అలానే, ఎప్పుడైతే గోమాతను గోమాత సంతానాన్ని విస్మరించి యంత్ర పరికరాలమీద
ఆధారపడ్డామో అప్పుడే మనకు కష్టాలు మొదలయ్యాయి. ఈ మధ్యనే గోమాత మీద
వ్రాయబడిన వ్యాసాలు, పుస్తకాలు చదువుతుంటే ఒకానొక శాస్త్రవేత్త వ్రాసినది
చదివి, ఎందుకు మనవారు దూరదృష్టి లేకుండా త్వర త్వరగా ఉత్పాదక శక్తిని
పెంచడం కోసం యంత్రాల మీదే పూర్తిగా ఆధారపడేట్టుగా
చేసుకున్నాడనిపుస్తుంది. అవసరమైన చోట్లమాత్రమేకాక అనవసరమైన చోట్ల కూడా
యాంత్రిక విధానాన్ని తక్కువ వ్యవధిలో ఎక్కువ ఉత్పాదన తక్కువ ఖర్చు అని
మానవ జీవితాన్నే ఎలా మార్చేసారో వివరిస్తుంటే ఆశ్చర్యం వేసింది. ఆ విషయం
మనందరికీ తెలిసిందే ఐనా మనం ఆచరించనిదే, ఆచరించలేనిస్థితిలోకి
వెళ్ళిపోయాం అనడం ఉత్తమం. its late now, we are getting in to an era
where we cannot rectify it, but there is a very very small hope....
దాని సారాంశం.. ఇదీ..
"భారతీయులు వారి జీవన విధానంలో గోవులను, గో సంతతిని ఎక్కువగా
ఉపయోగిస్తారు. గోవుల సంతతిఐన ఎద్దుల చే వారు పంటలను పండించడానికి అనువుగా
భూమిని సమిష్టి వ్యవసాయం ద్వారా దున్నేవారు, నీటిలో తగుమాత్రం కలిపిన
గోమూత్రాన్ని దున్నిన నేలపై చల్లి ఆ తరవాత వారు ఏ పంట వేయాలని తలచారో
ఆపంట వేసేవారు. పంటకి ఎరువుగా ముఖ్యంగా గోవు యొక్క పేడను (cow dung)
వాడేవారు అలాగే వారి వంటలకు కూడా ఇంతకుముందే ఎండపెట్టి నిలవచేసిన ఆవు,
ఎద్దుల పేడల పిడకలను (Cow Dung Cake) వాడేవారు. ఈ పిడకలను కాల్చటం వల్ల
వచ్చిన పొకచే వాతావరణంలో కలిగే మార్పుల వల్ల పుట్టే బాక్టీరియా వంటి
సూక్ష్మ క్రిములు నశించేవి పైగా ఋతువుల సమయానుసారం సూర్యుని నుంచి
వెలువడే నీల లోహిత అతి నీల లోహిత కిరణాల ప్రభావం తక్కువగా ఉండేది. పండిన
పంటను కోతలు కోసి మిగిలిన మొక్కలను పశువులకు దాణాగా వేసేవారు దానినే నిలవ
చేసి మళ్ళీ పంట వచ్చే వరకు కావలసిన పశువులదాణాని దాచుకునేవారు. ఇది అంతా
ఒక చక్రంలాగా పరిభ్రమిస్తూ ఉండేది. ఎప్పుడైతే సులువు కోసం ఎక్కువ
ఉత్పాదనా పద్ధతులు వచ్చాయో ట్రాక్టర్ల వంటి యంత్ర సామగ్రి అందుబాటులోకి
వచ్చిందో, సమిష్టి వ్యవసాయం తగ్గింది, స్వార్థం పెరిగింది, పశువుల అవసరం
తగ్గి గో సంపద తరిగింది, రసాయనిక ఎరువుల వాడకం ఎక్కువైంది. వానివల్ల
వాతావరణంలో రసాయనిక పదార్థాలు ఎక్కువయ్యాయి. ఈ ట్రాక్టర్లు, ఎరువులు ఇతర
సామగ్రి తయారు చేసే కర్మాగారాలు పెరిగాయి, కాలుష్యం పెరిగింది. దాని
ప్రభావం తగ్గించడానికి ఇప్పుడు ఆవు పిడకల వాడకం లేదు. గోమూత్రాన్ని
పంటల్లో చల్లడాలు లేవు. "
ఈ త్వర త్వరగా ఉత్పాదనలు చేయడంలో మనిషికి ఖాళీ సమయం ఎక్కువైంది, ఎక్కువ
ఉత్పాదన ఎగుమతులకు ఎక్కువ లాభాలకు మనిషి స్వార్థ చింతన సొంతంగా ఎక్కువ
ఎక్కువ ఆస్తులు కూడబెట్టుకోవాలనుక్కునే చింతనతో కొత్త ఆలోచనలు కొత్త
కొత్త పరిశోధనలు, కర్మాగారాలు, తద్వారా మానవ జాతి, ప్రకృతి భయపడే విధమైన
కాలుష్యం పెరిగింది. మనిషి జీవితంలో జీవన విధానం వేగం పుంజుకుంది, అదే
వేగం మనుష్య జాతి సగటు ఆయుష్య ప్రమాణమైన 100 సం,, ను అంతే వేగంగా 60 -70
సం,, మార్చింది, ప్రకృతి వైపరీత్యాలనూ వేగంగా పెంచింది.
ఏ సనాతన ధర్మం వల్ల భరతభూమి , మొత్తం భూమిమీద గొప్ప ఖ్యాతినార్జించిందో,
ఎక్కడ గో బ్రాహ్మణేభ్యశ్శుభమస్తు నిత్యం అని రోజూ స్వస్తివాచకాలు ఎక్కడ
చెప్పబడతాయో అక్కడ గోవుల సంపద తరిగింది.
గోవు ఉంటే ధర్మం నిలబడుతుంది, గోవుల సేవ వాటి రక్షణ ద్వారానే తిరిగి
సనాతన ధార్మిక జీవనం అలవడుతుంది.
మీ...