ఆన్‌లైన్‌లో మీ కథలు పబ్లిష్ కావాలని ఉందా? మీ కథ లేదా కవితలకు మీరు కోరుకున్నంత పారితోషికం పొందాలని ఉందా? మీ రాతలను ఇష్టపడే అభిమానులందరినీ మీ మొబైల్ లేదా వెబ్‌సైట్లో ఒక బృందంగా ఏర్పాటు చేసుకోవాలని ఉందా?

4 views
Skip to first unread message

Devendar Gona

unread,
Aug 6, 2016, 7:19:38 AM8/6/16
to e-తెలుగు హైదరాబాద్

ఆన్‌లైన్‌లో మీ కథలు పబ్లిష్ కావాలని ఉందా? మీ కథ లేదా కవితలకు మీరు కోరుకున్నంత పారితోషికం పొందాలని ఉందా? మీ రాతలను ఇష్టపడే అభిమానులందరినీ మీ మొబైల్ లేదా వెబ్‌సైట్లో ఒక బృందంగా ఏర్పాటు చేసుకోవాలని ఉందా? కూచున్న చోటు నుంచే మీరు రచయితలుగా గుర్తింపు తెచ్చుకోవాలని ఉందా? భారతీయ భాషల్లోకి మీ రచనలు అందుబాటులోకి కావాలని ఉందా? డోంట్ వర్రీ. మీ కలలన్నీ తీర్చేందుకు ఒక మార్గం ఉంది. జోక్ కాదు, కథా కాదు. నిజం. మీ రచనల్ని మీరే పబ్లిష్ చేసుకునే సదుపాయం కల్పిస్తోంది, KAHANIYA.COM.

మారుతున్న కాలంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఙానం అమల్లోకి వచ్చాక పుస్తకం కొనుక్కుని చదివే తీరిక ఎవ్వరికీ దొరకడం లేదు. అదే పుస్తకం ఆన్‌లైన్‌లో దొరికితే ప్రయాణ సమయంలోనో, ఖాళీగా ఉన్న సమయంలో మొబైల్‌లోనో, డెస్క్‌టాప్‌లోనో చదివేవారే ఎక్కువ. అలాంటి పాఠకులను దృష్టిలో ఉంచుకునే అనేక కథల, కవితల వెబ్‌సైట్లు అమల్లోకి వచ్చాయి. మనం రాసిన కవితా, కథను ఆయా మాధ్యమాల్లో పోస్ట్ చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందే అవకాశం ఉంది. అయితే, ఇప్పటి వరకు ఉన్న వెబ్‌సైట్లు అన్నిట్లోనూ ఉచితంగా అప్‌లోడ్ చేసుకోవడం, చదువుకునే సదుపాయం మాత్రమే ఉంది. కథా రచయితలు, కవులు చాలామంది ఇప్పటికే తమ స్వంత బ్లాగులు ఏర్పాటు చేసుకున్నారు కూడా. అయితే వారిలో చాలామందికి వాటి నిర్వహణ కష్టసాధ్యం కావడంతో అర్థాంతరంగా నిలిపివేయడమో లేదా నామ్‌కే వాస్తేగానో నిర్వహిస్తున్నారు. దీనికి రెండు కారణాలు.. ఒకటి తామే నిర్వహణ చూసుకోవడం ఇబ్బంది కావడం, మరోకటి ఆర్థికపరమైన వెసులుబాటు లేకపోవడం. కానీ KAHANIYA.COM కొత్త సంప్రదాయానికి తెర తీసింది. ఇటు రాసే రచయితకు లాభం చేకూరేలా అటు చదివే పాఠకునికి సంతృప్తి కలిగేలా కొత్త తరహాలో పని చేయడం ప్రారంభించింది.

ముగ్గురికీ లాభం

మనం ఒక పుస్తకం రాసి దాన్ని ప్రింటు చేయించాలంటే వేలాది రూపాయలు వెచ్చించాలి. లేదంటే పబ్లిషర్‌కు ఇస్తే మనకు ఎంతో కొంత ముట్టజెప్పి తను బిజినెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ కహానియా డాట్‌కాం మాత్రం రాసిన వారికే ఆ లాభం చేకూరేలా వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టింది. ఒక కథా రచయిత లేదా కవి తను రాసిన రచనకు తానే ఖరీదు నిర్ణయించుకోవచ్చు. దాన్ని కహానియా డాట్‌కాంలో పొందు పరచగానే ఎంతోమంది చూసి చదువుతుంటారు. అలా చదివేవారి నుంచి సంస్థ కొంత మొత్తాన్ని వసూలు చేస్తుంది. ఆ మొత్తాన్ని సదరు రచయితకు KAHANIYA.COM ఒప్పందం మేరకు షేర్ చేసుకునే అవకాశం ఉంది. దీనివల్ల మనం రాసే వాటికి విస్తక్షుత ప్రచారం లభిస్తుంది. ఆర్థికంగానూ లాభం గడించే అవకాశం ఉంది. అదే సమయంలో చదివే నెటిజన్లకు భారం పడని స్థాయిలో ధర నిర్ణయించడం వల్ల వారికి కూడా అదే సంతృప్తి మిగులుతుందని సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు.

అన్ని ప్రాంతీయ భాషల్లో...

KAHANIYA.COM కేవలం తెలుగు సాహిత్యానికే కాకుండా దేశంలోని అన్ని ప్రాంతీయ భాషల్లోనూ సేవలందించేందుకు ముందుకు వచ్చింది. ఇప్పటి వరకు ఇంగ్లీషుతో కలిపి 11 భాషల్లో అందుబాటులో ఉండగా తరువాతి కాలంలో మిగిలిన అన్ని ప్రాంతీయ భాషల సాహిత్యాన్ని అందించేందుకు కృషి చేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.

పాఠకుడికి ఏం లాభం?

పాఠకుడు తనకు ఏ తరహా కథలు ఇష్టమో వాటినే ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఒక మంచి కథ లేదా కవితను తన మాతృభాషలో చదువుకునే అవకాశం ఈ వెబ్‌సైట్ కల్పిస్తోంది. ఆయా రచయితల కథలు చదవడమే కాదు, తమకు ఇష్టమైన రచయితలతో కమ్యూనికేట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే, మీ చేతిలో మొబైల్ ఉంటే చాలు- కథల పుస్తకం మీ చేతిలో ఉన్నట్లే! అన్నట్టు, ఈ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యాక పాఠకుడిగా వచ్చిన వ్యక్తి రచయితగా మారినా ఆశ్చర్యం లేదు. అంతలా సౌలభ్యంగా ఉంది ఈ సాఫ్ట్‌వేర్‌లో.

కథలు, కవితలు, పాటలు ఏవైనా కావచ్చు. మనకున్న నైపుణ్యం నలుగురికి చేరాలనే తపన, ఇతరులు రాసిన వాటిని చదవాలనే ఆసక్తి ఉన్న వారందరికీ ఒక వేదికగా అవకాశం కల్పిస్తోందిKAHANIYA.COM.

వెబ్‌సైట్ ఇలా ఉంటుంది!

వెబ్‌సైట్ ఓపెన్ చేశాక మీ పేరు రిజిస్టర్ చేసుకోవాలి. చేసుకున్నాక ‘చూజ్ యువర్ లాంగ్వేజ్’ అని వస్తుంది. మొత్తం పదకొండు భాషలున్నాయి. మీరు ఏ భాషలో కథలు చదవాలనుకుంటున్నారో లేదా రాయాలనుకుంటున్నారో ఆ భాషను ఎంచుకుని లోపలికి వెళ్లవచ్చు. అటు పిమ్మట కథలు రాసి ప్రచురించాలనుకుంటే ఇంగ్లీషులో టైప్ చేస్తే తెలుగులో వచ్చేలా సాప్ట్‌వేర్‌ను రూపొందించారు. దాంతో మీకిష్టమైన జెనర్‌లో -చిల్డ్రన్, డ్రామా, ఫాంటసీ, ఫిక్షన్, ఇన్‌స్పిరేషన్ -ఇలా ఏ విభాగం కింద రాయాలనుకుంటే అందులో హాయిగా కథ రాసి పబ్లిష్ చేయవచ్చు. రాసేది చిన్న కథనా లేదా వెబ్ సిరిసా అన్నది మనం నిర్ణయించుకుని పోస్ ్టచేయవచ్చు. మీరు రాసింది ఉచితంగా నలుగురికీ పంచుతారా లేక పాఠకులు పే చేసి చదవాలా అన్నది కూడా మనం నిర్ణయించుకోవచ్చు.

ఇక, కథలు చదువుకోవాలనుకునే వారు సెర్చ్‌లోకి వెళ్లి మనకు తెలిసిన రచయితల పేర్లుగానీ, కథల పేర్లుగానీ టైప్ చేసి చూసుకోవచ్చు. ఆయా కథల్ని ఫేస్‌బుక్‌లో షేర్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. అలాగే ఆ కథల్ని చదవడానికి రమారమిగా పట్టే సమయం కూడా వెబ్‌సైట్ చూపిస్తుండటం విశేషం. ఇట్లా-కహానియా వెబ్‌సైట్‌లోకి వెళ్లి కథలు సులభంగా రాసి ప్రచురించుకోవచ్చు లేదా ఆనందంగా చదివి రావచ్చు. మరింకేం? ఒకసారి ట్రై చేస్తే మీరే చాలా విషయాలు చెబుతారు.

నిర్వాహకులు: ఇది నలుగురు యువకుల కహాని

KAHANIYA.COM నిర్వహిస్తున్న వారంతా యువకులే. వీరంత రచయితలు, కవులు కాదు. కానీ, చదవాలనే ఆసక్తి ఉన్నవారు. టెక్నాలజీపై పట్టున్న వాళ్లు. కొత్తగా ఏదైనా చేయాలన్న తపన ఉన్నవాళ్లు. తమ అభివూపాయాలను నలుగురితో పంచుకోవాలన్న ఆరాటం ఉన్న వాళ్లు. ముఖ్యంగా మంచి కథలకు ఆదరణ తేవాలనే ఆరాటం ఉన్న వాళ్లు కూడా. అందుకే కథలకు అడ్డగా ‘కహానియా డాట్‌కాం’ను ప్రారంభించామని అంటున్నారు.

తొలుత ఈ బ్లాగును ప్రారంభించాలనే ఆలోచన వచ్చింది పల్లవ్ బజ్జూరి అనే యువకుడికి. అమెరికాలో ఉన్నతోద్యోగం చేస్తున్న పల్లవ్‌కు కథలంటే ప్రాణం. అందుకే వివిధ తెలుగు బ్లాగుల్లోని కథలను క్రమం తప్పకుండా చదివేవాడు. కానీ చదవగా చదవగా ఒకటి గమనించాడు. తనకు ఇష్టమైన కథ లేదా రచయిత వివరాలు ఎంత వెతికినా దొరికేవి కాదు.

ఆ సమయంలో తనే ఒక బ్లాగును ప్రారంభిస్తే? అన్న ఆలోచనతో తన చిన్ననాటి మిత్రులు దేవేందర్ గోనా, సందీప్ పొనగండ్ల, జశ్వంత్ పాడూరులను సంప్రదించాడు. పల్లవ్ ఆలోచనలు నచ్చిన ఆ మిత్రులు కూడా ‘సై’ అనడంతో 2012 నుంచి తమ ప్రయత్నాలు ప్రారంభించి 2016 మే 21న దీన్ని ప్రారంభించారు.

జ్ఙానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నా. చేతుల మీదుగా KAHANIYA.COM ప్రారంభమైంది. అయితే, దీనికన్నా ముందు వీరంతా జర్నలిజం గురించిన వివరాల కోసం SADDAHAQ.COM అనే బ్లాగును నిర్వహించారు. దాని కోసం ఉపయోగించిన టెక్నాలజీతోనే దీన్ని ప్రారంభించారు.

ప్రస్తుతం SADDAHAQ ను ప్రపంచ వ్యాప్తంగా 10 లక్షల మంది వీక్షిస్తున్నారు. తర్వాత ప్రారంభమైన KAHANIYAకు అనతి కాలంలోనే 150 మంది రచయితలు, కవులు దాదాపు మూడువేలకుపైగా తమ రచనలను పోస్ట్ చేశారంటే దాని వెనుక ఉన్న ఈ నలుగురి కృషి ఎంతో అర్థమవుతుంది.

మరిన్ని వివరాలకు: PAL...@KAHANIYA.COM.

మొబైల్: 91600 44559

Reply all
Reply to author
Forward
0 new messages