నమస్తే
ప్రత్యక్షంగా గోమాత పూజ రోజూ చేసే అవకాశం లేకపోయినా, ఈ గోస్తుతి రోజు
చదవదగ్గది.
స్కాంద పురాణాంతర్గత శ్రీ గోమహిమ స్తోత్రం!
సృష్టి స్థితి వినాశానాం ! కర్త్రై మాత్రే నమోనమః!
యాత్వం రసమయై ర్భావై! రాప్యాయయసి భూతలమ్!! ౧
దేవానాంచ తథా సంధాన్! పిత్రాణమపి వైగణాన్!
సర్వేజ్ఙాత్వా రసభిజ్ఙే ! ర్మ ధురస్వాదు దాయినీ!! ౨
త్వయా విశ్వమిదం సర్వం !బలంస్నేహ సమన్వితమ్!
త్వం మాతా సర్వరుద్రాణాం ! వసూనాం దుహితా తథా!! ౩
ఆదిత్యానాం స్వసాచైవ ! తుష్టా వాంఛిత సిద్ధిదా !
త్వం ధృతిస్త్వంత తధా పుష్టి ! స్త్వం స్వాహాత్వం స్వధాతధా!! ౪
బుద్ధిః సిద్ధిస్తధా లక్ష్మీ! ర్ధృతిః కీర్తి స్తథామతిః!
కాంతిర్లజ్జా మహామాయా ! శ్రద్ధా సర్వార్థ సాధినీ!! ౫
త్వం మాతా సర్వదేవానాం ! త్వంచ సర్వస్య కారణమ్!
త్వం తీర్థం సర్వతీర్థానాం ! నమస్తేస్తు సదా2 నఘే!!౬
శశిసూర్యారుణా యస్య ! లలాటే వృషభద్వజః!
సరస్వతీ చ హుంకారే! సర్వే నాశ్చకంబవే!!
ఉర పృష్టేచ గంధర్వా! వేదాశ్చత్వార ఏవచ!
ముఖాగ్రే సర్వతీర్థాని ! స్థావరాణి చరాణి చ!!
గావః పవిత్రా మాంగల్యా! గోషులోకాః ప్రతిష్ఠితాః!
యద్గృహే దుఃఖితాగావః ! సయాతి నరకం నరః!!
~ఇతి స్కాంద పురాణాంతర్గత గోమహిమ సంపూర్ణమ్~