14_3_92 క.
దినమున మూఁడవయామం,బున యపరార్ధంబు యోగ్యముగ నాహారం
బునకుం గల్పించిరి నా,కనిమిషు లటు గాన మాన నాఁకలి వుత్తున్.
14_3_93 సీ.
అని పల్కె సౌదాసుఁ డమ్ముని యట్లేని నధిప మద్గురుకార్య మాచరించి
వచ్చెద మగుడ నవశ్యంబు నామాట ననృతంబు సొరదు నీ వర్థికోటి
కిష్టపదార్థంబు లిత్తు పాత్రమ యేను గురులకుఁ గాఁగ నాకొరుకోర్కి
నీవతీర్తని కృతనిశ్చయత్వంబున నరుగుదెంచినవాఁడ ననుడు నృపతి
ఆ.
యట్ల కాక యేమి యర్థించి వచ్చితి,చెప్పు మనిన నతఁడు చిత్త మలర
ననఘ నీదుపత్ని యర్థిమై ధరియించు,కుండలంబు లని యతండు సెప్పె.
verses 14_3_94 to 14_3_98 page missing
14_3_99 తే.
మని యభిజ్ఞానముగ మదయింతి కపుడు,సెప్పి పుచ్చితి నిట్లు విశిష్టరత్న
మయమహాకుండలము లిచ్చి మాన్తుఁగీడు,నీకతస ననుతలఁపున లోకంద్య.
14_3_100 వ.
అనియె నాభృగువంశవరేణ్యునిపుణ్యసన్నిధింజేసి యాసౌదాసంద్రునకు
సంప్రాప్తసమాధాననూతనసత్త్వంబు గలుగుట తంబునం గార్యదర్శనంబు
ను గుండలదానశ్రద్ధయు శాంతనచనంబునుం గలిగెఁ నదీయచవశ్రవణానంత
రంబ యుదంకుం డతనితో మిత్త్రత్వంబు సంభాషణమాత్రనిర్ధం బగుట బోధ
వృద్ధులు సెప్పుడు రేను నీవలనం గృతార్థుఁడ నైతిఁ బోవుదున్నవాఁడ మగి
డి వచ్చెద నని పలికితి బొంకు నడ కుండ వత్తు వనినఁ జతంబు గృపాయత్తం
బగుచుండ నాభూపతి యత్తాపసోత్తమునాసనం బాలోకించి.
14_3_101 ఉ.
చంపెడునట్టినాకడకు సంయమివల్లభ నత్తురయ్య నీ
పెంపును నిక్కముం దెలిసెఁ బ్రీతుఁడనైతి మదారి నీతప
స్సంపదఁజేసి పాపు మని సంస్తుతి బల్కిన వీనులందుఁ బే
రిం పొలయం బ్రసన్నత నహింపఁగఁ త్తమునంకుఁ డిట్లనున్.
14_3_102 ఉ.
ఏమిట నైన నొప్పమి నరేద్ర సుచిత్తులఁ పొందనేని యు
వే నురలున్ భవద్గుణమ వీతకళంకునిఁ జేసె నిన్ను పాం
ద్రామలకీర్తి గౌతమమహాముని సల్లనిచిత్తవృత్తినీ
పై మలఁగించెఁ గావలయుఁ బార్థినసత్తమ పొందు మున్నతిన్.
14_3_103 క.
అని పలికి మఱియు బలుదీ,వన లిచ్చి యతండు గారవమున నితనిమేన్
దనకరముల నివిరి ప్రియం,బొనర్చె నిగ్దురితుఁడైన యుర్వీపతియున్.
14_3_104 వ.
భక్తివినయసంభరితుం డయి యప్పరమమునిం బ్రస్తుతించి నమస్కరించి
యామంత్రణంబు సేసిన నమ్మహాత్ముండు గుండలంబులు గష్టాజినంబునం బది
లంబుగా ముడిచికొని గౌతమాశ్రమంబునకు రయంబునం బోయిపోయి ప
క్వఫలంబులం బెఱిగిన బిల్వంబుం గని యాఁకటి పల్లునం దదీయవిడపంబున
సకుండలం బగునయ్యజినంబు దగిల్చి యమ్మహీరుహం బక్కి ఫలంబులుగోసి
కొను చుండె.
14_3_105 సీ.
గాలి నవ్విటపమాలోల మగుడుఁ దగు లెడలి యయ్యజినంబు పుడమిఁబడిన
గని యొక్కనాగంబు గ్రక్కునఁ జనుదెంచి వెసఁ బుచ్చికొని కడ వేగ పఱవఁ
గాంచి యుదంకుండు గ్రమ్మన దిగదాఁటి వెనుకొనునంతకుఁ గనపపుట్టఁ
జొచ్చె నయ్యురగ మాసువ్రతపరుఁడు దీవ్రిముఖకాష్ఠముగనిత్రవ్వఁదొడఁగెఁ
తే.
దాని సైరింపఁ జాలక ధరణి తలరె,విప్రుఁడై నచ్చి గీర్వాణవిభుఁడు గొయ్య
కోలఁ దవ్వినమాతఁ బాతాళయాన,మేల సిద్ధింప నేర్చు మునీంద్ర వినుము.
14_3_106 వ.
పాతాళభువనం బిచ్చటికి సహస్రయోజనంబుల నున్నది కుండలంబులు గొని
పోయినభుజంగం బైరావతాపత్యం బనిన విని యమ్మునిశిష్యుండు.
14_3_107 క.
పాతాళంబున నున్నను,వేతెత్తుం గుండలములు విను మప్పని నా
చేతం గా కున్న నసు,వ్రాతము విడువఁబడు నిది ధ్రువం బని పలికెన్.
14_3_108 చ.
పలికిన నత్తపస్విదృఢభావ మెఱింగి సురేంద్రుఁ డొండువ
ల్కులపని నిల్పి కాష్ఠమునకుం గులిశంబనఁ గల్గువాఁడియున్
బలువును నిల్చి వజ్రి సనె బాంధవ మేర్పడఁ జెప్పి భీతిమై
నిల దెరు విచ్చె నమ్మునియు నేడ్తెఱఁ జొచ్చె భుజంగలోకమున్.
14_3_109 వ.
చొచ్చి యనేకప్రకారప్రాకారపరిరక్షితంబును బహురత్నదీప్తిజాలదేదీప్యమా
నంబును నైనయమ్మహనీయలోకం బాలోకించి దశయోజనాయామంబునుం
బంచయోజనవిస్తారంబును నగుతద్ద్వారంబు గని యతండు కుండలాహరణంబు
దుర్లభం బనుతలంపున డిల్లపడియె నయ్యెడ నరుణ వదనంబును నసితాంగం
బును సితవాలంబును నై వెలుంగుతురంగం బతని కిట్లనియె.
14_3_110 ఉ.
ఆతత మైననాదగునపానము నూఁదు మొకింతయున్ జుగు
ప్సాతురవృత్తినీదుహృదయంబునఁ జొన్పకు లోకవంద్యుఁడ
గ్గౌతమునాశ్రమంబున నఖండితభక్తినుపాస్తిసేసినన్
బ్రీతునిఁ జేసినాఁడవు వరిష్ఠతపోధన యట్లు గావునన్.
14_3_111 వ.
నీకుం బొడసూపియైరావతసుతుం డపహరించినసమంచితకుండలంబులు మగు
డం జేరెడునుపాయం బుపదేశించితి ననిన నుదంకుం డేను నిన్ను నెఱుంగ నుపా
సించుట యెట్లు గలిగెఁ దెలుపు మనుడు నయ్యశ్వం బతనితోడ భవద్గురునకు
గురుండం బావకుండ నీవు శుచి వయి సభక్తికంబుగా నిత్యంబును నన్ను
నియతిం బూజించి తత్తెఱం గెఱుంగవే యని పలికినం బ్రీతి నొంది యతండు
తదియోపదిష్టప్రకారం బాచరించిన.
14_3_112 సీ.
ఘోటకోత్తమరోమకూపంబులం దెల్ల నొక్కటఘనధూమ ముద్గమించి
కవిసి పాతాళలోకం బంతయును గప్పె వాసుకిప్రభృతిని వాసభుము
లుపరుర్ధభావంబు నొందెనైరావతావాసంబు హాహారవంబుతోడ
నాకులం బయ్యె నట్లతిదారుణం బైన పెనుఁబొగ నెంతయు భీతి నొంది
ఆ.
యమ్మునీంద్రుకడకు నహివరుల్ రయమున,వచ్చి భక్తినర్చ లిచ్చి వినతు
లై తదీయకార్య మడిగి యెఱింగి వే,తెచ్చి కుండలంబు లిచ్చి రధిప.
- ఉదంకుండు గుండలంబు లిచ్చి యహల్యను సంతోషపఱచుట -
14_3_113 చ.
అతఁడును వారిఁ బోఁ బనిచి యగ్నికిభక్తిఁ బ్రదక్షిణంబు సే
సి తగ నమస్కరించి విలసిల్లఁగఁ దేజము ప్రీతిచిత్తుఁడై
యతలము నిర్గమించి రయ మారఁగ వచ్చి యహల్యఁ గాంచి తె
చ్చితి నివె కుండలంబు లని చేనిడి భూస్థలిఁ జాఁగి మ్రొక్కినన్.
14_3_114 తే.
ఆయమయు గౌతముండు నత్యాదరమునఁ,గౌఁగిలించుచు దీవించి గారవింప
నతఁడు నమ్మునిపతికిని నయ్యమకును,బెక్కుమాఱులు భక్తిమైమ్రొక్కినిలిచి.
14_3_115 క.
మీకరుణఁ గాక తగుమెయి, నీకుండలములు పరిగ్రహించుట నడుమన్
వైకృత మొలసినఁ దలఁగుట,నాకొలఁదియె యనియె వినయనమ్రుండగుచున్.
14_3_116 వ.
అనిన విని వార లత్యంతసంతుష్టాంతరంగు లై రగ్గౌతముం డతని కిట్లనియె.
14_3_117 ఉ.
నీచరితంబు చిత్రమహనీయము మిత్త్రసహక్షితీశ్వరున్
నీచతఁ బాప నాగ మపనీతము సేసినకుండలద్వయం
బాచతురత్వ మాబలిమి యాదృఢనిశ్చయ నుట్టు లొప్ప ధ
ర్మోచితలీలఁ దేర నొరుఁ డోపునే యేను నిజంబ పల్కితిన్.
14_3_118 వ.
అనియె నయ్యుదంకుం డట్లు దనమహాతపంబుబలిమిం బరాక్రమించి యనన్య
సులభంబు లగుకుండలంబు లాహరించి గురుజనమనోరథసిద్ధి గావించె నా
భృగువంశమహత్తరుమహానుభావం బిట్టి దనిన విని జనమేజయుం డమ్మహాత్మున
కువరం బొసంగి చనిన వాసుదేవుననంతరవృత్తాంతంబు మునిసత్తమాయెఱిం
గింపవే యని యడిగిన నవ్విభునకు వైశంపాయనుండిట్లనియె.
14_3_119 సీ.
ఆభార్గవోత్తము నట్లు వీడ్కొని కృష్ణుఁ డరిగి యలంకృత మైననిజపు
రము సొచ్చునప్పుడు రైవతకాచల యాత్రామహోత్సవ మఖిలజనులుఁ
గొనియాడు చుండి యగ్గోవిందుసందర్శనంబున నుత్సవోన్మత్తభావ
మిమ్మడియై ప్రమోదమ్మునం దేలి రద్దేవదేవుఁడు వసుదేవుఁ గాంచి
తే.
దేవకిదేవి బలభద్ర దేవుఁ దక్కుఁ,గలుగువృద్ధబాంధవులను గని వినీతిఁ
దత్తదుచితమనోజ్ఞవిధాసమంచి,తాచరణములు నడపెఁ బ్రియం బెలర్ప.
14_3_120 వ.
వారలందఱకు ధర్మనందనుచెప్పిన చొప్పునఁ బ్రణామాదియోగ్యోపచారంబు
లాచరించె ననుజతనుజామాత్యభృత్యులు దన్నుం గనినం బ్రీతివాత్సల్య
సంభావనాబహుమానంబులు మెఱయ నాదరించె సాత్యకిసుభద్రలం దగు
తెఱంగులం దగినవారలం గానిపించె నట్లు సకలజనప్రమోదాపాదియైనదా
మోదరు నత్యంతసమీపాసీనుం జేసికొని వసుదేవుండు భారతరణప్రకారంబు
యాతాయాతజనంబులచేత వింటిం బ్రస్ఫుటంబుగా వినవలతుం జెప్పవే యని
యడిగిన నచ్యుతుం డతని కిట్లనియె.