Sweet audio rendering of almost Sanskrit but Telugu verse on Vasantrtu by the 16th century poet Ramarajabhushanudu

35 views
Skip to first unread message

Nagaraj Paturi

unread,
Apr 3, 2022, 5:25:39 AM4/3/22
to भारतीयविद्वत्परिषत्
Sri Suresh Kolichala, my friend, also a member of BVP shared the following with me as part of the (Y)ugaadi /Samvatsaraadi greetings he sent to me. 

Yesterday was (Y)ugaadi /Samvatsaraadi , the beginning of Chaitra maasa and Vasnta ritu also called as madhu maasa . 


The text below the Youtube link is as follows : 

Very proud to present the famous poem from Vasu Charitra, a much celebrated literary work of 16th Century by Sri Ramaraja Bhushanudu (Bhattumoorti).

 A great concept to present it like a song, indeed! 

 Music arranged by my friend & composer GP Raviin, elevated the presentation setting a natural soothing mood to my tune which I set in Madhyamavati Raga.

 Have a blessed Ugadi, everyone! Let this be a great new beginning in your life! Best wishes. 

 Here's the text of the Padyam along with word meanings & a summary. 

 లలనా జనాపాంగ వలనా వసదనంగ తులనాభికాభంగ దోఃప్రసంగ మలసానిల విలోలదళ సాసవ రసాల ఫల సాదర శుకాలపన విశాల మలినీ గరుదనీక మలినీకృత ధునీ క- మలినీ సుఖిత కోకకులవధూక మతికాంత సలతాంత లతికాంతర నితాంత రతికాంత రణతాంత సుతనుకాంత మకృత కామోద కురవ కావికల వకుల ముకుల సకల వనాంత ప్రమోద చలిత కలిత కలకంఠకుల కంఠకాకలీ వి- భాసురము వొల్చు మధుమాస వాసరంబు! వసంత ఋతువులోని ఒకానొక రోజు ఎలా ఉందో కవి రామరాజ భూషణుడు వసు చరిత్రలో వర్ణించిన విధం - లలనాజన = స్త్రీజనం యొక్క / అపాంగ = క్రీగంటి చూపుల / వలన = చలనంలో / అవసత్ = నివసించే / అనంగ = మన్మథునితో / తులన = సమానమైనవారైన / అభిక = కాముకుల యొక్క / అభంగ = అంతరాయం లేని / దోఃప్రసంగము = కౌగిలింతల ముచ్చట్లు కలదీ అలస = మెల్లగా వీచే / అనిల = గాలిచేత ( మందమారుతం చేత ) / విలోల = బాగా కదులుతున్న / దళ = చిగురాకులు కలవీ / స + ఆసవ = మకరందంతో కూడినవీ అయిన / రసాల = తియ్య మామిడి చెట్ల / సాదర = ఆదరంతో కూడిన / శుక = చిలుకల / ఆలాపన = ఆలాపాల చేత / విశాలము = విస్తారమైనదీ అలినీ = ఆడ తుమ్మెదల / గరుత్ = రెక్కల / అనీక = సమూహం చేత / మలినీకృత = నల్లగా చేయబడిన / ధునీ = నదీ సంబంధమైన / కమలినీ = తామర తీగల్లో / సుఖిత = సుఖంగా ఉన్న / కోకకుల వధూకము = చక్రవాక స్త్రీలు కలదీ అతికాంత = మిక్కిలి మనోహరాలైన /సలతాంత = పూలతో కూడిన / లతిక = తీగల / అంతర = లోపల / నితాంత = ఎడతెగని / రతికాంత = రతి భర్త ఐన మన్మథుని / రణ = యుద్ధంలో / తాంత = అలసిన / సుతనుకాంతము = స్త్రీ పురుషులు కలదీ అకృతక = సహజమైన / ఆమోద = పరిమళం కల / కురవక = గోరంట పువ్వులు కలవీ / అవికల = విచ్చిన్నం కాని / వకుళ = పొగడ చెట్ల / ముకుళ = మొగ్గలు కలవీ అయిన / సకల = సమస్త / వనాంత = వన మధ్యంలో / ప్రమోద = సంతోషంతో / చలిత = సంచరిస్తున్న / కలిత = ఒప్పుగా ఉన్న / కలకంట = కోయిలల / కుల = సమూహం యొక్క / కంట కాకలీ = కంఠంనుండి వెలువడే మధుర ధ్వని చేత / భాసురము = ప్రకాశిస్తున్న / మధుమాస వసరంబు = వసంత ఋతువులోని ఒక దినం / పొల్చున్ = విలసిల్లుతున్నది. 

 వసంత ఋతువులోని ఒకానొక రోజు స్త్రీల కడగంటి చూపులు శృంగార రస ప్రేరితాలూ మన్మథోద్దీపకాలూ అయ్యాయి. కాముకులు స్వేచ్చగా క్రీడించారు. తియ్య మామిడి చిగురించి పండ్లు పండి ఫలరసాలు దొరికాయి. ఆ పండ్లను తిని చిలుకలు పలికాయి. నదులలో తమర తీగలు బాగ పూచాయి. వాటిని తుమ్మెదలు గుంపుగా కమ్ముకొన్నాయి. ఆ తమర తీగల్లో చక్రవాకాలు సుఖంగా ఉన్నాయి. పూ పొదరిండ్లలో స్త్రీ పురుషులు వినోదిస్తున్నారు. గోరంటలు పూచాయి. పొగడలు మొగ్గ తొడిగాయి. కోయిలలు మధుర ధ్వనులు చేసాయి.

Nagaraj Paturi

unread,
Apr 3, 2022, 5:40:09 AM4/3/22
to bvpar...@googlegroups.com
image.png

--
You received this message because you are subscribed to the Google Groups "भारतीयविद्वत्परिषत्" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to bvparishat+...@googlegroups.com.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/bvparishat/570850e3-9b2b-44cf-a7f0-b14c472d0b9en%40googlegroups.com.


--
Nagaraj Paturi
 
Hyderabad, Telangana, INDIA.


Senior Director, IndicA
BoS, MIT School of Vedic Sciences, Pune, Maharashtra
BoS Kavikulaguru Kalidasa Sanskrit University, Ramtek, Maharashtra
BoS Veda Vijnana Gurukula, Bengaluru.
Member, Advisory Council, Veda Vijnana Shodha Samsthanam, Bengaluru
BoS Rashtram School of Public Leadership
Editor-in-Chief, International Journal of Studies in Public Leadership
Former Senior Professor of Cultural Studies, 
FLAME School of Communication and FLAME School of  Liberal Education, 
Hyderabad, Telangana, INDIA.
 
 
 
Reply all
Reply to author
Forward
0 new messages