Aswamedhaparvamu - 14_2_61 - 14_2_90

5 views
Skip to first unread message

Prakash Swaminathan

unread,
Aug 13, 2010, 11:04:11 PM8/13/10
to Andhramahabharatam
14_2_61 వ.
అట్టి దవ్విపినంబు.

14_2_62 ఆ.
మాననీయనియతిమహితతపోధన,వంతు లైన యట్టివారు శాంతి
దాంతినిస్స్పృహతలు దలకొన సుసమాహి,తాత్ములై వసింతు రందు సాధ్వి.

14_2_6౩ వ.
అని చెప్పి మఱియును.

14_2_64 సీ.
వినుము మార్కొనఁ జవిగొన దర్శనస్పర్శనము లాచరింప వినంగ నెలయ
నేమిసంకల్పంబు నెడఁ జేర్ప నిష్టార్థ ములను ననిష్టార్థములను గోరు
టయును నొల్లకత్రోచుటయును స్వభావకృత్యములవిగనుఁగొంచు నబల వానఁ
బొరయ నెట్లన్నమేల్ దొరకొనుఁ గోరికయును బోదు కీడు ద్రోచినను దీని

తే.
నెఱిఁగి యేను స్వభావంబునెడఁ బయోజ,పత్త్రగతజలబిందువుభంగిఁ దాల్తు
నని యెఱింగించి బ్రాహ్మణుఁ డతివతోడ,మఱియు నిట్లను శాత్రవమథనకల్య

14_2_65 వ.
ఒక్కయెడ నధ్వర్యునకు యతికిం గలిగినసంవాదంబు సెప్పెద నాకర్ణింపు ను
ధ్వర్యుండు పశువుం బ్రోక్షించు చుండ యతి నిరీక్షించి యిది హింస గాదే
యనిన నతండు.

14_2_66 తే.
ఛాగ మిది యరయంగ నాశంబుఁ బొంద,దూర్ధ్వలోకసుఖంబులనొందుఁగాని
శ్రుతులవాక్యముల్ నీకెక్కసూనృతంబు,లగునయేని నీవిట్లంట యనుచితంబు.

14_2_67 వ.
అని వెండియు నప్పశువు నుద్దేశించి.

14_2_68 క.
భూతములు నింద్రియంబులు,నాతతగుణ యాత్మయోనులందుఁ గలయఁ బిం
డేతరుఁ డగుజీవుఁడు సౌ,ఖ్యాతిశయం బొందు నధ్వరాతిశయమునన్.

14_2_69 క.
అని పలుకుటయును యతి యి,ట్లని ఛాగము పుణ్యగతికి నరిగెడుఁ బో యి
ప్పని నీ కెవ్విధముప్రయో,జనంబు సిద్ధించుఁ జెపుమ సమ్యక్ఫణితిన్.

14_2_70 వ.
అనుటయు నధ్వర్యుం డతని కిట్లనియె.

14_2_71 క.
ఆగమము పశువిధిం దగ,యాగ మొనర్చినఁ ద్రివిష్టపానేకమహా
భోగానుభూతిభన్యస,మాగమ మది యనుట బొంకె యాగమ వేదీ.

14_2_72 చ.
అనవుడు హింస పాప మని యాగమవాక్యము లంద కాదె యేఁ
గని యిటు లంటి నన్న యతిఁ గన్గొని నీవు సమాధిఁ బ్రాణరో
ధనము మనోలయంబు సుకృతంబులు గా నొనరించి వెండి యో
గనిరతిఁ బొందెదత్తెఱఁగు గా దొకొ హింస దలంచి చూడఁగన్.

14_2_73 వ.
అని పలికిన నయ్యధ్వర్యునకు నయ్యతిముఖ్యుం డిట్లనియె.

14_2_74 చ.
పరమతపంబు గాఢపరిపాకము నొందినఁ జిత్సుఖాత్మకా
క్షరము నచిత్తభూతగుణజాలతనున్ క్షరమున్ వివేకితా
పరిణితిఁ బాపి చూచి యనపాయసుఖస్థితి నూఁది పొల్లలం
బొరయక త్రోపు హింస యనుబుద్ధి విమూఢత గాక బోధమే.

14_2_75 చ.
అనవుడు నాతఁ డార్యవచనామృత మానినవాఁడు గీడు మేల్
గనుఁగొనఁజాలు నేను బశుకార్యమునప్పుడు మీ రనుగ్రహిం
చినక్రియఁ జూడ నేర్తుఁ జిదచిద్ద్వయమున్ విభజించి దానహిం
చిన క్రియఁ జూడ నేర్తుఁ జిదచిద్ద్వయమున్ విభజించి దానహిం
సనము నొకింతయుం బొరయ జన్నము సేయుదు మేలు నొందుదున్.

14_2_76 క.
అనుటయు నతనికి యతి యి,ట్లనుఁ బశుయజ్ఞమునకంటె ననఘ తపోయ
జ్ఞనిరూఢి మేలు గావున,వినిపింపఁ దలంచి యంటి వేయును నేలా.

14_2_77 వ.
అనవుడు నమ్మాటకునయ్యధ్వర్యుండొడంబడియె నని చెప్పి యాభూసురవర్యుం
డాభామినితో నీయర్థంబున కొక్కయితిహాసంబు గల దాకర్ణింపుము సహస్ర
బాహుండగునర్హునుండు దుర్జయప్రతాపంబున నఖిలద్వీపంబులు నేలి వ్రాలి
తనకు నెదురు లేకున్న విజృంభించి పరశురాముం దొడరి యతనికి నత్యంతంబ
ప్రియం బాచరించిన నతండు బహుశాఖోపశాఖాశోభితంబయినపాదపంబు
నుఱుముగా నఱకి పడవై చినచందంబునం బరశుఖండితసర్వాంగునింజేసెనంత
నిలువక తత్పక్షంబురాజులుం గూడికొని తదీయతనయులుం దారు నారాముని
యసన్నిధి నదనిజనకుం డగుజనుదగ్నింజంపినం బెంపారుకోపంబున నాటోపం
బెసంగ నాజామదగ్న్యుండు రాజుల నెల్లం దర మిడి యిరువదియొక్కమాఱు
పరశుధారపాలు చేసిన నతనికిఁ బితృదేవతలు సన్నిధి సేసి.

14_2_78 ఆ.
పరశురామ నీవు బ్రాహ్మణుండవు నరే
శ్వరులఁ జంప నేల వలవ దుడుగు
మయ్య యనుడు నాతఁ డట్లని కుండుఁ డీ
రేను రాజపశువిధానమునను.

14_2_79 క.
సారనియతిఁ బాటించి మ,హారోషాగ్ని పరితృప్తమగూనట్టులు గా
వీరాధ్వరంబు సేసెద,వారింపక యరుగుఁ డనిన వా రాతనితోన్.

14_2_80 క.
యజ్ఞంబులలోనఁ దపో,యజ్ఞం బుత్తమము దాని నాదరణమునం
బ్రాజ్ఞోత్తమ చేయుము స,ర్వజ్ఞుఁడు ప్రీతుఁ డగు శాంతరస మొప్పుఁ జుమీ.

14_2_81 వ.
అని చెప్పి మఱియు నిట్లనిరి తొల్లి యలర్కుం డనురాజు మనస్స్పృష్టంబు
లగునింద్రియంబుల కలిగి దివ్యాస్త్రంబులు ప్రయోగింపం జూచిన నవి
యయ్యవనిపతితో నయ్యస్త్రంబులం దారు సెడ మనియును రోషావేశంబునం
బ్రయోగించిన నతండ చెడు ననియునుం బలికి యోపుదేని నీతపామయంబు
లైనయస్త్రంబులు సంధింపు మనిన నతండు క్రోధంబుదక్కి యోగంబున శాంతి
నొంది వానిం దద్రూపతపఃఫలాస్త్రసాధితంబులం జేసె నీవునుం దపంబున
నంతశ్శత్రుజయసౌఖ్యం బనుభవింపుము బాహ్యశత్రుజయంబు జయంబుఁగాఁ
గొనకుము.

14_2_82 క.
అని నిష్ఠించి పలుక న,వ్వినుతచరిత్రుండు శాంతివిభవంబున నూ
నినమనుతోడ మునిమా,ననపాత్రం బైనతపమునన మే లొందెన్.

14_2_83 సీ.
అని చెప్పి బ్రాహ్మణుం డయ్యింతి కిట్లనుఁ దొమ్మిదిగుణములు గొమ్మ కలవు
స్తంభాతిమానహర్షంబులు సాత్త్వికములు క్రోధసంరంభములును శోక
మును రాజసంబులు మోహతంద్రాస్వప్నములుదామసములిట్లుగలుగురిపులఁ
దునుమ సేయస్త్రంబు లను వగు వాన నయ్యంతరశత్రుచయంబు నెల్లఁ

తే.
దునిమి యేనింద్రియంబుల మనము నోర్చి
శాంతి నొంది శ్రేయస్సిద్ధిసాధనుం బొ
నర్చునది ముఖ్యవైరినిర్ణయముఁ జేయు
నంబరీషగీతలు విను మంబుజాక్షి.

14_2_84 వ.
అంబరీషుం డనురాజు రాజనీతిపరత్వంబునం బరమప్రభుత్వంబు నొంది య
రాతుల నెల్ల విగతాసులంజేసి పూజ్యం బగురాజ్యంబు పరిపాలించు చుండి
యొక్కనాఁడు విద్వజ్జనంబులతో నిట్లనియె.

14_2_85 తే.
అరులనెల్లజయించియు నది జయంబు,గాఁగొనక యున్నవాఁడనగ్గలపుఁబగ
యింపకున్కిఁ దద్విజయవిహీనుఁ దృష్ట,జనిజరామృత్యువశగవర్తనునిఁ జేయు

14_2_86 క.
అంతటిలోభము గెలువక,శాంతి గలదె యని తదీయశక్తి నడచి ని
శ్చింతత్వ మొంది యాభూ,కాంతుఁడు సామ్రాజ్యమున సుఖస్థితి వడసెన్.

- జనకునకు విప్రరూపధరుం డైనయమునితో నైనసంవాదము -

14_2_87 వ.
అని వెండియు నవ్విప్రుం డిట్లను జనకచక్రవర్తికి నొక్కబ్రాహ్మణునకుం గలి
గిన సంవాదంబు సెప్పెదనాకర్ణింపుము జనకుండు దనకట్టెదుర బ్రాహ్మణుండు
గొఱగామి సేసిన నతనితో నీవు నావిషయంబున వసియింప వలదు పొమ్మని
నతండు.

14_2_88 క.
నీవిషయ మెంతవట్టది,యే విని పరవిషయమునకు నేఁ గెదఁ దెలియం
గా వినిపింపు మనుడు నా,భూవల్లభుఁ డూర కుండెఁ బుణ్యచరిత్రా.

14_2_89 ఆ.
ఊర కుండి మూర్ఛనూని యొక్కింతనే,పునకుఁ దేఱి యిట్టు లనియె నాదు
తాతతండ్రితరము ధరణి నుద్వశ్యత,నుండ నాకు మమత యొలయ దందు.

14_2_90 వ.
మిథిల నెప్పుడు వసియించెద నిప్పురంబును మదీయం బని యంగీకరింపంబడద
కావున నిది నావిషయం బన లేమింజేసి మున్ననీతో నాడినమాటం బుట్టినవ
పెంపున మూర్ఛవచ్చె ననిన విని యవ్విప్రుం డాభూవిభునాననం బాలోకించి.

Reply all
Reply to author
Forward
0 new messages