maha metha leader's polictics on telangana

6 views
Skip to first unread message

stry...@gmail.com

unread,
Oct 18, 2013, 10:54:16 AM10/18/13
to bayareays...@googlegroups.com

CVReddy

unread,
Oct 18, 2013, 10:55:51 AM10/18/13
to bayareays...@googlegroups.com

చంద్రబాబు-తెలంగాణపై భిన్న ప్రకటనలు

తెలంగాణకు సంబందించి ఆయా నాయకులు చేసిన భిన్నమైన ప్రకటనలు , ఎన్నిసార్లు అబిప్రాయాలను ఎలా మార్చుకున్నారన్నదానిపై తెలంగాణవాదాన్ని ప్రచారం చేసే ఒక పత్రిక ఆయా నాయకుల ప్రకటనలను సేకరించింది. అవి సహజంగానే ఆసక్తికరంగా ఉంటాయి. వాటిలో ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ప్రకటనలకు సహజంగానే ప్రాధాన్యత ఉంటుంది.ఆయన రెండువేల తొమ్మిది కి ముందు చేసిన వివిధ ప్రకటనలు, ఆ తర్వాత కాలంలో చేసిన ప్రకటనలకు చాలా స్పష్టమైన తేడా కనిపిస్తుంది.ఒక్కసారి వాటిని పరిశీలించండి.

నారా చంద్రబాబు నాయుడు (మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అద్యక్షుడు)
2008మే 1 (పిడుగురాళ్ళలో టీడీపీ పొలిట్‌బ్యూరో ): తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి టీడీపీ వ్యతిరేకం కాదు. నేనూ వ్యతిరేకం కాదు. ఆ ప్రాంత ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తాం. మేం నియమించిన కమిటీ నివేదిక రాగానే నిర్ణయం తీసుకుంటాం.
-2008 జూలై 31 (మహబూబ్‌నగర్ జిల్లా ఐజలో తెలంగాణ కోర్ కమిటీ రెండో సమావేశంలో): ఈ సారి తెలంగాణకు వ్యతిరేకంగా తెలుగుదేశం వెళ్ళడం లేదు.

2008 అక్టోబర్ 22 (పణబ్ ముఖర్జీకి టీడీపీ లేఖ): ‘‘తెలంగాణ పై అభివూపాయాలు వెల్లడిస్తూ గతంలో ఇచ్చిన లేఖకు కొనసాగింపుగా... తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై అక్కడి వారి మనోభావాలు తెలుసుకోవడానికి పార్టీ సీనియర్ నేతలతో ఓ కమిటీ వేశాం. కమిటీ సమర్పించిన నివేదికను పొలిట్ బ్యూరోలో చర్చించాం. తెలంగాణకు అనుకూలంగా పార్టీ ఓ నిర్ణయానికి వచ్చిందని మీకు తెలియజేస్తున్నాం, పొలిట్‌బ్యూరో తీర్మానం కాపీని కూడా దీనికి జత చేస్తున్నాం.’

2009 ఫిబ్రవరి 14 (ఓ టీవి ఛానెల్‌లో చర్చలో): రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలో వస్తే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర తీర్మానంపై శాసనసభలో అనుకూల బిల్లు పెడతాం.
2009 ఏప్రిల్ 3 (మహబూబ్‌నగర్ ఎన్నికల ప్రచార సభల్లో): అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ ఏర్పాటు చేస్తాం.


2009 డిసెంబర్ (అసెంబ్లీలో): మా పార్టీ తరఫున చాలా స్పష్టంగా చెప్పాం. మీరు చర్చ అన్నింటి కన్నా ముందుగా తీసుకున్నా మేము సిద్ధంగా ఉన్నాం. లేక పోతే ప్రభుత్వ తీర్మానం తీసుకువస్తే సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం.ఈ సందర్భంగా నిరవధిక నిరహార దీక్ష చేస్తున్న చంద్రశేఖర్‌రావు దీక్ష విత్‌డ్రా చేసుకోవాలని మా పార్టీ తరఫున విన్న వించుకుంటున్నా.. (సమావేశం తర్వాత) తెలంగాణకు మేము సానుకూలంగా ఉన్నాం. తెలంగాణకు రాజకీయంగా కట్టుబడి ఉన్నాం

2009 డిసెంబర్ 10 (చిదంబరం ప్రకటన తర్వాత మీడియాతో): ఇంతపెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఎవరితోనూ చర్చించకుండా, నచ్చజెప్పకుండా, ఏకపక్షంగా తీసుకుని రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారు. స్వీయ రాజకీయ ప్రయోజనాలేవో ఆశించి కాంగ్రెస్ ఇలా వ్యవహరించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారి మనోభావాలు తెలుసుకుని, ఆలోచించి ముందడుగు వేయడం కనీస ధర్మం. సోనియా గాంధీ ఇవేమి ఆలోచించకుండా అర్ధరాత్రి నిర్ణయం ప్రకటించిచేతులు దులుపుకున్నారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్‌కు స్పష్టమైన విధానం లేదు. ఈ నిర్ణయం తీసుకునే ముందు కొన్ని విధి విధానాలు, మార్గదర్శక సూత్రాలు, ఒక పద్ధతి పెట్టుకోవాలి. వాటిపై అందరితో చర్చించాలి. మేం తెలంగాణ తీర్మానానికి మద్ధతు ఇస్తామని చెప్పిన విషయం వాస్తవం. అందులో తేడా లేదు. కాని ఈ తీర్మానం పెట్టే ముందు అందులోని ఆంశాలపై ముందస్తుగా చర్చ జరగాలి. నిర్ణయం తీసుకునే వారు తమ ఆలోచన వెల్లడిస్తే దానిపై చర్చ జరిగి ఏకాభిప్రాయం వస్తే ఎవరికి మనస్తాపం ఉండదు.

2010 ఫిబ్రవరి 4: తెలంగాణ, సీమాంధ్ర నాకు రెండు కళ్ళ లాంటివి.
2010 మార్చి13 (కర్నూలు): ఆంధ్రా, తెలంగాణ రెండు కూడా నాకు రెండు కళ్ళలాంటివి. ఆ రెండింటిని కాపాడుకుంటాను.
2010 మే 27, 2, 29 (మహానాడులో): నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే.ండు ప్రాంతాలకు నేను పార్టీ అధ్యక్షుడిని. రెండు ప్రాంతాల్లో పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
-2011 జూన్ 2: తెలుగు జాతిని, ఆంధ్రప్రదేశ్‌ను కాపాడుకోవాల్సిన అవసరం మాకు ఉంది. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా ఎలా మద్ధతిస్తాం? మీరు మద్దతు ఇస్తారా?

2011 జూన్ 2 (కేంద్ర మంత్రి చిదంబరం వ్యాఖ్యలపై): తెలంగాణపై నిర్ణయం బాధ్యత కేంద్రానిదే. ఇప్పటికే కేంద్రం అన్నిపార్టీల అభిప్రాయం, ప్రజల అభిప్రాయం తీసుకున్నది.నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంది.

2012 సెప్టెంబర్ 26 (పధానికి రాసిన లేఖ): తెలంగాణపై అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయండి. తక్షణమే ఇది చేయాలి. నాన్చడంతో అభివృద్ధి ఆగిపోయింది.

2012 డిసెంబర్ 28 (ఢిల్లీ అఖిలపక్ష సమావేశంలో షిండేకు లేఖ): ‘‘రాష్ట్రంలో అస్థిరతకు ముగింపు పలికేలా కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. 2008 అక్టోబర్ 1న ప్రణబ్‌కు ఇచ్చిన లేఖలో మా పార్టీ అభిప్రాయాన్ని వెల్లడించాం. అది కేంద్ర ప్రభుత్వం వద్దే ఉంది. దానిని ఉపసంహరించుకోలేదు’’

2013 జూలై 30 (సీడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత మీడియాతో): 2008లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా మేము లేఖ ఇచ్చాం. దానికి కట్టుబడి ఉన్నాం. రెండు రాష్ట్రాలైనా తెలుగు జాతి కలిసి ఉండాలి రాష్ట్ర విభజన వల్ల ఏర్పడే కొత్త రాష్ట్రానికి... హైదరాబాద్‌కు దీటైన రాజధానిని నిర్మించాలి. రాజధాని నిర్మాణానికి నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు ఖర్చవుతుంది.. అది ఎంతైనా ఆ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే కేటాయించాలి. తెలంగాణ బిల్లులోనే సీమాంధ్ర రాజధాని నిర్మాణం, నిధుల కేటాయింపుపై స్పష్టత ఇవ్వాలి. ఒక కమిటీ వేసి సాగునీరు, విద్యుత్, ఆదాయ పంపకాలు సమన్యాయంతో జరిగేలా చూడాలి.

2013 ఆగస్టు 17 (పత్రికా సంపాదకులు, ప్రతినిధులతో ప్రత్యేక సమావేశంలో): రాష్ట్ర విభజనకు కట్టుబడి ఉన్నా.
ఆ తర్వాత ఇటీవలికాలంలో తెలుగుజాతిని విచ్చిన్నం చేయడానికి కాంగ్రెస్ కుట్ర చేస్తున్నదని, రాజకీయంగా తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని చంద్రబాబు ఆరోపించారు.అలాగే తెలంగాణలో టిఆర్ఎస్ ను, సీమాంద్రలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తో కుమ్మక్కవడానికి గాను తెలంగాణ నిర్ణయం తీసుకుందని చంద్రబాబు ఆరోపించారు.సీమాంధ్ర సమస్యలు తీర్చకుండా విభజన చేయడం వల్ల ఆ ప్రాంత ప్రజలు రోడ్డెక్కారని, వారి సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తూ చంద్రబాబు ఢిల్లీ ఎపి భవన్ లో దీక్ష కూడా నిర్వహించడం విశేషం.


On Fri, Oct 18, 2013 at 8:24 PM, <stry...@gmail.com> wrote:

--
You received this message because you are subscribed to the Google Groups "bayareaysrcongress" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to bayareaysrcongr...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.



--
Thanks 
CVReddy

 


CVReddy

unread,
Oct 18, 2013, 10:56:28 AM10/18/13
to bayareays...@googlegroups.com
రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడు బాబు 

తెలంగాణా లో "వస్తున్నా మీకోసం(నా కోసం )" యాత్ర చేయడానికని, రాష్ట్రాన్ని విభజించమని బాబు లేఖ ఇచ్చాడు-మాజీ మంత్రి  దేవినేని నెహ్రు చౌదరి  
    
రాష్ట్రాన్ని విభజించమని ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే అఖిలపక్షంలో నివేదిక ఇచ్చింది- కాంగ్రెస్ సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి 

అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబే తొలుత డిమాండ్ చేశాడు,తర్వాత తెలంగాణకు  అనుకూలంగా లేఖ ఇచ్చాడు , బాబు వల్లే తెలంగాణ సాధ్యమయ్యింది -ఎర్రబెల్లి 


లేఖకు కట్టుబడి ఉన్నాము కానీ రాష్ట్రాన్ని చీలిస్తే సహించేది లేదు అంటున్న బాబు


టి‌డి‌పి అధికారంలోకి వస్తే మొదటి సంతకం రాష్ట్ర విభజనపై పెడతా-2009 లో టి‌ఆర్‌ఎస్ తో కలిసి ఎన్నికల సభ లో వీర తెలంగాణ బాబు.

విభజన ప్రకటన వచ్చిన తర్వాత తనను కలిసిన APNGO నాయకులతో నేను తెలంగాణ కు కట్టుబడిఉన్నాను,ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను-పోకిరి బాబు.

2008 నుంచి ఇప్పటివరకు ఎలాంటి షరతులు పెట్టకుండా 10 సార్లు తెలంగాణ ఇవ్వమని ,2009 Dec 7 న తెలంగాణ బిల్ కాంగ్రెస్ పెట్టకపోతే టి‌డి‌పి పెడుతుంది అని చెప్పినప్పటికీ, విదేశీ వనిత అయిన సోనియా టి‌డి‌పి ని దెబ్బతీయటానికి తెలుగు జాతిని చీల్చింది- గుంటూర్ ఆత్మవంచన యాత్రలో గజనీ బాబు.

తెలంగాణ బిల్లు పెడితే మొదటి వోట్ టి‌డి‌పి వేస్తుంది-టి‌డి‌పి పార్లమెంటు నాయకుడు నామా నాగేశ్వరరావు చౌదరి.

సీమాంధ్ర ప్రజలు 2004 లో టి‌డి‌పి కి వోట్ వేయనందుకు అనుభవించాల్సిందే -టి‌డి‌పి మాజీ MLC యలమంచిలి రాజేంద్ర ప్రసాద్ చౌదరి.

బాబు దీక్ష తెలంగాణ కు వ్యతిరేకం కాదు-సోమిరెడ్డి.

రాష్ట్ర విభజన లో బాబు తొలి ముద్దాయి-NTV స్టోరీ బోర్డు "అమావాస్య చంద్రుడు".


stry...@gmail.com

unread,
Oct 18, 2013, 5:24:40 PM10/18/13
to bayareays...@googlegroups.com
 
Correct!!
 
1998 - 2008 YSR and his cunning selfish politics was the reason
and after 2008, jagan, Babu, KCR are the reason.
 
All are same....
 
YSR and Babu are two sides of same coin.
 
Glad you realized.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to bayareaysrcongress+unsub...@googlegroups.com.



--
Thanks 
CVReddy

 


Vippala Reddy

unread,
Oct 19, 2013, 9:10:47 AM10/19/13
to bayareays...@googlegroups.com
So whats u r point AHLE


2013/10/18 <stry...@gmail.com>
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to bayareaysrcongr...@googlegroups.com.
Reply all
Reply to author
Forward
0 new messages