మహారాజ్ పృధ్వీ రాజ్ చౌహాన్

96 views
Skip to first unread message

శ్రీ అయ్యగారి సూర్య నాగేంద్ర కుమార్

unread,
Feb 1, 2012, 2:26:45 AM2/1/12
to గోమాత (Go Mata)
నమస్తే
అది మహారాజ్ పృధ్వీరాజ్ చౌహాన్ భారతదేశపు సామ్రాట్ గా ఉన్నరోజుల్లో
మహమ్మద్ ఘోరీ ఇరాన్ నుండి 25000 మంది సైన్యంతో (అశ్వ మరియు పదాతి)
హస్తినాపురాన్ని కైవసం చేసుకోవాలని దండెత్తి వచ్చాడు. ఆ విషయం
తెలుసుకున్న భటిండాలోని గోమాత సేవకులైన దాదాపు 4000 మంది రాజపుత్రులు
మహమ్మద్ ఘోరీ సైన్యాన్ని నిలువరించారు ఈలోగా సమాచారం తెలుసుకున్న
పృధ్వీరాజ్ చౌహాన్ సైన్యాన్ని సమాయత్తం చేసుకుని చిత్తోడ్ ఘడ్ మహారాజైన
సమర్ సింగ్ సహాయంతో దాదాపు మూడునెలలు తరవాత భటిండాచేరుకున్నాడు. అప్పటి
వరకూ ఆ గోసేవకులే అంత సైన్యాన్నీ నిలువరించగలిగారు కొందరు అసువులు
బాసారు. పృధ్వీరాజ్ చౌహాన్ సైన్యానికీ, మహమ్మద్ ఘోరీకి మధ్య ధాణేశ్వర్
దగ్గర్లో సరస్వతీ నదీ తీరమైదానంలోని తరవాజీ అనే చోట యుద్ధం జరిగింది.
అందులో పృధ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ ఘోరీ సైన్యాన్ని ఓడించి సైన్యంతో సహా
ఘోరీని బంధించి రాజధాని హస్తినాపురానికి (ఢిల్లీ) తీసుకెళ్ళాడు.
రాజదర్బారులో విచారణ నిమిత్తం ఘోరీని ప్రవేశ పెట్టగా యుద్ధఖైదీనైన తనని
వేలమంది రాజపుత్రుల మరణానికి కారణమైనందుకు తీవ్రమైన శిక్షవేస్తారని
అప్పటికే ఘోరీకి అర్థం అయ్యింది. పృధ్వీరాజ్ అప్పుడు ఘోరీని చూసి "ఇంత
ఘోరానికి ఒడిగట్టిన నీతో మేము ఎట్లు వ్యవహరించాలి" అని గదమాయించగా ఘోరీ
రెండు చేతులూ జోడించి తల దించుకొని "నేను మీ ఇంటి ఆవును. మీగోవునైతిని, ఆ
ప్రకారంగా మహారాజు కరుణించి వ్యవహరించండి" అని కోరాడు. రాజా సమర్ సింగ్
"నువ్వుగోవువా?" అని ఉగ్రుడై లేవగా అంత దుష్టుడైన ఘోరీని చూసీ పృధ్వీరాజ్
చౌహాన్ "నువ్వు మా గోవువి అని కదా అన్నావు మేము గోవులను సంహరించం
హింసించం కాబట్టి నిన్ని వదిలేస్తున్నాం, మా ధర్మంలోని వారు ఈ దేశంలోని
వారు గోవుకు చిన్న ఆపదకలిగినా సహించలేరు, అటువంటి దేశానికి రాజునైన నన్ను
నేనుమీ గోవుని అని శరణు వేడావు కాబట్టి దండించలేం వదిలేస్తున్నాం " అని
విడిచి పెట్టగానే ఘోరీ తన దేశానికి పారిపోయాడు. కానీ అ విశ్వాసఘాతకుడూ
తిరిగి చాలాసార్లు భారతదేశంపై దండెత్తి దోచుకున్నాడు.

అంటే మన దేశంలో మన ధర్మంలో ఎంత మహాపరాధిఐనా గోవు వలన ఎలా రక్షింపబడ్డాడో
అప్పటి వారు ఎంత గోభక్తులో ఈ పృధ్వీరాజ్ చౌహాన్ వృత్తాంతాన్ని బట్టి
తెలుస్తోంది.
అంతే గొప్ప భక్తి మన దేశంలో మళ్ళో పెంపొందాలని కోరుకుంటూ

గోమాతా విజయతామ్

రాజశేఖరుని విజయ్ శర్మ

unread,
Feb 1, 2012, 3:04:13 AM2/1/12
to gom...@googlegroups.com


గోసేవా భాగ్యం వలననే కదా అంతటి క్షమ అలవడింది. గోమాత ఆశీర్వాదం ఎంతటి కార్యాన్నైనా సాధింపచేయగలదు. మంచి కథ తెలిపారు. ధన్యవాదములు.

--



ఇట్లు

భగవత్సేవకుడు
రాజశేఖరుని విజయ్ శర్మ

http://rajasekharunivijay.blogspot.com/  


Reply all
Reply to author
Forward
0 new messages