Fwd: చీరాల స్వామి వారి ఆరాధనా మహోత్సవం

4 views
Skip to first unread message

Sai Siva Gorthi

unread,
Sep 3, 2022, 4:31:47 AM9/3/22
to babasatsang


---------- Forwarded message ---------
From: SSCM vidyanagar <acharyavani...@gmail.com>
Date: Sat, Sep 3, 2022, 12:54
Subject:



               
              ఈరోజు(౦౩.09 .2022 ) చీరాల స్వామి వారి ఆరాధనా మహోత్సవం. మన మాస్టారు గారు మనకందించిన మహాత్ములలో ఒకరు చీరాల స్వామి వారు. ఎవరిని దగ్గరకు రానివ్వని స్వామి  వారు మాస్టారు గారిని తమ కన్నబిడ్డలా చూసుకునేవారని చరిత్ర చూస్తే తెలుస్తుంది. స్వామి వారు మాస్టారు గారిని ఆ ఎర్రస్వామి అనేవారు. వారిద్దరి అనుబంధం అత్యద్భుతం. తాను ఒక లెక్చరర్ అని, నలుగురు చూస్తే ఏమైనా అనుకుంటారేమో అని అనుకోకుండా స్వామి వారు ఎక్కడ ఉంటే అక్కడే మాస్టారు గారు వారి సేవ  చేసుకునే వారు.


                మాస్టారు గారు చీరాల స్వామిని మొదటిసారి దర్శించినప్పుడు పొందిన అనుభవం ఈ క్రింది విధంగా చెప్పారు :

వారిని గూర్చి మీరేమంటారు?  త్రోవలో అడిగాడు మారుతి....

*మహాత్ము లే అయి ఉండవచ్చు
*ఆయన సన్నిధి చిత్త శాంతి కలిగిస్తోంది
శ్రీ రమణ మహర్షి ఒకసారి చెప్పారు... *మహాత్ముల సన్నిధి చిత్త శాంతిని కలిగించి నట్లు అయితే అదే వారి జ్ఞాన సిద్ధికి నిదర్శనం* అని...

                                 ఆయన రూపంలో , చూపులో ఏ విశిష్టత లేక పోయినప్పటికీ ఆయన పట్ల నా మొదటి అభిప్రాయం సడలింది.ఆయన సన్నిధి లో నా మానసిక స్థితి మారింది.. ఆ తరువాత 10-15 నిమిషాలు సేవు నేను ఎవరోనన్న విషయం, నాకు జ్వరమున్న సంగతీ, పక్కన మిత్రుడున్న సంగతి పూర్తిగా మరుపొచ్చినది.. నా బాహ్యదృష్టి వికారరూపం పైన నిలచినా అది ఎప్పుడో నిర్లిప్తంగా అయి పోయింది. మనస్సు ఏ రూపు ధరించకుండా అలా ఖాళీగా ప్రశాంతంగా నిర్మలంగా ఉండిపోయింది


మాస్టర్ గారు ఇలా చెప్పి ఉన్నారు స్వామి సన్నిధిలో కొన్ని గంటలు గడిపిన ఆ శాంతి  ఆ స్థితి నాకు 2 లేదా 3 నెలలు అలా ఉండేది నిత్యం నేను చేసుకొనే ధ్యానమును పటిష్ట పరిచేది ఆ స్థితి అలానే ఉండేది.

                                   అట్టి మహిమాన్వితుని చరిత్ర ఘట్టాలు తెలియ జేసే గ్రంథరాజము ఆన్లైన్ లో చదువుటకు..
                                                http://www.saibharadwaja.org/books/readbook.aspx?book=7

                       మహాత్ముల చరిత్ర పారాయణయే వారి అనుగ్రహ, ఆశీస్సులు పొందడానికి అత్యంత సులభమైన మార్గం మాస్టారు గారు ఎప్పుడూ చెబుతారు.

                        మాస్టారు గారు మొదటిసారి స్వామివారిని దర్శించిన ఘట్టం కూడా attachment లో ఇవ్వడం జరిగింది.  


                         చాలా చిన్న గ్రంథంగా కనిపించినా సాధుదర్శనం యొక్క ప్రయోజనం,సేవ ఎలా చేయాలి,వారు మనకు పెట్టే  పరీక్షలు అవి  మనకు చేసే అత్యంత మేలు ఏమిటి అని తెలియజేసే అద్భుత గ్రంథరాజము,అట్టి మహాత్ముడు మనకు లభించిన ఎలా సద్వినియోగం చేసుకోవాలి అని తెలియ చెప్పే గ్రంథం..

                    శ్రీ సాయిమాస్టర్ ఆశీస్సులు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ..
   
With Regards,
SSCM, Vidyanagar.
Screenshot_20220903-122532-973.png
Reply all
Reply to author
Forward
0 new messages