మీరు వెలిబుచ్చిన సందేహాలకు ధన్యవాదాలు.
అందరికీ పుపయోగంగా వుంటుందని మెయిలింగ్ లిస్టులకు నకలుచేస్తున్నాను.
2011/1/23 siva babu
<drsiv...@gmail.com>
అర్జునరావు గారూ, నేను ఈరోజు తెవికి లో కొన్ని విషయాలు మీ దృష్టికితీసుకువద్దామనుకున్నాను. సమయాభావం వల్ల లంచ్ తర్వాత వచ్చేశాను.
అనంతపుపం టింబక్టు సంస్ధ కొత్తపల్లి పత్రిక వారు ఈ క్రింది విషయాలు మీకు తెలియజేయమన్నారు. దయచేసి పరిష్కారానికై కృషిచేయగలరు. వీలైతే వారికి సమాధానం ఇవ్వండి
శివబాబు గారు,
రేపు జరగనున్న సమావేశానికి నేనూ వద్దామనుకున్నాను గాని, చివరి నిముషం
వరకూ తెమలలేకపోయాను. 'కంప్యూటర్లలో తెలుగు-ఓపెన్ సోర్సుల' పరంగా ఈ
క్రింది అంశాలేమైనా చర్చకు వస్తాయేమో చూడండి-
1 . ఉబుంటు తెలుగు (స్కిం/లోహిత్ తెలుగు/తెలుగు RTS/OpenOffice)లో చిన్న
చిన్న సమస్యలు- పరిష్కారాలు:
a. సంయుక్తాక్షరాలకు నకారప్పొల్లు సరిగా రాకపోవటం: ఉదా: " సోర్స్ "
ఉబుంటు 10.04 లో మీరు లోహిత్ తెలుగు వాడితే సమస్యలేదు. పాంగోలో కొన్ని మార్పులు జరగడంవలన పోతన శైలికి కొంత ఇబ్బంది వచ్చింది. పోతన బొద్దుగా రావటంలోలోపాలుండటంవలన, లోహిత్ ప్రామాణిక ఫాంటుగా నేను వాడుతున్నాను.
10.04 లో ఐబస్ (Ibus) స్కిమ్ గా బదులుగా పనిచేస్తుంది. ఇది బాగా మెరుగైనది.
b. 'తీ' అనే అక్షరాన్ని ఓపెన్ ఆఫీసులో టైపు చేసి, దాన్ని కప్సుపిడియఫ్
ద్వారా పిడియఫ్ చేస్తే ఆ స్థలం ఖాళీగా కనబడటం. (ఇది పెద్ద సమస్యే..
ఉదాహరణకు మనం 'తీసుకురా' అని రాస్తే అది ప్రింటులో ' సుకురా' అని
వస్తుంది!)
నాకు సమస్య రాలేదు. లిబ్రెఆఫీసు 3.3RC3 తో పరిశీలించాను. ఏ ఫాంటు వాడుతున్నారు.
c. 'మై' అనే అక్షరం టైపు చేసినప్పుడు ఓపెన్ ఆఫీసు క్రాష్ అవ్వటం!
(దానికోసం మనం 'అందమయిన' అని రాసుకోవాల్సి వస్తుంది! )
ఓపెన్ ఆఫీసు అప్పుడప్పుడు క్రాష్ అయిన నాకు టైపు చేసినప్పుడు క్రాష్ అవలేదు. మీరు కొత్త ఆఫీసు రూపాంతరము వాడిచూడండి.
d. 'స్కృ' అనే మాట తప్పుగా రావటం (ముందు క వత్తు రావాలి కదా)
2. ప్రింటింగు పరంగా-
a. ఓపెన్ ఆఫీసులో టెక్స్టు పైకి నలుపుగా కనబడ్డా, నిజానికి RGBలలో
ఉండటం. (దానివల్ల ఆఫ్సెట్ ప్రింటర్లలో drying సమస్యలు వస్తాయి)
ఒక మచ్చుక ఫైల్ తో బగ్ నమోదు చేస్తే పరిష్కరించటానికి అవకాశం వుంటుంది.
b. ఓపెన్ ఆఫీసులో టెక్స్టు బ్లాకులు పిడియఫ్ అయ్యేసరికి ఇమేజెస్ గా
మారిపోవటం (అక్షరాల Sharpness పోతుంది)
Liboffice 3.3 Rc3లో అక్షరంగా నే వస్తున్నది. కొత్త లిబ్రెఆఫీసుకు మారండి.
c. తెలుగులో పేజ్ మేకర్ కి ప్రత్యామ్నాయం ఓపెన్ సోర్సులో లేకపోవటం- ఉదా:
Scribus ఇంగ్లీషుకు బాగున్నా, తెలుగును సపోర్టు చేయకపోవటం.
నేను ప్రస్తుతం దీనిని వాడలేదు.
d. అను ఫాంట్ల వంటి కమర్షియల్ ఫాంట్లకు యూనికోడ్ కన్వర్టర్లు, యూనికోడ్
నుంచి వాటిలోకి కన్వర్టర్లు వచ్చే అవకాశం ఉన్నదా?
అనుఫాంట్లు పాత తరానివి. వారే కొత్తతరమైన యూనికోడ్ ఫాంట్లు విడుదలచేసే అవకాశముంది. చాలా దినపత్రికలు యూనికోడ్ ఫాంటుకి మారిపోయాయి.
3. ప్రింటర్ల పరంగా
a. HPLIP మరీ అంత ఘోరంగా ఎందుకుంది? దానికి ప్రత్యామ్నాయం?
మీ సమస్య మరింత వివరించండి. వీలైతే బగ్ ఫైల్ చేయండి.
b. ప్రింటర్ల డ్రైవర్లు విండోస్ లో బాగా పనిచేసేవి, ఉబుంటులో అంత స్లో
ఎందుకైపోతై? ఉబుంటుతో చక్కగా పనిచేసే ప్రింటర్ ఏది?
నేను ఇంతకుముందు HPLIP తో ప్రస్తుతం శామ్సంగ్ తో వాడుతున్నాను. అప్పడప్పడు స్వల్ప అసౌకర్యమున్నా వాడేకొద్ది అన్ని రకాల సౌలభ్యాలు లినక్స్లో వున్నాయనిపిస్తున్నది.
ఇంకా చాలా అంశాలున్నైకాని, ఇప్పటికే సమయం పది దాటింది- అందుకని ఇక్కడికి ఆపుతాను.
మీకే సందేహమొచ్చిన లినక్స్ తెలుగు యూజర్స్ కి లేక లిబ్రెఆఫీసు-తెలుగుకి తెలపండి.
మీ లాంటి వారు మెయిలింగ్ లిస్టులలో పాల్గొంటేనే మన తెలుగు అభివృద్ధి చెందుతుంది.
ధన్యవాదాలు.