హైదరాబాదులో వికీపీడియా దశాబ్ది వేడుకలు మరియు తెవికీ అవగాహనా సదస్సు (జనవరి 23న)

3 views
Skip to first unread message

Veeven (వీవెన్)

unread,
Jan 13, 2011, 12:55:02 AM1/13/11
to etelu...@googlegroups.com, etelugu...@googlegroups.com

స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వమైన వికీపీడియా ఏర్పడి ఈ నెల పదిహేనవ తేదీకి 10 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఔత్సాహికులందరూ వికీపీడియా దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్నారు. హైదరాబాదులో e-తెలుగు సంస్థ కూడా ఈ వేడుకలను నిర్వహిస్తూంది. ఈ వేడుకలలో భాగంగా, తెలుగు వికీపీడియాను ఎలా ఉపయోగించుకోవాలి, కొత్త సమాచారాన్ని చేర్చడం, ఉన్న సమాచారాన్ని సరిదిద్దడం వంటి అంశాలపై ప్రత్యక్ష ప్రదర్శనతో కూడిన అవగాహనా సదస్సును నిర్వహిస్తున్నాం. తెలుగు వికీపీడియా లోని విశేష వ్యాసాలతో కూడిన సీడీని కూడా ఈ సందర్భంగా పంపిణీ చేస్తున్నాం.

ఈ సదస్తులో పాల్గొన్న వారు వికీపీడియాకి తోడ్పడటమెలాగో నేర్చుకుని తద్వారా తెలుగులో కూడా అపూర్వ విజ్ఞాన సంపందని పోగేసే మహా ప్రయత్నంలో భాగస్వాములవుతారని ఆశిస్తున్నాం.

-------------------------------------------------

తేదీ మరియు సమయం:
ఆదివారం, జనవరి 23, 2011 ఉదయం 10 గంటల నుండి 12 వరకు

వేదిక:
హనీపాట్ ఐటీ కన్సల్టింగ్ ప్రై. లి.
6-2-46, అడ్వొకేట్స్ కాలనీ,
ఏసీ గార్డ్స్, లకడీ-కా-పూల్,
హైదరాబాద్ - 500 004.
(పటం)

సంప్రదింపులు: 90303 65266, support @ etelugu.org

------------------------------------------------

మరిన్ని వివరాలకై ఈ లంకెలను చూడండి:

ఈ విషయాన్ని మీ మిత్రులతో పంచుకోండి.

ఇట్లు,
వీవెన్,
e-తెలుగు కార్యవర్గం తరపున.
Reply all
Reply to author
Forward
0 new messages