భారత స్వతంత్ర పొరాట మూలము

22 views
Skip to first unread message

శ్రీ అయ్యగారి సూర్య నాగేంద్ర కుమార్

unread,
Feb 2, 2012, 3:23:17 AM2/2/12
to గోమాత (Go Mata)
నమస్తే
భారతీయులు తమ రాజ్యములు పరాయి దేశీయులపాలైనప్పటికీ, వారికి సేవ చేస్తూనే
అక్కడక్కడ తమ తమ చిన్న చిన్న రాజ్యాల విడుదలకు పోరాటాలు చేసేవారు. సహజంగా
భారతీయులకు సహనమెక్కువ పైగా సహజ వనరులు పుష్కలంగా ఉన్న భారత దేశంలో ఎవరు
ఎంత దోచుకున్నా ఇంకా మిగిలేది. ఎన్ని హింసలు దారుణాలు ధన మాన ప్రాణాలు
హరింపబడినా అక్కడక్కడా చిన్న చిన్న వ్యతిరిక్తత ఉండేది కానీ పరాయి
రాచరికానికి వ్యతిరేకంగా పోరాటం జరగలేదు.

1850 నాటికే మన భారతీయులు ఆంగ్ల రాచరికపు ప్రభుత్వ ఉద్యోగాలలో, సైన్యంలో
చేరడం సామాన్యమైంది. అంటే అప్పటికే పరాయి పాలనను మనవారు (అంతకు ముందు
యవనులను తురుష్కులను, మొఘలాయిలను రాచరికానికి ఒప్పుకున్నట్టు) సహించి
ఓర్చుకున్నారని చెప్పవచ్చు స్వపరిపాలన స్వాతంత్ర్యం కోసం అప్పటి దాకా
చెప్పుకోదగిన పోరాటాలు కానీ వ్యతిరిక్తత కానీ లేవు అనే చెప్పాలేమో (భారత
చరిత్రలో కొన్ని చిన్న సంఘటనలను, పోరాటాలను లిఖించారు కానీ అవి వారి వారి
చిన్న చిన్న రాజ్యాల విడుదలకో, లేక పన్నులు కట్టడానికి విముఖతతోనో
చేసినవిగా ఎక్కువగా కనపడతాయి).

ఆకాలంలోనే గోజాతి సంహారం ఎక్కువైంది. అప్పటికి సైన్యం చేతిలో ఉండే రెండు
గొట్టాలుండే తుపాకీల గుండ్లను ఆవు, ఎద్దు యొక్క కొవ్వును పూతగా పూసి
తూటాలోని గన్ పౌడర్ లీక్ అవ్వకుండా ఉంచేవారు. సైనికులు ఆ గుండు పై పొరను
నోటితో పీకి తుపాకీలో గుండు పెట్టి కాల్చేవారు. 1857 ప్రాంతంలో
బ్రిటిషువారి సైన్యంలో ఉన్న మంగళ్ పాండే అనే యువ సిపాయి ఒక సారి ఒక
గ్రామం గుండా వెళ్తూ అక్కడి బావి దగ్గర ఒక స్త్రీని దాహార్తిని
తీర్చుకోడానికి నీరు పొయ్యమంటే ఆ తల్లి మంగళ్ పాండే ను చూసి "అన్నా! మీ
నోటినుంచి చేతులనుంచి గోవు ఎద్దు ల కళేబరాల దుర్గంధం వాటి కొవ్వు వాసన
వస్తున్నాయి గోవధ చేసినవారికి నీళ్ళిచ్చి ఈ నీళ్ళను అపవిత్రం చేయలేను"
అని వెళ్ళిపోయింది.

ఆ సంఘటనే బ్రిటిషువారికి వ్యతిరేకంగా మొట్టమొదటిసారి మన స్వాతంత్ర్య
సంగ్రామానికి నాందిగా మొదటి తూటా పేలింది. అప్పటి మన వారు స్వాతంత్ర్యం
కావాలన్నది మన ధర్మాలను నమ్మకాలను నిలపెట్టుకోవటానికి, కానీ రాజకీయ
ప్రాధాన్యాన్ని పొందటానికి కాదు. రాను రాను స్వాతంత్ర్య సమరం యొక్క రూపు
మారింది రాజకీయ ప్రాధాన్యాలు పెరిగాయి దానివల్ల స్వాతంత్ర్యం వచ్చినా
ఇప్పటికీ సగానికి పైగా భారతీయులు ఆ స్వాతంత్ర్య ఫలాన్ని
పొందలేకపోతున్నారు.

గోజాతి సంరక్షణార్థమే భారత స్వాతంత్ర్య సంగ్రామం మొదలైంది.

గోమాతా విజయతామ్

Reply all
Reply to author
Forward
0 new messages