నమస్కారం
ఈ నెల 14వ తేదీన విజయవాడలోని స్వాతంత్ర్య సమరయోధుల భవనంలో ఉ. 10 గం॥ లకు నశీర్ అహమ్మద్, నూర్బాషా రహంతుల్లా మరియు మండలి బుద్ధప్రసాద్ గార్లు వారి రచనలను క్రియేటివ్ కామన్స్ షేర్ అలైక్ ఆట్రిబ్యూషన్ 4.0 ద్వారా విడుదల చెయ్యనున్నారు. ఈ కార్యక్రమం యొక్క పోస్టర్ ను ఇక్కడ జత చెస్తున్నాను. దయచేసి ఆసక్తి గల వారు పాల్గొనగలరు.
ఈ కార్యక్రమంలోనే నకలు హక్కులపై అవగాహన సదస్సు ఉంటుంది.
రచయితలు, విద్యార్థులు, పరిశోధకులు, పాత్రికేయులకు ఇది ఎంతగానో ఉపయోగ పడవచ్చు.
వికీసోర్స్ ద్వారా మీ రచనలను మరింత విశ్వవ్యాప్తం చేసే అవకాశం గురించి తెలుసుకోవచ్చు.
మిగితా వివరాలు జతచేయబడ్డ బొమ్మలో చూడగలరు.
--
With thanks & regards
Rahimanuddin Shaik
నాని

reachout
| | ఒక విశ్వాన్ని ఊహించండి, ఎక్కడయితే ప్రతి మనిషి ఒక సంపూర్ణ విజ్ఞానభాండారాన్ని అందరితో పంచుకోగలడో, ఆ విశ్వాన్ని ఊహించండి. అటువంటి విశ్వాన్ని నెలకొల్పడమే మా సంకల్పం.
|