
తెలుగు వారి పండుగ ఉగాది
*మాసానామ్ మార్గశీర్షొహమ్, ఋతునామ్ కుసుమాకరః*
అని భగవద్గీత విభూతి యోగం లో శ్రీ కృష్ణ పరమాత్మా చెప్పాడు.
మాసాలలో ఉత్తమమైన మాసం మార్గశిర మాసం . ఋతువులలొ ఉత్తమమైనది వసంతఋతువు అని అన్నాడు ఆయన !
మన పండుగల అన్నీ ఋతువుల పైన ఆధార పది ఉన్నాయి.
ఉగాది వసంత ఋతువులో వస్తుంది. ఆ రోజులలో ప్రకృతి అత్యంత రమణీయముగా ఉంటుంది.
తరుశాఖలు చిగురులు వేస్తుంటాయి. సర్వత్రా పక్షుల కిలకిలారావాలతో మారు మ్రొగుతూ ఉంటాయి.
కోకిలలు చిగుళ్ళను ఆశ్వాదిన్చి పంచమస్వరము ఆలపిస్తూ ఉంటాయి. అలాగ ఈ ఉగాది పండుగ మన ముందుకి కొలాహలముగా మన ముందుకి వస్తుంది .
ఉగాది పండుగ రావడంతోనే తెలుగు వారి వాకిట్లు అన్నీ కళకళలాడుతూ
ఉంటాయి . ఇందు వెనుక ఒక కారణం ఉంది .
ఉగాది ముందు రోజు వరకు ఎవరెన్ని కష్టాలతో అల్లాడుతున్నప్పటికీ, పండుగ రోజున మాత్రం ఆనందముగా గడపాలన్నది నియమం.
ఎందుకంటే ఉగాది పండుగ నాడు ఎలా ఉంటే , మిగతా సంవత్సరం అంతా మన జీవితాలు అలాగే ఉంటాయని నమ్మకం, మనల్ను బంధుమిత్రులతో హుషారుగా కబుర్లు పంచుకోమని అంటారు.
"యుగాది" అనే సంస్కృత పదానికి " ఉగాది" వికృత పదమని అంటారు. వేదాలలో కాల నిర్ణయ ప్రస్తావన వచ్చినప్పుడు, సృష్టి జరిగిన తొలి రోజు "ఉగాది" అని చెప్పడం జరిగింది. సృష్టి ప్రారంభం అయిన తొలి రోజు నుండి కాలాన్ని లెక్క గడుతున్నాము మనము. కలియుగ ప్రారంభం నుండి లెక్కగట్టటం జరుగుతోంది. బ్రహ్మ సృష్టి ప్రారంభించిన ఆధ్యాయాన్ని బ్రహ్మ కల్పమని, కల్ప ప్రారంభాన్ని కల్పాది అని అంటారు.
ప్రతి కల్పంలో మొదట వచ్చేది యుగ ఆది( ఆరంభ) సమయమే ఉగాది !
యుగపు చైత్ర మాసములో మొదటి రోజున పాడ్యమి తిధి నాడు , మొదటి వారమైన ఆదివారము నాడు, మొదటి నక్షత్రము అయిన అశ్విని ఉన్న సమయములో బ్రహ్మ సృష్టిని ప్రారంభించినట్లు వేదాల ద్వారా తెలుస్తోంది. ఈ కాలానికి ఉన్న ప్రాముఖ్యాన్ని నిరంతరం గుర్తుకు తెచ్చుకునేందుకు ఉగాది పండుగ ప్రచారంలోకి వచ్చింది.
సూర్య భగవానుడికీ పుష్ప అర్చన, అర్ఘ్యము , ధూపదీపాలను సమర్పించి, వేప పచ్చడి ని నివేదన చెయ్యాలి.
ఉగాది పచ్చడి తినే ముందు ఎలాంటి ఆహారాపధార్ధాలు తినకూడదు. శాస్త్రాలలో వేప పచ్చడి తినటం " నింబకుసుమభక్షణం" అని చెప్పారు.
ఈ పచ్చడి లో లేత మామిడి చిగురు , అశోక వృక్షం చిగుళ్ళు, వేప పూత, కొత్త బెల్లం, కొత్త చింత పండు పులుసు, మామిడి, చెరుకు ముక్కలు కలుపుతూ ఉంటారు .
అలాగే ఉగాది నాడు మన వాళ్ళు తప్పకుండా పంచాంగాన్ని వింటూ ఉంటారు. సంవత్సరం మొదటి రోజున పంచాంగాన్ని వినటం ద్వారా సంవత్సరం అంతా జరిగే విషయాలను తెలుసుకోవడం వల్ల, కొన్ని కొన్ని సంధర్భాలలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే వీలు ఉంటుంది. అందుకే పంచాంగ శ్రవణమ్.
ఇట్లు
సృజన