వ.నామనంబుసందియంబుఁ బాపవే యనినం గపిలుం డమ్మహాద్విజునితో వేదంబుల నేల
కైకొన కుండ వచ్చు నవియ చూవె లోకంబులకుం 1బ్రమాణంబు లనిపలికి యిట్లనియె.
1. బ్రామాణ్యం బని.
_____________కపిలుఁడు స్యూమరశ్మికి వేదంబులు ముఖ్యప్రమాణంబులుగాఁ
జెప్పుట._________
12_5_332
క.అరయంగా శబ్దంబును, బరంబు నన రెండు సూవె బ్రహ్మములు గుణో
త్తర శబ్దబ్రహ్మభజన, పరుఁడు పరబ్రహ్మమహితపదముం బొందున్.
12_5_333
క.మనమున నెద్దియుఁ గోరం, డనసూయయు శమము దమము నతులఙ్ఞానం
బును గలగృహపతి ధర్మం, బని నడపును వేదచోదితాచారములన్.
12_5_334
క.భూతదయయు ననహంకా,రాతిశయముఁ గలుగువిమలుఁ డప్రాయశ్చి
త్తాతురుఁడు సూవె విధులు సు,నీతము లైనను ధృఢాత్మనిష్ఠకతమునన్.
12_5_335
క.విను శాంతు లైనవిప్రులు, మనుజేంద్రులు గృహమునంద మహితవ్రతసం
జనితపరిఙ్ఞాననిరం, జనులై పడయుదురు సూవె శాశ్వతపదమున్
12_5_336
తే.బ్రహ్మచర్యాదు లగునాల్గుఁ బాదమహిమ
గాఁగఁ బరఁగెడు ధర్మ మొక్కటియ చూవె
యెవ్వఁ డెందు వర్తించిన నేమి సకల
కర్మఫలరూపకత్వ మొక్కటియ కాదె.
12_5_337
క.సంతోషామృతసుఖిత, స్వాంతుం డగు నేని నట్టివాఁడు గృహంబుం
గాంతారదేశమును నొ,క్కంతగ నిశ్చింతవృత్తి నక్షోభ్యుఁ డగున్.
12_5_338
క.విను తృష్ణారాహిత్యం, బున నాలవునాశ్రమంబుఁ బొందుదురు మహా
జను లది యుపనిషదుక్తం, బనక యవైదిక మనంగ నగునే నీకున్.
12_5_339
క.ఙ్ఞానము ధర్మమున కధి,ష్ఠానము మూలంబు పరమసంతోషము భ
వ్యానూనత్యాగము రూ,పానందము ప్రాఁకు దాని కను వేదంబుల్.
12_5_340
క.ఏదియుఁ దలఁప ననేవ్యము, గా దాశ్రమసమితిలోనఁ గావున శుచులై
యేదాన నున్న సంసా, రోదధియాదరికిఁ బోవనోపుదురు బుధుల్.
12_5_341
క.సంతోషంబున నేగతి, శాంతాత్మున కొదవు దాని సద్గతిగా వే
దాంతవిదులు గొనియాడుదు, రింత నిజము దీని నీవు నెఱుగు మనింద్యా.
12_5_342
తే.వేదతాత్పర్య మారసి వేదితవ్య, మెఱుఁగువారలు వేదఙ్ఞు లిట్లు గాని
వారు వేదపాఠకులు సర్వంబు నరయ, వేదపరినిష్ఠితము సూవె విప్రవర్య.
12_5_343
క.త్యాగ మొకనెలవు శమసం, యోగం బుత్తరము దాని కూర్ధ్వము సంతో
షాగమము మోక్షలాభో,ద్యోగికి నివి గమ్యభూము లుత్తమధిషణా.
12_5_344
వ.అని యిట్లుపదేశించి.
12_5_345
సీ.వేదితవ్యం బన విదితంబు నా ఋతం, బనఁగ సత్యం బన నతిశయిల్లి
సంభృతస్థావరజంగమం బనఁగ స,ర్వాత్మకం బన శుభం బనఁగ వెలసి
యవ్యక్త మనఁగ బ్రహ్మంబు నా నుత్తర, మనఁగ శివం బన వినుతి కెక్కి
1ప్రభవం బనంగ నప్యయ మన శాంతి నాఁ, దేజంబు నా నెందుఁ దేజరిల్లి
తే.క్షమ యనఁగ నంబరం బనఁగా ధ్రువంబు, నా ననామయ మన నొప్పి లీనరూప
బుద్ధిసంప్రాప్యమగుతత్త్వమునకు వేద, మానితబ్రాహ్మణులకు నమస్కరింతు.
1.వైభవంబనఁగ నవ్యయమన.
12_5_346
వ.అని పలుకుటయు స్యూమరశ్మి ప్రీతుం డగుచుఁ గపిలునిం బ్రశంసించె
నియ్యితిహాసంబు తాత్పర్యంబు నీవుం గనికొను మని చెప్పినం దద్దయుఁ బ్రియం
బంది ధర్మనందనుండు ధర్మార్థకామంబులు మూఁడును 2వేదశంసితంబులు వీనిలో
నెద్దానిలాభంబున విశేషంబు గలిగియుండు నెఱింగింపవే ననిన గాంగేయుండు
గుండధారుం డనువాఁడు నిజభక్తున కుపకారంబు సేసిన ప్రకారం బితిహాసరూపంబునం
బ్రవర్తిల్లు నది భవత్ప్రశ్నంబునకు నుత్తరంబై యుండు వినుం చెప్పెద నని
యప్పుడమిఱేని కిట్లనియె.
2.వేదశాసితంబులు.
________________కుండధారుం డనుదేవానుచరునివృత్తాంతము._______
12_5_347
సీ.యఙ్ఞార్థ మొక్క బ్రాహ్మణుఁడు ధనార్థియై,తపము సేయఁగఁ గుండధారుఁ డనఁగఁ
పరఁగెడు దేవానుచరుఁ డచ్చటికివచ్చి, యభిలాష మేరూప మనుడు నర్థ
సిద్ధి గోరెద నని చెప్పినఁ బ్రీతి నా,తఁడు మాణిభద్రుని ధనదభృత్యు
నియతిఁ దలంప సన్నిధి సేసె నయ్యక్షుఁ, డతఁడు మదాశ్రితుండైన యితని
తే.ధనసమగ్రునిఁ జేయవే యనిన నెంత, ధనము వలసిన నిచ్చెద ననియె మాణి
భద్రుఁ డమ్మహాత్ముఁడు మర్త్యభావ మస్థి,రత్వదూషిత మనువిచారంబు వుట్టి.
12_5_348
క.ధన మేటికి నీవిప్రుని, మన మొలయఁగ వలయు ధర్మమార్గంబున దా
నన సర్వసంపదలు నగు, నని నిశ్చయ మొంది వినయ మతిశయమొందన్.
12_5_349
ఆ.యక్షవరునితోడ నవ్విచారము మృదు,వచనరచనఁ జెప్ప వాఁడు దాని
కాత్మఁ బ్రీతిఁ బొంది యనుమతి సేయంగ, నధికభక్తినిరతుఁడై యతండు.
12_5_350
క.దేవతలను బ్రార్థించిన, నావసుధామరునిచిత్త మాప్రొద్ద తప
స్సేవనతత్పర మగుడు, న్ దేవానుచరునకు నిట్లనియె నతఁ డధిపా.
12_5_351
క.అనఘా భవదీయదయ, న్మనంబు దెలి వొందె నిపుడు నాకే నొల్లన్
ధనము తపంబ యొనర్పఁగ, ననుఙ్ఞ సేయంగ వలయు నాదరణమునన్.
12_5_352
ఆ.అనిన నట్ల కాక యాచరింపుము ధర్మ, మనుచు నరిగె నిర్జరానుచరుఁడు
భూసురుండు మూలములును బత్త్రములు నా,హారములుగఁ జేసె నధికతపము.
12_5_353
క.క్రమమున జలపవనము లశ,నములు గఁ గొని తపము సేసినం గాయముఁ జి
త్తము మానుషంబు లగుచం,దములు విడిచి దివ్యమహిమధామము లయ్యెన్.
12_5_354
వ.అట్లు సిద్ధుం డగుటయు.
12_5_355
క.నను నెవ్వ రాశ్రయించిన, ధన మొసఁగుదు రాజ్య మిత్తుఁ దద్దురితములం
దునుముదు ననునగ్గలికలు, మనమున జనియింపఁ జొచ్చె మనుజాధీశా.
12_5_356
వ.అవ్విధంబున మహానుభావుం డై.
12_5_357
తే.ఆతఁ డతిభక్తిఁ దలఁచె దేవానుచరుని, నపుడ యక్కుండధారుఁడు నరుగుదెంచె
నరుగుదెంచిన నతఁడు నిజానుభావ, జనితగంధపుష్పములఁ బూజన మొనర్చి.
12_5_358
ఉ.చక్కఁగఁ జాఁగి మ్రొక్కుటయుఁ జయ్యన నెత్తి మనం బెలర్పఁ గా
నక్కునఁ జేర్చి యిట్లనియె నద్దివిచానుచరుండు శంక దాఁ
దక్కి ధనంబుఁ గామమును ధర్మముతోఁ గలయంగ నెన్నునే
యక్కట యిట్లు వేద మవి యప్పురుషార్థము 1నోలి మే లగున్.
1.నూఁద.
12_5_359
వ.అని ధర్మం బగ్గించి.
12_5_360
క.2ఆసుకృతము గడయెయ్ది మ,హాసత్త్వాయోగసేవనారామత ను
ద్భాసితుఁడ వగుచు 3నిష్ఠా, వ్యాసంగవిహారి వగు మనామయలీలన్.
2.నాసుకృతము. 3.నిష్టవ్యాసంగ.