గోమాతా విజయతామ్

38 views
Skip to first unread message

శ్రీ అయ్యగారి సూర్య నాగేంద్ర కుమార్

unread,
Nov 17, 2011, 5:16:40 AM11/17/11
to గోమాత (Go Mata)
శ్రీగురుభ్యోన్నమః
నమస్తే
గావో విశ్వస్య మాతరః
గోమాత విశ్వానికే తల్లి.

గోసేవ, గోపూజ, గోవులతోడి సంబంధం, సహజీవనం గోవు ఇచ్చే పదార్థాలు మన సనాతన
ధర్మంతో ముడిపడి ఉంటాయి. అందుకే మన శాస్త్రాలు ముందుగా గోవులను
రక్షించండి, గో సేవ చేయండి అంటూ స్వస్తి వాచకాలు పలికేటప్పుడు ముందుగా
గోవులు శాంతిని పొందుగాక అని చెబుతాయి. గోవు వల్లనే మన సనాతన ధర్మం ఇంకా
ఈ మాత్రమైనా మిగిలి ఉంది.

గోవులను గూర్చి కీర్తించని గ్రంధములు మన సనాతన ధర్మంలో బహు అరుదు అనే
చెప్పవచ్చు. గోవు అనేటప్పటికే ఏ ఇతర జంతువు / పశువు పై లేని ఒక
ప్రత్యేకమైన ఆరాధనా భావన మనస్సుకి స్ఫురిస్తుంది. కారణం ఒక్కటే
తాత్త్వికంగా గోవు పశువు కాదు గోమాత, జగజ్జనని స్వరూపం అమ్మ అన్న
పిలుపులో ఉన్న మాధుర్యమే గోమాతలో కూడా ఉందనిపిస్తుంది. అందుకే నాకు
ఒక్కోసారి భాషలు, అక్షరాలు ఇతరత్రా విచారణ చేసినప్పుడు అనిపిస్తుంది, మన
సంస్కృత భాష ఎంతగొప్పదో తెలుగూ అంతే స్థాయిలో గొప్పదానిగా ఎందుకు
వెలుగొందిందా అని. దానికీ కారణం లేకపోలేదు. తెలుగు అక్షరాలు
నేర్పేటప్పుడు అచ్చుల్లో మొదటిది... (వీడేమిటి అ, ఆ , ఇ , ఈ.... లు
నేర్పిస్తున్నాడనుక్కోకండి)..
అ = అమ్మ
ఆ = ఆవు.....
...బహుశా మన తెలుగు భాష ఒక్కటే అనుక్కుంటా చదువు నేర్పటం మొదలు
పెట్టినప్పుడే అమ్మతరవాత అమ్మంత మూర్తి గోమాత అని నేర్పిన భాష. ఇది మనకి
గర్వకారణమేగా!

సింహనాదం వింటే అడవి జంతువుల ఏమరుపాటు పటాపంచలైనట్లు, గురువుగారు
చెప్పినది వినటం వల్ల స్ఫూర్తి పొంది గోసేవ, గో రక్షణ ప్రచారం జరగాలనే
ఉద్దేశ్యంతో ఇప్పటికే సత్సంగం గుంపు ఉన్నా ప్రత్యేకంగా "గోమాత" అనే
గుంపును గూగుల్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గుంపులో చర్చలు, విషయాలు
అన్నీ గోమాతకి, గోజాతికి సంబంధించినవే ఉంటాయి. గురువుగారు అంతలా వారి
ఉపన్యాసాలలో గోమాత సేవ గూర్చి, గో సంరక్షణ గూర్చి ప్రచారం చేస్తుంటే. అది
విని కేవలం బాగుంది అని అనుక్కోడానికే కాదుగా మనమున్నది. మన వంతు కృషి
మనమూ చేయాలనీ. గోసేవ చేయాలనీ, గోసేవ, గోరక్షణ ఆవశ్యకతను ప్రచారం చేయాలనీ.
మన సనాతన ధర్మ విలవలను మన అవలంబించాలనీ ఈ గుంపు ప్రారంభింపబడింది. ఇలా
గుంపు ఒకటి మొదలుపెట్టేస్తేనే గోసేవ చేసినట్టా అన్న సంశయం ఉండచ్చు
కొందరికి. ఈ గుంపు ద్వారా మొదలు అవగాహన పెంచుదాం గోమాతకి సంబంధిచిన
వివరాలు, స్తోత్రాలు, పరిశోధనల విషయాలు అన్నీ ఇందులో పెట్టి పంచుకుందాం.
ఏమో రేపొద్దున్న కొన్నేళ్ళ తరవాత మన తరవాత వారికి ఇది గోమాతకి సంబంధించిన
విశేషాల భాండాగారంగా తయారై ఈ విషయాలు తెలుసుకుని గోమాత సేవ తరించవచ్చు.

ముందు ముందు వీలైతే, మన గుంపులోని పెద్దల సహాయ సహకారాలతో గుంపులుగా
ఏర్పడి ఏ ప్రాంత వారు ఆ ప్రాంతంలో మనకి వీలున్న రోజున మన కుటుంబాలతో
సామూహిక గోపూజాధికాలు, గోష్ఠాన్ని శుభ్రం చేసే కార్యక్రమాలు వగైరా
చక్కని ఇతరత్రా ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించుకుందాం.

అందరికీ ఆసక్తి ఉన్నదనే తలంపుతోనే, మీఅందరి సహకారం ఉంటుందన్న ఆశతోనే ఈ
పనిని ప్రారంభించాము. ఈ క్రింది లంకెద్వారా గోమాత గుంపులో సభ్యులుగా
చేరవచ్చు.

గూగుల్ గుంపు లంకె: http://groups.google.com/group/gomata
ఈమెయిల్: gom...@googlegroups.com

"గోమాతా విజయతామ్"

Reply all
Reply to author
Forward
0 new messages