Fwd: విద్యానగర్ శ్రీ షిరిడి సాయి మందిర 37 వ వార్షికోత్సవం -12.03.2018

29 views
Skip to first unread message

Sai Siva Gorthi

unread,
Mar 12, 2018, 12:23:33 AM3/12/18
to babasatsang

---------- Forwarded message ----------
From: SHIRDI SAI CULTURAL MISSION VIDYANAGAR <acharyavani...@yahoo.co.in>
Date: 2018-03-12 0:05 GMT+05:30
Subject: విద్యానగర్ శ్రీ షిరిడి సాయి మందిర 37 వ వార్షికోత్సవం -12.03.2018
To: SHIRDI SAI CULTURAL MISSION VIDYANAGAR <acharyavani...@yahoo.co.in>



ప్రియ గురుబంధువులారా ..

 
 
              మార్చి 12, 2018 న విద్యానగర్ శ్రీ షిరిడి సాయి మందిర 37 వ వార్షికోత్సవం జరపబడుచున్నది .. ఈ సందర్భంగా 37 వ వార్షికోత్సవ ఆహ్వాన పత్రిక మరియు 2007 మే 7,8 మరియు 9 వ తేదీలలో జరిగిన మందిర తృతీయ కుంభాభిషేక సావనీర్
​ 
(
a reminder of past events
) ను ​
గురుబంధువులతో
​ ​
పంచుకుంటున్నాము
 
​          
 
          ​
నేడు ఆంధ్రదేశమంతటా శ్రీ షిరిడి సాయినాథుని తత్త్వప్రచారం ఇంతలా జరిగి ప్రతి గ్రామంలోను శ్రీ సాయినాథుని మందిరాలు ఏర్పడటం కేవలం పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టారు గారి వల్లే అంటే అది అతిశయోక్తి ఎంతమాత్రం కాదు.మాస్టారు గారి తపోబలంతో పునీతమైన విద్యానగర్, గురుభరద్వాజ తపోవనంగా పిలవబడుతున్న శ్రీ మాస్టారుగారు నివసించిన ఇల్లు - ఆ అదృష్టం అనిర్వచనీయం. 12 సంవత్సరాలు నిరంతర
పారాయణలు, సత్సంగాలు మరియు మాస్టారు గారి పాద స్పర్శ వల్ల ఆ ఇల్లు పరమ పునీతమైంది.
 
​            ​
ఏ ప్రదేశంలో అయితే ఆత్మజ్ఞాని ఆవు నుండి పాలు పితికినంతసేపైనా కూర్చుంటారో ఆ ప్రదేశం పరమపవిత్రం అవుతుందనేది శాస్త్ర వాక్యమని శ్రీ మాస్టారుగారు చెప్పియున్నారు. అటువంటిది పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టారు గారి వంటి మహనీయులు భౌతికదేహంతో సంచరించిన ఆ విద్యానగరు గ్రామం, వారి పర్యవేక్షణలో నిర్మించబడి, అనేకమంది మహనీయుల పాదస్పర్శతో పునీతమైన శ్రీ సాయి కరుణాలయం ఇతర మందిరాలకు ఆదర్శప్రాయంగా నిలచింది.
 
 
               సామాజిక శ్రేయస్సుకు వినియోగపడేలా సాయి మందిర నిర్మాణం ఎలా ఉంటుందో మాస్టారు గారు విద్యానగర్ శ్రీ సాయిమందిరాన్ని కట్టించిన విధానం తెల్పుతుంది. మందిరంలో నిరాడంబరంగా జరిగే పూజలు, పారాయణలు, సత్సంగాలు మానవుణ్ణి  నిజమైన ఆధ్యాత్మికత వైపూ, దైవభక్తి వైపూ ఆకర్షిస్తాయి
​.
 ​
ప్రేమను పెంపొందించే క్రమశిక్షణే ఆధ్యాత్మికత అని, ప్రేమే దైవము, సత్యము అని మాస్టారుగారు వివరించారు.
 
 
               ఎంతోమంది మహనీయుల ఆశీస్సులతో, మాస్టారు గారి  వంటి 
మహనీయుని పర్యవేక్షణలో నిర్మించిన
విద్యానగర్ శ్రీ సాయి కరుణాలయ
​o​
 మార్చి 12, 1981 న మహనీయుల సమక్షంలో పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టారు గారి చేతుల మీదుగా
ప్రారంభోత్సవం
జరుపుకుంది
. ఆనాటినుండి నేటి వరకు సత్సంగాలు, పారాయణలు, నిత్యపూజలు, నిత్య ఆరతులు నిరాటంకంగా, అవిచ్చిన్నంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికీ ఎందఱో మహానీయులు అచ్చటికి వస్తున్నారు.
 
 
       
​      
మందిర దైనందిన కార్యక్రమాలు మరియు విశేషపూజలు మొదలగు అన్ని వివరాలు ఈ సావనీర్లో ఉన్నవి.
 
 
                శ్రీ సాయిమాస్టర్ ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుతూ ..
 
 
With Regards,
SSCM,
Vidyanagar.






VnagarTempleAnniversary.jpg
souvenir.pdf
Reply all
Reply to author
Forward
0 new messages