14_2_152
అని నిర్దేశించి నీరజాసనుం డాసంయమివరులతో సూక్ష్మభావత్వసంపాదినియు
శివయు నగునివృత్తితెఱం గెఱింగించెద ననుమాట ము న్నాడి యిట్లనియె.
14_2_153 సీ.
కమఠంబు దనయంగకముల నెట్లట్లు కామముల విద్వాంసుండు మరలఁదివుచుఁ
గామంబుల మరల్పఁ గానోపు ధీరుండువిరజస్కుఁడైముక్తితెరువు గాంచు
నింద్రియంబులు పదియింటిని గుదియించు టెక్కడువెర వది యింధనముగ
నాత్మాగ్ని వెలుఁగు భూతావలి నాత్మఁగాంచినసూక్ష్మతత్త్వదర్శనము గలుగు
తే.
భూతపంచక జలధి రాగాతిశోక,సహితభోగలవాంశకాశ్రయము దీని
విభులు గాముండుఁ గ్రోధుండు వీరి గెల్వ,వచ్చినప్పుడ యది గడవంగవచ్చు.
14_2_154 ఆ.
మనసు మనసునంద మడఁచి యాత్ముని నాత్మ,యందకాంచునట్టి యతఁడు సర్వ
విదుఁడు సకలభూతవితతియందునుఁ దనుఁ,గనుచు నుండు నిర్వికల్పకముగ.
14_2_155 తే.
ఆత్మ తత్త్వమేకంబ దీపాంతరములఁ
గలుగఁ జేయు ప్రదీపంబుకరణి నావ
హించు రూపాంతరముల నయ్యెలమియును బు
ధుండు గనుఁగొని బ్రమయక యుండు నొకట
14_2_156 తే.
ఆపరంజ్యోతిపేళ్లు లర్యముఁడు వరుణుఁ
డనిలుఁ డగ్ని సోముఁడు విష్ణుఁ డజుఁడు శివుఁ డ
నంగఁ బరఁగుశబ్దములు సన్మతులు దానిఁ
బ్రయతు లయ భజియింతురు నియతులార.
14_2_157 వ.
అని చెప్పి యచ్చతురాననుం డమ్మాననీయులతో మఱియు నిట్లను ధర్మంబునకు
నహింస లక్షణం బధర్మంబునకు హంసయు దేవతలకుఁ బ్రకాశత్వంబును
మనుష్యులకుఁ గర్మంబును నాకాశంబునకు శబ్దంబును వాయువునకు స్పర్శం
బును జ్యోతిస్సునకు రూపంబును జలంబునకు రసంబును బృథివికి గంధంబును
భారతికి శబ్దంబును మనంబునకుఁ జింతయు బుద్ధికి వ్యవసాయంబును దదీయ
మహత్తత్త్వస్వరూపంబునకు ధ్యానంబును నవ్యక్తంబునకు సాధుత్వంబును
యోగంబునకుఁ బ్రవృత్తింబునకు ధ్యానంబును నవ్యక్తంబునకు సాధుత్వంబును
యోగంబునకుఁ బ్రవృత్తియును జ్ఞానంబునకు నన్న్యాసంబును లక్షణంబులు
లక్షణజ్ఞానంబు పరతత్త్వపరిజ్ఞానంబునకు హేతుభూతంబు.
14_2_158 ఆ.
జ్ఞానపూర్వమైనసన్న్యాసకలనంబు,పరమగతి నొనర్చు భవ్యులార
ద్వంద్వరహితుఁడైనతని జరామృత్యుని,స్తరణకరణమైన ధర్మముందు.
- అన్యక్తనామతత్త్వనిడుపణ ప్రకారము -
14_2_159 సీ.
అన్యక్తనామకం బగుతత్త్వమరయ సలింగంబు పురుషుఁ డలింగుఁ డతఁడు
క్షేత్రంబు నెఱుఁగుట క్షేత్రజ్ఞుఁడనఁ జనుక్షేత్రంబు నాఁగఁబ్రకృతి యనంగ
సవ్యక్తమునకు నామాంతరంబులు గుణప్రభవమాతత్త్వమాప్రభువుగుణము
లెఱుఁగవు చేతనాహీనముల్ గాన యయ్యంతరాత్ముఁడు డత్క్రియానపంచ
ఆ.
మెఱఁగు నిట్టు లగుట యెఱిఁగి గుణమ్ముల,విడిచి నిలిచి తత్త్వవేది యంత
రాత్మవేశమున ననచలనిరామయా,వ్యయసవంబు నందు ననఘులవర.
14_2_160 వ.
అని వెండియు.
14_2_161 సీ.
జ్యోతిస్సులందు వర్యుఁడు రవి భూతంబులం దగ్ని వరుఁడు విద్యలఁ బ్రధాస
సావిత్రి దేవతాసమితిఁ బ్రజాపతి ఘనుఁడు వేదముల ముఖ్యంబు ప్రణ వ
మనిలచయమ్మునఁ బ్రాణ నుగ్ర్యముఛందములకు గాయత్రి యగ్గలముపశువు
లకు మేటి యజ మఖిలచతుష్పదములకు ధేనువు మిక్కిలి మానవులకు
తే.
బ్రాహ్మణుండు వరిష్ఠుండు పక్షులందు,శ్యేస మధికంబు యజ్ఞావిధానముల హ
తంబుపెద్దయుగములఁగృతంబుమేలు,ధాతువర్తములోన ను తమము పసిఁడి.
14_2_162 సీ.
యన లోషధులలోన నన్నంబు భక్ష్యభోజ్యములందు జలము పేయములలోన
సమారాచలము పర్వతములలోఁ బ్లక్షంబుదరువులలోన నూర్ధ్వంబు దిశల
జాహ్నవి నదులందు సాగరంబు సరస్సులందు గృహస్థత్వ మా మముల
నెక్కు డారయ నెక్కు డేను బ్రజాపతులం వచింత్యాత్మకుండైనయట్టి
తే.
విష్ణుఁ డెక్కుడు నాకంటెవినుఁడు తెలియ.నీశ్వరుఁడు దేవతాపలి కెల్ల నెక్కు
డతఁడు నా నేనసఁగ విష్ణుఁ దనఁగ వస్తు,వొకఁడ మూర్తిత్రయంబుననుల్ల సిల్లు
14_2_163 క.
నెఱయఁ బ్రధానపదార్థము,లెఱుఁగుట పరిబోధమూల మెఱకల కిల్లన్
మెఱుఁ గిడుట మమ్ము మువ్వుర,గుఱుకొనియొకఁడుగ నెఱిఁగికొనుట దలంపన్.
14_2_164 క.
దివసము రాత్రియునుం బొరిఁ,బ్రవర్తనముఁ బొందుచుండు పగిదిని సుఖసం
భవదుఃఖ జననములు జం,తువులకుఁ గలుగు వల దబ్బ దురపిల్లంగన్.
14_2_165 తే.
పొదలుఁ దఱుఁగుటకై పొడ వొదవుఁ బడుట
కై కడను జేరుఁ బాయుట కై జనించుఁ
బొలియుటకునై సుఖంబును బొందు దుఃఖ
మందుటకునై పదార్థము లఖిలములును.
14_2_166 క.
జ్ఞానము సవిశేషస్థితి,దానికి నాశంబు లేదు దానిఁ దెలియుటన్
మానాహంకృతిమమతలు,మానిననిర్మలుఁడు మోక్షమార్గముఁ గాంచున్.
14_2_167 వ.
అని వివరించి విరించి యసమంచితాచారులతోడ నాశ్రమప్రకారంబు లెఱిం
గించెద నని పలికి యిట్లని యుపన్యసించె.
14_2_168 సీ.
గురునకుఁ బ్రియహితకరుఁడయి వేదాధ్యయన మొనరించుచు నశన మమల
భిక్ష నొనర్చుచు బిల్వపలాశదండములలో నొకటి ధార్యముగఁ జేసి
స్నానశీలుఁడు బ్రహ్మచర్యపరుండును నియమితేంద్రియుఁడును నిత్యశుచియు
యజ్ఞోపవీతియు నబహుభాషియు మేఖలాఢ్యుండు నైశయనాసనప్ర
తే.
చారవిధములు సముచితా చరితములు గ,సత్యధర్మనిరూఢుఁడై శాంతి గలిగి
వేల్మియిరుప్రొద్దు నడపుచుఁ గల్మషంపుఁ,బనుల కెలయకవర్తించుబ్రహ్మచారి.
14_2_169 సీ.
అర్హప్రకారసమావర్తనుండయి నిజదారనిరతుండు నిర్మలప్ర
చారుండుఁ బంచయజ్ఞపరుండు నతిథిశిష్టాశియు శుక్లవస్త్రాన్వితుండు
శక్త్యనుగుణదానశాలియి నచపలేంద్రియుఁడును శుచియు మైత్త్రీపురుండు
స్ఫాధ్యాయశీలుండు సద్వ్రతనిష్ఠుండు నై యాజనంబు నధ్యాపనంబు
ఆ.
శక్యమైనఁ జల్పి క్షమ గల్లి సత్ప్రతి,గ్రహ మొనర్చి మిత్త్రులహితు లనక
మాటకార్యమునను మధ్యస్థుఁడై గృహ,స్థుండునడచు దురితదూరుఁ డగుచు.
14_2_170 సీ.
గ్రామంబు దొఱిఁగి యరణ్యస్థలంబునఁ
బర్ణశాలావాసపరత నొంది
స్నానతంత్రము రెండుసంధ్యల నడపుచు
బ్రహ్మచర్యవ్రతభాసి యగుచుఁ
బూరిపంటలు ఫలంబులు మూలములు శాక
సముదయంబును నశనముగఁ గొనుచు
నజినంబు వల్కల మంబరంబుగఁ గొని
శయనకృత్యంబు భూస్థలి నొనర్చి
తే.
యతిథులకు నెడ మిచ్చి యాహారములను
భక్తినాత్మీయములలోనఁ బంచి పెట్టి
యధ్యయనహోమశీలుఁడై యన్నియింద్రి
యముల గెలిచి వానప్రస్థుఁ డతిశయిల్లు.
14_2_171 క.
ఈమూఁడాశ్రమములలో,నేమిట వర్తించువార లేనియు ముక్తిం
గామించినఁ జొరఁ దగు వి,ద్యామూలాచారమైన యత్యాశ్రమమున్.
14_2_172 సీ.
సర్వభూతదయానుషంగంబు గలిగి యతీతవస్తువులఁ జింతింప కెదన
నాగతంబులమీఁద నాససేయక వర్తమానలబ్ధము లుపేక్షానిరూఢిఁ
గూర్చు చంగంబులఁ గూర్మమెట్లట్ల యింద్రియముల లోనికిఁ దిగిచికొనుచు
సముచిత కాలభిక్షాచర్యదొరకొన్న యంతన నిజదేహయాత్ర నడపి
తే.
గ్రాస మాచ్ఛాదనంబు దక్కంగ నెవ్వఁ డర్థి నెయ్యది యిచ్చిన నంద కేక
వారభోజి యగుచునమస్కారసఖ్య,నుతినిరాకృతిసహితుఁడై యతివెలుంగు
14_2_173 క.
అనసూయయు నక్రోధం,బును దమమును బ్రహ్మచర్యమును ఋజుభావం
బును సత్యంబు నపైశున,మునహింసయుఁ జూరె యతికి ముఖ్యవ్రతముల్.
14_2_174 తే.
వృక్షమూల నదీతీర విజననిలయ,విపిన గిరిగుహానిత్యవివిక్తదేవ
సదనవాసియైకౌటిల్య సాధ్యవస్తు,సంచయనములుడిగి యతి సంచరించు.
14_2_175 క.
తనమేలు ప్రకాశింపక,తనుఁ గనుఁగొనునట్టి జను లుదాసీనతమై
నునికికిఁ దగియెడుచందం,బున వర్తించుయతి సర్వము క్తత నొందున్.
14_2_176 వ.
అని యెఱింగించి మఱియును.
14_2_177 సీ.
సన్న్యాస మనఁ దపశ్చరణంబు పేరు తపోజ్ఞానముక్తిప్రబుద్ధులైన
జనము లచింత్యం బజర మమృతంబు నా వెలుఁగుతత్త్వము గండ్రు వీతతామ
సము నవధూతరాజసమునై శుద్ధసత్త్వాశ్రయం బగు హృదయంబు గలుగు
వారు తపోవృత్తి వలన సుక్షేమమార్గంబున నడతు రేకత్వశోభి
తే.
మహితనానాత్వ మనఁగ సమ స్తభూత
సముదయస్థమై యున్న తత్త్వము ప్రకాశ
మగుట నఖిలగతులఁ దోఁచు నవ్విధంబు
గలుగు బుధుఁడు నిర్ద్వంద్వుఁడై కాంచు ముక్తి.
14_2_178 వ.
అవ్యక్తప్రభవంబును బుద్ధిస్కంధంబును నహంకారవిటపంబును మహాభూ
తోపశాఖంబును నింద్రియకోటరంబును సంతతాశాపల్లవంబును శూభాశుభ
ఫలంబును నై సంసారవృక్షం బొప్పు చుండు.
14_2_179 క.
జ్ఞానాసి నది నఱకి యభి,మానాహంకార దూరమతి యగుపురుషుం
డానంత్యము ప్రస్ఫుటముగఁ,గానంగా నేర్చు విగతకల్మషులారా.
14_2_180 ఆ.
నిమిషమైనఁ బరమనియతి నాత్ముని నాత్మ
యంద కనినఁ దెలివు నారఁ బడసి
బోధమహితమునుల పొందునవ్యయగతిఁ
బొందఁ గండ్రు ప్రకృతి పొందు దొఱఁగి.