Aswamedhaparvamu - 14_3_121 - 14_3_150

14 views
Skip to first unread message

Prakash Swaminathan

unread,
May 10, 2014, 11:56:56 AM5/10/14
to Andhramahabharatam
14_3_121 క.
అది యతివిస్తారము పె,క్కుదినంబులు సెప్పఁబట్టుఁ గొంత దగం జె
ప్పెదనేఁ బ్రధానపురుషస,ముదయసమరవిధము లఘుతరోక్తులఁ దెలియన్.

14_3_122 సీ.
కౌరవసైన్య మేకాదశాక్షౌహిణోకలితంబు దానికిఁ గట్టె వీర
పట్టంబు భీష్ముఁడాప్రభువున కెదు రొడ్డి రెలమిమైఁ బాండుపుత్త్రులు శిఖండి
నక్కడ సప్తసంఖ్యాక్షౌహిణీక మనీక మిమ్మాడ్కిఁ బన్నినబలద్వ
యంబును ఖేచరు లచ్చెరువడఁ బోరెఁ గాండీవి దోడ్పడఁ గా శిఖండి

తే.
యన్నదీనందనునిఁ బదియవుదినంబు,నందుఁ గూలిచె నుత్తరాయణమువచ్చు
నంతకును మృతిఁబొందకయాతఁడుండె,నధిపశరతల్పమునఁ గడునద్భుతముగ.

14_3_123 క.
గురుఁడైదుదివసములు ని,ర్భరసమర మొనర్చె నతనిఁ బరిమార్పఁగ నా
వెరవున నర్జునప్రాపున,దొరకొనియె హుతాగ్నిభవుఁడు ద్రుపదసుతునకున్.

14_3_124 క.
గండున రాధాతనయుఁడు,రెండుదినంబులు పెనంగి గ్రీష్మసమయసూ
ర్యుండుంబోలె వెలింగెడు, గాండివధరుశరకరోష్మఁ గ్రాఁగెనరేంద్రా.

14_3_125 చ.
విను మఱునాఁడు శల్యుఁ డతివిక్రమతన్ సమరం బొనర్చి య
ద్దినము సగంబు సెల్లఁగ యుధిష్ఠిరుచేఁ దెగుడున్ బలంబు గై
కొని యని సేయఁగా శకునిఁ గూల్చి వడిన్ సహదేవుఁ డంతతో
మనమునఁ జేవ దక్కి తనమానము డిగ్గఁగఁ ద్రావి హీనుఁడై.

14_3_126 వ.
దుర్యోధనుండు దనతమ్ముల భీమసేనుండు సంగ్రామంబునం దెగటార్చి యుండ
భంగంబున కోర్చి పలపలనిమూఁక విడిచి గద చేతం గొని పాదచారి యయి
యొక్కండునుం బాఱి యొక్కమడువు సొచ్చి నీళ్లు (పాషాణమయముగా)
మంత్రించికొని డాఁగి యుండెఁ బాండవు లెఱింగి పోయి పొదివికొని మర్మ
భేదంబు లగుదూషణభాషణంబుల నొప్పించిన.

14_3_127 ఆ.
అతఁడు మడువు వెడలి యనిలనందనుతో డఁ,దగఁ బెనంగి తద్గదావినిహతిఁ
దొడలువిఱిగి కూలివిడిచెఁ బ్రాణంబులి,బ్భంగిజయముగొనిరి పాండుసుతులు.

14_3_128 క.
గురుసుతుఁడు పాండుతనయశి,బిర మారే యడరి పొదివి భీషణవృత్తిం
బొరిగొనియెం గరిఘోటక,నరచిచయము నెల్ల మనం గల దధిపా.

14_3_129 వ.
ఆరాత్రి యేనును బాండుసుతులు నచ్చట లేమి నంత పుట్టె నిట్లు పదునెనిమిదిదివ
సంబులు సెల్లిన సంగ్రామంబున నే మార్వురము సాత్యకియునుం దక్కమాది
క్కున సమస్తజనంబులు నస్తమించిరి కౌరవులదెన నశ్వత్థామకృపకృతవర్ములు
మువ్వురు బ్రదికిరి యుయుత్సుండు మున్నపాండవుల నాశ్రయించటం జేసి
చావునకుం దప్పె నిది భారతరణప్రకారంబు.

14_3_130 క.
అని చెప్పెఁగాని యభుమన్యునిచా వేర్పడఁగఁ జెప్ప నొల్లఁడ వసుదే
వునకు వగ మిగులుటకునె,మ్మనమునఁ దా నోర్వకునికి మాధవుఁ డధిపా.

14_3_131 వ.
దాని నెఱింగిసుభద్రగద్గదస్వరంబున గోవిందునితోడ నీయల్లుండభిమన్యుండు
దెగుట మీతండ్రికిం జెవులారం జెప్పుమన్నాయని వసుదేవుండు వినంబలుకు
చుం బుడమిం బడిన వసుదేవాదియాదవజనంబులు మనంబులంగదిరినక్రొత్తనె
వ్వగలంబలవించినం బద్మనాభుండు వారలనెల్లనూరార్చి వారణుపురంబునను
భద్రయునుత్తరయునభిమన్యునిదెస నెత్తినశోకంబున నాకులత్వంబు నొందిన
చందంబును గొంతి దగుమాటల వారిఁ దేర్చిన తెఱంగును నెఱింగించి పాండవు
లేవురును వేర్వేఱయభిమన్యునకైమణికాంచనగవాదివస్తువులు విప్రప్రకరంబుల
సంగుటయు మఱియుం దటాకకరణాదిధర్మంబు లాచరించుటయునుం జెప్పి
మఱియు దురంబునం దెరలక మరలక యాసౌభద్రుండు మూర్తియై
దుర్యోధనద్రోణకృపద్రౌణికృతవర్మకర్ణాదివీరవ్రాతంబుఁగలంచి యనేక నృప
లోకంబున జములొకంబునకనిచి యనిమిషులునొగడను త్తమమంబున కరిగి
సుఖియై యున్నవాఁడు వానికి వగవనేలయనియుం బలికి యిల్లుజాంతిగావించి.

14_3_132 ఆ.
బంధులోకమునకుఁ బరమప్రియం,బైన,యుచితవర్ణసమున నుండఁ గృష్ణుఁ
డని సవిస్తరంబు లగువాక్యములఁ బ్రీతి,చిగుడులౌత్తనిట్లు సెప్పి మఱియు.

14_3_133 వ.
కరిపురంబునం బుట్టినవిశేషంబులు విను మని పలికి వైశంపాయనుండు జనమేజ
యునకిట్లనియె.

___ వ్యాసుఁడు పాండవుల నశ్వమేధయాగమ్ము______

14_3_134 సీ.
చుఱుచుఱఁ దనచెవుల్ సూఁడినయట్లుగ నభిమన్యుసంస్తుతి యనవాక్చ
యము ప్రసంగాధీనమైబంధుజలులందుఁ బొముటయునుధృయతి తలరి
యుత్తరి విలపింప సత్తన్వియలదుట గనుఁగొని పాండునందనుల మాటఁ
గూరిన నచటికిఁ గారుణ్యమూర్తి వేదవ్యాసుఁ డతంచి తగిమాట

తే.
లాడి నారలవగ మాన్చియశ్వమేధ,విషయవిధులు ప్రసమగించి తానఁగుఁ
డని నియోగించి వారెల్లనట్లకాక,యనిన నాతఁ గంతర్పితుం య్యనధిప.

14_3_135 క.
అన విని జనమేజయుఁ డ,మ్ముని యిట్లు హితోపదేళముం జేసినఁ బాం
డునృపాగ్రతనముఁ డెమ్మయి, ననఘతొడగెనశ్వమేధమాదింబునకున్.

14_3_136 క.
అని యడిగిన వైళం పా,యనుఁ డాతని కిట్టు లనియె నప్పుడు కుంతి
తనయాగ్రజుండు దమ్ములఁ,గనుఁగొని యుత్సాహలక్ష్మిగనుఁగవినొర్పద.

14_3_137 సీ.
వ్యాసమహాముని వత్సలత్వంబున నానతి యిచ్చినమాననీయ
వాక్యంబు వింటిరె వసుధ యిత్తఱి వసుహీనయైయున్నది దానఁ పి
భూదేవనిహితధానాదాన మావశ్యకం బయ్యె దానిశక్యత్వమును హి
మాచలయాత్రాసమాచరణప్రకారమును విచారణీమములు గావె

ఆ.
యనుడుఁ బవనతనయుఁ డతనితో నీశ్వరుఁ,బరమనియతిఁ గొలిచి కరుణవనసి
ప్రథమగణము నెల్లభక్తిఁ బూజించి య,తలమునంబు భూతిబలు లొనర్చి.

14_3_138 క.
తెత్తము గాక నరేంద్ర మ,రుత్తకలిత మైనదానగూపము నుమహో
దాత్తస్థితి నున్నకనక,మిత్తఱి నిలదెసఁ దలంప నేటికి మనకున్.

14_3_139 వ.
అప్పనికి సముచితసైన్యసమేతంబుగా దేనర విజయంచేయనలయనుననిన వర్జునుం
డును గవలును నట్ల పలికిరి దానికి ధర్మనందనుండు ప్రియంబందికృతనిశ్చయుండ
యి ధృతరాషుకడకుంజని యశ్వమేధగోపక్రమోత్సవశ్రవణంబునం బుత్త్రు
లం దలంచి శోకసంతాపసమాక్రాంతం డయి యున్న యన్న రపతిచరణంబుల
కెఱంగి వేదవ్యాసువచనంబులు గాంధారియు వినుచుండ నతనికిం జెప్పియతని
చేత నయ్యజ్ఞాచరణంబునకు ననుజ్ఞ వడసి యయ్యిరువురును దండప్రణామపూ
ర్వకంబుగావీడ్కొనిగొంతిపాలికింబోయి సంతోషవికచవదన యయియున్న
యద్దేవి యధ్వరవిధానంబునకు ననుమతిసేయం దదీయపాదంబులకుం బ్రణ
మిల్లి తదామంత్రితుండై యాస్థానమండపంబునకు నరుగుదెంచి యయుత్సు
రావించి కార్యంబు తెఱం గెఱింగించి నీవు నగరరక్షకై నిలువునుని నెయ్యం
బలర విదురసమేతంబుగా నిలిపి బలంబులసంఘటింపం బడవాళ్లంబనిచి నియ
తుం డయి సురపితృపూజనంబులు దీర్చి మహేంద్రార్చనం బొనర్చి మహితా
వధానుండై.


14_3_140 క.
నానావిధబహుళాంచిత,దానము లొనరించి యర్చితం బగునగ్నిన్
దానియధికారి ధౌమ్యుం,దాను బ్రదక్షిణవిధాయితం గొలిచి తగన్.

14_3_141 క.
సితలేపనసితభూషణ,సితమాల్యసితాంబరములఁ జెన్నుగ సమలం
కృతుఁడై సితాతపత్ర,ప్రతతి మెఱయఁ బూర్ణచంద్రు పగిది వెలుఁగుచున్.

14_3_142 వ.
షోడశశ్వేతాశ్వవ్యూఢరథారూఢుండై.

14_3_143 క.
భూదైవతదత్తాశీ,ర్వాదంబులుఁ బుణ్యగానరవములు రోదో
మేదురమంగళతూర్యని,నాదంబులుఁ జెలఁగ బుధజనస్తుతు లెసఁగన్.

14_3_144 చ.
వెడలుడు నమ్మహీవిభునివేడ్క యెఱింగి వృకోదరుండుఁగ
వ్వడియును బిన్నతమ్ములును వైభవ మొప్ప నలంకరించి యె
క్కుడు మెఱయం బ్రధానభటఘోటకదంతిరథప్రతానముల్
దడిగలుఁ గుంచెలున్ గొడుగుతండములున్ విలసిల్ల వచ్చినన్.

14_3_145 క.
కని యానృపుఁ డలఁతినగవు,నిను పారెడుచూడ్కి వారినెమ్ముగములపైఁ
దను పారుచుఁ బొలయం జనఁ,జన రాజులు గూడుకొనిరి సైన్యంబులతోన్.

14_3_146 వ.
ఇవ్విధంబున నరిగి యక్కురువంశవరుండు సముచితప్రయాణంబుల గిరిసరిదర
ణ్యంబులు గడచి హిమశైలంబు సేరి ధౌమ్యాదిపరుహితులఁ బురస్కరించికొ
ని తదీయతలం బధిష్ఠించి యొక్కయుచితప్రదేశంబున విడిసె నట్టియెడ.

_ వ్యాసుఁడు హిమవత్పర్వతంబున నున్న పాండవులకడకు వచ్చుట _

14_3_147 శా.
బాలార్కద్యుతిపుంజపింజరజటాభారంబుఁ బ్రావృడ్ఘన
శ్రీలీలం బ్రహసించునంగమును రోచిస్స్ఫారదండంబు ను
న్మీలన్నీలమృగాజినాంబరమునైనిర్వాణదానక్రియా
శీలుం డైనపరాశరాత్మజుఁడు విచ్చేసెంగృపాలోలుఁడై.

14_3_148 వ.
ఇట్లు సన్నిహితుం డయినవేదవ్యాసమునీశ్వరుని బాండవులు పరమభక్తిం బ్ర
ణామపూర్వకంబుగాఁ బూజించి కర్తవ్యం బెయ్యది యానతిం డనిన నమ్మాన
నీయుండెల్లిమీరెల్లవారునుద్ర్యంబకపూజలు సెల్లింపవలయు నేఁటిరాత్రినియ
తులై దర్భసంస్తరణంబుల శయనించునది యని నియోగించిన.

14_3_149 ఆ.
రమ్యమైన చప్పరంబుల దర్భసం,స్తరణములను యోగసదనమునఁ బ్ర
భాసమానము లగుపంచాగ్నులునుబోలె,నమ్మహాత్ము లుండి రధిపముఖ్య.

14_3_150 వ.
అట్లుండి యవనీసురాశీర్వాదంబుల నాదరించుచు నారేయి గడపి కల్యంబగు
టయుంగాలోచితకరణీయంబులునిర్వర్తించిసర్వక్రియాకలాపనిర్వహణధుర్యుం
డగు పారాశర్యుండు వసుపధౌమ్యప్రముఘపురోహితసహాయమహనీయసమా
చారు లగుపాండవేయులు పరమస్థండిలంబునం బార్వతీపతి నావహించి యు
త్కృష్టంబులును బహుళంబులు నగుగంధపుష్పధూపదీపంబులం బూజించి స
మంచితమనోహరిభూరిపాయాసాది భవ్యద్రవ్యభారమహోదారం బగు నైవే
ద్యంబు సమర్పించి వేఱు వేఱ ప్రధానప్రమథులకుఁ దద్గణంబులకు నర్చ లిచ్చి
కుబేరమాణిభద్రప్రభృతిభూతయక్షజనంబులను సభక్తికావాహనకలితులం
గావించి పూజనంబు లాచరించి.
Reply all
Reply to author
Forward
0 new messages