వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీషాక్ అని చెప్పుకోవచ్చు. కరీంనగర్ జిల్లాలో జరిగిన రచ్చ ఆ పార్టీలోని లుకలుకల్ని బయటకు పెట్టటమే కాదు. ఇలాంటి వారు పార్టీ నాయకులుగా.. ప్రజలకు సేవ చేస్తామని చెప్పుకోవడం సిగ్గుచేటు. అంతర్గతంగా పార్టీలో ఎన్ని విభేదాలు ఉంటే మాత్రం.. రోడ్డు మీదకు పడి ఇష్టారాజ్యంగా కొట్టటమే కాదు.. రాయలేని బూతుల్ని తిట్టేయడం గమనర్హాం. అయితే ఈ రచ్చ మొత్తం ఒక మహిళా ఆధ్వర్యంలో సాగటం విశేషం. కరీంనగర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యలయం వద్ద జెండా వందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానఇకఇ జిల్లా అధ్యక్షుడు సింగి రెడ్డి భాస్కర్ రెడ్డిపాటు.. జిల్లా మహిళా విభాగానికి చెందిన ప్రధాన కార్యదర్శి గంటా సుశీల కూడా హాజరయ్యారు. జెండా వందనం పూర్తయింది. జనగణమణ పాడేశారు. అంతలోనే ఏమైందో ఏమో కానీ.. సుశీల తిట్ల దండకం మొదలు పెట్టింది. పార్టీకి అందుబాటులో ఉండకపోవడమే కాదు.. పార్టీని అస్సలు పట్టించఉకోవడం లేదని, పార్టీ కార్యాలయాలకు తాళం వేసి సొంత జారీరుగఆ నడపటమేటనఇ నిలదీయటమే కాదు. బండబూతు తిట్టటం మొదలు పెట్టారు. ఇలాంటి నాయకుల వల్లే పార్టీ నాశనమైపోతుందని, పార్టీలో చురుగ్గా ఉంటే తనలాంటి వారికి కూడా జెండా వందన కార్య్రకమానికి సంబంధించిన సమాచారం అందించరా అంటూ సుశీల చెలరేగిపోయారు. అంతలోనే ఆవేశం తట్టుకోలేక, పార్టీ జిల్లా అధ్యక్షుడ్ని కొట్టటమే కాదు. చెప్పుతో ఇష్టారాజ్యంగా కొట్టారు. ఆమెను అడ్డుకునే ప్రయత్నంలో ఆయన చేతులు పట్టుకుని ప్రయత్నం చేయబోగా, మరోవైపు నుంచి ఇంకో వ్యక్తి చెప్పుతో పెఢీల్‌మంటు కొట్టారు. జరుగుతున్న ఘటనతో షాక్ తిన్నారో లేక.. పార్టీలో ఉండే విభేదాలకఉ మనకెందుకులే అనుకున్నారో కానీ.. వారి మధ్యలోకి రావటానికి ఎవరూ సాహసించలేదు. దానికి తోడు తాను దళిత మహిళలని సుశీల చెప్పుకుంటూనే సింగిరెడ్డిపై దాడి చేయడం కొసమెరుపు.