రాబర్ట్ వాద్రా అమాయకుడు అయితే బాబు కూడా అమాయకుడే మరి !
సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రాపై ‘పిల్’ను తోసిపుచ్చిన ‘సుప్రీం( మొన్న కాంగ్రెస్ మేనమామ బాబు పై కేసులు కొట్టేసిన కోర్ట్)
రాబర్ట్ వాద్రా అమాయకుడు అయితే బాబు కూడా అమాయకుడే మరి !
చౌకబారు ప్రచారం కోసం వ్యక్తులపై ఆరోపణలు చేసి వారి ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను మార్గంగా ఎంచుకోవడం సరికాదని సుప్రీం కోర్టు సోమవారం హితవు పలికింది. యుపిఎ చైర్‌పర్సన్ సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు వ్యతిరేకంగా ప్రముఖ న్యాయవాది ఎం.ఎల్.శర్మ దాఖలు చేసిన ‘పిల్’ను తోసిపుచ్చుతూ జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ రంజన్ గొగోయ్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
న్యాయస్థానాలు కూడా తీర్పులు వ్యక్తి ని బట్టి ఇస్తున్నాయని సామాన్యుడు భావిస్తే తప్పెలా అవుతుంది.
పై సూత్రాలు జగన్ కు వర్తించవా?
జగన్ మీద కాంగ్రెస్ MLA శంకర్ రావు, బాబు కేసులు వేస్తె మా భేషుగ్గా తీసుకొంటారు.కానీ బాబు మీద కేసు వేస్తె కక్ష తో వేసినదని కొట్టేసారు.ఏమి శంకర్ రావు ఎమన్నా జగన్ కు బాబాయా? బాబు ఎమన్నా మేనమామా? కాదే, మరి వారు వేసిన కేసులు పిల్ ఎలా అవుతాయి, విజయమ్మ వేస్తె కక్ష తో వేసినదని ఎలా కొట్టేస్తారు?
బాబు మీద కేసు కొట్టేసిన తీరు చూడండి
రాబర్ట్ వాద్రా మాయకుడు అయితే బాబు కూడా అమాయకుడే మరి.
దీన్ని బట్టి రాబర్ట్ వాద్రా లాగే మన నిప్పు నారా బాబు కూడ కాంగ్రెస్ అండ దండలతోనే కేసులనుంచి బైటపడ్డాడు అని ప్రత్యేకంగా చెప్పాలా?
--
Thanks
CVReddy