Aswamedhaparvamu - 14_3_1 - 14_3_30

15 views
Skip to first unread message

Prakash Swaminathan

unread,
Aug 15, 2010, 1:34:47 PM8/15/10
to Andhramahabharatam
14_3_1
నగసుతాత్వమహితవి
ధానుతశశ్వల్లసల్లతావేష్టనహే
లానిత్యశాడ్వలతరు
త్వానుగుణఫలప్రదత్వహరిహరనాథా.

- తాను ద్వారక కరుగవలయు నని యర్జునునిఁ గృష్ణుఁ డడుగుట -

14_3_2 వ.
దేవా వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె నట్లు ఫల్గును నఫల్లువి
శారదుం జేసి శౌరి యతనితోడ.

14_3_3 క.
నాచిత్తము వసుదేవునిఁ,జూచుట గోరియును నీవు సుమనోవృత్తిం
జూచి యనుమతి యొనర్చుట,వేచినయది నన్నుఁ బుచ్చవే ద్వారకకున్

14_3_4 చ.
అనవుడు నక్కిరీటి దగనయ్యదువంశనరేణ్యుతోడని
ట్లను నటులేనిఁ బోవలయు హస్తిపురంబున కిల్తెఱంగు సె
ప్పిన నిను ధర్మనందనుఁడు ప్రీతిగ నందుల కన్చి పుచ్చున
య్యనుమతి గల్గునట్లు దగ నాడెద నవ్విభుపాల నచ్యతా.

14_3_5 వ.
అనిన విని దామోదరుండు దారుకురావించి రథంబు పూన్పు మని నయో
దదనంతరంబ ధనంజయుండు దమతోడం జనుదేరం దగుపరివారంబు స
బడవాళ్లం బనిచె నొక్కింతసేపునకు దారుకుండునుం దేరాయితంబుసేసి
బడవాళ్లునుం బరిజనంబుల సన్నద్ధులం గావించి సన్నిహితులం జేయ నా
ర్జునులు ప్రయాతోచితాలంకారాలంకృతు లై రథం బెక్కి కరిన
పథంబు గైకొని చనుసమయంబున.

14_3_6 సీ.
వినయ మారంగ గోవిందున కిట్లను గాండీవి దేవ నీకరుణఁ జిసి
కౌరవసైన్యసాగర ముత్తరింపంగఁ గంటిమి గురు భీష్మకర్ణముఖ్య
దుర్జయవీరుల నిర్జించితిమి నీవు శాత్రవయోధుల సమయఁ జేయ
వెనుక నేము జయంబు గొనుచు వచ్చితిమి తేజంబును బేరుసౌఖ్యంబు నతుల

తే.
మైనభవదీయసుప్రసాదాతిశయము,కతనఁ బడసితి మప్రతిహతమహాధి
రాజ్యసంపూజ్యుఁ డయ్యె ధర్మజుఁడు సంశ్రి,తాభిరక్షణవ్రతనిరతాంతరంగ.

14_3_7 క.
నీమహిమ వొగడఁ గొలఁదియె,దామోదర విశ్వసంవిధాతవు భవదీ
యామలతేజము యగ్ని,షోమము గాలాత్మకత్వశోభివికృష్ణా.

14_3_8 క.
భవదీయశ్వసనము వా,యువు నీక్రోధముఁ బ్రసాదయోగంబును మృ
త్యువు లక్ష్మియు నీవలనన,యవుఁ బ్రీతియు మరణమును మహానందంబున్.

14_3_9 క.
స్థావరజంగమమయజగ,దావిర్భావస్థితిక్రియావిలయంబుల్
నీవలనన యగు చుండును,భావాతీతుఁడవు సర్వపతివి ముకుందా.

14_3_10 వ.
అని వెండియు.

- కృష్ణార్జును లింద్రప్రస్థముననుండి హాస్తినపురంబునకు వచ్చుట -

14_3_11 క.
నారదదేవలకౌశిక,పారాశర్యాదిమునులపలుకుల భీష్మో
దారవచనముల నిను నఘ,దూరా యే నెఱిఁగి యుండుదును సకలముగన్.

14_3_12 వ.
కావున.

14_3_13 క.
నావలనికరుణ పెంపున,నీవు ప్రసాదించినట్టినిరవద్యకవి
ద్యావిస్తారంబున దృఢ,తావిశదమతిన్ రమించెదం గ్రతుపురుషా.

14_3_14 వ.
అని యిట్లు సభక్తికంబుగా సంభాషణంబు సేసిన వాసుదేవుండును వితతా
దరవాక్యంబుల నభినందించె నప్పురుషవరు లట్లు సల్లాపంబులు సేయుచుం
బోయి తమరాకకు సమలంకృతంబైనసామజపురంబ ప్రవేశించి ధృతరాష్ట్రు
మందిరంబునకిరిగి యక్కురువృద్ధుని గాంధారినిం బ్రణామవినయవిశేషంబులం
బ్రీతులం జేసి కుంతీసమారాధనం బాచరించి విదురధౌమ్యయుయుత్సుసంజ
యులదర్శనంబులు సముచితప్రకారంబులనడపి కౌంతేయాగ్రజు నత్యంతభక్తి
పూర్వకంబుగా సమంచితవిధంబునం గాంచి తదాలింగనాద్యాదరణంబులు
వడసి రప్పద్మనాభుండు నాఁడు సవ్యసాచినదనంబున నతనిచేయుపూజావిధా
నంబుల మానసంబలర వసియించి మఱునాఁడు మహనీయాస్థానమండపంబున
నున్నయన్నరేంద్రుకడకునయ్యింద్రసుతుండుదోడనచనంజని సుఖగోష్ఠినుండె
నట్టియెడనగ్గాండీవియప్పాండవపూర్వజునాననంబునఁ జూడ్కినిలిపినభృతుండై.

14_3_15 తే.
కమలనాభుండు పెద్దయుఁ గాలమిచట
నున్నవాఁడు దండ్రియును సహోదరాది
సకలబంధులు నితనిదర్శనము గోర
కుండురే వారిఁ జూడ నీతండుఁ గోరె.

14_3_16 క.
ద్వారకకు నిమ్మహాత్ముఁడు,మీ రనుమతి సేయఁ జని యమేయగుణుల నా
సీరిని వసుదేవునిఁ గని,గౌరవ మెసఁగంగఁ దల్లిఁ గాంచి ముదమునన్.

14_3_17 క.
తక్కటిసోదరుల సుతుల,నక్కునఁ బ్రియ మారఁ జేర్చి యప్పురజనులన్
మిక్కిలి మన్నన మక్కువ,నెక్కొనఁ గా నాదరించి నిలువక మగుడున్.

14_3_18 సీ.
దేవర యిప్పని దివ్యచిత్తంబునఁ జూచి మీ కెట్టులు సూడఁ బోలె
నట్టుల యుత్తరం బానతి యిత్తరు గాక నావుడు నధికప్రయమున
మాతులుఁ గాంచి యిమ్మాధవదేవుండు మనమాఱు గాఁగ నమస్కృతులును
నాలింగనంబులు నాచరించి హలాయుధుని దేవకీదేవిఁ గనినయపుడు

తే.భక్తిమనకునై పూజించి బంధుజనుల,నందఱను దత్తదౌచిత్యమభినుతముగ
నాదరించి వారలకుశలానుయోగ,విధము నస్మత్కృతమ్ముగ విస్తరించి.

14_3_19 క.
పరిజనయోగక్షేమము లరసి పురజనమ్ములకుఁ బ్రియం బెసఁగఁగ వా
క్యరచనలుం గార్యసమా,చరణములు నొనర్చి నడపి సఖిసత్కృతులున్.

14_3_20 తే.
మఱియు వలయుకృత్యంబులుఁ దెఱఁగుపఱుప
వలసినన్నిదినంబులు నిలిచి యశ్వ
మేధమునకు బాంధవజనమిత్త్రభృత్య
వర్గసహితుఁడై చనుదెంచువాఁడు గాక.

14_3_21 క.
అని ధర్మజుండు వలికిన,విని కృష్ణుఁడు సంతసిల్లి వినతుండై గొం
తిని ద్రౌపదిఁ దగుమెయి వీ,డ్కొని తాను సుభద్రఁ దోడుకొని పోవుటకున్.

14_3_22 వ.
గొంతి యెంతయుం బ్రియంబున ననుజ్ఞసేయుటయు నర్జునుననుమతియుంగొని.

14_3_23 తే.
వివిధవాహనారూఢులె విభవ మెసఁగఁ,బాండవేయులుఁ దక్కినబంధుజనులు
ననుప రాఁగ సాత్యకి దోడ నరుగు దేరఁ,బురమువెడలియొక్కెడనిల్చికరము నెమ్మి.

14_3_24 క.
సముచితభంగుల సందఱఁ,గ్రమమున వీడ్కోని పథంబు గౌకొని తనచి
తము దృష్టియుఁ బాండవము,ధ్వముపై నొలయంగ నల్ల నరుగుచు నుండెన్.

14_3_25 ఆ.
అట్లు మరలి మరలి యర్జునుం జూచుచుఁ,జనఁగ నతఁడు సూడ్కి సనినయంత
దవ్వుఁ జూచు చుండె నవ్విధంబున సితాం,బురుహలోచనుండు వోవునపుడు.

14_3_26 క.
సరసన సాత్యకి రుచిరపు,టరదంబునఁ జనియె వెనుక నలఁతిరథముపై
నరిగె సుభద్రయునిమ్మెయి,నరుగఁగ హరిమీఁద నింద్రుఁ డలరులు గురిసెన్.

14_3_27 ఆ.
పవనుం డనుకూలతమెయిఁ,బ్రవర్తితుం డయ్యె నతిశుభప్రదభంగుల్
వివిధములు మఱియు ధరణీ,ధవ తోఁచె నిమిత్తములు నితాంతస్ఫుటతన్.

- శ్రీకృష్ణుఁ డుదంకాశ్రమంబునకుఁ బోవుట -

14_3_28 వ.
ఇట్లు వోయి పోయి మార్గంబుకెలనం జేరువ నున్నయుదంకాశ్రమంబు గని
యందుఁ జని వినయం బొప్పనమ్మునింగని యతనిచేయునతిథిసత్కారంబులం
బ్రియం బంది యతనిపాల నాసీనుం డయి యుండ నతం డప్పుండరీకాక్షున
కి ట్లనియె.

14_3_29 చ.
భరతులపాలి కేఁగి తగఁ బాండవకౌరవబంధుభావనం
గరము దృఢంబు సేసియు సుఖస్థితి రాజుల వారివారివి
స్ఫురితమహాధిరాజ్యముల చొప్పుల నిల్పితెపక్షపాతితా
దురితము లేనినీవు జనతోషవిధానవిశారదుండ వై.

14_3_30 వ.
అని యి ట్లెఱుంగనివాఁ డయి యడిగెడునట్లపోలె నిందాగర్భంబుగాఁ బలికి
నం బద్మనాభుండు దానును దాని నెఱుంగమి భావించి యాభార్గవునాననం
బాలోకించి.

Reply all
Reply to author
Forward
0 new messages