నందన అన్న పదం ఒక్క కొడుక్కి మాత్రమే అన్వయమౌతుంది. నందనుడు అంటే, తల్లి
దండ్రులను ఆనందింపచేయువాడు అని అర్థం. ఎవరు తమ తల్లి తండ్రుల ఆనందానికి
కారకులో, ఏ కొడుకు పేరు చెప్తే తల్లి దండ్రులు వాని ధర్మ నిరతిని,
అభ్యున్నతిని చూచి ఆనందంతో భాష్పాలు రాలుస్తారో అటువంటి వాణ్ణి నందనుడు
అంటారు.
ఈ నందన నామ సంవత్సరం మన అందరికీ అంతటి ఆనందాన్నీ, సౌఖ్యాన్నీ, ఖ్యాతినీ,
ఆధ్యాత్మికోన్నతినీ, పరమేశ్వరుని పాదాలు ఇంకా గట్టిగా పట్టుకునే ధృతినీ
పేరు పేరునా ప్రతి ఒక్కరికీ ఇవ్వాలనీ ఆ ఆచార్య వర్యులకు, గురు వర్యులకు,
పరమేశ్వరుని పాదాలకు నమస్కరిస్తూ.
మీ....
గోబ్రాహ్మణేభ్యశ్శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినోభవంతు.