Aswamedhaparvamu - 14_2_121 - 14_2_150

4 views
Skip to first unread message

Prakash Swaminathan

unread,
Aug 13, 2010, 11:04:30 PM8/13/10
to Andhramahabharatam
14_2_121 క.
రాజసగూణములకుం గల,నైజ మెఱుఁగు వారు తజ్జనకవైకృతముల్
ధీజితములు గావింపఁగ,నోజ గలిగి శుభదవృత్తి నొందుదు రెందున్.

14_2_122 సీ.
సంతోషమును బ్రకాశత్వంబుఁ బ్రియమును నానందమును గరుణాభిరతియు
క్షమయును సత్యంబు శౌచంబు ధృతియు నకార్పణ్యమును దతిక్షయునహింస
యునునార్జవంబును ననసూయయును గ్రోధరాహిత్యమును నసంరంభతయును
సమత దాక్షిణ్యంబు శ్రద్ధధానతయు నక్రూరభావంబు హ్రీగౌరవంబు

తే.
సత్త్వజాతంబు లివి పుర్వజస్మసంక,లితము లైనట్టివా రహంకృతి మమత్వ
మర్థతృష్ణ గామార్తి లేకతులబోధ,భరితులై యూర్ధ్వలోకవైభవముగండ్రు.

14_2_123 క.
వినుఁ డాగుణంబు లన్నిటిఁ,గనుఁగొని తత్తదనుషక్తిగలుగనివాఁడ
ప్పనిచే భుజింపఁ గాఁ బడఁ,డనఘాత్మకులార మ్రింగు నతఁ డారాశిన్.

14_2_124 వ.
అని చెప్పి యప్పరమేష్ఠి మఱియును.

14_2_125 సీ.
వేర్వేఱ యుండవు వినుఁడు గుణంబు లన్యోన్యసంకలితంబు లగుచుఁ బరఁగు
సంకతత్వమునన సంసారయాత్రాప్రవర్తనం బొనరించు వానిలోన
నెయ్యదిమిగులఁదోపిచ్చెఁ దజ్జన్యంబు లొలయు బాయుటయునొక్కక్కమాటు
గలుగు దమం బెఱుఁ గలి యధికం బైన స్రోత స్సధోముఖిస్రుతి రజస్సు

ఆ.
వెరిఁగినపుడు మధ్యసరణి సత్త్వము వృద్ధిఁ,బొంద నూర్ధ్వవృత్తిఁ బొందు వీని
మును ప్రకారభేదమున నెఱింగించితి,నవి సదుత్తరంబు లనఘులార.

14_2_126 క.
స్రోత స్సన జీవగమన, హేతు వగుదశావిశేష మీగుణమునఁ దా
నీ తెరువు నొందు నని కనుఁ,డాతతమతులార కరణ మగు నదిత్రోవన్.

14_2_127 వ.
గుణత్రయంబునుం ద్రోచుటమేలదిద్రోపువడునట్టివితృష్ణత్వంబులేకుండునేని.

14_2_128 క.
సాత్త్వికులకు దివము రజో,నుత్త్వకలితవర్తనులకు మధ్యభువనవా
సిత్త్వముఁ దామసులకు నీ,చత్త్వకరాధోజగంబు సంప్రాప్తమగున్.

14_2_129 క.
ధర్మార్థకామగోచర,కర్మములకు సాత్త్వికాదికప్రకరవికా
రోర్ములు హేతువు లగు ని,ష్కర్మత కేతద్విధూతి గారణము సుఁడీ.

14_2_130 క.
క్రమమునఁ బ్రాణంబు నపా,నముసత్త్వంబును రజస్సునాకుం జూడన్
యమివరులార యుదానము,దమ మిట్టుల శ్రుతియు సువిదితంబుగఁ జెప్పున్.

14_2_131 క.
జపమును దానము యజ్ఞముఁ,దపమును గర్తృజనచిత్తదశలను సత్త్వా
ద్యుపహితము లగుట నడచుం,ద్రిపథంబుల సాత్త్వికపుగతియ మేలెందున్.

14_2_132 క.
వినుఁ డెక్కువ దక్కువ లే,కనయము నెనసినగుణత్రయంబును జూరే
వినుతావ్యక్తం బనఁగాఁ,జనుతత్త్వము శివ నుచలము శాశ్వత మరయన్.

14_2_133 క.
సదసత్ప్రకారనిత్యం,బది దాని తెఱం గెఱుంగూనాతఁడు విజ్ఞా
నదశావధూతగుణుఁ డై,యదీనగతిఁ బొందఁ గను నిరామయపదమున్.

14_2_134 వ.
అని యుపదేశించి నిరించి వెండియు.

- మనోబుద్ధ్యహంకారాది తత్త్వప్రకారము -

14_2_135 సీ.
అవ్యక్తమునను మహత్తత్త్వముదయించు నది బుద్ధి మతి ధృతి ఖ్యాతి సంవి
దుపలబ్ధినామంబు లొంది యెందును గని విని చని కావించి విభుత నొప్పు
దాన నహం కారతత్త్వంబునకుఁ గల్గుఁ బ్రభవంబు వినుఁడు తద్భావితాత్మ
కంబై ప్రవర్తించుఁ గార్యనీతుల లోక మఖిలంబు వర్ణత్రయప్రజనితు

తే.
లధ్యయనమును వ్రతమును నధ్వరంబుఁ
దపము మొదలైనక్రియ లందుఁ దగిలి నడచు
టెల్ల దద్వ్యాప్తిఁ జేసియ తెల్ల మింత
జగము రంజిల్లు దానితేజంబువలన.

14_2_136 క.
వినుఁ డాతత్త్వంబుల సం,జనితము లగు మేదినియును జలమును దేజం
బును వాయువు నాకాశము,ననఁగ మహాభూతములు నిరతిశయమహిమన్.

14_2_137 తే.
తద్గుణంబులు సూరె గంధంబు రసము,రూపసంస్పర్శశబ్దముల్ రూఢభంగిఁ
బరఁగునివ్విషయములపాల్పడ్డమనను,గలుగుజంతువు మోహాంధకారమొందు.

14_2_138 క.
దీన సకలజంతువులును,లీనము లగుచుండుఁ దమ మలీనస్మృతిధై
ర్యానూనం బగునిర్మల,మానసమునఁ బొరయ నీరు మహితార్యజనుల్.

14_2_139 క.
విషయంబులు నశ్రరములు,విషసన్నిభములు సమగ్రవికృతిజనకముల్
ధిషణాగుణముల నెల్లఁగ,లుషములుగాఁ జేయు మోహలోభకరములై.

14_2_140 ఆ.
మాంసశోణితాస్థినుయశరీరంబులఁ,దారు గాఁగ లగ్గ తలఁచునట్టి
కృపణజనులు వీని కీడు గానఁగ లేక,చిక్కి చెడుదు రింత నిక్కువంబు.

14_2_141 వ.
పండితులు వీనిచేతం జెడ రని పలికి పద్మసంభవుండు వెండియు.

14_2_142 తే.
అంతరాత్మ యనంగఁ బ్రాణాదిపంచ,కమును వాఙ్మనోబుద్ధులుఁగా నిరూఢి
గలుగు నీయష్టకంబు లోకమున కెల్లఁ,దా నుపాదానకారణత్వమువహించు.

14_2_143 వ.
ఇవ్విధంబునం గనుంగొనుట బోధంబునకు నిధానంబు.

14_2_144 సీ.
వినుఁ డహంకారసంజనితంబు లగుచక్షు రాదికబుద్ధీంద్రియములుఁ బాయు
ముఖ్యకర్మేంద్రియములును మనంబును నేకాదశేంద్రియానీక మీక
డిందిసందడిఁ బడి కుందక యం దెది యింపేనిఁ దననంక కీడ్వఁ జాలు
బుద్ధిత్త్వము గల్గుశుద్ధాత్మకుఁడు పరతత్త్వంబు గనుటకుఁ దా వలంతి

తే.
యనియెఱింగించిమఱి యునిట్లనునజుండు,స్వేద ముద్భేద మండ మన్వీనఁబుట్టు
నధమమధ్యమోత్తమదశలైనభూత,రాసు లత్యుత్తమములుజరాయుజములు.

14_2_145 వ.
భూతతారతమ్యజ్ఞానంబు మాననీయం బగుట నిట్లు సెప్పితి నధ్యాత్మాదులం
జెప్పెదఁ దద్వేదిత్వంబు విద్యామూలం బైయుండు నవధానంబుతో వినుండు

14_2_146 క.
అంబర మాది యనిల తే,జోంబుధరలు వరుసతోడ నగుఁ జూరెద్వితీ
యంబుఁ దృతీయంబుఁ జతు,ర్థంబును బంచమము భూతతతి యట్లుండున్.

14_2_147 వ.
అధ్యాత్మాదులు భూతాధిష్ఠానంబులు గావున భూతంబుల మున్నుపన్యసించితి

14_2_148 సీ.
శ్రోత్రమధ్యాత్మంబు సూరెశబ్దం బధిభూతంబు దిశలు ప్రబుద్ధులార
యధిదైవతము చర్మమధ్యాత్మ మందలిసంస్పర్శ మధిభూతసంజ్ఞకంబు
దానికి నధిదైవతంబు విద్యుత్తునేత్రంబు దా నధ్యాత్రకంబు రూప
మధిభూత మాదిత్యుఁ డధిదైవతము జిహ్వ యధ్యాత్మకము రస మారయంగ

తే.
దానియధిభూత ముడుపతి తదధిదైవ,తంబు ఘ్రాణమధ్యాత్మంబు దలఁప గంధ
మంచితాధిభూతము దదీయాధీదైవ,తంబు మారుతమండ్రువిద్వజ్జనములు.

14_2_149 వ.
ఇది బుద్ధీంద్రియప్రపంచంబు.

14_2_150 సీ.
పాదపాయూపస్థపాణివాగ్వర్గంబు కర్మేంద్రియములు సత్కర్ములార
యధ్యాత్మములు వాని కగునధిభూతముల్ గంతవ్యమును విసర్గమును శుక్ర
మును గ్రమవృత్తిమైవినుఁడు కర్తవ్యనక్త్యంబులును నధిదైవతములు
బభ్రుమిత్రప్రజాపతిశక్రహ్నులు మఱి యహంకారంబు మనను బుద్ధి.

తే.
పూజితాధ్యాత్మకము లధిభూతవృత్తి
వెలయు నభిమాన మంతవ్యములును నిశ్చ
యంబు నధిదైవతము రుద్రుఁ డమృతకరుఁడు
బ్రహ్మ మిది వేవాక్యనిర్ణయము తెఱఁగు.

Reply all
Reply to author
Forward
0 new messages