14_2_32 వ.
నిజంబుగా నేను దొఱంగితినేని.
14_2_33 ఆ.
అప్రయోజనంబులై యుండు నాఱిన,నిప్పులట్లు శూన్యనిలయములును
బోలె మీస్వరూపములు గాన మనలోన,నెక్కుడేన చూవె యింత నిజము.
14_2_34 వ.
అనిన విని యింద్రియంబులు మనంబున కిట్లనియె.
14_2_35 సీ.
ఇంతవట్టిట్టిద యిట్లైనయంతన కలుగ నేర్చునె యధికత్వమేము
వెలి గాఁగ నీ వొకవిషయంబునేనియు ననుభవించితయేని నధిక మగుట
గానంగ వచ్చు మాలో నొకం డడఁగిన ననుభవింపుమ తదీ యార్థ మట్లుఁ
గాక ఘ్రాణంబున గంధంబ జిహ్వరసంబ చక్షువున రూపంబ వినుము
ఆ.
చర్మశక్తి జేసి సంస్పర్శవిషంబ,శ్రోత్రయుక్తిశబ్దమాత్రకంబ
కాని యొంట నొంటిఁ గబళింపఁ జాల వే,ట్లధికతానిరూఢికాసపడితి.
14_2_36 క.
మును మే మాలంబించిన,వెనుకఁ గదా నీకు ననుభవింప వశం బో
మనసా నీ వెంగిలి కా,దనుమా యవ్విషయ మెక్కు డయ్యెడు మనలోన్.
14_2_37 క.
నీ వడఁగిననుం బ్రాణముఁ,గావఁగ మాయంద బోధకం బగుద్రవ్యం
బావర్తింపఁ గఁ జేయుట,గావించును నీకుఁ దెలివుఁ గనికొను మిదియున్.
14_2_38 సీ.
అట్లు గా దిట్లని యనుశాసనము సేయఁ గడునేర్చుశిష్యులకడకుఁ బోయి
వినిపింపఁ దొడఁగి యవ్వినుతార్థములు వార లుగ్గడింపఁగఁ గనునొజ్జవోలె
మముఁ గొని విషయోత్కరము నీవు భోగ్యంబు గాఁ జేసికొందు నీకలలు గన్న
యప్పుడు మాలేమి నవ్విషయంబు బొంకైన వాకిలి లేనియాలయంబుఁ
ఆ.
జెంది మరలినట్లు సేడ్పాటు వొరయుదు,గాక సత్యభుక్తి గలదె నీకు
నింతవట్టుఁ గాన్పుమేమును నీవును,గలసి పరఁగ భోగకలన గలుగు.
14_2_39 వ.
అని యివ్విధంబున మనంబును నింద్రియంబులును సంవాదంబు సేసె నని
యప్పురుషవరుం డావరవర్ణినితో వేఱొక్కండు విను మని యిట్లనియె.
14_2_40 సీ.
ప్రాణప్రభృతు లగుపవనులంభోరుహగర్భుని నొక్కటఁ గానఁ బోయి
యెక్కుడు మాలోన నెవ్వఁడు నావుడు నవ్విభం డెవ్వార లడఁగ నడఁగు
దురు పెఱవార లెవ్వరికిఁ బ్రవర్తన మొందిన నెల్లవారును జరింతు
రధికు లందఱకును నట్టివారలు మీరు ననుఁ డని పలికినఁ జనక నిలిచి
ఆ.
ప్రాణుఁ డాది గాఁగఁ బవను లందఱుఁ దమ,వలన నవ్విధంబు గలుగఁదెలుప
నాతఁ డే నెఱుంగనా యది యట్టిద,వినుఁడు మీవిశేషవృత్తిభంగి.
14_2_41 తే.
ఎప్పు డెవ్వరివలన నే చొప్పుగలుగు
నపుడ వా రెక్కు డగుదు రన్యోన్యమిత్త్ర
భావమునఁ దాల్పుఁడొండొరుఁ బవనులార
పొరిఁ బరస్పరభావనాపరుల రగుఁడు.
14_2_42 వ.
ఇత్తెఱంగున మీకు భద్రం బగుం బొం డని పుచ్చె నట్లుపదేశించిన బ్రహ్మ
వాక్యంబుల వాయువులు సమత నొందెనని చెప్పి వాయువిషయం బైనయది
నారద దేవమతసంవాదంబు సెప్పెద నాకర్ణింపు మని బ్రాహ్మణుండు బ్రాహ్మణి
కిట్లనియె.
14_2_43 తే.
దేవమతుఁ డనువిప్రుండు దేవమునివ,రేణ్యుఁడగునారదునినొక్కపుణ్యభూమిఁ
గాంచి వినతుఁడై యాతనికరుణవడసి,భక్తిరసమువొంగారఁదత్ప్రాంతమునకు.
14_2_44 సీ.
అల్లన చన నాతఁ డాదరంబున నిందు రమ్ముండు మనుచుఁ గరమునఁ జూపు
నెడ సమాసీనుఁడై కడు వినయంబున హస్తముల్ మొగిచి దయాసమ
యెఱిఁగింపు పవనంబు లేనింటియందును జాయమానం బగుజంతువునకు
దొలితొలి యెద్ది దాఁ దొడఁగు వర్తింపంగ ననవుడు నారదుం డతనితో
తే.
వాయు వెయ్యది గర్భసంవాసమునకుఁ,జొనువు జీవునిఁ దజ్జంతుజననవే
దొలుత దాని కనంతరకలిత మైన,మారుతంబు ప్రవర్తించు మఱియు విను
14_2_45 తే.
పురుషునందు సమానంబుఁ బొలఁతియందు
వ్యానమును జువ్వె పొడమించు వరుస ననఘ
శుక్లమును శోణితంబును జూలు గల్గు
నయ్యుగంబును విధిచెయ్ది నమరఁ బొంద.
14_2_46 క.
విను సృష్టశోణితంబునఁ,బనుగొనుశుక్లంబువలనఁ బ్రాణుఁడ దగ వ
ర్తన మొందుఁ బ్రాణశుక్లము,లనూనహేతువులు గానపానుఁడు నడచున్.
14_2_47 క.
చనుఁ బ్రాణుఁ డధోగతి నూ,ర్ధ్వనిరూఢి నపానుఁ డివ్వధము గలయీరెఁ
టను నగ్నిమయోదానం,బును వ్యానంబును సమానమును వర్తించున్.
14_2_48 ఆ.
పావకుండు సర్వదేవాత్మకుండు ప్రాణంబునకు నపాననామమునకు
నంతరమున వెలుఁగునాభవ్యమూర్తియు,దానరూప మండ్రు తజ్ఞజనులు.
14_2_49 సీ.
విను మహోరాత్రంబులును శుభాశూభములు
సత్యానృతంబులు సదనదాహ్వ
యములును నైనద్వంద్వములు ప్రాణాపాన
ములకు నామాంతరంబులు దదీయ
మధ్యవర్తిత నొప్పుమహనీయవహ్నియు
దానంబు దాని నిర్ద్వంద్వభావ
మాంతరయాగవిద్యాప్రవీణులు గండ్రు
పరమశాంతి యనంగ బ్రహ్మమనఁగ
తే.
నరయ భేదంబు లేదన్నయట్టు లుండు,నమ్మహావస్తువును నుదానాకృతియ
నంగఁ జెవి యార విందుము నలినగర్భు,చేత ననిదివ్యమునియిట్లు సెప్పెఁగరు
14_2_50 వ.
అని చెప్పి యింద్రియమనఃపవనంబులభంగులు గనుంగొనుట యీతత్వంబు
కుఁ బరమం బయినతత్త్వంబు గనుటకుఁ గతం బైయుండు నని పలికి యద్ధ
మరుండారామారత్నంబును సదయంబుగా నవలోకించి యుత్తమరహస్యం
సెప్పెద నాకర్ణింపు మని యిట్లనియె.
- జీవాత్మస్వరూపనిరూపణప్రకారము -
14_2_51 సీ.
కరణంబు గర్మంబు గర్త యన్నేతద్విరాజితకారకత్రయముచేత
నఖిలంబు సంవ్యాప్తమైయుండుఘ్రాణాదులునుమనంబునుబుద్ధియునుబ్రవరుల
గరణహేతువు లండ్రు గంధాదివిషయసంతతియు మంతవ్యబోద్ధవ్యములును
ఆ.
కెలఁకులకును మింటికిని మేర లివి యన,రాదు గాన యయ్యరణ్యభూమి
వెలుఁగు లొండ్లు సొరవు వినుము క్షేత్రజ్ఞుండు,రవి దదీయసేవ భవముఁబాచు.
-- page with verses from 52-59 is missing --
14_2_60 క.
మృగనయన బ్రహ్మసంభవ,మగుజలము వహించుచుండు నందులసదులున్
నగములు విను దానఁ దప,స్విగణం బవ్యయపదంబుఁ జెందం గాంచున్.