Aswamedhaparvamu - 14_2_1 - 14_2_30

6 views
Skip to first unread message

Prakash Swaminathan

unread,
Jun 14, 2010, 11:12:25 PM6/14/10
to Andhramahabharatam
14_2_1
శ్రీసుఖనిష్పాదనకే
లీసక్తపదారవిందలీలా సతతా
భ్యాసవికాసిసమాధిస
మాసాదితశాంతిలోల హరిహరనాథా.

- బ్రాహ్మణగీతలు -

14_2_2 వ.
దేవా వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె.

14_2_3 ఆ.
అట్లు శౌరి పార్థు నంచిత్రబ్రహ్మవి,ద్వాప్రబోధకంబు లైనయట్టి
వినుతవాక్యములు సవిస్తరముగ విని,పించి యతనివలనిప్రీతిఁ జేసి.

14_2_4 వ.
వెండియు నిట్లని బోధింపె.

14_2_5 సీ.
భర్త్రుభార్యాకృతభవ్యసంవాదంబు నభయనామకమునై యతిశయిల్లు
నట్టిది యొకయితిహాసంబు విను పార్థ జననుతసమధికజ్ఞానవర్ణి
తాత్మకుఁడై నమహాద్విజుఁ డొకఁడు వివిక్తప్రదేశసేవిత్వనిరతి
నున్నెడ నల్ల నాసన్నయై వినయంబు భక్తియు నెసఁగఁ దత్పత్ని ప్రణతి

తే.
యాచరించి మహాత్మ యధ్యాత్మబోధ,భరితఁగాఁ జేయవే నన్నుఁ గరుణ పల్ల
వింప నని దయ వుట్టంగ వేఁడుటయును, మందహాసవిభాసియై మగువఁజూచి.

14_2_6 క.
ఈమాటకుఁ జారుముఖీ,నామది ముద మందెఁ గాన నాతికి నిది యే
లా మేటితలం పనుత్రో,పేమియు లే దోపి వినుము హితవచనంబుల్.

14_2_7 వ.
నాయెఱింగినభంగిఁ జెప్పెద నని పలికి యయ్యతులవ్రతుండాపతివ్రకిట్లనియె.

14_2_8 సీ.
వినను గానను జేయ వెర వైనయవి కర్మములు వానిఁ గర్మకర్తలు సమస్త
సిద్ధిప్రదములని చెప్పుదు రజ్ఞానతిమిరాంధు లై విను ధీరచిత్త
జగమున లేదు నిష్కర్మత్వమెందేనిఁ గలిగె నేనియును మౌర్ఖ్యముగ దాని
నిందింతు రెక్కుడునెల వద్యియాత్మ నేఁ గందు బ్రహ్మంబు నిష్కళత నందు

తే.
వెలుఁగు నగ్నితో సోముండు గలసి మిథున
ధర్మమం దెప్డు నడపి భూతములఁ దాల్చు
నజుఁడు మొదలుగ నక్షరోపాస్తి యందుఁ
జేయుదురు శాంతి నింద్రియజిత్త్వమొంది.

14_2_9 వ.
అక్షరంబు తెఱం గెఱింగించెద.

14_2_10 సీ.
స్పర్శంబు రసము రూపంబును శబ్దంబు గంధంబుఁ గా కున్కి కారణముగఁ
ద్వక్కున జిహ్వ నేత్రమున శ్రోత్రంబున ఘ్రాణంబునను బరిగ్రహవిధాన
మాచరించుటకు లోనైయుండ దాతత్త్వ మమలినబుద్ధ్యవగమము దానిఁ
బ్రాపించుఁ బ్రాణాది పంచవాయువులును విను దానివలన వర్తనముఁ బొందు

తే.
నంద డిందుఁ బ్రాణంబు నపానమును స
మాననామకవ్యానమధ్యమున నడచు
మెలఁగుచుండుఁ బ్రాణాపానములకు నడిమి
దెస నుదానంబు శ్రుతి యిట్లు దేటపఱిచె.

14_2_11 క.
నెలకొని ప్రాణాపానం,బులఁ బురుషుఁడు సుప్తుఁడైనఁ బొలఁతి విలీనం
బులగు సమానవ్యానం,బులు యోగులు సంశయంబుఁ బొందరు దీనన్.

14_2_12 క.
విను తెలియంగ నుదానం,బున సుప్తుం డైనఁ బ్రాణము నపానంబున్
వనజనిభలోచనా పురు,షుని విడువవు యోగిజనుల చూ పిట్లుండున్.

అంతర్యాగప్రకారంబు నిరూపించి చెప్పుట

14_2_13 వ.
ఇవ్వాయువు లేనును మనంబును బుద్ధియుం గూడ నీయేడును వైశ్వానరునకు
జిహ్వలు వైశ్వానరుం డనఁ బ్రాణులదేహంబులం దగ్నిరూపంబున వెలుంగుచు
న్నయాత్ముండు ఘ్రేయంబును భక్ష్యంబును దృశ్యంబును స్పృశ్యంబును శ్రా
వ్యంబును మంతవ్యంబును బోద్ధవ్యంబును నగునీసప్తసంఖ్య సమిధలు ఘ్రాత
యు భక్షయితయు ద్రష్టయు స్ప్రష్టయు శ్రోతయుమంతయు బోద్ధయునయిన
యీయోడ్వురును వరుసన ఘ్రేయాదు లయినహవిస్సు లేడింటిని వేల్పు
ఋత్విజు లిది సప్తహోతృవిధానప్రకారంబు వైశ్వానరువదనంబులు పది
యు దిగ్వాయుసూర్యచంద్రపృథివీపావకశక్రవిష్ణుప్రజాపతిమిత్రాత్మకంబులుశబ్ద
స్పర్శరూపరసగంధవక్తవ్యకర్తవ్యగంతవ్యవిసర్గానందంబులు హవిస్సు లీపదిం
టిని గ్రమంబున నాహుతులు సేయుహోతలు శ్రోత్రత్వక్చక్షుర్జిహ్వాఘ్రాణ
వాక్పాణిపాదపాయూపస్థంబ లయినదశేంద్రియంబు లిత్తెఱంగు దశహోతృ
విధి యీరెంటినినెఱింగి యిందేవిధంబుననేనియుజీవాత్ముం డుపద్రష్టగా నంత
ర్యాగంబు నడపుయోగిజనంబులు జననమరణవిముక్తులగుదురు బహిర్యజ్ఞపరు
లు గమనాగమనభ్రమణంబులం బొందు చుండుదు రని చెప్పి వెండియు.

14_2_14 క.
విను ప్రణవాదికరూ,త్వనిరూఢిం బుట్టు వాక్కు దాని వెనుచునున్
మనము పురషార్థబుద్ధిం,బను పడి యని చెప్పె సతికి బ్రాహ్మణుఁ డనఘా.

14_2_15 క.
విని యావిప్రునితో ని,ట్లను నయ్యెలనాఁగ మన మనఘ ప్రే రేపం
గ నెగయు వాక్కు దదనువ,ర్తనము మనంబునకు నెవ్విధంబునఁ గలుగున్.

14_2_16 వ.
అనవుడు నతండు.


14_2_17 చ.
మనసు నుదానవాయువును మానిని గూడి వెలార్చు వాక్కునా
త్మునివలనన్ భవద్వచనమున్ జనతానుభవంబు చొప్ప యై
నను విను కార్యమున్ గుఱిచినం దగ వాగనువర్తనంబు సే
యన వలసెన్ మనంబునకు నమ్మెయి గల్గుట నట్లు సెప్పితిన్.

14_2_18 వ.
అని పలికి మఱియు నమ్మహీసురోత్తముండిట్లనియె.

14_2_19 క.
మనసును వాక్కునుమాలో,ననఘచరిత యెక్కు డెవ్వరని యంభోజా
సను నడిగిన నతఁ డెక్కుడు,మన మనవుడు వాణి యక్కమలభవుతోడన్.

14_2_20 వ.
ఏను నీకుం గామదోహిని నయి యుండ న న్నెట్లు దక్కువగాఁ బలికి తనిన
నతండుస్థావరంబును జంగమంబును నన నాకు రెండుమనస్సులు గల వందు
స్థావరంబు నాయొద్దను జంగమంబు నీకడను నిలుచు భవద్గోచరత్వంబునం
బరఁగువర్ణంబు మంత్రంబు స్వరంబు జంగమమనస్సుగా నెగడు దానకంటె
నీ వెక్కుడు నీకంటె నెక్కుడు స్థావరమనస్సు గావున నిమ్మాట యాడం గల
దానవుగా వని నిర్దేశించె.

14_2_21 క.
విను మమ్మెయినిర్దేశం,బున నవ్వాగ్దేవి ముర్ఛవోయినయట్లే
మిని బలుక కుండి పదపడి,వినయంబున నజుని శరణు వేఁడె లతాంగీ.

14_2_22 వ.
అనిన బ్రాహ్మణి పతితో బ్రహ్మమాటకుంగొఱవోయినవాణి యేమిటం దేఱె
నని యడిగిన బ్రాహ్మణుం డిట్లనియె.

14_2_23 క.
ప్రాణాపానంబులయెడ, వాణి నిలుచుఁ గాన ప్రాణవాయు వొదవిత
త్క్షీణత్వ ముడిపె నది గీ,ర్వాణజ్యేష్ఠప్రభావవాసిత యగుటన్.

14_2_24 వ.
ఇట్టి వని వాఙ్మనసప్రకారంబు లెఱుంగుట మోక్షంబునకు మూలం బింకను
వాణీమనస్సుల తెఱంగు సెప్పెద వినుము.

14_2_25 తే.
ప్రాణుఁ బొదువుట వాణి యపానుఁ జెంది
తా నుదానభూతాత్మయై తనువు విడిచి
వ్యానచేష్టితసర్వసంవ్యాప్తి నొంద
మనను సుస్థితి నొందు సమానునందు

14_2_26 వ.
మనసు సుస్థితి నొందు సమానునందు.

14_2_27 సీ.
ఘోషిణి నాఁగ నఘోషిణి యన రెండుదెఱఁగులు గలిగి వాగ్దేవి పరఁగు
నం దఘోషిణి గరీయసి యుత్తమరసంబు గోవుచందంబునఁ గురియుచుండు
నవ్యయరూపదివ్యప్రభావోజ్జ్వల బ్రహ్మవాదిని యిట్లు బ్రాహ్మివిధము
గనుట మహానందకర మని చెప్పి యవ్విప్రుండు మఱియు నవ్వెలఁదితోడ

తే.
వినుము ఘ్రాణాదికములైదు మనసు బుద్ధి
యొకయధిష్ఠానమున నుండియును నెఱుంగ
వబల యొం డొంటివిషయంబు నలమికొనఁగ
ననిన వివరింపు మీతెఱం గనియె నింతి.

14_2_28 వ.
అనుటయు నయ్యవనీదేవుం డయ్యువిద కిట్లనియె.

14_2_29 సీ.
గంధంబు ఘ్రాణంబ కాని తక్కినయాఱు నధిగమింపఁగ నోప వధిగమించు
రసము జిహ్వయ యితరములాపనికిఁగావు రూపంబుఁ జక్షుస్సయేపునెఱుఁగఁ
బెఱయవి యెఱుఁగవు తెఱవ సంస్పర్శంబుఁ గాంచుఁ జర్మంబ తక్కటివి గానఁ
జాలవు శబ్దంబుఁ జాలుఁ బట్టంగ శ్రోత్రంబ యన్యములు దత్కరణమునకు

తే.
వెరవు లేవు సంశయితసంవేదనంబు
మనసుకృత్యంబ యిక్కార్యమునకు నొండ్లు
సొరవు నిష్ఠ బుద్ధిన యగుఁ జొరఁగ నేర
విత్తెఱంగున కపరంబు లెఱిఁగికొనుము.

ఇంద్రియమనఃపరస్పరసంవాదప్రకారము


14_2_౩0 వ.
అని చెప్పి మనస్సునకు నింద్రియంబులకుం దొల్లి గలిగినసంవాదంబు సెప్పెద
నాకర్ణింపు మింద్రియంబులు మనస్సుతో నేము నీవు నొక్కరూప యనుటయు
మనస్సు వాని కిట్లనియె.

Reply all
Reply to author
Forward
0 new messages