jai sai master

123 views
Skip to first unread message

Suresh Reddy

unread,
Sep 10, 2012, 6:52:26 AM9/10/12
to babas...@googlegroups.com
sairam
   iam requesting any body has sree mala pichamma amma life history please share. iam eagerly waiting from long back.

Jai sai ram
suresh
suresh...@gmail.com 

Subrahmanyam Gorthi

unread,
Sep 26, 2012, 11:14:33 AM9/26/12
to suresh...@gmail.com, babas...@googlegroups.com
Dear Guru Bandhu Suresh garu,

Sairam. I am not aware of any book containing the life history if Avadhuta Mala Pichchamma garu. I will let you know if I come across in future.


By the way,
I have read a nice blog post on Amma's life, and here is the link.
One more article on Amma is here

Sairam,
Subrahmanyam.



--
You received this message because you are subscribed to the Google Groups "Baba-Satsang" group.
To post to this group, send email to babas...@googlegroups.com.
To unsubscribe from this group, send email to babasatsang...@googlegroups.com.
For more options, visit this group at http://groups.google.com/group/babasatsang?hl=en.

sushma savitri kandikonda

unread,
Sep 26, 2012, 11:59:45 AM9/26/12
to subrahman...@gmail.com, suresh...@gmail.com, babas...@googlegroups.com
అవధూత
పిచ్చెమ్మ గారి గురించి మనకు తెలిసినది చాలా తక్కువ. ఎక్కిరాల వేద వ్యాస్
గారు ఆ మహితాత్మురాలి గురించి సంగ్రహం గా తెలియ జెసారు. ఆ విషయాలను
అందరితో పంచుకోవాలనుకుంటున్నాను.
"నేను హేతువాదిని, మూఢ నమ్మకాలను ససేమిరా ఒప్పుకోను.
ప్రతి దానికీ నాకు ప్రత్యక్ష నిరూపణ కావాలి. కంటికి కనిపించని వాటి గురించి
నేను విశ్వసించను." అని అందరు హేతువాదులకు మల్లేనే ఉపన్యాసాలు ఇస్తున్న
రచయిత, 4 దశాబ్దాల క్రితం తన సాహిత్యం తో యువ తరాన్ని వెర్రెత్తించిన
గుడిపాటి వెంకటాచల (చలం) జీవిత దృక్పథాన్నే మార్చివేసిన అపురూపమైన సంఘటన
ఒకటి 1938 లో జరిగింది.
అవధూత పిచ్చెమ్మ గురించీ, ఆమె అద్భుత శక్తులను గురించీ
విన్న చలం దాదాపు ఆమెను పరీక్షించడానికే వెళ్ళాడు. అక్కడ ఆయనకు కలిగిన
అనుభవం ఆయన సొంత మాటల లోనే విందాం:
"నేను పిచ్చెమ్మ గారు ఉండే గది లోకి వెళ్ళాను. ఆమె సమాధి
నిష్థ లో ఉన్నారు. ఆమె కళ్ళు కొంచెం గా ఎత్తి నన్ను తన దగ్గర
కూర్చొబెట్టుకుని ఒక చేతిని నా వీపు మీద, రెండవ చేతిని నా గుండె మీద
ఉంచారు. నాలో ఆనంద విద్యుల్లత లు వెలిగాయి. రక్తమంతా తల కు చేరినట్లు
అయింది. గొప్ప ఆనందము, ప్రేమ నాలో పొంగుతున్నాయి. ఓ 5 నిముషాల్లో
వెళ్ళిపోవాలనుకున్న వాడిని అట్లా గంట కూర్చున్నా. యోగులు, ఇతరులలో ఎంతటి
అద్భుతమైన మార్పును తీసుకు రాగలరో ఇప్పుడు సొంతంగా అనుభవ అధికారం తో
చెప్పగలను."
నిర్భయం గానూ, నిస్సంకోచం గానూ తనకు కలిగిన ఆ ఆధ్యాత్మిక
అనుభవాన్ని చెప్పిన చలం గారికి మనం అభినందనలు తెలపాలి. తను విశ్వసించిన
హేతువాదం,తను ఇన్నాళ్ళుగా తన రచన ల ద్వారా వెలువరించిన విశ్వాసం, పేక
మేడలుగా కూలిపోతుంటే, అది గుప్తంగా తనలో దాచుకోలేదు. నిర్భయంగా ప్రపంచానికి
చాటి చెప్పాడు- తను ఒకప్పుడు నమ్మినది తప్పని. తన శేష జీవితాన్ని
సత్యాన్వేషణ లో రమణాశ్రమం లో గడిపారు.
ఇంతకీ అసలు ఈ పిచ్చెమ్మ ఎవరు? ఏమామె కథ?
ఇంతటి దివ్య శక్తి గల ఆ పిచ్చెమ్మ మేధావి కాదు కదా,
కనీసపు చదువైనా చదువుకోలేదు. ఆమె పండితుల కుటుంబం లోనూ పుట్టలేదు. ఒక పేద
కుటుంబం లో పుట్టింది. 1870 లో కృష్ణా జిల్లా కురుమద్దాలి గ్రామం లో
జన్మించింది.
పువ్వు పుట్టగానే సౌరభం వెదజల్లుతుంది. అలాగే ఆమెకు చిన్న తనం
లోనే ఎన్నో అనుభవాలు వచ్చాయి. ఆ అనుభూతుల సారమేమిటో ఆ చిన్న తనం లో ఆమెకు
అర్థం కాలేదు. అప్పుడు ఆమె తన తల్లిదంద్రులతో ఆ అనుభూతుల గురించి ఇలా
చెప్పింది. "అమ్మా, నా తలలో కాదు, గుండెల్లో కాదు, నాలోనే ఎక్కడో నాదాలు-
శంఖం ఊదినట్లు ఎంతో కమ్మగా వినపడుతున్నాయి.నన్ను నేను మర్చిపోతున్నాను.
కదలి పోతున్నాను.ఒక్కొక్కప్పుడు రంగులు- ఎన్నో రంగులు నెమలి పురి
విప్పినట్లు తళతళలాడుతున్నాయి. ఒక్కొక్కప్పుడు నాలో నుంచి ఒక చిన్న
అమ్మాయి- బంగారపు బొమ్మ- కాళ్ళకు గజ్జెలతో గలగలలాడుతూ బయటకు వచ్చి
ఆడుతోంది." వీటిని ఆ తల్లిదంద్రులు పిచ్చి కబుర్ల క్రింద తోసి పారేశారు.
మామూలు స్త్రీకి మల్లేనే ఆమెకూ వివాహమయింది. ఒక
కుమార్తె పుట్టగానె భర్త వియోగం సంభవించింది. కాయ కష్టం చేసి పిల్లని పెంచి
పెద్ద చేసింది. ఆ అమ్మాయి కి పెండ్లి కూడా చేసింది. కానీ పెళ్ళయిన కొద్ది
రోజులకే ఆ అమ్మాయి మరణించింది. ఇది భరించరాని బాధ అయింది పిచ్చెమ్మకు.
కన్నీరు మున్నీరు గా ఏడ్చింది. అలా ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయేది.

ఈ శోక సముద్రం లో ఆమె జీవిత నౌక ఒక ప్రశాంత
ద్వీపానికి చేరింది. ఆమె సుఖ దుఖ్ఖాలకు అతీతమైన తుర్యావస్థ ను చేరుకుంది.
ఇప్పుడు ఆమెకు దుఖ్ఖము లేదు, సుఖం లేదు. జగమంతా ఆ జగన్నాధుని లీలా విలాసమే.
ఎక్కడ చూసినా ఆమెకు భగవత్ సాక్షాత్కారమే. అంతా ఆనందమయమే.
ఆమె ఇల్లు వదిలేసింది. స్మశానం లో, చెట్టు తొర్రలో,
కాలువ గట్టు మీద- ఎక్కడ పడితే అక్కడ తిరుగాడుతుండేది. ఆకలి వేస్తే బూడిద
నోట్లో వేసుకుని ఆకలి తీరింది అనేది. ఆమె ఈ సాధన జనానికి అర్ధం కాలేదు.
కొన్నాళ్ళు ఆమెకు పిచ్చి పట్టిందనే అనుకున్నారు.
ఆమెకు జగత్తంతా శూన్యం గా
కనిపించేది. అలా కొన్నాళ్ళు గడచిన తర్వాత ఒక రోజున ఒక దివ్య జ్యొతి
ఉద్భవించి భూమి, ఆకాశం నిండింది. ఆ వెలుగు లో కిరణాల్లా నడుస్తూన్న చరాచర
ప్రకృతి గోచరించింది. ఆ చిత్ర విచిత్ర వినోదం పరికిస్తూ తన్మయత్వం తో
గంతులు వేసేది. ఆ అనుభూతుల్ని తన వద్దకు చేరిన జనానికి ఆనందం తో
వివరించేది.
ఆమె లోని జ్ఞాన దీపం నలు వేపులా వెలుగులు చిమ్మింది. ఎంతో మంది
భక్తులు ఆమెను సేవించడం, పూజించడం మొదలెట్టారు.
ఆమె ఏ పురాణాల నుండి గానీ, ఉపనిషత్తుల నుండి గానీ
శ్లోకాలు వల్లించేది కాదు.తన సొంత మాటల్లో, సొంత ఫక్కీ లో ఎంతో లోతైన
ఆధ్యాత్మిక సత్యాల్ని, అందరికీ అర్ధమయ్యేలా చెప్పేది.
తన వద్దకు ఒళ్ళంతా బంగారు ఆభరణాలు నింపుకుని వచ్చిన ఓ
వనిత తో, "ఎందుకే ఇన్ని రోతలు పెట్టుకొచ్చావు. ఈ తిత్తి లో గాలి పోతే
అవన్నీ ఎమవుతాయి? అన్న దానం చేసుకోకూడదూ?" అంది. ఆమె వెండి, బంగారం
పొరపాటున కూడా ముట్టుకునెది కాదు. అవి ముట్టుకుంటే ఆమెకు ఒళ్ళంతా
మంటలెక్కినట్లుండేది.
"అసలు మొగుడు భగవతుడొకడుండగా, ఈ మాయ మొగుళ్ళా వలలో
పడిపోయారేంది" అనేది.
తన వద్దకు రావడానికి సంకోచిస్తున్న బ్రాహ్మణుణ్ణి చూసి, "మెడలో
వడికిన పోగులు వేసుకున్నానని గొప్పవాడినని విర్ర వీగుతున్నావా? వడకని
పోగులు నీలోనే ఉన్నాయి చూచుకో" అంది.
పిల్లలు కావాలని ఆరాట పడే ఒక స్త్రీ తో "నీవే ఒక
బొమ్మవైతే, మళ్ళీ నీకొక బొమ్మ కావాలా?" అంది.
పూర్వం తన వద్ద బాకీ తీసుకున్న వాళ్ళు, బాకీ తీర్చడానికి
వస్తే, "వీడికెవదూ బాకీ లేడు, ఎవడికీ వీడు బాకీ లేడు, ఫొ" అని తరిమేసేది.
పిచ్చెమ్మ గారు రమణ మహర్షిని దర్శించింది. "ఎప్పుడూ అంత
దూరం లో ఎమిటి చూస్తావు?" అంది.
రమణ మహర్షి నవ్వుతూ,"నువ్వు చూచేదే నేనూ
చూస్తున్నాను" అన్నారు.
బందరు నొబుల్ కళాశాల కు వచ్చిన మహాత్మా గాంధీ ని గాఢాలింగనం
చేసుకుని "నీవు చాలా మంచి పని చేస్తున్నావు, చేయి" అంది.
గాంధీ గారు కాల్చి చంపి వేయబడ్డారన్న వార్త విని,
"అంతటి పుణ్యాత్ముడి కి నొసటన ఇలా వ్రాసి పెట్టి వుంది. అవును, ఇతడు కూడా
గోవును తుపాకి తో కాల్చి చంపించాడు. ఆ పాపం ఇట్లా ఫలించింది" అన్నదట.
చలం గారు ఆమెను గురించి వ్రాస్తూ, "తెలుగు దేశం లో యోగులు
అవతరించటం వికృతం. పొరపాటున అట్లాంటి వారు ఎక్కడైనా పుట్టినా వారికి ఆదరం
దొరకదు. పిచ్చెమ్మ గారు అట్లాంటిది . ఆమెను గుర్తించక పోతే, గుర్తించినా
ఉపేక్ష చేస్తే ఆ ప్రజలు, ఆ దేశం గొడ్డు పోతుంది" అన్నారు.
పిచ్చెమ్మ తల్లి వంగ దేశంలో పుట్టి వుంటే........
విశ్వమంతా ఆమె నామం వ్యాపించి వుండేది" అన్నారు శ్రీ వేలూరి శివ రామ
శాస్త్రి గారు.
పిచ్చెమ్మ గారు 1951 జనవరి 13 వ తేదీన పరమపదించారు.
ఆమె సమాధి కురుమద్దాలి గ్రామం లో ఉంది.
వెలుగు కు రాని ఎందరో మహానుభావులలో పిచ్చెమ్మ ఒకతె.


On 9/26/12, Subrahmanyam Gorthi <subrahman...@gmail.com> wrote:
> Dear Guru Bandhu Suresh garu,
>
> Sairam. I am not aware of any book containing the life history if Avadhuta
> Mala Pichchamma garu. I will let you know if I come across in future.
>
>
> By the way,
> I have read a nice blog post on Amma's life, and here

> <http://sarasabharati-vuyyuru.com/2012/06/27/%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7-%E0%B0%AF%E0%B1%8B%E0%B0%97%E0%B0%BF-%E0%B0%AA%E0%B1%81%E0%B0%82%E0%B0%97%E0%B0%B5%E0%B1%81%E0%B0%B2%E0%B1%81-16-%E0%B0%85%E0%B0%B5%E0%B0%A7/>is


> the link.
> One more article on Amma is

> here<http://mahathi.mywebdunia.com/2008/07/19/1216465680000.html>

Reply all
Reply to author
Forward
0 new messages