గోభక్తులకు నమస్కారములు
మన వేదంలో, ముఖ్యంగా కర్మకాండలో ఏదేని పెద్ద యాగాదులు తలపెట్టినప్పుడు
పంచ గవ్య ప్రాశన సర్వ పాప పరిహారార్థం, సర్వ దోష నివారణార్థం చేయీస్తారు.
అంటే ఆ యాగము చేయడానికి వలసిన యోగ్యతను పొందడానికి ఇతం పూర్వం తెలిసి
కాని తెలియక కాని చేసిన పాపకార్యాలు, వాటివలన వచ్చిన దోషాలు ఉంటే అవి ఈ
యాగమును నిర్వహించు సమర్థతకు అడ్డంకి గా మారకుండా, ఆ పాప / దోష
పరిహారార్థం పంచ గవ్య ప్రాశన చేయిస్తారు.
పంచ గవ్యములు అంటే? గోవు నుంచి వచ్చిన ఉత్పత్తులు గవ్యములు అటువంటి ఐదు
గో ఉత్పత్తులను కలిపి మంత్ర పురస్సరంగా తీర్థంగా స్వీకరిస్తారు.
పంచ గవ్యములు
౧) ఆవు పాలు
౨) ఆవు పాలతో చేసిన పెరుగు
౩) ఆవు నెయ్యి
౪) గో పంచతం (ఆవు మూత్రం)
౫) గో మలం (ఆవు పేడ)
ఈ ఐదింటినీ సమ భాగాలుగా చేర్చి రంగరించిన పదార్థాన్నే పంచ గవ్యమంటారు.
ఇది అతి పవిత్రమైనది.
వైద్య రీత్యా ఈ పంచగవ్య ప్రాశనం, శరీరాన్ని శుద్ధిచేసి, కఫము, వాతము,
అజీర్ణము, అపస్మృతి (మరుపు/ మగత వంటిది), జ్వరము, వంటి నొప్పులు వంటి
ఎన్నింటినీ తగ్గిస్తుంది.
మన దగ్గర ఇంకాలేదు కానీ, రష్యా, అమెరికా, జర్మనీ వంటి దేశాలలో గోవును, గో
ఉత్పత్తుల మీద విశేషమైన పరిశోధనలు చేసి విశ్వవిద్యాలయాల్లో సమర్పించి
పట్టాలు పొందిన వారున్నారు. ఒకానొక రష్యశాస్త్రవేత డా శిరోవిచ్ అధ్యయనంలో
రేడియోధార్మిక శక్తిని ఎదుర్కొనే గుణాలు గోవు ఉత్పత్తులలో ఎక్కువ ఉన్నాయి
అని నిర్ధారించారు.
డా శిరోవిచ్ పరిశోధనలలోని కొన్ని వివరాలు
౧) ఆవు పాలలో రేడియోధార్మిక శక్తినుంచి రక్షించే గుణాలు ఎక్కువ,
రేడియోధార్మిక శక్తి వల్ల కలిగే కొన్ని రుగ్మతలు నిత్యం ఆవు పాలు
తాగేవారికి సోకవు
౨) ఆవు పేడలో కూడా రేడియోధార్మిక శక్తినుంచి రక్షించే గుణము ఎక్కువ, ఆవు
పేడ అలికిన గోడలున్న ఇంటిలోకి సూర్యుని నీలలోహిత కిరణ ప్రసారం ద్వారా
మరియు ఇతర ఎలక్ట్రానిక్ తరంగాల ద్వారా ప్రసారమయ్యే రేడియోధార్మిక శక్తి
ప్రభావం చూపట్లేదు (అందుకే కాబోలు పూర్వం గోడలకి, నేలలకి ఆవు పేడ అలికే
వారు, ఇప్పటికీ ఆ పాకలే చక్కగా చల్లగా ఉంటాయి కూడా )
౩) ఆవు నేతిని భారత దేశములో అగ్నిలోవేసి దేవతల పూజ చేస్తారు, దీని వల్ల
వాతావరణములోని రేడియేషన్ తగ్గి, వాతావరణము చల్లబడి వర్షించడానికి అనువుగా
ఉంటుంది
౪) పంచగవ్యములు రేడియోధార్మిక తరంగాల వలన కలిగే అనేక చర్మ వ్యాధులను
ఆవ్యాధి కారకములను సమర్థ వంతంగా ఎదుర్కొంటాయి
౫) వీనిని సేవించిన వారు పటుత్వంతో రోగముల బారి పడకుండా దీర్ఘ కాలము
జీవిస్తారు ( life span of a human will increase, and they will live
without any diseases)
మీ...