Aswamedhaparvamu - 14_3_151 - 14_3_180

27 views
Skip to first unread message

Prakash Swaminathan

unread,
May 10, 2014, 11:57:07 AM5/10/14
to Andhramahabharatam
14_3_151 క.
రక్షాకరమంత్రకలస,దక్షాత్మకులైనయట్టిధౌమ్యముఖోదా
త్తక్షోణీసురులు బెరయ,నక్షయపుణ్యుఁ డగుకౌరవాధిపుఁ డెలమిన్.

14_3_152 క.
అనుజులుఁ దానుఁ బరాశర,తనయపురస్సరముగా నిధానస్థలికిం
జని యరుణగంధకుసుమము,లను మాంసాపూపములను లాజములఁ దగన్.

14_3_153 ఆ.
భూతతృప్తిఁ జేసి భూరిబలాఢ్యులఁ,బరిజినములఁ ద్రవ్వఁ బనుచుటయును
నతికుతూహలమున నార్చి వారలు ద్రవ్వి,రన్నిధానదేశ మధిపముఖ్య.

14_3_154 క.
త్రవ్వినఁ బ్రభ లెల్లదెసల,నివ్వటిలఁగ వెలుఁగుచుండె నిధి యనిలజుఁడుం
గవ్వడియుఁగవలు నలరఁగ,నవ్వసుధాధిపుఁడు దాని కర్చన లిచ్చెన్.

14_3_155 వ.
అట్లు వివిధద్యానిధి యగువేదవ్యాసుండు సన్నిధిసేసి సాధించిననాధర్మనంద
నుం డాపరాశరనందనుపాదంబులకు దండప్రణామంబుసేసి నిలిచి కేలు మొగిడ్చి
ఫాలతలంబునం గదియించి వినయావనతుం డై యున్న రేంద్రు నమ్మునీం
ద్రుం డాలింగ నాశీర్వాదంబుల నాదరించి యామంత్రణంబుసేసి యంతర్హితుం
డయ్యె నమ్మానవనాథుండు.

14_3_156 సీ.
శకటఖరోష్ట్రఘోటకకుంజరంబు లనేకసహస్రంబు లెలమి సంఘ
టించి భారంబు లెత్తించి భారవహత్వదక్షజనుల్ పెక్కు లక్ష లర్థిఁ
గదిసి నేనని కడఁగిమోవఁగ యాగనిలయంబుఁ గలపయుఁ గలశములును
నలఁకులు గాఁగులు నాదిగాఁగలభాండములును బీఠములు శయ్యలును ఱోళ్లు

తే.
రోకళులుఁ జట్టువంబులు స్రుక్స్రువాజ్య,పాత్రదండకమండలు దాత్రములును
లోనుగాఁ గల్గువస్తువుల్ శుద్ధహేమ,మయము లొక్కటనడపించెమనుజనాథ.

14_3_157 చ.
మఱియును నన్నిధిం గలసమంచితకాంచనరాశి బండులం
బెఱికంల మోపులం గొలఁది వెట్టఁగఁ బెక్కగుబారువుల్ జనుల్
వెఱఁగసడంగ ఖేచరులు వెక్కస మందఁగ శత్రుకోటికిన్
వెఱ పొనరించువార్తపృథివిం బరఁగన్ నడిపించె భూవరా.

14_3_158 ఆ.
ఏరునేలకొలఁది నెడనెడ విడియుచుఁ,బోవ వలసి యుండెభూరిభార
వహులడప్పి యెఱుఁగు వాఁడగునాధర్మ,నందనునకు ధరణినాథవర్య.

14_3_159 వ.
అంత నక్కడఁ గృష్ణుండు.

14_3_160 తే.
ద్వారకానగరమునకుఁ దన్నుఁ బుచ్చు,నపుడు ధర్మజుఁ డశ్వమేధాధ్వంబు
సమయమగుట,ప్రతీక్షించి సకలబంధు,యుక్తముగ రమ్మనినమధురో క్తయూఁది.

కృష్ణుండు సకలభందుహితుండై కరినగరంబునకు వచ్చుట

14_3_161 వ.
అరసికొనియుండు యప్పాండవాగ్రజుండు యాగంబున కుద్యోగంబు సేయుట
చారులు సెప్ప నాకర్ణించి కుతూహలోన్నిద్రుండై బలభద్రసాత్యకికృతవర్మ
ప్రద్యుమ్నచారుదేష్టసాంబాదియాదవసమేతంబుగావసుదేవదేవకీసమనుజ్ఠాతుం
డై సుభద్రం దోడ్కొని కరినగరంబున కరుగుదెంచిన ధృతరాష్ట్రుండును గాం
ధారియు గొంతియుం బనుప నుత్సుకుండై కరుగుదెంచిన ధృతరాష్ట్రుండును గాం
ధారియు గొంతియుం బనుప నుత్సుకుండై యుయుత్సుండు విదురుం బురస్క
రించికొని యప్పాంచజన్యధరు నెదుర్కొని పరమభక్తిం దోడ్కొని వచ్చిన.

14_3_162 తే.
మున్ను ధృతరాష్ట్రుకడకు నా వెన్నుఁ డేఁగి
యతనిగాంధారిఁ బ్రణతిపూర్వాతిమధుర
వాక్యుములఁ బ్రీతి నొందించి వచ్చి గొంతిఁ
గాంచి ప్రణమిల్ల నద్దేవి గౌఁగిలించి.

14_3_163 వ.
పెక్కుభంగుల దీవించె బలదేవాదులుం దగినతెఱంగుననప్పాండురాజమహి
షిం గని రక్కులపాలికాతిలకంబుపులకంబులం బెఱిగినమేనితో మాననీయచరి
త్రుం డగునద్దేవకీపుత్త్రు సంభావించి.

14_3_164 క.
ప్రమద మెసఁగ విదురుఁ బనిచి,సముచిత మగునర్చనంబు సంకర్షణపూ
ర్వము గాఁగ నడపి యదునిక,రమునర్చలు సంభృతాదరంబున నడపెన్.

14_3_165 వ.
సుభద్ర దన్నుం గనినం బరమప్రియంబున గారవించి యభ్యంతరమందిరం
బునకుం బుచ్చెఁ బద్మనాభప్రభృతు లగునాబంధుజనంబు నెల్లను నగరిచేరువ
శోభిల్లు మందిరంబుల విడియింప యుయుత్సు నియోగించి నట్లయ్యందఱు
నభినందితులై యున్నసమయంబున.

14_3_166 ఉ.
ఉత్తరపుణ్యగర్భమున నుండి భవజ్జనకుండు పూరువం
శోత్తరుఁ డాదిరాజగుణయోగి పరిక్షితుఁ డుద్భవించినం
జిత్త మెలర్పఁ బుత్త్రుఁ డని చెప్పిరి వెల్పలివారి కింటిలో
నత్తఱి నున్న వృద్ధనతు లార్చె జనం బఖిలంబు నుబ్బునన్.

14_3_167 క.
బాలుఁడు మృతజాతుం డని,యాలోనన యేడ్పు బెరయ నలమట నచ్చో
నాలలన లుగ్గడించిన,దేలిరి శోకమున జనులు ధీరవిచారా.

14_3_168 వ.
అత్తఱి రోదసధ్వనులు గలయం జెలంగిన విషాదవేదనాయత్తంబు లయిన
చిత్తాంగంబుతో శౌరి సాత్యకి యనుగమనంబు సేయ సత్వరంబుగాగొంతియు
న్నెడకుం జనుదెంచె నప్పు డాకుంతిభోజనందనయు ద్రౌపదియు సుభద్రయు
నార్తనాదంబు లెసంగం దనకడకు రయంబున రా నెదుర నయ్యదువీరుండు
గాంచి శోకసమాకలుమానసుం డయ్యె నప్పాండురాజపత్ని పురుషోత్తముతో
డగ్గుత్తిక నెలుంగు దగుల నిట్లనియె

పరిక్షిత్ప్రాణదానంబునకై కుంతీసుభద్రలు గృష్ణుఁ బ్రార్థించుట

14_3_169 క.
గతి నీవు నాకు మత్సం,తతికిన నీయల్లుఁ గుఱ్ఱ తనయుఁడు పుట్టెన్
మృతుఁడై క్రూరుం డగుగురు,సుతునియిషీకాస్త్రవహ్నిఁ జూఁడినకతనన్.

14_3_170 సీ.
దేవకీపుత్త్ర సంజీవితుఁ జేయవే యబ్బాలు నద్దారుణాస్త్రసంప్ర
యోగంబునపుడు కృపాగరిష్ఠుండ వై చేసితి ప్రతిన గాచెద నవశ్య
మును నుత్తరాగర్భజనితు నే నని బాలు బ్రతుకుతోడిన నాదుబ్రతుకు ద్రుపద
తనయాసుభద్రలు ధర్మజుం డనుజులా శిశువు సంజీవితుఁ జేయ కున్న

ఆ.
బ్రదుక రన్వయమున కుదకపిండప్రదా,సంబు లెడలు మత్స్యనందనఘును
నూఱడింపఁ బడియె నొకనాఁడు నీచేత,దానియార్తికరుణఁ దలుఁగవయ్య.

14_3_171 వ.
దేవా నీ విక్కులంబు గలిగించినవాఁడ వింకను నీవ వీని బ్రదికింపవే యని
పల్కుచుం బుడమిం బడని గొంతి నగ్గోవిందుం డనునయవచనంబుల నూరా
ర్చి యెత్తె నట్టియెడ సుభద్ర యమ్మహాత్మునితో నిట్లనియె.

14_3_172 క.
గురుసుతుఁడు భీమునకునై,పరమాస్త్రం బెత్తె దానిఫల మందంగా
నరుఁడును దత్పత్నియుఁ గాం,చిరి తుది నే నీకు నేము సెప్పదుఁ బ్రభవా

14_3_173 క.
నీమఱఁది యాకొడుకుపైఁ,బ్రేమం బెప్పుడును బెంపఁ బ్రేలెడి మనునుం
డీమెయి వమ్మయిపోయిన,నేమి యగునొ యెఱుఁగ నీవ యెఱుఁగుదు దీనిన్.

14_3_174 సీ.
ధర్మజుం డిమ్మెయి ధరియించు నెవ్వగ పవననందనుఁడును గవలు నేమి
వెరవున నుపశమింతురు దీని విను దేవ యస్త్రప్రయోగంబునపుడు నీవు
గురుసుతు నదలించి కుచ్చిత నిన్ను మోఘాస్త్రునిఁ జేసెద నంటి దాన
నూఱడి యుండుదు ముజ్జ్వలతేజ నీ మహితానుభావత మాకు నెల్లఁ

ఆ.
దెలిసియుండుఁ గాన యులుకము సత్యద,యాశ్రితాభిరక్ష లనఘ నీకు
నైజములు శిరఃప్రణతి నేను వేఁడెద, గరుణ నిక్కులంబు గాచికొనుము.

14_3_175 తే.
ఏవిధంబునఁ గోలుపో నీవు నీవు,పాండవుల నీదుసన్నిధిఁ బాపకర్మ
శీలుఁ డైన యశ్వత్థామ గోలుపపుచ్టె,వాని నేమనఁ గలదు దుర్వారతేజ.

14_3_176 వ.
అని వెండియు.

14_3_177 చ.
భువనము లొక్కపెట్ట మృతిఁ బొందిన జీవము లావహింప నే
ర్తు వలచినట్టులైన గుణరూఢుఁడు మేనమఱందిపౌత్రుఁ జా
వ విడుతె వంతపెంపున నవారణ నీయెదురుం బ్రలాపముల్
వివిధము లే మొనర్చితిమి వెఱ్ఱుల మై యిటు భక్తవత్సలా.

14_3_178 తే.
అనినఁ గృపయును శోకంబు నగ్గలింప,వనజనాభుండు జను లర్థి వినఁగఁ బిన్న
వాని బ్రదికింతు వగవంగ వలవదనియె,నెలుఁగు జలదస్వవమ్మున ట్లెనకమెసఁగ.

14_3_179 వ.
ఎల్లవారును బ్రమోదంబు నొంద నట్లు వలికి సూతికాగృహంబునకుం గుంతీ
ప్రభృతులు దోడరానతండు వోవునప్పుడది ధవళకుసుమసితసర్షపలాజపూర్ణ
కుంభప్రముఖమంగళవస్తువులను బ్రజ్వలితపావకప్రదీప్తశస్త్రపిచుమందపల్లవాది
భూతపరిహారకపదార్థంబులను జతురవృద్ధాంగనాచికిత్సదక్ష పరిచారికాముఖ్య
హితకారిపరివారజన ప్రవర్తనంబులను బరిశోభితం బయి యుండె నమ్మందిరం
బాగోవిందుండు ప్రవేశించె నట్టియెడ నంతక మున్న.

14_3_180 సీ.
కడచి ద్రౌపది సని యడలునఁ బడియున్న మాత్స్యనందనతోడ మాధవుండు
సనుదెంచె వీఁడె సవినయంబుగాఁ గను మనవుడు నుత్థిత యై వికీర్ణ
వేణిభరంబుతో వినతి యొనర్చి భక్తార్తి వాపుట నీకు నతిదృఢవ్ర
తంబు కదే దేవ దయ వెలయంగ నీ శిశువు సంజీవితుఁ జేయ వయ్య

తే.
నీవు గూర్తేని మేనల్లునికిఁ దదీయ,పుత్త్రు
ద్రోణునిపుత్త్రుద్రోణునిపుత్త్రుండుఁ బొలియఁ జేయు
వాఁడె పతిహీన యగుపాపవతికిఁ బుత్త్ర,హీనతయును బాటిల్లిన నెట్లుబ్రదుకు.
Reply all
Reply to author
Forward
0 new messages