మాతృదేవోభవ --కోటేశ్వర రావు కేళం
----------------------------------------------------
నీ ప్రాణం నేనాయే
నా జీవం నీదాయె
నే తింటే నీ కడుపు నిండే
నువ్వు తింటే నా కడుపు నిండే
నే తంతే నవ్వుకున్నావ్
నను తన్ని నువ్వు ఏడ్చవ్
నను నిలువునా మోసి మైమరచావ్
నిను నిలువునా కోసినా నాకై మురిసావ్
నా స్వభావం నీ నుంచే
నీ ప్రభావమే నను తీర్చే
నా దేహం నీనుంచే
నీ గమ్యం నా మంచే
నీ ప్రేమంతా పంచిచావ్
నా ఆనందమే ఆశించావ్
నువ్వు కరుగుతూ నను పెంచావ్
నా వెలుగుతో పరవశించావ్
నా కష్టానికి కన్నీరయ్యావ్
నీ కష్టంతో నాకన్నీ తీర్చావ్
బుడి బుడి అడుగుల నుండి... వడి వడి పరుగుల దాకా...
చేయి పట్టి నడిపించావ్... నెత్తినెట్టుకు పెంచావ్...
అమ్మా...
నేను వేరే కాదమ్మా
నీ అంశే నేనమ్మా
అమ్మా...
నాకు వేరే దైవం లేదమ్మా
నా శ్వాసే నీదమ్మా