తెలుగులో వ్రాయడానికి నేను సహాయం చేస్తాను

40 views
Skip to first unread message

చక్రవర్తి

unread,
Apr 13, 2012, 3:22:53 AM4/13/12
to Arsha Vidya Gita
ఈశ్వర స్వరూపమైన గుంపునకు నమస్కారములతో,

భవదీయ చక్రవర్తి భాగ్యనగరం నుంచి వ్రాయునది. ఈ గుంపుని నేను భక్తి పేజెస్
అనే గుంపులోని వేగుద్వారా చూసి ఉన్నాను. గూగుల్ వారు తెలుగులో
వ్రాయడానికి సాంకేతికమైన సౌలభ్యం కలిగిస్తున్నారు. ఇలాంటి సౌలభ్యం యహూ
గుంపులందు లేనియడల మనం అక్కడ తెలుగులో వ్రాయలేకపోయ్యాము. కావున ఇక్కడ
తెలుగులో వ్రాయడానికి ఎవ్వరికైనా అసౌకర్యం ఉన్నయెడల నన్ను సంప్రతించగలరు.
అందుకు నేను ఉచితంగానే సహాయం చేస్తాను.

మనకు తెలిసిన విషయాలను తెలుగులో చదువుకుంటే భావం ఇంకొంచం మనసుకు
హత్తుకుంటుందని నా అభిప్రాయం. ఎక్కువగా వ్రాసి ఉంటే పెద్దలు మన్నించగలరు

ధన్యవాదములతో,
భవదీయుఁడు

Bhagavatula Sreenivasa Rao

unread,
Apr 14, 2012, 2:28:26 AM4/14/12
to Arsha Vidya Gita
శ్రీ చక్రవర్తి గారి అభిప్రాయము చాలా బాగున్నది. మన గీతా అధ్యయన
బృందములోని సభ్యులలో తెలుగు చదవగల వారు తెలుగు లిపిలో వ్రాసే ప్రయత్నం
చేయటం వల్ల మనం తెలుగుదనానికి మరింత దగ్గరవుతాం. గీతా స్ఫూర్తిని,
తాత్పర్యాన్ని పూర్తిగా గ్రహించటానికి కూడా సులభంగా ఉంటుంది.
కాబట్టి, చక్రవర్తి గారి సహాయం కోసం ఎక్కువమంది సభ్యులు ముందుకు వస్తారని
ఆశిస్తున్నాను.

Paritala Gopi Krishna

unread,
Apr 19, 2012, 12:47:50 AM4/19/12
to arsha-vi...@googlegroups.com
Dear Chakravati gaaru,
Love and Love alone ....
We have started a separate Telugu group on Srimad Bhagavad Gita.
 We would appreciate it very much of you kindly join that group and help us. Many thanks.
Love and Love alone ....
P. Gopi Krishna
====
Reply all
Reply to author
Forward
0 new messages