గోమాత యొక్క అంగముల యందు వసించు దేవతలు

70 views
Skip to first unread message

శ్రీ అయ్యగారి సూర్య నాగేంద్ర కుమార్

unread,
Nov 21, 2011, 7:42:32 AM11/21/11
to గోమాత (Go Mata), satsa...@googlegroups.com
క్ర.సం. గోమాత యొక్క అంగములు గోమాత యొక్క అంగముల యందు వసించు దేవతలు
౧ కుడి కన్ను సూర్య భగవానుడు
౨ ఎడమ కన్ను చంద్రుడు
౩ కుడి నాసికా రంధ్రము మిత్రుడు
౪ ఎడమ నాసికా రంధ్ర్రము వరుణుడు
౫ లలాటము శివుడు
౬ మూర్ధన్య స్థానము కుబేరుడు
౭ కుడు కొమ్ము జయ
౮ ఎడమ కొమ్ము విజయ
౯ కుడి చెవి బుధుడు
౧౦ ఎడమ చెవి బృహస్పతి
౧౧ గొంతు సరస్వతి
౧౨ గొంతు పైన నకులీ వాగీశ్వరి
౧౩ గొంతు కింద వాగీశ్వరి
౧౪ కుడి తొడ భైరవ
౧౫ ఎడమ తొడ హనుమ
౧౬ కుడి మోకాలి క్రింద పిక్క తూర్పున ఉండే మేరువు
౧౭ ఎడమ మోకాలి క్రింద పిక్క పశ్చిమమున ఉండే అమేరువు
౧౮ హృదయం విష్ణు భగవానుడు
౧౯ మూపు బ్రహ్మగారు
౨౦ జఠరం అగ్ని
౨౧ ఉదరం భూదేవి
౨౨ పొదుగు అమృత సాగరం
౨౩ పొదుగు పైభాగమున సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు, నారద మహర్షి,
సప్తర్షులు
౨౪ వెన్ను చివర పార్వతి (శక్తి)
౨౫ పృష్ట భాగం లక్ష్మీ దేవి
౨౬ పృష్ట భాగం క్రింద (మూత్ర స్థానము) పవిత్ర నదీ జలములు
౨౭ తోక కాలము
౨౮ వెనక కుడి తొడ ఊర్ద్వ లోకములు / అటువైపు మార్గము
౨౯ వెనుక ఎడమ తొడ పితృ లోకములు / అటువైపు మార్గము
౩౦ వెనుక కుడి మోకాలి క్రింద పిక్క దక్షిణము
౩౧ వెనుక ఎడమ మోకాలి క్రింద పిక్క ఉత్తరము
౩౨ శిరములు (పాల పితుకులు) ౧)ఋగ్వేదం ౨) యజుర్వేదం ౩) సామ వేదం, ౪)
అధర్వణవేదం
౩౩ నాలుగు డెక్కలు ౧) స్థితి ౨) జ్ఙానం ౩) బుద్ధి ౪) క్రియ

Chakravarthy DSK

unread,
Nov 21, 2011, 10:31:15 AM11/21/11
to gom...@googlegroups.com, satsa...@googlegroups.com
ఈశ్వర స్వరూపమైన గుంపునకు నమస్కారములతో,
 
ఇన్ని ఉన్నాయన్న విషయం తెలియకుండానే నా చేత ఈశ్వరుడు ఈ మధ్యనే గో మాతను పూజించుకునే భాగ్యాన్ని ఇచ్చారు. ఎంతటి భాగ్యం నాది!! ఇంతటి కర్మ నా చేత చేయించుకున్న అమ్మవారికి మనసా వాచా నమస్కారములు తమ్మ మరింకేమీ ఇవ్వలేను.
 
ఈశ్వరునికి నాయందు ఎంతటి కృపయే కదా!!

2011/11/21 శ్రీ అయ్యగారి సూర్య నాగేంద్ర కుమార్ <nagendra...@gmail.com>



--
ధన్యవాదములతో,
భవదీయుడు,
చక్రవర్తి
-------------------------------
 
సంధ్యారంభ విజృంభితం శ్రుతిశిర స్థానాంతరాధిష్టితం
సప్రేమ భ్రమరాభిరామ మసకృ త్సద్వాసనా శోభితం
భోగీంద్రాభరణం సమస్తసుమనః పూజ్యం గుణావిష్కృతం
సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితమ్ ||

Reply all
Reply to author
Forward
0 new messages