NRI life in America

5 views
Skip to first unread message

Leela

unread,
Feb 25, 2010, 1:35:28 PM2/25/10
to CBM School Kakinada 1973
దూర తీరాలు
కన్నదేశం వదలి, ఉన్నదేశానికి వస్తే, ఉన్నవాళ్ళంతా కానివాళ్ళే!
కారు ఉన్నా, కాసు ఉన్నా, ఊరుకాని ఊరులోన సుఖం సున్న!

కార్లో ఏసి, ఇంట్లో ఏసి, వంట్లో మాత్రం వేడి వేడి!
ఊరు గొప్పది, పేరు గొప్పది, ఉనికి మాత్రం ఉత్తది!

సంవత్సరాలు సహచరులే, సంబంధాలు మాత్రం అరకొరలే!
ముఖము మాత్రం సుపరిచితమే, మనిషి మాత్రం అపరిచితుడే!

ఎదురు పడితేనే హై, బై, ఎపుడు కలవాలి చేయి చేయి? ఎన్నడు కావాలి భాయి
భాయి?

ఇక్కడి ఇళ్ళే బందిఖానాలు, మూసిన వాకిళ్ళు, మనసుకు సంకెళ్ళు!
భార్యా భర్తలు కూడా దూరపు బంధువులే! ఎవరి లెక్క వారిది! ఎవరి తిక్క
వారిది!

నవ్వే క్రుత్రిమం, నడత క్రుత్రిమం, అంతా అసహజత్వం, అంతా యాంత్రికం!
రోజంతా కంప్యూటర్తొ కబుర్లు, "నువ్వు కూడ ఒక యంత్రానివే" అన్నట్లు దాని
విసుర్లు!

స్వఛమయిన గాలి పీల్చి ఎన్నేళైయింది? సూర్యోదయాన్ని చూసి ఎన్నాళైయింది ?
ఆత్మీయంగా మాట్లాడే వాళ్ళ కోసం ఆత్రంగా చూడడం, తెరిచిన వాకిళ్ళ కోసం
అలుపెరుగక చూడడం!

ఎంతగా కలసిపోవాలన్నా, పరాయి వాడన్న భావన!
చుట్టూ వందలమంది ఉన్నా, ఎవరూలేని వంటరితనం!

నా దేశాన్ని దూరంచేసిన, నా రూపాయి అవిటితనం!
--unknown
author

ravitha sunadh

unread,
Feb 26, 2010, 6:59:22 AM2/26/10
to cbm-school-k...@googlegroups.com
my goodness.....what a poem leela.i surely believe, that is your and yours alone.dont tell me unknown author., it is you and your feelings..well,  ila  nee telugu pravinyam theerchukunnavannamata....wonderful,amazing, and it really tuoched my heart.hats off for your creativity....what a rhym and  rhythm?!?
 then ,leela, it is perfect time for u to visit india..let us unite and enjoy our good and olden times together.....we do want u here..our inspiration.....mrs.LEELA.

2010/2/26 Leela <leel...@gmail.com>
Reply all
Reply to author
Forward
0 new messages