BHAGAVAAT GEETA CHATER 4 SLOKA 13

13 views
Skip to first unread message

JAJISARMA

unread,
May 28, 2012, 11:03:34 AM5/28/12
to Arsha Vidya Gita
ప్రియ భగవత్ బంధువుల్లారా!
జైశ్రీమన్నారాయణ.
"చాతుర్వర్ణం మయా సృష్టం" (BG 4.13) అనే శ్లోకం చాలా మంది ఆ శ్లోకం
తప్పుగా అర్ధం చేసుకుని, కులాల విభాగం పరమాత్మకు అంటగట్టుతున్నారు.
మన స్వామి మనల్ని ఎప్పుడు కులాలవారిగా విడదీయలేదు. చాలామంది ఈ
శ్లోకానికి అర్ధం "బ్రాహ్మణ,క్షత్రియ, వైశ్య, శుద్ర," అనే విభాగాలుగా
మనస్వామి చెసినట్లు వక్రభాష్యం చెప్పుతున్నారు.మనస్వామి చేసిన విభాగం
"దేవ,మనుష్య,తిర్యక్,స్థావరల"నే నాలుగు విభాగాలు మాత్రమే.
దేవ అంటే దేవతలు, మనుష్య అంటే మనుష్యులు, తిర్యక్ అంటే అడ్డంగా నిలువుగా
తిరిగే పశువులు పక్షులు, స్తావరాలు అంటే, వృక్షాలు, కొండలు ,కోనలు
మొదలగునవి మాత్రమే. మొత్తం మనస్వామి సృష్టి యావత్తూ ఈ విభాగములోకే
వస్తుంది.
ఇది శ్రీశ్రీశ్రీ త్రిదండిశ్రీమన్నారాయణ చినజీయరు స్వామి వారు ప్రవచించిన
సత్యము.

హరేరామ, హరేరామ రామరామ హరే హరే, హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే
జైశ్రీమన్నారాయణ.
భవదీయుడు,
జాజిశర్మ.

Reply all
Reply to author
Forward
0 new messages