ఈ పుస్తకం జాడ తెలుసుకునేందుకు మీరేమైనా సహాయపడగలరా?
శ్రీరామ పట్టాభిషేకము లేదా అశ్వారయ చరిత్రము అనే పేరుగల పుస్తకంలో
వెలమ వీరులకు ధంసాతో జరిగిన పోరాటాన్ని, పాల్వంచ సంస్థానము చారిత్రక వివరణలను,
భద్రచల శ్రీరాముని వలవృత్తాంతము మరియు రాముని విగ్రహాలను తిరిగి తెచ్చుటలో అప్పటి
పాల్వంచ సంస్థానాధీయుడు అశ్వారాయుని తోడ్పాడు వివరాలను కథతో పాటు పేర్కొనటం
జరిగిందట. ఈ పుస్తక రచయిత శ్రీనాధుని వెంకట రామయ్యా లేదా శ్రీనాధుని వెంకటరామ కవి
అని పిలువబడేవాడు. ఈ పుస్తకం యొక్క ప్రతి సిరిపురం తాలూకాలో వున్నదని వినికిడి
అంటూ గోలుకొండ కవుల చరిత్ర పుస్తకంలో(పేజీ 462 పాతప్రతి) సురవరం ప్రతాప రెడ్డి
గారు పేర్కొన్నారు.
ఈ పుస్తకం ప్రతి అందుబాటులో వున్నా లేదా అప్పట్లో వరంగల్లు జిల్లాకు 1953 తర్వాత
ఖమ్మంజిల్లాకు చెందిన పాల్వంచ సంస్థానము సంభందించిన మరేవైన అధికారిక వివరణలు మీకు
తెలిసినంతలో వుంటే దయచేసి తెలియపరచగలరు.
మీ
కట్టా శ్రీనివాస్
9885 133 969 లేదా nivas....@gmail.com