గో దానం గురించి నాదొక సందేహం, ఇంట్లో ఎవరైనా పరమపదించాక వారి పేరు మీద
గో దానం చేస్తారు. అంత వరకు బాగుంది కాని కొందరు అసలు ఈ రోజుల్లో గోవులు
జెర్సీ గోవులు సంపర్కం ద్వార వున్నా గోవులు కావున గోదానం లో ఏమి పుణ్యం
లేదు అంటారు. ఇదే ఎంతవరకు నిజం?
మనము గోదానం చేయాలంటే ఆ గోవు కి చక్కని గంగిడోలు మరియు మొపు వుండాలని
అంటారు అప్పుడే అది మంచి గోవు అని, ఇవి జెర్సీ గోవులో ఉండవని కావున ఆ
గోదానంలో ఫలం లేదు అంటారు.
సభ్యులు నా సందేహం ని అల్పం అని భావించకుండా మీ అమూల్యమైన మాటలు
తెల్పగలరు.
భవదీయుడు
అనిల్ కుమార్ సముద్రాల
గోదానం చేయడం ఎన్నడూ తప్పుకాదన్నది ముమ్మాటికీ సత్యం. పైగా గోవును
రక్షించినా సేవ చేసినా దానమిచ్చినా అపార శ్రేయస్సు. గోదానం ఇచ్చేవారు
గోవు తో పాటు గోపాలనకి సరిపడా ద్రవ్యంకూడా ఎంతో కొంత ఇస్తారు. ఐనా కూడా
దానం పుచ్చుకున్నవారు గోవును సరిగా చూడకపోతే దాని మంచి చెడ్డలు దానం
పుచ్చుకున్నవారివే తప్ప ఇచ్చిన వారివి కావు. ఐతే దానం ఇచ్చేటప్పుడు
ఎవరికిస్తున్నామో కాస్త తెలుసుకుని చూసుకుని ఇవ్వడం మంచిది. ఏ దానం
చేసినా ఒక దాన ఫలితమే ఇస్తారు కానీ గోదానానికి మాత్రం ఒక్క గోవు దానం
వెయ్యి గోవుల దానంతో సమం. మొన్నీమధ్యనే చరక ఆయుర్వేద సంస్థ వారు
నాలుగురోజుల పాటు హైదరాబాదులో గోవులను ప్రదర్శించారుకూడా. హైదరాబాదులో
చక్కగా నిర్వహించబడే గోశాలలెన్నో ఉన్నాయి చక్కగా వారిని సంప్రదిస్తే
గోదానం చేసుకోడానికి తగిన వివరం సదుపాయం కలిపిస్తారు.