14_2_182 క.
అవ్యక్తతత్త్వజాతము,భవ్యము సత్త్వంబు దురితపంకహరం బై
యవ్యయ మమృత మనింద్రియ,భావ్యం బగుత్త్వమొందఁ బ్రాఁక గుఁజుండీ.
14_2_183 వ.
కావున.
14_2_184 తే.
సత్త్వభావనకంటెఁ బ్రశస్తమైన,కృత్య మరయంగ లేదండ్రు నిత్యవస్తు
సమ్యగధిగమసిద్ధికి సంయమప్ర,సిద్ధు లాగమతంత్రప్రసిద్ధులార.
14_2_185 క.
వినుఁడీ సత్త్వస్థుఁ బురుషుఁ,గనుఁగొను టనుమానకలనఁ గాని మనము ద
క్కిన తెఱఁ గేమిట నైనం,గనుఁగొనియెద మనుట వెరవు గాకుండుఁ జుఁడీ.
14_2_186 సీ.
ఇట్లగు టెట్లనియెదరేని సత్యంబు సంతోషమును నహింసయును ధృతియు
క్షమయు నార్జవమును సన్న్యాసమును బరిత్యాగంబు విజ్ఞానయోగదశయు
సాత్త్వికంబులుగాన తత్త్వవిజ్జనము లీ యనుమానమునఁ బురుషాధిగమముఁ
బడయుట యొప్పెడుపదమండ్రుసత్త్వంబుఁబురుషుండు నొకఁ డనుబుద్ధిగొంద
తే.
ఱార్యు లూఁదుదు రట్లేల యగు నుదుంబ
రమున మశకమ్ము వారి మీనము వసించు
నట్లు సత్త్వంబునం దంతరాత్ముఁ డుండుఁ
గాక యనియెడివారు పెక్కండ్రు గలరు.
14_2_187 వ.
అనిన విని యమ్మును లమ్మహితాత్మునితో ధర్మంబు లనేకవిధంబులు వీనిలో
నెవ్వం డెయ్యది యవలంబించె నదియ వాఁడు మే లను నే మన్నింటిమీఁద
నుం బరఁగినబుద్ధులు గలిగి యనిశ్చయదర్శనుల మయియుండుదు మిది ప్రధా
నానుష్ఠేయం బని యుదేశింపవలయు సత్త్వపురుషసంబంధప్రకారంబును
బ్రస్ఫుటంబుగా నెఱింగింపు మనుటయు వారికి వారిజాసనుం డిట్లనియె.
- సత్త్వం బనశ్యానుష్ఠేయంబుగా నిరూపించుట -
14_2_188 సీ.
సకలధర్మములలో సర్వభూతాహింస మేటి యహింసాసమేతుఁ డైన
వానికి నుత్తమ జ్ఞానోదయం బగు నది మోక్ష మొనరించు ననఘులార
కోరికమెయిఁ గర్మకారి యయ్యెడువాఁడు వొందుగతాగతంబుల ఫలాభి
లాషంబు లేక నిర్దోషత మే లాచరించిన ముక్తి సిద్ధించు వినుఁడు.
తే.
విషయి పురుషుండు సత్త్వంబు విషయ మిట్లు
భోక్తృభోజ్యత్వసంబంధమునఁ బొసంగి
యుండియును బద్మపత్రసయోలవంబు
కరణి నతఁడు తత్సంగంబుఁ బొరయకుండు.
14_2_189 క.
సత్త్వము ప్రదీప మాపర,తత్త్వముఁ గాంచుటకుఁ గాన తత్సాధనతా
తత్త్వము వదలక చిత్తసు,ఖత్వాకలిత మగునెలవు గండ్రు కృతాత్ముల్.
14_2_190 చ.
అది సదుపాయ మెందును నుపాయసమగ్రత లేమి సేర్ప ద
భ్యుదయము దూరమార్గమునఁ బొందెడుభద్రము నాహనాఢ్యుఁడున్
నది నెఱి నుత్తరించి కనునందము నౌసహితుండుఁ గాంచునొ
ప్పిదము విసాధనుం డయిన బే లెటు లొందఁగ నేర్చుఁ జెప్పుఁడా.
14_2_191 ఆ.
ఇట్టు లగుట యెఱిఁగి యెఱిఁగియేనియును నె,ఱుంగ కేని బలిమి ఱొచ్చుగడిగి
చేయుపని ఫలంబు సిద్ధింప కుండుట,కొలఁదిఁ బోక దుఃఖములును గలుగు.
14_2_192 క.
స్థలపథమునఁ బోతమ్ము,న్జలమార్గమునందు వాహనము వినియోజ్యం
బులు గావిమ్మెయి సాధన,కలనవిభాగజ్ఞుఁడైనఁ గడచు దురితముల్
14_2_193 వ.
అని చెప్పి.
14_2_194 తే.
తటినిఁ దగ నుత్తరించునంతకును బోత
మాదరించి తక్కొల్లనియట్లు పురుషు
దర్శనము సంభవించునంతకును సత్త్వ
మూఁది పిదపఁ దత్సంబంధ ముడుగుఁ డనియె.
14_2_195 వ.
ఇట్లుపదేశించి మఱియు నిట్లను నవ్యక్తంబుగుణంబు మహత్తత్త్వంబు మహ
త్తత్త్వగుణం బహంకారం బహంకారగుణంబులు మహాభూతంబులు నుహా
భూతగుణంబులు శబ్దాదులం దాకాశంబునకు శబ్దంబు గుణంబు వాయువునకు
శబ్దస్పర్శంబులు గుణంబులు దేజస్సునకు శబ్దస్పర్శరూపంబులు జలంబునకు శబ్ద
స్పర్శరూపసంబులు గుణంబులు పృథివికి శబ్దస్పర్శరూపరసగంధంబులు గుణం
బులు శబ్దంబు మృదుఖరాదిబహువిధభేదంబులు గలిగియుండు స్పర్శంబు శీతో
ష్ణముఖ్యవివిధప్రకారంబులం బరఁగు రూపంబు శుక్లకృష్ణప్రభృతినానావిధం
బులం జను రసంబు మధురతిక్తాదిప్రచురభంగుల నడచు గంధంబు సురభీతీక్ష్ణ
ప్రముఖానేకవిశేషంబుల వర్తించు నిట్లు పెక్కుచందంబులం జెల్లువిషయంబు
ల తెఱంగెఱుంగుట వానిఁ దొఱంగుటకుం దోడ్పడంజాలుననిచెప్పి వెండియు.
14_2_196 ఆ.
భూమిముఖచతుష్కమునకంటె దివి యహం,కారతత్త్వమంతకంటె దాని
కంటెబుద్ధి బుద్ధికంటెఁ బ్రకృతి యెక్కు,డన్నిటికిని బురుషుఁ డధికుఁ డరయ.
14_2_197 క.
భూతములతారతమ్యము,చేతోగత మైనయట్టి శిష్టజనము ప్ర
ద్యోతితుఁ డగుపురుషుఁ గని ని,రాతంకావ్యయపదంబు ప్రాపింపఁ గనున్.
14_2_198 సీ.
పంచభూతంబులఁ బరఁగింపఁ గుదియుంపఁ జాలుదక్షత వాని నేలుప్రభుతఁ
దనరు మనంబు రథ్యముల సారథి యెట్టు లట్లింద్రియంబుల నాఁగ నడప
నదియ వలంతి భూతాత్మకంబును బుద్ధి సన్నాహమును మనస్సారథికము
నింద్రియాశ్వము నైనయూడ్యరథంబున నభిమతగతి నంతరాత్ముఁ డెందు
తే.
నెలమివర్తించునిట్లగుటెఱుఁగుబుధుఁడు,ఘోరసంసారమోహవాగురకులోను
గాక నిర్గుణపథమునఁ గ్రాలి కను ని,రామయము నవ్యయంబును నగుపదంబు.
14_2_199 వ.
అని పలికి మఱియు.
14_2_200 క.
శరనిధితరఁగలభంగిం,బొరిఁ బొరి నవ్యక్తమునన పుట్టు నడంగున్
సురనరధరణీరుహముఖ,చరాచరానేకభూతజాలము లెల్లన్.
14_2_201 క.
అవ్యక్తాదిసకలము,నవ్యయుఁ డగుపురుషుఁడాశ్రయంబుగఁ బరఁగున్
సవ్యక్తంబుగ నిది గను,భవ్యులు వడయుదురు మోహబంధవిముక్తిన్.
14_2_202 క.
వినుఁ డక్కనుటకు మూలం,బనఘం బగుతపను యగుట నతినిష్ఠఁ దపో
ధనసమ్యగ్విధసముపా,ర్జనం బవశ్యంబు వలయు సన్మతులారా.
14_2_203 సీ.
భూరితపంబునఁ జూరె ప్రజాపతుల్ బహువిధసృష్టినిర్వహణనిపుణ
లైరి వన్యంబు లాహారంబులుగఁ దప మాదరంబునఁ జేసి కాదెమునులు
గాలత్రయంబు లోకత్రితయంబును గాంతురు విద్యల గౌరవంబు
లొదవుఁ దపంబున నొండువిధంబులఁ బడయంగ రానియెక్కుడుపదంబు
తే.
లచ్చమైనతపంబున వచ్చుఁ బడయ,బ్రహ్మవధమద్యపానాదిపాతకంబు
లెల్లఁ బాయుఁ దపఃకృతినిద్ధతపము,పేర్మి సర్వభూతంబులుఁ బ్రీతిఁ బొందు.
14_2_204 క.
మనుతాహంకృతిసహితత,పమునఁ బ్రజాపతిసమీపభవ్యపదము సం
యమి వొందు నిందు సందే,హ మొకింతయు లేదు నిర్మలాత్మకులారా.
14_2_205 క.
మమతాహంకారవిము,క్తముశుద్ధమునైనయచలితధ్యానముతో
సమవేతం బగుతపమున,యమి గను సకలోత్తరావ్యయపదప్రాప్తిన్.
14_2_206 వ.
అని చెప్పి వెండియు.
14_2_207 క.
తమము రజస్సుఁదొఱఁగి స,త్త్వమునన రమియించి యగుణతత్త్వముగని స
త్త్వమును దిగవిడుచు వైరా,గ్యమహితుఁ డగుమునివరుం డకల్మషులారా.
14_2_208 క.
పరమం బనంగ వేదాం,తరహస్యాత్మత వెలుంగుతత్త్వము నిక్కం
బరయఁగ క్షేత్రజ్ఞుఁడ యను,పరిణితి గలయతఁడు సర్వపదవిదుఁడు సుఁడీ.
14_2_209 క.
వృత్తివిశేషమునఁ జనిన,చిత్తము వెనుకఁ జని యందుఁ జేర్చి మనసు దా
నెత్తెఱఁగునకుం దివియమి,యుత్తమపురహస్యమండ్రు యోగమున మునుల్.
14_2_210 క.
వినుఁ డవ్యక్తాంతం బగు,పని యెల్ల నవిద్య నొలయు బంధము మమతం
బనుపడిన మృత్యు వమృతం,బనఁ జను నది నిర్మమత్వమారఁ గలిగినన్.