Indian languages in corporate offices

10 views
Skip to first unread message

Gōpāl/గోపాల్

unread,
Sep 5, 2012, 7:16:42 PM9/5/12
to indlinu...@lists.sourceforge.net, linux-tel...@googlegroups.com, locali...@swecha.net
నమస్తే,

ఈ‌ మెయిలు.. నా పూర్వపు మెయిలుకి మీరంతా పంపిన సమాధానాలూ, ఒక సంవత్సరంగా నా బుర్రలోనే తప్ప ఆచరణకి నోచుకో(లే)ని కొన్ని ఆలోచనలూ కూడుకున్నది. మనందరం ఖచ్చితంగా కోరుకునే ఒక్క విషయం: అంతా కష్టపడి మనం చేస్తున్న కృషికి తగిన ప్రయోజనం ఉండటం.

ఐఐఐటి-హైదరాబాద్ పుణ్యమా అని హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల్లో ఉన్న దాదాపు అన్ని పెద్ద కార్పొరేట్ ఆఫీసుల్లో నాకు తెలిసిన వాళ్ళు, స్నేహితులు చాలా మందే ఉన్నారు. ఆ ఆఫీసుల్లో పని చేసే వాళ్ళలో > 95% మందికి వాళ్ళ వాళ్ళ భాషల్లో టైప్ చేయడం, వాళ్ళ భాషల్లో బ్లాగులుండటం గట్రా తెలియవు (ఇది నేను రూడీ చేసుకుని చెప్తున్న విషయం). నా ఆలోచన ఇది: ఈ కార్పొరేట్ సంస్థలలో పని చేస్తున్న వాళ్ళకి వాళ్ళ వాళ్ళ భాషల్లో టైప్ చేయడం నేర్పించడం (తెలుగొక్కటే కాదు), బ్లాగులు/వికీపిడియా పరిచయం చేయడం. HR department, Social welfare (లాంటి) department ని సంప్రదించి ఇలాంటి workshopలు గాని, టాక్‌లు గాని ఇవ్వడం కుదురుతుందో లేదో కనుక్కోవడానికి Pega, CSC లలో సంప్రదించమన్నాను నా స్నేహితులని. కుదురుతుందని abstract/వివరాలు పంపమని చెప్పారు.

అయితే ఇదొక విప్లవంలా జరగాలి. మాతృభాషలో టైప్ చేయడం అంటే prestige లా భావించాలి, స్టైల్ factor ఉండాలి. తగిన కంటెంట్ తయారు చేస్తున్నాను, సమయం పట్టొచ్చు. వర్కుషాపులకి, టాకులకీ మట్టుకు ఖచ్చితంగా ఒక జట్టు కావాలి: presentations బల్ల గుద్దినట్టుండేలా ఇచ్చే వాళ్ళు మరీ మరీ కావాలి. నేను నవంబరు నుంచి జనవరి మొదటి వారం దాకా ఇండియాలో (చెన్నై, మధ్యమధ్యలో హైదరాబాద్) ఉంటాను. బహుశా ఆ సమయానికి ఈ కంటెంట్ సిద్దంగానూ ఉంటుంది, అప్పటికి మరికొన్ని సంస్థలనుంచి అనుమతి కూడా తీస్కుని ఉంటాను. అప్పుడు కలిసి మాట్లాడి పనులు మొదలుపెడదాం.

మీరు సహాయపడగలరా? ఇంకెవరైనా ఆసక్తి చూపేవాళ్ళుంటే వాళ్ళకి కూడా చెప్పండీ విషయం!

-- 
 
Regards,
--
Kōḍūri Gōpāla Kr̥ṣṇa,
Music Technology Group, UPF - Barcelona, Spain.

Portfolio - http://tidbits.co.in
తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com

k.karthik

unread,
Sep 7, 2012, 2:57:51 PM9/7/12
to linux-tel...@googlegroups.com
మీ కృషి ఎంతో అభినందించదగినది. మీకు మన గ్రూపు నుండి పూర్తి సహకారాలు ఖచ్చితంగా వుంటాయి. నేను నా బ్లాగు ద్వారా తెలుగును అభివృద్ది చేయడానికి ప్రయత్నిస్తున్నాను. నేను create చేసిన తెలుగు toolbar ద్వారా తెలుగులో చాలా సమాచారాన్ని అందరికి తెలియజేస్తున్నాను.
teluguhomepage.blogspot.com
teluguhomepage.ourtoolbar.com

2012/9/6 Gōpāl/గోపాల్ <gopala...@gmail.com>

--
You received this message because you are subscribed to the Google Groups "linux-telugu-users" group.
To post to this group, send an email to linux-tel...@googlegroups.com.
To unsubscribe from this group, send email to linux-telugu-us...@googlegroups.com.
For more options, visit this group at http://groups.google.com/group/linux-telugu-users?hl=en-GB.



--
k.karthik
www.Ldcomputers.in

Kaśyap కశ్యప్

unread,
Sep 7, 2012, 11:31:16 PM9/7/12
to linux-tel...@googlegroups.com
తప్పక చేద్దాం ..  హైడ్ కార్పొరేట్ ఆఫీసుల్లో  HR వాళ్ళు కొంతమంది నాకు తెలుసు 

8 సెప్టెంబర్ 2012 12:27 ఉ న, k.karthik <avkka...@gmail.com> ఇలా రాసారు :



--
మీ శ్రేయోభిలాషి 
కశ్యప్

Arjuna Rao Chavala

unread,
Sep 8, 2012, 12:27:24 AM9/8/12
to linux-tel...@googlegroups.com, indlinu...@lists.sourceforge.net, locali...@swecha.net, telug...@googlegroups.com
(తెలుగు వికీ జట్టు కు నకలు చేస్తున్నాను)

గోపాల్ గారు,
మీ ఆలోచన అభిలషణీయం.

తెలుగు టైపు చేయడాన్ని తెలుగు వికీపీడియాకు అనుసంధించి నేర్పితే ఫలితం మెరుగుగా వుంటుందని నా అనుభవం. దానికై ఇప్పటికే  ప్రదర్శనా పత్రాలు (చూడండి) వున్నాయి. వాటిని మెరుగుపరచవచ్చు. ఇలా అయితే తెవికీ సభ్యులు, ఔత్సాహికులు మరియు వికీమీడియా ఇండియా సంస్థ  దాని  నగర మరియు భాషా ప్రత్యేక ఆసక్తి జట్టుల తరపున తోడ్పాటు, భాగస్వామ్యం,వనరులు లభించగలవు.
ఆలోచించగలరు
ధన్యవాదాలు

అర్జున

2012/9/6 Gōpāl/గోపాల్ <gopala...@gmail.com>
నమస్తే,

--

Gōpāl/గోపాల్

unread,
Sep 13, 2012, 3:22:42 PM9/13/12
to linux-tel...@googlegroups.com, Arjuna Rao Chavala, indlinu...@lists.sourceforge.net, locali...@swecha.net, telug...@googlegroups.com
అర్జునరావు గారు,

మీ ఆలోచన బావుంది.

అంచెలంచెలుగా ప్రణాళికతో వెళ్తే ఆశించిన ఫలితాలు ఉంటాయని నా నమ్మకం. ఇదివరలో నేను ఎవరికైనా కంప్యూటర్లో తెలుగు వాడకం గురించి చెప్పినప్పుడు అన్నీ ఒకేసారి చెప్పెయ్యాలి అన్న ఉబలాటంతో అవతలి వారిని ఉక్కిరిబిక్కిరి చేసేయడమో, లేదా "ఇన్ని" నేర్చుకోవాలా/తెలుసుకోవాలా అన్న భావన వారిలో కల్పించడమో జరిగేది. అలా కాకుండా ముందు టైప్ చేయడం, బ్లాగు రాయడం నేర్పించి, ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆసక్తి ఉన్నవాళ్ళకు వికిపీడియా గురించి, అనువాదాల గురించి విడివిడిగానో కలిపో చెప్తే బావుంటుందని నా అభిప్రాయం.

Arjuna Rao Chavala

unread,
Sep 13, 2012, 10:34:15 PM9/13/12
to Gōpāl/గోపాల్, linux-tel...@googlegroups.com, indlinu...@lists.sourceforge.net, locali...@swecha.net, telug...@googlegroups.com


2012/9/14 Gōpāl/గోపాల్ <gopala...@gmail.com>

అర్జునరావు గారు,

మీ ఆలోచన బావుంది.

అంచెలంచెలుగా ప్రణాళికతో వెళ్తే ఆశించిన ఫలితాలు ఉంటాయని నా నమ్మకం. ఇదివరలో నేను ఎవరికైనా కంప్యూటర్లో తెలుగు వాడకం గురించి చెప్పినప్పుడు అన్నీ ఒకేసారి చెప్పెయ్యాలి అన్న ఉబలాటంతో అవతలి వారిని ఉక్కిరిబిక్కిరి చేసేయడమో, లేదా "ఇన్ని" నేర్చుకోవాలా/తెలుసుకోవాలా అన్న భావన వారిలో కల్పించడమో జరిగేది. అలా కాకుండా ముందు టైప్ చేయడం, బ్లాగు రాయడం నేర్పించి, ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆసక్తి ఉన్నవాళ్ళకు వికిపీడియా గురించి, అనువాదాల గురించి విడివిడిగానో కలిపో చెప్తే బావుంటుందని నా అభిప్రాయం.
బ్లాగు పై ఆసక్తి వున్నవాళ్లకి ఆ ప్రాధాన్యత పనికిరావచ్చు. నా దృష్టిలో చాలా బ్లాగర్లు వికీపీడియాలో ప్రవేశించినతరువాత బ్లాగర్లు అయ్యారు. వికీపీడీయా అయితే అందరికి ఉపయోగపడే మానవాళి ఉపయోగాపేక్ష తప్ప ఇతర అపేక్షలులేనిది కనుక, బ్లాగు ప్లాట్ఫారమ్ లో తేడాలు అవి పట్టించుకోకుండా చెప్పటానికి వీలవుతుంది. టైపింగు అనుభవానికి వికీసోర్స్ వాడవచ్చు. వ్యాసాల నమూనాలకు మొదటిపేజీలో ప్రచురితమైన వ్యాసాలు చూపించవవచ్చు. వ్యాసాలకు వాడుకునే బొమ్మలగురించి కామన్స్ పరిచయంచేయవచ్చు.  వారికి వచ్చే సవాలక్ష అనుమానాలకు  చాలా సమాధానాలు వికీలో చూపించవచ్చు. వారి వారి వాడుకరిపేజీలలో వ్యాసాలు ప్రారంభింపచేయవచ్చు.
ధన్యవాదాలు.
అర్జున

Gōpāl/గోపాల్

unread,
Sep 15, 2012, 10:44:01 AM9/15/12
to Swecha Localisation Mailing List, tumarada narasimha murty, telug...@googlegroups.com, indlinu...@lists.sourceforge.net, linux-tel...@googlegroups.com
నరసింహమూర్తి గారు,

మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను. ముఖ్యంగా "అసలెందుకు నేర్చుకోవాలి/చేయాలి" అన్న ప్రశ్నకు సమాధానం చాలా బలమైందిగా ఉండాలి. దీనికోసం వీలు చిక్కినప్పుడల్లా నేను సంబంధిత వ్యాసాలు చదువుతూ ఉన్నాను. ఉదాహరణకి (ఫేస్బుక్లో కనబడిన) ఈ‌ వీడియో చూడండి: http://videolectures.net/metaforum2012_kornai_language/

ఇంజనీరింగ్ చేస్తుండగా, టెక్‌సేతు మొదలుపెట్టిన తొలిరోజుల్లో (2008-09) రాసిన ఈ వ్యాసం కూడా అలాంటి సమాధానాలు చెప్తూ రాసిందే (మార్పులు చేయాల్సిన అవసరం ఉంది): http://techsetu.com/pages/inspiration-future-india

మీ సూచనలకి నెనర్లు. అన్నట్టుగా కంటెంట్ సిద్దం చేసే ప్రక్రియలోనే ఉన్నాను, పూర్తవ్వగానే పంపిస్తాను.

On సెప్టెంబరు 14 శుక్రవారం 2012 ఉ. 07:25, tumarada narasimha murty wrote:
సభ్యులకు నమస్కారం
తెలుగు (లేదా వారి వారి మాతృ) లిపిని అభివృద్ది చెయ్యడానికి ఒక పెద్ద కూటమి అవసరం
కూటమి పెద్దది అవడానికి ఎక్కువ మంది సభ్యులు అవసరం
సభ్యులలో రెండు రకాలు 1) తమకి తాముగా వచ్చేవాళ్ళు 2) ప్రచారం ద్వారా వచ్చేవాళ్ళు
ఇప్పుడు  గోపాల్ గారు ప్రతిపాదిస్తున్నది ఈ ప్రచారమే కాబట్టి నేను ఒకటి రెండు మాటలు ప్రచారం గురించి చెప్పదలుచుకున్నాను.
ప్రచారానికి అత్యంత ముఖ్యమైనది "అజెండా".
అజెండా:
మనము ఎవరినైతే తెలుగులో(లేదా వారి మాతృ భాషలో ) టైపు చేయమని అడగదలుచుకున్నామో వాళ్ళంతా ఇంతవరకూ ఇంగ్లీష్ లో టైపు చేస్తున్నవాళ్ళే. ఇన్నాళ్ళూ ఇంగ్లీష్ కి అలవాటు పడ్డవాళ్ళు ఒక్కసారి మారాలంటే బలమైన కారణాలు కావాలి. మనం కోరే ఈ మార్పుకు బలమైన కారణాలను (justification) గనక వాళ్లకి చూపించగలిగితే మన పని మరింత సులువు అవుతుందని నా అభిప్రాయం. ఈ కారణాలనే నేను అజెండా అంటున్నాను.  
ఇక్కడ నేను ఆలోచించిన, చదివిన, తెలుసుకున్న కారణాలు కొన్ని చెపుతున్నాను. సభ్యులు వీటిని చర్చించి ఆమోదించవచ్చు లేదా మార్చవచ్చు లేదా నిరాకరించవచ్చు. 
1 ) మాతృ భాషలో చదువు - పరభాషలో చదువుకన్నా ఎక్కువ ఫలవంతంగా ఉంటుంది - గమనించాల్సిన విషయం చదువుయొక్క పరమార్థం విద్యార్థికి పూర్తిగా అర్థమవడం.
మాతృభాషలో చదువు పై చర్చకోసం కొన్ని లింకులు:
http://unesdoc.unesco.org/images/0014/001466/146632e.pdf 
http://articles.timesofindia.indiatimes.com/2012-06-15/mysore/32253507_1_mother-tongue-regional-languages-indian-language
2 ) ఒక పది పదిహేను సంవత్సరాల తరవాత ప్రపంచంలోని నిరుపేద దేశాలతో సహా ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ అందుబాటులోకి వచేస్తుంది కాని తిండి గుడ్డ రావు. మంచి బోధన సరే సరి. ఇటువంటి పరిస్థితిలో ఒక పేద విద్యార్థికి మంచి కంటెంట్ (వ్యాసాలూ, పాఠాలు, చర్చలూ   మొదలైనవి) తెలుగులో అందుబాటులో ఉంటే చాలా బాగుంటుంది. (తెవికీ) - ఇప్పుడు మన దేశం లో అందరికీ టెలిఫోను అందుబాటులో ఉంది కాని వైద్యం విద్యా మొదలైనవి లేవు. జ
3 ) భావ ప్రకటనకూ , సృజనాత్మకతకూ  కొంతైనా ఇబ్బంది వస్తుంది.  (ఈ విషయాన్ని నిరూపించడానికి కొన్ని వినోదాత్మకమైన ఆటలు తయారుచేస్తే మంచిది).
4 ) ఉదాహరణలు చూపించడం - ఏ ఏ భాషలలో ఎన్ని పుస్తకాలు ప్రచురితమవుతున్నాయి. ఏ ఏ భాషలు ఇంటర్నెట్లో ఎక్కువ ప్రగతి సాధించాయి. ఏ ఏ భాష ఏ స్థానంలో ఉంది. ఇలా ... (స్పృహ, పోటీ తత్వం పెరుగుతాయి).  

కూటమి యొక్క విధులు:
ఇదే విధంగా మాతృభాషను వాడడం కొంత సులువు గా కూడా  ఉండాలి. కొన్ని ఇంగ్లీష్ పదాలు (వాటికి సమానాలు మన భాషలలో లేకపోవడం వల్ల) సర్వ సాధారణం అయిపోయాయి. కొన్ని ఇంగ్లీష్ పదాలు ( వాటికి సమానాలు మన భాషలలో ఉన్నప్పటికీ ) సాధారణం అయిపోయాయి.
1 ) మనం నిత్యం వాడే ఇంగ్లీష్ పదాలని గుర్తించాలి.
2 ) వాటిని రెండు వర్గాలుగా విభజించాలి (ఇక్కడ విడగొట్టాలి అనే మాట వాడడం నాకిష్టం). మన భాషలో సమానార్ధం ఉన్నవి, లేనివి.
3 ) ఉన్న వాటి సామానార్థాలను విరివిగా వాడుతూ మళ్ళీ ప్రాచుర్యం లోకి తేవాలి (ఉదా: బుక్ - పుస్తకం; కీ - తాళం; ఒపీనియన్ - అభిప్రాయం)  
4 )  లేనివాటిని మన పదాలుగానే గుర్తించాలి తప్ప పర భాషా పదాలుగా గుర్తించకూడదు.(బస్సు, కార్, మొదలైనవి). ఈ ఇంగ్లీష్ పదాలను మాతృభాషలో విలీనం చెయ్యాలి. (భాష ప్రవహించే నీరు. చెరువులో నీరు కాదు. మురిగిపోదు - మహాకవి)
5 ) రాసే భాషని సరళీకృతం చెయ్యాలి. వీలైనంత ఎక్కువగా వాడుక భాష వాడాలి.
6 ) ఇంగ్లీష్ భాషలో కొత్త పదాలు చేర్చడం ఒక నిరంతర ప్రక్రియ. నిఘంటువులు ఎప్పటికప్పుడు కొత్త పదాలను స్వీకరిస్తూనే ఉంటాయి. ఈ పద్ధతి అన్ని భాషలూ అవలంబించాలి.

ఇవి కొన్ని ఆలోచనలు.
ఇట్లు
నరసింహ మూర్తి
 

2012/9/8 Arjuna Rao Chavala <arjun...@gmail.com>

--
"తెలుగువికీ" గుంపులో మీకు సభ్యత్వం ఉంది కాబట్టి మీకీ మెయిలు వచ్చింది.
ఈ గుంపుకు పోస్టు చేసేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, teluguwiki-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని వికల్పాల కోసం, ఈ గుంపును http://groups.google.com/group/teluguwiki?hl=te వద్ద చూడండి



--
T Narasimha Murty
Srikakulam
9966582234


_______________________________________________
Localization mailing list
Locali...@swecha.net
http://swecha.net/mailman/listinfo/localization_swecha.net
Reply all
Reply to author
Forward
0 new messages