మూలం: ఆంధ్ర భారతి. http://www.andhrabharati.com/itihAsamulu/bhAratamu/virATa.html
Of course, needs editing per the group/wiki standards.
Total poems count: 336+365+239+277+407=1624.
వసు.
------------------------------------------------------------------------------------------------------------------------------
విరాటపర్వము - ప్రథమాశ్వాసము
1 ఉ.
శ్రీయన గౌరి నాఁ బరఁగు చెల్వకుఁ జిత్తము పల్లవింప భ
ద్రాయితమూర్తియై హరిహరం బగురూపము దాల్చి విష్ణురూ
పాయ నమశ్శివాయ యని పల్కెడు భక్తజనంబువైదిక
ధ్యాయిత కిచ్చ మెచ్చుపరతత్వ్తముఁ గొల్చెద నిష్టసిద్ధికిన్.
కృతినిర్మాణప్రస్తావన.
2 వ.
అని సకల బ్రహ్మప్రార్థనంబు సేసి తత్ప్రసాదాసాదితకవిత్వతత్వ్తనిరతిశయాను
భావానందభరితాంతఃకరణుండ నగు చుండి యొక్కనాఁ డి ట్లని వితర్కించితి.
3 శా.
విద్వత్సంస్తవనీయభవ్యకవితావేశుండు విజ్ఞానసం
పద్విఖ్యాతుఁడు సంయమిప్రకరసంభావ్యానుభావుండు గృ
ష్ణద్వైపాయనుఁ డర్థిలోకహితనిష్ఠం బూని కావించె ధ
ర్మాద్వైతస్థితి భారతాఖ్య మగులేఖ్యం బైన యామ్నాయమున్.
4 క.
వేదములకు నఖిలస్మృతి, వాదములకు బహుపురాణవర్గంబులకున్
వా దైనచోటులను దా, మూదల ధర్మార్థకామమోక్షస్థితికిన్.
5 వ.
అదియును;
6 ఉ.
ఆదరణీయసారవివిధార్థగతిస్ఫురణంబు గల్గి య
ష్టాదశపర్వనిర్వహణసంభృత మై పెను పొంది యుండ నం
దాదిఁ దొడంగి మూఁడుకృతు లాంధ్రకవిత్వవిశారదుండు వి
ద్యాదయితుం డొనర్చె మహితాత్ముఁడు నన్నయభట్టు దక్షతన్.
7 మ.
హృదయాహ్లాది చతుర్థ మూర్జితకథోపేతంబు నానారసా
భ్యుదయోల్లాసి విరాటపర్వ మట యుద్యోగాదులుం గూడఁగాఁ
బదియేనింటిఁ దెనుంగుబాస జనసంప్రార్య్థంబు లై పెంపునం
దుది ముట్టన్ రచియించు టొప్పు బుధసంతోషంబు నిండారఁగన్.
8 క.
అని రచనాకౌతుకమున, మన మలరఁగ నీప్రబంధమండలి కధినా
థునిగా నేపురుషునిఁ బే, ర్కొనువాఁడనొ యనుతలంపు గూరినమదితోన్.
9 వ.
ఇంచుక నిద్రించుసమయంబున.
10 సీ.
మజ్జనకుండు సమ్మాన్యగౌతమగోత్ర, మహితుండు భాస్కరమంత్రితనయుఁ
డన్నమాంబావతి యనఘులు కేతన, మల్లన సిద్ధనామాత్యవరుల
కూరిమితమ్ముండు గుంటూరివిభుఁడు కొ,మ్మనదండనాథుండు మధురకీర్తి
విస్తరస్ఫారుఁ డాపస్తంబసూత్రప,విత్రశీలుఁడు సాంగవేదవేది
11 తే.
యర్థిఁ గల వచ్చి వాత్సల్య మతిశయిల్ల, నస్మదీయప్రణామంబు నాదరించి
తుష్టి దీవించి కరుణార్ద్రదృష్టిఁ జూచి, యెలమి ని ట్లని యానతి
యిచ్చెనాకు,
12 వ.
“కి మస్థిమాలాం కిము కౌస్తుభం వా, పరిష్క్రియాయాం బహుమన్యసే త్వమ్। కిం
కాలకూటః కిము వా యశోదా, స్తన్యం తవ స్వాదు వద ప్రభో మే॥” యని నీవు దొల్లి
రచియించినపద్యంబు గాఢాదరంబున నవధరించి భక్తవత్సలుం డగు హరిహరనాథుండు
నీదెస దయాళుండై యునికింజేసి నిన్నుం గృతార్థునిఁ జేయం గార్యార్థి యయి
నాకలోకనివాసి యయిననాకుఁ దనదివ్యచిత్తంబునం గలయక్కారుణ్యంబు తెఱం
గెఱుంగునట్టిశక్తిం బ్రసాదించి నన్ను నాకర్షించి కొలిపించికొని వీఁడె
విజయంచేయుచున్నవాఁ డనుచుం జూపుటయు సవిశేషసంభ్రమసంభరితహృదయుండ నయి
యవ్వలనుం గనుంగొనునప్పుడు,
13 సీ.
కరుణారసము వొంగి తొరఁగెడుచాడ్పున, శశిరేఖ నమృతంబు జాలువాఱ
హరినీలపాత్రిక సురభిచందన మున్న,గతి నాభి ధవళపంకజము మెఱయ
గుఱి యైన చెలువున నెఱసినలోకర,క్షణ మన గరళంబుచాయ దోఁపఁ
బ్రథమాద్రిఁ దోఁతెంచుభానుబింబము నా ను,రమ్మునఁ గౌస్తుభరత్న మొప్ప
తే.
సురనదియును గాళిందియు బెరసినట్టు, కాంతిపూరంబుశోభిల్ల శాంతమూర్తి
నామనంబు నానందమగ్నముఁగఁ జేయ, నెలమి సన్నిధి సేసె సర్వేశ్వరుండు.
13 వ.
ఏనును భక్తిమయం బగుసాష్టాంగదండప్రణామం బాచరించి కొండొక దొలంగి
వినయావనతుండ నై లలాటోపరిభాగంబున నంజలిపుటంబు ఘటించి నయనంబులు నవయవంబులును
బ్రమదబాష్పసలిలవిలులితంబులును బులకపటల పరికలితంబులునుం గా నంతంత నిలిచిన
నద్దేవుండు.
14 క.
అనుకంపాతిశయంబునఁ, దనదక్షిణనేత్రమును సుధారోచియ కా
నను వింత లేక చూచి వ, దనమున దరహాసరసము దళు కొత్తంగన్.
15 ఉ.
వైదికమార్గనిష్ఠ మగువర్తనముం దగ నిర్వహించుచు
న్భేదము లేనిభక్తి మది నిర్మలవృత్తిఁగఁ జేయు చుండ మ
త్పాదనిరంతరస్మరణతత్పరభావముకల్మి నాత్మ స
మ్మోదముఁ బొందఁ గావ్యరసముం గొనియాడుచు నుండు దెప్పుడున్.
16 వ.
అందును,
17 క.
పారాశర్యునికృతి యయి, భారత మనుపేరఁ బరఁగుపంచమవేదం
బారాధ్యము జనులకుఁ ద, ద్గౌరవ మూహించి నీ వఖండిత భక్తిన్.
18 తే.
తెనుఁగుబాస వినిర్మింపఁదివురు టరయ, భవ్యపురుషార్థతరుపక్వఫలముగాదె;
దీని కెడ నియ్యకొని వేడ్కమాని కృతిప, తిత్వ మర్థించి వచ్చితిఁ
దిక్కశర్మ.
19 వ.
అనిన నద్దివ్యవచనామృతంబు నాయుల్లంబున వెల్లిగొనినఁ బునఃపునఃప్రణామంబు
లాచరించి యప్రమేయప్రభావభావనాతీతుం డయ్యును నప్పరమేశ్వరుం డాశ్రితులకు
నత్యంతసులభుం డని బుధులవలన విని యునికింజేసి ననుబోఁటిబాల స్వభావునకు
నిట్టిమహనీయమహిమ దొరకొనుటయుం గలుగున కాక యని తలంచుచు నవ్విభునకు
విన్నపంబు సేయువాఁడనయి కొమ్మనామాత్యునాననం బాలోకించి తదనుమతి వడసి
యిట్లంటి.
20 క.
భూరిభవత్కారుణ్య, క్షీరాంబుధి నాదుతుచ్ఛచిత్తంబున వి
స్తార మహితముగ నునిచితి, వారయ నచ్చెరువు గాదె యఖిలాండపతీ.
21 ఉ.
ఇంతకు నేర్చునీకు నొకయింతటిలోన మదీయవాణి న
త్యంతవిభూతిఁ బెం పెసఁగునట్టినినుం గొనియాడఁ జేఁత దా
నెంతటిపెద్ద నీకరుణ నిట్లు పదస్థుఁడ నైతి నింక జ
న్మాంతరదుఃఖముల్ దొలఁగునట్లుగఁ జేసి సుఖాత్ముఁ జేయవే.
22 వ.
అని యుపలాలితుం డగుడింభకుండు దనకొలంది యెఱుంగక మహాపదార్థంబు వేఁడువిధంబున
బ్రహ్మానందస్థితిం గోరి సర్వాంగాలింగితమహీతలం బగు నమస్కారంబు సేసిన
నజ్జగన్నాథుండు.
23 తే.
జననమరణాదులైనసంసారదురిత,ములకు నగపడ కుండంగఁదొలఁగు తెరువు
గను వెలుంగు నీ కిచ్చితిననిన లేచి, నిలిచి సంతోష మెద నిండ నెలవుకొనఁగ.
24 వ.
మేలుకాంచి,
25 క.
ఎలమియు నచ్చెరువును సరి, నెలసి పొదలుమానసమున నెంతయుఁ బ్రొద్దేఁ
గలలోనఁ గన్నచందము, దలఁచుచు నుండితిని భక్తితాత్పర్యమునన్.
26 వ.
తదనంతరంబ,
26
ఉ.
ఇట్టిపదంబు గాంచి పరమేశ్వరునిం గృతినాథుఁ జేసి యే
పట్టునఁ బూజ్యమూర్తి యగుభారతసంహితఁ జెప్పఁ గంటి నా
పుట్టుఁ గృతార్థతం బొరసెఁ బుణ్యచరిత్రుఁడ నైతి నవ్విభుం
గట్టెదఁ బట్ట మప్రతిమకారుణికత్వమహావిభూతికిన్.
27
ఉ.
కూర్చుట నూత్నరత్నమునకుం గనకంబునకుం దగున్ జనా
భ్యర్చిత మైనభారత మపారకృపాపరతంత్ర వృత్తిమైఁ
బేర్చిన దేవదేవునకుఁ బ్రీతిగ నిచ్చుట సర్వసిద్ధి నా
నేర్చినభంగిఁ జెప్పి వరణీయుఁడ నయ్యెద భక్తకోటికిన్.
28
వ.
ఇది యనన్యసామాన్యాకారం బగుపరమధర్మప్రకారంబు.
29
ఉ.
కావున భారతామృతము కర్ణపుటంబుల నారఁ గ్రోలి యాం
ధ్రావలి మోదముం బొరయునట్లుగ సాత్యవతేయ సంస్మృతి
శ్రీవిభవాస్పదం బయినచిత్తముతోడ మహాకవిత్వ దీ
క్షావిధి నొంది పద్యముల గద్యములన్ రచియించెదం గృతుల్.
30
వ.
అని పూని యీదృశంబు లగుపుణ్యప్రబంధంబులు దేవసన్నిధిం బ్రశంసించుటయు
నొక్కయారాధనవిశేషం బగుటంజేసి.
31
షష్య్ఠంతములు.
క. ఓంకారవాచ్యునకు నన, హంకారనిరూఢభావనారాధ్యునకున్
హ్రీంకారమయమనోజ్ఞా, లంకారోల్లాసనిత్యలాలిత్యునకున్. 32
క. త్రిభువనశుకదృఢపంజర, విభవమహితునకు సమస్తవిష్టపనిర్మో
కభుజంగపతి కఖిలజగ, దభిన్నరూపునకు భావనాతీతునకున్. 33
క. శ్రుతిసీమంతమణికి నా, శ్రితవాంఛాపూర్తికరణచింతామణి కా
నతదురితతమోద్యుమణికిఁ, గ్రతుభూషణమణికి లోకరక్షామణికిన్. 34
క. పరమశమనిరతసంయమి, వరమానస కుముదహాసవర్ధనచంచ
చ్చరణనఖచంద్రికావి, స్ఫురణాచిత్రప్రకారశోభాఢ్యునకున్. 35
క. హరిహరనాథునకు మరు, త్సరిదాకల్పితమనోజ్ఞచరణశిరస్సుం
దరమూర్తికి భావనత, త్పరచేతోయుక్తభక్తపరతంత్రునకున్. 36
కథాప్రారంభము.
వ. ఏను విన్నపంబు సేయుతెఱంగుగా నంతస్సన్నిధిం గలిగించుకొని యమ్మహా
కావ్యంబునర్థంబు సంగతంబు సేసెద. 37
క. శరణాగతసంశ్రితభయ, హరణా సురనికర శేఖరానర్ఘమణి
స్ఫురణాపరిచయరంజిత, చరణా వనమాలికాభుజంగాభరణా. 38
క. అజగవశార్ఙ్గాలంకృత, భుజగర్వనిరస్తదైత్య భూమస్తుత్యా
త్రిజగద్ధారణనిత్యా, భుజగసమాచరితశయన భూషణకృత్యా. 39
క. జలనిధిహిమవద్భూధర, కలితజననకేళికౌతుకవ్యక్తావ్య
క్తలలితసౌందర్యస్ఫుర, దలఘుతనుస్త్రీసనాథ హరిహరనాథా. 40
వ. దేవా దివ్యచిత్తంబున నవధరింపుము. 41
ఆ. కథ జగద్ప్రసిద్ధ గావునఁ బూర్వప, ర్వార్థయుక్తి సేయునట్టియెడల
యత్న మించుకంత యయినను వలవదు, వలసినట్లు సెప్ప వచ్చియుండు. 42
వ. మహాభారతంబు సమస్తదురితాపహంబును నభిమతశుభావహంబునుం గావున నొక్క
మహాఫలంబుగోరి జనమేజయుండు గృష్ణద్వైపాయనమహామునికారుణ్యంబు వడసి
తదీయప్రియశిష్యుం డయిన వైశంపాయనువలన వినినకథ యగుటం జేసి తత్ప్రకారంబు
నడపెద నది యె ట్లనినం బరమపవిత్రు లగుపాండుపుత్త్రులచరిత్రం
బుపాఖ్యానసహితంబుగా వ్యాఖ్యానంబు సేయుచుండ వారలవనవాస సమ్యగనుష్ఠానంబు
సవిస్తరంబుగా విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె. 43
చ. మహితసముజ్వ్జలాకృతులు మానధనుల్ జనమాన్యు లంగనా
సహితము గాఁగ నేమిగతి సమ్యగుపాయనిగూఢవృత్తిమై
నహితుల కప్రభేద్య మగునాపదుమూఁ డగునేఁడు మత్పితా
మహులు చరించి రంతయుఁ గ్రమంబున నా కెఱుఁగంగఁ జెప్పుమా. 44
క. అని యడిగిన వైశంపా,యనుఁ డమ్మనుజేంద్ర చంద్రునధికౌత్సుక్యం
బునకలిమికిఁ దనహృదయం,బున గాఢాదరము భరితముగ ని ట్లనియెన్. 45
వ. పాండవులు వనవాసంబు సముచితంబుగాఁ జలిపి పండ్రెం డగునేఁటికడపటఁ దమకు
ధర్మదేవతాసమాగమం బయినం దత్ప్రసాదంబున నజ్ఞాతవాసంబునకు భంగంబు గాకుండ
వరంబు వడసి యంతకు మున్న తమవెనుక నడవులం దిరుగుచు నగ్నిహోత్రంబులఁ దోడన
కొని వర్తిల్లుభూసురోత్తములు దమ్ముం బరివేష్టించి యుండఁ దా రనుష్ఠింపం
బూనినపని వారల కెఱింగింపం దలంచి కరంబులు మొగిచి సవినయంబుగా ని ట్లనిరి.
46
సీ. తెల్లంబు గాదె మీ కెల్ల సుయోధను, చేసినకుటిలవిచేష్టితంబు
లకట మాతో మీరు నడవుల నిడుమలఁ, బొందితి రొకభంగిఁ బోయెఁ గాల
మిది పదుమూఁ డగునేఁడు మా కజ్ఞాత, వాసంబు సలుపంగ వలయు నిందు
ధార్తరాష్ట్రులు సూతతనయసౌబలులును, జెఱుపన వేతురు చిన్నసన్న
ఆ. యెఱిఁగిరేనిఁ జాల నెగ్గు వాటిల్లు న, ట్లగుట మమ్ము నింక నతిరహస్య
వృత్తిమై నిరస్తవిఘ్నుల రై చరి, యింపుఁ డని యనుగ్రహింపవలయు. 47
వ. అని చెప్పి రట్టిసమయంబున ధర్మనందనుండు విషణ్ణహృదయుం డై. 48
క. ఒకనాఁ డేమును నాపద,లకు విడుమరఁ గాంచి వ్రిపులం జుట్టలఁ బె
ట్టుకొని సుఖముండఁ బడయుదు, మొకొయిప్పాటెందుఁ గలదెయొరు లెవ్వరికిన్. 49
వ. అని డగ్గుత్తిక వెట్టి దుఃఖపరవశుం డగుటయు నమ్మహీసురవరులుం దమ్ములు
నతని నాశ్వాసించు చుండఁ దత్పార్శ్వంబున నున్నధౌమ్యుండు దదీయవిషాదాపనోదంబు
సేయం దలంచి యి ట్లనియె. 50
ధౌమ్యుఁడు పాండవుల నూరార్చుట.
ఉ. ధర్మనిరూపకత్వమున ధైర్యమునన్ మహానీయవృత్తి స
త్కర్మవిధిజ్ఞతం జతురతామహిమన్ దృఢబుద్ధి నెవ్వరున్
ధర్మజుపాటి గా రనఁగ ధాత్రిఁ బ్రసిద్ధుఁడ వైనయట్టినీ
పేర్మికి నీడె దుర్దశలపెల్లునకున్ దురపిల్లు టారయన్. 51
వ. అట్లుం గాక, 52
క. దేవతల కైన నొక్కొక, చో వలయున కాదె శత్రుసూదనవిధికా
లావాప్తికి మును దమస, ద్భావంబు లడంచి యుడుగఁబడి యుండంగన్. 53
సీ. నిషధాద్రియం దనిమిషపతి ప్రచ్ఛన్న, సంచరణమున వ ర్తించుటయును
నదితిగర్భంబున నవతార మై వామ, నాకారమున హరి యడఁగుటయును
జననియూరుప్రదేశంబున నతినిగూ, ఢంబుగా నౌర్వుండు డాఁగుటయును
ధేనుశరీరవిలీనుఁ డై యజ్ఞాత,చర్య మార్తాండుండు సలుపుటయును
ఆ. వినమె యిట్లు పడినవీరలు పదపడి, తమకు నగ్గ మైనతఱి జయింప
రెట్లు ప్రబలి రిపుల నీవును నాపద, కోర్చి భంగపాటు దీర్చికొనుము. 54
క. అనవుడు నప్పలుకులు విని, తనచిత్తముకలఁక దేఱి ధర్మతనూజుం
డనుజన్ములదెసఁ జూచిన, ననిలసుతుం డిట్టు లనియె నాతనితోడన్. 55
మ. భవదాజ్ఞాదృఢబంధసంయమితశుంభద్వేగ మై కాక నాఁ
డవలీలన్ మనయర్జునద్విపము క్రోధావేశదుర్దాంతద
ర్పవిలాసోద్భటభంగి నే పడరి కౌరవ్యాంబుజశ్రేణిఁ జి
క్కువడం జేయదె యెక్కవ్రేల్మిడిన నీకున్ వేడ్క సంధిల్లఁగన్. 56
వ. అనిన విని ధర్మనందనుండు దెలి వొందిన మొగంబుతోడ శిరఃకంపంబు సేసె
నట్టిసమయంబున నవ్వ్రిపు లందఱు నొక్కమొగిన మీతలంపునకు దైవం బనుకూలంబు
గావుత మని పాండుపుత్త్రుల దీవించి పునర్దర్శనం బయ్యెడు మనుచు వీడ్కొని
నిజస్థానంబులకుం జనిరి తదనంతరంబ బాహ్యపరివారం బెల్లను సముచితప్రకారంబున
వీడుకోలు వడసి తమతమపొందుపట్లకుం బోయిన, 57
ఉ. తమ్ములు ధౌమ్యుఁడున్ సతియుఁ దా నరదంబులతోడఁ గ్రోశమా
త్ర మ్మొకచోటి కల్లఁ జని ధర్మతనూభవుఁ డందు నాఁటిరే
యిమ్ములఁ జల్పి వేగుటయు నీప్సితకార్యము సేయఁగా విచా
రమ్మున నున్నచో నమరరాజతనూభవుఁ జూచి యి ట్లనున్. 58
క. మన మొకయేవుర మీయం, గనయుం దో నరుగుదేరఁగా నెయ్యెడఁ బో
యిన నెఱుఁగ కుండుదురె యి, ద్దినములు గడపంగ నెద్దిదెఱఁ గయ్యెడినో. 59
వ. అనిన నతం డి ట్లనియె. 60
తే. ధర్మదేవత నీదుసత్కర్మమునకు, మెచ్చి యెంతయుఁ బ్రీతిమై నిచ్చినట్టి
వరముగలుగంగ మనమేమివర్తనమున, నెచటనున్నను నొరులకు నెఱుఁగనగునె. 61
వ. కురుజనపదంబుచుట్లం బాంచాల చేది మత్స్య సాళ్వ విదేహ బాహ్లిక దశార్ణ
శూరసేన కళింగ మగధదేశంబులు సుభిక్షంబులు జనాకీర్ణంబులు నతిస్థిరంబులు నై
నివాసయోగ్యత గలిగి యున్నయవి యని విందుము వానియందు మీకుం జూడం బోలినయెడఁ
దగినచందంబున నిలుచువారము గాక యనినం బ్రియం బంది ధర్మనందనుం డి ట్లనియె.
62
క. అగు నది యట్టిద దైవము, దగ నిచ్చినయవ్వరంబు దప్పునె మనకున్
విగతభయవాసయోగ్యం, బుగ నొక్కెడ సెప్పుఁ డిపుడ పోవఁగ వలయున్. 63
ఆ. నాకుఁ జూడ మత్స్యనరపతి సద్ధర్మ, వర్తి సుజనహితుఁ డవార్యబాహు
బలుఁడుగాన యతనిపాల నందఱుఁ దగ, వైనపనుల నిలుచు టభిమతంబు. 64
పాంచాలీపాండవులు దమ మెలంగవలయుపనుల నిశ్చయించుకొనుట.
క. మనలోన నెవ్వఁ డెమ్మెయి, పనివెంటను విరటుమనము వడయుద మది యె
ల్లను నేర్పరించి యందఱుఁ, దనతనమది నున్న తెఱఁగు తథ్యమ చెపుఁడా. 65
వ. అనిన విని సవ్యసాచి సవితర్కంబును సవిషాదంబును సగౌరవంబునుం గా నతని
నుపలక్షించుచు ని ట్లనియె. 66
సీ. మహనీయమూర్తియు మానవైభవమును, సౌకుమార్యంబును సరళతయును
మార్దవంబుఁ బ్రభుత్వమహిమయు నపగత, కల్మషత్వంబును గౌరవంబు
శాంతియు దాంతియుఁ జాగంబు భోగంబుఁ, గారుణ్యమును సత్యసారతయును
ధర్యమయక్రియాతత్పరత్వంబును, గీర్తిధనార్జనక్రీడనంబుఁ
ఆ. గలిగి జనుల నేలఁ గాని యెన్నండును, నొరులఁ గొల్చి తిరుగ వెరవు లేని
యట్టినీవు విరటు నెట్టిచందంబున, ననుచరించువాఁడ వధిప చెపుమ. 67
క. అనినం దమ్మునినెమ్మన, మునఁ బుట్టినవగపు భావమున నెఱిఁగియు గీ
టునఁ బుచ్చుచుఁ బ్రస్తుతకా, ర్యనిరూపణదశయ మెఱయ నతఁ డి ట్లనియెన్, 68
క. సన్న్యాసివేషమున రా, జన్యునిఁ గని యెపుడుఁ గొలిచి సభ్యత్వమునన్,
మాన్యుఁడ నై పుణ్యకథా, విన్యాస మొనర్తు నతనివేడుకకుఁ దగన్. 69
క. శ్రౌతస్మార్తనిమిత్త, జ్యోతిర్విద్యలు వహించి యోగ్యసమయసం
జాతప్రాగల్భ్యుఁడ నై, చాతుర్యము మెఱసి మానసం బలరింతున్. 70
క. అతనితో నొక్కొకమరి, కౌతూహలవృత్తికిం దగం దొడఁగి మృదు
ద్యూతంబునఁ గ్రీడింతుం, జేతోముద మొదవ నక్షశిల్పప్రౌఢన్. 71
తే. మణిమయమ్ములుఁగలధౌతమయములును సు,వర్ణమయములునాదిగావలయునట్టి
యడ్డసాళులు గలవు నాకభిమతముగ, వానిఁ గొనిపోయిచూపుదువరుసతోడ. 72
వ. మఱియు నవసరోచితంబు లగువినోదంబులం బ్రమోదంబు పుట్టించుచుఁ
బ్రసాదంబునకుం బాత్రుండనై కంకుం డనునామధేయుంబు ధరియించి చరియింతు
నయ్యుర్వీశ్వరుండు మత్పూర్వవర్తనం బడిగెనేనియు ధర్మపుత్త్రుతోడిమైత్రిం
దగిలి యతనిపాల వసియింతు ననం గలవాఁడ నని చెప్పి యనిలతనయు నిరీక్షించి
తత్కాలజనితం బయినఖేదంబునం దొరఁగ సమకట్టుబాష్పజలంబులు మగుడ నింకించుచు
నిట్టూర్పు లడంచి ధైర్యం బవలంబించి యి ట్లనియె. 73
సీ. కడిమిమై సౌగంధికమున యక్షులమద, మడఁచి కృష్ణకుఁబువ్వు లట్లుదెచ్చెఁ
గిమ్మీరదానవు నమ్మెయి నిర్జించి, విగతకంటకముఁ గావించె వనము
బకదైత్యుఁ దొడరి యాభంగి రూపఱఁ జేసి, రక్షించె నేక చక్రాపురంబు
నప్పాటఁ బ్రబలు జటాసురు నడరి దం,డితుఁ జేసి మనలఁ బెట్టించుకొనియె
తే. నితఁడు పుట్టినకోలెను నెసక మెసఁగు, దర్పమునన వర్తిల్లు నుదగ్రహృదయుఁ
డకటయొరుచిత్తమునకెక్కునట్లుగాఁగ, మెలఁగియేమివిధంబునఁగొలుచువాఁడు 74
వ. అనిన విని భీమసేనుం డి ట్లనియె. 75
తే. ఏను వంటలవాఁడ నై యానరేంద్రుఁ, గొలిచి గరగరగాఁ గూడుగూర చిత్త
మునకు వచ్చినచందంబునన యొనర్చి, నేర్చి మెలగుదుఁ గరము వినీతి మెఱసి. 76
ఉ. ఆఱురసంబులం జవులయందలిక్రొత్తలు వుట్ట నిచ్చలున్
వేఱొకభంగిఁ బాకములు విన్నను వొప్పఁగఁ జేసి చేసి న
న్మీఱఁగ బానసీని నొకనిం బురిఁ గాననియట్లు గాఁగ మేన్
గాఱియ వెట్టి యైన నొడికంబుగ వండుదు నెల్లగూరలున్. 77
తే. పఱియవాపంగఁదునియఁగావిఱువ వలయు, నెడలఁగాళులఁజేతులఁదొడలఁబట్టి
కడఁగియనువుగఁ జేసిప్రొయ్యిడుదుఁగాని, కత్తిగొడ్డలి యడుగ నేఁగట్టియలకు. 78
క. సూపాధ్యక్షుఁడు గలిగిన, నాపురుషునితోడ సఖ్య మగునట్లుగ నే
నేపాట నైన నడవఁగ, నోపుదుఁ దత్తద్విధప్రయోగములమెయిన్. 79
వ. అట్లుం గాక. 80
తే. జెట్టితండంబుతోడఁ జేపట్టి హొంత, కారి విఱిచినయట్టు నగ్గలిక విఱుతు
లాఁగు వేగంబు మెఱసి బలంబు నెఱపి, మల్లుతనమున మెప్పింతు మనుజవిభుని. 81
క. పెక్కండ్ర నొక్కపోరను, నుక్కఱ భంజింతుఁ జంపు టుడుగుదు రాజుం
దక్కటిచూపఱు లెంతయు, వెక్కసపడఁ జిత్రగతుల విహరింతుఁ దగన్. 82
చ. అదియును గాక కోలుపులి నైనను గారెనుపోతు నైన ను
న్మదకరి నైన నుగ్రమృగనాథుని నైనను గిట్టి ముట్టి బె
ట్టిదముగఁ గాలఁ గేలను గడిందిమగంటిమి యుల్లసిల్లఁ బ
ట్టుదు నడఁగంగ మాత్స్యుఁడు గడున్ వెఱఁ గందుచుఁ బిచ్చలింపఁగన్. 83
వ. ఇట్లు నానాప్రకారంబుల నతనిమనంబు వడయుదు వలలుం డనుసమాఖ్య వహింతు
నమ్మహీపతి నీ వెవ్వరివాఁడ వని యడిగెనేనిఁ బాండవాగ్రజునకు బానసంబు సేయుదు
ననం గలవాఁడ ననిన విని ధర్మజుం డమ్మెయికి సమ్మతించి బీభత్సు వీక్షించి
ఘూర్ణమానమానసుం డగుచు ని ట్లనియె. 84
ఉ. ఖాండవ మేర్చె దేవతలుఁ గాననియీశ్వరుఁ గాంచె దోర్బలో
ద్దండమహాసురప్రతతిదర్ప మడంచి ప్రియం బొనర్చి యా
ఖండలుఁ డున్నగద్దియసగంబున నుండె మహానుభావుఁ డీ
తం డొకమర్య్తుఁ జేరి యనుదాత్తత నెమ్మెయిఁ గొల్చువాఁడొకో. 85
క. అనుమాటలు విని సంక్రం,దననందనుఁ డిట్టు లనియె దైవంబుకతం
బున నాకు నొక్కచందం, బను వై యున్నయది దీని నౌఁగా దనుఁడా. 86
వ. అమరనగరంబున కరిగినయెడ నూర్వశి నన్ను నపుంసకుంగా శపియించిన నాకు
నాకేశుండు గరుణించి యీశాపఫలంబు భవదజ్ఞాతవాసవత్సరంబున ననుభవించి తదనంతరంబ
శాపమోక్షంబు వడయు మని దీవించెం గావునఁ బేడితనంబుదాల్చి
బాహులదీర్ఘత్వంబునకు గుణకిణంబులకుఁ గంచుకంబును శంఖవలయంబులును మాటు
సేసికొని విరాటుకడకుం జని. 87
క. ఉత్తమకన్యాజనులకు, నృత్తము గఱపంగ నాకు నేర్పు గలదు త
ద్వృత్తమునకు న న్నేలుము, చిత్తమునకు నెక్కఁ బనులు సేసెద నందున్. 88
క. అని కొలిచి యే బృహన్నల, యనునామముతోడఁ గన్యకాంతఃపుర వ
ర్తన మొనరించుచు లాసిక, తనమున నిపుణుండనై యతని మెచ్చింతున్. 89
క. మానవపతి న న్నెక్కడి, దానవు నీవనియె నేని ద్రౌపదికడ స
మ్మానంబు వడసి మెలఁగుదు, నానగళుల నృత్యగురువననఁ గలవాఁడన్. 90
తే. అనిన నిది వోలు నని యియ్యకొని యజాత,వైరియల్లన నకులునివలను సూచి
నెమ్మనంబున నుమ్మలికమ్ము గదుర, నెలుఁగుచందంబు వేఱుగానిట్టులనియె. 91
ఉ. ఒప్పెడుమేను బెంపు గలయుల్లము నాగరికంపు జందముం
జెప్పక చూప కీతనివిశేషముఁ దెల్పెడుం గొల్చు టెంతయున్
డెప్పర మేమి సేయుదుఁ గడిందివిచారము పుట్టె నె ట్లితం
డప్పురి సంచరించునొకొ యన్యు లెఱుంగక యుండునట్లుగన్. 92
వ. అనిన నప్పలుకులకు నకులుం డి ట్లనియె. 93
అ. అశ్వశిక్షకుండ నై మత్స్యభూవిభుఁ, గొలుచువాఁడ గుఱ్ఱములకు వలయు
తెఱఁగు లెల్లఁ జాలనెఱుఁగుదు రూపుగా, నరయ నేర్తువాని ననుదినంబు. 94
సీ. గోడిగజాతిలోఁ గొదమపెంటుల నేర్చి, మావుల హత్తించుమార్దవంబుఁ
ద్రాళ్ళఁ బట్టింపంగఁ దఱి యైనకొదమల, సంచంబు లెఱిఁగి శిక్షించునేర్పుఁ
గళ్యాలఁ బదిలంబు గానిగుఱ్ఱంబులఁ, గ్రొత్తముట్టున కియ్యకొలుపువెరవుఁ
బెనఁగుశూకములబిరుదుతనంబులఁ, జలము డింపక తీర్పఁజాలుటయును
తే. నలవరించినవాఁడలాయముననున్న,యపుడు దొడకించుకయులేనియట్లుగాఁగ
మాటిమాటికిఁ బరికించి మందడీల, కెల్ల నూఱట యగుచు వర్తిల్లనేర్తు. 95
క. దామగ్రంథి యనఁగ నొక, నామము పెట్టుకొనువాఁడ నాతొంటివిధం
బామనుజేశ్వరుఁ డడిగిన, నే మీకడవాఁడ నందు నిది దెఱఁ గధిపా 96
క. అనినఁ గడులెస్స యని నె, మ్మనమున నూఱడి విభుం డమానుషతేజో
ధనుఁ డగుసహదేవుఁ గనుం, గొని యి ట్లను వగలు మిగిలికొందలపఱుపన్. 97
చ. అకుటిలుఁ డార్యసమ్మతుఁ డహంకృతిదూరుఁడు నీతినిర్మలా
త్మకుఁ డనవద్యశీలుఁడు సధర్ముఁడు దాంతుఁడు గొంతి ముద్దుసే
యుకొడుకు మేను లేఁత దనయుల్లము మెత్తన యిట్టియీఁత డె
ట్లొకొ యొరు నాశ్రయించు విధి యోపదె యెవ్వరి నెట్లు సేయఁగన్. 98
క. అనుడు నతఁడు దనచిత్తం, బునఁ దోఁచినవిధము ధర్మపుత్త్రునితో ని
ట్లని చెప్పె నాతనికిఁ బు,ట్టిన యుత్తలపాటు గొంత డిందుపడంగన్. 99
క. కీలారితనమునకు నేఁ, జాలుదు నని కొలిచి మత్స్యజనపాలుకడన్
మే లగునడవడిఁ దంత్రీ, పాలుం డనుపేరితోడఁ బరగుదు నధిపా. 100
సీ. వంజల నైనను వల నేర్పడఁగ నొక, భంగిఁ జేఁపఁగ జేసి పాఁడి గొనఁగ
బడుగుల నైనను బాటించి పరికించి, గోమున మైఁ గండక్రొవ్వు దేఱఁ
దెవులుగొంటుల నైనఁ దేర్చు సంకటమున, కోపి ముందటియట్ల రూపుసేయ
నఱ్ఱల నైనను నలు వైనవెరవున, ముట్టె యంటఁగఁ బట్టి కట్టి విడువఁ
ఆ. బిదుకఁ గదుపు సేర్ప బెదరు వాపఁగ నీరు, మేపు గలుగునెడకుమెలఁగవెలువ
మృగము నరయ మ్రుచ్చురేవగలునుగొట్ట,నేర్తుఁ బసికిఁ జాలఁగూర్తునేను. 101
వ. నన్ను విరాటుండు మున్న నీ వెందుండు దని నిరూపించెనేని
యుధిష్ఠిరుగోష్ఠంబుల కధిష్ఠాతనైయుండుదు ననియెద నని పలికినఁ గౌంతేయాగ్రజుం
డిదియుక్తం బగునని యనుమతిసేసి పాంచాలినాలోకించి ఖిన్నాంతఃకరణుం డగుచు
నిట్లనియె. 102
చ. ఇది గడుముద్దరాలు పను లేమియుఁ జేయఁగ నేర దెంతయున్
మృదు వొకకీడుపాటునకు మేకొనఁ జాల దుదాత్తచిత్త యొం
టి దిరుగుదాని కోర్వ దొకటిం దను దా సవరించుచొ ప్పెఱుం
గదు తగ నొండులం గొలువఁ గా వెర వెమ్మెయిఁ గల్గు నక్కటా! 103
క. అనిన నతనిచిత్తంబున, వెనుఁబా టంతయును బాయువెరవుకలిమి యె
ల్లను దెలియునట్లుగా ని, ట్లనియెం బాంచాలి యుచిత మగుచందమునన్. 104
క. సైరంధ్రీవేషంబునఁ, జేరుదు నంతఃపురంబుచెంతకు న న్నా
భూరమణుదేవి యెంతయు, గారవమునఁ బిలువ నంపఁ గా వినయమునన్. 105
క. కని కొలువు సేసికొని మా,లిని నాఁ జని సాధ్వి యిది మలీమసవృత్తం
బునపొంతఁ బోవ దెన్నఁడు, ననువ్రేఁకఁదనంబు దోఁచునట్లు చరింతున్. 106
సీ. కలపంబు లభినవగంధంబులుగఁ గూర్చి, తనువున నలఁదుదు ననువు గాఁగ
మృగమదపంకంబు మృదువుగా సారించి, తిలకంబు వెట్టుదుఁ జెలువు మిగులఁ
బువ్వులు బహువిధంబులఁ గట్టి ముడి కొక్క, భంగిగా నెత్తులు వట్టి యిత్తు
హారముల్ మెఱయ నొయ్యారంబుగా గ్రుచ్చి, యందంబు వింతగానలవరింతు
ఆ. వివిధశిల్పములఁ బ్రవీణ నై మఱియును, వలయుపనులవెంట మెలఁగ నేర్తు
మత్స్యరాజమహిషిమనమున మక్కువ, నెలకొనంగ నిట్లు గొలువ నేర్తు. 107
క. మును నీ వెచ్చో నిలు తే, పనిమెయి వర్తిల్లు దనినఁ బాంచాలకి నే
ననుచారిణి నై తగఁ బం, చినగరువపుఁబనులు నేర్చి చేయుదు నందున్. 108
వ. అనవుఁడు ధర్మనందనుండు ద్రుపదనందన కి ట్లనియె. 109
క. మనవంశంబునవృత్తం, బును బెంపును గానఁ జాలుపుణ్యసతివి దు
ర్జను లగుతులువలతలఁపులు, గనుఁగొని యేమఱక మెలఁగఁగా వలయుఁజుమీ. 110
వ. అనిన విని యాజ్ఞసేని యనాదరమందస్మితసుందరవదనారవింద యయి యతని కి
ట్లనియె. 111
క. ఆరయ నెందును గౌరవ, భారం బెడలంగ నీక పాతివ్రత్యా
చారముమై వర్తింతురు, సైరంధ్రీజాతివారు సౌజన్యమునన్. 112
క. కావున నుచితము లగు నా, కావెంటం గొలిచి తిరుగునప్పుడు మితభా
షావిరచనమును వ్రతసం, భావనమును గౌరవంబుఁ బాపభయంబున్. 113
క. అని చెప్పిన విని యగుఁ బొ, మ్మని కైకొని ధర్మతనయుఁ డందఱమును ని
ట్లనపాయత వర్తిల్లుద, మని తమ్ములతోడ నిశ్చయంబుగఁ బలికెన్. 114
వ. ఇవ్విధంబునఁ గార్యంబు నిర్ణయించి మనయగ్నిహోత్రంబుల నెల్ల ధౌమ్యులు
రక్షించువారు వంటలవారును మహానసాధ్యక్షులును బాంచాలీపరిచారికలును
ద్రుపదుపురంబున నిలుచువారు రథంబులు గొని యింద్రసేనాదు లైనసారథులు
ద్వారకానగరంబున కరుగువారు వీ రెల్లను దమ్మెవ్వరైనను మనవార్త లడిగిరేని
ద్వైతవనంబున మమ్ము విడిచి పోయి రట యెఱుంగ మనం గలవా రని చెప్పి
యిత్తెఱంగున నభ్యంతరపరివారంబు నెల్ల నియోగించి వీడుకొలిపె నయ్యవసరంబున
ధౌమ్యుండు పాండుకుమారుల కి ట్లనియె. 115
ధౌమ్యుఁడు పాండవులకు సేవాధర్మంబు లెఱింగించుట.
క. ఎఱిఁగెడువారికి నైనను, గఱపక తక్క రుచితప్రకారము శుభముం
గొఱలు హితు ల ట్లగుట నం, దఱకును జెప్పంగ వలయుఁ దగియెడుబుద్ధుల్. 116
వ. అదియునుం గాక, 117
తే. కౌరవాన్వయజాతు లై గారవమునఁ, బెరిఁగినట్టిమీ రొండొకనరునిఁగొలిచి
మసలి వర్తిల్లి మానావమానములకు, నోర్చి యడఁకువతోడనయునికి యరిది. 118
క. వాలి వివిధాస్త్రశస్త్ర, జ్వాలల వెలుఁ గొందుపాండవజ్వలనం బా
భీలత మండం దొడరినఁ, గాలవిరోధంబు మఱచి కార్యముఁ దప్పున్. 119
వ. కావున మీకు నప్రమాదార్థంబుగా నానేర్చినవిధంబున నుపదేశం బవశ్య
కర్తవ్యంబు రాజులం గొలిచి యెమ్మెయి నయినను బ్రదుకుజనంబులు గీడునుం బొరయ
కుండునట్టి సాధారణనీతి సంక్షేపరూపంబున నెఱింగించెద సావధానులరయి వినుండు.
120
క. తగఁ జొచ్చి తనకు న్హరం, బగునెడఁ గూర్చుండి రూప మవికృతవేషం
బుగ సమయ మెఱిఁగి కొలిచిన, జగతీవల్లభునకతఁడుసమ్మాన్యుఁడగున్. 121
క. నరనాథుఁ గొలిచి యలవడఁ, దిరిగితి నా కేమి యనుచుఁ దేఁకువ లేమిన్
మరియాద దప్ప మెలఁగినఁ, బురుషార్థంబునకు హాని పుట్టుక యున్నే. 122
ఉ. రాజగృహంబుకంటె నభిరామముగా నిలు గట్టఁ గూడ దే
యోజ నృపాలుఁ డాకృతికి నొప్పగువేషము లాచరించు నే
యోజ విహారముల్ సలుప నుల్లమునం గడువేడ్క సేయు నే
యోజ విదగ్ధుఁ డై పలుకు నొడ్డులకుం దగ దట్లు సేయఁగన్. 123
క. పుత్త్రులు పౌత్త్రులు భ్రాతలు, మిత్రులనరు రాజు లాజ్ఞ మిగిలినచోటన్
శత్రుల కాఁ దమయలుకకుఁ, బాత్రము సేయుదురు నిజశుభస్థితిపొంటెన్. 124
క. చనువానిచేయుకార్యం, బున కడ్డము సొచ్చి నేరుపున మెలఁగుచుఁ దా
నునుబయిఁ బూసికొనుటఁదన,మునుమెలఁ గినమెలఁకువకునుముప్పగుఁబిదపన్. 125
ఆ. రాజునొద్దఁ బలువురకు సంకటము గాఁగఁ, దిరుగుపనుల కెంతతేజ మయిన
వాని బుద్ధిగలుగువా రొల్ల రది మీఁదఁ, జేటు దెచ్చు టెట్లు సిద్ధ మగుట.
126
క. ఊరక యుండక పలువుర, తోరవ మెసఁగంగఁ బలుకఁ దొడరుపక మదిం
జేరువ గలనాగరికులుఁ, దారుఁ గలసి పలుక వలయు ధరణీశుకడన్. 127
క. వేఱొకతెఱఁగున నొరులకు, మా ఱాడక యునికి లెస్స మనుజేంద్రుకడం
దీఱమి గలచోటులఁ దా, మీఱి కడఁగి వచ్చి పంపు మెయికొన వలయున్. 128
చ. ధరణిపుచక్కఁగట్టెదురు దక్కి పిఱుందును గానియట్టుగా
నిరుగెలనం దగం గొలిచి యే మనునో యెటు సూచునొక్కొ యె
వ్వరిదెస నెప్పు డేతలఁపు వచ్చునొ యీతని కంచుఁ జూడ్కి సు
స్థిరముగఁ దన్ముఖంబునన చేర్చుచు నుండుట నీతి కొల్వునన్. 129
క. నగళులలోపలిమాటలు, దగునే వెలి నుగ్గడింపఁ దన కేర్పడ నొం
డుగడం బుట్టినఁ బతి విన, నగుపని చెప్పెడిది గాక యాతనితోడన్. 130
క. అంతిపురముచుట్టఱికం, బెంతయుఁ గీ డంతకంటె నెగ్గు తదీయో
పాంతచరకుబ్జవామన, కాంతాదులతోడిపొందుకలిమి భటునకున్. 131
ఆ. ఉత్తమాసనములు నుత్కృష్టవాహనం,బులును గరుణఁ దమకు భూమిపాలుఁ
డీక తార యెక్కు టెంతటిమన్నన, కలుగువారి కైనఁ గార్య మగునె. 132
క. మన్నన కుబ్బక యవమతి, ద న్నొందిన స్రుక్కఁబడక ధరణీశుకడన్
ము న్నున్నయట్ల మెలఁగిన, యన్నరునకు శుభము లొదవు నాపద లడఁగున్. 133
క. జనపతి యెవ్వరి నైనను, మనుపఁ జెఱుపఁ బూని యునికి మదిఁ దెలియ నెఱిం
గెనయేనిఁ దాను వెలిపు,చ్చునె మునుము న్నెట్టిపాలసుండును దానిన్. 134
ఉ. ఎండకు వాన కోర్చి తనయిల్లు ప్రవాసపుఁజోటు నాక యా
కొండు నలంగుదున్ నిదురకుం దఱి దప్పెడు డప్పి వుట్టె నొ
క్కండన యెట్లొకో యనక కార్యము ముట్టినచోట నేలినా
తం డొకచాయ చూపినను దత్పరతం బని సేయు టొ ప్పగున్. 135
క. తా నెంతయాప్తుఁ డైన మ,హీనాయకుసొమ్ము పామునెమ్ములుగా లో
నూనినభయమునఁ బొరయక,మానినఁ గా కేల కలుగు మానము బ్రతుకున్. 136
ఆ. ఆవులింత తుమ్ము హాసంబు నిష్ఠీవ,నంబు గుప్తవర్తనములు గాఁగఁ
జలుపవలయు నృపతిగొలు వున్నయెడల బా,హిరములైనఁ గెలనికెగ్గు లగుట. 137
క. వైరులదూతలు నెర వగు, వారు నిరాకృతులుఁ బాపవర్తులుఁ దమకుం
జేరువగా వర్తించుట, నేరమి తుదిఁ బోయి చేటు నిందయు వచ్చున్. 138
ఆ. వసుమతీశుపాల వర్తించునేనుంగు,తోడ నైన దోమతోడ నైన
వైర మగుతెఱంగు వలవదు తా నెంత, పూజ్యుఁ డైన జనులపొందు లెస్స. 139
క. కలిమికి భోగముల కదా, ఫల మని తను మెఱసి బయలుపడఁ బెల్లుగ వి
చ్చలవిడి భోగింపక వే, డ్కలు సలుపఁగవలయు భటుఁ డడంకువతోడన్. 140
వ. అని యిటు పురోహితుండు సేవాధర్మం బెఱింగించిన
ధర్మజభీమార్జుననకులసహదేవులు ప్రసన్నచిత్తు లై యి ట్లనిరి. 141
క. తల్లియుఁ దండ్రియు దైవము, నెల్లసుహృజ్జనము మీర యిట్లు గొలిచి వ
ర్తిల్లెడు తెఱంగు లెంతయుఁ, దెల్లము సేసితిరి బ్రతికితిమి మీకరుణన్. 142
ఆ. అనిన ధౌమ్యుఁ డిట్టు లనియె నీవత్సర, మొకఁడు నెట్టు లయిన నుడిగి
మడిఁగి
సంకటముల కోర్చి చరియించి యాపద, నిస్తరించి పిదప నెగడ వలయు. 143
క. అనవుడు నట్టుల చేసెద, మని వారలు భక్తియుక్తి నతనికి నభివం
దన మొనరించినఁ దగుదీ, వన లిచ్చె నతండు గాఢవాత్సల్యమునన్. 144
క. భూదేవోత్తమునాశీ, ర్వాదంబులఁ బ్రీతిఁ బొంది వారలు ప్రస్థా
నాదరపరు లగుటయు స, మ్మోదావహపుణ్యకర్మముల కుద్యతుఁ డై. 145
ఆ. అతఁడు నియతితోడ నగ్ని సముజ్వ్జలం, బుగ నొనర్చి కామ్యపూజ దీర్చి
యానసమయమంగళార్థంబు లగుమంత్ర, సంచయములు దగ జపించుచుండె. 146
పాండవులు పాంచాలితోడ విరాటనగరంబునకు బయలు దేఱుట.
వ. తదనంతరంబ హుతవహునకుం బురోహితునకుం బ్రదక్షిణంబుసేసి యమ్మహీసుర
వరేణ్యుననుమతి వడసి పాండవులు పాంచాలిం బురస్కరించుకొని యాతండును దోడన
యరుగుదేరం గదలి శుభనిమిత్తంబులు గైకొనుచుం జని దశార్ణదేశంబున కుత్తరంబునఁ
బాంచాలజనపద యామ్యదిగ్భాగంబున సాళ్వశూరసేనవిషయంబులలోనం గాళిందీదక్షిణతీరం
బొరసికొని పశ్చిమాభిముఖప్రయాణంబుల నెడనెడ వన్యాహారంబుల శరీరయాత్రలు
నడపుచు నానామృగవివిధవధవిహారంబులను మనోహరకుసుమకదంబగంధమకరందబిందుసందోహ
సుందరతరుచ్ఛాయా సేవనంబులను గమలపరాగపరంపరాధూసరిత భాసురజలాశయసమవగాహనంబులను
సరిత్సంగమస్నానాద్యనుష్ఠానంబులను బహుప్రకార పాదపగుల్మలతావలోకనంబులను
బక్షికులప్రకరానేకభంగివిరుతాకర్ణనంబులను వినోదించుచుఁ గానన మార్గంబుల
నరిగి మత్స్యమండలంబుగడి సేరి ధౌమ్యుని వీడుకొని రవ్విప్రవరుండును
నొక్కపుణ్యాశ్రమంబున వసియించె వారు మఱియు నూళ్లు సొరక యడవి తెరువుల నడచి
విరాటునగరంబున కనతిదూరం బగుకాంతారంబునం దఱిమి పోవుసమయంబునఁ బథిశ్రమంబు
నూని యాజ్ఞసేని యి ట్లనియె. 147
ఉ. డప్పి జనించె వ్రేళులపుటంబులు పొక్కఁ దొడంగె గోళ్ళలోఁ
జిప్పిలఁ జొచ్చె నెత్తురులు చిత్తము నాకుఁ గడున్ వశంబు గా
దప్పుర మిచ్చ టచ్చటనునాసల వచ్చితి నెంతదవ్వొకో
యిప్పటిభంగి నొక్కడుగు నేఁగెడుదానికి నోర్వ నెమ్మెయిన్. 148
వ. అనవుడు. 149
క. తనమదిఁ గరుణయు ఖేదం,బును బిరిగొను చుండ ధర్మపుత్త్రుఁడు నకులుం
గనుఁగొని ద్రుపదనృపతినం, దనదెస యాతనికిఁ జూపి తగ ని ట్లనియెన్. 150
ఆ. అకట మనమువచ్చినది గడుదవ్వు నేఁ, డప్పురంబు సొత్త మని తలంచి
తఱిమి నడచితిమి లతాతన్వి యిది వడి,గొనియె మోచి తెమ్ముకొంతదవ్వు. 151
క. అనిన విని పూని గ్రక్కునఁ, జనుదేరమి నతఁడు డస్సెఁ జాలం డని నె
మ్మనమున నెఱింగి యాతని, యనుజన్మునిఁ బనిచె నతఁడు నలసుం డయినన్. 152
వ. సవ్యసాచిం జూచి. 153
ఉ. ఇమ్మదిరాక్షి డస్సె మన కీనడుమన్ విడియంగ నొండుచో
టిమ్మును గాదు నిక్కమున కేమును డస్సితి మట్లు గాన నీ
వెమ్మెయి నైన దీని భరియించి పురంబుసమీపభూమికిం
దెమ్మని చెప్ప నాతఁడును దెచ్చెఁ బ్రియంబునఁ బుష్పకోమలిన్. 154
క. మోచికొని వాసవాత్మజుఁ, డా చెలువం దేర నిట్టు లరిగి పురము దృ
గ్గోచర మగుటయుఁ దమ్ములఁ, జూచుచు వారలకు ధర్మసుతుఁ డి ట్లనియెన్. 155
క. చక్కనిచిక్కనిమేనులు, నిక్కోదండములు నైన నెఱుగరె మన మీ
చక్కటి నిలుతమె శస్త్రము, లొక్కెడ దాఁచుటకు వేషయోజనములకున్. 156
వ. అనిన నిది కార్యం బని మథ్యమపాండవుం డాసుమధ్య నొక్కశీతలసికతాతలంబున
డించెఁ దక్కినవారలు నట్ల చేయుద మని నిలిచి రట్టియెడం బాండవాగ్రజుండు
గాండీవి చేతివి ల్లుపలక్షించి యతని కి ట్లనియె. 157
క. మనశస్త్రాస్త్రంబులు ద, క్కినయవి యొకభంగి వీటికిని గాండివముం
గొనిపోయితిమేని సుయో, ధనునకు నగపాటు నిశ్చితం బూహింపన్. 158
వ. అనవుడు. 159
చ. ఇది పెనుఁబాముచందమున నెంతయు భీషణ మై జనంబులన్
బెదరఁగఁ జేయు న ట్లగుటఁ బెట్టి చనన్ వలయుం దలంచి నా
హృదయము దీనిఁ బాయుటకు నియ్యకొనం జొర దెట్లు సెప్పినం
దుది నొకచోట వైచుటయ తోచినకార్యము నయ్యెడుం గటా! 160
వ. అని వితర్కించుచుం గిరీటి యురియాడు చిత్తంబునుత్తలం బుడిపికొని
నిశ్చయించి యాయుధంబులు నిక్షేపించుటయ కర్జంబుగాఁ బలికి
యోగ్యస్థలనిరూపణంబునకు నలుదిక్కులుం బరికించి
ప్రేతభూమిపరిసరారణ్యంబునందు. 161
సీ. నెగసినకొన లేచి నింగి యంతంతకు, నవుల ద్రోవఁగఁ దనరారుదానిఁ
జాగినశాఖ లాశాచక్రములకొలం, దులు బారవెట్టంగఁ బొలుచుదానిఁ
గవట లొండొంటితోఁగదియుచు నెడములు,మ్రింగి ప్రబ్బఁగ సొంపుమిగులుదాని
లోనిజొంపము పవలును బెనుఁజీకఁటి, నొదవించి పొదలంగ నొప్పుదానిఁ
తే. గనియెఁ బవమానవివిధ నర్తనకళాను,వర్తిఁ గాకఘూకారవస్ఫూర్తి జాత
భీతిపరిసరవర్తి నాభీలభుజగ, చండమూర్తి శమీతరుచక్రవర్తి. 162
వ. కని యమ్మహామహీరుహంబు ధర్మనందనునకుం జూపి యి ట్లనియె. 163
శా. పక్షివ్యాకులముం బరేతనిలయోపాంతోత్థమున్ డాకినీ
రక్షోభూతపిశాచగోచరము దుర్గస్థంబు నై చూడఁ జి
త్తక్షోభం బొనరించు న ట్లగుటఁ జెంతం జేర రా దీశమీ
వృక్షం బెవ్వరి కిందుఁ బెట్టుదమె పృధ్వీనాథ శస్త్రాస్త్రముల్. 164
క. పెనుఁబొడవుఁ బఱపు జొంప,మ్మును గలయది దీన నెల్లపురుషులకుఁ బ్రయో
జన మొకఁడు లేదు సేరం, జనఁ జూడఁగ నరయ నెక్క సమకట్టంగన్. 165
ఉ. కావున దీనియం దిడుట కార్యము గైదువు లెల్లఁ గేశచ
ర్మావృతసంచయంబుగ శవాకృతిగా నొనరించి కట్టినం
బోవరు దీనిది క్కొరులు భూవర నెమ్మది నూఱడిల్లు మె
చ్చో వసియించినం బిదపఁ జొప్పడుఁ గ్రమ్మఱ వచ్చి కైకొనన్. 166
పాండవులు దమ యాయుధంబుల శమీవృక్షమునఁ బెట్టుట.
వ. అనిచెప్పిన నందఱునత్తెఱంగున కియ్యకొనుటయు నతండు గాండివంబు నవలోకించి.
167
చ. అనిమిషదానవాంబరచరాదికజాతుల నెల్లఁ బోర నీ
ధనువునఁ గాదె గెల్తు సముదగ్రవిరోధిభయావహంబు దీ
నిని నొక మ్రానఁ గట్టి చనునిశ్చయముం దగఁ జేసె దైవ మే
మనఁ గల దట్ల కాక యని యాత్మ నలందురి మందచేష్టుఁడై. 168
వ. ఎక్కు డించినఁ బాండవాగ్రజుండు. 169
క. దనుజకులత్రాసకరం,బును రిపుభంజనము రత్నభూషితరూపం
బును గురుదేశాహ్లాదన,మును నగునిజకార్ముకంబుమో పెడలించెన్. 170
వ. తదనంతరంబ భీమ నకుల సహదేవులదెసఁ గనుంగొని. 171
సీ. సైంధవయక్షపాంచాలత్రిగర్తుల, దీనన యోర్చితి మానధనుఁడ
సౌరాష్ట్రనాథాదిశత్రులు దీనిచేఁ, గాదె మర్దితులైరి ఘనభుజుండ
కాళింగపాండ్యమాగధుల నిర్జించుచో, నిదియ కైదువు నీకు విదితయశుఁడ
యని క్రమంబున వార లందఱవిండులు, పెం పెసలార వేర్వేఱ పొగడి
ఆ. గొనయములు వదల్ప ననుమతి సేయుడు, వారు నట్ల చేసి తేరఁ జాప
ములునుదొనలువర్మములునసిముద్గరా, ద్యాయుధములుఁ గూడ నతఁడు గట్టె. 172
వ. ఇట్లు పూర్వోక్తప్రకారంబునం బొదివి మహోరగంబులం బెట్టియలంబెట్టి కట్టు
చందంబున బంధించి వానింగొలుచు నయ్యజాతశత్రుండు ధర్మదేవతాదత్తవరుం
డగుటంజేసి నిశ్శంకంబైన యంతఃకరణంబుతోడ శమీవృక్షసమారోహణం బాచరించి. 173
తే. బ్రహ్మవిష్ణుమహేశదిక్పాలచంద్ర
సూర్యవనదేవతాపితృస్తుతులొనర్చి
దివియు భువియును జూచి ప్రార్థించి యొక్క
విపులశాఖ నాయుధములు వ్రేలఁగట్టె. 174
వ. ఇట్లు గట్టి తదీయాధిదైవతంబుల నుద్దేశించి నమస్కరించి. 175
క. నరునకు నాకుం దక్కఁగ, నొరులకు మీరూపుసూప కున్నది విషవి
స్ఫురిత భుజగభంగి భయం,కరమూర్తులు దాల్చియుండఁగా వలయుఁ జుఁడీ. 176
ఉ. భీముఁడు ధార్తరాష్ట్రకులభీషణరోషుఁడు చిత్తమెప్పు డె
ట్లై మద మెత్తునో యతనియాగ్రహవృత్తికి లోనుగాక మీ
రేమెయి నైన వంచన వహించి తొలంగుట మత్సమీహితం
బేమఱ కుండఁగా వలయు నివ్విషమాబ్దములోన నాతనిన్. 177
వ. అని వేఁడికొని వృక్షంబు డిగ్గి దానికిం బ్రదక్షిణంబు వచ్చి ప్రణమిల్లి
భీమసేనుదెస మరలి చూచి సాంత్వనవచనసమేతంబుగా నతనిం గౌఁగిటం జేర్చి
యనునయించి తమచేసినవిధంబు దత్ప్రదేశవర్తులయిన గోపాలాది క్షుద్రజనంబులకు
మఱువెట్టం దలంచి వారల కభిముఖులై పాండునందను లందఱు ని ట్లనిరి. 178
చ. ఇది శతవృద్ధ మాజనని యిప్పడు మృత్యువుఁ బొందె నిట్లు సే
యుదుము కుల ప్రయుక్త మగు చున్నసనాతనధర్మ మిత్తెఱం
గ దహనకర్మ మొల్ల మది గానిది గా మును నిశ్చయించి మా
మొదలిటివా రొనర్చువిధముం గొనియాడితి మేము నియ్యెడన్. 179
వ. అని యిట్లు పలుమఱుం దెలియఁ బలికి శస్త్రాస్త్రంబులనిక్షేపణంబు నిగూఢం
బగుటకు నూఱడిల్లి యచ్చేరువం జచ్చిన పసరంబు వడియున్నంజూచి సహదేవుం బనిచి
ధర్మతనయుండు దానిచర్మంబొలిపించి శీతాతపవర్ష పరిహారంబుగా నాయుధంబులం
బొదివించి మఱియును దత్సమీపంబున నొక్క శుష్కశవంబు నవలోకించి యిది
యుంఛవృత్తియైనమానవుకళేబరంబు గావలయు ననుచు నదియునుం గైదువులకట్టపయిం
బెట్టి కట్టించె నివ్విధంబున నత్యంతగుప్తి యాచరించి దీని దుర్గంధంబున
వనచారు లెవ్వరుం జేర రని నవ్వుచు వార లచ్చోట వాసి విరాటపురాభిముఖులై
చనుచుండి యజ్ఞాతవాసకాలంబునం దమ రహస్య వ్యవహారంబునకు ననువుగా
నేవురపేళ్లును గ్రమంబున జయుండును జయంతుండును విజయుండును జయత్సేనుండును
జయద్బలుఁడు నని సంకేతించుకొని యాజ్ఞ సేనీ పురస్సరంబుగాఁ
బుణ్యనదీతీర్థావతరణంబు సేసి తదీయస్నానంబునం బథిశ్రమం బపనయించి
దేవపితృతర్పణమంగళజపహోమధ్యానాద్యనుష్ఠానంబు లొనర్చిరి తదనంతరంబ
యక్కౌంతేయాగ్రజుండు ప్రాఙ్ముఖుండయి నిర్మలచిత్తంబున ధర్మ దేవతం దలంచి యి
ట్లనియె. 180
ఆ. తండ్రి నీవు నాకు దయతోడ నిచ్చిన వరము చిత్తగించి వలయుతెఱఁగు
సమయసముచితముగ సమకట్టు మయ్య యీ,రాకుమారు లవిధిఁబోకయుండ. 181
వ. అనుజులదెసకుఁ దూర వగచి డగ్గుత్తిక వెట్టి మఱియును, 182
ఉ. అంబరవర్తి వైనఁ గని యక్షునిచే నగపడ్డవీరిప్రా
ణంబులు మున్ను ని న్నడిగి నల్వురకున్ నయవిక్రమప్రభా
వంబులు వేఁడికొన్న నతివత్సలభావముఁ బొంది యాదరా
ర్ద్రం బగు చూడ్కితోఁ బ్రియహితస్థిరభాషల నూఱడింపవే. 183
వ. అని తాను భూసురవరునరణిదేర నరిగిననాఁడు సరోవరతీరంబునం దనకుధర్ముండు
సేసినమన్నన దోఁప నతనికి విన్నవించినవాఁడై కరకమలంబులు మొగిచి ఫాల భాగంబునం
గదియించి సంప్రార్థనంబుగా వినయవినమితమస్తకుం డుగుటయుఁ దదనుగ్రహంబునఁ
బాండవాగ్రజుం డున్నయునికిన సన్న్యాసిరూపం బలవడి
ధాతుపటదండకమండలుకలితమూర్తి యయ్యె నయ్యవసరంబున వా రందఱు మహాద్భుతం బంద
వారివారికి నరzౖు్యవేషంబుల కనుగుణంబులగు నంబరాభరణ మాల్యాద్యుపకరణంబులు
సన్నిహితంబు లయినం జూచి సంతసిల్లి యెల్లవారిం గలయం గనుంగొని క్రమంబున
నొంటిమైఁ జనుదెం డని నియోగించి యతండు నానావిధంబు లగునక్షంబులముడి
కక్షంబున నిడికొని చని దైవయోగంబున విరాటుండు వెడలి వచ్చి బయలికొలు
విచ్చుటం జేసి తదాస్థానంబు సేరం బోవునప్పుడు. 184
ధర్మరాజు సన్న్యాసివేషమున విరటుఁ గొల్వ వచ్చుట.
ఉ. దవ్వులఁ జూచి మత్స్యవసుధాపతి యూచనుదెంచు చున్నవా
డెవ్వఁడొ నాదుచూడ్కులకు నెంతయు వ్రేగయితోఁచె నె ట్లితం
డివ్విధిఁ బొందెనో జగము లెల్లను నేలఁగఁ జాలుతేజ మా
మువ్వుర తొడిజోడి యగుమూర్తి యతీంద్రునియొప్పు గంటిరే. 185
సీ. కరచరణాద్యంగకంబు లేలొకొ రత్న,భూషణప్రకరంబుపొందు దొఱఁగె
నుభయపార్శ్వంబుల నిభఘట లేలొకో,చనుదేవు సమదాళిసమితి మొరయఁ
బాయు తొలంగు మం చాయతవేత్రహ,స్తులమొత్త మేలొకో తోడ రాదు
ధవళాతపత్రముల్ దఱచుగా నేలొకో, పట్టరు మౌక్తికప్రభలు వెలుఁగ
తే. నితఁడు రా జగు రా జనునింతమాత్ర,గాదు మూర్ధాభిషిక్తవర్గంబుఁ దనదు
చరణయుగ్మంబు గొలిపింపఁ జాలుసార్వ, భౌముపదవికిఁదగియెడుభంగివాఁడు. 186
క. మనకడకు నేమిటికి వ, చ్చెనొకో యే నిమ్మహాత్ముచెప్పిన పను లె
ల్లను జేయువాఁడఁ గోరిన, కనకాంబరమణులు దలఁపు గడవఁగ నిత్తున్. 187
ఆ. మత్స్యవిషయరాజ్యమహిమకు యుక్తుండు, గాఁ దలంచెనేని గారవమున
నట్ల చేసి భక్తి ననుచరింతు నమాత్య, సుతసుహృద్భటార్యయుతముగాఁగ. 188
వ. అని సమస్తజనంబులుఁ దదభిముఖులయి భక్తియుక్తిం బ్రత్యుత్థానంబు సేయం
దానును గద్దియ డిగ్గి యెదురు చని నమస్కరించి యతనియాశీర్వాదంబులు గైకొని
సగౌరవంబుగాఁ దోడ్కొని చనుదెంచి సమంచితసమున్న తాసనంబున నునిచి వినయావనతుం
డయి. 189
ఉ. ఎయ్యది జన్మభూమి కుల మెయ్యది యెయ్యది యున్నచోటు పే
రెయ్యది మీర లిందులకు నిప్పుడు వచ్చినదానికిం గతం
బెయ్యది నాకు నంతయును నేర్పడఁగా నెఱింగింపుఁ డున్నరూ
పయ్యది నావుడున్ నరవరాగ్రణి కయ్యతిముఖ్యుఁ డి ట్లనున్. 190
ఆ. ఉన్నరూప పలుకునన్నరు లెక్కడఁ, గలరు తోఁచినట్లు పలుకు వలుక
నైనచంద మయ్యె నంతియ కా కంత, పట్టి చూడఁ గలరె యెట్టివారు. 191
వ. అని మందహాసంబు సేయుచు మఱియును, 192
క. నానావిధభూతమయము, మే నతిచంచలము మనము మెయికొని నిక్కం
బేనరునకు, జెల్లింపం, గా నగు సత్యంబు నడపుక్రమ మ ట్లుండెన్. 193
వ. అనుచు మత్స్యమహీవల్లభు నవలోకించి. 194
క. ద్విజుఁడఁ గురువిషయజాతుఁడ, సుజనప్రియుఁ డైనధర్మసుతుసఖుఁడఁ బరి
వ్రజనాశ్రమకలితుండ మ,నుజవల్లభ యోగ్యబహువినోదకరుండన్. 195
క. ద్యూతక్రీడకుఁ గొండొక, నేతుం గపటమున నొవ్వనిజనంబులు నా
చేతిధన మెల్లఁ గొని పరి,భూతి యొనర్చిన విరక్తి పుట్టి వెడలితిన్. 196
చ. నృపనయవిద్యకుం దగిననే ర్పలవడ్డది గొంత కొంత ధ
ర్మపరులసంగతిం దగిలి మచ్చిగ నుండుదుఁ బేరు కంకుఁ డే
వపుఁగొలు వైన నాకు నిలువన్ మది గొల్పదు గాన నిన్ను భూ
మిపతులలోన సాధుజనమిత్రుఁడు నా విని కొల్వ వచ్చితిన్. 197
తే. వత్సరంబునఁ గడచనువ్రతము నాకు, దాని నీపాలఁ జల్పి యుత్సాహవృత్తి
మెఱయ నాకుఁ గృతఘ్నత నెఱపి తొల్లి, యెగ్గు సేసినవారి జయింపఁబోదు. 198
వ. అనిన విని సంప్రీతచేతస్కుం డై విరాటుం డతని కి ట్లనియె. 199
తే. అట్ల చేయుఁడు రుచిరోన్నతాసనములు
వాహనములు భోజనములు వస్త్రములును
వలయుభోగములును నెల్లవర్తనములు
నాకు నె ట్లవ్విధమ మీకు నడపువాఁడ. 200
క. నాయనుచరులం దెవ్వఁడు, మీయెడ భయభక్తి లేక మిగిలి మెలఁగు నే
నాయధముని దండితుఁగాఁ, జేయుదు నతఁ డెంతయుం బ్రసిద్ధుం డయినన్. 201
వ. అట్లుం గాక 202
చ. వెలయఁగ మత్స్యరాజ్యపదవీపరిపాలన సేయఁగా మదిం
దలఁచుట యెంతయుం బ్రియము దమ్ములుఁ బుత్త్రులు బంధులుం బ్రధా
నులును బలంబు నేను సుమనోవిభుతుల్యుఁడ వైననిన్ను మి
క్కిలి యగుభ క్తిఁ గొల్చి కృతకృత్యతఁ బొందుదు మట్ల చేయవే. 203
వ. అనిన విని దరహసితవదనుం డగుచుఁ బాండవాగ్రజుం డతని కి ట్లనియె. 204
క. ఏను హవిష్యమ కుడుతును, భూనాయక నాకు శయ్య భూమియ యిమ్మైఁ
బూని వ్రతంబులు సలిపెడు, వానికి నిన్నియును నిట్లు వలయునె చెపుమా. 205
ఆ. అనిన విరటుఁ డిట్టు లనియె నెత్తెఱఁగున, నడవ నిష్ట మట్ల నడచి మీకు
మనసు వచ్చినన్ని దినములు సలుపుఁ డి, చ్చోట నదియ మాకు శోభనంబు. 206
క. ద్యూతజ్ఞులదెసఁ గొండొక, ప్రీతియుఁ గల దట్లుఁ గాక పెద్దల రగుమీ
రేతెఱఁగున విహరించినఁ, జేతోమోదంబు దగ వసింపుఁడు నెమ్మిన్. 207
వ. అని పలికి కౌంతేయాగ్రజు నత్యంతసంతుష్టాంతరంగుం జేసి 208
చ. పొరిఁ బొరిఁ బ్రీతి రెట్టిగ నపూర్వవిలోకన మాచరించుఁ ద
త్పర మగుసద్వివేకమున భావనిరూపణ సేయుఁ గౌతుక
స్ఫురణఁ గరంబు దత్కరముఁ బొంద నయంబునఁ జేర్చి వాక్యవి
స్తరచతురత్వ మేర్పడఁగ సల్లపనం బొనరించు నర్థితోన్. 209
వ. ఇట్లు మత్స్యమహీవల్లభుం డతనిం గలిపికొని పరివారంబును దానును దదీయ
సంభావనా తత్పరుఁ డై యుండె నంత. 210
భీముఁడు వంటలవాఁ డై విరటుఁ గొల్వ వచ్చుట.
సీ. చట్టువం బొకచేతఁ బట్టి ఖడ్గము సంకఁ, దగిలించి సురియతో బిగియ
ద్రిండు
గట్టిన నునుఁజేలక ప్పెంతయును జెన్ను, సేయంగ దాపలి చేతియందు
బెడిదంపుఁగోలలు బెడఁ గొంద బహువర్ణ, చిత్రితాజినము పై చీర గాఁగ
జూప ఱెల్లను దన రూపంబు చూడ్కికి, వ్రేఁ గైన నత్యంత విస్మయంబుఁ
తే. బొందు చుండ సమీరణపుత్రుఁ డగ్ర,జుండు వోయినదెసఁ దప్పనొండువలన
సమదవారణపతిగమనమున మత్స్య,ధరణివల్లభుసభ చేర నరుగుటయును. 211
వ. అంతంతం గనుంగొని. 212
క. ఉలుకును వెక్కసపాటును, దలకొను నెమ్మనముతోడ ధాత్రీరమణుం
డలఘుభుజవివులవక్షస్థ్సల రేఖాకాంతిఁ బరవశత్వముఁ బొందెన్. 213
వ. ఇట్లతని రూపాతిశయంబున కోటువడి చూచుచు నిజాంతర్గతంబున. 214
క. విహరింప మానవాకృతి, సహితంబుగ మహికి నర్థిఁ జనుదెంచిన ప
ద్మహితుఁడొ హిమకరుఁడొ శచీ, గృహమేధియొ కాక యితఁడు కేవలనరుఁడే. 215
గ. ఏమికులంబునవాఁడొకొ, నామం బెద్ది యగునొక్కొ నాభృత్యులలో
నీమనుజోత్తముఁ దొల్లియు, నే మెఱుఁగుదు మనఁగ నిచట నెవ్వరు గలరో. 216
క. అను చుండ ననతిదూరం,బున కల్లన వచ్చి పవనపుత్త్రుఁడు మనుజేం
ద్రునకు జయశబ్దయుతముగ, వినయంబున మ్రొక్కి విన్నవించె నిభృతుఁడై. 217
శా. దేవా నాలవజాతివాఁడ నిను నర్థిం గొల్వఁగా వచ్చితిన్
సేవాదక్షత యొండుమై నెఱుఁగ నీచిత్తంబునన్ మెచ్చున
ట్లే వండం గడు నేర్తు బానసమునం దిచ్చోటనే కాదు న
న్నేవీటన్ మిగులంగ నెవ్వఁడును లేఁ డెబ్భంగులం జూచినన్. 218
క. పేరు వలలుండు గూడుం, జీరయు నిడి సాకతంబు సేసినఁ జాలుం
గోరినవంటకములు నా, నేరిమిఁ దగ నెఱపి కొలుతు నిశ్చల భక్తిన్. 219
చ. అనవుఁడు మత్స్యభూరమణుఁ డాతని కి ట్లను నెట్లు శూద్రుఁ గా
నినుఁ దలఁపంగ వచ్చు ధరణీభరణక్షమమూర్తి వీవు నీ
కనుగుణ మైనయానమును నాసనమున్ రుచిరాతపత్రముం
జనవరికొల్వు నిచ్చెద గజవ్రజముం బరికింపు పెంపుతోన్. 220
క. అనుటయు మోఱకుచందం,బున మో మడ్డము గదల్చి భూవిభుఁడు సభా
జనులు విన ననిలసుతుఁ డి, ట్లనియెం బ్రస్ఫుటనిరర్గళాలాపములన్. 221
ఉ. నా కవి యెల్ల నేల నరనాథులకుం బ్రియ మొందునట్లుగాఁ
బాకము సేయ నేర్తు జనపాలక ధర్మసుతుండు పెద్దయుం
జేకొని యుండు బానసము సేయువిధంబున కిచ్చమెచ్చి పు
ణ్యాకరమూర్తి వైననిను నాతనిఁ గొల్చినయట్ల కొల్చెదన్. 222
చ. వలసిన నేలు మేను బలవంతుఁడఁ గారెనుపోతు దంతి బె
బ్బులి మృగనాథునిం దొడరి పోరుదు శూరత యుల్లసిల్లఁగా
దలమున లావు విద్య మెయిదర్పముఁ బేర్చి పెనంగుజెట్టిమ
ల్లుల విఱుతున్ వడిన్ గడియలోనన చూడ్కికి వేడ్క సేయుదున్. 223
క. కొలువు గొన నొల్లీకుండుట, గలిగినఁ బొమ్మనుట యంతకంటెను మే లే
వలసినకడ కేఁగెద నీ, తలఁ పెయ్యది యాన తిమ్ము ధరణీనాథా. 224
వ. అనిన విని భూనాథుండు సానునయంబుగా నిట్లనియె. 225
ఉ. ఇమ్మహనీయరూపమునయేడ్తెఱఁ గన్గొని వేడ్క నీకు యో
గ్యమ్మగుభంగిఁ జెప్పితిమి గాని నరోత్తమ యొండు గాదు నీ
వెమ్మెయి నైన నిల్చుటయ యిష్టము వంటలమేరవాఁడ వై
యిమ్మలనుండు సూపజన మెల్లను నీదగుపంపు సేయఁగన్. 226
క. అని హర్షోత్కర్షంబున, మన మలరఁగఁ బల్కి మత్స్యమనుజాధీశుం
డనిలసుతు నేలె నాతఁడుఁ, దనమనమున నూఱడిల్లెఁ దదవసరమునన్. 227
అర్జునుఁడు పేడిరూపమున విరటుఁ గొల్వ వచ్చుట.
సీ. కాళ్లయొప్పిద మాఁడుక ట్టనుజ్వ్జలము సే,యంగ సంకులబాహులంద మెడలఁ
గంచుక మంగంబుకాంతికి మాటుగా, మెడ హేమపట్టిక మెఱయ కుండ
వదనంబుకొమరు భావనఁ జేసి వేఱుగా, నుదుటిపెంపలకలఁబొదువఁబడఁగఁ
బవడంపుజొత్తులఁ జెవులు రూ పడఁగంగఁ, బాపటఁ దలకట్టుభంగి గప్ప
ఆ. మంచు మఱుఁగువడినమార్తాండుఁడునుబోలె, నీఱు గవిసి యున్ననిప్పుఁబోలె
వేషధారి యైన విష్ణుండుఁబోలె న,వ్విరటుకొలువు సేర నరుఁడు వచ్చె. 228
క. చనుదెంచి పేడితనమును, వనితారూపంబు నమర వాసవసుతుఁ డా
మనుజాధీశునకు సభా, జనులకుఁ దనుఁ జూపి మందపంచారమునన్. 229
వ. మెలంగినం గనుంగొని మత్స్యజనవిభుండు దనయొద్దివారలతో ని ట్లనియె. 230
మ. వనితావేషము గల్గి యున్నయది చెల్వం బాఁడుచందంబు గా
దు నిరూపింప మహానుభావతయు నిర్దోషత్వమున్ రాజసం
బును శోభిల్లెడు నెవ్వఁ డే నొకజగత్పూజ్యుండు గ్రీడార్థ మి
ట్లొనరం దాల్చినరూపు గావలయు మీ రూహింపుఁడా యట్లగున్. 231
తే. అనినఁ బరిజనంబులు విస్మయంబు గదుర, నిశ్చయముసేసి పలుకంగనేర్పు లేక
చూచు చుండఁగ నాసవ్యసాచి సేరఁ, జని విరాటనృపాలుతో సవినయముగ. 232
క. నిన్నుఁ గొలువంగ వచ్చితిఁ, గన్నియలకు నాట గఱపఁ గా నోపుదు వి
ద్వన్నుత మన్నామంబు బృ,హన్నల యేఁ బేడి ననుడు నతఁ డి ట్లనియెన్. 233
ఉ. ఆయతబాహులున్ వెడఁద యైనసమున్నతవక్షమున్ సరో
జాయతలోచనంబులుఁ బ్రసన్నముఖంబు నుదా త్తరేఖయుం
గాయజుఁ గ్రేణిసేయు ననఁ గౌశికు మీఱు ననంగ విభ్రమ
శ్రీయును బెంపునుం గలుగఁ జేసి విధాతృఁడు పేడిఁ జేసెనే. 234
శా. మత్కోదండచయంబులోన నొకసమ్మాన్హార చాపంబు భా
స్వత్కాండంబులు హేమచంద్రకకనద్వర్మంబు నీ కెంతయున్
సత్కారంబున నిచ్చి వాహనపరిష్కారాంకసంభావ్యసం
పత్కల్యాణునిఁ జేసి వైభవము దర్పంబున్ విజృంభింపఁగన్. 235
క. ఏము నిను మత్స్యరాజ్య, శ్రీమహిమకు నెల్ల యు క్తుఁ జేయఁ దలంపం
గా మామనోరథమునకు, నీమాట విరుద్ధ మయ్యె నిది యెట్లొక్కో. 236
వ. అనిన విని యమ్మహీపతికి బృహన్నల యిట్లనియె. 237
ఉ. ఆఁడుదనంబు నిక్కమున కారసి చూచిన లేదు పుంస్వ్తముం
బోఁడిమి దప్పి యున్నది నపుంసకజన్మ మవశ్యభోగ్య మై
వాఁడిమి గల్గుశాపమున వచ్చెఁ బురాకృతకర్మ భావ్య మె
వ్వాఁడును నేర్చునే తొలఁగ వైవఁగ నోర్వక పోవ వచ్చునే. 238
వ. కావున, 239
తే. ఒండుపనులకు సెలవు లేకునికిఁజేసి, యభ్యసించితి శైశవ మాది గాఁగ
దండలాసకవిధమును గుండలియును, బ్రెక్కణంబు తెఱంగును బేరణంబు. 240
క. విశ్రుతవాద్యంబులు మం,జుశ్రుతిసంభావ్యగీతసుగతులు సద్భా
వాశ్రయములుఁ దజ్జన్యర,సాశ్రయములు నైనయభినయంబు లెఱుఁగుదున్. 241
తే. ఇన్ని తెఱఁగుల శ్రమము సేయింతుఁ జతుర, తావిహీనములైన పాత్రములనైన
నట్టువొజ్జనై మెలఁగుదు నగళులందు, నిపుణనైపథ్యవిధులకు నేర్తునధిప. 242
చ. అనుడు విషణ్ణ మైనహృదయంబున గారవ మొంద నైపుణం
బున నుచితంబుమై నరసి పొచ్చెము లేమిఁ దదీయసేవ గై
కొనుటకు నిశ్చయించి తనకూఁతు విరాటుఁడు పిల్వఁ బుచ్చె న
ర్తనమునకై బృహన్నలకుఁ దత్పరతం దగ నప్పగింపఁగన్. 243
వ. ఇట్లు రావించిన, 244
సీ. అల్లదనంబున ననువు మైకొనఁ జూచు, నడపు కాంతికి వింతతోడవు గాఁగ
వెడవెడ నూఁ గారి వింత యై యేర్పడు, దేరనివళులలో నారు నిగుడ
నిట్టలు ద్రోచుచు నెరవులకలమేర, నెల్లను బిగి యెక్కి యేర్పడంగఁ
దెలుపును గప్పునువెలయంగమెఱుఁ గెక్కు, తారకంబులఁగల్కితనముదొడరఁ
ఆ. జరణములును నడుముఁ జన్నులుఁ గన్నులు, జవ్వనంబుచెన్ను నివ్వటిల్లు
చునికిఁ దెలుపుచుండ నుత్తర సనుదెంచె, నలరువిలుతుపువ్వుటమ్మువోలె. 245
ఆ. వచ్చి కొలువు సొచ్చి నెచ్చెలిపిండు నం, తంత నిలువఁ బనిచి యల్లనల్లఁ
గదిసి ప్రౌఢవనితకైవడి ముద్దియ, ముద్దు వుట్టఁ దనకు మ్రొక్కుటయును. 246
చ. తిగిచి కవుంగిలించి జగతీవిభుఁ డక్కమలాయతాక్షినె
మ్మొగము మొగంబునం గదియ మోపుఁ గరాంగుళులం గపోల మిం
పుగఁ బుడుకుం బొరింబొరి నపూర్వవిలోకన మాచరించుఁ గ
ప్పగుమృదుమౌళి నుజ్వ్జల నఖాంకురచేష్ట యొనర్చు నర్మిలిన్. 247
వ. ఇవ్విధంబునం దనగాదిలికూఁతు నుపలాలించి బృహన్నలదెసం గనుంగొని సాదర
దరహసితరుచిరాననుండై యిమ్మగువ నీకు నాట గఱపందగుపాత్రం బగునేయని యడిగి
తత్ప్రతివచనంబులయందలినాగరికత్వంబునకుఁ జిత్తంబు రంజిల్ల మధుర
సల్లాపంబుసేసి కర్పూరసహితం బగుతాంబూలంబు వెట్టి చిత్రంబులగు చీనాంబరంబు
లిచ్చి మణిమయంబు లగునాభరణంబు లొసంగిసంభావించి యవ్విభుండు. 248
ఆ. నీవు చతురమతివి నీకు నిక్కన్నియ, నప్పగింప నేల యైన నాదు
హృదయమతులు దీనియెడఁ గడు నార్ద్రమై, యుండుఁగాన చెప్పకుండరాదు. 249
క. నెచ్చెలులతోడ నెంతయు, మచ్చిగఁ దనయిచ్చ నాడ మరగినయది యై
విచ్చలవిడి నింతకు ము, న్నిచ్చేడియ మెలఁగు శిక్ష యెఱుఁగదుసుమ్మీ. 250
ఆ. బాల కేళిమీఁదిభరము గ్రమంబున, విడువఁ గళలయందు వేడ్క సొనిపి
నయముతోడ నర్తనంబుల శిక్షింపు, నెలఁత కేడుగడయు నీవ కాదె. 251
చ. అని యుచితంబుగాఁ బలికి యంగనహస్తముఁబట్టి తత్కరం
బునఁ గదియించి నీగురువుఁ బొల్తి తగం గొనియాడు మెట్లు సె
ప్పె నటుల భక్తిమై నడవు పెం పెస లారఁగఁ గూడుగూర చం
దనకుసుమాదులున్ నడపి తప్పక యారసి గారవింపుమీ. 252
ఆ. ఎల్ల చుట్టములును దల్లియుఁ దోడును, జెలియుఁ బరిజనంబుఁ జెలువ నీకు
గురువ యింక నొక్క కొఱఁతయు లే దిందుఁ, జేరి బ్రదుకు బుద్ధి గౌరవమున. 253
క. మనయింట నిచ్చ టచ్చో టన కెచ్చట నైన నీబృహన్నల మెలఁగం
జనియెడుమానిసి తనమన,మున కిమ్మగునట్టిచరితమున వర్తించున్. 254
నకులుఁ డశ్వపాలకుఁడై విరటుఁ గొల్వవచ్చుట.
వ. అని యిత్తెఱంగున నయ్యిరువుర నొండొరులకు నప్పగించి పుచ్చినయనంతరంబ
నకులుండు, 255
ఉ. అంబుజముల్ సముద్యదరుణాంశునిఁ గన్నవిధంబునన్ వికా
సంబున నుల్లసిల్లి జనచారువిలోచనముల్ నిజోజ్వ్జలాం
గంబున కర్థిమై నభిముఖంబులు గాఁ జనుదెంచి దైవయో
గంబున భూవిభుండు దురగంబులఁ దేరఁగఁ బంచి చూడఁగన్. 256
వ. ఆస్థానంబు సేర వచ్చి ఘోటకంబుల నుపలక్షించు చున్న నన్నరేంద్రుఁడు
గనుంగొని పరిజనంబుల కతనిం జూపి. 257
క. ఇతఁ డెవ్వఁడొక్కొ రూపు ని,రతిశయ మై మనకునుఁ బ్రియం బొసఁగెడుఁ జూ
చితిరే చిత్తంబునుదా,త్తత గానఁగ నయ్యడున్ వదనమునభంగిన్. 258
క. తురగంబులఁ జూచువిధం, బరయఁగ నితఁ డశ్వవిద్యయందు నిపుణతా
స్ఫురణము గలవాఁ డగు బం,ధురమూర్తిపరాక్రమాన్వితుఁడు గానోపున్. 259
క. మీ రెఱిఁగినఁ జెపుఁ డీతని, పే రెఱుఁగనియట్టు లైనఁ బెం పారంగాఁ
జేరం జని యల్లన యొకఁ, డారసి యెఱుఁగంగ వలయు ననుసమయమునన్. 260
క. చేరఁ జనుదెంచి పాండవ,వీరుఁడు మత్స్యాధిపునకు వినతుం డై దే
వా రాజవాహనము లగు, వారువముల నరయ నేర్తు వల నేర్పడఁగన్. 261
వ. దామగ్రంథి యనువాఁడ నాకు నశ్వవిషయం బయినవిచక్షణత్వం బెల్లనుం గల
దవధరింపు మని యి ట్లనియె. 262
సీ. అవయవలక్షణం బాయుఃప్రమాణంబు, గర్భంబు లింగితాకారములును
మాత్రాంతరము వయోమానంబు దేశకా, లోచితాహారప్రయోగభంగి
జాత్యనురూపశిక్షావిధి క్రమగతి, వ్యాయామసాత్మ్యప్రవర్తనంబు
ప్రమదవిషాదాదిబహువిధచిత్తధ, ర్మము పోషణప్రకారము చికిత్స
ఆ. పరిచితములు ధరణిపాల నీముందట, రూపురేఖ మెఱయఁ జూప నేర్తు
బవర మైన నాకుఁ బని యేమి యనఁ జేతి, బలిమికలిమి నెఱపఁదలఁపు గలదు. 263
వ. అనిన విరాటుం డతని కి ట్లనియె. 264
క. నీకుఁ దగుపదవి యిచ్చెద, నాకలిమికి నెల్ల రక్షణం బొనరింపం
గాక హయశిక్షకుఁడ వను, నాకొలఁదియె యిట్లు పలుకు టనుచిత మరయన్. 265
ఆ. అనుడు నకులుఁ డిట్టు లను దేవ తమతమ, నేర్చుపనులవెంట నెగడి బ్రదుక
వలయుఁగాక నగరఁ దలము దప్పినమెలం,కువల కలుపు లియ్యకొనుట దగునె. 266
ఉ. ధర్మసుతుండు వెంచె ననుఁ దాన తురంగమ శాస్త్రశిక్షకుం
గర్మఠుఁ జేసి యాత్మతురగంబుల కెల్లను నన్న యుక్తుఁ గా
నర్మిలి నిల్పి యీగియుఁ బ్రియంబును నాయెడ నాఁడునాఁటికిం
బేర్మి వహించుచుండ నడపెం దనతమ్ములలోనివానిఁగాన్. 267
క. ఆవిభుఁడు రాజ్యసుఖలీ, లావిముఖత వెడలి బంధులం దొఱఁగి యథే
ష్టావాసత బ్రుంగుడువడి, పోవుట నెచ్చోటఁ గడుపుఁ బ్రోతునొ యనుచున్. 268
క. తిరిగి తిరిగి లోకోత్తర, చరితుఁడు సుజనుండు మత్స్యజనవిభుఁడు యుధి
ష్ఠిరునట్ల యనఁగ విని నినుఁ, గర మనురాగమునఁ గొలువఁగా నియ్యెడకున్. 269
క. చనుదెంచి కాంచి నానే, ర్చిన తెఱఁగున విన్నపంబు సేసితి నన్నుం
బనిగొనఁ దలఁచిన నేలెడి, దనుమానము గలిగినేని నరిగెద నధిపా. 270
వ. అనవుడు. 271
ఉ. ఆనరనాథుఁ డి ట్లనియె నశ్వములం బరికించి యున్కి యిం
పేనిఁ దురంగశాలలకు నెల్లను ముఖ్యుఁడ వై తదీయనా
నానియతప్రకారకరణంబులఁ ద్రిమ్మరు చున్నవారి ము
న్నే నెటు లట్ల నీ వరసి యిచ్చమెయిం బని గొమ్ము నెమ్మితోన్. 272
క. అని చెప్పి యధికసమ్మా, ననపూర్వము గాఁగ మత్స్యనరపతి మాద్రీ
తనయుఁ దగ నిల్పె నాతఁడు దనమదిఁ బ్రియ మందె నతనితమ్ముం డంతన్. 273
నహదేవుఁడు గోపవేషంబున విరటుఁ గొల్వ వచ్చుట.
క. పావనశాంతత్వము నిజ, భావంబున నూష్మలతయుఁ బ్రకటంబులుగా
నావిధుఁడు మనుజవేషుం,డై వచ్చెనొ శిఖి శరీరి యయ్యెనొ యనఁగన్. 274
క. తలుగులపొది యొకదెసఁ బె,య్యలదామెన యొక్కవలన నను వై యుండన్
మొల మోపి పెక్కుచుట్లన్, బలుద్రాటం జుట్టి గోపభావం బమరన్. 275
చ. నునుసెలగోల సేకొని మనోహర మౌతనమేను రాజుచూ
పును బ్రజచూడ్కులం దిగువఁ బుష్కరపత్త్రనిభంబు లైనలో
చనముల మూర్తి దెల్పఁగ ససంభ్రమతం జనుదెంచె నల్లన
ల్లన వెడభీతి దోఁప జనులన్ వెగ డయ్యెడుదృష్టిఁ జూచుచున్. 276
వ. ఇట్లు వచ్చి మత్స్యమహీవల్లభు నంతంతం జేరి వినయావనతుం డగుచు ని
ట్లనియె. 277
క. నీపసులఁ గావఁ బెట్టుము, భూపాలక నన్ను నేను బూని యరసినన్
గోపంక్తులు రుజ వడ వొరు, చేపడ వెన్నఁడును డప్పిఁ జేడ్పడ వెచటన్. 278
తే. తొఱఁగువోకుండ మెకములు గఱవకుండఁ
బాఁడి దఱుఁగక యుండ నాపాటిగొల్ల
లిచ్చ మెచ్చ నీదృష్టికి నెక్కఁ గదుపు
నరయ నేర్తు న న్నేలుము ధరణినాథ. 279
వ. అనిన విరాటుండు పాండవావరజున కి ట్లనియె. 280
ఉ. ఎక్కడిమాట గొల్లతన మించుకయేనియు లేదు నీదెసం
జక్కని మేను నీగఱువచందముఁ గాంతియుఁ జూడ వచ్చినన్
నిక్కువ మీవు సూర్యశశినిర్మలవంశజు లైనరాజులం
దొక్కమహానుభావుతనయుండవు గావలయున్ నరోత్తమా. 281
ఆ. వలయుపదవియందు నిలిచి నారాజ్య మం,తయును జక్కంబెట్టి నయము విక్ర
మంబు నడపునంత మానిసి వై యుండి, కుచ్చితంపుబ్రదుకు గోరఁ దగునె. 282
వ. ఉత్తమవాహనంబులు మహనీయాయుధంబులు నిచ్చెద మత్స్యదేశంబున భవ దభిమతస్థలం
బొసంగెద మదీయమండలసేనాపరిపాలనంబు సేసి వర్తిల్లుము. 283
క. అనవుడుఁ బాండునృపాలక,తనయుఁడు మ్రొక్కుచు విరాటధరణీశున కి
ట్లను హీనకులుఁడ బాలుఁడ, మును నాగరికంపుఁగార్యములవెర వెఱుఁగన్. 284
ఆ. పసులఁ గాచి కాని బ్రదుకఁ గౌరవులప్రాఁ, తలము మున్ను నేను ధర్మపుత్రు
పశుగణంబు నెల్లఁ బాలింతు నమ్మహీ, వరునిచిత్తమునకు వచ్చువాఁడ. 285
వ. తంత్రీపాలుం డనం బరఁగినవాఁడ నాచేతం గ్రేపులు పురాణించుటంజేసి కొండొక
కాలంబునన కదుపులం బెనుతు నే నగునని కైకొనిన యాఁబోతుపంచితంబు మూర్కొనినను
బైగాలి వీచినను గొడ్డున కైనంజాలు నిలుచు నుంగిడి యదురుఁ ద్రిక్క
యనువానికి నాపేరు సెప్పినం జాలు మఱియును బసికి వలయు తెఱంగు లెల్ల
నెఱుంగుదు వేఱొక్కపనికిం గాను గాని యే నీవెంట నీమనసు వడయం జాలుదు నావలనం
బ్రయోజనంబు గొనవలయు నేని నొండుమాటలు దక్కి పసులం బరికింప నియోగింపుము.
286
చ. అనుటయు నెట్టకేలకు ధరాధివుఁ డట్టుల కాక యంచు నా
తనివదనంబు సూచి యుచితం బగునేనిఁ బ్రియంబ యేని నె
ట్లును గురుకార్యవర్తనములున్ రుచియింపక యుండు నేని గో
ధనముల కెల్ల రక్షణము దత్పరతం దగఁ జేయు ముఖ్యతన్. 278
క. మున్ను గలగోపవర్గము, నిన్నుం గని కొలిచి భక్తి నీపని సేయన్
మన్ననమానిసి వై నీ, వున్నం గడు మేల కాక యొప్పమి గలదే. 288
ద్రౌపది సైరంధ్రీవేషమున సుదేష్ణఁ గొలువ వచ్చుట.
వ. అని పలికి యతనియభిమతంబు సలిపి నిలిపె న ట్లయ్యేవురును విరటుం గొల్చిరి
తదనంతరంబ. 289
క. గారవమున నిజదేశా, చారముమై నల్లి యున్నజడ యగుకబరీ
భారంబు విచ్చి తిరముగ, సైరంధ్రీజాతివేషసముచితభంగిన్. 290
క. వలపలిదిక్కున కించుక, మలఁగంగా దుఱు మిడి కుఱుమాపుడుఁబుట్టం
బలవడఁ గట్టి జరఠవ, ల్కలమున నెవ్వీఁగుఁజన్నుఁగవ గప్పి తగన్. 291
క. పరిచారికాత్వరేఖా, పరిణతి దనమేన నచ్చువడుభావనకుం
దిర మై తలకొనునంతః, కరణముతోఁ బురము ద్రుపదకన్యక సొచ్చెన్. 292
వ. ఇట్లు సొచ్చిన, 293
సీ. పఱమొయిల్‌గప్పినఁ బాడఱినునుఁగాంతి, గదలినయమృతాంశుకళయుఁబోలెఁ
బెనుమంచుమీఁదఁ బర్విన వికాసము దప్పి, చెలువు గుందినసరోజినివిధమున
ధూమంబు వొదివినఁ దుఱఁగలిమెఱుఁగులు, నలఁగి మాసినదీపకళికపగిది
ధూళి పైఁ బొరసినఁ దొంగలించుట మాని, లావణ్య మెడలినలతికభంగి
తే. గంధకారికావేషంబుకతన మూర్తి,యుజ్వ్జలత్వంబు మఱుపడియుండఁ బాండు
తనయమహిషి యంచితగతిఁజనఁగ రాజ, వీథిఁ బౌరజనంబు లవ్వెలఁదిఁ జూచి. 294
ఉ. రోహిణి యొండె నొండెను నరుంధతి గాక మనుష్యజాతియే
యీహరిణాక్షి చెల్వమున యేడ్తెఱ చూడ్కుల నాఁచికోల కా
దా హితగౌరవం బగుశుభాంగముఁ దేజముఁ జూడ బుద్ధి సం
దేహముఁ బొందుచున్నది సతీజన మిట్టిదె యెజ్జగంబులన్. 295
వ. అనుచు నంతంతం జేరి, 296
క. నీ వెవ్వ రేమిపనికై, యేవలనికిఁ బోవు చునికి యిది నావుడు న
ద్దేవియు సౌముఖ్యము సం,భావనముం దోఁప నుచితభంగిం జెప్పెన్. 297
ఆ. ఏను గట్టువాలుదాన నా కెవ్వరు, గడుపుకూడు వెట్టి కట్టఁ జీర
యిచ్చి సాకతమున నేలుదు రట్టివా,రలకుఁ బనులు సేసి మెలఁగుబుద్ధి. 298
క. వచ్చితి ననవుడు విని జను, లచ్చెరువును సందియంబు నడరెడుమదితో
నిచ్చెలువ కడుపుకూటికి, నెచ్చటనే నిలుచునట్టె యిది పలు కగునే. 299
వ. అనుచుం గనుంగొనుచు ముసరికొని చను చుండం బాంచాల రాజనందన రాజ
మందిరంబుచక్కటికి నరుగునవసరంబున. 300
క. ముద మొదవ రమ్యహర్మ్యము, తుదినిలువునఁ బ్రణయసఖులతోడ విహారా
స్పద మగునెలవున మెలఁగెడు, సుదేష్ణ తజ్జాలకములఁ జూచెం బ్రీతిన్. 301
వ. ఇత్తెఱంగున మత్స్యరాజమహిషి ద్రౌపదీదేవి నాలోకించి కుతూహలంబున. 302
ఉ. ఎక్కడనుండి యెక్కడకు నేఁగెడినో యిది యొక్కకాంత రూ
పెక్కుడుపెంపుసొంపు మన కేర్పడు చున్నది దా వినీత యై
స్రుక్కుచునీచభామినులచొప్పునఁ బల్కెడుఁ బౌరులుం గడున్
వెక్కస మంది చూచెదరు వేగమ తోడ్కొని రండు నెమ్మితోన్. 303
క. అని పలికి పనుపఁ బ్రౌఢాం,గన లిరువురు వోయి ద్రుపదకన్యకతో ని
ట్లనిరి విరాటుమహిషి నినుఁ, దనపాలికిఁ బిలువఁ బంపె దయ పెం పెసఁగన్. 304
వ. అనవుడు, 305
క. తనతలచీర యరసి య, వ్వనితారత్నంబు వినయవైభవము సతీ
తను వొందినచందంబునఁ, జనియెం గేకయసుతానుచారికలబడిన్. 306
వ. ఇవ్విధంబునం జని సౌధంబు నుపరిభాగం బెక్కి. 307
సీ. పదతలంబుల కెంపు పరఁగినతలము కుం, కుమ లిప్తమైనచందము వహింప
నంగంబునునుఁగాంతి యడరినగోడలు, వేదులు మణిమయవిధము నొందఁ
గనుఁగవమెఱుఁగులు గదిరినముందఱఁ బుష్పోపహారంబుపొలుపు దాల్ప
వేనలికప్పు పర్వినమీఁదు నీల దు, కూలంబుమేల్కట్టుకొమరు వడయఁ
తే. దాను జొచ్చిన కతనమత్స్యక్షితీశు, నింటనిమ్మెయిఁ గ్రొత్తయొప్పెసక
మెసఁగ
నమ్మహాదేవి యున్నెడ కల్లనల్లఁ, బాండురాజతనూభవపత్ని యరిగె. 308
వ. కేకయరాజనందనయును. 309
చ. కనుఁగొని గారవంబును మొగంబును గేలుఁ బురఃప్రసారముం
దనువును నమ్రభావమును దంతమరీచులు సామినిర్గమం
బును దనలోఁ గడల్కొనఁగ భూరితరాదరరేఖ నిందు ర
మ్మనవుడు నంత నంత ద్రుపదాత్మజ సేరి వినీతి నిల్చినన్. 310
క. ఆపాదమస్తకము త, ద్రూపము వీక్షించుచుం గుతూహల మడరన్
భూపాలమహిషి యి ట్లను, నాపొలతుకతోడ నుచితమయ్యెడుభంగిన్. 311
ఆ. ఏది కులము నామ మెయ్యది యెవ్వరి, దాన వేమిపనికిఁ బూని యిప్పు
డెచటు బుద్ధిఁదలఁచి యేఁగెదవింతయు, నెఱఁగఁజెప్పు మాకుమెఱుఁగుబోఁడి. 312
వ. అనిన విని యాజ్ఞసేని యిట్లను నేను సైరంధ్రీజాతిసంభూత నభిదానంబు మాలిని
పురుషపంచకసనాథ నై యుండుదు నొక్క కారణంబున నుద్ధతు లగువిరోధుల చేతం
బతులసన్నిధిందలవట్టి యీవ్వంబడి వనంబునకరిగి వ్రతంబుమై వల్లభసహితంబుగా
వన్యాహారంబులం గాలంబు గడపుచు బ్రహ్మచర్యంబు నడపితి నిట మీఁద
నియమాచరణంబునకు నొక్కసంవత్సరంబు గొఱంత గలదు నీవు ధర్మవర్తిని వని వినుటం
జేసి నానేర్చుపనులవెంట నీకడ నిలువం దలంచి యిందు వచ్చితి ననవుడు సుదేష్ణ
యిట్లనియె. 313
క. సురగరుడఖచరవిద్యా, ధరకిన్నరయక్షసిద్ధతరుణులలో నీ
వరయఁగ నొక్కత వగు ది,ప్పురికిం జనుదేరఁ గతము బొంకక చెపుమా. 314
క. అనుటయు దరహసితము మో,మునకుఁ దొడవుగాఁగఁ బలుకు ముద్దియ యేఁ గృ
ష్ణునిదేవి సత్యభామకుఁ, బని సేయుదుఁ దొల్లి పిదపఁ బాంచాలికడన్. 315
తే. తగువుమైఁ బరిచారికాధర్మములకు, నెల్లఁ జాలి వర్తించితిఁ దల్లి వినుము
నాకుఁబ్రాణంబు ప్రాణమైనన్నుఁ దన్న, కాఁగ భావించి యాదేవిగారవించు. 316
వ. నీవును. 317
క. నీచము లయ్యెడుపనులకు, నాచాలమి యెఱిఁగి మన్ననకుఁ బాత్రముగా
నీచిత్తంబునఁ గైకొని, యాచారము దప్ప కుండ నరయుము నన్నున్. 318
వ. అని యిట్లు దేవజాతి యనుసందియంబు వాయం బలికి మఱియును. 319
క. కలపములు గూర్ప బహువిధ, తిలకంబులు వెట్ట వింతతెరువునఁ బలు పు
వ్వులు గట్టి కట్టి మోడ్వఁగఁ, దల ముడువఁగ సరులు గ్రువ్వఁ
దద్దయునేర్తున్. 320
మ. అనినం గేకయరాజనందన ప్రభూతాశ్చర్యయై యి ట్లనున్
విను నీరూపము సూచి మానృపతి యువ్విళ్ళూరు నే నెమ్మెయిం
బనిగొందుం దగ నింతులుం దగిలి నీపైఁ జూడ్కి నెక్కొల్పి నె
మ్మనముల్ విస్మయ మందఁ జూచెదరు భామా పల్కు లిం కేటికిన్. 321
క. దుర్భర వగునినుఁ గర్కటి, గర్భము ధరియించునట్లు గైకొని నాకై
నిర్భరవిధ్వంసదశా, విర్భావము దెచ్చికొనుట వెరవై యున్నే. 322
ఆ. అనిన నీతలంచినట్ల కా దేర్పడ, వినుము నాదుపతులు వెరవు లావు
నలఘవిక్రమంబుఁ గలుగు గంధర్వు లే,మఱరు నన్ను నొక్కమాత్రయైన. 323
క. నీచమతి నన్ను నెవ్వఁడు, సూచిన నారాత్రిలోనఁ జూతురు దెగఁ దా
రాచపలు హరిహరాదులు, గాచిన బలవిక్రమము లఖర్వము లైనన్. 324
క. బంధుశతంబులు శౌర్యమ, దాంధము లై శక్తిసంపదాభీలతమై
సింధురసదృశత నున్నను, సంధులసంధు లెడలించి చంపుదు రతనిన్. 325
వ. కావునఁ బురుషులు నాకడం దేఱి చూడను వెఱతు రదియునుం గాక. 326
క. నాచిత్తము తాదృశులకు, గోచరమే యస్మదీయకులజన సంశి
క్షాచారమహిమ యట్టిది,యే చెప్పకు తద్విధాతిహీనవచనముల్. 327
చ. మనమున నూఱడిల్లు మనుమానము మానుము నన్ను నేలు మే
పనులు నుదాత్తనాగరికభంగుల నీమది కెక్కునట్లు నే
ర్పును భయభక్తులున్ మెఱయ రూపుగఁ జేసెదఁ దజ్‌జ్ఞు లైన స
జ్జనులు నుతింప వర్తనము సాధులు వృద్ధులు మెచ్చఁజల్పెదన్. 328
క. ననుఁ గుచ్చితంపుఁబనులకుఁ, బనుపక యెంగిలికి లోనుపఱుపక తగుమ
న్ననతోడ నరయువారల, కనురాగము నెఱపి నడతు రస్మత్పతులున్. 329
ఆ. అనిన సంతసిల్లి యద్దేవి సైరంధ్రి, నూఱడిల్లఁ బలికి యునిచికొనియె
నంతిపురముచరిత కలవడ మెలఁగుచు, నుండె నవ్వధూటియును ముదమున. 330
క. ఇవ్విధమున నయ్యేవురు, నవ్వెలఁదియు సకలజనుల కజ్ఞాతముగా
నవ్విరటుప్రోలఁ బ్రమదము, నివ్వటిల వసించి రుచితనిభృతత్వమునన్. 331
వ. అనిన విని వారలవర్తనం బటమీఁదఁ జెల్లిన తెఱం గెఱింగింపు మని యడిగిన.
332
ఉ. బాంధవశాత్రవాకలితభావభవా భవపాశ బంధసం
బంధవిరామరామ పరిపక్వవివేకనిరూఢభక్తహృ
ద్గ్రంథవిభేదనా పరమకారుణికా పరిమాణదూర దుః
ఖేంధనపావకాయితసమీక్షణ చైత్తమహాద్భుతప్రభా. 333
క. అన్నమయత్వాదివిరా, మోన్నతివాఙ్మనసదూర యోగిస్మేరా
భిన్నాభిన్నాకార, చ్ఛన్నాత్మీయప్రకార జగదాధారా. 334
మాలిని. కమలభవకిరీటగ్రామపద్మావలీసం
గమసుభగపదాబ్జా గాఢభక్తిప్రకార
ప్రముదితమునిశశ్వద్భావనాగమ్యరమ్య
క్రమపరిణతమూర్తీ శ్రౌతశాఖాగ్రవర్తీ. 335
గద్యము. ఇది శ్రీమదుభయకవిమిత్త్ర కొమ్మనామాత్యపుత్త్ర బుధారాధనవిరాజి
తిక్కనసోమయాజిప్రణీతం బయిన శ్రీమహాభారతంబున విరాటపర్వంబునందుఁ
బ్రథమాశ్వాసము. 336
విరాటపర్వము - ద్వితీయాశ్వాసము.
క. శ్రీమదపాంగాలోకన
ధామసకృత్సంగరూఢ తాదృశవిభవో
ద్దామాశ్రితలోకా లో
కామయన్హిరరణనిపుణ హరిహరనాథా. 1
వ. దేవా వైశంపాయనుండు జనమేజయున కి ట్లనియె నట్టియెడ ధర్మసూనుండు సభా
జనంబులయుల్లంబులు రంజిల్ల రాజునకు వినోదంబులు వివిధోదాత్తప్రకారంబులఁ
జలుపుచు నొక్కొక్కమాటు మధురప్రసంగంబుగా నాడిననెత్తంబున గెలిచిన
విత్తంబులు దమ్ముల కొసంగుచుండు వాయునందనుండు వంటకు మిగిలినమాసంబు
లమ్మునెపంబున నిచ్చలు సహోదరులకు నిచ్చు చుండు వివ్వచ్చుండు సంగీత
ప్రసంగంబున మెచ్చువడసినకనకాంబరాదులు సోదరులకుం జేర్చు చుండు నకులుండు
దురంగంబులగ్రాసంబులం గనినధనంబులు తోడంబుట్టువులకుఁ బెట్టుచుండు సహదేవుండు
గోవులం జూచి భూవల్లభుండు సంతసిల్లినసమయంబున సముపార్జితంబు లగుపదార్థంబు
లన్నియు నన్నల వశంబుసేయుచు వారలకు గోరసంబులం దుష్టి సలుపు చుండు ద్రౌపది
ద న్నరసికొని తిరుగు చున్నవీరులం గన్నులారం జూచుచు నుచితంపునడవడి మెలంగు
చుండు. 2
తే. ఇట్లు దమతమవర్తిల్లు నెడల సకల
జనములకు హృదయానురం జన మొనర్చి
తాల్మి పుయిలోట యడఁకువ తగవు మెలపు
నెఱిదెఱంగును బాటింప నేర్పు గలిగి. 3
క. ఉన్నతఱి వివిధదేశో, త్పన్నులు నద్భుతవిధాయి బలవిక్రమసం
పన్నులు నగుమల్లులు విభ,వోన్నతుఁ డగువిరటుపాల నుద్భటవృత్తిన్. 4
క. తమలోన మాటలాడెడు, సమయంబున నొక్కరుఁడు వి శాలోరస్కుం
డమితబలుఁడు పంచానన, సమమూర్తిస్ఫూర్తి యధిక సంరంభమునన్. 5
వ. అన్నరపతికట్టెదుర నిల్చి భుజాస్ఫాలనంబుఁ జేసి యిట్లనియె. 6
తే. నేలనాలుగు సెఱఁగుల నృపులకొలువు, లందు నేను వర్తించితి నవనినాథ
యగ్గలించి నాయెదుర బా హప్పళించి, కడఁగఁజాలెడుమల్లులఁ గాననెందు. 7
చ. అనునెడ వానియుగ్ర సమ దాకృతియుం బటువాక్యవృత్తియుం
గని విని మల్లు లెల్ల భయ కంపితమూర్తులు దాల్చి మాఱు వ
ల్కను గను విచ్చి చూడను మొ గం బెగయింపను జాల కున్న న
జ్జనపతివేడ్క మ్రోడుపడు చందము గాంచి యుధిష్ఠిరుం డనున్. 8
క. వీనికి మార్కొనఁ జాలెడు, దానికిఁ దగువాని ధర్మ తనయునిపురిలో
నానానియుద్ధలంపటు, నే నొక్కనిఁ గంటి నిప్పు డిందుల కతఁడున్. 9
క. మనబానసీఁడు వలలుం, డనుశూద్రుఁడు నాకుఁ దెల్ల మధికబలుల నో
ర్చినవాఁ డనేకమల్లుల, నిను మెచ్చింపంగఁ జాలు నిజ మిది యధిపా! 10
క. అనవుడు భూపతి పిలువం, బనిచె నతని నతఁడు నపుడు భయభక్తులతోఁ
జనుదెంచి మల్లవర్గముఁ, గని మై వెఱుగంగ నిలిచె గౌతూహలియై. 11
వ. ఇట్లు నిలిచినపవనతనయు నవలోకించి యవనీవల్లభుం డమ్మల్లముఖ్యుం జూపి
యితనితోడియుద్ధంబునకు సన్నద్ధుండవుగమ్మనిన నతండును ధర్మతనయు కనుసన్న
గయికొని యమ్మత్స్యవిభునకు వినయంబుతో నిట్లనియె. 12
తే. అధిప ధర్మజుపాల ను న్నప్పు డతని, వేడుకకుఁ దగఁ బెనఁగుదు వింత లైన
జెట్టిమల్లులతో నిప్పు డట్టువోలె, నీదువేడ్కకుఁ బెనఁగెద నేర్చినట్లు.
13
భీముఁడు మల్లునితో యుద్ధము చేయుట.
వ. అని మెత్తన యియ్యకొని గర్జించి గజాలస్యంబున నంగణంబుసొచ్చి భూపాలుని
ముందట భుజాస్ఫాలనంబు సేసి మ్రొక్కి మరలునెడ నంతకు మున్న యమ్మల్ల వరుండు
నరపతియనుమతి వడసి కృతపరికరబంధుండై యరుగుదెంచి యచ్చట నునికిం జేసి యతండును
ననిలసుతుండునుం బరప్పరమూర్తుల నవలోకించి యుద్ధ రంగంబుమన్ను ఫాలప్రదేశంబుల
ధరియించి శిరంబులపైఁ జల్లుకొని రెండు సేతుల మునివ్రేళ్ళను గొండొక
పుచ్చికొని యొండొరులదెసకు వైచి యున్నతంబు లగునపసవ్యకరంబుల
నాకుంచితసవ్యబాహుతలంబుల నప్పళించుచప్పుళ్లు గలసి యొక్కరుండ
మల్లచఱచినచందంబున వీతేర వింతతానకంబుల నిలిచి కదిసిన యప్పుడు వృకోదరుండు.
14
సీ. ఉపతాయిలోఁ దన కొదవినతోరహత్తము సూపి వేయక సమదవృత్తిఁ
బాసి క్రమ్మఱఁ జేరు బలువిడి వాఁడు పై, నడరిన జరగక యవనిఁ గ్రుంగి
నిలుచు నొత్తొరువున వలచినయప్పుడు, గొనిపోవు నవలీలఁ గూల వైచు
జళికి పట్టిన మను సన్నపువిన్నాణ,ములు దొరకొన్నను ముట్టఁగొనఁడు
తే. కాలిదెసఁ జొర వచ్చుట గానిపించి, యుడుగుసీసానఁ బట్టియు
నుప్పళించుఁ
బోవ నిచ్చు మగుడ నేచి పోరఁ జేరు, నెడల సరిసేయ నగుతడ వీకహత్తు. 15
వ. మఱియు ననేకగతులయోజలు మెఱయుచుఁ గొండొకసేపు విరాటునకు వినోదంబు సలిపి.
16
ఆ. కచ్చ యమరఁ బట్టి కాళ్లును చేతులు, వ్రేల మత్తగజము లీల మెఱయ
ముష్టిబలువు నెఱయ ముక్కున వాతను, నెత్తు రొలుక ముల్లు నెత్తి వైచె.
17
వ. ఇవ్విధంబున విసరి నేలతో వ్రేసి వీఁపున మండివెట్టిన. 18
క. పెలుకుఱి తాళం బీ మదిఁ, దలఁచి యనువు గాక ధరణి తలముఁ గరతలం
బుల నప్పళించె వాఁడ, క్కొలు వార్వఁగ విడిచి మెఱసెఁ గుంతీసుతుఁడున్. 19
వ. ఇవ్విధంబున మహాబలుపట్టి యాజెట్టి నెట్టన గెల్చిన మత్స్యపతి మెచ్చి తన
కిచ్చినధనంబు లచ్చటిజనంబుల కిచ్చి నిజనివాసంబునకుం జనియె మఱియు
నిత్తెఱంగున నతనికి వేడ్క సలుపుచుండుఁ జిక్కనిమల్లులు లేనితఱి నంతిపురంబు
నింతులు సూడ నయ్యవనీకాంతుండు పోరింప శార్దూలశుండాలాదులతోడ నీడంబోక పెనంగి
భంగంబునకుం దెచ్చి మెచ్చించుచుండు. 20
క. పెఱవారలు దమమెలఁగెడు, తెఱఁగులు దొరఁకొన్న వింత తెరువులనేర్పుల్,
మెఱయుచుఁ బతిచి త్తము గొన, నొఱపు గలిగి మాన్యవృత్తి నుండుదురు దగన్. 21
వ. ఇట్లు పాండవులు పాంచాలీసహితంబుగా విరాటునగరంబున వర్తించుచుఁ గతిపయ
దినంబులు గొఱంతగా నేఁడుకాలంబు గడపినసమయంబున మత్స్యపతి మఱందియు
దండనాథుండును గీచకాగ్రజుండును రూపాభిమానియు నానాభరణ ధరణశీలుండును
దుర్విదగ్ధుండును బలగర్వితుండును నగుసింహబలుండు తనయప్ప సుదేష్ణకు
మ్రొక్కం జనువాఁ డద్దేవి కనతిదూరంబున నున్నద్రుపదరాజ నందనం గనుంగొని. 22
ఉ. అక్కజ మైనచెల్వమున నాత్మకు వ్రేఁ గయి పొల్చుపొల్తిపై
నెక్కొనుచూడ్కిఁ గ్రమ్మఱుప నేరక యూరక నిల్చెఁ గాముచేఁ
జిక్కిననెమ్మనంబుఁ గడుఁ జేడ్పడుమానముఁ జేష్టితంబులం
దక్కినయంగముం దలఁకు ధైర్యము నై యతఁ డప్పు డయ్యెడన్. 23
తే. ద్రౌపదీరూపమనునురిఁ దగిలి తనదు, హృదయ మనుమృగమత్తఱి నుదిలకొనుచు
గాముఁ డనుబల్లిదపు వేఁట కానిబారిఁ, బడుట కెంతయు నాసింహ బలుఁడు దలరి. 24
వ. నిజాంతర్గతంబున. 25
ఉ. ఎందును నిట్టిరూపు నరు లెవ్వరుఁ గాంచిరె నాక కాదు సం
క్రందనసూతికిం దగిలి కన్గొనఁ జాలదె దీన నిందిరా
నందనునాజ్ఞ యేచి భువ నంబులఁ బ్రబ్బదె యిత్తలోదరిం
జెందఁగ గాన్పు గాదె ఫల సిద్ధి పురాతనపుణ్యవృద్ధికిన్. 26
సీ. ఇయ్యింతిప్రాపున నయ్యనంగుఁడు పార్వ,తీశు నైనను దక్క నేల కున్నె
యిన్నాతిచెలువంబు గన్న శచీప్రియుం, డైననుగనుకలి నవయ కున్నె
యిత్తన్వి కెన లేమి కెదిరి పన్నిదము భా, షావిభుతో నైనఁ జఱవ రాదె
యిత్తలోదరిజీవి తేశున కిందిరా, పతినైన మెచ్చక పలుకఁ జనదె
తే. కుసువ బాణునిబాణముల్ గూడ నైదు, గరఁగి నేరిమివాటించి కరువుగట్టి
పోసి చేసి చైతన్యసం పుటముదగ ఘ,టించిరో కాక యిట్టిచే డియలుగలరె. 27
క. ఈనెలఁతఁ గన్నమన్మథుఁ, డైనఁ జిగురుగొడుగుఁ బువ్వు టమ్ములపొదులున్
లోనుగ సెజ్జలు సేయం, దానియమింపండె విరహ తాపము పేర్మిన్. 28
వ. అని వెండియు. 29
సీ. దీనిజన్మంబునఁ దేజంబు నొందిన, యింతియుఁ బతియును నెవ్వరొక్కొ
దీనినామాకృతి గా నోఁచి పడసిన, యిం పగువర్ణంబు లెవ్వియొక్కొ
దీనివల్లభుఁ డన ఁగా నిల సొబగుసొం, పెసఁగ వర్తిల్లువాఁ డెవ్వఁడొక్కొ
దీని వసించుటఁ దా నొప్పి పెంపున, నేపారుమందిరం బెద్దియొక్కొ
ఆ. దీనిఁ బొందఁ గాంచు తెఱఁగు నా కెయ్యది, యొక్కొ యిట్టిపనికి
నూఱడిల్లి
తోడుకొనఁగ నిచట నీ డగుచుట్టంబుఁ, దడవి యెట్టులొక్కొ పడయువాఁడ. 30
చ. అని యని యుగ్గడించు ధృతి యల్లల నాడినఁ దల్లడించుఁ బై
కొనుతలఁ పోరగించు మదిఁ గోర్కులు పేర్చిన నప్పళించు నె
ట్టన తెగ నగ్గలించు నచ టన్ జనులం బరికించు బుద్ధి దూ
లిన వెస నెంతయుం గళవ ళించు మనోజవికారమగ్నుఁడై. 31
క. మాసినచందముఁ దనుఁ గని, రోసినడెందంబుఁ గలత రుణి నెఱుఁగఁడ బి
ట్టేసినమదనునిచే ధృతి, వాసిన బెగ డొందు సింహ బలుఁ డట్టియెడన్ 32
సీ. వెఱవక ననుఁ జూచు వీఁ డనియెదఁగలు,షించిన నొండొండ చెమట వొడమ
ననుచితకృత్యంబు లాచరించువిధాతృ, బలిమికి నివ్వెఱ పాటు దోఁప
నిచ్చట దిక్కు లే రెవ్వరు నా కను,భయమున మేనఁ గం పంబు వుట్టఁ
జేయంగ నేమియు పాయంబు లేమి నా, ననమున వెల్లఁద నంబు గదుర
తే. నున్నపాంచాలిఁ గనుఁగొని యన్నరాధ
ముఁడు వివేకవిహీనుఁ డై ముదితుఁ డగుచు
మదనవికృతియ కాఁ దన మదిఁ దలంచి
రాగసాగరపూరని ర్మగ్నుఁడయ్యె. 33
వ. అయ్యవసరంబున. 34
చ. పొలఁతుక కాంతి యింత పొలి వోవఁగ నీ కెసలారుతార ని
శ్చలతఁ గడంగి క్రోలికొనఁ జాలుటఁ గీచక ముఖ్యులోచనం
బులు నయనం ప్రధాన మను పూర్వవచస్థ్సితి దప్పకుండఁగా
నెలమి వహించెఁ దక్కుఁ గల యింద్రియవర్గము ధిక్కరించుచున్. 35
క. అప్పయుఁ బరిజనములుఁ దనుఁ, దప్పక కనుగొనుచు నుండఁ దగ వేది కరం
బొప్పనితమకము చిత్తము, గప్పికొనుట నుత్తలంబు గదురఁగ నచ్చోన్. 36
సీ. తన్వంగిమవ్వంపుఁ దనులత నెసఁగెడు, నునుఁగాంతివెల్లవ మునుఁగఁ బాఱఁ
గిసలయహస్తకెం గేల నేపారుక్రొ, మ్మించను లేయెండ మిగులఁ బర్వఁ
గమలాస్యముద్దుమొ గంబులేమెఱుఁగుల, మొత్తంబుపరి చుట్టు ముట్టికొనఁగ
ధవళాక్షితొంగలి తఱచుఱెప్పల చెన్ను, క ప్పనుచీఁకటి గవియుదేర
తే. బెగ్గలం బంత కంతకు నగ్గలింప, నొదవు చెమటతోఁ జిత్తంబు సెదరియెందు
మెలఁగఁ దలపేదియాసింహ బలుఁడనంగు, పట్టియాడెడుజంత్రంబు పగిదినుండె. 37
కీచకుఁడు సుదేష్ణవలన ద్రౌపది తెఱం గెఱుంగఁ గోరుట.
వ. ఇట్లు కందర్పదర్పగోచరుం డైనకీచకుండు నిజసహోదరివలన నక్కోమలి కలరూపు
దెలియం దలంచి దానిదెసం దగిలినదృష్టి యెట్టకేలకుం దిగిచికొని చని
యద్దేవికిం బ్రణమిల్లిన. 38
క. కాంచనపీఠము వెట్టఁగఁ, బంచి ప్రియముచూడ్కి ముసుఁగు వడఁదను సంభా
వించునెడ నాతఁ డప్పకుఁ, బాంచాలిం జూపి వేగ పడి యి ట్లనియెన్. 39
ఉ. ఇయ్యరవిందగంధికుల మేమి చరిత్రముచంద మెట్లు పే
రెయ్యది నాథుఁ డెవ్వఁడిది యెచ్చట నెప్పుడు నుండు నిప్డు దా
నియ్యెడ కేఁగుదేవలయు టేపని సేయఁగఁ బూని దీనిపై
నెయ్యముకల్మి యేకొలఁది నీమది కింతయు నాకుఁ జెప్పుమా. 40
క. అనవుడు నయ్యంగన యితఁ, డనంగశరదళితహృదయుఁ డయ్యెనకట యీ
తనిచిత్తవృత్తిమరలుప, ననురూపం బగునుపాయ మది యెయ్యదియో. 41
వ. అని తలంచుచుఁ గీచకునిమాటలు గీటునం బుచ్చి యొండుపలుకులు జరపిన నతండును
సత్వ్తహీనుండు గావున సత్వరుండై క్రమ్మఱి ద్రౌపదియున్నయెడకుం జని
యాసమీపంబున నఱ్ఱాడుచు నమ్మానవతితో ని ట్లనియె. 42
క. ఇవ్వసుమతి నేపొలఁతుల, కివ్విధమునఁ జెలువు గలదె యెన్నండును నీ
వెవ్వరితనయవు నీపతి, యెవ్వఁడు పేరేమి సెప్పు మిందునిభాస్యా. 43
వ. అనిన నప్పలుకులు వినియు వినమి భావించి యప్పాంచాలి నిర్వకార యై యూర
కున్న నచ్చపలుండు వెండియు ని ట్లనియె. 44
సీ. తెలిగన్నుఁగవకాంతి పొలుపార నించుక, గను విచ్చి చూచినఁ గాదె యబల
చెలువంపునెమ్మోము నెలమిసొం పినుమడి, గా నల్ల నవ్వినఁ గాదె యింతి
దంతమౌక్తికరుచి దలకొన మఱుమాట, పలికినఁ గాదె యు త్పలదళాక్షి
యుల్లంబుసరసత దెల్లంబుగా లీలఁ, గైకొన్నఁ గాదె పం కరుహవదనఁ
ఆ. యనుచుఁ జూచుఁ జేరు నమ్ముగ్ధపలుకులు, వినఁగఁ గోరుఁ గేలు దనదు కేలఁ
గీలుకొలుపఁ దలచుఁ గీచకాధముఁడు ని, జానురక్తి దెలుప నప్పళించు. 45
వ. ఇట్లు దాన తమకంబున వడిగొనుచు నప్పు డయ్యంగనయింగితం బూహింప వెరపు మాలి
మఱియును. 46
సీ. సుదతి నీమై చక్కఁ జూచుట కోడెదఁ, గనుఁబాటు వొరయునో యనితలంచి
మది నిగిర్చినమాట మగువ నీపెంపునఁ, గుదిసి నానాలుక తుదికి రాదు
పడఁతి నీకరములు పట్టంగఁ దివిరి శం, కించి వడంకెడు గేలు సూడు
నెఱి నిట్టి దని యింతి నీనెమ్మనం బెన్ని, భంగుల నరసినఁ బట్టువడదు
తే. చెలువ యింక నొక్కించుక సేపు నీ వ
నాదరంబున నెప్పటి యట్ల యున్న
మన్మథుఁడు సమయించిన మగుడ నన్నుఁ
బడయ వచ్చునె యెన్నియు పాయములను. 47
వ. అని తనయభిలాషంబుదేటపడం బలికిన నబ్బోటి కలుషించియు దుర్వారం బైన
పరిభవవికారంబు దోఁప కుండఁ దన్నుం దాన యుపశమించుకొని వీఁడు దురభిమాని యై
యున్నవాఁడు వేగిరపాటు వలను గాదు వెరవుతోడన తప్పించు కొన వలయు నని తలంచి
యతని కి ట్లనియె. 48
క. నాయున్నబాము దలఁపవ, యీయొడ లీచీర యిట్టి యేవపుఁజందం
బోయన్న మదనవికృతిం, జేయు ననుట యెంతయును ని షిద్ధము గాదే. 49
తే. చనునె యిమ్మాట లాడ స జ్జనుల కాఁడుఁ,బుట్టువులతోడ నీవును
బుట్టినాఁడ
వట్లుఁ గాకయు హీనవం శాభిజాత, నైనపతివత్ని నగు నన్ను నడుగఁదగునె. 50
క. అని వీడఁగఁ బల్కిన న, మ్మనుజాధముఁ డంతఁ బోక మదనోన్మాదం
బునఁ దన్ను నెదిరి నెఱుఁగక, వనితకు ని ట్లనియె గార వంపుఁబలుకులన్. 51
సీ. నెత్తమ్మి రేకుల మెత్తఁదనము దెచ్చి, యచ్చునఁ బెట్టిన ట్లంద మొంది
చక్రవాకంబుల చందంబు గొనివచ్చి, కుప్పలు సేసిన ట్లొప్పు మెఱసి
చందురునునుఁగాంతి కం దేర్చి కూర్చి బా,గునకుఁ దెచ్చినయట్లు గొమరుమిగిలి
యళికులంబులకప్పు గలయంతయును బుచ్చి, నాఱు వోసినభంగి నవకమెక్కి
తే. య్రంఘితలములుఁ గుచములు నాననంబుఁ
గచభరంబును ని ట్లున్న రుచిరమూర్తి
యనుపమానభోగములకు నాస్పదంబు
కాదె యీత్రిప్పు లేటికిఁ గమలవదన. 52
తే. నీవు దుర్జాతి గామికి నీవ సాక్షి, పరసతీసంగమున వచ్చు పాపమునకు
నోరుతును గాని సైరింప నోపఁ బచ్చ, విలుతుతూపులతాఁకున కలరుఁబోఁడి. 53
క. అనునప్పలుకుల కయ్యం,గన కోపము గదిరినీచు గావున జంకిం
చినఁగాని మెత్తఁబడి పోఁ, డని మనమునఁదలఁచి యిట్టు లనియెం బెలుచన్. 54
ద్రౌపది కీచకునితోఁ బరుషవాక్యంబులు పలుకుట.
శా. దుర్వారోద్యమబాహువిక్రమరసా స్తోకప్రతాపస్ఫుర
ద్గర్వాంధప్రతివీరనిర్మథనవి ద్యాపారగుల్ మత్పతు
ల్గీర్వాణాకృతు లేవు రిప్డు నిను దో ర్లీలన్ వెసం గిట్టి గం
ధర్వల్ మానముఁ బ్రాణముం గొనుట త థ్యం బెమ్మెయిం గీచకా. 55
తే. అనుడు నతఁ డిట్టు లనియె నా యతులబాహు
బలముఁ జెనయంగ భవదీయ పతుల కారు
మూఁడులోకంబులందు నె వ్వాఁడు లేఁడు
నిక్కువం బింత నమ్ముము నీరజాక్షి. 56
వ. అనిన విని సైరంధ్రి సైరణ దక్కి ధిక్కరించి యి ట్లనియె. 57
క. చనుఁ జన దని చూడక యం,దనిమ్రాఁకులపండ్లు గోయఁ దలఁచుట హితమే
మును చెడినరావణాదుల, విని యెఱుఁగవె యెన్నఁడును వి వేకవిహీనా. 58
తే. ఇవ్విధంబునఁ బలికిన యింతిపలుకు, గాన నేరక తమయప్ప కడకు మగుడ
నరిగె నెవ్వగమనమునఁ బిరిగొనంగఁ, జిన్నఁబోయిన మొగముతో సింహబలుఁడు. 59
క. చని మదనాగ్నిజ్వాలలు, దనుకఁగ నిట్టూర్పుగాడ్పు దందడి నిగుడం
దను నూరార్పఁగ సఖి దొరఁ,కొనమికి వెనుఁబడుచుఁ గీచ కుం డాసతితోన్. 60
వ. ఏ నప్పుడు నీకుం జూపి యన్వయనామధేయంబు లడిగినయప్పొలఁతివలనం జిక్కి
చిత్తం బుత్తలపడు చున్నయది యిట మీఁద నీవ యెఱుంగు దయ్యింతి యింతసేపు
నీచేరువ నుండి యిప్పు డెట మెలఁగె నని యడిగిన విని యతనివేగిర పాట సూచి శిర
కంపంబు సేయుచు సుదేష్ణ నిజాంతర్గతంబున. 61
తే. రాగరసమగ్నుఁడయ్యె సై రంధ్రిఁజూచి, యకట దీన నింకేమియ పాయమగునొ
వలదు తగ దన్న నుడిగెడు వాఁడెవీఁడు, మాయదైవమ యే నేమి సేయుదాన. 62
వ. అయిన, నానేర్చుకొలందిఁ దగిన తెఱంగున వారించి చూచెదం గాక యని యూహించి
యి ట్లనియె. 63
సీ. లలితంబు లగుమట్టి యలచప్పు డింపార, నంచకైవడి నడ నల్ల వచ్చి
యెడమేనినెత్తావి సుడియంగఁ బయ్యెద, సగము దూలించి పై మగుడఁ దిగిచి
సోలెడు నెలదీఁగ లీలఁ గ్రాలుచు వింత, చెలువంబు దలకొనఁ జేరి నిలిచి
తెలిగన్నుఁగవకు నె చ్చెలి యైనలేఁతన, వ్వొలయంగ సరసంపుఁ బలుకు వలికి
తే. మెఱయు చెయ్వుల రాగంబు మెయికొనంగ
నెడఁద సొగయించుమాటల నెలమి మిగుల
నిన్ను ననురక్తిఁ గొలుచున న్నెలఁత లుండ
నీరసాకార సైరంధ్రిఁ గోరఁదగునె. 64
వ. అనిన నప్పలుకులదెస ననాదరంబుసేయుచు నచ్చేడియం జూచి కీచకుం డి ట్లనియె.
65
క. నాకొలువువార కా ర, న్నా కేశుం గొలుచునంగ నలలో నైనన్
లేకునికి నాకుఁ దెల్లం, బాకొమ్మకు నీడు వోల్ప నయ్యెడుసుదతుల్. 66
సీ. గండుమీలకుఁబుట్టి కాముబాణములతోఁ, గలసి యాడెడునట్టి కన్నుఁగవయు
బిసకాండములశిక్షఁ బెరిఁగి లే దీఁగల, మెచ్చక యున్నట్టి మృదుకరములుఁ
జిగురులతో సంధి సేసి యంబుజముల, పై నెత్తి చనునట్టి పదతలములుఁ
గలకంఠములచేతఁ గఱచినవిద్య వీ,ణల కిచ్చునట్టితి న్ననియెలుంగు
తే. నత్తెరంగున రేఖయు నవ్విధంబు, గఱువచందంబు నమ్మెయి కలికితనము
నట్టిచెన్నును సైరంధ్రి యంద కాక, కలవె యొరులకు నెఱుఁగక పలికి తబల. 67
వ. కావున నాయెలనాఁగ నేమియుపాయంబుననైన నన్నుం జేర్పవైతేనిఁ గందర్ప
దర్పంబున నలందురి వందుదు ననిన నవ్వెలంది వెండియు ని ట్లనియె. 68
తే. ఆయురైశ్వర్యకీర్తుల నపహరించు
పరసతీసంగమము ధర్మ పథమునందుఁ
బరఁగువారలు పరిహరిం పంగఁ గనియు
వినియుఁ దెలియవె యిది దుర్వి వేక మగుట. 69
సీ. పతి యెఱంగినఁ దన ప్రాణంబుపై వచ్చు, ననుభయంబున నుల్ల మదరు చుండ
జనులుగాంచినమాను షముదూలుఁదనకను, పుయిలోటమున మోము పుల్లగిలఁగ
బోటికిఁదోఁచినఁ బొలియుఁ దేఁకువ యను, వెగడునఁ జెయ్వులు వీడుపఁడఁగ
బంధుల కగపడ్డఁ బాయు నన్వయ మను,కలక మైఁ జెమటలు గ్రమ్ముదేరఁ
తే. గ్రీడదెసఁ గౌతుకం బురి యాడ రతుల, చవులు గొనియాడ నేరని జారపొందు
హృదయమున కింపు సేయమి నెఱుకగలుగు,వారు దీనిసుఖంబుగాఁ గోరరెందు. 70
వ. అదియునుం గాక. 71
క. బలవిక్రమసంపన్నులు, గల రేవురు దానిపతులు గంధర్వులు వా
రలఁ దలఁచిన నాచిత్తము, దలఁ కెడు నది యేల నీకుఁ దమ్ముఁడ చెపుమా. 72
తే. కాని తెరువునఁబోయినఁ గలుగునయ్య, బ్రదుకుచవియెంతయైన న పథ్యములకు
వేడ్క సేయుదురయ్య వి వేకు లెవ్వి,ధమున నాబుద్ధి వినవయ్య తమక ముడిగి.
73
క. అనవుడు నమ్మాటలు దన, మనమునకు సహింప రామి మల్లడిగొనుచున్
మనసిజపరతంత్రత ని, ట్లని పల్కె సుదేష్ణతోడ నతఁ డుద్ధతుఁ డై. 74
మ. వనితా యే నొకపల్కు వల్కెదఁ జతు ర్వారాశిమధ్యంబునన్
ఘనబాహాబల మొప్ప నన్ను నెదురం గా నొక్కఁడున్ లేమి యె
వ్వనికిం దెల్లము గాదె దానిమగలన్ వజ్రాహతిం గూలుశై
లనికాయం బన మద్భుజాసమదలీ లన్ గీటడంగించెదన్. 75
ఉ. బుద్ధులు సెప్పు టెల్ల నటు పో విడు మెమ్మెయి నైన సౌఖ్యసం
సిద్ధి యొనర్పు నాకు నెడ సేసినఁ దాపము రూపుమాపు నా
వృద్ధియ కోరుదేని నవి వేకివి నీ వని నన్ను ని ట్లసం
బద్ధము లైనవాక్యములు వల్కక వే పిలిపింపు కోమలిన్. 76
తే. అనుచు దైన్యంబు నొందెడు నాననంబు,తోడ దిగ్గన లేచి య త్తోయజాక్షి
చరణపీఠంబుకడఁజక్కఁ జాఁగిమ్రొక్కి, యున్ననద్దేవిగనుఁగొని చిన్నఁబోయి.
77
ఉ. ఆవల వచ్చునాపదల కన్నిటి కోర్చి లతాంగిఁ గూర్చి కా
కీవెడమాటలన్ మరలఁ డెన్నివిధంబులఁ జూపి చెప్పినం
గావల మైనవీఁడు దగు కార్యము వట్టునె వీని కెమ్మెయిం
జావు నిజంబు మన్మథుని శాతశరంబుల నైన నక్కటా. 78
క. అని మనమునఁ దలపోయుచుఁ, దనతమ్ముని నల్ల నెత్తి దందడి దొరఁగం
జనుదెంచునశ్రుపూరము, కనుఁగవలో మ్రింగికొనుచుఁ గామిని పలికెన్. 79
ఆ. ఇంత దలర నేల యెమ్మెయి నైనను, గొమ్మ నలవరించి కూర్చు టరుదె
యుమ్మలంబు దక్కి యూఱటతోడ నీ, వేఁగు మసలవలవ దింక నిచట. 80
క. ఆసవమున కని నీదుని,వాసమునకు దివములో న వశ్యంబును నే
నాసుదతిం బుత్తెంతు ని,జాసక్తి ఫలింపఁ గొఱలు మభిమత కేళిన్ 81
కీచకుండు ద్రౌపదియందలి మోహంబునఁ బరితపించుట.
వ. అనిన విని కీచకుండు ముదితహృదయుం డయి నిజసదనంబునకుం జని వివిధ
మధురసంబు లొనరించి సముచితఖాద్యంబులు సమకట్టి తత్ప్రదేశంబు విజనంబు
గావించి యొక్కరమ్యస్థలంబున నుండి పాంచాలివలనితగులు చిత్తంబు నుత్తల పఱుపం
దలరి నెవ్వగల కగపడి తలపోఁతలకుం జొచ్చి దుర్వదగ్ధుండు గావున నమ్ముగ్ధకుం
దనసన్నిధిఁ గామవికారంబు వుట్టుట గలుగ భావించుచు. 82
సీ. కేలిమై నొక్కట లీలఁ గ్రేళ్లుఱికెడు,వాలుగుసోగల నేలుదెంచి
కరువలిసుడియమిఁ గదలక చె న్నొందు, నెఱవిరితమ్ముల నుఱక తెగడి
బెడఁ గొందఁ దుడిచిమైఁ దొడసినవలరాజు, వాలికతూపులఁ దూలఁదోలి
పొలపంబు మెఱసిది క్కులఁగాంతిపూరించు క్రొక్కారుమెఱుఁగుల నుక్కడంచి
తే. తనవిలోచనములు నాదు మనము నాఁచి
కొనఁగ నయ్యింతి ననుఁ గనుఁ గొనియె నాత్మఁ
గైకొనియె రాగరసమునఁ గడలుకొనియె
మదనవికృతి బయల్పడ నుదిలకొనియె. 83
ఉ. చిత్తము మెచ్చి నావలనఁ జిక్కఁగ వెండియు నాలతాంగి య
చ్చొత్తినయట్లు నాకుఁ దన యుల్లము దెల్లము సేయ కున్కి దా
నత్తఱిఁ గ్రొత్తకా న్పగుట నడ్డము సొచ్చిన సిగ్గుపెంపు న
న్నుత్తల మందఁ జేయుటకు నో తలపోసి యెఱుంగ నయ్యెడున్. 84
తే. అనుచుఁ గొందలపడుకోర్కు లగ్గలించి
చిఱ్ఱుముఱ్ఱాడు చుండ న చ్చెలువ చెలువుఁ
దగిలి తనయిచ్చఁ బాఱుచి త్తంబుపజ్జ
నరిగి యి ట్లను నక్కీచ కాధముండు. 85
సీ. లీల నాముందట నాలేమ వొలసినఁ, జూడ్కికిఁ జుబ్బన చూఱ గాదె
కను విచ్చి నన్ను నా తనుమధ్య సూచినఁ, దనువున కమృతసే చనము గాదె
చిరునవ్వు బెరయ న చ్చెలువ నాతోడఁ బ,ల్కినఁ జెవులకు రసా యనముగాదె
యెలమి నమ్మెలఁత న న్నెలయింపఁ దివిరిన, నెడఁద కానందంబు నిక్కగాదె
తే. యానితంబిని మక్కువ ననఁగి పెనఁగి, యింపు పొంపిరివోవ న న్నేలికొనఁగఁ
దలఁచి పొందిన నది జన్మ ఫలము గాదె, యనుచు వలరాజుబారికి నగ్గ మయ్యె. 86
వ. మఱియు ననేకభంగుల ననంగవిభ్రమంబుల కనురూపంబు లైన బహువిధ ప్రలాపంబులం
బ్రొద్దు గడపుచు నమ్మదిరాక్షిరాక కెదురుచూచు చుండె నక్కడఁ బాంచాలి
రావించి సుదేష్ణ తృష్ణ భావించుచు ని ట్లనియె. 87
క. ఒదవెడుతృషపెల్లిదమున, వదనము వఱువట్లు వట్టె వాసితరాజ
న్మదిరారస మానఁగ నా,హృదయంబున వేడ్క యెసక మెసఁగెడుఁ దరుణీ. 88
క. కీచకునియింట నెప్పుడు, వాచవి యగు బహువిధంపు వారుణి గలుగున్
వే చని యిచటికిఁ గొని ర,మ్మా చూతము గాని నీగ మనవేగంబున్. 89
వ. అనవుడు. 90
ఉ. ఉల్లము దల్లడిల్లఁ దను వుద్గతఘర్మజలంబు దాల్చుచున్
డిల్లపడంగ నా కిది గ డిందివిచారము వుట్టె నందుఁ బో
నొల్ల ననంగ రా దచటి కూరక పోవను రాదు నేర్పు సం
ధిల్లఁగ దీనిఁ బాపికొను దీమస మెట్టిదియొక్కొ దైవమా. 91
వ. అని తలంచుచు డోలాందోళితమానస యగుచు నమ్మానిని సుదేష్ణ కి ట్లనియె. 92
ఉ. ఉత్పలగంధి న న్నుడుగు మొడ్లను బంపుము కల్లు దేర నే
సత్పథవృత్తి నీకడన సంతతమున్ బహుమానపాత్ర నై
తత్పరతం జరించి యుచి తంపుఁబనుల్ దగఁ జేయఁగాక దు
ష్యత్పరివారయోగ్యపరి చారముమైఁ జనునట్టిదాననే. 93
క. అతివ తగునమ్మ నీగృహ, మతినిర్మలచరితభరిత మని యీయెడ మ
త్పతులయసన్నిధినైనను, మతి నూఱడి యున్నచోట మన్నన దప్పన్. 94
ఉ. సాధులు చేరి నెమ్మిగ ని జస్థిరవృత్తము దుష్టకోటిచే
బాధలఁ బొంద కుండఁ దమ పాల వసించినఁ బెద్దవారు ది
క్కై ధరియించి వారి కొక యాపద పుట్టక యుండఁ గాచు టొ
ప్పై ధరఁ గీర్తి కెక్కదె య పాయము సేసిన నింద వుట్టదే. 95
ఆ. ఎవ్వరేనియింటి కెద్దియే నొకటికి, నన్నుఁ బంపఁ దగునె నిన్ను నాఁడ
కొలుచునెడ ననుజ్ఞ గొననె నీచము లగు,పనుల కేను జాల కునికి సెప్పి. 96
క. అనిన విని యనుచితంబున, కనయము శంకించియును ల తాంగి మదిం ద
మ్మునివలవంత దలఁచి యి, ట్లనియెం బాంచాలితోడ సాదరవృత్తిన్. 97
ఉ. అక్కట యేను వేడ్కపడి యానెడునాసవ మర్థిఁ దేరఁ గా
నొక్కనికృష్టఁ బంచుటకు నోపక చెప్పిన దీని నీవు గో
సెక్కఁగఁ జేసి నిన్ను నతి హీనవిధాననియుక్తఁ జేఁత గా
నిక్కమ యుమ్మలించి తిది నెయ్యముతియ్యముకల్మియే సఖీ. 98
క. అది లాఁతియిల్లె నినుఁ దమ, హృదయంబుల నెవ్వరేని నెఱుఁగరె యేఁ జె
ప్పుదు నీదుపెంపు నినుఁ గ,న్నది మొదలుగ నెల్ల వారి కరzౖు్యభంగిన్. 99
క. అని మఱియుఁ బెక్కుభంగులఁ, దనుఁ బ్రార్థింపంగ ద్రుపద తనయకుఁ జిత్తం
బున నింకఁ బెద్ద పెనఁగం, జన దీయమతోడ ననువి చారము పుట్టెన్. 100
వ. ఇట్లు దోఁచినతలంపునం జేసి. 101
ద్రౌపది కీచకునింటికిఁ గల్లు దేరం బోవుట.
చ. మన మురియాడు చుండ నను మానముతోన సుదేష్ణఁ జూచి నీ
వనయముఁ గోరినట్టిపని యర్థిమెయిం జని చేయుదానఁ గా
కనుతనమాట కప్పొలఁతి హర్షముఁ బొందుచు నంది యిచ్చుకాం
చనచషకంబు వుచ్చికొని చారువిలోచన యార్తమూర్తి యై. 102
వ. చనుచుండి నీచహృదయుం డగుకీచకుండు దనయెదుర నప్పు డాడినకర్ణశూలంబు
లగుమాటల మీఁదం బిడుగు పడినవానిఁ గొఱవిం జూఁడిన తెఱంగున సుదేష్ణ
దన్ననుచితవ్యాపారంబున నియోగించుటకు నిర్వేదనంబుం బొంది. 103
చ. అలమటఁ బొందు మాయవిధి యా యని దైవము దూఱు నిత్తఱిం
గలరొకొ నాకు ది క్కను మొ గంబున నశ్రులు వెల్లిగొల్పుఁ దొ
ట్రిలఁబడు జ ల్లనం జెదరు డెందము గూడఁగఁ దెచ్చి నన్నుఁ గే
వలమున ముట్ట నెవ్వరికి వచ్చు ననుం గలఁగున్ వెనుంబడున్. 104
వ. అట్టియెడ. 105
సీ. దైన్యంబుతలపోఁత దలకొన్నఁ జెలువ కా,ననమున వెల్లద నంబు గదిరె
భయరసవేగంబు పైకొని ముట్టినఁ, గాంతకుఁ దనులతఁ గంప మడరె
బెగ డంత కంతకు మిగిలిన నింతికిఁ, బదముల నట దొట్రు పాటు బెరసెఁ
దల్లడం బొందినఁ దన్వికి నవయవం,బుల నెల్ల ఘర్మాంబు కళిక లెసఁగెఁ
ఆ. దలఁకు వుట్టెఁ గొంకు గొలఁదికి మీఱెవె,న్బాటు దోఁచెముట్టు పాటు
దొడరె
వెఱఁగుపాటు దనికె నెఱనాడె నొవ్వునె, వ్వగలువగల నీనె దిగులు వొదివె.
106
వ. ఇవ్విధంబున ద్రుపదపుత్త్రి దురవస్థం బొందుచు మహాపదలకుం బరిహరణంబు
హరిస్మరణంబ యని తనహృదయపుండరీకంబునం బుండరీకాక్షు నిక్షేపించుకొని
సుదేష్ణమందిరంబు వెలువడి దినకరుం గనుంగొని వినయవినమితోత్తమాంగ యై
నిజాంతర్గతంబున. 107
తే. పాండుపుత్త్రుల కేను ద ప్పనిమనంబు, గలుగుదాననయేని నో కమలమిత్త్ర
కీచకునిదెస న న్నొక కీడు తెరువు, వొరయ కుండఁగ రక్షింపు కరుణతోడ. 108
వ. అనుచుం గేలు మొగిచిన. 109
క. తరణియు దుఃఖిత యగున, త్తరుణిం గాచుటకు నత్యు దగ్రభుజావి
స్ఫురణాఢ్యు నొక్కరక్కసుఁ, గరుణార్ద్రమనస్కుఁడగుచు గ్రక్కునఁ బనిచెన్.
110
వ. వాఁడునుం బని పూని యంబరంబున నదృశ్యాకారుం డై వచ్చి నిలిచె. 111
తే. ఇట్లు ప్రార్థించి పాంచాలి యెట్టకేని, సింహబలుమందిరం బల్లఁ జేర
నరిగి
యొల్లఁ బోవుచు బెబ్బులి యున్నపొదరు,సొచ్చు లేడిచందంబునఁ జొచ్చుటయును.
112
ఉ. అంబురుహాక్షి వచ్చు తెరు వారయఁ గీచకముఖ్యుఁ డప్డు దె
ల్లంబుగఁ జూచి యుల్లముక లంకయు వారక మేన వెమ్ముతా
పంబును డిగ్గఁ ద్రావి గరు పాఱుచు నుత్కటసంభ్రమంబు హ
ర్షంబుఁ బెనంగొనంగ నతి చంచలభావపరీతమూర్తియై. 113
క. చిడిముడిపడుచునెదురుసనఁ, గడఁగుచు హారములు చక్కఁ గాఁ ద్రోచుచు మ
ల్లడిగొనుచు దుర్విలాసం, బొడలికి నొడఁగూర్చు చుండ నుగ్మలి యంతన్. 114
వ. తత్ప్రదేశంబునకుం జని. 115
తే. దేవి తృషవుట్టి వారుణి దేరఁ బనుప, నరుగుదెంచితిఁ బోయింపుఁ
డనిననింతి
నెమ్మొగంబున దృష్టులు నిలిపి తమక, మడర ని ట్లను నాకీచ కాధముండు. 116
క. దేవితృష దీర్పఁ బూనితి, వావెలఁదిసహోదరుండ నగునాతృష లీ
లావతి నీదుసరససం, భావనమెయిఁ దీర్ప కునికి పాడియె చెపుమా. 117
సీ. కాంతి దళ్కొత్తునీ కడకంటిచూడ్కితోఁ, బొంద గాననిమేను పొగులుటయును
దీపారునీపల్కు దెల్లంబుగా వినఁ, గాననివీనులు గందుటయును
నిం పగునీచెయ్వు లెలమిమైఁ గొనియాడఁ, గాననికోర్కులు గనలుటయును
సొగయించునీకేళిఁ దగిలి యానందంబుఁ, జెందఁ గాననిమది గుందుటయును
తే. బాయ నా దగుజన్మంబు ఫలము నొంద, భావజన్మునిపూనికి పార మెయ్ద
నన్ను బంటుగా నేలుము నలినవదన, యింక నీ సిగ్గుదెరయోల మేల నీకు. 118
వ. అనవుడు. 119
తే. చెలువ యప్పలుకులు పెడ చెవులఁ బెట్టి
ధీర గావున విగతవి కార యగుచు
మదిరవోయింపుఁ డద్దేవి యెదురుచూచు
నలుగుఁ దడ వైన మగుడఁ బో వలయు ననిన. 120
చ. మదిర సుదేష్ణపాలి కొక మాత్రన వుచ్చెద నొడ్లచేత నిం
పొదవెడునట్టిదీని చవి యుల్లము సొక్కఁగ నాను మీవు నీ
వదనసరోజసౌరభ మ వారణ నన్నును గ్రోల నిమ్ము బె
ట్టిదుఁ డగుకాముతూపులఁ దొ డింబడ కుండఁగ గావు మి త్తఱిన్. 121
క. కరితురగరథసమితిఁ బొం,పిరివోయెడు నాదులక్ష్మి పెంపున కెల్లన్
సరసిరుహవదన నీవ కు,దురుగా నొనరించెదం గు తూహల మెసఁగన్. 122
క. రుచిరమణిభూషణంబులు, నుచితవిహారప్రకార యోగ్యాగార
ప్రచయము సుందరగణికా, నిచయము నొప్పించువాఁడ నీకుం దరుణీ. 123
క. నాకులకాంతల నెల్లను, నీకుం బని సేయఁ బనిచి నెయ్యంబున నే
నీ కనుస్నన మెలఁగెద, నే కార్యం బైన నడపు మీవ తగంగన్. 124
వ. అనుచు సింహబలుండు దనయంతరంగంబున నంత కంత కగ్గలించుతమకంబునఁ దన్నుఁ దా
నెఱుంగక పయిం బడి పట్టికొనిన. 125
క. తనుఁ గాచి వెనుక వచ్చిన, దనుజుమహాబలము తనదు తను వొందిన నా
తనిచే విదిల్చి రభసం, బునఁ దన్మందిరము ద్రుపద పుత్త్రిక వెడలెన్. 126
వ. ఇట్లు ద్రోచిపోయినం గీచకుండు వెనువెంటం దగిలిన నమ్మగువయు మరలిచూచి
భయభ్రాంతయై యెవ్వలనికిం బోదునో యని తలంచి దైవయోగంబున విరాటుం డప్పుడు
గొలు వునికింజేసి తత్సభాభాగంబుదెసకు వెసం బాఱినం గామాయత్త చిత్తుండును
గర్వోన్మత్తుండును గావున జనసమూహంబు సరకు సేయక రహస్య ప్రకాశవిభేదవిచారంబు
దక్కి. 127
కీచకుఁడు ద్రౌపదిం బట్టుకొనుటకు వెంటఁ దగులుట.
సీ. సమదవారణము జం గమలత వెనుకొని, సరభసంబునఁ బట్టఁ జనువిధమునఁ
గ్రూరదానవుఁడు భూ చారినిర్జరకాంతఁ, బొదువ రయమ్మునఁ బోవుభంగి
ఘోరగృధ్రము సుకు మారనాగాంగనఁ, బటుగతి నొడియంగఁ బాఱుకరణిఁ
బ్రబలబిడాలంబు బాలశారికమీఁద, నడరి సత్వరముగ నరుగుమాడ్కి
తే. సింహబలుఁ డత్యుదగ్రుఁ డై చిగురుఁబోఁడి
పజ్జఁ గడువడిఁ దగిలి కో పంబు గదుర
నొడిచి తల పట్టి తిగిచి మ హోగ్రవృత్తిఁ
గొంకు కొస రించుకయు లేక కూలఁ దాఁచె. 128
క. అట్టియెడఁ బాంచాలీరక్షకుం డైనరాక్షసుం డతని డొల్ల వ్రేసిన. 129
క. కీచకుఁడు వ్రేటువడి తన, నీచపుదశ యొరు లెఱుంగ నేరక యుండన్
లేచి వెనుకఁ జని విస్మయ,గోచరుఁ డై యసురకతనఁ గుంఠితుఁ డగుచున్. 130
వ. ఒడుపు దప్పిన మహానాగంబునుంబోలె నిట్టూర్పు నిగుడ నిట్టలం బగుకోపంబు
పెల్లున మల్లడిగొను చుండె నయ్యవసరంబున. 131
క. తానును నన్నయు నయ్యా,స్థానమ్మున నుండి పవన తనయుఁ డసహ్యం
బైనమనోవల్లభ యవ,మానము నాసింహబలుని మదజృంభణమున్. 132
చ. కనుఁగొని కోపవేగమునఁ గన్నుల నిప్పులు రాల నంగ ము
ల్దనరఁగ సాంద్రఘర్మసలి లంబులు గ్రమ్మ నితాంతదంతపీ
డనరటదాస్యరంగవిక టభ్రుకుటీచటులప్రవృత్తన
ర్తనఘటనాప్రకారభయ దస్ఫురణాపరిణద్ధమూర్తి యై. 133
సీ. నేలయు నింగియుఁ దాళముల్‌గాఁ జేసి, యేపున రేఁగి వా యించి యాడఁ
గులపర్వతంబులు గూల్చి యొండొంటితోఁ, దాఁకంగ వీఁకమైఁ దన్నియాడ
నేడుసాగరములు నిక్క డక్కడఁ బెట్టి, పలుచనిరొంపి మై నలఁదికొనఁగ
దిక్కులునాలుగు నొక్కచోటికిఁ దెచ్చి, పిసికి పిండలి సేసి పిడుచగొనఁగ
తే. మిగిలి బ్రహ్మాండభాండంబు పగులవ్రేయ
నప్పళించుచుఁ బ్రళయకా లానలమున
గండరించినరూపంబు కరణి భీముఁ
డతిభయంకరాకారత నతిశయిల్లె. 134
వ. ఇట్లు పేర్చినకోపాటోపంబున నవిచారితసమయవర్తనుం డయి వృకోదరుండు
కీచకునిగీటడంగింపం జూచి తత్సంబంధబద్ధుండును నాజ్ఞాపరిపాలకుండును గావున
మత్స్యపతిఁ దనయలుకలోనివానినకాఁ దలంచుచు నచ్చేరువ నున్నయున్నత వృక్షంబు
నిరీక్షించి యాననంబు పల్లటిల్ల ధర్మతనయుం గనుంగొనిన నతండు దననయనాకారంబున
వారించి యి ట్లనియె. 135
మ. వలలుం డెక్కడఁ జూచె నొండెడ నసే వ్యక్ష్మాజముల్ వుట్టవే
ఫలితం బై వరశాఖ లొప్పఁగ నన ల్పప్రీతి సంధించుచున్
విలసచ్ఛాయ నుపాశ్రితప్రతతికిన్ విశ్రాంతి గావింపఁగాఁ
గలయీభూజము వంటకట్టియులకై ఖండింపఁగా నేటికిన్. 136
తే. అని నిగూఢభాషణముల నయ్యజాత,శత్రుఁ డనిలజుకోపర సంబుపేర్మి
చెఱిచె నయ్యన్నదమ్ముల చేష్టితములు, దెల్లముగ నప్డు సూచుచు నల్ల లేచి.
137
సీ. ఎలదీఁగఁ గప్పిన లలితపరాగంబు, క్రియ మేన మేదినీ రేణు వొప్పఁ
జంపకంబున నవ సౌరభం బెసఁగెడు, కరణి నాసిక వేఁడి గాడ్పు నిగుడఁ
దోయజదళముల తుది మంచు దొరఁగెడు, గతిఁ గన్నుఁగవనశ్రు కణము లురుల
నిందుబింబముమీఁది కందుచందంబునఁ, గురులు నెమ్మొగమున నెరసియుండ
తే. సర్వజనవంద్య యైనపాం చాలి సింహ, బలునిచే నివ్విధంబున భంగపాటు
దనకు వచ్చిన నెంతయు దైన్య మొంది, యవ్విరాటునిసభఁ జేర నరిగి నిలిచి.
138
ద్రౌపది తనభంగపాటు విరాటునితోఁ జెప్పుట.
ఉ. పంబినకోపమున్ సమయ భంగభయంబును నగ్గలించి యు
ల్లంబు పెనంగొనంగఁ బతు లం దగ సభ్యులఁ జూచుమాడ్కి రూ
క్షం బగుచూడ్కి నాద్రుపదు కన్నియ సూచి సభాజనప్రతా
నంబున మత్స్యనాథుఁడు వి నంగ నెలుంగు చలింప ని ట్లనున్. 139
సీ. నిఖిలధర్మాధర్మ నిపుణంబు లైనశు, ద్ధాంతరంగంబుల నతిశయిల్లి
శిష్టసంరక్షణ దుష్టనిగ్రహముల, నీతి వాటింపంగ నేర్పు గలిగి
సకలశస్త్రాస్త్రసం చయములఁ బరమాద్భు,తంబు సేయుపరిశ్ర మంబు దాల్చి
దుర్దమప్రతిభట మర్దనక్రీడమైఁ, జతురులు నా నెందు నుతికినెక్కి
తే. యున్నగంధర్వు లేవురు నన్ను నిట్టు, లొకఁడు పఱుపంగ నూరక
యునికిసూడ
నచ్చెరువుగాదె యెవ్వరి యాండ్రురింకఁ, బరిభవంబునఁ బొందక బ్రతుకువారు.
140
క. ఈనరపతియాస్థానము, లో నొక్కరుఁడైన ధర్మ లోప భయమునం
బూని తగ వైనవెడవలు, కైనను బలుకంగఁ జాలఁ డయ్యెడు నకటా. 141
ఉ. ఇందఱుఁ జూడఁగా నిచట నెమ్మెయి నన్నుఁ బతివ్రతాగుణా
స్పందితవర్తనం బరమ సాధ్వి ననిందితశీలఁ గీచకుం
డెందును నెట్టియంగనల నెవ్వరుఁ జేయనియట్లు సేయఁగాఁ
గొందఱకైన నిప్డు కృప కుం దఱి గా దటె యేమి చెప్పుదున్. 142
ఉ. ఐనను మత్స్యదేశమున యాజ్ఞ కితం దొడయుండు గాన నా
కీనరనాథు దూఱఁ దగు నెయ్యదియేని నధర్మ మెవ్వ రెం
దైన నొనర్చినం బ్రభువు లారసి దండన మాచరింతు రి
చ్చో ననుఁ దన్నఁ గీచకునిఁ జూచియు నూరక యున్కి పాడియే. 143
చ. అనుడు విరాటుఁ డుల్లమున నక్కటికం బొలయంగ నంగనం
గనుఁగొని కీచకుం గినియఁ గాఁ దగుసత్వ్తము లేమిఁజేసి సాం
త్వనములు వల్కి రోషభరి తస్థితిఁ గంపితమూర్తియైనయా
తనిమదికుందు వాపిన న తండును బోయె నివాసభూమికిన్. 144
వ. అట్టియవసరంబునం 145
సీ. శుభలక్షణాంగి యీ సుందరి సైరంధ్రి, యగు టెట్లొకో యని వగచువారు
నిమ్మేని కక్కట యిట్టిది సేసెనే, మాయదైవం బని మఱుఁగువారు
నింతకీ డొనరించె నే రాజు సూడ నీ, దుష్టాత్మకుం డని దూఱువారు
దేవియుపేక్షయ చూవె యీయమకు ని,ప్పాటువచ్చుట యని ప్రందువారు
తే. నగుచు సభవార లందఱు నంత నంత, నల్లనల్లన గుజగుజ లాడు చుండి
రుల్లముల నిండి ఖేదంబు వెల్లివిరిసె, నాఁగ మోముల విన్నఁదనంబు గదుర.
146
ఉ. అప్పుడు ధర్మసూతి హృద యంబు కలంగ లలాటభాగముం
గప్పఁగ ఘర్మవారి యధి కం జగురోషము నొంది యుండియుం
దప్పఁగఁ ద్రోచికొంచుఁ దన ధైర్యము పెంపున నిర్వికారుఁడై
యెప్పుడుఁ దాను బల్కు నెలుఁ గేర్పడ ద్రౌపదితోడ ని ట్లనున్. 147
సీ. జననాయకుండు నీ సభవారు నీ దగు, తెఱఁ గెల్ల నెఱిఁగిరి తెఱవ యింక
మానక యీపలు మాట లాడఁగ నేల, చనుము నీవు సుదేష్ణ సదనమునకు
నీపరాభవమునఁ గోపింప నేరరే, గంధర్వులకుఁ దఱి గాదు గాక
సమయ మెయ్యదియేనిఁ దమకును నీకును, మును గల్గినట్లైనఁ గినియ రిచట
తే. గాన నాథుల దూఱంగఁ గాదు వినుము, సతికిఁ దానెంతవడియును సభలలోనఁ
దడవుగా నిల్చి యిట్టు లు దగ్రవృత్తి, శంకసెడి ధిక్కరింపంగఁ జనునె చెపుమ.
148
వ. అని యిట్లు సెప్పినధర్మతనయునిపలుకులు విని వెండియు సైరంధ్రి యచ్చోటు
గదలక నిలిచి యెద్దియేనియుం బలుకం దలంచినం జూచి యతండు మఱియు ని ట్లనియె.
149
క. పలుపోకలఁ బోవుచు వి,చ్చలవిడి నాట్యంబు సూపు చాడ్పున నిచటం
గులసతులగఱువచందము, దొలఁగఁగ ని ట్లునికి దగునె తోయజవదనా. 150
వ. అనిన విని పాంచాలి సాభిప్రాయంబుగా నతని కి ట్లనియె. 151
ఆ. నాదువల్లభుండు నటుఁ డింత నిక్కంబు, పెద్దవారియట్ల పిన్నవారు
గానఁ బతులవిధమ కాక యే శైలూషిఁ, గాననంగ రాదు కంకభట్ట. 152
వ. అట్లుగుటంజేసి నాకు నాట్యంబును బరిచితంబ మత్పతి శైలూషుండ కాఁడు
కితవుండునుం గావున జూదరియాలికి గఱువతనం బెక్కడియదియనుచు నచ్చోటు వాసి తన
చిత్తంబున. 153
ఉ. నన్నిటు లాదురాత్ముసద నంబునకుం జను మన్నజంత కీ
బన్నము లన్నియుం దెలిపి ప్రైయిడనే యని పోయె నార్త యై
కన్నుల బాష్పపూరములు గ్రమ్మఁగ మోమున దైన్య మొందఁగా
నన్నలినాక్షి తొట్రిలుచు నంగము దూల సుదేష్ణపాలికిన్. 154
తే. చనిన నయ్యెలనాఁగయు సంభ్రమంబు
దెచ్చికొని తా నెఱుంగని తెఱఁగు దాల్చి
శాఠ్యమున నుమ్మలించిపాం చాలితోడ
నెలుఁగు వే ఱొకభంగిగా నిట్టు లనియె. 155
సీ. ధరణిపరాగంబు వొరసి ధూసరిత మై, చేడియ నీమేను చెన్ను దఱిఁగె
జిత్తంబు తలపోఁత చే వాడు పొదవిన, చెలువ నీనెమ్మోము చిన్నఁబోయెఁ
బ్రస్వేదమునఁ దోగి ఫాలంబుతో నంటి, యుగ్మలి నీకురు లొప్పు గందెఁ
గన్నీరువఱ్ఱొడ్డి కాంతియెంతయుఁ గొన్న, వెలఁది నీకనుఁగవ విన్న నయ్యె
ఆ. నేది కారణముగ నెవ్వ రెచ్చోట నీ, కేమికీ డొనర్చి రెట్టిపాటి
సాహసికులొ వారిఁ జంపుదునొంపుదు, భంగపఱుతునిడుమ పఱతుఁ జెఱుతు. 156
వ. ఇత్తెఱంగు నాకుం జెప్పు మనిన నీ వెఱింగియు నెఱుఁగమి భావించిన నింక నే
మని పలుకం గలదాన నైనను విను మని సైరంధ్రి యి ట్లనియె. 157
మ. నను నీ వప్పుడు సూతుమందిరమున న్మద్యంబుఁ దెమ్మన్నఁ బో
యిన నాతం డవినీతి సేసినను జే యీ కేను మత్స్యావనీ
శునియాస్థానముదిక్కు వే చనిన న చ్చోఁ దీవ్రకోపంబున
న్వెనుకం గూడఁగ ముట్టి పట్టికొని త న్నెం బల్కు లిం కేటికిన్. 158
వ. అని యేర్పడం బలికిన. 159
ఉ. ఖేదము దక్కు మీక్షణమ కీచకు దండితుఁ జేసి నీకు నా
హ్లాద మొనర్తు నే నని న యంబునఁ గేకయరాజపుత్త్రి య
త్యాదరవృత్తితో ననున యం బొనరించిన నయ్యసత్యసం
వాదినివూన్కి పాండుసుత వల్లభ యాలము సేసి యి ట్లనున్. 160
క. నీ వింత యలుగ నేటికి, నావంతయుఁ బౌరజనమ నఃఖేదము నొ
క్కావంత ద్రిక్క కుండఁగ, లావంతులు మత్పతులు గ లరు పగ దీర్పన్. 161
క. అనిన సుదేష్ణయుఁ దత్పరి, జనములు నెఱఁ బొంది యెన్ని సాంత్వనములు సె
ప్పినఁ దేఱద మజ్జనభో,జనములకుం జొరద ద్రుపద సంభవ యెట్లున్. 162
వ. అట్టియెడ సుదేష్ణ సేయునది లేక నివ్వెఱఁ గంది యుండెఁ దక్కటియంగనలును
గీచకునినీచత్వంబు దలంచి వానిచేటున కొడంబడిరి పరిభవానలసంతప్తయైన పాంచాలి
నిజశయనస్థానమునకుం జని తల్పంబుపై మేనువైచి యపాంగంబులఁ దొరఁగుకన్నీరు
చెవులకొలంకులు నిండ నెవ్వగలు నివ్వటిల్లం దలపోయుచుండి. 163
క. ప్రబలుం డారయ నాసిం,హబలుం డాతని జయింప ననిలతనయుబా
హుబలంబ చూడఁ దగు దైవబలంబును నాతనికి న వశ్యము గల్గున్. 164
ద్రౌపది భీమసేనుతోఁ దన భంగపాటు చెప్పి పరితపించుట.
వ. ఇట్లూహించి రాత్రిసమయం బగుటయు సమస్తజనంబులుఁ గ్రమంబున నిద్రింపం
దొడంగినం దానును శయ్యాతలంబు విడిచి మేనిధూళి గడిగి ధౌతపరిధాన పరీత యై
మహానసగృహంబున సుప్తుం డైనవృకోదరుకడకుం జని. 165
ఉ. నన్నుఁ బరాభవించి సద నంబునకుం జని కీచకుండు ము
న్నున్న తెఱంగు దప్పక సు ఖోచితశయ్యను నిద్ర సేయ నీ
కన్ను మొగుడ్చునూఱటకుఁ గారణ మెయ్యది భీమసేన మీ
యన్న పరాక్రమంబు వల దన్ననొకో దయ మాలి తక్కటా! 166
వ. అనుచు మందమందసంభాషంబుల సంబోధించు పాంచాలిపాణిస్పర్శంబున మేలుకని యిది
యెవ్వ రనవుడు నే ననునమ్మానినియెలుం గెఱింగి భీమసేనుండు యాజ్ఞసేని
కీచకుదురాచరణంబు నాకుఁ బ్రకటించి వాని నిర్జింపనియోగించునది యై
యరుగుదెంచెంగావలయు నత్తెఱంగిత్తెఱవ దాన చెప్ప విందు నని తలంచి. 167
తే. ఇంతప్రొద్దేల యిచ్చోటి కేగుదేరఁ, గారణంబేమి యెవ్వరుఁ గానకుండు
నట్లుగాఁ జనుదెంచితె యంబుజాక్షి, యనిన నయ్యింతి యి ట్లను నతనితోడ. 168
చ. ఎఱిఁగి యెఱింగి న న్నడుగ నేమిటి కిప్పు డెఱింగి యింతకు
న్మఱచుట గల్గెనే నది వి నం బని లే దటు గాక యున్నరూ
పెఱిఁగియు నేన చెప్ప విన నిష్టము గల్గుట చాల లెస్స య
త్తెఱఁ గెఱిఁగించెదన్ వినుము తెల్లముగా మొదలింటనుండియున్. 169
చ. అధిపుమఱఁది సింహబలుఁ డప్పకు మ్రొక్కఁగ వచ్చి నన్ను న
త్యధికమనోజరాగమతి యై కనుఁగొంచుఁ గడంగి యెన్నియేన్
విధములఁ బల్కి నాకుఁ దన విన్నను వెల్లను జూపి చెప్పి మా
నధనవిహీనతం జెనకి నం గడు నేవము వుట్టి యయ్యెడన్. 170
క. విడియం బలుకఁగ వెండియు, నుడుగక, కీచకుఁడు మన్మ థోన్మాదము ద
న్నడరిన న న్నడుగుటకుం, దొడరినఁ గోపించి వానితో ని ట్లంటిన్. 171
శా. దుర్వారోద్యమబాహువిక్రమరసా స్తోక ప్రతాపస్ఫుర
ద్గర్వాంధప్రతివీరనిర్మథనవి ద్యాపారగుల్ మత్పతు
ల్గీర్వాణాకృతు లేవు రిప్డు నిను దో ర్లీలన్ వెసన్ గిట్టి గం
ధర్వుల్ మానముఁ బ్రాణముం గొనుట త థ్యం బెమ్మెయిం గీచకా. 172
వ. అనిన విని వాఁడు గొన్నిప్రల్లదంబులు వలికిన నేనును దత్కాలోచిత
వచనంబులం ద్రోచి పుచ్చినం బోయెఁ బదంపడి పాపాత్మయైన సుదేష్ణ దనకు
మదిరారసంబు దేరం గీచకనివాసంబునకు నన్నుం బనిచినం బోవుట కొడంబడక యెన్ని
సెప్పిన నన్నింటికి నన్ని సెప్పి నిర్బంధించినం బెద్ద పెనంగ నొల్లక
నామనంబున న న్నెవ్వరికి నేమి సేయవచ్చు నని మీలావు నచ్చి సూతునింటికి
సురకుం బోయిన. 173
క. కొన్నివెడమాట లాడుచు, నన్ను నతఁడు చెట్టవట్టి నం ద్రోచి వెసం
జన్న వెనుకొనుటయును మీ, యన్నెడ కే నపుడు సంభ్ర మోపేతగతిన్. 174
తే. పాఱు తెంచిన నక్కుల పాంసనుండు, గోపమడరంగ వెనుకన కూడ ముట్టె
నట యెఱుంగుదు నీవు మీ యున్న పెద్ద,తనముఁ జూచితి నేమందు ననిలతనయ. 175
ఉ. మీసుభటత్వమున్ బలము మిన్నక పోవఁగ దుస్ససేనుఁ డ
ట్లాసభలోన నన్ బఱిచె నంతియ కాక జయద్రథుండు సం
త్రాసభరంబు లే కనుచి తం బొనరించినఁ జెల్లి పోయె నేఁ
డీసభికుల్ గనుంగొనఁగ ని ట్లయితిన్ వగ నాకు వింతయే. 176
ఆ. అకట యాఁడుకూయు నాలకూయునులాఁతి, వారికైన నరయ వలయు ననిన
నన్నుఁ గీచకుండు దన్నంగ నెట్టులు, సూడ నేర్చె ధర్మ సూనుఁ డపుడు. 177
వ. అనిన విని యతం డిట్లనియె. 178
ఉ. కీచకుఁ డట్లు మీఁదు పరి కింపక నిన్నుఁ బరాభవింపఁగాఁ
జూచి మహోగ్రకోపవివ శుం డగునన్నును జూచి ధైర్యహే
మాచలుఁ డైనధర్మసుతుఁ డమ్మెయి వారణ సేయకున్ననే
నీచత వాని మత్స్యవిభు నిం బరివారము నుగ్గు సేసినన్. 179
వ. ఆ సంరంభంబున సమయభంగంబుగా జనంబులు మనల నెఱింగిరయేని. 180
క. ముందటిభంగిన కానల,యందు వసింపంగ వలదె యది నీవును నే
నుం దెచ్చినయాపదగా, నిందింపరె యెల్లవారు నీరజవదనా. 181
వ. కావున సత్యవ్రతనిష్ఠుం డగుయుధిష్ఠిరుండు పొగడ్తకుం దగువాఁడుగాని దూఱు
వడ న్హరుండు గాఁడని వెండియు ని ట్లనియె. 182
క. పరిభవకరుఁ డగుకీచకుఁ, బరిమార్చుట యిపుడు గడవఁ బడియెనె యిమ్మై
దురపిల్ల నేల వ్రేల్మిడిఁ, బొరిగొని నీమనముకలఁక పుత్తు లతాంగీ. 183
వ. మనల నెవ్వరు నెఱుఁగ కుండునట్టి తెఱంగు దలపోయ వలయుఁ గాక పగతుని
భంజించుట యెంతటిపని యనిన విని యమ్మానిని యి ట్లనియె. 184
క. గొంతికి నంత వెఱవ మీ, కంత వెఱవ దైవమునకు నంత వెఱవ న
త్యంతకలుషాత్మ విరటుని,కాంతకు నే వెఱతుఁబనులు గావించునెడన్. 185
చ. కినుకకుఁ జాల కెంతయును గీడ్పడి నాపడుపాటు లెల్ల వ
మ్మునఁ గలయంగ నిట్లు లొక మూర్ఖునిచేఁ దుదిఁ బోయి కోలుపో
యెనె యభిమాన మన్వగపు నేడ్తెఱ డెందము గొందలంబుఁ బొం
దిన ధృతి మాలి యేఁ బలికి తిం దగ వెల్ల నెఱింగి యుండియున్. 186
ద్రౌపది భీమునితో ధర్మరాజుమహిమ సెప్పుట.
వ. ఇట్టిద కాని సమస్తజనస్తవనీయుం డగుపాండవాగ్రజు నిక్కంబ నిందించిన దానం
గా నని పలికి మఱియును. 187
క. ధర్మతనూభవుసంతత, ధర్మనిరతి మనము బ్రదుకఁ దలఁచుట యరుదే
నిర్మలుఁ డగునాతని స, త్కర్మంబునఁ గాదె బ్రదుకు ధాత్రికి నెల్లన్.
188
సీ. చనునె వేఱొకని క జాతశత్రుం డను, పేర దిగ్విజయంబు పెంపు దాల్ప
రాజసూయమహాధ్వ రము గోరి చేయంగఁ, దీఱునే పెఱధరి త్రీపతులకు
ధర్మైకనిరతుఁ డా తం డొక్కరుఁడ చూవె యనఁ, జన నొరులకు నలవియగునె
నిత్యవ్రతంబుగా సత్యంబు పాటింప, వచ్చునె యొరుల కె వ్వరికి నైన
తే. నయ్యుధిష్ఠిరుగాంభీర్య మతనిధైర్య, మరయ నొండెడఁ గలుగునె యతఁడు
కీర్తి
ధరుఁడు గరుణోత్తరుఁడుమహీ సురసమృద్ధి,కరుఁడునిజవంశకరుఁడుప కారపరుఁడు 189
క. కలిమికి నొ ప్పగునీగియు, బలిమికిఁ దొడ వైనయట్టి బలఁగము నై లో
కులచిత్తములకు వ్రేఁ గగు,కొలది మనన్ గొంతిపెద్ద కొడుకున కమరున్ 190
సీ. ఎవ్వనివాకిట నిభమదపంకంబు, రాజభూషణరజో రాజి నడఁగు
నెవ్వనిచారిత్ర మెల్లలోకములకు, నొజ్జ యై వినయంబు నొఱపు గఱపు
నెవ్వనికడకంట నివ్వటిల్లెడుచూడ్కి, మానితసంపద లీను చుండు
నెవ్వనిగుణలత లేడువారాసుల, కడపటికొండపైఁ గలయఁ బ్రాఁకు
తే. నతడు భూరిప్రతాపమ హాప్రదీప, దూరవిఘటితగర్వాంధ కారవైరి
వీరకోటీరమణిఘృణి వేష్టి త్రాంఘి,తలుఁడు గేవలమర్య్తుఁడె ధర్మసుతుఁడు. 191
ఉ. అట్టిమహత్ముఁ డొక్కనికి నాశ్రితుఁ డై వెడగూడుఁ జీరయుం
బెట్టఁగ నిల్చి వాని మది ప్రీతికి నీ డగువృత్తిఁ బేరునుం
బుట్టును మాలి యిప్పు డిటు బ్రుంగుడుపాటునఁ బొందఁ జూచి నా
కెట్టు మనంబు వట్టు ధృతి యెమ్మెయిఁదూలక నిల్చుఁ జెప్పుమా. 192
ఉ. నీవలమూఁపులావు మును నేల వహించిననాగకూర్మగో
త్రావనిభృద్దిశాకరుల కారయ నాఱటపట్టు గాదె సం
భావన భూజనంబులకుఁ బండువు గాదె మహాగ్రకోపరే
ఖావిభవంబు వైరులకుఁ గాలముచేరువ గాదె పావనీ. 193
తే. బకహిడింబకిమ్మీరుల బాహుబలము, నాజరాసంథునుగ్రద ర్పాతిశయము
లోకభీకరములు విజ యాకరములు, నైన నీకరములకు లో నయ్యెఁగాదె. 194
ఆ. అట్టినీవు వంట కట్టియలకు లావు, సూపుచుండ నెపుడుఁ జూచిచూచి
వగతు నదియుఁ గాక తగ వేది యమ్మత్స్య, మేదినీశ్వరుఁడు వి నోదమునకు. 195
మ. మహిషవ్య్రాఘగజాదిసత్వ్తచయమున్ మల్లవ్రజంబుం గృపా
రహితండై యెదు రొడ్డుచున్ వరుసఁ బో రం జూచు ని న్నెప్పుడున్
మహనీయం బగునీశరీరము జగ న్మాన్యంబు నీచక్రియా
విహితం బైన కుజీవనంబు విధి గా వించెం గటా దీనికిన్. 196
వ. అని మఱియు ని ట్లనియె వివేకహీనుం డగువిరాటుండు నిన్నుం
బోరించునప్పుడు నిజాంతఃపురకాంతలకు వినోదంబు సేయ వారల రావించిన నేనును
సుదేష్ణతో నరుగుదెంచి చూచు చుండుదు నయ్యవసరంబున. 197
క. భరమున నీపోరెడునెడఁ, బరమవిషాదంబు నీవు బలమి మెఱసి యు
ద్ధురవృత్తిజయము గొనినం, బరితోషముఁ బొందు నన్ను భావించి మదిన్. 198
వ. ఊహించి సుదేష్ణయుఁ దత్పరిజనంబులుం దమలోన. 199
క. వలలునిదెస మాలిని చూ, డ్కులతెఱఁ గెడపొందుఁ దెలిపె డుం గంటిరె వీ
రలు వచ్చినసమయంబును, దలఁపఁగ నొక్కటియ యివ్వ ధం బెట్లొక్కో. 200
వ. అనుచుం గలదు లే దని పెక్కువిధంబులం దలపోసి గుజగుజలు వోవు చుండుదు
రట్టియెడ. 201
తే. మరగి నీమూర్తిపైఁ గన్ను మనముఁదగిలి, యుండనేమఱియుండి యొ క్కొక్క మాటు
దలఁచికొని వారిదెసమది నిలుపునప్పు, డెఱుఁగనగువారునాతెఱఁ గెఱుఁగుటెల్ల.
202
వ. కావున మదీయపరిభవాతిరేకంబునకు నీవుద్రేకించిన జనంబులు మనల భేదింతురు
నీకుం బోలినభంగి రహస్యభంగంబుగాకుండ నరిభంగంబు సేయు మని వెండియు. 203
సీ. తొడరినహరు నైన దోర్బలంబునఁ దన్ను, మిగులంగ నీఁ డను మేటిమాట
యమరేంద్రునర్ధాస నమునకు నైన న, ్హరుం డెంతయును నను రూఢిమాట
జమునిల్లు సొచ్చిన జంతువు నైనను, గాచు నెమ్మెయి నను రాచమాట
దనుఁ గోరి యూర్వశి దాన వచ్చిన నైన, లోలుండు గాఁ డను మేలిమాట
తే. శౌర్యవైభవప్రభవ శౌచములకు, నొరుల కైనఁ గైవార మై యుల్లసిల్లు
నొక్కరుని కివి యెల్లను నిక్కమట్టె, యెందుఁ గలుగునె యర్జును నీడువాఁడు.
204
క. ఆపార్థుఁడు భరతాన్వయ,దీపకుఁ డమరేంద్రుసుతుఁడు దేజోనిధి వి
ద్యాపారగుండు వినుత,వ్యాపారుం డాపదలకు నగ్గం బయ్యెన్. 205
చ. అరయ నతండు మానధనుఁ డక్కట రంగమునందు నిల్చి సుం
దరులకు నాట సూపెడువి ధం బతిదీనము దానిఁ జూచి యేఁ
బురపురఁ బొక్కుదుం గడుపుఁ బ్రోచికొనన్ లఘువృత్తి కిమ్మెయిం
జొర నగువాఁడె దేవపతి సూనుఁడు దైవముచేఁత సూచితే. 206
చ. మగలకు మేటి యైనబల మర్దననందనుఁ బేడిఁ జేయఁగాఁ
దగునె విధాత నీకు నని దైవము దూఱుదు నోర్వ రానినె
వ్వగ దలకొన్న నెంతయును వందుదు నిద్దురవస్థ యెన్నఁడో
తెగు టని సంతతంబును మ దిం దలపోయుదు నేమి సేయుదున్. 207
సీ. తనయొప్పెదురఁ గన్నఁ దగిలియెవ్వరికైన,మలఁగిక్రమ్మఱఁజూడ వలయువాఁడు
తనవర్తనము విన్న మునిజనంబుల కైన, నలవరించికొనంగ వలయువాఁడు
తనబంటుతన మాజిఁ గనిన మార్తులకైనఁ, బలుమాఱు నగ్గింప వలయువాఁడు
తనవితరణ కేళి వినినఁ గల్పకతరు, వుల కైనఁ దల యూఁప వలయువాఁడు
తే. నకులుఁ డొరులకు నశ్వశి క్షకుఁడుకాఁగ, నగునె యాతనిదుస్థ్సితి
యనుదినంబుఁ
గాంచి కన్నీరు డించుచుఁ గడవ రాని, దైవఘటనకు నొత్తుఁ జిత్తంబులోన.
208
శా. ఆరూపం బవికార మాభుజబలం బత్యంతనిర్గర్వ మా
శూరత్వంబు దయారసానుగత మా శుంభత్క్రియాజ్ఞాన మా
ర్యారంభ ప్రతికూలవాదరహితం బాయీగి సమ్మానవి
స్తారోదాత్తము మాద్రిపిన్నకొడు కే తన్మాత్రుఁడే చూడఁగన్. 209
క. సుకుమారుఁ డతఁడు గోపా, లకవృత్తి వహించి యడవు లం గ్రుమ్మరు చు
న్కికి నాక కాదు పగవా, రికి నైనను నకట మన ము రియదే వగలన్. 210
ఉ. ఏనును మీరుఁ గానలకు నేఁగునెడన్ ననుఁ జేరి యెంతయున్
దీనత దోఁపఁ గుంతి సహ దేవుని నిల్లడ వెట్టి నాకు న
మ్మా నిను నమ్మి చాల విష మం బగునవ్వనవాస మీతఁడుం
బూనఁగ నియ్యకొంటి నని బోరన నశ్రులు గ్రమ్ము చుండఁగన్. 211
వ. మఱియును. 212
చ. కడుఁబసిబిడ్డ వీఁ డొకటి గా దవు నా నెఱుఁగండు ముంద రె
య్యెడ నొకపా టెఱుంగఁ డెద యెంతయుఁ గోమల మెప్పుడైన నేఁ
గుడువఁగఁ బిల్తుఁ గాని తన కుం గలయాఁకటిప్రొ ద్దెఱుంగఁ డీ
కొడు కిటు వోకకున్ మనము గుందెడు నిన్ గని యూఱడిల్లెడున్. 213
తే. ఎప్పు డెయ్యడ నేమిట నెట్టు లరయ, వలసె నమ్మెయి నారయు మలసి డస్సి
నొచ్చియైనను నేమఱ కిచ్చఁ దలఁచి, తడమి నాచేత దీవన వడయు మమ్మ. 214
వ. అని యప్పగించె నేనును వనవాసకాలంబున నానేర్చువిధంబున మీకు నెల్లను
గారా మైనతమ్ముని నమ్మెయిం బరికించికొని వచ్చితి నిపు డజ్ఞాతవాసాయాసితుం
డగునతని నాకు ననుసరింప వెరవు గామింజేసి చేయునది లేక చింతిల్లు చున్న దాన
నా తెఱంగు వినుము. 215
సీ. ద్రుపదభూవిభుఁడు పు త్త్రులకంటె నెంతయుఁ, బెంపు సేయుచు గార వింపఁ
బెరిఁగి
కుంతీమహాదేవి కోడండ్రలోపల, నగ్గలంబునఁ గొని యాడఁ బరఁగి
ప్రాణంబులకునెల్లఁ బ్రాణంబుగా మీరు, నెయ్యంబు తియ్యంబు నెఱపనడచి
మదిఁ దల్లిదండ్రుల మాఱుగాఁ గొని జను, లనిశంబు భక్తిసే యంగ నెగడి
తే. రూపగుణవిక్రమంబుల రూఢి కెక్కు, నట్టికొడుకులఁ గని భర తాన్వయంబు
నందు నాయిల్ల యిల్లుగా నతిశయిల్లి, తగవుమై బాంధవులచేతఁ బొగడువడసి. 216
మ. వినుతింపం దగురాజసూయమునఁ బృ థ్వీదేవతాకోటి కె
ల్లను సంతృప్తి యొనర్చి వారిదయఁ గ ల్యాణాత్మ నై పుణ్యవ
ర్తన పాండుక్షితిపాలుకోడ లనఁగా రాజన్యమాన్యప్రియాం
గనలం దెల్లఁ బొగడ్త గంటి నతిలో కం బైనమీమన్ననన్. 217
ఉ. ఏను మనంబుపెంపు సెడి యిప్పుడు నీచతరప్రచారముం
బూని నికృష్ట నై యుదర పోషణకై తగ వేది యెంతయున్
దీనత బొంది యిమ్మెయి సు దేష్ణపనుల్ గనుసన్నఁ జేయుచున్
హీనత నున్కి మీకు వగ పేమియుఁ జేయద యేమి సేయుదున్. 218
క. పని పంపఁ గాని యొకతకుఁ, బని సేయ నెఱుంగ నన్నుఁ బనిగొనునెడఁ బాం
డునియగ్రమహిషి గొంకుచుఁ, బని గఱపెడుచందమునన పనుచు టెఱుఁగవే. 219
ఉ. ఒల్లరు రాజుదేవులును నొడ్డులు రాచినచందనంబు మే
నెల్లఁ జెమర్పఁగా నలయ కేను శ్రమంపడి నిల్చి నిల్చి య
ల్లల్లన మార్దవం బొనరు నట్లుగ నెట్టకునేని రాచి మీ
తల్లికి భక్తిఁ బెట్టెడువి ధంబునఁ బెట్టుదు బ్రహ్మఁ దిట్టుదున్. 220
ఉ. నున్నఁదనంబుగా నలుఁగు నూఱియుఁ జందన మట్లు రాచియుం
బన్నుగఁ గ్రొత్త లైనకల పంబులు గూర్చియు నాసుదేష్ణకుం
గన్నులసన్నలం బనులు గైకొని వారక చేయుచుండుటన్
ము న్నటు లున్నపాణితల ముల్ బలుగాయలు గాచెఁ జూచితే. 221
క. అనుచుం దొరఁగెడునశ్రుల, మునిఁగినమో మతనివక్ష మునఁ జేర్చిన న
వ్వనితయవస్థయ తాల్చుచు, ననిలసుతుం డడలె డెంద మలమటఁ బొందన్. 222
తే. అట్టియెడఁ దన్నుఁ దాన యూ రార్చికొనుచు
నంబుజానన నెమ్మొగ మల్లఁ దుడిచి
యనునయించి తత్కరములు దనమొగంబుఁ
గదియఁ జేర్చుచు నిట్టూర్పు గాడ్పు నిగుడ. 223
వ. చింతాక్రాంతుం డైనకౌంతేయునకు నయ్యింతి యి ట్లనియె. 224
తే. ఇందఱకు నిన్నిభంగుల నిడుమ గుడువ, వలసి ధర్మతనూభవు వలనఁ జేసి
దాయ లొడ్జినమాయజూ దంపుటురులఁ,బడి కులంబున కాతఁ డి ప్పాటు దెచ్చె. 225
ఉ. అక్కట మోసపోయి యడి యాసలఁ జావక యున్నదాన ము
న్నొక్కెడనే దురంతదురి తోత్కటబాధలఁ బెట్టి యున్ననా
కెక్కడి దుఃఖశాంతి గడ యెయ్దుట యెమ్మెయిఁ గల్గ నేర్చు మీ
ముక్కున నూర్పు గల్గ నొక మూర్ఖనిచేఁ బడితిన్ సభాస్థలిన్. 226
క. మీ రేమి సేయుదురు దై,వారంభము గాక శుభము నశుభంబును సం
సారులఁ దనతనతఱి నని,వారణఁ బొందంగ మాన్ప వచ్చునె వానిన్. 227
ఉ. కావున మీర లభ్యుదయ గౌరవ మొందుట యాత్మఁ గోరి యే
నేవిధి నైన నాపదల కెల్లను నోర్చెద దాని కేమి యీ
కావర మైనకీచకుఁడు కామనిపీడితుఁ డై యలంతులం
బోవక యేచి పట్టుకొనఁ బోయినఁ దూలెదఁ గాక యిమ్మెయిన్. 228
తే. వానిఁ దెగఁజూడ వైతేని వాయుపుత్ర, నీవు గనుగొన నురి నైన నీర నైన
నగ్ని నైన విషంబున నైన నేను, మేను దొఱఁగుదు నెట్టు నీ యాన సుమ్ము. 229
వ. అనిన వృకోదరుండు చిఱునవ్వు నవ్వుచు ని ట్లనియె. 230
చ. జలజదళాక్షి కీచకునిఁ జంపుట కిమ్మెయి ముట్టఁ బల్కఁగా
వలయునె యేను జూడ నని వారణ నిన్నుఁ బరాభవించి వాఁ
డిల మన నింక నాండ్రకును నెవ్వరు భంగము నీఁగఁ జాలువా
రలఘుమదీయబాహుబల మప్పుడ చూపనితప్పు సాలదే. 231
తే. ఎల్లి యెల్లవిధంబుల నెందుఁ జొచ్చె,నేని నాధర్మతనయుండు తాన వచ్చి
యడ్డపడెనేని నీవ పెం పారుకరుణఁ, గాచి తేని నాచే, బడుఁ గీచకుండు, 232
వ. వానిదెసం జింత యావంత వలవ దమ్మాటలు విడువు మని యూఱడిల్లం బలికి
దుర్దశల నలందురునవ్వెలందికుందు వాపం దలంచి యి ట్లనియె. 233
సీ. చ్యవనునివాంఛకు సంయాతినందన, యిడుమలఁ గుడువదె యడవిలోన
రాఘవుతోడ న రణ్యవాసము సేసి, సంతాప మందదె జనకతనయ
కుంభసంభవునకై ఘోరదుర్గముల లో, పాముద్ర యలజడి పాలు గాదె
నలునిపిఱుందఁ గా నల కేఁగిదమయంతి, మనుజులు వడనియు మ్మలిక వడదె
తే. వారు సైరణ సేసి దు ర్వార మైన, నిరతిశయదుఃఖభారంబు నిస్తరించి
సౌఖ్య మొందరె నీవు నా చందమునన, యాపదల కోర్చి సంపద లనుభవింపు. 234
వ. దుర్యోధనదుశ్శాసనకర్ణశకునిసైంధవప్రముఖం బగుదుష్టలోకంబు నధోలోకంబున
కనుచునంతకు మదీయాంతరంగంబు చింతాభరభుగ్నంబును నవమానపంక మగ్నంబును
గోపోద్విగ్నంబునునై వేగిరపడుచున్నయది ధార్తరాష్ట్రులకుం
గాలానసానంబైనయట్లు సమయకాలావసానం బయ్యె నజ్ఞాతవాసంబునకుం జొచ్చి పదు
నొకొండునెలలు సని పండ్రెండవనెల వర్తిల్లుచున్నది దీనికొఱంత దీఱిన
నీదువంతయుం దీఱు నూఱడిల్లియుండుము సింహబలుండు నిన్నుఁ బరిభవించి మైమైతోన
యునికింజేసి యెల్లియుం జెనకవచ్చు నీవుం గ్రమంబున నొడంబడుట భావించికొని
వానికి నర్తనశాల సంకేతప్రదేశంబుగాఁ జెప్పి యొంటిమెయిం జనుదేర నియమింపుము
వాఁడువచ్చిన నాసొబగునిందెగఁజూచి నీకుం జూపి నీచిత్తంబు వడసెద నిత్తెఱంగు
దప్ప నొండువిధంబు గర్జంబు గా దిదియ నిశ్చయం బిట్ల చేయువార మిమ్మాటలవలనం
దప్పవు గాని వేగుచున్నయది జనులు మేలుకాంచి మనలం గాంచిరేని వంచన బయలువడినం
గార్యంబు దప్పుఁ గీచకవధంబునకుం బూనిననామనోరథంబు దుదిముట్ట వలయు
నిజశయనస్థానంబునకుం బొ మ్మని శయ్యాతలంబు విడిచి యత్తన్విం దఱిమి
కొన్నియడుగు లనిచి మరలి మారుతాత్మజుండు కలుషితాత్ముం డగుచు, సెజ్జకువచ్చె
నచ్చెలువయుం దననిద్రించునెడకుం బోయి పర్యంకభాగంబునం దనువువైచి యంకిలి
దేఱని డెందంబునఁ గొందలంబుతోడి నిశ్చయంబున నిద్రం బొరయని కనుదోయి మొగిడ్చి
యుండె నంత. 235
ప్రభాతకాల వర్ణనము.
తే. ద్రుపదనందన పరిభవ దుఃఖమునకు, నుల్లమున దురపిల్లుచు నున్న నరసి
వేఁడినిట్టూరుపో యన వెడలెఁ గ్రొత్త, తావి మూతులు విచ్చునె త్తమ్మివిరుల
236
క. విచ్చెం దిమిరము గాఁపులు, వచ్చె మధుపకులము లబ్జ వనముల కురులం
జొచ్చె విరులు తరులతికల, నిచ్చె రథాంగములు వంత యెల్లఁ దొగలకున్. 237
సీ. పెనఁకువఁ దనిసిన తనువు లొండొంటితోఁ, గీలించి నిద్రించి
మేలుకాంచి
తరుణులుఁ బతులు వా తాయనంబుల నల్లఁ, బొలయువేఁబోకటి మలయపవను
నింపారు చోఁకున నిగురొత్తుచిత్తంబు, లెలసియొండొరులపైఁ బొలయుచూడ్కు
లాదట నుపకర ణావలి వెడవెడ, యాదరించుట రాగ మడరఁ దొడరి
తే. కేళి సలిపిరి భవనదీ ర్ఘికలతమ్మి, విరులనెత్తావి నెనయంగ బెరసి చెమట
పొడముమేను లతనికంపు ప్రోచి తఱచు, టూర్పుగాడ్పులపరిమళ ముల్లసిల్ల. 238
తే. రాలి యున్నపుష్పప్రక రము విదిర్చి, చెన్నుగా నున్నసేసిన సెజ్జ
యనఁగ.
వేగుటయుఁ జుక్కలన్నియు విరిసి విశద, భాతిఁ జెలువొందెఁ జూడ నం బరతలంబు.
239
వ. తదవసరంబున నల్లనల్లన తెఱపి యిచ్చి యడవులం జనునంధకారంబు దూరంబుల
యందును లేకునికివలనం గడళ్లప్పళించి నెరసి విరిసినం బొలుచుకలుకట్టలుం
బోనిదిక్తటంబులును దమపాసినకందువలు రోసి యెత్తినమెడలును బచరించిన చూడ్కులు
వేడ్కలం గ్రందైనడెందంబులుం గలిగి మెలంగుచు నొండొంటి బిట్టుగాంచియొదవు
సమ్మదంబునం బొదలు మేనులు బెరయించి పరమానందంబునం జొక్కుచు జక్కవలు గలసి
సొలసి నలిరేఁగి చెలంగుచురేయింటి యాఁకటిపెల్లున గొదగొని కమిచి చంచువులం
దిగిచి త్రుంచి యానుచు నిక్కడక్కడఁ బఱచినం జిక్కువడియున్న
మృణాలశకలంబులవలన బాలచంద్రశతాభిరామంబు లగుశంభు జలమూర్తివిశేషంబులంబోని
సరోవరంబులును జీఁకటి వాసినం బ్రభాతం బను వింతమానిసి మెలంగి ముసుంగు
వుచ్చినట్లు మేలుకని యఱకలు వొదల విదిర్చి కూర్చికొని కలగొనం
బలుకుపులుఁగులయెలుంగులవలన నొండొంటిం దెలుపు కరణి నొప్పుధరణీరుహంబులును
బరఁగునరుణోదయరాగపటలంబు నెనయు కెంజాయ రంజిల్ల వికసిల్లురక్తారవిందంబుల
దందడి నెగసి చరించుచంచరీకంబుల యెఱకలనెఱుల గిఱికొని
క్రొత్తయగుకాంతిప్రవాహంబులం గడలుకొల్పుపుప్పొళ్లు డుల్చిరాల్చుచుం
బొలయుమలయానిలంబునం గ్రాలుమవ్వంపుఁదీవలఁ గడివోయి తొరఁగినవిరులవలన మీనకేతన
పురాతనబాణశాలలం బోనిలతామండపంబులును మొగిడియు జనంబుసంధ్యాంజలిపుటకరణంబుల
ననుకరించువిధంబునఁ దర్శనీయంబు లగుకుముదవనంబులును నేమేనినెపంబున నొండొరుల
మేలు కాన్పురమణరమణీజనంబులనర్మాలాపంబులన్ బెరయుదరహాసంబులకాంతిఁ దెలు
పెక్కునట్లు వెలరారుదీపంబులును మునుకడ వచ్చి యెఱుక సేయమికి వాతా
యనపవనునిపయిం బుట్టినయలుకవిధంబున వేగుఁబోకట నంకురించుమదంబున గెంపు గదురుట
నిద్ర లేమి నని శంకింపక యింపునం గదియువిదగ్ధవిటజనంబుల మనంబుల దిగుచు
లలనాలోచనంబులును రేపకడ వనలక్ష్మి పురశ్రీ నలంకరించువడువున నెడపడక
యెల్లెడల నిగుడువిభాతకుసుమకదంబపరిమళంబును నై యున్నంత. 240
సీ. నీరజాకరములు నిష్ఠమైఁ జేసిన, భవ్యతపంబున ఫల మనంగ
దివసముఖాభినం దితచక్రయుగ్మకం, బుల యనురాగంపుఁ బ్రోవనంగ
హరిహరబ్రహ్మమ హానుభావంబు లొ,క్కొటి గాఁగఁ గరఁగిన గుటిక యనఁగ
నతులవేదత్రయ లతికాచయము పెను, పొందఁ బుట్టెడుమూల కంద మనఁగ
తే. నఖిలజగముల కన్దెఱ యగుచు జనస,మాజకరపుట హృదయస రోజములకు
ముకుళనంబును జృంభణం బునునొనర్చి, భానుబింబంబు పూర్వాద్రి పై వెలింగె.
241
వ. ఇట్లు సూర్యోదయ మగుటయు సమయసముచితకరణీయంబులు వేగిరంబ నడపి వేగిరపాటుతో
సింగారంబు సేసికొని సింహబలుండు. 242
క. తనమదిఁ గదిరినతమకం, బునఁ జిడిముడి పడుచు ద్రుపద పుత్రికపై నూ
నినవేడ్క దిగువ నొకటియుఁ, గనుఁగొన వినలేక మదన కంపితుఁ డగుచున్. 243
వ. అతిత్వరితంబ సుదేష్ణమందిరంబున కరుగుచు నంతరంగంబున. 244
ఉ. చయ్యన నేఁగి యంబుజవి శాలవిలోచనఁ గాంచి ప్రీతిమై
నయ్యెడ నేకతంబ హృద యం బలరం దగఁ బల్కి యొక్కమై
నియ్యకొనంగఁ జేసి యెల యించెద నిక్కకుఁ దార్చినేర్పునన్
శయ్యకుఁ దెచ్చెదం గుసుమ సాయకుపూనికి నేఁడ తీర్చెదన్. 245
క. అని యువ్విళ్ళూరుచు వెసఁ, జని కేకయరాజపుత్రి సదనంబున న
య్యనిమిషచారువిలోచన, యనురూపవిధాననిరత యై యుండంగన్. 246
చ. కనుఁగొని యప్డు గ్రొత్తయగు కౌతుకవృత్తి మునింగి పల్లటి
ల్లినధృతితోఁ గ్రమం బరయ లేనిమనంబు చలింప నచ్చటన్
జను లెడ యౌట గాంచునెఱి సాలక గ్రక్కున నింతిఁ జేరఁగాఁ
జనియె విధాతృలుబ్ధకవ శంబునఁ బోవుమృగంబుచాడ్పునన్. 247
క. చనుటయు ద్రౌపది యతనిం, గనియుం గాననివిధంబు గైకొని చిత్తం
బున బెదరక తనముందటి, పనివెరవున నుండె భీము పలుకులయూఁతన్. 248
వ. అట్టియెడ, 249
సీ. ఎవ్వరితో నైన నెలుఁ గె త్తి యొక్కింత, పని లేనివెంగలి పలుకు వలుకు
మట్టియ లొండొంటి బిట్టు దాఁకఁగ నేల, నందంద మునిగాళ్ళ నప్పళించుఁ
గడు వికారంబుగా నొడ లెల్ల విఱుచుచు, మలఁగి రిత్తకురిత్త సెలఁగి
నవ్వుఁ
దాళంబుగాఁ గర తలమునఁ బెలుచఁ గం, బంబు వ్రేయుచు వెడ పాట వాడు
తే. మలయు నంతంతఁ జేరువఁ బొలయు నింతి, దన్నుఁజూడమి కెంతయుఁ
దల్లడిల్లు
నిక్కడక్కడఁ బడుఁదగు లినుమడింపఁ,జూచు నత్తన్విఁ బొరిఁబొరిఁ గీచకుండు.
250
వ. ఇట్లు బహుప్రకారంబు లగుదుర్విలాసంబులు సేయుచు నద్దురాత్ముండు ద్రుపద
నందన డాయం బోయి. 251
ఉ. భాగ్యము గాదె నీచరణ పద్మము లెప్పుడుఁ జేరి కొల్వఁగా
యోగ్యత గల్గెనేని నను నొక్కని నొల్లవొ కామసౌఖ్యవై
రాగ్యము నీమనంబునఁ ది రంబొ నిజం బెఱుఁగంగఁ జెప్పు సౌ
భాగ్యము గుందునే మగల పై నొకయించుక చూడ్కి నిల్పినన్. 252
ఉ. ఆలము సేసి నాతగుల మాఱడిఁ బుచ్చఁగ నేల బేల న
న్నేలి యనంతభోగముల నిచ్చమెయిన్ విహరింపు నిత్యల
క్ష్మీలతికాలవాల మగు జీవన మంతయు నీమొగంబ కాఁ
బాలన సేయు మిప్పురము భామిను లెల్లను నిన్నుఁ గొల్వఁగన్. 253
ఉ. రాజుల నెల్ల నుగ్రసమ రంబుల వ్రేల్మిడి నోర్చి పేర్చి యీ
భూజనకోటి నా దగువి భుత్వసమగ్రత నాదరించి వి
భ్రాజిత రాజ్యతంత్రములు పాలన సేయుదు నేన వీటికిన్
రా జనఁగా నెపం బిడి వి రాటునకుం దగఁ గూడు వెట్టుదున్. 254
వ. కావున. 255
క. నీ వొకత వేల యిలఁ బది, వేవుర నే వలచి పట్ట వెదకిన నడ్డం
బై వచ్చి వలదు నా నిం, దేవాఁడు మగండు దీని నెఱుఁగవ కంటే. 256
చ. విరటుఁడు సూచు చుండ నిను వేవురముందట నట్లు ద్రోవ నొ
క్కరుఁడును గాదు గూడ దనఁ గల్గెనె పోటరు లైనభ ర్త లే
వురు గల రంటి వారియల వుం జలముం గడగంటి నింక నె
వ్వరు గల రెట్లు దప్పె దని వారణఁ బట్టెద నెందుఁ జొచ్చినన్. 257
వ. అనిన నవ్వెలంది వీఁడు దమకించి యున్నవాఁడు నాయంత్రించుమాటలకు మున్న
కదియంబడినఁ గర్జంబు దప్పు నని విచారించి. 258
తే. బహువిధంబుల నమ్మెయిఁ బలుకునతని
పలుకు లేర్పడ విని మెత్తఁ బడినయట్లు
సుభగ మెయివడిచూపుగాఁ జూచి తనదు
హృదయ మఱిఁగించు తెఱఁగున నిట్టు లనియె. 259
చ. వల దని యెంత సెప్పినను వావిరి వై కడువేగపాటుమైఁ
బలుమఱు నెల్లెడం దొడరఁ బాఱెదు నీహృదయంబునట్ల కాఁ
దలఁపు మనోజుతూపులకుఁ దక్కటిచిత్తములుం గడంగి వి
చ్చలవిడి సేఁత గర్జమె వి చారము గోర్కికిఁ గానివావియే. 260
క. మగ లడఁకువనుండక తమ, తగులమ పాటింతు రెట్టి తగులం బైనన్
మగువలయెడలన యడఁగుం, దగవు విడిచి యడిచిపడరు ధైర్యము పేర్మిన్ 261
ఆ. ఇట్టు లగుట యెఱిఁగి యెల్లభంగుల రహ,స్యంబు గోలుపోని యట్లు గాఁగ
నడరునీదుకోర్కి కనురూప మెట్టిది, యట్టిభోగభంగి ననుభవింపు. 262
చ. అనవుడుఁ గీచకుండు హృద యంబునఁ బొంగి లతాంగితోడ ని
ట్లను ధృతిఁ గోలుపుచ్చెఁ గుసు మాయుధుఁ డేటివిచార మిట్టు లేఁ
ప నగునెయైన నీ దయిన పం పెదఁ గైకొని చేయువాఁడ నే
యనువున నెప్పు డయ్యెడ ని జాభిమతం బొడగూర్తు చెప్పుమా. 263
క. అనిపలికినఁ బాంచాలియుఁ, దనయురులం గీచకుండు దగులుట భావం
బున నిశ్చయించి యి ట్లను, ననురాగాయత్తచిత్త యైనదివోలెన్. 264
ఉ. ఉత్తర లోనుగాఁ గలప యోజముఖుల్ పగ లెల్లఁ బ్రీతితో
నృత్తముఁ జేసి పోవ మహ నీయ రహస్యవిధిన్ నిశీథినీ
వృత్తము గోరువారలకు వేడ్కఁకు బట్టగుచుండు నాగృహం
బుత్తమ మిత్తెఱంగునకు నొంటిమెయిం దగ నీవు వచ్చినన్. 265
క. అనిన నతఁడు వికసిల్లుచు, నను నమ్మెయి నేలికొనిన నలినానన నీ
యనుమతి సేయనె యొక్కఁడఁ, జనుదెంచెద నేఁటిరాత్రి సమ్మదలీలన్. 266
తే. ఇదియు నిశ్చయ మిమ్మాట వదల కుండు, మనిన నీవొక్కరుండవ యరుగుదేర
వలయు లేకున్న నయ్యెడ నిలుచుదానఁ, గానుజూ నిక్కువం బని పూనిపలికి.
267
క. మన మియ్యెడఁ బెద్దయుఁ బ్రొ,ద్దనుమానము లేక మాట లాడుట దగ దీ
వును బొ మ్మేనును నా దగు, పని సేసెద ననియెఁ గమల పత్రేక్షణయున్. 268
చ. సమయము నిర్ణయింప విని చంద్రనిభాననపల్కు లప్డు చి
త్తమునకు నింపు పెంపఁగ ము దంబునఁ గీచకముఖ్యుఁ డాత్మగే
హమునకు బోయె నమ్ముదిత యచ్చట వెండియుఁ బ్రస్తుతక్రియా
సముచితవర్తనంబుఁ దగఁ జల్పి మహానసశాలలోనికిన్. 269
ద్రౌపది భీమునితోఁ గీచకుఁడు నర్తనశాలకు రాఁబోవుటం జెప్పుట.
క. చని వెడ వికసిల్లెడునా, ననపద్మముతోడ ననిల నందనునకు ని
ట్లనియెఁ జతురోక్తిరీతి య, తనిగూఢక్రోధవహ్ని దరికొల్పంగన్. 270
క. నాకొఱఁత దీర్చి వచ్చితి, నీకొఱఁతయ యింక సూతు నిం దెగఁజూడన్
లోకము వంచింపను దగు,చీఁకటిరేయొదవ నేమి సేసెదొ చెపుమా. 271
వ. అనిన విని దరహసితవదనుండగుచు వృకోదరుం డి ట్లనియె. 272
క. న న్నడుగ నేల నీవును, నన్నీచుఁడు నేమిమాట లాడితి రది నా
కున్నట్టు లెఱుఁగ జెప్పుము, ని న్నే మెచ్చించువాఁడ నీరజవదనా. 273
వ. అనినఁ బాంచాలి సుదేష్ణమందిరంబునం దా నుచితాచరణంబున నునికియు
సింహబలుండు సింగారించుకొని వచ్చుటయు రేయింటిమాటలవలనం దాను బెదరమియు వాఁడు
సామదానభేదదండంబులు సూపి పలుకుటయు దానికి మెయికోలు భావించికొని క్రమంబునం
దగిన సంభాషణంబు సేసినాట్యమండపంబు సంకేతస్థలంబుగాఁ జెప్పి యొక్కరుండ
వచ్చువాఁడ వని నియమించుటయు నద్దురాత్ముండు ప్రముదితాత్ముం డగుచు
రాత్రిసమయంబున నయ్యెడకు నొంటి మెయిం జనుదెంచువాఁ డై చనుటయుఁ దెలియం
జెప్పిన నతండు పరమా హ్లాదంబునం బొంది. 274
శా. క్రోధం బప్రతికార మై హృదయముం గుందింప నత్యంత చిం
తాధూతాత్ముఁడ నైననాకుఁ బరమో త్సాహంబు సంధిల్ల దు
స్సాధం బైనవిరుద్ధకార్య మిటు లా సన్నంబుగా సంఘటిం
తే ధర్మాత్మజుఁ డాత్మ మెచ్చఁ బగ సా ధింపంగఁ గా న్పల్పమె. 275
వ. అని పలికి కొండొక విచారించి. 276
క. వెఱవక సంకేతించిన, తెఱఁగున నయ్యెడకు నరుగు దెంచునొకో కొం
దఱఁ దెచ్చునొకో వెడఁ గై, యఱిముఱి వెలిపుచ్చునొకొ ర హస్యంబెల్లన్. 277
ఉ. అట్టిద యేల చేయు నన యంబు నయం బొడఁగూడఁ బల్కి నీ
విచ్చితెఱంగు సేయు మని యేర్పడఁ జెప్పిన వాని కత్తఱిం
బుట్టినసంతసంబునను వుం బరికించితి కాదె యింక ని
ట్ట ట్టనఁ డెట్టు లైన హృద యంబున నెక్కడిశంక వానికిన్. 278
ఉ. వచ్చు మదాంధవృత్తినని వారణ నొక్కఁడు నాట్యశాలకుం
జొచ్చు నవశ్యమున్ వెదకి చూచి ననుం గని యప్డు సంగరం
బిచ్చు మదీయబాహుబల హీనబలుం డయి నీకుఁ బ్రీతిగాఁ
జచ్చు నసంశయం బిది వి చారము లిన్నియు నింక నేటికిన్. 279
వ. అని నిశ్చయించి వృకోదరుండు వెండియు ని ట్లనియె. 280
మ. బలియుం డాసొబగుండు భావభవద ర్పభ్రాంతుఁ డై వచ్చి ని
శ్చలసర్వాంగత నున్న న న్నరసి నీ చదంబు గా కున్న నా
కులతం బొందెడు నప్డు మండపము సం క్షోభింపఁగా నేతుఁ గ
ట్టలుకన్ బెబ్బులి గోల వేసినటు లు గ్రాకార మేపారఁగన్. 281
క. ఎఱిఁగి పిఱుసనిన వెసఁ బై, కుఱుకుదు సాళువము గాకి నొడిసినభంగిన్
వెఱచఱవం బొదువుదుఁ బఱి, పఱిసేయుదు నీదుపూన్కి పారం బెయిదన్. 282
ఆ. నాదుబాహుబలము నకు మాఱుకొనఁ జాలు, భుజబలంబు గలిగి పోక చిక్కఁ
బెనఁగి నన్నుఁ గొంత గినియింప నోపెడు, చంద మైన వినుము సరసిజాక్షి.
283
మ. అవనీచక్రము సంచలింపఁగ దివం బల్లాడ నాశాచయం
బవధూతంబుగ గ్రోత్రశైలనికరం బాకంపముం బొంద న
ర్ణవముల్ ఘూర్ణన మొందఁ గ్రోధము గృతా ర్థత్వంబు నొందించి చి
త్రవధప్రౌఢి వహించి సూతునకు రౌ ద్రం బేర్పడం జూపెదన్. 284
వ. అనినం బాంచాలి సంచలితస్వాంత యై నిజాంతర్గతంబున నతనితీవ్రక్రోధంబు
గుప్తసాధనంబునకు బాధకం బగు నని బోధింపం దలంచి యి ట్లనియె. 285
ఉ. ఒవ్వనివారు నవ్వ మహి మోదధి ధర్మసుతుండు దీనికిన్
నెవ్వగఁ బొంద భూజనులు నింద యొనర్పఁగ నే నొనర్చునీ
చివ్వకు నీవు నల్కమెయిఁ జేసినయాపని గూఢవృత్తికిన్
ద వ్వగునేని నియ్యభిమ తం బొడఁగూడియు నిష్ఫలం బగున్. 286
క. కావున వంచన బాహిర, పోవక యుండంగ మనరి పుం బరిమార్పం
గా వచ్చునేని నట్టిద, నావల పటు గాక తక్కి నను వలదు సుమీ. 287
వ. అనిన విని ద్రుపదనందనకుం బాండునందనుం డి ట్లనియె. 288
చ. మదమునఁ గీచకాగ్రజుఁడు మార్కొనిన నిల్చి వీఁక మైమెయిం
గదిసితిమేని నప్పుడు ప్ర కాశరహస్యవిభేదబుద్ధి నా
కొదవునె యైన నేఁ దలఁచి యోపినభంగి నిగూఢవృత్తిమైఁ
బదిలము గల్గి తిన్ననియు పాయమునం దెగఁ జూతు నాతనిన్. 289
క. అనవుడు జయలక్ష్మిం జే, కొను మని దీవించి యింత కుం గేకయ నం
దన నన్నుఁ దడవుఁ దడయం, జన దియ్యెడ నని లతాంగి సనియెం బ్రీతిన్. 290
వ. మారుతసుతుండును గృతనిశ్చయుం డై యుండె నట గీచకుండు గందర్ప దర్పగోచరుం
డై పరిజనంబుల వంచించి యేకాంతస్థలంబున. 291
కీచకుఁడు ద్రౌపదియందలిమోహంబునఁ బరితాపంబు నొందుట.
సీ. వామాక్షిరుచిరలా వణ్యంబు భావించుఁ దన్వంగిరూపు చి త్తమున నిలుపుఁ
గంబుకంధరచెన్ను కైవడి దలపోయు, నంగనసౌకుమా ర్యము దలంచు
భమినిసహజవి భ్రమ మెదఁ గీలించుఁ, బడఁతి చెయ్వులు మదిఁ బట్టుకొలుపు
మానినిగరువంపు మాటపొం దూహించు, దళితాబ్జముఖితిన్నఁ దనము మెచ్చు
తే. నడరి కోర్కులు చిఱ్ఱుము ఱ్ఱాడ వెడఁగు, పడినయుల్లంబు పట్టునఁ
బఱుపఁదనకు
వశముగాకున్న నెంతయు వంతఁబొందుఁ, జింతయెసకంబువడిగొని చిక్కువఱుప. 292
చ. తలరు నలందురున్ నవయుఁ దాపభరంబున వెచ్చ నూర్చు మే
నలయఁగ నొల్లఁబోవు వెగ డందుఁ గలంగుఁ బరిభ్రమించుఁ గొం
దలపడుఁ దల్లడం బడరి ధైర్యము దూలిన బెగ్గడిల్లు వి
చ్చలవిడిఁ బేర్చు నెవ్వగల సందడి డెందము గంది చేడ్పడున్. 293
వ. ఇవ్విధంబున మదనకదనదోధూయమానమానసుం డగుచు నిట్లని వితర్కించు. 294
సీ. పడఁతి నన్నూఱడఁ బలికినభంగిన, నిచ్చమై నిక్కకు వచ్చునొక్కొ
వచ్చితొల్లిటియట్ల వడిఁ ద్రోచిపోవక, పొలఁతి యింపెసలారఁ బొందునొక్కొ
తలపోత గలిగి య మ్మెలఁత వచ్చుటకు నొం,డొకవింత పుట్టక యుండునొక్కొ
గంధర్వు లేవురు గల రని చెప్పె న, న్నెలఁతుకమాటలు నిక్కమొక్కొ
తే. తెఱవచిడిముడిపాటు సు దేష్ణ యెఱిఁగి
వేడ్కఁ బని వంచు టుడిగి రా విడుచునొక్కొ
మదనుఁ డింతికి నొజ్జ యై మతకములను
నదను నెఱిగించి నాకడ కనుచునొక్కొ. 295
ఉ. నిక్కమపోలె నప్పు డొక నేరిమిమై ననుఁ ద్రోచిపుచ్చఁగా
నక్కమలాక్షి పొందు దగ నాడి తుదిన్ నిజ మేది నేఁటిరే
యిక్కకు రాక తక్కిన స హించునె నన్ మరుఁ డట్టు లైన నా
కెక్కడిప్రాణ మేటితను వెయ్యది నిల్కడ యేమి సేయుదున్. 296
క. అట్టేల రాక తక్కుం, గట్టిఁడియే యాలతాంగి గామాతురు నన్
బెట్టి యచట దానికి మన, సెట్టు నిలుచుఁ దగవు విడువ నెట్టులు నేర్చున్.
297
ఉ. దానికి నేటినిక్కము వృ థా పరితాపము దక్కి బాసమై
పూనికి డిగ్గఁద్రావి వెసఁ బోయెద నిప్పుడ పోయి ముట్టి య
బ్జాననఁ బట్టి తెచ్చి హృద యం బలరంగ ననంగతంత్రవి
ద్యానిపుణత్వ మేర్పఱిచె దం బ్రమదాంబుధి నోలలార్చెదన్. 298
ఆ. అనుచు సంచలించు నడియాసఁ గ్రమ్మఱ, బాసఁ దలఁచి ధృతికిఁ బట్టువెట్టు
మరుని కోహటించి యురియాడుఁ దుదిముట్టఁ, గాన నిశ్చయించుఁ గలగుఁ దేఱు 299
వ. మఱియు నక్కోమలివలనిప్రేముడిం దగిలి. 300
సీ. పొడసూపిన ట్లైన వడిఁ బట్ట సమకట్టి, పరికించి కానక బమ్మరించు
మెలఁగినయ ట్లైనఁ బలికింపఁ దలఁచి ని,రూపించి లేమి న శ్రులు వహించుఁ
గదిసినయ ట్లైనఁ గౌఁగిలింపఁ గడంగి, యారసి బొంకైన నలఁత నొందు
నొడఁబడ్డయ ట్లైన నడరిపైకొనఁజూచి, చెన్నఁటియగుట నిశ్చేష్టఁబొరయు
తే. లలితవివిధవిహారంబు లకు లతాంగి, యెలసి పొలసినయట్లైన నెలమిఁ గలసి
యభిమతక్రీడ సలుపంగ నప్పళించి, వెదకి రిత్తబయల్ గని విహ్వలించు. 301
కీచకుఁ డుద్యానవనంబున విహరించుట.
వ. ఇట్లు బహుప్రకారంబు లగుమన్మథవికారంబున కగపడి వెగ డంది యమంద
సంతాపభరితాంతఃకరణుండగుచు సింహబలుండు పరిచారికాప్రార్థనం జేసి మజ్జన
భోజనంబు లొకభంగి నడపినవాఁడై తదనంతరంబ మనోవేదనాపనోదనార్థంబు
మందిరారామభూమికిం జని తత్ప్రదేశంబున. 302
చ. కమలవనంబుపొంత నును గా డ్పొకయించుక యాదరించుఁ జి
త్తమునకు దానఁ దల్లడము దన్కుటయుం జని గారవంపుఁజూ
తముకడ నిల్చు నిల్చి యది తాపముఁ బెంచిన లేఁతతీవజొం
పముఁ జొరఁబాఱు నం దలఁత పైకొనినన్ వెడలున్ వెనుంబడున్. 303
ఆ. సుడియుగాలిఁబువ్వుఁ బొడిఁదన్నుఁగప్పునో, యనుచు బెగ్గలించు నగ్గలముగఁ
గురియు తేనియలకుఁ గొంకు లతాగుల్మ, తరుసమీపములకు నరిగి యరిగి. 304
వ. ఇత్తెఱంగున నొక్కయెడ నయినను గా లూఁదక లీలోద్యానంబు గలయం గ్రుమ్మరుచు.
305
సీ. ఇం పైనప్రియ కాన నిచ్చినిల్చినమధు, వాదట నానుమ త్తాలివిభుని
జెట్టుపల్ పచరించి చుట్టుఁ గ్రుమ్మరి మనో,రమ నియ్యకొలుపుమ రాళవభుని
ఫలరసమొండొంటి కెలమిఁజంచులనిచ్చు, మెయినచొక్కెడుశుక మిథునములను
గమిఁబాసి తలిరుజొం పమునకు మెయిమెయిఁ,దాఁకంగఁ జనుపిక దంపతులను
తే. జూచి చూచి యుల్లంబున నేచి కోర్కు
లడరఁ జిడిముడిపడు మ్రాను పడు వెడంగు
పడు వెనుంబడుఁ దల్లడ పడు దురంత
చింతబారికి నగపడు సింహబలుఁడు. 306
వ. ఇట్టివలవంత నిక్కడక్కడ వడిఁ దిరిగి తిరిగి. 307
క. వగ ముట్టికొనినఁ జిత్తము, వెగ డొందఁగ మేను గలయ వెమ్మఁగ ధృతిపాఁ
తగల నొకతీవయింటికిఁ, దగి యుండెడుచంద్రకాంత తల్పము సేరెన్. 308
క. అం దొఱగి కీచకుం డా,యిందీవరనయన నాత్మ నిడి వేడ్కమెయిన్
డెందము చని విచ్చలవిడిఁ, గందర్పుఁడు వెఱ్ఱిఁ జేయఁ గా ని ట్లనియెన్. 309
సీ. కెంగేలు గేలితోఁ గీలించి నెయ్యంపు,మాటలఁ దగుమఱు మాట లార్తుఁ
గుచము లురంబునఁ గుదియించి క్రమమున, నిఱిసినకౌఁగిట నిం పొనర్తు
నంగుళంబుల నల్ల నలకలు కబళించి, కెమ్మోవి యాని యె క్కింతుఁ గాయ్వు
మనము మనంబునఁ బెనఁచి కేళికిఁ జొచ్చి, సతిఁ దేల్తు సౌఖ్యర సంపునిట్ట
తే. దనివు మొద లైనఁ జిగురొత్తు తమకమునకుఁ
బ్రాఁకు వెట్టుచు మగుడఁ బైఁ బడుచు నింతి
వింతభంగుల కెలయించి వెకలిఁ జేసి
యభిమతక్రీడనములకు నలవరింతు. 310
వ. అనుచు వెండియు నిగుడుమనోరథంబులను భావరతంబుల శిశిరోపచారంబులఁ బ్రొద్దు
గడపి కడ గానక. 311
క. మాయరవి యేల క్రుంకఁడొ,కో యను ని ట్టేల తడసె నో యనుఁ గ్రుంకం
బోయెడుఁ జూ యిప్పుడ యను, దాయ పఱిచె నను మనోజ తాపముపేర్మిన్. 312
ఆ. దివమ కాని యింక భువనంబునం దిట, వట్టి రాత్రి లేని యట్టు గాఁగఁ
జేసెనొక్కొ విధి వి శేషించి నాకకా, నేఁడ దివము సాఁగి నిలిచెనొక్కొ.
313
తే. అనుచుఁ గ్రుంకింప రానిప్రొ ద్దరసియరసి, శిశిరపర్యంకమున మేను
సేర్చి చేర్చి
వంతఁ దలపోసితలపోసి వనరివనరి, మిగుల వందురివందురి పొగిలిపొగిలి. 314
సీ. తనికెడునారటం బున నంతకంతకు, వెమ్ముచు నునికికి విడుమరయును
గోలుమసంగెడు కోర్కులవెనువెంటఁ, బాఱుచు నునికికి నూఱటయును
వావిరిఁ బొదివెడు వగలసందడిఁ బడి, యురియుచు నునికికి నుడుకువయును
నందంద కదిరెడు కొందలపాటుచేఁ, దలఁకుచు నునికికి నిలుకడయును
ఆ. లేమిఁ దాల్మిగొనఁగ లేక యలందురి, తనువు నింద్రియములు మనముధృతియుఁ
దనవశంబు గాక తల్లడపడి సింహ,బలుఁడు విషమబాణు బారిఁ బాఱె. 315
క. ఇమ్మెయిని నధికపరితా,పమ్మునఁ బడుసూతుహృదయ పద్మం బలరం
దమ్మికొలంకులు మొగుడ వ,నమ్ములు సోలంగ దివస నాథుఁడు గ్రుంకెన్. 316
వ. తదనంతరంబ. 317
సూర్యాస్తమయవర్ణనము.
క. ఇనుఁడు దనకడకు నేతెం,చినరాగముఁ బొందు టది యు చిత మనఁగాఁ గెం
పున మెఱసి పశ్చిమాశాం,గన జనసంభావనముల గౌరవ మందెన్. 318
ఉ. చుక్కలు తోడుతోడఁ దల చూపఁ దొడంగె మనోభవుండు వి
ల్లెక్కిడి చక్రవాకముల యిక్కలు రోయఁగ జొచ్చె నేల కెం
పెక్కుచు వచ్చె దీవియల యేడ్తెఱ సోయగ మందె సందడుల్
దక్కెఁ బురంబువీధుల మ దం బొలసెన్ విటచిత్తవృత్తులన్. 319
వ. పదంబడి జారచోరులమనంబు లలరం జంద్రాస్తమయం బగుటయు. 320
క. పెనుమి ఱ్ఱిది పల్లం బిది, యన కుండఁగ నోలమును బ యలు నొక్కటిగాఁ
గనువిచ్చుటయును మోడ్చుట,యును సరిగాఁ దమము పర్వె నుర్విం దోడ్తోన్. 321
వ. అప్పు డాకృశోదరి వృకోదరుకడకుం జని సమయం బయ్యె ననవుడు. 322
తే. అతఁడు పెండ్లికిఁ బలిచిన యట్లువికచ, హృదయుఁడై తలచీర యా యితముసేసి
ద్రుపదనందనఁ జూచి నా తోన వెనుక, నల్ల నంతంత నరుగుదె మ్మనికడంగి 323
చ. గమనమువీఁక వేఱొకవి కారము వుట్టక సంగరోత్సవో
ద్యమరభసాతిరేకము బ యల్పడు టించుక లేక రోషసం
భ్రమ మొకయింత యైనఁ బర భావనిరూప్యము గాక ద్రౌపదీ
రమణుఁడు వోయి విక్రమధు రంధరతం దగ నాట్యశాలకున్. 324
వ. చని వివేకరహితుహృదయంబునుంబోలెఁ దమోదుషితంబును విదగ్ధవనితా
ప్రేమంబునుంబోలె దుర్నిరూపంబును ఘోరాటవీభాగంబునుబోలె నిర్మనుష్యంబును
గాపురుషలక్ష్మీవిలాసంబునుంబోలె ననుపయోగ్యంబును ననభ్యస్త
శాస్త్రంబునుంబోలె దుర్గమంబును స్వప్నలబ్ధపదార్థంబునుంబోలె
నదృష్టిగోచరంబును విషమకావ్యంబునుంబోలె నస్పష్టాలంకారంబును
బాలిశరాజ్యంబునుం బోలె జారచోరహృద్యంబును నైనయానర్తనాగారంబుముఖభాగస్థలంబు
సేరి. 325
క. కెలఁకులుఁ బిఱిందిదెసయుం, గలయం బరికించి తనయ ఖండితబాహా
బలగర్వమ యచ్చట ముం,గలిగా మదమత్తభద్ర గజసదృశగతిన్. 326
శా. ధ్వాంతాకారితకుడ్యకుట్టిమఘన స్తంభావలీరూపముం
బ్రాంతాది ప్రవిభాగబోధరహిత ప్రాగ్వ్దారముం గాతర
స్వాంతత్రాసకరంబు నై దురభివే శం బైనయాలోను ని
శ్చింతుం డై సతికేలు పట్టికొని చొ చ్చెన్ భీముఁ డత్యుగ్రతన్. 327
వ. ఇట్లు సొచ్చి తఱియం జని మధ్యప్రదేశంబున విరాటనందనలీలాపర్యంకం బరసి
కని దాని కనతిదూరంబునం బాంచాలి నోసరిల నునిచితా నాతల్పంబున నుండె నంతం
గీచకుండు. 328
క. కైసేసి మదవికారో,ల్లాసంబున మేను వొంగ లఘుగతి నుత్కం
ఠాసవపానవిధాన,వ్యాసంగతరంగితాంత రంగుం డగుచున్. 329
శా. సింగం బున్నగుహానికేతమునకున్ శ్రీఘంబునన్ వచ్చుమా
తంగంబుం బురుడించుచుం బవనపు త్త్రస్వీకృతం బైనయా
రంగాగారము సేర వచ్చి మదిలో రాగంబు ఘూర్ణిల్ల నిం
తిం గాముం డిట తేఁడె యింత కని యు ద్వృత్తాంగజోన్మాదుఁ డై. 330
ఉ. స్వాంతము బాహుగర్వఘన సంతమసాంధము గాఁగ శంక యొ
క్కంతయు లేక కీచకుఁ డ హంకృతి ముంగలి గాఁగ మండపా
భ్యంతరభూమిఁ జొచ్చి తఱి యం జని యారసి సెజ్జ గాంచి య
త్యంతముదావహం బగుడు నందు రయంబునఁ గేలు సాఁచినన్. 331
చ. ఘనతరకోపవేగమునఁ గంపము నొందునిజాంగకంబులం
దనధృతి పెంపుసొం పచలి తంబులఁ జేయ సమీరుకూర్మినం
దనుఁడు తదీయచేష్టలును దద్వచనంబులచొప్పు నేర్పడం
గనుమతి నూర కుండె నవి కారనిగూఢనిజప్రకారుఁడై. 332
ఆ. కీచకాధముండు కిమ్మీరవైరిపైఁ, గేలు సాఁచి యావి శాలనయన
గాఁ దలంచి మేను గరుపాఱ ని ట్లను, మదనఘూర్ణమాన హృదయుఁ డగుచు. 333
చ. వనిత మనోహరంబు లగు వస్తువు లెల్లను వేడ్క నేఱి నీ
కని నియమించి తెచ్చితిఁ బ్రి యంబునఁ గైకొను మెప్డు నంగనా
జనములు నన్నుఁ జూచి మరు సాయకముల్ దమచిత్తవృత్తులే
చినఁ గొని వచ్చి యిత్తురు వి శిష్టధనంబులు నాకు లంచముల్. 334
సీ. నాదురూపంబు మ నంబునఁ జిక్కిన,తరుణి ద క్కొరు నేల సరకు సేయు
నాదులావణ్యంబు నకు నిచ్చ మెచ్చిన, యెలనాగ పైఁ బడ కేల నిలుచు
నావిలాసంబులు భావింపఁబడసిన,యింతి పుష్పాస్త్రుచే నెట్లు బ్రదుకు
నావివేకమున కా నందింపఁ గనినయం,గన యెట్లు నిలుపునఁ గ్రాఁగ కుండు
తే. మెఱయ నాయాడుమాటలు తెఱవపిండు,నుల్లములకునింపారెడు నురులుగావె
యిట్లు నీ వొక్కతవె నన్ను నేలుకొంటి,గాక మాట లిం కేటికిఁ గమలవదన. 335
క. అనవుడు మనమున నిస్సీ, యని యుచితనిగూఢభంగు లగుభాషణముల్
దనప్రియ వినిపించుట కి, ట్లనియెన్ మృదురీతి భీముఁ డాతనితోడన్. 336
తే. ఇట్టివాఁడవు గావున నీవు నిన్నుఁ, బొగడికొనఁ దగు నకట నా పోల్కియాఁడు
దాని వెదకియు నెయ్యెడ నైన నీకుఁ, బడయ వచ్చునె యెఱుఁగక పలికి తిట్లు.
337
క. నాయొడలు సేర్చినప్పుడఁ, నీయొడ లెట్లగునొ దాని నీ వెఱిఁగెదు త
న్నేయబలలతోడిదిగాఁ, జేయఁ దలంచితివి తప్పు సేసితి గంటే. 338
క. నను ముట్టి నీవు వెండియు, వనితలసంగతికిఁ బోవు వాఁడవె యైనం
దను వేఁ బడసినఫలమే, కనియెద విదె చిత్తభవవి కారము లెల్లన్. 339
మ. అనుచున్ గ్రక్కున లేచి రోషకఠినం బౌహాస మాసూతునె
మ్మన ముద్వేగముఁ బొందఁజేయ బలసా మగ్రీసముజ్జృంభణం
బున వానిం దల వట్టి వంచుటయు నే పుం జేవయుం దోఁప వాఁ
డనుమానింపక బె ట్టదల్చికొని కో పాటోపదీప్తాంగుఁ డై. 340
భీమసేనుఁడు కీచకుని సంహరించుట.
వ. గంధర్వుం డనుతలంపున. 341
చ. పవనతనూజుబాహువులు పాణియుగంబునఁ బట్టి వీఁకమై
నవనిపయిం బడం దిగిచి యంగము జానుల నూఁదినం గడున్
జవమున దండతాడితభు జంగముభంగి సముత్థితాంగుఁ డై
యవయవముల్ ప్రకోపరభ సాతిశయంబునఁ బొంగ నుద్ధతిన్. 342
మ. మగుడం గీచకుఁ బట్ట వాఁడును బలో న్మాదంబునన్ బాహుగ
ర్వగరిష్ఠుం డగునాహిడింబరిపుఁ దీ వ్రక్రోధుఁ డై పట్టి బె
ట్టుగఁ ద్రోపాడఁగ నిద్దఱున్ భుజబలా టోపంబుమై నొండొరున్
మిగులం జాలక కొంతసేపు వడి మే మేఁ బోరి రుగ్రాకృతిన్. 343
వ. అట్టియెడ. 344
క. తనయగపా టొరు లెఱుఁగుదు, రని సూతుఁడు సమయభంగ మగుటకు భీముం
డును గొంకుచుఁ జప్పుడుసే,యనిగూఢవిమర్దనప్ర హారములఁ దగన్. 345
వ. మల్లయుద్ధనైపుణ్యంబు మెఱయం గడంగి. 346
సీ. తిగిచిన నడుగులు దెరలక యొండొరుఁ, గ్రమ్మఱఁ దిగుచుచుఁ గడిమిమెఱయఁ
బొడిచిన వెస బీఱు వోవక యొండొరు, నందంద పొడుచుచు నవనిఁ బెట్టి
యొత్తిన బెగ్గలం బొందక యొండొరు, బలువిడి నొత్తుచు నలవు మిగిలి
యడఁగంగఁ బొదివిన నడిచిపా టించుక,యును లేక వీఁక నొం డొరుల నడరి
తే. యడఁగఁ బొదువుచు నలుక యం తంత కగ్గ
లించి యాయముల్ నొంచి దో ర్లీల నెఱపి
యుల్లసిల్లిన స్రుక్క కొం డొరుల రౌద్ర
వృత్తి నొంచు చొండొరులకు వెక్కసముగ. 347
క. కదియుచుఁబాయుచుఁబట్టుచు, నుదలుచుచుం బడుచులేచు చుడుగుచు వడిగొం
చొదవెడుకినుకం గడుబె,ట్టిదముగఁ బెనఁగిరి చలంబు డింపక కడిమిన్. 348
ఆ. ఇవ్విధమున నేచి యిరువురుఁ బెద్దయుఁ, బ్రొద్దు పోర వాయు
పుత్త్రుబలము
దోడుతోడఁ బెరుఁగఁ దొడఁగె నాకీచకా,ధమునిలావు పిదపఁ దఱుఁగజొచ్చె. 349
ఉ. దాని నెఱింగి యెంతయు ను దగ్రత నాబకవైరి గ్రక్కునన్
వాని నడంగఁ బట్టి పడ వైచి మహోగ్రత నాక్రమించెఁ బం
చానన మేణముం బొదువు న ట్లతఁ డూర్జితశక్తి నుద్భటుం
డై నెగసెన్ సమీరసుతు నల్కకుఁ బ్రాఁ కిడినట్లు వీఁకతోన్. 350
క. నెగయునెడ నగ్గ మైనను, బిగి యారుచుఁ బిఱుఁదుసనినఁ బిడికిట గొఱసం
ది గడు బెడిదముగఁ బొడిచెం, బగతుఁడు గను మిడిసి నేలఁ బడి తన్నికొనన్.
351
ఆ. పల్లవప్రసూన ఫలభరితం బగు,మ్రాను గూలఁ ద్రోచు మత్తగజము
పోల్కి వివిధరత్న భూషణభూషితుం, డైనసూతుఁ గూల్చె ననిలసుతుఁడు. 352
చ. వికృతవుఁజావు సంప మది వేడుక వుట్టినఁ గిట్టి పట్టి మ
స్తకమును బీనదీర్ఘభుజ శాఖలుఁ బాదయుగంబు మేనిలో
నికిఁ జొర నుగ్గుగాఁ దుఱిమి నించిన గ్రంతలతిత్తి యైనకీ
చకు ధరణీస్థలిం జదిపి చక్కనిముద్దగఁ జేసె దుష్టుఁ డై. 353
క. తనకడిమికలిమి నచ్చియు, మనమునఁ దలఁ కడర సూతు మరణంబు గనుం
గొనుటకుఁ దల్లడపడుప్రియ,వనిత కతనిచావు సెప్పి వడిఁ దన్మాత్రన్. 354
చ. అనలము గూఢయత్నమున నయ్యెడకుం గొని వచ్చి దానిఁ జ
య్యన వెలుఁగొందఁ జేయుటయు నచ్చెరువున్ భయమున్ బ్రియంబునుం
బెనఁగొనఁగాఁ గనుంగొనియె భీతమృగేక్షణ భీము డాయఁగాఁ
జని కడు నక్కజం బయిన చందమునం బడి యున్నపీనుఁగున్. 355
ఉ. చూచుచుఁ జేరి వ్రేల్మిడుచు చుం దలయూఁచి విలక్షచిత్త యై
యాచపలాక్షి ముక్కుపయి నంగుళముం గదియించి దీనికై
కీచక యింత సేసితి సు ఖిత్వముఁ బొందుదుగాక యింక న
ట్లేచిన నిట్లు గా కుడుగు నే యనుచున్ వెఱఁ గందు చుండఁగన్. 356
క. పూనిక నెఱపితి సతియవ,మానముఁ బరితాపభరము మాన్చితి నిపు డి
ట్లే నని మదిఁ బొంగెడుపవ,మానసుతుం డిట్టు లనియె మానినితోడన్. 357
శా. చింతాశల్యము వాసెనే భుజబలో త్సేకంబు నీ కెక్కెనే
శాంతిం బొందెనె రోషపావకుఁడు దు శ్చారిత్రునిం జూచితే
సంతోషించితె యిట్లు గాక బ్రతుకన్ శక్యంబె దుర్వృత్తి నీ
చెంతం జేరినయట్టివీరులకు నా చేతం బయోజాననా. 358
క. అనిన విని సింహబలమ,ర్దను నవలోకించి ద్రుపద రాజతనయ యి
ట్లనుఁ దనమనమున నిండా,రినసమ్మోదంబు వెలి వి రిసి వెరయంగన్. 359
సీ. కొలువులోపల నిన్నఁ గోప మ ట్లెత్తినఁ, దలఁకక నిలిచిన ధైర్యమహిమ
నేఁ డిందుఁ జనుదెంచి నిర్వికారతఁ బ్రజ,కన్నులు గప్పిన గౌరవంబు
మనవారిలోన నొ క్కని నైనఁ బిల్వ కు, త్సాహంబు సేసిన సాహసంబు
లోకదుర్జయుఁ డగు నీకీచకునిని వ్రే,ల్మిడి రూపు మాపిన కడిమిసొంపు
తే. సూడఁ దలపోయ మెచ్చ సం స్తుతి యొనర్ప, నాదలంబె నీయుత్తమ నాయకత్వ
మెఱిఁగి నినుఁ గొనియాడ నే నెంతదాన, మహిత విస్మయానందని ర్మగ్ననైతి. 360
క. అనుపలుకులు కర్ణరసా,యనము లగుడు నయ్యుధిష్ఠి రానుజుఁడు ముదం
బునఁ దేలి యింకఁ దడయం, జన దని ద్రౌపదికిఁ జెప్పి చయ్యన నేఁగెన్. 361
క. అనిన విని కీచకుఁడు స,చ్చినపిమ్మటఁ బుట్టునవ్వి శేషము లెల్లన్
వినువేడుక మన మలరెడు, ననఫూ యేర్పడఁగఁ జెప్పు మనుటయుఁ బ్రీతిన్. 362
చ. పరమకృపావిధేయ నిరు పాధిక చిన్మయకాయ గాఢవి
స్తరనిగమైకవేద్య గుణ తత్వ్తవికారనియత్యభేద్య సం
స్మరణనిరస్తతాప ఘన సంసృతిసంతమనప్రదీప ని
ష్ఠుర భుజసారదానవని షూదన భక్తజనప్రమోదనా. 363
క. చతురానందమయా దు,ర్గతిరోగోద్గమచికిత్స కా భువనభవ
స్థితిసంహారకరా ని,ర్వృతిపణ్యాపణపదారవింద వికాసా. 364
మాలిని. సురపరివృఢచూడా శోభిరత్నాంశువీచి
స్ఫురణసుభగపాదాం భోజసంచారకేళీ
పరిచయకలనాల బ్ధవ్యయాతీతసౌఖ్యో
త్తరమునిజనహృన్మా ద్యన్మరాళప్రతానా. 365
గద్యము. ఇది శ్రీమదుభయకవిమిత్త్ర కొమ్మనామాత్యపుత్త్ర బుధారాధనవిరాజి
తిక్కనసోమయాజిప్రణీతం బయిన శ్రీమహాభారతంబున విరాటపర్వంబునందు
ద్వితీయాశ్వాసము. 366
విరాటపర్వము - తృతీయాశ్వాసము.
క. శ్రీత్వ్తశివాత్వాలంబన
తత్వ్తాశ్లేషాత్తశబల తాసంగతక
ర్తృత్వ్తాదిక లీలాత్తమ
హత్వ్తాహంకారభావ హరిహరనాథా. 1
ఉపకీచకులు ద్రౌపదిం దమయన్నశవంబుతోఁ గట్టి దహింపం గొనిపోవుట.
వ. దేవా వైశంపాయనుండు జనమేజయున కి ట్లనియెఁ బవనతనయుం డట్లు సని
మహానసమందిరంబుపరిసరంబున శరీరప్రక్షాళనంబు సేసికొని యనులేపనంబున నస్రగంధం
బుడిపికొని కృతకృత్యుండై శయ్యాతలంబునం గూర్యుండె నిట యాజ్ఞసేనియు
భీమసేనుం డింతకు వంటయింటికిం బోయి నిశ్చింతంబున నుండు నని నిశ్చయించి
నర్తనశాల వెలువడి కావలివారలం బిలిచి. 2
క. నాపతు లగుగంధర్వుల,చేపడి మృతిఁ బొందె వీఁడె సింహబలుం డీ
పాపాత్మునిఁ జూడుఁడు దు,ర్వ్యాపారఫలంబు గాంచె నని పలుకుటయున్. 3
ఆ. వారు సంభ్రమించి వడిఁ గోలదివియలు, గొనుచు నులివు మిగులఁ గూడఁబాఱి
నృత్తశాలఁ జొచ్చి రత్తఱి నాకల,కల మెఱింగి కీచ క వ్రజంబు. 4
చ. కడువెస వచ్చి రూపఱిన కాయము నున్న తెఱంగు జూచి బి
ట్టడలు మనంబులం గదిరి హా యనువారును జోద్య మంది మ్రా
న్పడియెడువారు నగ్రజుని పైఁ బడి మూర్ఛలఁ బొందువారు న
య్యెడ కరుగంగ నోర్వక మ హిం బెఱచోఁ బలవించువారు నై. 5
వ. ఉన్నంత బంధుజనంబులు గూడంబాఱి కీచకశవంబుఁ గనుంగొని. 6
ఉ. మానవకోటి నిట్టివిసు మానపుఁబీనుఁగు లైనవారి నెం
దైనను గంటిమే యకట యాఱడి వ మ్మయి పోయె దుర్జయం
బైనబలంబు గానితెరు వై తన కిత్తఱిఁ దోడు గాద యు
క్కీనిమనంబు గీడు పరి కించునె క్రొవ్వినఁ జేటు దప్పునే. 7
తే. కరము లెయ్యవి శిరమేది గాళు లెచటఁ, జొచ్చె గంధర్వవరులచేఁ
జచ్చువార
లెల్ల నిట్టుల యుగుదురో యితనితోడి,యలుకఁ జేసిరొ యిది గడు నక్కజంబు. 8
వ. అని వెండియు బహుప్రకారంబులం బలుకుచు శోకవిస్మయపరీతచేతస్కు లయి
యున్నంత నొక్కయుపకీచకుండు నిజసహోదరులం జూచి. 9
క. మన మెంత పనవి పిలిచిన, విన నేర్చునె సింహబలుఁడు వేగమ యితనిం
గొనిపోవఁగ వలయుంగా, కని యందఱఁ దేర్చె ననున యాలాపములన్. 10
ఉ. సూతులు దాని కియ్యకొనుచుం దమయన్నకు నగ్ని యేర్చువా
రైతగ వాచరించునెడ నల్లన ద్రౌపది వీరిచందముల్
సూతముగాక యంచు నొక చోఁ దమచేరువ నున్నఁ గాంచి సం
జాతమహోగ్రకోపు లయి చారువిలోచనఁ బట్టి క్రూరతన్. 11
క. పెడ గేలు గట్టి పాపపుఁ,బొడ వగు నిది గాదె యితనిఁ బొడ వడఁగించెన్
గెడగూడ దీని నీతని,యొడలిపయిం బెట్టి కాల్చు టుచితం బరయన్. 12
వ. అని విరాటుని కెఱింగించి చేయువా రై యంతకు మున్న యీవృత్తాంతం బంతయు
విని సంక్షుభితహృదయుం డై యున్నయతనిపాలికిం బోయి. 13
తే. ఎల్లభంగుల సైరంధ్రి నేము సింహ,బలునితోఁ జంపువారమై తలఁచి నీకు
నెఱుఁగఁ జెప్పంగ వచ్చితి మీవు నింత,వట్టు మన్నన మాకు నీ వలయు ననిన. 14
వ. ఆతండును దనమనంబున నియ్యుపకీచకులచందంబు సూడ నేను వారించితినేనియు
నుడుగం గలవారు గా రని యూహించి వారలం గలయం గనుంగొని యట్ల కాక మీకుం బోలిన
తెఱంగు సేయుం డనిన నదియ యనుమతిగాఁ గైకొని సరభసంబునం జనుదెంచి. 15
ఉ. అంగజరాగమత్తుఁ డగు నన్నకు నిమ్మెయి నైనఁ బ్రీతి సే
యం గలవార మీజఱభి యాతనితోడన తీఱుఁగాక యం
చుం గొనిపోయి దైన్యమున సూతునిపీనుఁగుమీఁదఁ బాండుపు
త్త్రాంగనఁ బెట్టి కట్టిరి ద యాపరివర్జితచిత్తవృత్తు లై. 16
చ. అశుచియుఁ గష్టుఁడున్ లఘువు నైననిజాగ్రజుమేనితోడ ని
త్యశుచియుఁ బుణ్యశీలయు ను దాత్తయు నాఁ జనునింతిఁ గొంచుఁ గ
ర్కశమతిఁ గీచకుల్ బహుము ఖంబుల బాంధవవిప్రలాపముల్
దిశ లద్రువం జెలంగఁ గర దీపనికాయము ప్రజ్వరిల్లఁగన్. 17
క. పితృవనముదెసకుఁ జన న,య్యతివ భయభ్రాంతచిత్త యై బాష్పజలో
ద్గతి మొగముఁ గప్ప ని ట్లని, యతిరావముగా నొనర్చె నాక్రందనమున్. 18
ఆ. అనద నైతి నిచట నాలికుయ్యాలింపుఁ, డకట మీరు గలుగ నాక్రమించి
నన్నుఁ గట్టి సూత నందను లిమ్మెయి, వెఱపు లేక భంగ పఱుచువారు. 19
ఉ. ఆనతవైరి యోజయ మ హాద్భుతవిక్రమ యోజయంత దు
ర్మానవిఘూర్ణమానరిపు మర్దన యోవిజయాభిధాన తే
జోనిహతాహితప్రకట శూరగుణప్రతిభాస యోజయ
త్సేన విరోధిబాహుబల జృంభణభంజన యోజయద్బలా. 20
సీ. తొడఁగినపని చలం బెడపక యతిదుష్క,రం బైనఁ గడ తేర్చు ప్రభువులార
పెనఁగిన వైవస్వ తుని నైనఁ గడిమిమై, వ్రేల్మిడిఁ బరిమార్చు వీరులార
శరణార్థి యగుదుష్ట శాత్రవు నైనను, గరుణ రక్షించుస త్పురుషులార
యర్థికిఁ బ్రాణంబు లైనను డాపక, తమకించి యిచ్చును దారులార
తే. నాథులార గంధర్వర త్నంబులార, నన్ను నుపకీచకులు దమ యన్నశవము
నందు బంధించుకొని వెస నరుగుచున్న,వారు రక్షింప వేగరా వలయుమీరు. 21
భీముఁ డుపకీచకులం జంపి ద్రౌపదిని విడిపించుట.
చ. అని పలవించునయ్యెలుఁగు లాపవమానతనూజుఁ డేర్పడన్
విని మది నాదువల్లభకు వీండ్రును గ్రమ్మఱ నింత సేసిరే
యనుచు సరోషసంభ్రమత నాయిత మై వెసఁ బాఱి వప్రలం
ఘన మొనరించె గుప్తముగ గ్రక్కున ముట్టెడుదానికిం దగన్. 22
తే. ఇట్లు లంఘించిపోయి ప రేతభూమి,యొద్ద నలుదిక్కులునుజూచి యొక్కయున్న
తావనీజంబు వెఱికి రౌ ద్రాతిరేక, మడర భుజశిఖరంబున యం దమర్చి. 23
మ. వికటభ్రూకుటిఘోరఫాల కలిత స్వేదోద్భటుండుం జల
ద్వికృతోష్ఠద్వయుఁడుం బ్రమర్దనదశా విర్భావసంభావితాం
గకుఁడుం జిత్తవిదాహదోహలసమ గ్రక్రోధవేగుండు నై
బక విధ్వంసకుఁ డయ్యెడన్ నిలిచె శుం భన్మూర్తివిస్ఫూర్తితోన్. 24
వ. తదనంతరంబ. 25
ఆ. సూతుశవముతోడ నేతెంచు నెరవులు, దవ్వుదవ్వులన యు దగ్రరూప
కలితుఁడైనభీముఁ గనుఁగొని నడవక, నిలిచి రంతనంతఁ గలఁగఁబాఱి. 26
మ. ఇదె గంధర్వులు వచ్చి ముట్టికొని రిం కెట్లెక్కొ యంచున్ భయం
బొదవం బల్లములందు డాఁగియు సమీ పోర్వీజముల్ వ్రాఁకియుం
జెదరం బాఱియు నీరు సొచ్చియును ని శ్చేష్టం బదద్వంద్వముల్
గుదివడ్డం బెగ డొందియున్ భరితసం క్షోభాత్ము లై రత్తఱిన్. 27
ఉ. సూతులు భీతు లై ద్రుపద సూతిసమేతము గాఁగ నగ్రజ
ప్రేతము వైచి వీటిదెసఁ బెల్లుగఁ బాఱఁ దొడంగినన్ వడిన్
వాతసుతుండు ముట్టికొని వారి బడల్పడ వ్రేసి యందఱం
జేతులతీఁట వో నుఱుము సేసె విశృంఖలవిక్రమంబునన్. 28
వ. ఇవ్విధంబున నూటయేవు రుపకీచకులను సమయించి శమితక్రోధుం డై వచ్చి
పాంచాలీబంధమోక్షంబుగావించి యింక నిశ్చింతంబున సుదేష్ణమందిరంబునకుం జను
మని యవ్వెలంది వీడుకొలిపి తానును వేఱొక్కమార్గంబున మహానస గృహంబున
కరుదెంచెం దత్సమయంబున విరాటుండు గీచకానుజులు గంధర్వులచేత నిరవశేషంబుగా
మృతిం బొంది రని విని చకితచేతస్కుం డగుచు సహోదరమరణశో కాయత్తచిత్త యయిన
జీవితేశ్వరి నుచితాలాపంబుల ననునయించి యి ట్లనియె. 29
ఆ. చంద్రవదన యింక సైరంధ్రి నిచ్చోటు, వాప వలయు నేమి భంగి నైనఁ
గాన నాదుపలుకు గాఁ జెప్పు వెడలుట, కనుగుణముగ నమ్మృ గాక్షితోడ. 30
ఆ. పురుషు లాలతాంగి పొరువునఁ బోయినఁ, జేటు వచ్చుఁ గాన చెప్ప నేను
వెఱతు నాఁడువారు వెరవుతో మృదువచో,రచనఁజెప్పుటరయ నుచితవృత్తి. 31
ఉ. ఆకమలాక్షిరూపమహి మాతిశయంబు మనోహరంబు భో
గైకపరాయణుల్ పురుషు లంగజుఁ డప్రతికారచేష్టిత
స్వీకృతలోకుఁ డ ట్లగుటఁ జేటు పురంబునవారి కెప్పుడుం
గా కెటు లుండు నిట్టియవ గాఢపుఁబొత్తు మనంగ వచ్చునే. 32
క. అని నిశ్చయించి పలికిన, విని కేకయరాజపుత్త్రి విభుతలఁపు మనం
బునకుఁ బ్రియం బగుటయుఁ గై,కొని యాపని యట్లచేఁత కుం బూనెఁ దగన్. 33
క. అంతం గుంతీనందన,కాంతాచింతామహాంధ కారముతో న
త్యంతంబు మచ్చరించెనొ, సంతమసం బనఁ బ్రభాత సమయం బయ్యెన్. 34
వ. పదంపడి పద్మినీప్రమోదసంపత్కరుం డగు నరుణకిరణుం డుదయించె నటమున్న
పాంచాలి సచేలస్నానంబు సేసి రాగాదివికారనిరాసంబునం బ్రసన్న మయిన
బుద్ధియుంబోలె సింహబలప్రభృతికీచకవిధ్వంసనంబునం దెలి వొంది మందయానంబునం
బురంబు సొచ్చి రాజవీథి నరుగుదెంచునప్పుడు. 35
సీ. మనకీచకుల కెల్ల మారి యై పుట్టిన, సుదతి వోయెడు నని చూచువారు
నద్దిరా నీకుఁ గ్రొ వ్వఱుగ దేఁ జూతుగాఁ, కని తల సూపక యడఁగువారు
నలవోక గనుఁగొని యంతరంగము బిట్టు, బెదర మాఱుమొగంబు వెట్టువారు
నెదురుగా వచ్చిన నెంతయేనియు దవ్వు,గలుగ వేఱొక త్రోవఁ దొలఁగువారు
తే. ముట్టఁబడి మేనఁగంపంబు పుట్ట నొదిగి,యుండువారుఁ గరంబున నుదర మప్ప
ళించి యమ్మరొ రక్కెస యంచు నుల్ల,ములుకువారు నై పురజనం బులు దలంకి. 36
చ. పులిఁ గనుఁగొన్న లేడులును బోలె విభీతిఁ గలంగఁ బాఱ న
న్నెలఁతుక యంతరంగమున నిండినహాస్యరసంబు మోముపై
వెలివిరియంగ నీక చని వేచి మహానసశాలవాకిటన్
నిలిచినభీమసేనుఁ గని నెయ్య మెదం జిగురొత్తు చుండఁగన్. 37
క. తనయంతన యటు పలుకుచుఁ, జనువిధమున నతనిదిక్కు చక్కనిచూడ్కిం
గనుఁగొనక ద్రుపదనృపనం,దన యి ట్లను నిజకృతార్థ తం దెలుపుటకున్. 38
తే. కీచకుల దెసఁ బుట్టిన కిల్బిషంబు, పాచి నన్ను రక్షించిన పరమధర్మ
రతికి గంధర్వపతికి ని రంతరంబు, భక్తియుక్తిమైఁ బ్రణమిల్లి బ్రదుకుదాన.
39
వ. అనిన విని యనిలనందనుండు నిగూఢవచనచాతుర్యధుర్యుం డై యిట్లనియె. 40
చ. అతివ యపాయముం బొరయు నప్పుడు గావక తక్కెనేని యా
పతి పతియే తలంప మగ పాడియె లోకముపాడియే భవ
త్పతు లిటు లాచరించుట గ దా భవదీయమనోనువర్తన
స్థితి కుచితంబు వారల ను తింపఁగ నేల నిసర్గవృత్తులన్. 41
ద్రౌపది యర్జునునితో సల్లాపంబు సేయుట.
తే. ఇట్లు దమ్ము నిరూపింప నితరజనము,లకు నశక్యంబు గాఁగ న ల్లాపరసము
ననుభవించుచు నల్లన ల్లన లతాంగి, యరిగె నర్తనమండపో పాంతమునకు. 42
వ. చని విరాటకన్యకలయాటఁ జూచుచందంబున నందుఁ బురందరనందనుం గను గొను
నప్పాంచాలి నాలోకించి యతండును దారును దదభిముఖంబుగా వచ్చి యక్కన్నియ లి
ట్లనిరి. 43
ఉ. కీచకకోటిచేత నొక కీడును బొందక వచ్చితమ్మ ని
న్వేచినదు ర్మదుండు జము నిం గొలువం జనెనమ్మ యంతఁ బో
కేచినసూతు లీయొడలి కింతయపాయ మొనర్తురమ్మ వే
కాచి విరోధులం దునుమఁ గా నిటు ముట్టుదురమ్మ నీపతుల్. 44
వ. అని తాము మున్ను విన్నకీచకవృత్తాంతంబున కనుగుణంబుగా నుపచారంబులు
వలుకు చుండ నాబృహన్నల సైరంధ్రి కి ట్లనియె. 45
క. ఆపాపాత్ములనీచ, వ్యాపారక్రమము వార లందఱు మృత్యు
ప్రాపితు లైనతెఱంగును, నీపలుకుల నెఱుఁగ వలయు నెలఁతుక చెపుమా. 46
వ. అనిన విని సైరంధ్రి సాభిప్రాయంబుగా బృహన్నల కి ట్లనియె. 47
తే. కన్నియల కాట గఱపుచు నున్ననీకు, నకట సైరంధ్రి యిప్పుడే మయ్యెనేని
ఖేద మెద నించుకయు లేమిఁ గాదె సస్మి, తాననంబుతో న న్నిటు లడుగుటెల్ల.
48
వ. అనిన బృహన్నల యి ట్లనియె. 49
క. నీ వలుగులపడుటకు దుః, ఖావేశము వొందనే ని రర్థక మగుని
య్యేవపుఁబుట్టువు వుట్టిన, నావగ పెవ్వరికి నెక్కు నళినదళాక్షీ. 50
క. నీతోడిపరిచయము లే, దే తలపోయఁగ ననింద్య వెందును నీ వి
ట్లాతుర వగుటకె నామది, నేతాపము లేదు నైజ మెఱుఁగవు గంటే. 51
వ. అని తాను నిజసహోదరులయట్లపోలె వేషాంతరంబు దాల్చినయంతియ కాక యూర్వశి
యిచ్చినశాపం బనుభవించుటకు శరీరాంతరపరిగ్రహంబు సేయుటంజేసి రిపుమర్దనంబు
తనకు వెరవు గాకునికి గుప్తసాభిజ్ఞానంబుగాఁ దెలిపిన బలసూదన సూనుపలుకులు
విని పాంచాలి యంత స్స్మితకమనీయకపోల యగుచు నిట్లనియె. 52
ఆ. అట్ల కాక యింత యన నేల నీమది, తెఱఁగు గొంత యేను నెఱుఁగ కున్న
దానఁ గాను నగరఁ దగవుమైనీవు వ, ర్తించుటయ కరంబు ప్రియము నాకు. 53
వ. అనుచుం గన్యకాపరివృత యై యరిగి యంతఃపురంబు సొచ్చి సహోదరమరణ శోకాతుర
యగుకైకేయికడకుం జనునప్పుడు. 54
సీ. ముదమున నెలమిసొం పొదవి నెమ్మొగమునఁ, దోఁపంగ వచ్చినఁ ద్రోచిత్రోచి
లలి నుల్లసిల్లుచు లలితలోచనదీపు, లడర నుంకించిన నాఁగి యాఁగి
సంతసంబునబాలి శము లగుచెయ్వులు, దొడరఁజూచినఁ జేయ కుడిగి యుడిగి
మనమున నుబ్బుమై మాట నాలుకకు రాఁ, గడఁగిన నాడక కడపి కడపి
తే. ధీర యై యిట్లు సమ్మద పూరమునకు, గఱువతన మనుబలితంపుఁ గట్ట వెట్టి
వెలఁది యెఱుఁగనియదివోలె వికృతిలేక, యల్ల నెప్పటియట్టుల యరుగుటయును 55
క. భయశోకంబులు దనదుహృ,దయమునఁ బిరిగొన విరాట ధరణీనాథ
ప్రియ సంభావన సేసె వి,నయపూర్వము గాఁగ ద్రుపద నందనకుఁ దగన్. 56
వ. ఇట్లు సంభావించియత్తరుణిం దనపరిసరంబున నునిచికొని తదీయ వదనం
బవలోకించి. 57
తే. నీవు చక్కనిదానవు నెలఁత ధైర్య
రహితచిత్తులు మగవారు రాజు దీనిఁ
దలఁచి భయ మంది నిన్ను నీ వలచునెడకు
నరుగునట్లుగఁ బ్రార్థించి యనుపు మనియె. 58
వ. అని తనమనంబునం గదిరినయనుజవియోగతాపం బుత్కటం బగుటయు వెండియు ని
ట్లనియె. 59
క. బిరుదు గలమగలు గల రని, తరమిడి చంపింపఁ జూచె దవు జనములు నీ
పొరువునఁ బోవెఱతురు మా,పురమును రాష్ట్రంబు వెడలి పొ మ్మెందైనన్. 60
వ. అనిన విని విరాటవల్లభకు సైరంథ్రి యి ట్లనియె. 61
ఉ. ముందటియట్ల యింకఁ బదు మూఁడుదినంబుల మాత్రకున్ భవ
న్మందిరవాస మియ్యకొని నం గడతేఱు మదీయవాంఛ యం
తం దగఁ దోఁచి మత్పతు లు దాత్తమతిన్ భవదీయవాంఛితం
బుం దలకొల్పఁ జాలుదు ర పూర్వమనః ప్రమదంబు సేకుఱున్. 62
క. కృత మెఱుఁగుదు రుపకార,వ్రతమున వర్తింతు రెపుడు వదలరు కరుణా
న్వితు లీనరపతికి శుభ,ప్రతిపాదకు లగుదు రేమి భంగుల నైనన్. 63
వ. కావున. 64
క. సైరంధ్రి యిట్టు లనుటకుఁ, గారణము దలంప నేమి గా నోపునొ యం
చారసి బహుప్రకారవి,చారములకుఁ జొచ్చు టుడుగు సరసిజవదనా. 65
క. ఇది యేమి యైన నే మగు, మది నా కిం తేల యనుచు మన్నన యెల్లం
దుదిఁ జెఱుపక ప్రార్థన సే,యుదుగా కని నిశ్చయించు టుచితము నీకున్. 66
చ. అనిన సుదేష్ణ యి ట్లనియె నం తవునంతకు మద్గృహంబునం
దునికికి సమ్మతించితి ని జోచితవృత్తిఁ జరింపు నాదునం
దనుల మదీయవల్లభు ను దాత్తమతిం బరికించికొమ్ము నీ
మనమున కెట్టు లూఱట స మస్తము నట్టుల చేసెదం దగన్. 67
క. అని యూఱడిల్లఁ బలికిన, విని తొల్లిటియట్ల యుచిత వృత్తి ద్రుపదనం
దన యుండె నట్టియెడని, ట్లని మ్రోసిరి జనులు పురము నందును భూమిన్. 68
చ. విరటుమఱంది కీచకుఁడు విక్రమదుర్దముఁ డన్యసైన్యభీ
కరమహనీయమూర్తి బల గర్వసముద్ధతచిత్తుఁ డెందు నె
వ్వరు సరిలేరు వీని కన వాలినదండిమగండు సూడ న
చ్చెరు వగుచావు సచ్చె నటు సేసినవారటె యెట్టివీరులో. 69
తే. సింహబలుఁడు గంధర్వుల చేత నొక్క, సతికిగాఁ నిట్లు ఘోరంపుఁజావు సచ్చె
నకట రిత్తకు రిత్త మ త్స్యావనీశు,లావు గోల్పోయె సూతకు లంబు వొలిసె. 70
వ. ఇవ్విధంబునం బ్రవర్తిల్లుజనవాదంబు గ్రమక్రమంబున సమస్తదేశంబుల నెరసి
చెల్లచుండె నట్టియెడ. 71
దుర్యోధనునివేగులవారు పాండవుల వెదకి కానక వచ్చుట.
ఉ. పాతకి యై సుయోధనుఁడు పాండుతనూజులు సల్పుచున్న య
జ్ఞాత విధివ్రతంబు గలు షంబుగఁ జేయఁ దలంచి పంచినన్,
భూతల మెల్లఁ జూచి మును వోయెడునప్పుడు సెప్పుకొన్నసం
కేతవుఁజోటఁ గూడఁబడి ఖేదముఁ బొందుచుఁ జారు లందఱున్. 72
వ. మగిడి వచ్చి హస్తిపురంబు సొత్తెంచి. 73
సీ. వరుస నేనుంగులు గురిసినదానధా, రావలి దగుకల యంపి గాఁగ
రాజులసందడి రాసినతొడవులు, మురిసి రాలినపొడి మ్రుగ్గు గాఁగఁ
గాంతలసంకుల గతిఁ ద్రెస్సి తొరఁగిన, హారముల్ పుష్పోప హారములుగ
నే మేమ యని యోలి నెత్తినపరదేశి, దొరలపావడములు తోరణముగ
తే. సహజమైనయలంకార మహిమ నతిశ,యిల్లి మహనీయవైభవ మెసక మెసఁగ
వఱలునరపతిమందిర ద్వారభూమి, సేర నరిగి యావేగుల వారు ప్రీతి. 74
వ. సముచితంబుగాఁ బ్రవేశించి. 75
తే. ద్రోణగాంగేయభానుమ త్సూనుకృపసు,శర్మదుశ్శాసనులు సర్వ సైన్యపతులు
నార్యజనములుఁ గొలువమ హ్హారకాంచ, నోన్నతాసనమునఁ గొలు వున్నవాని. 76
స్రగ్ధర. మౌళిస్రక్సంగరంగ న్మధుకరపటలీ మానసాకృష్టివిద్యా
శాలిస్ఫారాబ్జ రేఖాం జలిపుటఘటనా చారుఫాలస్థలక్ష్మా
పాలశ్రేణీవిశాలాం బకకుముదవనీ బాంధవాయత్తచంద్ర
శ్రీలీలాగాఢకాంతి స్మితవదనరుచి స్ఫీతునాగేంద్రకేతున్. 77
వ. కని జయజయశబ్దపూర్వకంబుగా సాష్టంగదండప్రణామంబు సేసి. 78
క. మొగిచినచేతులు ముందల నిగిడించి నితాంతవినయ నిరతిం జారుల్
దగ విన్నవించి రి ట్లని, జగతీశ్వరునకు నిజప్ర చారం బెల్లన్. 79
క. దేవరయానతిఁ బాండవు, లేవురు ద్రౌపదియు నున్న యెడ యే మరయం
గా వెడలి వారు సనినమ,హా విపినంబులకుఁ దొలుత నరిగితిమి వెసన్. 80
వ. అందు. 81
ఆ. పరఁగుపొదరు పొదరు పల్లంబు పల్లంబు, మ్రాను మ్రాను దుర్గ మంపుఁ
జోటు
దుర్గమంపుఁజోటు దొన దొన గుహ గుహ, యాది గాఁగ నెందు నరసి యరసి 82
వ. ఒక్కయెడ నరదంబు లరిగినచొప్పు గాంచి దానివెంబడిం జని చని. 83
క. కేవలసూతులతోడన, పోవుట గని వారిఁ జేరఁ బోవక యది యిం
కేవంకఁ బోవునొకొ యను, భావనఁ బోయితిమి దాని పజ్జన యేమున్. 84
వ. అదియును ద్వారకానగరంబున కరిగిన. 85
క. అందుల నుండుదు రనునా,నం దెల్లము గాఁగఁ బెక్కు చందంబుల ము
ట్టం దిరిగి తడవి కుంతీ,నందనులం గాన లేక నానాభంగిన్. 86
వ. విచ్చి పోయి సమస్తదేశంబులుం గలయం గ్రుమ్మరి కొండొకయు నుపేక్ష లేక
పరువుతోడిద కాఁ బరికించుచు బయలను నాలస్యంబు దక్కి యోలంబునట్ల శోధించుచుఁ
గీ డయిన నుదాసీనత యుడిగి మేలుచందంబున భావించుచు వివిధప్రకారంబు
లయినబహుప్రదేశంబులు రోసి కౌంతేయులం గానక సంకేతస్థలంబునం గూడికొని
మావర్తించిన తెఱంగు దేవరకు నెఱింగించి యట దివ్యచిత్తంబున నవధరించినభంగి
సేయువారమై చనుదెంచితిమి మాకుం జూడఁ బాండవులు పొడవడంగి లేకపోయిరి గాని
యీలోకంబున నునికి గలిగిన నగపడ కుండ నేర రిది యిక్కార్యంబునున్న రూపు
మఱియొక్క విశేషంబునం బ్రియం బంది వచ్చితిమి చిత్తగింపుము. 87
సీ. మత్స్యదేశాధీశు మఱఁదిఁ గీచకునిఁ బు,ణ్యోజ్వ్జలాకృతి యగు నొక్క వనిత
కతమున నడురేయి గంధర్వు లతిరహ,స్యప్రకారంబునఁ జంపి రదియు
నక్కజం బాయుధ వ్యవహార మేమియు, లేదు శిరంబు గా ల్గేలు డొక్క
లోనికిఁ జొరఁ ద్రోచి పీనుంగుముద్దగాఁ, జేసి వైచిరి దుష్ట చిత్తు లైన
తే. యతనితమ్ముల నొక్కరి నైనఁ దప్పి, పోవ నీక యారాత్రియ పొదివి చిత్ర
నిహతిఁ దెగఁ జూచి యనిరూప ణీయదుర్ని, వారవృత్తిమై నరిగిరి కౌరవేంద్ర.
88
వ. విరాటుండు పగతుండు గావునఁ దదీయవ్యసనం బెఱింగింప వలయు నని
విన్నవించితి మది య ట్లుండెఁ బాండవుల నన్వేషించుపని యిటమీఁదం జిత్తగించు
తెఱం గాన తిచ్చునది యనిన విని యట్ల చేయుదముగాక యని వారలఁ బోవం బనిచి
కొంతసేపు చింతాక్రాంతుం డై యమ్మహీకాంతుండు మంత్రులం జూచి యి ట్లనియె. 89
తే. సమయసముచితకృత్యంబు చక్కఁజేసి
పాండవులు రాజ్యమున కాస పడక మున్న
యరసి యెఱిఁగి యరణ్యంబు నందుఁ దొంటి
యట్ల యిడుమలఁ గుడుపఁబో నడువవలయు. 90
క. ఎఱుఁగుట దుర్ఘట మెవ్విధి, నెఱుఁగంగా వచ్చు మీర లెల్లను మీమీ
యెఱిఁగినచందంబున నా, కెఱిఁగింపుఁడు వారి వెదకి యెఱుఁగు తెఱంగుల్. 91
వ. అనిన రాధేయుం డి ట్లనియె. 92
ఆ. వివిధదుర్నిరూప వేషముల్ గైకొని, నిఖిలదిశలయందు నిపుణవృత్తి
నెఱుఁగునట్లుగా న నేకులఁ బుచ్చిన, నెల్లి నేఁటిలోన నెఱుఁగఁబడరె. 93
క. అనుపలుకులు విని దుశ్శా,సనుఁ డేమియు సరకుగొనక సమద విలాసా
ననుఁ డై నిజాగ్రజన్మునిఁ, గనుఁగొని యి ట్లనియె గాఢ గర్వస్ఫూర్తిన్. 94
చ. వలవదు రోయఁ బాండవుల వా రొక యూఱట లేని త్రిమ్మటన్
బల మఱి వన్యసత్వ్తముల పాల్పడి చచ్చినచోటఁ బూరియు
న్మొలవదె యింత కిం కిట మ నోముద మస్ఖలితంబు గాఁగ వి
చ్చలవిడి రాజ్యలక్ష్మిఁ దగు చందమునం గొనియాడు మున్నతిన్. 95
వ. అనిన విని దరహసితవదనుం డగుచుఁ గుంభసంభవుం డి ట్లనియె. 96
ఉ. క్షాత్త్ర సమగ్రు లార్యనుత గౌరవదీప్తులు వర్ణనీయసౌ
భ్రాత్రు లుదాత్తదైవబల భవ్యులు దివ్యసమాను లాపృథా
పుత్త్రులు వారి నాపదలు వొందునె యోపిన నింక నైన నీ
ధాత్రిఁ గడంగి యారయువి ధంబులు సెప్పుఁడు నేర్పు లేర్పడన్. 97
భీష్ముఁడు దుర్యోధనునితో ధర్మరాజుసుగుణంబులఁ జెప్పుట.
వ. అనిన నాతనిమాట లాదరించి భీష్మం డి ట్లనియె. 98
ఉ. నల్లవొ నిక్క మాడె నృప నందనుముందట ద్రోణుఁ డొక్కఁడుం
దెల్లము వారు బాహుబల ధీబలదైవబలంబు లొప్ప వ
ర్తిల్లుదు రమ్మహాత్ముల క రిష్టము లేమిట నెందు నేల పా
టిల్లెడు వారిఁ గాన్పను గ డింది తదీయమహానుభావతన్. 99
క. వారలును వీరలును నా, కారయఁగా నొక్కరూప యైనను గార్యం
బీ రెఱిఁగింప వలయు నని, కౌరవపతి నన్ను నడిగెఁ గాన నితనికిన్. 100
క. కలరూ పెఱిఁగింపంగా, వలయుం జెప్పెద మదీయ వచనములు హితం
బులు గాఁగ నిశ్చయస్థితిఁ, దలఁచి యనుష్ఠింప బుద్ధి దలకొనునేనిన్. 101
సీ. బ్రాహ్మణభక్తియుఁ బరహితశక్తియు, నిర్మలమతియును నీతిరతియు
సత్యభాషణమును సాధుపోషణమును, జిరవితరణమును సేవ్యగుణము
సన్మార్గరక్షయు నున్మత్తశిక్షయు, నంచితోదయము గృ పాతిశయము
బంధుసంప్రీతియు భవ్యవిభూతియు, శాస్త్రోపగమము న స్ఖలితదమము
తే. సజ్జనస్తవనీయసౌ జన్యములును, ధర్మసంచితబహుధన ధాన్యములును
గలుగు నక్షీణపుణ్యదో హలుఁడు ధర్మ,సూనుఁ డున్న దేశంబున మానవులకు. 102
క. మఱియును నొక్కవిశేషం, బెఱిఁగించెద నతనియున్న యెడ గోధనముల్
మెఱుఁ గెక్కి పాఁడి నేమిం, గొఱతవడక యుండఁ జేఁపి కురియుచునుండున్. 103
వ. కావున నిట్టిదేశం బిప్పు డెయ్యది యగు నందుఁ గుంతీతనయుల నరయం బనుప
వలయు ననినఁ గృపాచార్యుం డి ట్లనియె. 104
క. అరయఁగ నయ్యెడు తెఱఁగుల, నరయుట కార్యంబు వారి నాలస్యము లే
కరయునది పెక్కుభంగుల, నరసినఁ దోఁచెదరుగాక యది య ట్లుండెన్. 105
ఉ. వారలు పూనినట్ల వన వాసము సల్పిరి వీరు వేచి త
మ్మారయఁగా బయల్పడని యట్లుగ నుండెడువత్సరంబునుం
జేరువచేరువల్ గడచెఁ జిత్తములుం గలుషంబు లమ్మహా
వీరుల కీనృపాలునెడ వీరికి నూరక యున్కి గర్జమే. 106
క. అలు చైనను బగతునిదెస, దలఁపు గలుగ వలయు ననిన దర్పోజ్వ్జలదో
ర్బలు లగుకౌంతేయుల మన, మెలమికలిమి నచ్చి యిట్టు లేమఱ నగునే. 107
చ. మనబల మెంత యంతయు స మగ్రసముద్యమదుర్దమంబుగా
మునుమును గూర్చి తోడుపడు మూఁకలకుం దగుమైఁ గ్రమక్రమం
బున నెఱిఁగించి రాఁ బనిచి భూరిసముజ్వ్జలసైన్యజృంభణం
బున నెర వొంది యున్కి కురు భూపతి కిప్పటి కార్య మారయన్. 108
ఆ. పాండురాజసుతులు బాసమై నడవడి, గడచి కయ్యమునకుఁ గాలుద్రవ్వ
కున్నయట్టు లైన నిన్నరనాథుతో, సంధి సేయు టొప్పు సముచితముగ. 109
క. ఏచి చలంబున నొంటికిఁ, జూచిన నప్పటికి మనకుఁ జూడం గార్యం
బేచందంబునఁ దెఱఁ గగు, నాచాలుట కోర్వవలయు నది యట్లుండెన్. 110
క. వారలు లేరటె పో పెఱ, వారలఁ దగుభంగి మనకు వశ్యులఁ జేయన్
భూరిబలయుతుల మగుటయ, కారణ మను టనుమతంబు గాదే మనకున్. 111
తే. ఇవ్విధంబునం దమతమ యెఱుఁగు తెఱఁగు
లందఱును జెప్ప విని కురు నందనుండు
దగ విచారించి కార్యంబు తెగువ గాంచి
యెలమి వారలఁ గనుఁగొని యిట్టు లనియె. 112
ఆ. సింహబలుఁడు భీమ సేనుండు శల్యుండు, హలధరుఁడు సమాన బలమువార
లొండొరులను గెలుచు నుత్సాహమునుగల, రుద్ధతులునుబాహు యుద్ధపరులు. 113
క. ఈనలువురభుజశక్తుల,తో నెనయఁగఁ జాలునట్టి దోర్బల మెందుం
గానము గావున వీరల, లోనన యెండొరుల కని గె లుపు సమకూరున్. 114
ఉ. తక్కినవార లాతనికి దవ్వులచోటులవారు వాయుజుం
డొక్కఁడ యింక సింహబలు నుద్ధతి మాన్చిన మాన్చువాఁ డతం
డక్కడ నిల్చెఁ గావలయు నాసతి ద్రౌపది గాఁగ నోపు వే
ఱొక్కరుఁ డాజిఁ గీచకుల నోర్వఁగఁ జాలమి మీ రెఱుంగరే. 115
క. గంధర్వు లనునెపంబున, నంధతమసగూఢవృత్తి ననిలసుతుఁడు గ
ర్వాంధమతి యైనసూతు స, బాంధవముగఁ జంపెఁగాక పరులకు వశమే. 116
వ. పితామహుం డుపదేశించినలక్షణంబు లద్దేశంబునం గలిగియుండు నని విందుము
పాండవులు ప్రచ్ఛన్న వేషంబున విరటుప్రోల వసియించినవారు గావలయు నతండును
బ్రతిభటుం డయి భంగించుచుండుం గావున నతనిపయి నెత్తిపోయి తదీయ గోధనంబుల
గ్రహించిన ధర్మతనయుండును దమ్ములు నడ్డపడం బఱతెంతు రయ్యవసరంబున మనము
సమయభంగంబు సెప్పి వారలం గ్రమ్మఱం బండ్రెండు వత్సరంబులు వనవాసంబు సలుపం
బుత్త మట్లైన నప్రతిహతంబుగాఁ జతురంత భూచక్రంబాక్రమించి
కీర్తనీయులమైవర్తిల్లుదుము కుంతీనందను లందు లేకతక్కిన
మత్స్యపతిసమస్తవస్తువులును జూఱకొంద మదియును లాభంబ యెల్లభంగుల నిప్పటి
కిదియె కార్యంబు మీకు నందఱకుం జూడఁబోలునేని దీని కనురూపం బగునుద్యోగంబు
సేయుం డనినఁ ద్రిగర్తాధీశ్వరుం డగుసుశర్మ దొలుతఁ గర్ణ దుశ్శాసనులతోఁ
గొండొక ప్రసంగించి వారలయనుమతి నవనీపతితో ని ట్లనియె. 117
క. కేకయ సాల్వులు దోడుగ, నాకీచకుఁ డాజి నన్ను నపజితుఁ జేసెం
జా కుండ మున్న యొక పరి, నా కాతనితోడ భండ నము లేదయ్యెన్. 118
క. భంగముతోడ నున్నననుఁ బంపు విరాటునిమీఁద భూమికిం
జెంగట నుండు నా దయిన జీతపుటూళ్లులు సంతతంబు వా
నిం గడు గాసిసేయు నత నిం జెఱుపం దఱి యయ్యె ముట్టి స
ప్తాంగముఁ జూఱదెచ్చెద న హంకృతి యెల్ల నడంచి వచ్చెదన్. 119
ఆ. ఉద్దవిడిన పసుల నూచముట్టుగఁ దెత్తు, నతఁడు వెనుక వచ్చి యడ్డపడిన
చోటఁ బాండురాజ సూనుల నరయుదు, నెల్లభంగి దీని కేన తగుదు. 120
వ. అనవుడు. 121
క. బరవసముమైఁ ద్రగర్తే, శ్వరుఁ డి ట్లను టుచిత మింక జననాయకుఁ డె
ప్పరుసున నానతియిచ్చెను, దొర లే మని రట్ల చేయఁ దుదిఁ గార్యమగున్. 122
చ. అనునినసూనుమాటవిని యందఱఁ గన్గొని పెద్ద లెల్ల ని
న్ననుమతి సేయ సైన్యముల నన్నిటిఁ బన్నఁగఁ బంపు రెండు మే
ల నడత మీత్రిగర్తుల బ లంబుల ముందటఁ బంచి వానిపో
యినమఱునాఁడు పోద మని యెం గురునాథుఁడు దుస్సనేముతోన్. 123
చ. అనుటయు ఫాలభాగకలి తాంజలి యై యతఁ డట్ల చేయువాఁ
డ ననిన మేదినీశుఁడు దృ ఢం బగునిశ్చయ మెల్లవారుఁ గై
కొనుటకుఁ గార్యబోధమున కుం దగఁ జుట్టల నున్నవారలం
గనుఁగొని యాదరాధికస గౌరవ భావనతోడ ని ట్లనున్. 124
ఉ. మున్ను సుశర్మ దాను బల ముం జని గోవులఁ బట్టువట్టినన్
వెన్నడి వచ్చు మత్స్యపృథి వీపతి సేనల నెల్ల గొంచు శౌ
ర్యోన్నతి సూపువాఁ డయి స ముద్ధతిమై నిట వేఱ కౌరవుల్
గొన్నిటిఁ బట్టఁ గయ్యమున కుం బఱతెంతురు పాండునందనుల్. 125
ఉ. కందువ సెప్పి యొక్కెడఁ ద్ర గర్తులు దాడికిఁ గూడువారు మీ
రందఱు వేఱ యొక్కయెడ నాజికి సేనలఁ గూర్పుఁ డెల్లవాఁ
డుం దనవారిఁ దోకొని క డున్ రభసంబునఁ గూడి వార్తకున్
ముందఱఁ బోయి గోధనము ముట్టుకొనన్ వలయున్ మహోగ్రతన్. 126
వ. అని చెప్పి వెండియు సుశర్మం జూపి, 127
క. బహుళాష్టమి నీతఁడు స,న్నహనముతోఁ బసులఁ బట్టు నవమిని మనగో
గ్రహణ మని నిశ్చయించిన, నహికేతనుపలుకులకు మ హాహ్లాదమునన్. 128
వ. సమస్తపరిజనంబులును సముద్యుక్తులై రట్టిసమయంబున 129
ఆ. పాండురాజసుతులుఁ బాంచాలియును దమ్ము, నొరులెఱుంగకుండఁ దిరుగవలయు
దుష్కరంపుటేఁడు దుది సేరఁ బాఱె నె, వ్వరును దీనిఁ దలఁప వలను లేర. 130
సుశర్మ దక్షిణగోగ్రహణంబుసేయుట.
వ. సుశర్మయు నేలినవానిపనిఁ బూని జోడుపక్కెర కైదువు బిరుదు రవణంబు మొద
లైన సవరణంబులం జూడ నక్కజంబుగాఁ గూడి పరదేశం బాపోశనంబు గొనం దమకించు
తనబలంబుగజిబిజి యుడిపికొని గోగణంబులయగపా టూహించి జతనంబుతో నడచుచండియు
వెసగుందక వేగిరంపుఁ బయనంబు లయ్యును బ్రజల నోలాకుపడనీక యెత్తెడుచోట్లను
విడుదలలయందును లోనుగా నిస్సాణాదులైన యుద్భటచిహ్నంబులు ప్రకటింపక
దాడిమెయిం జని వేగులవారివలన విరాటు తొఱ్ఱు లున్నయెడ యెఱింగి కదుపులం
గార్చిచ్చుచందంబునం బొదివి వెలిచిన. 131
శా. కూడం బాఱి సముద్ధతిం గఁడగి త గ్గోపాలకుల్ మూఁక ల
ల్లాడం దాఁకి నిశాతసాయకపటు వ్యాపారఘోరంబుగా
నీడం బోక పెనంగినం గని త్రిగ ర్తేశుండు చే వీఁచుడుం
గ్రీడాఫూతనిరూఢి నాశ్వికులు వా రిం దున్మి తూఁటాడినన్. 132
వ. వారలలోన 133
చ. అసదుగఁ దాఁకి మేనఁ దఱ చై పొరి నెత్తురు గ్రమ్ముపోటులన్
వస మఱి తూలు చుండియును వారనిభీతిఁ బదంబులం గడున్
వెస కలిమిం బురంబునకు వేగమె కొందఱు వాఱి మత్స్యనా
థుసభకు నేఁగి దీనదశ తోఁ బ్రణమిల్లుచు నార్తమూర్తులై. 134
క. కారణ మెయ్యది యగునొకొ, వీరలదురవస్థ కనుచు వెఱఁ గందెడునా
భూరమణుఁడు సభయును విన, నీరెలుఁగు దలంకఁ బల్కి రి ట్లని గోపుల్. 135
చ. హయరథదంతిసంతతి ని రంతరదుర్దమలీలఁ బేర్చి నే
ల యవిసి మూఁగిన ట్లగుబ లంబులతోడఁ ద్రిగర్తు లెంతయున్
రయమున గోవులం బొదివి రక్షకు లొక్కట నార్చి తాఁకినన్
భయదమహాస్త్రశస్త్రపటు పాతపరంపరఁ దున్మి యుద్ధతిన్. 136
క. గోవులకు వెనుక యై వెసఁ, బోవుచు నున్నారు గడవఁ బోవక యుండం
బో వలయు నడ్డపడియెడు, దీవస మెదఁ గలిగెనేని దేవర కడఁకన్. 137
వ. అనిన విని విరాటుం డదరిపడి. 138
శా. ఏమీ నిక్కమె ము న్నెఱుంగఁడె త్రగ ర్తేశుండు మద్గోధన
స్తోమంబు గొనిపోవుతెంపునకు ను ద్యోగించెనే మేలు మే
లామైతోడనె పోవుఁగాక యని వీ రాలాపముల్ వల్కి యు
ద్దామక్రోధశిఖాకలాపవికటో ద్యద్భ్రూకుటిస్ఫూర్తియై. 139
విరటుఁడు సుశర్మమీఁద యుద్ధము సేయఁబోవుట.
చ. సచివులఁ జూచి యిప్పుడు వె సన్ మన మెయ్దక తక్కినం బశు
ప్రచయము దప్పి పోవుఁ దుది భంగము సేగియు వచ్చుఁ గాన మీ
రుచితవిధాన సత్వరత నుద్ధతయోధసమగ్రవాహినీ
ప్రచలితభూమిభాగముగఁ బన్నఁగఁ బంపుఁడు దండనాథులన్. 140
వ. అని నియోగించి, 141
శా. యానప్రక్రమసూచకంబు లగుతూ ర్యంబుల్ దిశాపాటన
ధ్వానస్వైరవిహారకల్పితసము ద్రక్షోభముల్ గా ధరి
త్రీనాథుండు రణోచితోద్యమము సం ధిల్లంగ శస్త్రాస్త్రవ
ర్మానీతిక్రమదక్షులం బనిచె న రzౖు్యవారికిన్ గ్రక్కునన్. 142
ఉ. సారథిఁ జూచి నీవు రభ సంబునఁ బూన్పుము ఘోటకంబులం
దేరఁ దదీయవర్మము ల తిస్ఫుట బంధము గాఁగఁ బెట్టు నీ
వీరవచోవిలాసములు విందుము ము న్నిదె వచ్చెఁ గయ్య మే
పారఁగఁ జూపు నీ దగున హంకృతికిం దగుధైర్య మియ్యెడన్. 143
వ. అని పనిచి తానును యోధవిరోచితప్రకారంబున సింగారంబు సత్వరంబుగాఁ
జేసికొని ఖచితకాంచనబిందుసందోహం బగుసన్నాహంబు వెట్టికొని
విరచితాలంకారచక్రంబును బద్ధపరికరకూబరాక్షయుగాద్యవయవంబును
బ్రతికల్పితతురంగంబును సన్నివేశితవివిధాయుధంబును సన్నద్ధసారథికంబును
నైనరథం బెక్కి గోగణహరణప్రదేశంబు పశుపాలకులం దెలియ నడుగుచు వెడలునప్పు
డమ్మత్స్యపతియనుజన్ముండు. 144
శా. లోకస్తుత్యవిభూతి నన్యపృతనా లుం టాకబాహాబల
శ్రీకల్మిన్ రథదంతి ఘోటకభట శ్రేణీసముద్దాంతసే
నా కల్పధ్వజవిభ్రమంబున సుహృ ద్యప్రోద్యముం డై శతా
నీకుం డుద్ధతి నేఁగుదెంచె నఖిలా నీకంబు నుప్పొంగఁగన్. 145
ఉ. ఆతనితమ్ముఁ డైనమది రాశ్వుఁడు కర్ణఝళంఝళాసము
ద్ధూతబలోత్థరేణుపరి ధూసరితాంబర మైనవారణ
వ్రాతము గొల్చి రాఁ గడఁగి వచ్చె సముజ్వ్జలహేమవర్మని
ర్యాతరుచిచ్ఛటాపటల రంజితహేతిమహోగ్రసైన్యుఁ డై. 146
తే. అతనియనుజుండు సూర్యద త్తాహ్వయుండు, సమదసైనికనానాస్త్ర శస్త్రబహుళ
దీప్తిజాలకప్రతిహత దినకరాంశు, రాజి యై చనుదెంచె సం రంభ మెసఁగ. 147
ఉ. తెల్లనిజోడు వెట్టుకొని తీవ్రగతిం జనుదెంచె మత్స్యభూ
వల్లభునగ్రనందనుఁడు వైరిమదాపహవిక్రమప్రకా
రోల్లసితుండు వన్యబల ముద్ధతిఁ గొల్చుమృగేంద్రురేఖ శో
భిల్లుచు నుండు శంఖుఁడు వి భీషణశంఖనినాద మొప్పఁగన్. 148
వ. మఱియు ననేకయోధవీరులు వివిధవాహనారూఢు లై గాఢసన్నాహంబు లగు
నిజవ్యూహంబులతో నేతెంచు చుండిరి విరాటుండు బలంబులం గూర్చుకొను తలంపునం
బురబహిరంగణంబునం గొండొకసేపు నిలిచె నట్టిసమయంబున ధర్మతనయుం
డనిలతనయమాద్రీతనయుల నంతంతం బొడసూపి నిలువుం డని నిపుణంబుగా నియోగించి
తానును మత్స్యమహీవల్లభు నల్లన జేరి యిట్లనియె. 149
చ. ఒక ఋషిచేత నాయుధస ముత్కర మెల్లను సప్రయోగమం
త్రకముగ నభ్యసించి సమ రంబునకుం గొఱయైనవాఁడ గో
ప్రకరములున్ మరల్చుటకు బంధులు నీవును బోవ నాకు నిం
టికడన యున్కి పాడియె ఘ టింపఁగఁ బంపు రథంబు చయ్యనన్. 150
క. అనిన విని యియ్యకొనున, మ్మనుజాధీశ్వరునితోడ మఱియు నతం డి
ట్లనుఁ బవనతనయుఁ గవలం, గొని సమరంబునకుఁ బోవఁ గోరెడుమదితోన్. 151
సీ. మనవలలుండు లా వున బంటుతనమున, జను లెఱుంగఁగ సడి సన్నవాఁడు
మంచిమగండు దా మగ్రంధి యసమసం, గ్రామకేళీగాఢ కౌతుకుండు
వినుము తంత్రీపాలుఁ డును దుర్దమారాతి, మర్దనచాతుర్య మహితభుజుఁడు
మున్నును వీరలు మువ్వురకడఁ కల, కొలఁదు లే నెఱుఁగుదుఁ గొంతకొంత
తే. యెక్కఁదగునట్టియదరంబు లిచ్చి వీరి, ననికిఁ గోకొనిపోక కా ర్యంబు
నాకుఁ
జూడ ననవుడు మేదినీ శుండు హర్ష, నిర్భరాత్మకుఁడై శతా నీకుఁ జూచి. 152
వ. కంకవలలదామగ్రంధితంత్రీపాలురం జూచి యిట్లనియె. 153
మ. రథముల్ మంచివి గాఁగ నాలు గతిశీ ్రఘవ్యాప్తిసత్వ్తంబులం
బ్రథితం బైనతురంగమోత్కరము సం గ్రామ్హారచాపంబు ల
శ్లథవర్మంబులు వీరి కిమ్ము రణలీ లాదక్షతన్‌మన్మనో
రథముం దీర్పఁగ వీర లోపుదురు దో ర్గర్వం బఖర్వంబుగన్. 154
వ. అనిన నతం డట్ల చేయుదు నని వారలం దోడ్కొనిచని సమస్తంబును సన్నద్ధంబు
గావించి యంగరాగమాల్యాభరణంబుల నలంకృతులం జేసినం గైకొని తమతమయంతవట్టునుం
గూడుకొని సూతకృత్యంబులకుం దార చాలి రథంబులు దోలికొని చనుదెంచిరి
తదనంతరంబ. 155
సీ. గంధదంతావళ కర్ణమారుతహతిఁ, గాంతారములు చాఁప కట్టు వడఁగ
రథఘోషమునఁ బ్రతి రవ మిచ్చునద్రులు, భయమున వాపోవు భంగి నుండఁ
దురగఖురోద్ధూత ధూళి ద న్బెరసిన, వననిధి పిండలి వండు గాఁగ
బహుళపదాతిదు ర్భరభార మడరిన, నురగకూర్మంబు లొం డొంటిఁ బొంద
తే. సైన్యముల నడపించె ను త్సాహలీల, యతిశయిల్లంగ సంరంభ మగ్గలింప
బరవసము మిక్కుటంబుగఁ బసులుసన్న, జాడగైకొని యమ్మత్స్య జనవిభుండు. 156
వ. ఇట్లు చని కూడముట్టిన. 157
క. విరటుబలంబు త్రిగర్తే, శ్వరుబలముం జెలఁగ నార్చి వడిఁ దాఁకె భయం
కరనాదమేదురము లగు, శరనిధు లొండొంటిఁ దాఁకు చందం బమరన్. 150
మ. గుణరావంబుఁ గృపాణఘట్టనరవ క్షోభంబునుం గింకిణీ
క్వణన వ్యావృతహేషితస్వనములున్ ఘంటానినాదాత్తపో
షణనానాపటుబృంహితధ్వనియు శ శ్వద్గాఢమై పేర్చినన్
రణనం బించుక దోఁప లేద బహుతూ ర్యశ్రేణి నాసేనలన్. 159
విరాటసుశర్మలసైన్యంబులు సంకులంబుగాఁ బోరుట.
వ. అట్టిసమయంబున. 160
సీ. ఒండొంటితోఁ దాఁకి మండెడునవియును, జిందముల్ పొడిపొడి సేయునవియు
గట్టిమైమఱువులు దట్టముల్ గావించు,నవియును నెఱను నో నాడునవియు
నెట్టుపైఁ బడి మేని నెగయించునవియును, దల నేల డొల్లంగఁ దాఁకునవియు
నిరుమెయిఁ దొలిచి బె ట్టిలఁ దూఱునవియును, నలువుర నేవుర నాటునవియు
తే. నైనశరములు గనుఁగొని యాడి యాడి, నారదుఁడు పిచ్చలింపంగ వీరకేళి
సలిపెనుద్ధతిమై ధను ర్బలములడరి, లావు వెరవును నెఱయఁ జ లంబు మెఱయ. 161
వ. అప్పుడు సుభటులు గడంగి. 162
ఉ. ఏటుల మ్రొగ్గువారిఁ గని యించుక కొంకక యర్ముపెంపునం
బోటులవాతఁ బోవుభట పుంగవులన్ మది మెచ్చుచున్ వడిన్
వ్రేటులఁ గ్రీడ సల్పి పృధి విం బడువీరులఁ ద్రొక్కికొంచు నె
చ్చోటుల నైన నగ్గలికఁ జొత్తురు నెత్తురు వఱ్ఱు సేయుచున్. 163
సీ. ఒక్కఁడు పెక్కండ్ర కెక్కినవిచ్చియుఁ, బొదివి చెఱొకపోటు
వొడుచునెడలుఁ
బలువు రొక్కనిమీఁదఁ బఱపిన సైరించి, నళికి పైఁబెట్టక నిలుచునెడలు
దళము దళంబుతోఁ దాఁకి యగ్గలికమై, నీఁడబోవక వ్రేటు లాడునెడలు
నోహరిసాహరి నుయ్యాలచేరుగా, వెనుకొంచుఁ దెరలుచుఁ బెనఁగునెడలు
ఆ. నైయనేకభంగి నాశ్వికసేనలు, బొమ్మ లాడినట్లు పోరుచుండె
నమరగణము సిద్ధ సమితియు వేడుకఁ, జదల నిలిచి చూచి సంస్తుతింప. 164
వ. ఒక్కయెడ. 165
ఉ. ఒండొరు మీఱుకోర్కిమెయి నొక్కట బాసలవారు సొచ్చినన్
రెం డయి పాయ యిచ్చినయ రిప్రకరంబులు వేఱువేఱ యు
ద్దండభుజాబలం బలరఁ దాఁకిన సంగడిఁ బాఱు చుండఁగా
గం డమరంగ నిల్చి చెలి కాం డ్రయి క్రమ్మఱ వత్తు రిద్దఱున్. 166
సీ. కరశీకరంబులు కరటగళద్దాన,తోయంబులును ధరా ధూళి మ్రింగఁ
బొడవులసడి సన్న యొడళుల దెంచ న,మ్ములపెంపు గగనంబు గొలఁదివెట్ట
బృంహితధ్వనులును బృథులఘంటావలీ,రవములు దిక్కుల నవులఁ ద్రోవ
రోషారుణాక్షుల రుచులును సిందూర, కాంతియు రవిదీప్తిఁ గ్రమ్మఱింప
తే. జోదులొక్కటవాలంప సోనగురియ, రౌద్రరసమాకృతులఁదాల్చి రణ మొనర్చు
కరణి నత్యుగ్రముగఁ గరి ఘటలుగడఁగి, కలను పీనుంగుపెంటగాఁ గలయబెరసె. 167
ఉ. అక్కజ మైనశౌర్యమును నద్భుతసంపద నొందుశక్తులుం
జిక్కని మేనులున్ మొనకుఁ జెల్వగుకైదువులుం దగంగ ను
క్కెక్కినయట్టిమేటిమగ లించుకవారణ లేక ఖేచరు
ల్వెక్కసమంద నొచ్చియుఁ జ లింపక పోరిరి పెక్కుభంగులన్. 168
సీ. నొగ నొగతోఁ దాకిఁ పగులంగ నరదంబుఁ, బఱపి యాతేరిపై కుఱుకువారు
రథ్యముల్ వడ్డ వి రథు లయ్యు నసిముద్గ,రాదుల నడరి పో రాడువారు
సారథి నొచ్చినఁ దేరును గడపుచు, నేయుచుఁ గయ్యంబు సేయువారు
నరదంబుపై వ్రాలి యాలోనఁ దెలిసి త, న్నేసినాతనిఁ బడ నేయువారు
తే. నగుచు రథికనికాయంబు లడరి యప్ర,మత్తనిజచిత్తవృత్తులై మగతనంబు
ఘోరమూర్తులు గైకొని పోరునట్లు, సలిపె సంగ్రామకేళి సం కులము గాఁగ. 169
వ. ఇట్లిరువాఁగును నరవాయి గొనక పెనంగు చుండ. 170
ఉ. భీకరబాణవర్షముల పెల్లున వైరులు పెల్లగిల్ల మౌ
ర్వీకృతగర్జితంబు పృథి వీవియదంతర మెల్ల నిండ ను
గ్రాకృతిఁ గల్పసంక్షయమ హాభ్రముచందము నొందుచున్ శతా
నీకుఁడు దాఁకెఁ గంకటమ ణిద్యుతివిద్యుదుపాంతకాంతియై. 171
తే. అతఁడు నానాప్రకార శ స్త్రాస్త్రనిహతి, నతులవిక్రమవిభవ మ నర్గళముగ
యోధసారథియుగ్యసం యుతము గాఁగ, నూఱురథములు వ్రేల్మిడి నుగ్గుసేసె. 172
మ. మదిరాశ్వుండు గడంగి యన్నకు బలో న్మాదంబు రెట్టింప స
ప్రదరజ్యాలతికాక్రియాసమభిహా ర క్రీడనం బప్పు డొ
ప్పిద మై యోగవియోగసంధులు నిరూ పింపంగ రా కుండఁ గ
ర్ణదళోపాంతము వింత సేయ నడరెన్ రౌద్రంబు శోభిల్లఁగన్. 173
క. అడరి పడి రథచతుశ్శతి, పొడిసేసి పరాక్రమం బ పూర్వం బై యే
ర్పడఁ గరిహయనరనికరము, బడలువడం దఱిమె నలి న భశ్చరు లార్వన్. 174
ఉ. మండలచారి యై రథ మ మానుషవిక్రమలీల నొప్ప ను
ద్దండభుజాబలంబు ప్రథి తంబుగ నత్తఱిఁ దాఁకి సూర్యద
త్తుం డనివార్యశౌర్యగుణ ధుర్యుఁడు వీఁడ యనంగఁ బేర్చి వే
దండఘటావిపాటనవి దగ్ధతఁ బొల్చె రణాంగణంబునన్. 175
ఉ. అప్పుడు శంఖుఁ డెంతయుఁ బ్రి యంబునఁ బెండ్లికిఁ బోవునట్లు మో
మొప్పగఁ నస్త్రశస్త్రముల యుల్లసనంబున శత్రునేత్రముల్
గప్పఁగఁ జీఁకటుల్ రణము ఖంబు సమస్తముఁ దాన యై రథం
బుప్పరవీధిఁ దోలికొని యుగ్రగతిం బఱతెంచి తాఁకినన్. 176
తే. మందరాచలచటులవి మర్దనమున, ఘూర్ణమాన మై గాఢసం క్షోభ మెసఁగఁ
దలఁకుజలనిధి నాఁ ద్రిగ ర్తక్షితీశు, బలము దిరుగుడువడియె సం కులముగాఁగ.
177
వ. అయ్యవసరంబునం దక్కినదొరలును దలపడి యతిభీమంబుగా సంగ్రామంబు సేయం
దొడంగిన. 178
చ. అనుజతనూజమంత్రిసుభ టాప్తజనంబుల పోరు సూచి నె
మ్మనమునఁ బొంగి మై పెనిచి మత్స్యమహీరమణుండు సారథిం
గనుఁగొని యల్ల గట్టిమొనఁ గ్రాలుచు నున్నత్రిగర్తనాథుకే
తనమునచక్కటిన్ మనర థంబు వెసం జననిమ్ము నావుడున్. 179
క. అగ్గలిక నతఁడు హయముల, పగ్గంబులు సడల విడిచి పటురయమున నా
మొగ్గరము దఱియఁ బఱపిన, మ్రగ్గెను రథపంచశతము మత్స్యాధిపుచేన్. 180
మ. అవనీనాయకుఁ జూచి యేచి నలి వీ రావేశదుర్దాంత మై
కవిసెన్ గుంతభుశుండితోమరగదా ఖడ్గాదిశస్త్రాస్త్ర తీ
వ్రవిహారంబు విరోధిదుర్విషహసం రంభంబుగా నొక్కపె
ట్టవడిం దద్బల మెల్ల నారదుఁడు వే డ్కం గుంచె సారింపఁగన్. 181
వ. ఇవ్విధంబున విరాటుండు దానును సేనయుం జేయం గలవారును బరవసంబు సేసి
యొక్కుమ్మడి నడరుటయుం దెరలి మరలిననిజసైన్యంబుదైన్యంబు గలయం గనుంగొని
కోపాటోపంబునం గెంపు గదురులోచనంబులుం బెం పొలయుభుజ శిఖరంబులుం గలిగి
సుశర్మ దానుం దమ్ముండు సంగడంబుగాఁ గోల్తల సేసి రథ సమూహంబుతో
విరాటవ్యూహంబు నెదురుకొని, 182
క. బలవిక్రమములు మెఱయఁగఁ, దలపడి రథదంతిహయప దాతిచయంబుల్
గలను సుడివడఁగ దామర, కొల నేనుఁగు సొచ్చినట్లు గురువుగఁ జొచ్చెన్. 183
ఉ. ఏలినవానిఁ గాంచి మొన లెల్లను నెంతయు దర్ప మెక్కి యా
భీలనిశాతహేతిరుచి భీకరలీల నెదిర్చి మత్స్యభూ
పాలకసైన్యరాజిఁ దల పడ్డ మహోగ్రతఁ బేర్చి యాసమి
త్కేళి వియచ్చరప్రతతి కిన్ వెఱఁ గందఁగఁ జేసె నెంతయున్. 184
తే. కడిమి మెఱయంగఁబోరుత్రి గర్తనాథు, రథముఁగనుఁగొని కడఁగి వి రాటవిభుఁడు
వరవునకు నల్గినట్టుల సరకుగొనక, యతులరభసాతిరేకత నతనిఁదాఁకె. 185
విరాటుఁడు సుశర్మమీదఁ దనరథంబు తోలించి పోరుట.
వ. ఇట్లు దలపడి, 186
మ. పటువేగం బగుశాతభల్లచయసం పాతంబునన్ మింట మి
క్కుట మై మంట ధగద్ధగద్ధగ యనం గోపంబు రూపంబు లై
చటులక్రీడఁ జరించున ట్లిరువురున్ శౌర్యోన్నతిం బోరి రు
త్కటదర్పోద్ధతు లై పరస్పరజయా కాంక్షం బ్రచండంబుగన్. 187
క. తదవసరంబున నొక్కటఁ, బదియమ్ములు దొడి త్రిగర్త పతివక్షంబున్
వదనంబు నేసి విరటుఁడు, మదమునఁ దురగముల నేసె మఱియుఁ బదింటన్. 188
క. ఇంచుకయు నీడఁ బోవక, కాంచనపుంఖప్రకాండ కాంతిస్ఫాయ
త్పంచాశద్బాణంబులు, నించె నతఁడు మత్స్యమేది నీపతిమేనన్. 189
తే. దొరలు దలపడ్డనాహవ దోహలమున, నుభయబలములుఁ దమకించి యోర్వలేక
కలయబెరసి భూరేణువు కతన రాత్రి, గాకమున్న యొండొరువులఁ గానరైరి. 190
క. క్షతములఁ బెల్లు దొరఁగుశో,ణితము రజఃపటల మడఁచి నెఱసిన నరుణ
ద్యుతిఁ దమము వాపువేకువ, గతిఁ దత్సమయం బతిప్ర కాశత నొప్పెన్. 191
ఉ. దానికిఁ జిత్తవృత్తులు ము దంబునఁ బొందఁగ మేను లుబ్బఁగా
సేనలు రెండు నుద్భట వి జృంభణతన్ వివిధాస్త్రఘట్టన
ధ్వానము దిక్కులం బరఁగఁ దాఁకి రణం బొనరించె నత్తఱిన్
భానుఁడు పశ్చిమాద్రిఁ గను పట్టెఁ దలిర్చినమావిమ్రో కనన్. 192
క. సమరంబున భటులు గడు, న్శ్రమ మొందిరి తమము గవిసి నం గాని సము
ద్యమసంరంభ ముడుగ రిది, సమయం బని తొలఁగినట్లు సవితృఁడు గ్రుంకెన్. 193
వ. తదనంతరంబ. 194
క. ముఱిముఱిచీఁకటియప్పుడు, నఱిముఱి భటు లుడుగ కడరి యని సేయంగా
నెఱసి తమ మెల్ల యెడఁ గ్రి,క్కిఱిసిన మఱి పాసి నిలిచి రింతను నంతన్.
195
వ. ఇ ట్లుభయసైనికులు సాంద్రసంతమసంబునం జేయునదిలేక సంగ్రామంబు దక్కి తమకం
బెక్క నొక్కింతసే పూర కున్నంత. 196
క. తనమనుమలు పాండుతనయు, లని సేఁతకు వేడ్కసేయు టాత్మఁ గని తమం
బున వారు మెఱయ రని వ,చ్చినక్రియ శశి పూర్వశైల శిఖరం బెక్కెన్. 197
క. వెలుఁగు గని కడఁగి యిరువాఁ,గులుఁ బోరికి జొచ్చె మత్స్య కుంజరుఁడును న
గ్గల మగుమగఁటిమిసొంపునఁ, దలపడియె సుశర్మతోడఁ దదనుజుతోడన్. 198
చ. తలపడి పోర వారియర దంబు లనేకము లొక్క పెట్ట యి
ట్టలపురయంబునం బొదివి డాసెఁ గడంగి వడిం ద్రిగర్తనా
థులు నిరుదేరుఁ దద్రథము తోఁ గదియించి తదీయసారిథిన్
బరువిడిఁ గూల్చి రథ్యముల ప్రాణములుం గొని రుగ్రమూర్తు లై. 199
వ. ఇవ్విధంబున విరాటుండు విరథుం డగుటయు. 200
చ. అతిరభసంబుమై నడరి యాతనిఁ బట్టి సుశర్మ వెల్ప నా
ర్చి తనరథంబుపై నిడి య శేషబలంబులు నల్దెసన్ భయ
ద్రుతగతిఁ బాఱినన్ విజయ దుందుభు లొక్కట మ్రోయ విక్రమో
ద్ధతివిభవంబునన్ మది ము దం బొలయన్ మరలెన్ మహోద్ధతిన్. 201
వ. అట్టియెడ ధర్మతనయుఁ డనిలనందను నవలోకించి సత్వరం బగుచిత్తంబుతో
మత్స్యవిభునివలను సూపుచు ని ట్లనియె. 202
తే. ఇతనియాశ్రయమున మన మెల్ల బ్రదికి, యున్నవారము గావున నుగ్రరిపుల
పాలువడకుండవిడిపింపఁ బాడియితని, నెయిదుమెయిదుము రథరయ మెసక మెసఁగ. 203
చ. అనవుడు మేను వెంచుచు మ హాబలనందనుఁ డప్పు డన్న కి
ట్లను నిదె సాలవృక్షము ర యంబున దీని నరాతిసేన డొ
ల్ల నడచి యీసుశర్మునిబ లంబుఁ జలంబును మాన్పి యవ్విరా
టుని విడిపించెదన్ రణప టుత్వము వైరులు పిచ్చలింపఁగన్. 204
చే. నీవుఁ దమ్ములు నొక్కెడ నిలిచి చూచు
చుండుఁ డని పల్కుటయుఁ బుయి లోటతోడఁ
గీచకారాతిఁ దప్పక చూచి నగుచు
నతని కి ట్లని చెప్పె ధ ర్మాత్మజుండు. 205
క. తరువు వెసఁ బెఱికికొని నీ, వురవడిమైఁ గవిసితేని నుభయబలము న
చ్చెరు వందుచుఁ జూచి వృకో, దరుఁడ వగుట యెఱుఁగకున్నె తద్విధ మేలా. 206
వ. కవలు నీకుఁ జక్రరక్షకులుగా లోకసామాన్యంబు లైనచాపకృపాణగదాదు లగు
నాయుధంబుల విరోధివధం బాపాదించి వేవేగ విరాటు విడిపింపుము. 207
చ. అనుపలు కంకుశంబునక్రి యం గుదియించిన నిల్చి భూరుహం
బునదెస వోక మత్తగజ పుంగవుచందమునన్ సమీరనం
దనుఁడు శరీర దోళన విధాపరిశోభితవిక్రమోద్యమం
బున విలసిల్లి యిట్టు లను భ్రూకుటి ఫాల మలంకరింపఁగన్. 208
క. మీపనిచినట్ల చేసెద, నేపారినవైరిబలము నెల్లను బాహా
టోపమున నోర్చి మత్స్యమ, హీపతి విడిపించి తెచ్చి యిచ్చెద మీకున్. 209
వ. అనిన విని కౌంతేయాగ్రజుండు సంతసిల్లి తమయంతవట్టునుం గూడుకొని. 210
పాండవులు సుశర్మ నోడించి విరాటుని విడిపించుట.
తే. తాను మున్నుగ శాత్రవ సేనమీఁద
రథము లొక్కటఁ బఱపిరి పృథివి యద్రువ
నుఱక యేచి త్రిగర్తులు నుద్ధతముగఁ
జెఁలగి మార్కొని పొదివి సం కులము గాఁగ. 211
క. ఏయుచుఁబొడుచుచువ్రేయుచు, డాయుచునుద్వృత్తిఁదఱుము టయుఁ బొడిసేసెన్
వాయుసుతుఁడు రథముల నిరు, వేయిటి రథిరథ్యసూత వితథంబులు గాన్. 212
తే. ఏడునూఱురథంబుల నేపుమాపె, నకులుఁ డప్పుడు మున్నూటి నామ మడఁచె
నతనియనుజుఁడు కుంతీసు తాగ్రజుండు, రథికముఖ్యుల వేవురఁ బృథివిఁ గూల్చె.
213
వ. అతండు మఱియును. 214
చ. తఱిమి సుశర్మఁ గిట్టి యతి దారుణభంగి రణంబు సేయ వాఁ
డుఱక నిశాతసాయకము లొక్క మొగిం బది మేనియందుఁ గ్రి
క్కిఱియఁగఁ జేసి నాలుగిట నేసెఁ దురంగములన్ యుధిష్ఠిరుం
డఱిముఱిఁ జంపె సారథిఁ ద దశ్వములన్ వరబాణపాణియై. 215
వ. అయ్యవసరంబున మత్స్యమహీనాథుండు జనితోత్సాహుం డై. 216
ఆ. ఆసుశర్మ తేరి యం దున్నఘనగదా, దండ మెత్తికొని యు దగ్రవృత్తి
జరఠదేహుఁడయ్యుఁ దరుణవయస్కు న, ట్లవని కుఱికి పోయి యతని వ్రేసె. 217
క. అట్టిసమయమునఁ గరువలి,పట్టి త్రిగర్తేశురథము పై కుఱికి వెసం
బట్టికొని యతనిఁ బెడగే, ల్గట్టి పెలుచ నార్చెఁ దద్బ లము పెల్లగిలన్.
218
వ. ఇట్లు సుశర్మం బరాజితుం జేసినఁ జక్రరక్షకుం డైనశోణాశ్వుండు మొదలుగా
నాప్తభృత్యవర్గంబు ననుజుండైనసుశర్మలోనైనబంధుజనంబులు నాదిగాఁ గలపరి వారంబు
పలాయనపరాయణం బగుటయు వెనుకొని యెయిది గోధనవర్గంబు మరల్చి కరితురగరథంబులం
దలమీఱి పొదివి తెచ్చి యన్నపాలికి వచ్చి తాను మున్ను త్రిగర్తేశురథంబుకడ
నిలువ నియోగించి యున్నతమ్ములం గూర్చుకొని తమయంతవట్టును నొక్కట విరాటునకుం
బొడసూపిన. 219
క. ఆదరము సంభ్రమంబును, మోదంబును దనమనమున ముప్పిరిగొన నా
భూదయితుఁడు వివిధప్రియ,వాదంబుల గారవించె వారల నెల్లన్. 220
వ. ఇట్లు సంభావించి పాండవాగ్రజు నవలోకించి. 221
క. మానముఁ బ్రాణముఁ గాచితి, దీనికి సరి గాఁగ నీమ దికిఁ బ్రియ మెసఁగం
గా నాకుఁ జేయ నయ్యెడు, దాని నెఱుఁగఁ గాన మత్ప దము గైకొనవే. 222
తే. ఒడలు సిరియును నాకు నీ యొసఁగినవియ, కాన దగ సమర్పించెదఁ గరుణనీవు
సమ్మతించి యిమ్మత్స్యదే శంబు గావు, పంచి పనిగొని నన్ను ర క్షించికొనుము.
223
వ. అనిన విని యజాతశత్రుం డతని కి ట్లనియె. 224
చ. మనుజవరేణ్య నావలని మన్నన యట్టిద కాదె శత్రుమ
ర్దన మొనరించి మత్స్యనగ రంబున కుత్సవ ముల్లసిల్ల నీ
చనుటయ నాకుఁ దేజమును సంపదయున్ గరిమంబుఁ గాక యి
ట్లనఁ దగునయ్య యే నిచట నైనది యేటిది యింత యేటికిన్. 225
క. అనుపలుకులకును విస్మయ,మును సంతోషమును జిత్త మునఁ బెనఁగొన నా
జనపతి ధర్మతనూభవుఁ, గనుఁగొని యి ట్లనియె మఱియు గౌరవ మెసఁగన్. 226
క. ఉపకారమొ బంటుతనమొ, కృపయో పెంపో సమగ్ర కీర్తిప్రియమో
రిపుదుస్సహ మగునీరణ, నిపుణతకుం గారణంబు నెయ్యమొ యెఱుఁగన్. 227
ఉ. మంటయుఁ బోనిశాత్రవస మాజము నించుకయేని శంక లే
కంటఁగఁ దాఁకి వెండి తెగ టార్చె మహాద్భుతశక్తిశాలి యీ
వంటలవానిచేసినయ వార్యపరాక్రమ మొండుచోటులం
గంటిమె వింటిమే యితఁడ కాఁడె వెసన్ గెలిపించె న న్ననిన్. 228
క. కంధరములు దెగి తలలు వ,సుంధర నతిపక్వతాల సుభగఫలాళీ
బంధురత రాలు దామ,గ్రంథి పగఱమీఁదఁ గినిసి కవిసినయెడలన్. 229
క. ఎక్కడఁ జూచినఁ దానై, యక్కజ మగుకడిమికలిమి నరిసేనఁ గరం
బుక్కఱఁ దంత్రీపాలుం, డొక్కఁడ పొలియించె నీర ణోత్సాహమునన్. 230
క. ఈనలువురు దక్కఁగ మన, సేనల నొక్కరుని నైనఁ జేడ్పడనిభటుం
గానం జెలి కెడ రైనం, బూని తలఁగునతఁడ చూవె పురుషుం డెందున్. 231
ఉ. కావున మీకు దంతిహయ కాంచనరత్నవిభూషణంబులున్
దేవనితంబినీజన స దృక్షమృగాక్షులు నాది గాఁగ నా
నావిధవైభవంబులు మ నంబులవాంఛలకుం దగంగ నీ
కేవిధి నీఁగువాఁడ ఋణ మెయ్యది యేనియు వేఁడుఁ డిచ్చెదన్. 232
క. అనవుడుఁ బాండుతనూభవు, లనఫూ యి ట్లెంతయుం బ్రి యంబున సంభా
వున సేసితి మా కిదియే, ధనము వడయుదానికంటెఁ దక్కువె చెపుమా. 233
ధర్మరాజు సుశర్మను సపరివారంబుగా విడిపించుట.
వ. మమ్మెరవుగాఁ దలంచి యియ్యెడ నిట్టట్టన వలవదు పురంబున కరిగి యయ్యెడ
నీకెట్లు ప్రియం బట్లు మన్నింపు మని రందు గంకుండు మఱియు ని ట్లనియె. 234
క. తగ నొక్కటి వేఁడెద నిను, జగతీశ్వర యిచ్చు టొప్పు సరథగజాశ్వం
బుగ విడిచి పుచ్చు మిప్పుడ, త్రిగర్తపతి నిదియ నాకుఁ బ్రియ
మెబ్భంగిన్. 235
వ. మననగరంబునకుం జంఫూలురం బంపుము పురంబున వారలు వోయి భవద్విజయ
ఘోషంబాచరించి శోభనధ్వజోన్నయనంబును మంగళతూర్యనాదంబులును బర
స్పరగంధసలిలసేచనంబును గీతవాద్యనృత్తంబులును నాదిగాఁగల వివిధశుభా చారంబులం
బ్రవర్తింప నియోగింపవలయు ననిన విరాటుండును బనిచినంగాలరులు వేగునంతకు
వీటికిం జని గెలుపు ప్రకటించి పట్టణాలంకరణప్రముఖనిఖిలభద్ర
విధానంబులుసేయించి రిట పాండవులును మత్స్యమహీవల్లభుండును సమస్తసేనా
సమేతులై విభవం బెసఁగ విలసిల్లుచు లజ్జావనతాననుం డగుసుశర్మ సపరిచ్ఛదంబుగా
విడిచి పుచ్చి గుత్తులకొలందికిఁ గృత్తంబు లయి పడి యున్నపాదంబుల వలనం
గెందలిరులసెజ్జలచందంబు లగుచోట్లును దునిసి చిక్కువడి
యున్నయూరుకాండంబులవలన మదగజంబులు సొచ్చినకదలీవనంబులం బోనియెడలును బ్రోవులు
గొని యున్న ప్రేవులవలన లావు గలయంచపిండు పేరాఁకలి నఱిముఱిం బెఱికినఁ
గుఱుకులు గట్టినమృణాళనాళంబుల నొప్పు కమలాకరోద్దేశంబులఁగ్రేణి
సేయుప్రదేశంబులును నంగుళీయకరుచు లడర నెఱిం జాఁగిపడి యున్నబాహు దండంబులవలన
నురగనివాసంబుల ననుకరించుతలంబులును గీలాలజలంబులపయిం దేలుచు నవ్విన
ట్లున్నశిరంబులవలన వికచారవిందదీర్ఘికల విడంబించుఠావులును నవయవభేదంబు
లడంగునట్లుగాఁ దుత్తునియలై పడియున్నగాత్రంబులవలనం గృతాంతమహానసశాలలపగిది
నొప్పుపట్లును గలపొలిగలను గలయంగనుంగొనుచు వెడలి చంద్రికాసుందరం
బగునొక్కసైకతస్థలంబున నారాత్రి వుచ్చి రనిచెప్పిన విని మఱునాఁటివృత్తాంతం
బెట్లయ్యెనో యని సాదరంబుగా నవలోకించిన. 236
చ. అపరిమితప్రకార విని రస్తసమస్తవికార షట్ప్రమా
ణపరమదూర గాఢభజ నక్రమగత్యనుభావసార దే
వపితృపథప్రవర్తన వి వర్జననిర్మలచిత్తచోర శాం
తిపర మహాత్మ సంసరణ తీర నిరంజన భక్తరంజనా. 237
క. విజ్ఞానానందరసా, భిజ్ఞహృదయకమలహంస భీమదురితమ
ర్మజ్ఞ వివిధాభిధానా, యజ్ఞాత్మకరూప నిశ్చ లావ్యయదీపా. 238
మాలిని. త్రిజగదవననిత్య క్రీడనోద్యత్ప్రమోదా
రజనిచరవిఫూతా రంభలీలావినోదా
భజననిరతసౌఖ్య ప్రాప్తిజాగ్రత్ప్రసాదా
నిజతనువిభవత్వో న్మీలనాచ్ఛిన్ననాదా. 239
గద్యము. ఇది శ్రీమదుభయకవిమిత్త్ర కొమ్మనామాత్యపుత్త్ర బుధారాధనవిరాజి
తిక్కనసోమయాజిప్రణీతం బయిన శ్రీమహాభారతంబున విరాటపర్వంబునందుఁ
దృతీయాశ్వాసము. 240
విరాటపర్వము - చతుర్థాశ్వాసము.
క. శ్రీమదరేఖ విషాదవి
రామాహితగాఢశమధు రానిర్భరని
ష్ఠామర్దితవివిధవికా
రామలచేతోనివాస హరిహరనాథా. 1
భూమింజయుఁడు గోవుల విడిపింపఁ గౌరవులతోఁ బోరుటకుఁ బో నెన్నుట.
వ. దేవా వైశంపాయనుండు జనమేజయున కి ట్లనియె. 2
క. సూర్యోదయావసరమున, దుర్యోధనుబలము ప్రబల దోర్బలలీలా
ధుర్యగతి నడచె భీష్మా, చార్యరవిసుతాదియోధ సంఘోద్భట మై. 3
వ. నడచి మత్స్యనగరంబున కనతిదూరంబున విరాటుపశుగణంబులం బొదివె నట్టియెడ
మ్రుక్కడిమూఁకలు సని యెక్క డెక్కడ నని తలపడినం గృపాశ్వత్థామ శకుని
దుశ్శాసన కర్ణ దుర్ముఖ ప్రముఖరధికజనంబులు గోపాలవర్గంబు ననర్గళ ప్రసారం
బగుశరాసారంబునం గప్పినం గని కౌరవబలం బగుట యెఱింగి బెగ్గలించి
గవాధ్యక్షుండు రథంబు దోలికొని యాక్రోశించుచుం బురంబున కరుగుదెంచి
రాజమందిరద్వారంబుఁ జొచ్చి రథావతరణంబు సేసి యంతఃపురంబున నున్నభూమింజయుం
గాంచి ససంభ్రమంబుగా ని ట్లనియె. 4
మ. ధరణీచక్రము సంచలింపఁగ సము ద్దాంతంబు లై గ్రక్కునం
గురుసైన్యంబులు వచ్చి ముట్టికొనియెన్ గోవర్గమున్ వేగమై
మరలం దెచ్చుటకుం గడంగుము రిపు క్ష్మాపాలలోకంబు నీ
శరజాలంబులపాలు సేయుము భుజో త్సాహంబు శోభిల్లఁగన్. 5
ఆ. తేరుఁ బూన్పఁ బంపు తెప్పింపు దృఢతను, త్రాణ ముగ్రచాప బాణపూర్ణ
తూణఘనగదాసి తోమరచక్రాదు, లనువుగా నొనర్పు మతిరయమున. 6
చ. విరటుఁడు నిన్ను నెప్డుఁ బది వేవురముందటఁ జెప్పు బాహు వి
స్ఫురితుఁడు శౌర్యశాలి కుల భూతివిశేషవిధాయకుండు భూ
భరణవిశారదుండు జన భవ్యతపఃఫలసంభవుండు గా
తరపరిరక్షకుం డనుచు దానికి నీడుగఁ జేయు మిత్తఱిన్. 7
క. అని కాంతాజనములలోఁ, దను నగ్గించుటయుఁ బొంగి దర్పోద్ధతి ని
ట్లను నుత్తరుండు దనమన, మున సంగరకౌతుకంబు ముడివడు చుండన్. 8
ఉ. ఎత్తునఁ గొందు గౌరవుల నెల్లను మార్కొనిరేని గోవులం
దెత్తు ముహూర్తమాత్రమునఁ దేరికి సారథి లేమిఁజేసి నా
చిత్తమునన్ విచారదశ సెందెడు నెవ్వఁడు గల్గునొక్కొ నా
కిత్తఱి నేఁ గదా కడప నెంతయు నేర్తు రథం బనం బురిన్. 9
క. తగుసారథి దొరకొనినం, బగతుర భంజించు టెంత పని కదుపుల ద
వ్వుగఁ గొని పోదురొకో యి, ట్లగునె కలండేని సూతు నరయుం డెందున్. 10
చ. కురుపతిభీష్మకర్ణకృప కుంభజముఖ్యులు మత్సముద్యమ
స్ఫురణము సూచి పార్థుఁ డను బుద్ధిఁ గలంగఁగ బెట్టు గిట్టి సం
గరమున నోర్చి యేఁ బసులఁ గ్రమ్మఱఁ దేరక యున్న నన్ను భూ
వరుఁడు సుహృజ్జనంబుఁ బరి వారముఁ జిత్తములందు మెత్తురే. 11
వ. అనునప్పుడు తత్ప్రదేశంబున నునికించేసి, 12
క. విని ద్రుపదధరణిపతినం, దన సామర్షాపహాస తరళహృదయ యై
చని తద్వృత్తాంతము మె,త్తనిపలుకులఁ జెప్పె నింద్ర తనయునితోడన్. 13
వ. అతండు నజ్ఞాతవాసవత్సరం బతీతం బగుట నిరూపించి పాంచాలి కిట్లనియె నీవు
వోయి వారలతో నిట్లనుము మన బృహన్నలకు సారథ్యంబు సేయుసామర్య్థంబు గలదు
దొల్లిఖాండవదహనంబునం బాండవమధ్యమునకు సారథి యై యతని చిత్తంబు వడసె మఱియుఁ
బెక్కెడలం దదీయం బగురథంబు గడపఁ దాన యై యుండు నేను నెఱుంగుదుం
దత్సాహాయ్యంబునం గురుసైన్యంబుల జయింప వచ్చుటకు సంశయంబు వలవ దనుము వా రే
మనిరేని మఱియుం దగ నాడి నన్నుం బిలిపించునట్టితెఱంగు గావింపు మన నట్ల
చేయుదు నని సైరంధ్రి యుత్తర యున్నయెడకుం బోయి, 14
చ. జనపతినందనుండు దగు సారథి నారయు చున్నవాఁ డెఱిం
గినపని సెప్పఁగా వలయుఁ గ్రీడి మనంబున మెచ్చునట్టినే
ర్పును భుజశక్తియుం గలిగి రూఢికి నెక్కినసూతవృత్తిమై
నని సడి సన్న యేడ్తెఱ బృ హన్నలకుం గల దంబుజాననా. 15
తే. అర్జునునకు ఖాండవదహ నాదు లైన, విక్రమము లాబృహన్నల వెరవులావు
గాదె జయ మొనరించె లో కంబు లెఱుఁగ, నువిద దీని నెఱింగింత ముత్తరునకు. 16
క. అని యమ్ముదితయుఁ దానును, జని యతనికి నత్తెఱంగు సముచితముగఁ జె
ప్పిన నక్కుమారువరుఁ డి, ట్లనియెం బాంచాలితోడ నల్లన నగుచున్. 17
తే. అకట సైరంధ్రి నన్ను ని ట్లాలిగొనఁగ, నేల చక్కఁగఁ గను విచ్చి
యేనుబేడిఁ
జూడరోయుదు రణమున సూతకృత్య, భరముదాల్చుట కెమ్మెయిఁ బనుచువాఁడ. 18
వ. అదియునుం గాక. 19
చ. కురుబల మేఁగుదెంచె నటె గోవుల బిట్టఱఁ బట్ట దానిపైఁ
బరిగొని శౌర్యసంపదయు బాహుబలంబును జూపఁ బూని యే
నిరిగెదనట్టె తేరికి బృ హన్నల సారథి యైన దీని న
వ్వరె పురిలోన నింతకఱ వా రథచోదకు లింత యేటికిన్. 20
వ. అనిన విని సైరంధ్రి యతని కి ట్లనియె. 21
ఉ. కౌరవసేన గాదు త్రిజ గంబులు నొక్కట నెత్తివచ్చినం
దేరు బృహన్నలావశగ తిం జరియించిన గెల్వవచ్చుఁ ద
ద్వీరగుణంబుసొంపు పృథి వీవరనందన ము న్నెఱుంగుదుం
గారణజన్మ మై తనువి కారము వచ్చినఁ బెంపు దప్పునే. 22
వ. అనవుడు. 23
క. మన మురియాడుచు నుండఁగఁ, దన కొరు లప్పటికి లేమి ధరణీశ్వరనం
దనుఁడు బృహన్నలఁబిలువం, బనుచుట కొడఁబడినపలుకు పలుకుటయుఁదగన్. 24
వ. సైరంధ్రిదెసఁ గనుంగొని యేను బోయి తోడ్కొని వచ్చెద నని పూని. 25
సీ. అడుగులనునుఁగాంతి నయ్యెడ పద్మరా,గంబుల నెలకట్టు కరణి నొప్పఁ
బాలిండ్లు దను వెడ వ్రాలింపఁ జెన్నొందు, నసదుఁగౌఁదీఁగె య ల్లాడుచుండఁ
దఱివేచి వెనువెంటఁ దగులు కామాంధ కా,రములీలఁ గ్రొవ్వెద గొమరుమిగులఁ
గర్ణభూషణమౌక్తి క ప్రభాడోలన, మీక్షణ దీప్తుల నినుమడింప
తే. నందియలమొరపంబున కరుగుదెంచి, ప్రోది రాయంచ రయమునఁ బోవునవ్వి
ధంబు దగ నభ్యసించుచం దమునఁ దోన, చనఁగ నుత్తర న ర్తన శాల కరిగె. 26
ఆ. మెఱుఁగు మొగిలుసొచ్చు తెఱఁగుననాట్య మం,దిరముసొచ్చితనదు గురువుకడకు
నరిగి నెమ్మి నిట్టు లను నింతి ప్రార్థనా,వినయసంభ్రమములు పెనఁగొనంగ.
27
క. ఇచ్చట నొకకయ్యంబునఁ, జచ్చె మదీయాగ్రజన్ము సారథి తగువాఁ
డెచ్చోట లేమి నాతం, డచ్చుపఱుపఁ డయ్యెనీక్రి యకు నొండొకనిన్. 28
వ. అది యట్లుండె నేఁడు కౌరవులు పసులం బట్టిరని కూయి వచ్చిన నన్న
సన్నద్ధుం డై వెనుకం దగుల సమకట్టి సారథ్యంబు సేయువాఁడు లేమికి విషాదంబు
నొందిన నీకందువసైరంధ్రి సెప్పినం బ్రియం బంది నిన్ను దోడ్తెర నన్నుఁ
బనిచిన నేనును నీపాల నాకుఁ జనవు గలుగుటంజేసి యెల్లవిధంబులం
దెత్తుననిపూనివచ్చితి నీవును నాపలుకులు గుఱుచసేయక నీపెంపునుం బ్రకటంబుగా
నయ్యుత్తరకుమారునకు రథంబు గడప నియ్యకొని యియ్యాపదఁ దలఁగవలయు ని ట్లొడంబడక
తక్కుట నావలనివాత్సల్యంబు గొఱంతపఱుచుట యనిన నమ్ముద్దియపలుకులు
ముద్దుసేసి. 29
క. నగుచు బృహన్నల యి ట్లను, జగతీశ్వరపుత్త్రి నాకు సారథ్యమునే
ర్పు గలదె నీమాటకు నే, మిగులంగా వెఱతుఁ బొదము మీఁ ద ట్లుండెన్. 30
క. భవదీయప్రార్థనచేఁ, దివిరి పరమదుష్కరములు దీర్చి యయినను
త్సవ మొనరించెద సార, థ్యవిధం బొకఁ డనగఁ నేల యంబుజవదనా. 31
వ. అనుచు సంగీతనిలయంబు వెలువడి సలీలంబుగా మెత్తమెత్తన నడతెంచుమత్త
శుండాలంబునుంబోలె. 32
ఉత్తరుఁడు బృహన్నలను దనకు సారథిఁగా జేసికొనుట.
తే. అరుగుదెంచుబృహన్నల నంతనంతఁ, గని నృపాలసుతుం డను గారవమునఁ
గౌరవులతోడఁ గయ్యంబు గలిగెనాకుఁ, గడఁగి నేఁడు రథమ్మీవు గడపవలయు. 33
క. వే రమ్ము మైమఱువు దొడి, తే రెక్కుము దప్పఁ గ్రుంకఁ దీఱదు నీకున్
సైరంధ్రి సెప్పె నీ దగు, వీరమ్మునపెంపు లావు వెరవును మాకున్. 34
చ. అనుటయు నాటపాట గల యప్పటికిన్ ననుఁ గోరి పిల్వఁ బం
చినఁ దగుఁగాక సంగరము చేఁతకు సారథి గమ్ము రమ్ము నీ
వను టుచితంబె యెల్లెడల నారసి బాహుబలాఢ్యుఁ డైనయొ
క్కని రథ మేడ్తెఱం గడపఁ గా నియమింపుము రాజనందనా. 35
వ. అనిన విని వైరాటి కిరీటి కి ట్లనియె. 36
ఉ. ఖాండవ మేర్చునప్పుడు ద గన్ రథచోదకవృత్తి సల్పి యా
ఖండలసూతికిన్ జయము గల్గ నొనర్చినయట్టిబుద్ధియున్
దండితనంబు నీయెడన తక్కెనె నాదెస మైత్త్రి పెన్పు మిం
కొండొకమాట దక్కుము ర ణోత్సహనం బొనరింపు గ్రక్కునన్. 37
తే. అనిన నాతనిమాటకు నడ్డమాట, వెఱచినట్టితెఱంగు భా వించి యల్ల
నియ్యకొనుటయు నమ్మను జేంద్రసుతుఁడు, దృఢతనుత్రాణ మతనికిఁ దేరఁబనిచె.
38
క. తెప్పించి తొడుగు మీ వని, యొప్పించిన నిట్టు నట్టు నొఱవలుగా మైఁ
గప్పికొని యాబృహన్నల, యప్పుడు నగుపించె నచటి యబలాజనమున్. 39
క. ఉత్తరుఁడు సత్వరంబుగఁ, దత్తనువున మఱువు దొడిగి తానును హృద్యో
దాత్తం బగుకంకట మిడి, చిత్తము పసిఁ గ్రమ్మఱింపఁ జిడిముడిపడఁగన్. 40
వ. బృహన్నల నవలోకించి. 41
క. హయములఁబూన్పుము రథమున, రయమున సిడమెత్తుమిపుడ రావలయును గో
చయము గొని యస్మదీయవి,జయ మభినందింపఁ బురము జను లెదురుకొనన్. 42
తే. అనిన నీ వేమి పనిచిన నట్ల చేయ, వలయు నీ వున్నయెడ నుండ వలయు నీవు
సన్నదెసఁ జనవలయు నా శక్తియెఱిఁగి, పంచి పనిగొనికడిమిమైఁ బగఱగెలుము. 43
వ. అని పలుకుచు మనంబున ముదం బొదవ నాధనంజయుండు. 44
క. కాంచనజాలాలంకృత, చంచత్తనులీల మెఱయు జవనాశ్వములం
బూంచి రథంబున మణిమయ, పంచాననకేతు వెత్తె బంధురభంగిన్. 45
వ. ఇట్లు సన్నాహంబు మెఱసినసారథిం జూచి యుత్తరయుం జెలులు ని ట్లనిరి. 46
క. కురువీరుల గెలిచి తదం, బరములలోఁ జిత్రవర్ణ భాసురములుగాఁ
దర మెఱిఁగి లోచనోత్సవ, కరములుగా బొమ్మపొత్తి కలకుం దెండీ. 47
క. అనుడు బృహన్నల యి ట్లను, జనపాలకనందనుండు జయలక్ష్మిం జే
కొనునటె చీరలు దెచ్చుట, పనియే యటు సూడుఁ డెల్ల భంగులఁ దెత్తున్. 48
వ. అనుచు ధనుస్తూణీరకృపాణముద్గరాదివివిధసాధనంబులు రథంబుపైఁ బదిలంబుగా
నిడి నొగ లెక్కిపగ్గంబుల స్రుక్కు సక్కంజేయ నుత్తరుండును బసులం బట్టినదెస
గోపాలకు నడిగిన వాఁడు పితృవనంబువల నని చెప్పిన వినుచు రథారోహణంబు సేసి
వెడలి పౌరవృద్ధపుణ్యాంగనాభూసురసమూహంబులు బృహన్నలం జూచి తొల్లి
ఖాండవదహనంబున నర్జునునకు నీకతంబున నయినమాంగల్యం బెట్టి దట్టిద
భవత్సాహాయ్యంబున భూమింజయున కయ్యెడు మని దీవించి సేసలు సల్లం బురంబు
నిర్గమించినిరర్గళపరాక్రముండయిన యాఫల్గునునైపుణంబున వల్గదశ్వం
బగురథంబురయంబునకు మెచ్చుచుం బరేతనిలయప్రాంతప్రదేశంబు సేరం జని. 49
సీ. అభినవజలధర శ్యామంబు లగునెడ, లాకుజొంపంబుల ననుకరింప
సాంధ్యరాగోపమ చ్ఛాయంబు లగుపట్లు, కిసలయోత్కరములఁ గ్రేణిసేయ
రాజమరాళగౌ రము లగుచోటులు, దఱచుఁబూఁబొదలచం దంబు నొంద
హారిద్రరుచిసమా నాకృతు లగుఠావు, లడరెడు పుప్పొడు లట్లు మెఱయఁ
తే. గలయ నెగసి ధరాధూళి లలితవనము
దివికి నలిఁ గాఁపు వోయెడు తెఱఁగుఁ దాల్ప
గోగణము ముంగలిగ నేల గోడివడఁగ
నడచుకౌరవరాజసై న్యంబుఁ గనియె. 50
ఉత్తరుఁడు కురుసైన్యంబు గనుంగొని భయభ్రాంతుం డగుట.
క. కని యుత్తరుండు గరుపా,ఱినమేనును దలఁకుమనము ఱిచ్చవడినచూ
పును నై తొట్రుపడుచు ని, ట్లనియె దిగులు సొచ్చి యాబృ హన్నలతోడన్. 51
శా. భీష్మద్రోణకృపాదిధన్వినికరా భీలంబు దుర్యోధన
గ్రీష్మాదిత్యపటుప్రతాపవిసరా కీర్ణంబు శస్త్రాస్త్రజా
లోష్మస్ఫారచతుర్విధోజ్వ్జలబలా త్యుగ్రం బుదగ్రధ్వజా
ర్చిష్మత్వ్తాకలితంబు సైన్య మిది యేఁ జేరంగ శక్తుండనే. 52
క. అకృతాస్త్రుఁడ బాలుఁడఁ గా, ర్ముకవిద్యాప్రౌఢిమై ని రూఢు లయినయీ
శకుని జయద్దథ దుర్ముఖ, వికర్ణ కర్ణాది యోధ వీరుల కెదురే. 53
క. ఇ ట్టగు టెఱుఁగక వచ్చితి, మెట్టొకొ మనభంగి వీర లిందఱును గడున్
బెట్టిదులు మనకు మార్కొను, నట్టికొలఁది గాదు భీతి యడరెడుఁ దోడ్తోన్.
54
ఉ. కౌరవసేనఁ జూచి వడఁ కం దొడఁగెన్ మదితోన మేను నీ
వూరక పోవు చున్కి యిది యొప్పునె యిప్పటిభంగిఁ జూచిన
న్వీరల నేను మార్కొనమి నిశ్చయ మ ట్లగుటన్ రయంబునం
దేరు మరల్పు ప్రాణములు దీ పన మున్ వినవే బృహన్నలా. 55
వ. అనిన దరహసితవదనుం డగుచు శతమఖతనయుం డతని కి ట్లనియె. 56
చ. అసదృశలీలఁ బొల్చురథి కావలిమీఁదఁ జనంగ వెఱ్ఱినే
మసలక యామిషంబు గొని మార్గము వట్టినతుచ్ఛసైన్యమున్
వెసఁ జని ముట్టిగోధనము వేగ మరల్తముగాక యిమ్మెయిం
బసు లటు వోవఁగా మరలఁ బాడియె నీకు నరేంద్రనందనా! 57
ఉ. అంతిపురంబులోనఁ గల యంగన లెల్లను నెమ్మనంబులన్
సంతస మందఁగా బసులఁ జయ్యనఁ దెచ్చెద నంచుఁ బూని నీ
వెంతయుమేటి వై యరద మెక్కి రయంబున వచ్చి యిచ్చటన్
దంతితురంగసద్భటక దంబముఁ జూచి కలంగు టొప్పునే. 58
ఆ. అనినపలుకులకు బృ హన్నలఁగనుఁగొని, యెలుఁగు వడఁక నాతఁ డిట్టులనియెఁ
బసుల దయ్య మెఱుఁగుఁ బడఁతులసంతోష, మేల నాకు ననికిఁ జాల నేను. 59
వ. అనవుడు. 60
చ. తనభజశక్తియున్ రిపుల దర్పము నేర్పఁడ జూచిచూచి యె
ట్లును దెగ కున్నఁ బోక యిది లోకముచక్కటి శూరు లైన దీ
నిని మది మెచ్చ రీబలము నీదెసఁ దేఱియుఁ జూడ దింతకున్
మును భయహేతు వైనవిధ ముం దగఁ జెప్పుము నాకు నిత్తఱిన్. 61
సీ. దెసలు బీఁటలు వాఱఁ దివురు చిందములకో,లాహలంబులకుఁ గ లంగఁబడక
యురవడి సేనలు దెరలఁ బైఁ దోఁ తెంచు,ధూళి పె ల్లడరినఁ దూలపోక
చతురంగబల మతి సాంద్రతఁ గవిసిన,యగ్గలికమునకు బెగ్గడిలక
శస్త్రాస్త్రములు రథ్య సారథివర్మాంగ,తతి నాటుతఱచునఁ దల్లడిలక
తే. బహువిధంబులఁ బగతుర బరవసమున, నిత్తెఱంగునఁ గలుగుక్రం దెల్ల నోర్చి
నిల్చి గెల్చిన సత్కీర్తి నెగడుఁగాక, దవ్వుదవ్వుల ని ట్లైన నవ్వ
రెట్లు. 62
చ. అనుదివిజేంద్రనందనున కమ్మనుజేశ్వరసూనుఁ డి ట్లనున్
వినుము త్రగర్తవాహినులు విక్రమసంపద సొంపు మీఱ గో
ధనములఁ బట్టినం బతి యు దగ్రత సైన్యము లెన్ని యన్నియుం
గొని యట వోయెఁ గాన మన కుం బురి బాసట లేర యెవ్వరున్. 63
తే. ఒంటి దలపడి కురుసేన నోర్చువాఁడ, నే యి దేటికి వెడమాట లిట్టు లాడ
వారు గానకముందఱఁ దేరు దోలు, కొని రయంబునఁ బురి కరు గుటయ నీతి. 64
వ. అనినం బార్థుండు పార్థివనందనున కి ట్లనియె. 65
క. వెగ డొంది యిట్లు వలుకఁగ,నగునే పగతురు ప్రమోద మందఁగఁ బసులన్
దిగ విడిచి పురజనంబులు, దెగడంగా మగిడి పోక దీనత గాదే. 66
వ. అట్లుం గాక. 67
మ. నను సైరంధ్రి గడంగి పేర్కొనియె దా నం బెంపుమైఁ బిల్చి తో
డని తోడ్తెచ్చితి వీవు బంటుతన మ ట్లగ్గించి పౌరాలి దీ
వన నిచ్చెం దుదిఁ బోయి కౌరవులు గో వర్గంబుఁ గొంపోవఁగాఁ
గని యేఁ గ్రమ్మఱి రిత్త వోదునె భయో త్కంపంబు నీ కేటికిన్. 68
తే. చిత్తవృత్తి యొక్కించుక చిక్కఁ బట్టు, మిపుడ కౌరవసైనికు లెల్లఁ
జూచి
వెఱఁగువడ వేగమునులావు వెరవుమెఱయఁ, గదుపుఁ బెట్టించిపోదము గ్రమ్మఱంగ. 69
వ. అనుచు వివ్వచ్చుండు గడంగి తేరు వోవ నిచ్చుటయు నాననంబు పల్లటిల్ల
మానసంబు దల్లడిల్ల నాభూవల్లభకుమారుండు. 70
క. దవ్వుల విఱిగినఁ బౌరులు, నవ్వుదురటె మేలు మేలు నను నాఁగకు నీ
క్రొ వ్వఱుగ దేనిఁ దలపడు, మెవ్విధిఁ జనితేని ననుచు నెత్తినభీతిన్. 71
క. శరములు శరాసనము న,య్యరదముపై డిగ్గ విడిచి యతిరభసమునన్
ధరణికి లంఘించి వెసం, బురిదెసకును లజ్జ వీటిఁ బోవం బాఱెన్. 72
వ. ఇట్లు వాఱినం దనమనంబునం గుత్సించుచు బీభత్సుండు యుగ్యంబులపగ్గంబులు
నొగల ముడిచి రథంబు డిగ్గ నుఱికి లంబకేశభారుండును నాందోళితరక్తాంబర
యుగళాంచలుండును నగుచు నతనివెనుకం బఱచుసమయంబున నిలిచి కనుం
గొనుకౌరవబలంబునందు. 73
ఉ. అజ్ఞులు కొంద ఱప్పుడప హాసము సేయుచు గూఢరూపరే
ఖాజ్ఞత లేమిఁ దద్వికృత కాయముమీఁదను దృ్లషు నిల్పఁగాఁ
బ్రాజ్ఞులు మూర్తిసౌమ్యతయు బాహులదీర్ఘతయుం భటత్వత
త్వ్తజ్ఞతయున్ గతిస్ఫురదు దాత్తతయుం గని సంశయంబుతోన్. 74
తే. ఆఁడుఁజందంబుఁ బురుషస మాకృతియును
గలిగి యున్నవి యొప్పు నూ ష్మలతసొంపు
వికృతవేషాకృతంబు లై వెలయ కితఁడు
నివుఱు గవిసిన మెఱయని నిప్పుఁబోలె. 75
ఉ. బాహులచాయయున్ గమన భంగియు నర్జునునట్ల దీన సం
దేహము లే దితండు దన తేజము డాఁపగ మత్స్యభూమిభృ
ద్దేహమునందుఁ బేడి యనఁ గీడ్పడి యుండెనొ కాక యీకురు
వ్యూహముతోడికయ్యమున కొండొకరుం డిటు లొంటి వచ్చునే. 76
చ. విరటుఁడు దక్షిణంబునకు వీరుల సారథులన్ నిజాజికై
పురిఁ గలవారి నెల్లఁ గొని పోయిన నొండులు లేమిఁజేసి యు
త్తరుఁ డిట వచ్చు చుండి యర దంబు దగం గడపంగ నెవ్వరుం
దొరకొన కున్నఁ దా నితనిఁ దోడ్కొని వచ్చినవాఁడు సూఁడఁగన్. 77
చ. పరి సనుదెంచి గోగణముఁ బట్టి రనన్ విని పిన్న గాన మీఁ
దరయక రాజనందనుఁ డ హంకృతిమైఁ బఱతెంచి సైన్యవి
స్ఫురణముఁ జూచి భీతిఁ దన బుద్ధి గలంగినఁ బాఱఁజొచ్చె ని
ప్పురుషునిశౌర్యసంపదయు భూరిబలంబు నెఱుంగఁ డేమియున్. 78
వ. అనుచు నిశ్చయరహితహృదయు లగు చుండ శండాలరయలీలాసమరేఖం బగు గమనంబునం
బురుహూతపుత్త్రుండు పదశతమాత్రప్రదేశపలాయితుం డైన భూమింజయు నెయిది
పట్టికొనిన నతండు. 79
సీ. వెలవెలఁ బాఱుచు వెగ డొందుఁ బెదవుల,తడి యాఱ నెంతయుఁ దల్లడిల్లుఁ
జల్లన నంగంబు లెల్లనిండఁ జెమర్చుఁ, బదములుఁ గరములుఁ గుదియవడఁకు
హృదయంబు తటతట నదరంగఁ బెలుకుఱు,దీనదృష్టుల మోముఁ దేఱి చూచు
నెలుఁగు గద్గదికఁ దొ ట్రిల నేడ్చు విడు మని, ప్రార్థించు మాటఁ గీ
డ్పాటుదోఁప
తే. నిష్కశతశుద్ధ హేమంబు నిర్మలోజ్వ్జ
లాష్టవైడూర్యములుఁ దుర గాఢ్యరథముఁ
గరటిదశకంబు నొకయూరుఁ బురము సొచ్చి
నపుడ యిచ్చెద నీ కను నార్తుఁ డగుచు. 80
క. నాతోడిప్రేముడిం గడు, నాతుర యై యెదురుచూచు నంబకు జేతః
ప్రీతిగఁ జని యాయమఁ బొడ,సూతుం బోనీఁగదే వి శుద్ధచరిత్రా. 81
అర్జునుఁ డుత్తరునిఁ దనకు సారథిగాఁ జేసికొనుట.
వ. అని మఱియు నానావిధదీనాలాపంబులం బ్రార్థించు చుండం బార్థుండు నగుచు
నతనిం దేరు సేరం దెచ్చి. 82
చ. వెఱవకు మన్న పోటు కురు వీరులతోడ నశక్యమేని న
త్తెఱఁ గది యేల నీ కుడుగు తేరికి సారథి గమ్ము నాకుఁ జి
చ్చుఱపిడు గెట్టు ల ట్టడరి శూరులమొత్తము నుగ్గు సేసెదం
బఱపెద సేన రాజుధృతిఁ బాపెద గోవులఁ గ్రమ్మఱించెదన్. 83
క. అనుచు నొడఁబాటు లేకు,న్నను నయ్యుత్తరుని నొగల నడుకొన నిడి తా
నును రథ మెక్కి రథికుఁ డయి, చనియె నరుఁడు జమ్మి సేర సమ్మదలీలన్. 84
వ. ఇట్లు సవ్యసాచి నిక్షిప్తాయుధం బైనశమీవృక్షసమీపంబునకరుగునవసరంబునం
గ్లీబరూపచ్ఛన్నుం డయ్యును బ్రస్ఫురణవిశేషభీషణుం డగునతనిం గనుంగొని
కౌరవసైనికులు గలంగినమనంబులతోడ నివ్వెఱపడి యుండ వారలం గనుంగొని
తోఁచునుత్పాతంబుల నాలోకించి గురుం డి ట్లనియె. 85
క. మాసె నభోమణి నక్కలు, గూసెం గలయంగ దెసల కుం బలుసాయల్
సేసెం బఱమొయిళు లడరి, మ్రోసెం దమయంతఁ దూర్య ము లపధ్వను లై. 86
క. ఇగ్గజములు మిన్నకయును, మ్రొగ్గెడు నుత్తమతురంగ ములు బాష్పజలం
బగ్గలము విడుచుచున్నవి, దగ్గెడుఁ గారణము లేక తడఁబడి పడగల్. 87
క. దగ్ధము లైనట్టులు స, మ్యగ్ధైర్యము లెడలె మండె నాయుధచయముల్
దిగ్ధూమం బెసఁగె నసం,దిగ్ధము మన కాజి యగుట దీనికిఁ దగఁగన్. 88
క. మొన లొఱపుగఁ దీర్చికొనుఁడు, దనతనవాహనము లాయు ధము లెల్లజనం
బును ననువుసేసికొనుఁడో,పినయంతయుఁ గాచికొనుఁడు బెదరక పసులన్. 89
వ. అనిచెప్పి తా నప్పు డర్జును నెఱింగినవాఁడు గావున నతనికి నజ్ఞాతవాససమయ
భంగం బగునో యనుభయంబున సురనదీసూనువదనంబు వీక్షించి సన్నవాఱ ని ట్లనియె.
90
చ. వెరవరి గాక వీఁడు కురు వీరులకుం బొడసూపువాఁడె య
చ్చెరు వొక మ్రానిపేర నిట సేరఁగ వచ్చుచునున్నవాఁ డహం
కరణమ కాని యొం డొకటి గానఁడు మూర్తివిశేష మారయన్
సురపతియట్ల వీనిమది చొ ప్పది యెట్లొ యెఱుంగ నయ్యెడున్. 91
క. అనిన విని యెఱిఁగికొని యా,తనిమది సందియము మాన్పఁ దలఁచి నరేంద్రుం
గనుఁ గొనుచు నతనితోఁ జె,ప్పినభంగి నిగూఢవృత్తి భీష్ముఁడు వలికెన్. 92
క. తలఁపఁగ రిపులకు ని మ్మగు,కొలఁదిఁ గడచి వచ్చితిమి య కుంఠితబాహా
బలము నెఱపఁ దఱి యయ్యెను, జలింప వల దింక మనకు శత్రులవలనన్. 93
వ. అనవుడు నాచార్యుం డయ్యర్థంబు గనుంగొని పార్థునకు సమయభంగంబువలని
సంకటంబు లే కునికికి మనంబునం బ్రియం బంది మొగంబునం దోఁపనీక పుయిలోట దక్కి
యిట్లనియె. 94
శా. సింగం బాఁకటితో గుహాంతరమునం జేడ్పాటుమై నుండి మా
తంగస్ఫూర్జితయూథదర్శనసము ద్యత్కోధమై వచ్చునో
జం గాంతారనివాసఖిన్నమతి న స్మత్సేనపై వీఁడె వ
చ్చెం గుంతీసుతమధ్యముండు సమర స్థేమాభిరామాకృతిన్. 95
ఉ. ఈతనితోడికయ్యమున కియ్యకొనం దగువార లస్మదీ
యాతతసేనలోఁ గలుగు టారయ సంశయ మెల్లభంగి గో
వ్రాతనివర్తనంబు సుక రంబ కిరీటి కితండు రుద్రునిం
బ్రీతునిఁ జేసె నా వినమె పెం పెసలారెడు బాహుసంపదన్. 96
వ. అనుపలుకు లాకర్ణించి కర్ణుండు కటకటంబడి కుంభసంభవున కి ట్లనియె. 97
ఉ. పాండవపక్షపాతమునఁ బల్కుదు నోరికి వచ్చినట్లు ని
న్నొం డన రామిఁజేసి యిది యొప్పునె కౌరవసేన కెల్ల నొ
క్కండవ మేటి వీబలము గర్వముఁ గుందఁగ నిట్లు శత్రుదో
శ్చండిమ కోహటించితి ని జంబునకున్ నరుఁ డింతయెక్కుడే. 98
ఆ. అతఁడు వచ్చెనేని న స్మచ్ఛిలీముఖ, పాతచలితహృదయ పద్ముఁ జేసి
వెగడుపఱిచి యో ధవీరుల కెల్ల ను,త్సవ మొనర్తు బాహు దర్ప మొప్ప. 99
వ. అనిన విని సుయోథనుండు రాధేయున కి ట్లనియె. 100
ఆ. తప్పఁ బలికి తీవు సెప్పెద విను మితఁ, డర్జునుండయేని నడవి కేఁగి
భ్రాతృయుతము గాఁగఁ బండ్రెండువత్సర,ములును నంద నిలువ వలయు మగుడ. 101
క. ఒరుఁ డయ్యెనేని మామక,శరాసనక్షిప్తదీప్త సాయకపంక్తిం
బరిమార్చెద వ్రేల్మిడి న, చ్చెరువుఁ బ్రమోదంబు నొంది సేనలు వొగడన్.
102
క. అనుపలుకులకును భీష్ముం,డును ద్రోణుఁడు ద్రోణసూనుఁ డును గృపుఁడును మే
లని యియ్యకొనిరి హృదయా,ననురూపములైన తెలివు లాస్యముఁ బొందన్. 103
అర్జునుఁడు శమీవృక్షనిక్షిప్తంబైనగాండీవంబు గొనుట.
వ. అట్టియెడ శమీవృక్షసమీపంబున నరదంబు నిలుపం బంచి పార్థుం డుత్తరున కి
ట్లనియె. 104
క. ఇన్నగమునందు గాండివ, మున్నది యది గాని మద్భు జోద్రేక విలా
సోన్నతి కోర్వవు పెద్దయు, నన్నువ లీ విండ్లు గుఱుచ లలఁతిబలంబుల్. 105
క. ఇవి నీతెగకొలఁదివి వీ,రవినోదమునప్పు డధిక రభసము లగుమ
ద్వివిధాటోపములకుఁ జా,లవు వి ల్లది నూఱువేల లా వరయంగన్. 106
క. వీనిఁ గొని గట్టిమైమఱు, వేనుంగును మఱియు నెట్టి వేనియుఁ దునియం
గా నేయ నగునె కైదువు, లేని యలవుకలిమి పోర లెస్సై యున్నే. 107
వ. కావున నిమ్మహీరుహం బెక్కి యమ్మహానీయచాపంబు దెచ్చి యిమ్ము ధర్మజ
భీమార్జుననకులసహదేవులు దమతమసమస్తాయుధంబులుఁ గూడం గట్టి యిందుఁ బెట్టినవా
రాకట్ట విడిచి యందు గాండీవంబు పుచ్చికొని తక్కటియవి యెప్పటి యట్ల బంధింపు
మని చెప్పి శవాకారంబున నున్నశస్త్రాస్త్రసంచయంబు సూపిన భూమింజయుం డతని కి
ట్లనియె. 108
క. పీనుఁగు నంటఁగ నగునే, భూనాథతనూజుఁ డనక పుయిలోడక న
న్నీనీచపుఁబనిఁ బనుపం,గా నీకుం దగునె పాప కర్మము గాదే. 109
వ. అనిన విని ధర్మనందనానుజుం డత్యాదరంబున. 110
ఆ. మనుజు లంట కుండ మఱువడఁ జేసిన, యస్త్రశస్త్రసంచ యంబుగాని
శవము గాదు మత్స్య జనపాలపుత్త్ర యే, నట్టిదైనఁ బనుతు నయ్య నిన్ను. 111
క. నమ్ముము కైదువుమో పగు, జమ్మి వెసం బ్రాఁకి విడిచి చాపము నా కం
దిమ్మనుడుఁ జేయునది లే, కమ్ముగ్ధుం డమ్మహీజ మలసత నెక్కెన్. 112
వ. ఇ ట్లుత్తరుండు సమారూఢశమీవృక్షుం డగుటయు నరదంబుపయి నిలుచుండి
పాండవమధ్యముండు వేవేగ విడువు మనవుడు నతండు నాయుధసంచయబంధం బెడలించిన. 113
క. మెఱసి యుదయించు గ్రహముల, తఱచుప్రభలఁ గ్రేణిసేసి దశదిశలం గ్రి
క్కిఱిసి వెడలె నావిండ్లన్, మెఱుఁగులు నృపతనయుదృ్లషు మిఱుమిట్లుగొనన్.
114
వ. అట్టియెడ నయ్యాయుధంబులు. 115
క. పెనుపాములచందంబున, నునికికి భయ మంది వడఁకు నుర్వీశసుతుం
గని తగుమాటలఁ గుంతీ,తనయుఁడు వెఱ వాపుటయు న తం డచలితుఁ డై. 116
వ. పొదువు విరియం దట్టి కనుంగొని నిరూపించి సారథీ యని సవ్యసాచిం బిలిచి
యి ట్లనియె. 117
క. ఇది యొకచాపము విస్మయ, మొదవించుచుఁ గొండచిలువ యొకొ నాఁదగి యు
న్నది ఖచితకనకకమలస,ముదయద్యుతిసముపగూహ నోజ్వ్జల మగుచున్. 118
వ. దీనిం బాండవులయం దెవ్వరు ధరియింతు రని మఱియు బహువిధంబు లగు నాయుధంబు
లుపలక్షించి వేఱువేఱు వానిచందంబు లుపన్యసించి యివి యెవ్య రెవ్వరి వని
యడిగిన నర్జునుం డి ట్లనియె. 119
తే. తొలుత నీవు న న్నడిగిన దొడ్డవిల్లు, గాండివము ఫల్గునున కేడు గడయు
నదియ
సమరమున దేవదానవ సమితి నైన, గెలుచు నశ్రమమున దాని వలన నతఁడు. 120
క. ఆద్యపురుషోపలాలిత, ముద్య్దోతితరోచిరుద్గ మోగ్రం బరిని
ర్భేద్యము దివ్యజనన మన,వద్యం బది కార్ముకైక వరము కుమారా. 121
వ. అమ్మహనీయచాపంబు బ్రహ్మ శతసహస్రవర్షంబులు ప్రజాపతి చతుష్షష్టిసహస్ర
వర్షంబులు నింద్రుండు పంచాశీతిహాయనంబులు సోముండు పంచశతాబ్దంబులు
వరుణుండుశతశరత్సమితియుఁ గ్రమంబునన్ ధరియించిరి వరుణుచేతనగ్నిదేవుఁడు
వేడుకపడి పుచ్చికొని పదంపడి యద్భుతకర్మంబునకు మెచ్చి వివ్వచ్చున కిచ్చె
నతండును నఱువదే నేండ్లు ధరియింపంగలవాఁ డి ట్లిది త్రిలోకపూజ్యమహిమ నొప్పు
చుండు. 122
సీ. నీలోత్పలచ్ఛాయ నెరసి సౌవర్ణ వృ, షావలి నొప్పుబా ణాసనంబుఁ
దాళప్రమాణసుం దరము నై భర్మశా,ఖా మృగాంచిత మగు కార్ముకంబుఁ
దావ్రకుశానల దీప్తాకృతియుఁ గన,త్కనకమత్స్యంబులుఁ గలుగుధనువు
మెఱుఁగాఱిసారంబు మెఱయఁ గాంచనమయా,రములశోభిల్లుచా పమునువరుసఁ
ఆ. బాండవాగ్రజుండుఁ బవనపుత్త్రుఁడు నకు,లుండు దదనుసంభ వుండుం బట్టు
నవి కుమార యగ్గ వాజినకోశమ,హాశరంబు పార్థు నదియ చూవె. 123
క. ఎద్దెసలం దనరుచులు స,ముద్దీప్తము లగుచు నుండ నుజ్వ్జల మగున
య్యుద్దండగదాదండము, పెద్దయు నెడ మెచ్చి పట్టు భీముఁడు పోరన్. 124
అర్జునుఁ డుత్తరునకుఁ ద న్నెఱింగించుట.
వ. అని చెప్పి మఱియు బాణకృపాణతనుత్రాణాదు లగువివిధసాధనంబులు వేఱువేఱ
నిరూపించి గ్రక్కున నెఱింగించె నప్పుడు మూఢాత్ముం డగునయ్యుత్తరుండు
పాండవోత్తము నెఱుంగమి ని ట్లనియె. 125
క. ఈయెడ నిట్లిమ్మహనీ,యాయుధములు వెట్టి యెచటి కరిగిరి మనకౌం
తేయులు బృహన్నలా తగ,నీయెఱిఁగినయంతవట్టు నిక్కము సెపుమా. 126
వ. అని సస్నేహంబును సగౌరవంబును సవిషాదంబునుంగా మఱియును. 127
క. ఏ నమ్మహానుభావుల, మేనల్లుఁడ వార లార్య మిత్త్రులు శత్రు
క్ష్మానాయకగర్వతమో, భానులు బంధుహితకార్య పరతంత్రాత్ముల్. 128
తే. అయ్యుధిష్ఠిరుం డెచ్చట నడఁగియున్న,వాఁడొ భీమునిపార్థుని వర్తనంబు
లెయ్యెడల నేమిచందంబు లయ్యెనక్క,టావిధాతృండ కవలెందు డాఁగిరొక్కొ. 129
క. భూపాలవల్లభాజన, దీపిక యనఁ జాలుద్రౌప దికి నెయ్యెడలం
దేపాటులు వాటిల్లెనొ, కాపురుషులవలన నిట్టి కాఱియ వుట్టెన్. 130
క. కపటద్యూత మొనర్చిన, నృపతియు దుర్యోధనాది నీచులవలఁ బా
ఱి పడియెఁ గడుఁ బెక్కిడుమల, రిపుమర్దనవీర్యభుజగ రిష్ఠుం డయ్యున్. 131
క. వినఁబడ రెచ్చోటను దమ, వినుతమహీరాజ్యమహిమ విడిచి చనుట నే
మని వినియెదనో నీచే, ననుడు నతం డిట్టు లనియె నాతనితోడన్. 132
వ. వారలకు వగవ వలవదు విధివశంబున వచ్చినయాపదకు నోర్చి బాస దప్పక తారును
బాంచాలియు నొక్కటఁ బండ్రెండేండ్లు వనంబున వసియించి పదు మూఁ డగునేఁ
డజ్ఞాతవాసంబు సలుపవలయుట నిట వచ్చిమనవీట నవ్యాపన్ను లై యున్నవారు వినుము
వారి నెఱింగించెద. 133
క. కంకుఁడు ధర్మసుతుఁడు వల, లాంకుఁడు భీముండు కవలు హయశిక్షకగో
కింకరులు సెప్పఁ దొడఁగితి, నింకఁ గొఱత వెట్ట నేల యే నర్జునుఁడన్. 134
తే. అధిపనందన మాలిని యనఁగఁ బరఁగు, కాంత ద్రౌపది దానికై కాదె సింహ
బలునిఁదమ్ముల గంధర్వ పతులు సంపి, రనఁగఁ జంపె మహోగ్రత ననిలసుతుఁడు. 135
వ. అనిన విని భూమింజయుండు సంభ్రమాశ్చర్యసంశయంబులు మనంబున ముప్పిరి గొనం
దప్పక చూచి సవ్యసాచికి వెండియు ని ట్లనియె. 136
క. చిరకీర్తిప్రియుఁ డగున, న్నరునకుఁ బది గలవు భవ్య నామములు మనో
హరముగ నవి సెపుమా యొం,డరయక యే నమ్మోదను బృ హన్నల నిన్నున్. 137
వ. అనుడు నతండు స స్మితాననుం డగుచు నర్జునుండు ఫల్గునుండు పార్థుండు
కిరీటి శ్వేతవాహనుండు బీభత్సుండు విజయుండు జిష్ణుండు సవ్యసాచి ధనంజయుండు
ననునివి పదియును నాపే ళ్ళనవుడు నుత్తరుండు పాండవమధ్యమున కి ట్లనియె. 138
క. ఏమేమికతంబున నీ,నామంబులు సంభవిల్లె నరునకు నవి చే
తోమోదంబుగఁ జెప్పుము, నీమదిఁ దత్తద్విధంబు నిశ్చిత మేనిన్. 139
వ. అనుటయు నట్ల చేయుదు నని యతం డి ట్లనియె. 140
ఆ. ధరణి యెల్ల గెలిచి తగ ధనంబులు గొని,యునికి నే ధనంజ యుండ నైతి
నెట్టివారి నైన నెదిరినఁ బోర జ,యంబుఁ గొనుట విజయుఁ డండ్రు నన్ను.
141
తే. తెలుపు లగు వాహనములు నా తేర సమర
భూములం దెప్డు నియతిమైఁ బూన్కిఁజేసి
శ్వేతవాహననామవి ఖ్యాతి నాకు
సకలజనసమ్మతంబుగ సంభవించె. 142
చ. రవి యుదయించినట్లు సమ రంబున నాతలమీఁదఁ గాంతిమూ
ర్తి వెలుఁగు నింద్రుఁ డిచ్చినకి రీట మభేద్యమహోగ్రసుస్థిర
త్వవిభవరూఢిమై జనులు దానన నన్నుఁ గిరీటినామసం
స్తవనవిశేషపాత్రముగ సమ్మతిఁ జేసిరి మాత్స్యనందనా. 143
తే. వీరులకుఁ జూడ బీభత్స విధము గలుగు నట్టి కార్యంబు సేఁతకు నెట్టిసమర
భంగులను దడఁబడక బీభత్స సేయ, దాన బీభత్సుఁ డనునభి ధాన మయ్యె. 144
క. భండనమున నిరుగేలను, గాండీవము దివియ నేర్పు గలిగిన నం దు
ద్దండ మగుసవ్యకరముప్ర,చండతఁ బరఁగుదును సవ్య సాచి యనంగన్. 145
తే. ధరణి దుర్లభ మగునవ దాతవర్ణ, మారఁ గలుగుట నర్జునుఁ డండ్రు నన్ను
ఫల్గునాహ్వయ ముత్తరఫల్గునీవి,శిష్టకాలసంజననతఁ జేసి కలిగె. 146
క. అనిమొన మార్కొని వ్రణ మేఁ, గనుఁగొన ధర్మజునిమేనఁ గావింపఁగ న
య్యనిమిషులుం జాల రెవ్వరుఁ, జెనకినఁ బరిమార్తుఁ గాన జిష్ణుఁడ నైతిన్.
147
క. పృథ యనుపేరు మదంబకుఁ, బ్రథితంబై యునికిఁ జేసి పార్థుఁడ నైతిన్
వృథయుఁగఁ బలుకుదునే యవి, తథవచనుం డైనధర్మ తనయుననుజుఁడన్. 148
వ. ఈ పదిపేళ్లును నివి కారణంబులుగాఁ బ్రకాశంబు లయ్యె సకలసురనికరంబు
లడ్డుపడినం బుండరీకాక్షసహాయుండ నై ఖాండవం బేర్చినప్పుడు మెచ్చి
భద్రమూర్తు లైనరుద్రవిరించులు సన్నిధిసేసినం బెన్నిధి గన్నపేదచందంబున సం
భ్రమించునాకుం గరుణించి కృష్ణుం డనునేకాదశనామంబును నప్రతిహత బాణంబులు
నొసంగిరి వారలయనుమతి నింద్రాదు లయినవిబుధులును వివిధంబు లగు
దివ్యాస్త్రంబు లిచ్చిరి పదంపడి గీర్వాణులకు నోర్వరానియట్టివారి వరదాన
గర్వితుల నివాతకవచు లనియెడుదైతేయుల మాతలి సారథికంబగు నైంద్రస్యందనం
బెక్కి యొక్కండన మూఁడుకోట్ల నిర్జించితి దుర్జయులగుహిరణ్యపురనివాసుల
నఱువదివేవుర దేవారాతుల వారాశితీరంబునం బరిమార్చితి నప్పుడు ప్రీతుండై కదా
గిరిభేది కిరీటం బొసంగె దేవసంఘంబు శంఖం బిచ్చె నది గతంబుగా నచ్చిందంబు
దేవదత్తం బనం బరఁగె మఱియు నెయ్యెడల నెవ్వరు దొడరినం బొలివోనిబలిమికలిమి
వెలుంగుదు గాంధారీనందనుండు గంధర్వరాజుచేతం బట్టువడినయప్పుడు పదునాలుగువేల
గంధర్వుల జయించి యతని విడిపించితి నీ వోడకు మీకూడినకురుబలంబుల గెలిచి
కర్ణగాంగేయకృప ద్రోణద్రౌణి దుర్యోధనులు గనుంగొనుచుండఁ గదుపులం
గ్రమ్మఱించెద నని సత్వరంబుగాఁ జెప్పిన విని యుత్తరుండు చిత్తంబున
నద్భుతహర్షంబులు వొదువ మ్రాను డిగ్గ నుఱికి సర్వాంగసంగతోర్వీతలం
బగుదండప్రణామం బాచరించి చేతులు మోగిచి నిలిచి యి ట్లనియె. 149
ఉత్తరుఁడు బృహన్నల నర్జునుఁగా నెఱుంగుట.
ఉ. బాహుసమగ్రశత్రుమద భంజనశౌర్య సమస్తలోకచే
తోహరమూర్తి నీ విటులు దోఁచుట నాకుఁ బ్రసన్నవిస్ఫుర
ద్దేహముతోడ భాగ్యమయ దేవత సన్నిధిసేఁత గాదె స
మ్మోహము వాసెఁ జిత్తము ప్ర మోదరసత్వముఁ బొంది పొంగెడున్. 150
క. ని న్నెఱుఁగక యే నేమే, నన్నపలుకు లెల్ల మఱచి యాశ్రితరక్షా
సన్నద్ధభావ మేర్పడ, నన్నుం గృపఁ జూడవే స నాథుఁడ నగుదున్. 151
క. అన వినుచుఁ దేరు డిగి గ్ర, క్కునఁ గౌఁగిటఁ జేర్చె విరటు కొడుకును
గుంతీ
తనయుఁడు సమ్మదమునఁ దన, కనుఁగవఁ గడు నశ్రువారి గడలుకొనంగన్. 152
వ. ఇట్లు సమాలింగింతుం డై. 153
చ. మనముకలంక దేఱె రిపు మర్దనవిక్రమ యెక్కు తేరు నీ
ఘనభుజశక్తిప్రాపున న ఖండితశౌర్యమహోన్నతుండ నై
యనిమొన సారధిత్వముమ హాత్వ్తము వైరులు మెచ్చఁ జూపెదన్
ననుఁ బనిగొమ్ము లెమ్ము కురు నాథు నదల్పు మరల్పు గోవులన్. 154
క. మనమునఁ గోరుదు నేన, ర్జునునకు సమరమున రథ్య చోదకభావం
బునఁ బనిసేయ వలయు నని, యనిశము విధికరుణ నాకు నది సిద్ధించెన్. 155
వ. అని పలుకునుత్తరు నత్యాదరంబునం జూచి సవ్యసాచి యతని కి ట్లనియె. 156
మ. ప్రియ మక్షీణము నాకు నీదెస మదిన్ భీతిప్రదోద్వేగసం
శయముల్ సేరఁగనీను నీకు ఘనర క్షాకల్పనాబుద్ధిని
శ్చయసంపాదిని నాదుదృష్టి నిను న శ్వవ్రాతముం జోఁక గా
లియు రానీను దృణీకరింపు రిపుదో ర్లీలాసముల్లాసమున్. 157
వ. అనిన విని భూమింజయుండు సవినయంబుగా ని ట్లనియె. 158
క. నిను నర్జును డని యెఱిం,గినయంతన పాసె నెల్ల కిల్బిషములు నీ
తను వేల షండభావం, బునఁ బొందెనొ యెఱుఁగ వలయుఁ బుంస్వ్తాభరణా. 159
చ. అనవుడు నాతఁ డి ట్లను మ దగ్రజుపంపున బ్రహ్మచర్యవ
ర్తనకయి పూర్వశాపవిహి తం బగురూపముఁదాల్చి యేకహా
యనపరిపాలనీయ మగు నట్టివ్రతంబు సమాప్తిఁ బొందఁ జ
ల్పినజతనంబు లోకులకుఁ బేడితనం బయి తోఁచె నిమ్మెయిన్. 160
వ. అదియును నిట మీఁద లే దనినఁ బ్రమోదమాన మానసుం డయి మత్స్యపతి సూనుండు
పాండుసూనున కి ట్లనియె. 161
ఆ. ఇట్లు దెలియ జెప్పు టెల్ల నాదెస దయ, పెంపుతోడికూర్మి పేర్మిఁ గాదె
యింక సురల కైన శంకింతునే భవ, ద్బాహువప్రగుప్తి బలుపు గలుగ. 162
వ. నాకుం బని యెయ్యది పనుపు మనిన నతండును గాండీవంబును గాంచనపుంఖంబు లగు
బాణంబులతూణీరయుగళంబును మదీయతనుత్రాణకృపాణంబులును బుచ్చికొని తక్కినవాని
నెప్పటిభంగిన కట్టిపెట్టి ర మ్మని నియోగించిన నాతండు నట్ల చేయుటయు
నమ్మహాత్ముండు నియతాత్ముం డయి యధిదేవతలకుం బ్రణమిల్లి భక్తితోడ
దివ్యకోదండాదు లగుసాధనంబులు గైకొని సవిశేషస్ఫూర్తి యగు మూర్తి
నత్యంతదర్శనీయత్వంబు నొంది. 163
క. బలరిపుఁ డిచ్చినకుండల,ములు నుష్ణీషంబుఁ జిత్త మున భక్తిమెయిం
దలఁప నవి వచ్చె వెండ్రుక, లలవడఁగాఁ బాచి ముడిచె నమర దృఢముగన్. 164
క. తలచుట్టు చుట్టెఁ గుండల,ములు పెట్టెను ద్రిండు గాఢ ముగఁ గట్టెఁ గరం
బులవలయంబులు గనుఁగొని, యెలనవ్వొలయంగ నెక్కె నేడ్తెఱ రథమున్. 165
వ. అట్టియెడ వరదానమహానుభావంబునంజేసి. 166
క. పెట్టక కట్టక మౌళిం, బుట్టినక్రియ దీధితులు న భోభాగంబున్
ముట్టి వెలుంగఁగ నింద్రుని,పట్టికిరీటంబు వొలిచెఁ బ్రస్ఫురితం బై.
167
వ. ఇవ్విధంబున సన్నద్ధుం డై యతిరథశ్రేష్ఠుండు రథం బెక్కియం దాయుధంబులు
పదిలంబుగా నిడి తనుత్రాణతలత్రాణంబులు దాల్చి కవదొనలం బూని గాండీవంబుఁ
బుచ్చికొని యెక్కువెట్టి ముష్టి నలవరించి గుణధ్వని సేసిన. 168
తే. పక్షిమృగజాతు లెల్లను బ్రమసియిట్టు, నట్టుఁ గలగొనఁ జెదరె వృ
క్షాళియదరెఁ
గురుబలంబును బెదరెనం బరముదిశలు, బూరటిల్లంగఁదొడఁగెఁ ద దారవమున. 169
వ. తదనంతరంబ యగ్నిదేవుం దలంచిన నతండును దనవరంబున మున్న కలిగి
విశ్వకర్మనిర్మితంబును మాయామయంబును వానరాకారంబును నగుమహోగ్ర కేతనంబును
దదాశ్రితంబు లైన వికృతాభీలనానావిధభూతంబులనుం బుత్తెంచిన నుదాత్తచిత్తుం
డయి యుత్తరుసింహపతాక శమీవృక్షంబునం బెట్టించి నిజధ్వజంబు రథంబునం
గట్టించి దివ్యంబు గావున దేవదత్తంబు చిత్తజ్ఞత్వంబున సన్నిధి సేసిన
సవినయంబుగాఁ గైకొనియె నక్కుమారుండును నాయితంబై నొగ లెక్కి పగ్గంబు
లమర్చికొని యగ్గలికతోడం దురంగంబులయంగంబులు దొడయుచు వానిజవసత్వంబులు
వేఱువేఱ వర్ణించిన. 170
అర్జునుఁ డుత్తరసారథికం బైన రథం బెక్కి దేవదత్తంబు పూరించుట.
చ. తడ వగుదెంచె జమ్మికిఁ బ్ర దక్షిణవృత్తిగఁ దేరు వోవని
మ్మెడ గలుగంగఁ బోయెఁ బసు లిప్పుడ కూడుద మన్న నాతఁడున్
నడపఁ దొడంగుడున్ మనము నన్ రణకౌతుక ముల్లసిల్లఁగాఁ
బిడుగులపిండు బి ట్టులియు పెల్లునఁ బార్థుఁడు శంఖ మొత్తినన్. 171
మ. కలఁగెం దోయధిసప్తకంబు గిరివ ర్గం బెల్ల నూటాడె సం
చలతం బొందె వసుంధరావలయ మా శాచక్ర మల్లాడెఁ గొం
దల మందెం ద్రిదశేంద్రుపట్టణము పా తాళంబు ఘూర్ణిల్లె నా
కుల మయ్యెన్ గ్రహతారకాకులము సం క్షోభించె నవ్వేధయున్. 172
తే. అపుడు నిశ్చేష్టితంబులై హయములవనిఁ,జాఁపకట్టుగఁ బడియె మ
త్స్యక్షితీశ
నందనుండునునొగలపైమ్రందినట్లు, మ్రొగ్గతిలఁజాఁగిబలితంపు మూర్ఛఁబొందె. 173
చ. కనుఁగొని ఫల్గునుండు దుర గంబులవాగెలు వట్టి యెత్తి త
త్తనువులు నూల్కొనన్ నివిరి తత్పరతం దగ మత్స్యభూమిభృ
త్తనయుని నూఁది పట్టి వికృ తం బగురూపము చక్కఁజేసి నె
మ్మన మొకభంగిఁ దేర్చి గరి మంబుఁగఁ గౌఁగిటఁ జేర్చి యి ట్లనున్. 174
తే. శంఖభేరీరవంబులు సామజముల, బృంహితంబులు వింతలే పృథులసైన్య
పరిచయోదాత్తు లగునర పాలసుతుల, కెలమిఁ బొందుము దీనికి నింత యేల. 175
చ. అనవుడు మత్స్యరాజుసుతుఁ డాతని కి ట్లనుఁ దొల్లి శంఖని
స్వనములు విందు భేరులర వంబులు విందుఁ గరీంద్ర బృంహిత
ధ్వనులును విందు నద్భుతవి ధంబుగ ని ట్లవి యెల్లఁ జిత్తమో
హన మొనరింపఁజాలునె మ హానినదం బిది యోర్వ వచ్చునే. 176
చ. చెవు లవిలసెన్ దిశల్ దిరిగెఁ జిత్తము నీ ఱయిపోయె నాకు నీ
రవమున నిమ్మహోగ్రకపి రాజపతాకయుఁ జూడ్కిఁ జీఁకటుల్
గవియఁగఁ గ్రాలెడున్ భవద ఖండితతేజము పర్వి యాత్మకున్
వివశతఁ జేయుచున్నయది విహ్వలభావము మాన నేర్చునే. 177
క. అన విని తగుమాటల నా,తనికొందలపాటు పాండు తనయుండు క్రమం
బున డిందుపఱిచి యరదము, సనఁగా నెఱిఁగించి పట్టె శంఖము మఱియున్. 178
వ. ఇతైఱంగున నయ్యుత్తరకుమారు ధీరుంగావించికొని పాండవవీరుండు రథనేమి
నిస్వనజ్యానాదమేదురం బగుశంఖారవంబు సెలంగ నడచుసమయంబున నాచార్యుండు
దుర్యోధనున కిట్లనియె. 179
సీ. శ్రవణపుటంబులు వ్రయ్యంగఁ దాఁకి సం, క్షోభంబు గావించె గుణముమ్రోఁత
బ్రహ్మాండభాండంబు పగిలించి భూతని,శ్చైతన్య మొనరించె శంఖరవము
గగనభాగం బెల్లఁ గప్పి క్రాలుచు బెగ, డడరించె నుగ్రంపుఁ బడగపఱవు
మిఱుమిట్లు గొని చూడ్కి పఱివోవ వెలిఁగిప,రిభ్రాంతి సేసెఁ గి రీటకాంతి
తే. తెల్ల మిది గాండివంబును దేవదత్త,మును గపిధ్వజమును వాస వునివరమునఁ
గన్నమకుటంబు నగు వేఱ కొన్నియైన,నుజ్వ్జలాద్భుతభంగులై యున్నెయిట్లు. 180
ఉ. అచ్చెరు వైనవిక్రమము నగ్గలికన్ సమరంబు గోరి యీ
వచ్చుచు నున్నవాఁడు బల వద్రిపుభీషణ బాహుఁ డైనవి
వ్వచ్చుఁడ యింక మిన్నక వి వాదము సేసినఁ బోవ దియ్యెడం
బొచ్చెము లేనిబల్మగలఁ బోరి కమర్పుము దర్ప మేర్పడన్. 181
వ. అని కృపాశ్వత్థామాదియోధముఖ్యుల నవలోకించి. 182
క. మనమొనల దుర్నిమిత్తము, లనేకములు వుట్టఁ దొడఁగె న ట్లగుట జయం
బనుమానం బొకకార్యము, వినుఁడా మీకెల్లఁ జూడ వెర వగునేనిన్. 183
ఉ. ముందర రాజుఁ బుచ్చి బల ముల్ గలయంబడి గోవ్రజంబులన్
దందడి వెట్ట కుండఁ బిఱుఁ దన్ నడపింపఁగఁ బంచి గట్టిమై
నందఱు నింతకున్ వెనుక యై మొన లేర్చి చనంగ నెప్డు సం
క్రందనసూతి డగ్గఱియెఁ గయ్యము సేయుట కప్పు డి మ్మగున్. 184
వ. అనిన విని సుయోధనుండు భీష్మ కృప కర్ణ వికర్ణులదెసం గనుంగొని మున్న
చెప్పితిన కాదె జూదంబునం బరాజయం బొంది పాండునందనులు పండ్రెండు వత్సరంబులు
వనంబున వసియింపను బదుమూఁడగునేఁడు జనపదంబున మన మెఱుంగ కుండఁ జరియింపనుం
బూని కాదె భూమి వెలువడిరి యీపదుమూఁడవ యేఁటికొఱంత గలుగం బార్థుండు ద
న్నెఱింగించికొనియెనేని నెప్పటియట్ల వన వాసంబునకుం జన వలయు నిది మనము
మోహంబునం గానమి నొండె వారు లోభంబున వచ్చుట నొండె నగుం గావున
నెక్కువదక్కువలు నిరూపించి భీష్ములు దీని నిశ్చయింప న్హరులు
రిత్తయుత్తరుండుకాక గాండీవియు నగుట మనకార్యంబు సఫలంబు సుశర్మ నక్కడ
గోవులం బట్టం బనిచి యిక్కడ మనమును పసులం బట్టుట మత్స్యనగరంబునం గౌంతేయు
లున్నవా రని శంకించి వారలు గూయి వచ్చినం గనుటకుం గాదె యిట్లు నిశ్చయించి
చేసినపనికి నిపుడు విచారం బేల యని పలికి వెండియు ని ట్లనియె. 185
ఉ. అర్జునుఁ డైన నేమి సుర లైనను నే మగు విద్విషచ్చిరో
పార్జిత మైనగోధనముఁ బట్టితి మెవ్వరు వచ్చిరేని వి
స్ఫూర్జితబాహుసంపదలు సూపుద మొండొరు మీఱి నిర్మలా
త్యూర్జితకీర్తి కారణర ణోద్ధతి వెల్వెలఁబాఱ నేటికిన్. 186
చ. మనసుల నూలుకొల్పి యను మానము లెల్లను బాచి యేచి వా
హనములు నాయుధంబులును నాయిత మయ్యెడుభంగిఁ జేయుచున్
మొనలకు హెచ్చుగా మనము మున్ను గడంగినఁగాక శత్రులం
గనుఁగొనియిట్టు లొండొరుమొ గంబులు సూచుచు నున్నఁ బోవునే. 187
దుర్యోధనుఁడు ద్రోణాచార్యుల నధిక్షేపించుట.
ఆ. హరులహేషితములు ననుకూలవాయుసం,చారములును మనకు జయముకలిమిఁ
దెలుపుచున్నయవి యు ధిష్ఠిరానుజుఁ డొక్కఁ, డీబలంబు గెలువ నెట్లు నేర్చు.
188
క. ఎవ్వరు వినినను దీనికి, నవ్వుదు రని యెఱుఁగఁ డకట నాయెదురెదురన్
వివ్వచ్చుఁ జూపి సేనలు,గ్రొవ్వఱఁ బలుపలుకు లిట్లు ద్రోణుఁడు వలికెన్.
189
తే. రోష మొండెను రాజ్యాభి లాష మొండెఁ,గాక యీతనిరాకకుఁ గారణంబు
పెఱ యెఱుంగమ యెదిరిని బెద్దఁ జేసి, పూని వందివిధంబునఁ బొగడనేల. 190
వ. ఆచార్యులైనవారలు కార్యంబు దవ్వులం గనియెడువారుగాన కయ్యంబు తెఱంగు
వారల నడుగ వలవదు బుద్ధిమంతు లిండ్లకడనుండి భోజనావసరంబుల నాయుధ
శ్రమసమయంబుల నీతిశాస్త్రగోష్ఠికాలంబుల నుచితాలాపంబులు వలుకుదురు గాని
పోట్లాడెడువారు గారు వారిం గలనం గలసి నిలువ నీక పిఱింది దెస నిలిపినను
నాకువారు విజయంబు గోరుచుండుట లెస్సయనినవిని యశ్వత్థామయతని కి ట్లనియె.
191
ఉ. కావలివారిఁ దోలి యెస కంబున గోవులఁ బట్టికొంటి నం
చీవెడమాట లేల ధర ణీశ్వరయింతకు మున్న వీటికిం
బోవవు శత్రునే పుడిపి పోయెడువాఁడవు గావు నీవు సై
న్యావలి యైనఁ జేడ్పడక యాతల కెయ్దుట లేదునేనియున్. 192
క. సమరమున గెల్చి యొరురా, జ్యము గొనియును సుజనుఁ డిట్టు లాడఁడు సిరి జూ
దమునఁ గొని రజ్జు లేటికి, సమయం బరుదెంచెఁ దొంటి చందము గలదే. 193
ఉ. పాండవవీరులం గలన బాహుబలంబున నోర్చియే సము
ద్దండత నీవు దొల్లి ద్రుప దక్షితిపాత్మజఁ గొల్వులోనికిం
దెం డని పుచ్చు తద్దెసకుఁ దెచ్చుట సౌబలునీతిఁ గాదె యా
తండ మరల్చుఁగాక సము దగ్రత వచ్చువిరోధి నిప్పుడున్. 194
వ. అబ్భంగి నవమానింపంబడినవాఁడుగావున ధార్తరాష్ట్రకులధూమకేతువగుకపికేతువు
దోఁచె నీకు దుర్మదంబున ద్రోణాచార్యుల నధిక్షేపింప వచ్చు నంతియ కాక
దేవదానవుల కయినను దుర్జయుం డగునర్జునునకుం దలసూప వచ్చునే నయవిక్రమంబుల
నతిలోకుం డగునతని నెవ్వరి కేనియుం బొగడ వలయు ననినం బుత్త్రనిర్విశేషుం
డగునిజప్రియశిష్యుని నగ్గించుట గురునకుం గొఱంతయె యింక సిగ్గు మాలి రణంబు
సేసెనేనియు ద్రోణుండ చేయుం గాని యే నిట్టిదాని కోర్వ నదియునుంగాక. 195
క. ప్రళయాంతకుండు బడబా,నలమును మృత్యువును నెదిరి నం గొఱఁతవడన్
నిలిపినను నిలుపు మార్కొని, చెలఁగిన నరుశరము లనవ శేషము సేయున్. 196
ఆ. కుటిలబుద్ధు లిచటఁ గొనవు నెట్టన ఘన,దోర్బలంబు మెఱసి తొడరవలయు
నతఁడు గాండీవమున నడ్డసాళులు వైవఁ, డురుల నంపవాన గురియుఁ గాని. 197
క. విను మట్టులు గా కున్నం, దనగోవులవెనుక మత్స్య ధరణీశుఁడు వ
చ్చిన మార్కొందుము నరుఁ డే,పున ముట్టిన నతనిపొంతఁ బోదుమె యధిపా. 198
వ. అనిన విని రాధేయుండు సక్రోధుం డై యోధవీరలోకంబు నాలోకించి. 199
చ. వడిగొని గోగణంబు బొదు వం బఱతెంచితి రెల్లవారు ము
న్నొడఁబడి పాండునందనుల యున్నెడ యిమ్మెయిఁ గాన వేఁడి యి
ప్పుడ నరుఁ గాంచి మీ రతని పోటు నుతించుచు భీతి నిట్లు వా
విడిచి యనేకభంగిఁ బృథి వీపతి వీఱిఁడిఁ జేయు టొప్పునే. 200
చ. వెఱచితిరేని నిల్వుఁ డొక వీరున కొక్కఁడచాలుఁ గాక యెం
దఱు వలయుం గపిధ్వజము దవ్వుల వ్రేల్మిడిఁ ద్రుంచివైచెదం
బఱపెదఁ దత్పిశాచముల భగ్నము సేసెదఁ దేరు సారథిన్
నెఱఁకులు నొంచెదం బొదులు నించెద నర్జునుగాత్రశాలలోన్. 201
శా. జ్యాఘోషం బతిభీషణం బయి దిశా చక్రంబు నిండన్ శర
వ్యాఫూతంబున శాత్రవుండు వికల స్వాంతుండు గా నారద
శ్లాఫూపాత్రము నై యనర్గళభుజా సంరంభతన్ రౌద్రరే
ఖఘోరాకృతి యేనచూపెద నశం కం జూడుఁడీ యేర్పడన్. 202
క. క్రోధజ్వాలలు నిగుడ వి,రోధిబలేంధనముఁ బొదువు క్రూరతమై దు
స్సాధ మగునర్జునాగ్నిని, సాధించెద నేన పూని శరవర్షమునన్. 203
వ. పాండవమధ్యముండు పదుమూఁడువత్సరంబులు పూఁచిపట్టి కయ్యంబునకువచ్చె
నతనిలావును బీరంబును లోకంబునకు నెక్కి యున్నయవి యేనును గురుసేన యందు
శక్తిశౌర్యంబులు గలవాఁడనపోలె వర్తించెదం గావున నేమిరువురము నొండొరులకు
బాహుబలవిలాసంబును విక్రమక్రీడాకౌశలంబును బ్రకటించుట యుచితంబు గాదె యని
వెండియు ని ట్లనియె. 204
సీ. అనుదినంబును నంత కంతకుఁ బెరిఁగెడి,యధిపతిమన్నన యప్పు దీర్ప
నర్జును నోర్చెద ననిలోన నే నని, యతనితోఁ బలికిన ప్రతిన నెఱపఁ
గర్ణార్జునులయందు ఘనుఁడెవ్వఁడగునొక్కొ, యనుజనంబులసంది యంబుమాన్ప
జమదగ్నిసుతకృపా శ్రయమునఁ బడసిన, విలువిద్యకలరూపు వెలయఁజేయఁ
ఆ. గనుట నేఁడు పుణ్య దిన మయ్యె నాకు మీ, కెల్లఁ బోరు సూడ నిష్టమేనిఁ
జూడుఁ డట్లు గాక వేడుక లేదేని, సంతసమునఁ బసుల జాడఁ బొండు. 205
వ. అనిన నమ్మాటలు విని కృపాచార్యుం డతని కి ట్లనియె. 206
ఆ. కయ్యమునక యెపుడుఁ గాలుద్రవ్వుదు కార్య,గతికిఁజొరవు నీతి యుతులు సమర
హత మసాధనముగ నాడుదు రర్థసం,సిద్ధిఁ బొందుతెఱఁగు సేయునెడల. 207
క. అగు దేశకాలబలయుత,ముగఁ జేసినపోర నర్థ ములు మోఱకు లై
తెగఁబాఱి తమ్ము నెదిరిని, వగవక తొడరుటలఁ గీడు వర్తిల్లుఁ దుదిన్. 208
వ. అక్కిరీటి యొక్కరుండ కాఁడె యని తలంతుమేని. 209
సీ. శక్రాదిసురులతో సంగ్రామ మొనరించి, ఖాండవం బేర్చె నొ క్కరుఁడ కాఁడె
యాదవబల మెల్ల నాఁగఁ ద్రోచి సుభద్రఁ,గడిమిమైఁ దెచ్చెనొ క్కరుఁడ కాఁడె
దిగ్విజయంబునఁ దేజంబు సేసె ని,క్కురువంశమునకు నొ క్కరుఁడ కాఁడె
బలముతో గంధర్వ పతి నోర్చి విడిపించెఁ, గౌరవేశ్వరుని నొ క్కరుఁడ కాఁడె
ఆ. యని నివాతకవచు లనుదానవుల నాతఁ,డొక్కరుండ కాఁడె యుక్కు మడఁచె
నమరులకు నజేయు లగుకాలకేయుల, నొక్కరుండ కాఁడె యొడిచెఁ గర్ణ. 210
క. భూవరు లెల్లను నొక్కట, ద్రోవదికై తొడరి యతని తోఁ బెనఁగి కడుం
జేవ సెడి పోవునప్పుడు, నీ వచ్చటఁ గలవొ లేవొ నిక్కము సెపుమా. 211
శా. కుంతీనందను లొక్కఁ డొక్కఁడ రిపు క్షోభంబు సంధిల్ల దు
ర్దాంతస్వైరపరాక్రమంబులు మహో త్సాహంబునం జేసి ర
త్యంతోదగ్రతఁ బల్కె దీ విచట బా హాశక్తి యిమ్మేదినీ
కాంతుం డియ్యకొనంగఁ బూనితి వృథా గర్వంబు నీ కేటికిన్. 212
తే. ఏచి మున్నీరు సేయీఁత నీఁద నగ్ని, నుఱుక వాసుకికోఱలు వెఱుకఁ కడఁగి
నట్లుగాదె రాధేయ నీ వర్జునునకుఁ,బోర నెక్కటి మార్కొనఁ బూను టరయ. 213
క. బలుగాలిఁ బేర్చుదావా,నల మొక్కరుఁ డార్పఁ బోయి నను దీఱునె నీ
చల ముడుగు సాహసమునం, గలదే మే లెట్లు నధిపుఁ గావఁగ వలదే. 214
తే. కురువిభుండును భీష్ముండు గురుఁడుగురుత,నూభవుండునునీవు నే నును
గడంగి
కూడుకొనితాఁకుదముగాక క్రీడితోడ,నొంటిమార్కొన వశమె ము క్కంటికైన. 215
కర్ణుఁడు కృపాచార్యు నధిక్షేపించి పలుకుట.
క. అని పలికిన సంరంభం,బున నినసుతుఁ డిట్టు లను రి పులయెడఁ జిత్తం
బున నీవు ప్రియము గలుగుటఁ, గనికని నినుఁ దోడు పిలువఁ గాఁ బతి బేలే. 216
క. ఏలినవానిధనంబులు, బాలురు బంధువులుఁ దారు బ్రదికినదినముల్
వ్రేలారిచి తిం డ్రాతని,యోలము గని పిదప భీతి నొదుఁగుదు రాజిన్. 217
క. జన్నములు సేయునెడఁ బ,క్వాన్నంబులు గుడుచు చుండు మధిపతి నిన్నున్
జన్నియ విడిచె రణముతఱి, మిన్నక కినువడక పొమ్ము మీగృహమునకున్. 218
తే. ఏను విల్లందుకొనిన నీ రేడుభువన,ములును వడవడవడఁకు నా యలఘుబాహు
బలముఁ దలఁపక పలికితి పార్థుఁ డనఁగ, నెంతవాఁడొక్కరథికున కింతయేల. 219
వ. అనియె నిత్తెఱంగున నందఱుఁ బలుకుపలుకు లెల్ల వినుచు గాంగేయుండు కౌర
వేశ్వరు నుద్దేశించి ధర్మార్థసంగతంబును సువిహితంబునుగా
నిట్లనుద్రోణాచార్యుండు నీతిపథంబునం బలికె నాచార్యతనయువచనంబు లుచితంబులు
కృపాచార్యుం డాడినచందంబును దెఱంగు వడియున్నయది మన్నన గలమానిసి యగుట నంగ
రాజునకు సంగరపాటవంబుమాటలు దగుం గాక మాన్యుల నధఃకరింప నగునే యని వెండియు.
220
ఆ. నేల ప్రొద్దెఱింగి చాలుమానిసి రణో,ద్యమ మొనర్చి కాక తగినవారి
చెవికిఁ జేఁదు గాఁగ నవమానవాక్యంబు, లుడుగ కిట్లు వలుకు టొప్పు
నెట్లు. 221
క. బీరము లావును మిగులఁగ, వైరులు దఱి యైనఁ దొడర వచ్చినచోటన్
దూరమున వెరవుతోడివి,చారము గలుగు టిది దగదె సద్బుద్ధులకున్. 222
ఆ. అరులగుణములైన నగ్గింతు రెప్పుడుఁ, గలయ బెరసినపుడు గలితనంబు
మెఱయుదురు మహాత్ము లెఱుఁగఁడు తుదిమొద, లెట్టివారి నితఁడు బెట్టుపలుకు.
223
వ. ఆచార్యులైనవారలు పూజావాక్యంబుల క్హరులుగాక గ్హరించుటకు విషయంబె
యనుచుఁ గృపాశ్వత్థామలకరంబులకు నిజపాణిపుటంబులు సాఁచి యిట్లనుఁ బని
సాలినంత గలదు వివ్వచ్చుండు వచ్చుచున్నవాఁడు విరోధంబునకు సమయంబు గాదు మన
మందఱముం గూడికొని కయ్యంబు సేయుదము బలవద్వ్యసనంబు నందు భేదంబు గలుగు
టొప్పదని బుధులు సెప్పుదురు వేదంబు లొక్కవలనను ధనుర్వేదంబొక్కవలనను
గలమీయట్టి మహానుభావులెందునుం గలరె కురుబలంబునకొకటి పుట్టినం బ్రసిద్ధులరు
గావున నది మీతలన నిలుచు నట్లగుటంజేసి. 224
క. క్షమియింప వలయు నొకఁ డెఱుఁ,గమి నేమే నన్న నంతఁ గటకటఁబడి భూ
రమణునికార్యస్థితి చి,త్తములం దెడ సేయునట్టి తరమే మీరల్. 225
వ. అనిన విని వార లి ట్లనిరి. 226
క. క్షమియింప నెవ్వరము భూ,రమణునికార్యమున కెవ్వ రము ద్రోణులచి
త్తము శాంతి వొందఁజేయుట, మముఁ దెలుచుట యిట్టులేల మాకొలఁదులకున్. 227
వ. అనిన విని గాంగేయకర్ణులం గూర్చికొని కురుపతి గురునిం బ్రార్థించి
యశ్వత్థామను వేఁడికొని కృపాచార్యులం దేర్చినం బ్రసన్నుం డయియోధవీరులం
గలయం గనుంగొని ద్రోణాచార్యుం డి ట్లనియె. 228
తే. అలుక భీష్మునిపలుకుల యపుడ పోయె, మీఁదికార్యంబు నడపుఁడు మీరలింక
మోహసాహసములఁ గురు ముఖ్యుదెసకుఁ, గీడురాకుండఁ దగఁ బరి కింపవలయు. 229
క. వాసవనందనుఁ డెంతయు, గాసిలి యున్నాఁడు మనలఁ గని యించుకయుం
దా సైరణ సేయఁడు గను, మోసము లే కొక్క మొగిన ముసరఁగవలయున్. 230
వ. అప్పుడు కురుపతి సమయకాలవిషయంబుగా నాడినమాటయుం గలదు దాని నిరూపించి
యున్నరూపు గాంగేయుండు సెప్ప న్హరుఁడనిన నతండు దుర్యోధనున కి ట్లనియె.
231
భీష్ముఁ డర్జునునజ్ఞాతవాసవత్సరవ్యాప్తి నిష్కర్షించుట.
సీ. రెండవయేఁట నొ క్కం డధిమాస మి, ట్లెక్కినయన్నెల లెల్లఁ గూర్చి
కొనఁ బదుమూఁడు హా యనములు దప్పక, నిన్నటితోడన నిండె నింత
యెఱిఁగియ తమపూన్కి యెల్లను దీర్చితిఁ మని పొడసూపె న ర్జునుఁడు నేఁడు
పాండుపుత్త్రులు ధర్మ పరులు ధర్మాత్మజుం, డేరి కధిష్ఠాత వారు ధర్మ
తే. పథము దప్పుదురే యన్ని పాటు లట్లు, పడినవారలు దఱియంగఁ బాఱ నేర్తు
రెట్లు దమకించి నీతివి హీనవృత్తిఁ, దమకు నొకకీడు వచ్చువిధంబు గాఁగ. 232
ఉ. అట్టిద యైన నాఁడ తఱి యంబడి మూర్ఖుతనంబు సేయరే
నెట్టన ధర్మపాశముల నిల్చిరి కాలము వేచి యుండి రిం
కెట్టును వారు గొంత తమ యేడ్తెఱ సూపక మాన నేర్తురే
ముట్టఁగ వచ్చి రేని మన ముం దగ నోర్తముగాక దానికిన్. 233
ఉ. వచ్చినవాఁడు ఫల్గునుఁ డ వశ్యము గెల్తు మనంగ రాదు రా
లచ్చికినై పెనంగినబ లంబులు రెండును గెల్వ నేర్చునే
హెచ్చగుఁ గుం దగుం దొడరు టెల్లవిధంబుల కోర్చు టట్లుగా
కిచ్చఁ దలంచి యొక్కమెయి నిత్తఱిఁ బొం దగుచేఁతయుం దగున్. 234
వ. అనిన విని కురుపతి దరహసితవదనుం డగుచు ని ట్లనియె. 235
ఆ. మనకుఁ బాండురాజ తనయవర్గమునకు, నెట్లు వొందు గలుగు నేను రాజ్య
భాగ మీను సమర భంగిక విక్రమ,నిరతిఁ బూను టిదియ నిశ్చయంబు. 236
వ. అనిన నయ్యిరువురవచనంబు లాకర్ణించిగురుండిట్లనుఁ గార్యగతియును గయ్యంబు
భంగియు భూపతికంటె మిగులం గనియెడువారు లే రయినను నా యెఱింగిన యంత నొక్క
తెఱంగు సెప్పెద నీబలంబున నాలవపాలు గొని మహీపాలుండు సత్వరంబుగా ముందఱఁ
బోవవలయు నంతియసేన తదనంతరంబ కదుపులం బొదివికొని చన వలయుఁ దక్కటిసగంబుతో
మనము నిలిచి మోహరించి యల్లనల్ల నరుగ వలయుఁ గవ్వడి యెయ్యెడం గవిసె నయ్యెడన
తలపడ వలయు నిట్లైన మానవేశ్వరుండు సురక్షితంబుగా సందడింబడక నడచుగోవులు
నిన్నెలం గడచు మనమును ధనంజయునకుం జాలినయప్పుడ యట దోడుపడ నెవ్వరు గలిగినను
వారికిం జాలి నిలుత మనిన విని సురనదీసూనుండు దాని కియ్యకొని రాజన్యునకు
సైన్యంబుఁ బంచి యిచ్చి పుచ్చి పసులకుం దోడగుభాగంబునుం బంచి యున్నంతవట్టు
చతురంగంబుల నియతి సేసికొని యాచార్యుండు నడుమను గృపాచార్యుండు వలపటను
నాచార్యపుత్త్రుండు దాపటం గర్ణుండు ముదట వికర్ణ దుశ్శాసన శకుని సైంధవ
సోమదత్త బాహ్లిక భూరిశ్రవః ప్రభృతియోధవీరు లెల్ల నెడనెడం గలయ
నిలుచునట్లుగా మోహరించి మహోత్సాహంబున సన్నాహ సౌందర్యంబు నొంది తాలధ్వజం
బెత్తించి మెఱసితాను వెనుకయయి నడపించు చుండె నట్టిసమయంబున. 237
చ. అరుదుగ నిట్టు లొక్కనికి నంతబలంబునకున్ మహోగ్రసం
గర మగుడున్ మనం బతుల కౌతుక మొంది కనుంగొనన్ సురే
శ్వరుఁడు సుదర్శనం బనఁ బ్ర శంసకు నెక్కువిమాన మెక్కి యం
బరగతి వచ్చె దేవముని పంక్తులు సిద్ధగణంబుఁ గొల్వఁగాన్. 238
వ. అద్దివ్యయానరత్నంబునందు. 239
తే. స్వర్గమున నున్నరాజులుఁ జక్రవర్తు,లును యథోచితచ్ఛత్త్రంబు లును
నిజ్హార
చామరంబులుఁ జెలువొందఁ జారులీలఁ, గొలిచియుండిరి వేడ్కలు గొనలునిగుడ.
240
క. పాండుమహీపాలుం డా,ఖండలుచేరువన పెద్ద గద్దియ నమరీ
మండలి వీచోపు విడఁగ, నుండి కనుంగొనుచు నుండె నుజ్వ్జలభంగిన్. 241
వ. అంత. 242
సీ. దేవదత్తాభీల రావంబు వెసఁ గర్ణ,ముల దీటుకొన లేట మెగము వడుచు
రథనేమిదళితధ రాధూళి యంగంబు, లెల్లఁ గప్పఁగ వెలు వెల్లనగుచు
బహుళకపిధ్వజ ప్రభలు లోచనములు, మిఱుమిట్లు గొనఁ బర్వ మెండుకొనుచు
నుద్భటాకారస ముద్ధతి మనము లు,త్తలపడఁ దోఁపంగఁ దల్లడిలుచు
తే. నడచుకౌరవరాజసై న్యంబుఁ గదిసెఁ, దీఁగ దిగిచినగతిఁ దన తేరు మెఱయ
రయముమైఁ జని ప్రళయభై రవసహస్ర, గర్జనోదగ్రతర్జనుఁ డర్జునుండు. 243
వ. ఇవ్విధంబునఁ గురుబలంబులఁ గ్రోశమాత్రంబునం గూడ ముట్టి క్రీడి తల
యెత్తి చూచి యుత్తరున కి ట్లనియె. 244
చ. ఇది యెకపెద్దగట్టిమొన యీమొనముందట గోగణంబుతో
నదె యొకయల్పసైన్య మట యాతల వేఱొకకొంతసేన య
ల్లదె యిటుపంచి పెట్టఁ జను నంతటిలోన వృథాభిమానదు
ర్మదబహుభాషి యైనకురు రా జెచటం జనుచున్నవాఁడొకో. 245
క. అరయుదము గాని యిమ్మో,హరమునకును డాపలించి యరదముఁ బో ని
మ్మురవడి నతనిక యుఱికెద, నరుదుగ నెబ్భంగి నెవ్వ రడ్డం బైనన్. 246
ఉ. ఆతఁడు సిక్కెనేని బల మంతయు విచ్చు మరల్పవచ్చు గో
వ్రాతము నట్ల యైన సుక రంబుగ నంతట నెల్లఁ దీఱు నీ
యాతతసేనయం దతని నారసి కానక యున్న వీరి ని
ట్లీతల డించి యాకదుపు నెయ్దఁగఁ బోదముగాక వ్రేల్మిడిన్. 247
క. విచ్చి చనకుండఁ బసులం, దెచ్చుట మునుమున్న వలయు తెఱఁ గాపనికిం
జొచ్చి యది చక్కఁబెట్టగఁ, నచ్చోటన దాయ మనకు నగపడెడు బలే. 248
క. అనిన విని యుత్తరుం డ,మ్మొనవలపటఁ బెట్టి యరద మును బోవఁగ ని
చ్చిన సరస కరిగి కవ్వడి, కను విచ్చి బలంబు నెల్లఁ గలయఁగఁ జూచెన్. 249
వ. ఇట్లు గలయం గనుంగొని మధ్యదక్షిణవామాగ్రపశ్చిమోత్తరభాగంబుల నిట్టిట్టి
వారలు నడచు చున్నవా రని సారథితో నేర్పడం బలికి వీరలలోనురగకేతనుండు లేఁ
డతండు గోవులం గొనిపోవ నోపు నిరామిషం బైనయీసేనతో నని సేయం బని లేదు వీర
లెయిది యడ్డపడి తడవు సేయకుండునట్లుగా ముట్టికొని పసులం బెఱ్టించి దొరయును
నెల గడవం బోవక యుండఁ బొదువ వలయు నని చెప్పి యతని నద్దెసకుఁ దేరు వఱుపం
బనిచి గురకృపగాంగేయులకుఁ జరణ సమీపస్థలంబులం బడ రెండును
గర్ణాభ్యర్ణప్రదేశంబులం జన రెండునుగా నాలుగేసి యమ్ము లేసిన నాసవ్యసాచిం
జూచి యాచార్యుండు పరిసరవర్తు లగునాప్త జనంబులతో నల్లన యర్జునుం డింత
యొప్పి యుండునేయని యగ్గించి వెండియు. 250
ద్రోణాచార్యుఁ డర్జునుం జూచి ప్రశంసించుట.
మ. విలసద్గాండివచాలనోద్ధతి కన ద్విద్యుల్లతాలీలగా
నలఘుస్ఫారకపిధ్వజథ్వని సము ద్యద్గర్జచందంబుగా
జలదాకారత నొందెఁ దే రితఁడు ప ర్జన్యాకృతిం బొల్చె దో
ర్బలతీవ్రారినిదాఘదుర్విషహగ ర్వస్ఫూర్తి నిర్మూర్తిగాన్. 251
వ. ఇప్పుడు నాకుఁ బ్రణామంబులుగాఁ బాదంబులమొదలం బడ రెం డమ్ము లేసిపెద్ద
కాలం బేనిఁ బాసి యున్నవాఁడు గావునఁ గుశలప్రశ్నంబుగాఁ జెవులు సోఁకియుం
జోఁకములుగా రెం డమ్ము లేసె నని పలికి వెండియు ని ట్లనియె. 252
క. ఇడుమలఁ బదుమూఁ డేండ్లుం, బడి కడుఁ గోపించి వచ్చె బలువిడి నీక
వ్వడి దఱియ నుఱికి వడి ని,ప్పుడ యిమ్ముఱుప్రోవు నెల్లఁ బొరిగొనెడు బలే
253
తే. విపినవాసంబు నజ్ఞాత విధమువర్త
నంబు గడపి నవాభ్యుద యంబు నొంది
రాత్రిఁ బుచ్చి తోఁతెంచుమా ర్తాండుమాడ్కిఁ
జూడ నుజ్వ్జలుం డగుచు న ర్జునుఁడు వొలిచె. 254
వ. అనియెఁ గృపాచార్యభీష్ములు పార్థుబాణపాతప్రకారంబులు
ప్రణామకుశలప్రశ్నంబులుగా నంతరంగబులం గనికొని సంతసిల్లిరి ధనంజయుండును
దక్కినవారికి దుర్నిరీక్ష్యుం డగుచు నమ్మోహరంబుదెస ననాదరంబు సేసి
గోవులపజ్జంబోవు చుండె నతనిం జూచి సురనదీసూనుండు కురువీరులతో ని ట్లనియె.
255
క. చిరకాలమునకుఁ గంటిమి, నరు నక్కట వీఁడు సజ్జ నప్రియుఁడు సుహృ
త్పరతంత్రుఁడు బాంధవహితుఁ, డరిభీకరుఁ డిట్టివార లవనిం గలరే. 256
క. మనచూడ్కికి వ్రేఁ గయి యీ,తనియతులితమూర్తియత్యు దాత్తతఁ గడు నొ
ప్పినయది గంటిరె జగ మె,ల్లను నేలఁగఁ దగుసముజ్వ్జ లత యూహింపన్. 257
క. వెనుకదెస వచ్చి కదిసియుఁ, దనరథము దొలంగనిచ్చి తఱియఁబడుట కొ
ల్లనితలఁపు గలిగి క్రేఁగం,టన మనలం జూచుచుం గ డచి యట నడచెన్. 258
క. మొనఁ గలయఁ జూచి యూరక, చను టధిపతి నరసి తా ని చటఁ గానక యా
తనిపజ్జ నరుగు తెఱఁ గగు, ననుమానము లేదు క్రోధ మగ్గలము మదిన్. 259
చ. మనకును గౌరవేంద్రునకు మధ్యముఁ జొచ్చెనయేని నాతఁ డ
ర్జునునకు నొంటి సాలఁ డని రుద్రుఁడు నెక్కటి మార్కొనంగ లేఁ
డనిన నొరుండు శక్తుఁడె ర యంబుమెయిన్ మన మెల్ల నిప్పు డా
తనికడ సేరఁగాఁ జనుట తప్పినఁ గార్యము దప్పు నెంతయున్. 260
ఆ. వాసవాత్మజుండు వసుధేశనందను, ముట్టికొనిన నొకటి వుట్టెనేని
మనప్రయోజనంబు మఱి యేమి పసు లవి, యేటి కొండుధనము లెల్ల నేల. 261
వ. అని పిలికి బలంబుఁ బురికొల్పికొని యతండు రాజరక్షణతత్పరత్వంబున నరదంబు
సత్వరంబుసేసిన సేనాపతిం గని సైనికనికాయంబులుం గడఁగి చనం దొడంగె నిప్పాట
నమ్మేటిమొనయును వెసం బోవ గోవులకావలిమూఁకయు వానిందఱిమి కొని యతిరయంబున
నరుగం దానును గెలనఁ గ్రోశద్వయమాత్రంబు నడచి పురుహూతపుత్త్రుం డుత్తరున కి
ట్లనియె. 262
మ. ఇదె గోవర్గము సేర వచ్చితిమి పో నిం కేల సైన్యంబులుం
గదియన్ వే చనుదెంచె రెంటినడుముం గాఁ జొచ్చి యీవచ్చును
న్మదవీరావలికిన్ భుజావిభవవి న్యాసంబు గాన్పించి మా
న్చెద గర్వంబు మరల్చెదం బసుల నా చేఁ జిక్కు రా జెమ్మెయిన్. 263
యుద్ధారంభము.
క. అనుటయు విరాటతనయుఁడు, మొన కడ్డముగాఁగఁ దూర్పు మొగమై రథముం
గొని కట్టెదిరికిఁ బోయినఁ, దనమూఁపులు రెండు నపుడు దలకుం గడవన్. 264
వ. తేరు సమ్ముఖంబు సేయించి పేరువాడి క్రీడి కరతలం బెత్తినిలునిలుమని
యదల్చిన ఘోషంబుతోడన వెడలునిశితశరపరంపరలదట్టంపుఁబఱపున నంబరంబునీరంధ్రం
బగుటయుఁ దదంధకారంబును భయతిమిరంబునుం గవిసి గుండియ లవిసి కురు బలంబు
లెదురు నడవను మరలం బఱవను మఱచి వెఱచఱచి హరితనయహస్త లాఘవప్రశస్తిదక్కం
దక్కినచేష్టలు తక్కియుండె నతండు గోవులవెనుకంబోవు నల్పబలంబు బెదరి
తూర్పుదెసకుం జెదరునట్లుగా నరదంబుఁ బఱపించి తెఱపిసూపి వెలిచీర సారించి
దేవదత్తంబు పూరించినం గేతుకపి గర్జిల్లం దదీయభూతంబు లార్వ మౌర్వీరవంబును
రథనేమినినదంబును బ్రతిపతాకినీతుములంబును గగనంబునం బొగడునమరులయెలుంగులును
నొక్కటఁ జెలంగ సముదితసాంద్ర సంరావంబు రోదసీకుహరంబు నిండిన నొండొండ మట్ట
లెత్తుకొని నేల మ ట్టవియుచు నద్రువం బసులు వెసం దిరిగి మున్ను
వివ్వచ్చుండు వచ్చినజాడ గైకొని దక్షిణదిశకుఁ గెరలువొడుచుచుం దెరలం బాఱిన.
265
క. గోవులతోఁ బొదువంబడి, పోవుచు నున్నట్టిగోప పుంజంబు తదీ
యావసరంబున సరభస, మై వానిపిఱుందఁ దిరిగి యమ్మెయిఁ బఱచెన్. 266
ఆ. అప్పుడర్జునుండు దప్పక చూచి యీ,బలము పసుల కడ్డ పడక యుండ
నెడ సొరంగవలయు నిట యెయ్దికొను మని, పనిచె మత్స్యభూమి పాలసుతుని. 267
క. పనిచిన నాతఁడు నమ్మెయిఁ, జన నిచ్చె రథంబు గోప సంఘముఁ దిర మై
కొనిపొండు పసుల నోడక,యని తా నెలుఁగించి వీ టికై నూల్కొలిపెన్. 268
వ. అట్టిసమయంబున. 269
క. కరితురగసమితిఁ గార్కొని, కురువీరులమొనలు మొగులు కొమరునఁ గవియన్
శరవేగంబున నరుఁ డు,ద్ధురమారుతచండభంగి దోఁప దెరల్చెన్. 270
క. కదిసినబలములు విచ్చినఁ, గదుపులఁ జెదరంగనీక గాండీవి వెసం
బొదివి యట కడపె నవియును, గొదకొని తమపొలముసొచ్చె గోపాలురతోన్. 271
వ. అని చెప్పిన విస్మయంబు నొంది. 272
ఆ. పసులు వట్టువడిన పదపడి నరుఁ డెద్ది, యాచరించెఁ గౌర వాధినాథుఁ
డేమి సేసె బలము లె ట్లయ్యె భీష్మాది, వీరు లెవ్విధంబు వార లైరి. 273
వ. అనవుడు. 274
మ. నవతాదూర పురాణతానుపగతా నానాత్వ సంశోభితా
వివిధత్వాపగమోజ్వ్జలా బహుకళా విర్భావశాలీ సము
ద్భవరాహిత్యనిరూఢ సూక్ష్మతర సం భాసా మహాస్థూలమూ
ర్తివిశేషా నిరుపాధికా గుణమయా ధీవర్తకా నిష్క్రియా. 275
క. అంతఃకరణచతుష్టయ, శాంతిసముద్యద్వివేక సంపద్వేద్యా
చింతాతంతుత్రుటనా,త్యంతవిదగ్ధైకభజన తత్పరహృద్యా. 276
మాలిని. ప్రణమదవనవిద్యా ప్రౌఢిసంరూఢ కాంతి
ప్రణుతచరణపద్మా పద్మజాదిత్యసత్పో
షణచతురదయావి స్ఫారితాలోక లోకా
పణనిపుణజనాంచ ద్భక్తివిక్రీతమూర్తీ. 277
గద్యము. ఇది శ్రీమదుభయకవిమిత్త్ర కొమ్మనామాత్యపుత్త్ర బుధారాధనవిరాజి
తిక్కనసోమయాజిప్రణీతంబయిన శ్రీమహాభారతంబున విరాటపర్వంబునందుఁ
జతుర్థాశ్వాసము. 278
విరాటపర్వము - పంచమాశ్వాసము.
క. శ్రీసంపాదనచాతు
ర్యా సేవ్యపదారవింద యౌగికవిద్యో
ద్భాసితమతిమూర్తిమయా
వ్యాససమాసైకరూప హరిహరనాథా. 1
అర్జునుఁ డుత్తరునకుఁ గౌరవవీరుల వేఱువేఱ నిరూపించి చెప్పుట.
వ. దేవా వైశంపాయనుండు జనమేజయున కి ట్లనియె నివ్విధంబున విరోధివర్గం
బుక్కు దక్కి వెక్కసపడి చూచు చుండ నిరర్గళభూజార్గళసంరంభవిజృంభణంబు
శోభిల్లఁ బసులంబెట్టించి యనతిదూరవర్తియగు కౌరవచక్రవర్తిదెసంగనుంగొని
ధనంజయుండు భూమింజయు నక్కడఁ దేరు వఱపం బనుప నప్పళించునప్పుడు
కురువీరులుగూడుకొనిమూఁడు వేలరథంబులతోడను గాంగేయకర్ణు లొక్కొక్కరుండు
వేయింటితోడను దలకడచి రాజున కడ్డపడి కవ్వడిదిక్కు మొగంబుగాఁ దిరిగి
రట్టియెడఁ గదుపులు పట్టువడుటకు నిట్టూర్పు నిగిడించుచు మగిడి మనుజ పతియు
ననుజసహితుండై సహస్రస్యందనంబులతోడ వెన్ను దన్ని నిలిచె నంతఁ దక్కటిబలంబులు
నెయిదికొని యమ్మెయిన దళంబుగాఁ గవిసిన. 2
క. కనుఁగొని యెలన వ్వొలయువ, దనమున గరువంపుఁజెన్ను దలకొనఁగా న
ర్జునుఁడు విరాటసుతున కి, ట్లనుఁ గేవలవీరరసమ యాత్మకుఁ డగుచున్. 3
సీ. కాంచనమయవేది కాకనత్కేతనో, జ్వ్జలవిభ్రమమువాఁడు కలశజుండు
సింహలాంగూలభూ షితనభోభాగకే,తుప్రేంఖణమువాఁడు ద్రోణసుతుఁడు
గనకగోవృషసాంద్ర కాంతి పరిస్ఫుట, ధ్వజసముల్లాసంబు వాఁడు కృపుఁడు
లలితకంబుప్రభా కలితపతాకావి, హారంబువాఁడు రా ధాత్మజుండు
తే. మణిమయోరగరుచిజాల మహితమైన, పడగవాఁడు కురుక్షితి పతి మహోగ్ర
శిఖరఘనతాళతరు వగు సిడమువాఁడు, సురనదీసూనుఁడేర్పడఁ జూచికొనుము. 4
క. గురునకుఁ బ్రదక్షిణంబుగ, నరదముఁ బో నిత్త మిమ్మ హాపురుషునెడం
బరిభవము వలవ దీతఁడు, కురుకులనృపతనయశిక్ష కుఁడు సు మ్మనఫూ. 5
క. శస్త్రప్రకారనిపుణుం, డస్త్రవిదుఁడు దూరపాత నాభీలుఁడు వ
ర్చస్త్రాసితరిపుఁడు ధను, శ్శాస్త్రపరిజ్ఞానఘనుఁ డ సదృశుఁడు శక్తిన్. 6
ఉ. ఈతనితోడికయ్యమున కియ్యకొనం దగ దేను దుష్పథ
ద్యూతజయోద్ధతుం డగుసు యోధనునిం బరిమార్పఁ బోవుచో
శాతశరోత్కరం బితఁడు చక్కఁగ నేయునొ నన్ను నేయఁడో
చూతము తాన ము న్ననికిఁ జొచ్చినఁ జొత్తముగాక పిమ్మటన్. 7
క. గురుపుత్త్రుఁడు తేజోనిధి, సురాసురుల కైనఁ దేఱి చూడ నరిది సం
గరమున నీతని నీశ్వర,వరజనితుఁడు మేటి కౌర వవ్యూహమునన్. 8
క. ధైర్యధనుఁ డితఁడు ద్రోణా, చార్యుల కెన వచ్చుదివ్య శరవిదుఁడు కృపా
చార్యుఁడు మత్పితృసఖుఁ డా, చార్యక మొనరించె మాకు శైశవముతఱిన్. 9
తే. వీర లిరువురు మాన్యులు వీరితోడి, కయ్యమున కిప్డు మన మంత
గాలుద్రవ్వ
వలవ దెచ్చోట నెదురుగా మెలఁగి రచట, మనరథం బల్లనల్లన చనఁగనిమ్ము. 10
శా. యోధాగ్రేసరుఁ డిద్ధతేజుఁడు రణో ద్యోగానురక్తుండు దు
స్సాధప్రక్రమ బాహువీర్యుఁడు గురు క్ష్మాపాలవాల్లభ్యల
క్ష్మీధామాత్ముఁడు జామదగ్న్యకలిత శ్రేష్ఠాస్త్రవిద్యాఢ్యుఁ డీ
రాధేయుం డొకచీరికింగొనఁడు వీ రవ్రాతముం బోరులన్. 11
క. శౌర్యాటోపంబున దో, ర్వీర్యంబున నస్త్రశస్త్ర విత్వ్తమునను మా
త్సర్యంబు సేయు నాకును, దుర్యోధనుఁ డెపుడుఁ ద న్నె దురు సేయంగన్. 12
చ. అతిదృఢవేది పేరు గల యట్టిమగండు రణంబు గల్గె నేఁ
డితనికి నాకుఁ దెల్లముగ నిట్టియెడం బరికించి చూడుమీ
మతి గలఁగంగ నీక యను మానము వాయఁగ నీవు సాయకో
ద్ధతిఁ బ్రకటించుచో బహువి ధంబుల నిద్దఱతారతమ్యముల్. 13
క. ఈయెడ ననుఁ గని వారణ, సేయుదు నితఁ డగ్గ మైన చిచ్చుఱపిడు గై
పోయి పయిఁబడుదు నీ వర,వా యించుక లేక పఱప వలయు రథంబున్. 14
ఉ. ఉగ్రుఁ డనూనమానమహి మోన్నతచిత్తుఁ డజయ్యవిక్రమో
దగ్రుఁడు హస్తలాఘవస మన్వితుఁ డేయునెడన్ సమగ్రకో
పాగ్రహబుద్ధి మాదెస న నార్యుఁడు కార్యమునందు ధార్తరా
ష్ట్రాగ్రజుఁ డీతనిం గదిసి నప్పుడు పండువు నాకు నుత్తరా. 15
తే. అరసికొని యెన్నిభంగుల నైన నితని, తేరు మనబారి కగపడు తెఱఁగు గాంచి
యడరి బాసటయై యెవ్వ రడ్డపడిన, మెఱపుమెఱచినచాడ్పునఁ దఱియఁజొరుము. 16
క. అస్మత్పితామహుం డతి,విస్మయజననప్రతాప విభవాగ్నిశిఖా
భస్మీభూతప్రతిప,క్షస్మయకాననుఁడు ప్రథమ గణ్యుఁడు బుద్ధిన్. 17
క. బహుమహితాయుధవిద్యా,రహస్యసంవేది ధార్త రాష్ట్రులకును మా
కు హితంబ కోరు సముఁ డై, సహాయుఁ డగు వారలకు న చటఁ దా నునికిన్. 18
క. వివిధము లగులక్ష్యంబులు, నవలీలం దునియ నాట నవియఁగ నేయున్
భువనైకధన్వి నత్యు,గ్రవిచేష్టితు నోర్చెఁ బరశు రాముం బోరన్. 19
క. శంతనునందనునరదము,పొంతం బో వలవ దలుక పుట్టి యతఁడు భూ
కాంతునకు సైన్యమునకుం, జెంతలఁ జేరంగ నీక సిలుగులఁ బెట్టున్. 20
వ. అని యిట్లు వేఱువేఱ చూపి క్రమంబున నేర్పడంజెప్పి సవ్యసాచి
సమరోన్ముఖుం డగుసమయంబున సస్మితుండగుచు నశ్వత్థామ రవతనయునవలోకించి యి
ట్లనియె. 21
క. నిను నీవ పొగడికొని పలి,కినపలుకులు పెక్కు గలవు క్రీడి యనికి వ
చ్చినవాఁ డిదె పులివలె మా, ర్కొనరాదే కర్ణ సేన కుం బ్రియ మెసఁగన్. 22
క. తలఁకు గల దేని శకునిం, బిలిచి విచారింపఁ బొమ్ము పృథివీపతి నీ
తలన తనకార్యఖడ్గం,బులమో పెక్కించె రిత్త వోవునె నీకున్. 23
వ. అనిన విని యతండు క్రోధఘూర్ణమాన తారకుం డగుచు ని ట్లనియె. 24
చ. తలఁకెడువానికిన్ మగఁడ తానటె న న్నడిఁకించువాఁ డిసీ
పలుకకు భీతున ట్లొదుఁగఁ బాఱునె శూరుఁడు నిన్ను నచ్చియే
కలనికి వచ్చితిన్ నరుఁడు కాఁ డట వాసవుఁ డైన నేమి నా
బలముఁ జలంబు నేరిమియు బంటుతనంబును నీవ చూడుమీ. 25
క. అని కడఁగునినసుతునకు, న్మును ద్రోణుఁడు ద్రోణనంద నుఁడుఁ గృపుఁడును
శాం
తనవుఁడుఁ గడఁగుట దుర్యో,ధనుఁ డవలోకించి యత్యు దగ్రతఁ గడఁగెన్. 26
వ. ఇవ్విధంబుననయ్యేవురుదొరలును ధరణీశుండును సరభసంబుగాబరవసంబుసేసిన
దుశ్శాసన దుష్ప్రహదుర్ముఖప్రముఖనిఖిలకురుకుమారనికాయంబును
శకునిసైంధవప్రభృతిబంధునివహంబును బాహ్లికసోమదత్తాదిసామంతనికురుంబంబును
మఱియునుం గలవివిధయోధవీరనిచయంబును నొక్కటఁ గరటిఘటాఘోటకధట్ట
రథయూథపదాతివితతిసంరంభశుంభత్సేనాసమూహసహితంబుగాఁ ద్రోచినడచిన. 27
చ. ధరణి వడంకె ధూళి దివిఁ దన్నిన భానునిఁ గానరాద బం
ధురవివిధప్రకారపటు తూర్యరవంబులఁ బొంగె దిక్కు లా
స్ఫురితమహాయుధోగ్రరుచి పుంజవిజృంభణఘోర మయ్యె నం
తరము సహస్రనేత్రముఖ దైవతమండలదుర్నిరీక్ష మై. 28
అర్జునుఁడు కౌరవసైన్యంబుల నుఱుమాడుట.
వ. అట్టియెడ నుద్భటహాసోల్లాసభాసురముఖుం డగుచు శతమఖతనయుండు. 29
చ. గుణమున లస్తకంబునను గోటియుగంబునఁ గేలఁ దార భీ
షణముగ నుప్పతిల్లి రభ సంబున రేఁగినమాడ్కిఁ దీవ్రమా
ర్గణనికరంబు లొక్కట న రాతిబలంబులఁ గప్ప గాండివ
క్వణనము రోదసీకుహర కర్పరముం బగిలింప నుగ్రతన్. 30
క. తలపడి తలమీఱినకా, ల్బలములఁ బొడిసేయ మఱియుఁ బైపైఁ బీనుం
గులఁద్రొక్కికొనుచువెసముం,గలిమొనగవియుటయుఁ గడఁక గడలుకొనంగన్. 31
క. తనదృష్టియు ముష్టియుఁ దగు,ననువున ము న్నెత్తి యేయు నతఁ డప్పు డుడిం
చినకాయముల సపాటం,బునఁ బదియుఁ బదేను నుచ్చి పోయెం గోలల్. 32
చ. ఉడుగక వెండియున్ సుభటు లొక్కమొగిన్ వెస నంటఁ దాఁకి క
వ్వడిపటుబాణభాస్వదని వార్యసముద్ధతిఁజేసి మంటలో
మిడుతలు సొచ్చిన ట్లయిన మేటిమగల్ గని యీడఁబోక బ
ల్విడి మఱియున్ వడిం బొదువ వ్రేల్మిడిఁద్రుంచె నతండు దోడుతోన్. 33
తే. అంతకంతకుఁ గదిసి సై న్యములు సుట్టు,ముట్టి శస్త్రాస్త్రసంచయ మున
నభంబు
దీటుకొనునట్లు సేయఁ గి రీటి గాండి,వంబుపరిచాలనంబు దీ వ్రంబు గాఁగ. 34
సీ. గోరఁ బోఁజినమాడ్కిఁ గొన్నింటిఁ జక్కసాఁ,బాలుగా వ్రయ్యలు వాపి పాపి
బాడిస నఱకిన భంగిఁ గొన్నింటిఁ దు,త్తునియలుగా బిట్టు త్రుంచి త్రుంచి
వెస ఱంపమున నిడ్డ వసిగఁ గొన్నిటి నిసు,మంతలుగా నుఱు మాడి యాడి
పనివడి ఱోలఁ గొ ట్టినలీలఁ గొన్నింటిఁ, జిఱునుగ్గుగాఁ బొడి సేసి చేసి
తే. యడరిపొదివినబలమునా నాయుధములఁ, బ్రతిహతంబులుగావించె నతిరయమున
నక్షతధ్వజసూతహ యత్వలసద,ఫల్గురథవల్గనుం డగు ఫల్గునుండు. 35
క. ఆమెయిన వివిధవర్మ, స్తోమం బఱవుళ్లు సేసి సునిశితబాణో
ద్దామప్రసారవిభవ,శ్రీ మార్తుర కద్భుతంబు సేసెం గడిమిన్. 36
క. గర్జద్గుణుఁ డై పగతుర, జర్జరితాంగులుగఁ జేసె సాయకజాల
స్ఫూర్జన చూపఱు వొగడఁగ, నిర్జరవరనందనుండు నిమిషార్థమునన్. 37
శా. శక్తిస్ఫారధనంజయాయతభుజా సంరంభగాండీవని
ర్ముక్తక్రూరశరావలీదళితశ త్రువ్రాతముల్ శోణితా
సిక్తాకారతఁ బొంది సాంద్రకుసుమ శ్రేణీవికాసోల్లస
ద్రక్తాశోకతరువ్రజంబులక్రియన్ రంజిల్లి యొప్పెం గడున్. 38
చ. తదవసరంబునన్ దొర లు దగ్రతఁ ద్రోచినవజ్రధట్టముల్
మదమున నొక్కపెట్ట బల మర్దనుసూనురథంబు గ్రక్కునం
బొదివెఁ దురంగకింకిణుల భూరిరవంబుఁ గరీంద్రఘంటికా
భ్యుదితనినాదమున్ రథవ రోత్థితఘోషము నుత్కటంబుగన్. 39
తే. అట్టియెడ వేల్పు వచ్చిన యట్ల మేను, వొంగ నలిరేఁగి పాండవ పుంగవుండు
మత్స్యనృపనందనునిబలు మాటతోడి,యేపు సెవికిని జూడ్కికి నింపు నొసఁగ 40
క. మేదురదీర్ఘతరం బగు, నాదం బెడ తెగక గుణము నను వడి నిగుడం
గోదండము సంతతవల,యోదాత్తస్ఫురణ వెలుఁగు చుండఁగ నేసెన్. 41
మ. ఒకమాత్రన్ వితతప్రసారనిబిడా త్యుగ్రాస్త్ర సంతానముల్
సకలానీకములందుఁ బర్వ నరుభా స్వన్మూర్తి శోభిల్లె దీ
ప్తికలాపంబులు లోక మంతటను వి స్తీర్ణంబు లై యౌగప
ద్యకృతవ్యాప్తి వెలుంగ నొ ప్పెసఁగుమా ర్తాండున్ విడంబించుచున్. 42
క. నరు లొరులు దృశ్యములపైఁ, బరఁగింపఁగఁ జూడ్కు లెట్లు వడుఁ దప్పక య
ప్పరుసున నరుఁ డేయునిశిత, శరములు లక్ష్యములు దప్పి చనవించుకయున్. 43
క. గజఘోటకరథసూత, ధ్వజకంకటయోధగాత్ర తతియం దెచటం
విజయధనుర్ముక్తశర,వ్రజములు దవులంగఁ బడ క వారణ నిగుడున్. 44
చ. కవదొన లేల పూనునొకొ కవ్వడి నా వల దుగ్రసంగరో
త్సవమున సవ్యపాణి నప సవ్యకరంబున మార్చి మార్చి గాం
డివము ధరింపఁగా శరప టిష్ఠతయుం బొరిఁ జేయి మార్చి చూ
పువెరవుతోన వీడ్వడక పొం దొడఁగూడెడు నెప్డు సూచినన్. 45
క. సమవిషమవినిమ్నోన్నత, సమీపదూరస్థలములు సదృశములు గఁ జి
త్తముక్రియ నవిహతగతులను, సమరమహిం గ్రీడిరథము సను నవితథమై. 46
వ. వెండియు నతండు. 47
మ. బల మెల్లన్ వెఱ రెండుపాయలు గ శుం భద్వేగుఁ డై చొచ్చి యా
వలగా నడ్డము వచ్చి నాలువు గ దు ర్వారోద్ధతిం బోయి మూ
లల ననాశకలాకృతిం బొరయ లీ లాయానదుర్దాంతుఁ డై
వలయంబుల్ సని చించి చిక్కువఱుచున్ వైకల్యసంపాది యై. 48
వ. ఇవ్విధంబున నంబుధిలోన మహామత్స్యంబు విహిరించుచందంబునఁ దదీయ రథంబు
గౌరవసైన్యంబునందు సంచరించు నయ్యవసరంబున. 49
ఆ. రత్న కేతనములు రాజితశేఖరం, బులును రుచిరఘంటి కలును బార్థు
బాణనిహతిఁ దునిసి పడుఁ గౌరవులచేటు,దెలుప డుల్లునుల్క ములునుబోలె. 50
క. నరుభల్లంబుల నగ్రిమ,చరణంబులు ద్రెస్సి మ్రొగ్గు జవనాశ్వంబుల్
కరుణమొయి రాహుతులకున్, శరణం బగు మనుచు మ్రొక్కు చందంబొందెన్. 51
క. దంతిఘటాసంతానము, కుంతీసుతనారసములఁ - గూలినతఱి న
త్యంతనిబిడాభ్రమున దివి, యెంతయు సొంపారుభంగి నిల చెలు వొందెన్. 52
క. పలుపులుఁ గాండ్లుం బగ్గం,బులుఁ దనయస్త్రంబు లడరి పొడిసేసిన వి
చ్చలవిడిఁ బాఱెడురథ్యం,బుల నేయఁడు దివిజరాజ పుత్త్రుఁడు గృపతోన్. 53
ఆ. అర్జునాస్త్రఖండి తాతపత్రధ్వజ, చామరములు గాలిఁ జదల దూలఁ
జిహ్నములవిభూతిఁ జెందంగఁ గని యొప్పె, నప్పు డాడుచున్న యట్ట లచట. 54
క. ఒకమఱి కిరీటికట్టెది,రికి నుఱుమునఁ బోయిరేని రెండవమా ఱి
య్యకొనుట కోర్వగ లేరై, రొకళ్లుఁ గురురాజుసేన యోధులలోనన్. 55
సీ. మండితధ్వజదండ మండలంబులఁ గిట్టి, విటతాటనంబుగా విఱిచి విఱిచి
చటులఖురోద్భటా శ్వశ్రేణిఁ బొదివి ర,యంబునఁ దునిమి తూఁ టాడి యాడి
రాజితబహువిధ రథసమూహముఁ జొచ్చి, గలిబిలి యగునట్లు గలఁచి కలఁచి
మదభరభీషణ మాతంగముల ముట్టి, చిందఱవందఱ చేసి చేసి
ఆ. పటుపదాతిచయము పై రౌద్రరసమహో,గ్రముగ నడరి నేలఁ జమరి చమరి
సవ్యసాచిబాణ సంఘంబు మత్తశుం,డాలఘోరలీలఁ గేలి సలిపె. 56
ఉ. శిక్షితచిత్రసంగరవి శేషములం బ్రతిహేతిఖండనా
దక్షతపెంపుసొంపునను దైవబలంబున నత్తఱిన్ సహ
స్రాక్షతనూజుసారథిర థాశ్వచయధ్వజముల్ పరాస్త్రశ
స్త్రక్షతి లేక యొప్పెఁ గురు సైన్యము వెక్కస మంది బెగ్గిలన్. 57
క. తేజోధనుఁ డగునరుఁ డు,ద్భ్రాజితగతి నడుమ మెఱసి బడబాగ్ని దళం
బై జలనిధిఁ ద్రెక్కొనియెడు,నోజం గురుబలముపేర్మి యుడిపెం దోడ్తోన్.
58
తే. కాలపక్వంబు లైనలో కముల జముఁడు, బారిసమరెడుచాడ్పున మారిమసఁగి
యుగ్రరూపుఁ డై శౌర్యస మగ్ర బాహు,సంపదుద్దాముఁడగు క్రీడి సంపె రిపుల. 59
వ. అట్టియెడ మున్ను తురంగమఖురాదులందూలినకెందూళియుం బైపయి నెగయఁ బరబలంబు
నెత్తుట జొత్తిల్లుచు నుచ్చిచనువివ్వచ్చునిశితశరపరంపరలును సైనిక
శరీరంబులపై సుడిసి తడిసి రుధిరశీకరనికరరవికిరణపరిణతంబగుసమీరణంబును
ధారాళకరాళరక్తపరిషిక్తవిశ్వంభరాభాగంబును గలయం గెంపుసొంపు
సంపాదించియకాలసంధ్యనావహించినందదుచితవ్యాపారపారంగతంబులై పొడసూపిన
యుడుగణంబులుంబోలెఁ బొలుచుధనంజయసాయకదళితకుంజరకుంభ
వికీర్ణమౌక్తికవిసరంబులవలనను సముదీర్ణమదవేగదుర్నివార వారణవిదారణంబులగు
నర్జు నాస్త్రపాతంబుల బెదరి తేం ట్లెగయుట పొగ లెగయుటయుం బ్రతిభటబాణ
ఘట్టనంబునం బాండవమధ్యమకాండప్రకాండంబుల నిబిడజ్వాలలు నిగుడుట మంటయునుగా
మూర్తం బగుతదీయక్రోధదవానలంబు ఛటచ్ఛటాశబ్దంబుల చాడ్పునంజెలంగుచున్న
యుధిష్ఠిరానుజాతనిష్ఠురభల్లభజ్యమానబలవదరాతిఖరాస్థి నిస్వనంబులవలనను
దొట్టి తొట్టి యెడనెడ మడువులు గట్టుశోణితంబు నీళ్లు నందుఁ బడి
తేలాడువెలిగొడుగులు పుండరీకంబులును, వింజామరలు మరాళ పుంజంబును నై
కొలంకులచందంబు నొంద వాని కెఱఁగెడుకొదమతుమ్మెదపదుపులపగిదిఁ
దొరఁగునాఖండలతనయఖండితపర వీరకాలాయసనారాచశకలంబుల వలనను
గిరీటిశరపాటవపరిస్ఫోటితరిపుకపాలగళితమస్తిష్క పలలపంకంబునను నలుదెసల నంతంతఁ
గదియం జాఁగిపడి యున్నకృత్తకరచరణంబులను వెదపదనికి రొంపి గలంచి వరుజులు
పదిలంబుగా నమర్చినకేదారంబు తెఱంగు దోఁచుటకు నీడై చతురహలికుండు
సల్లుపరువంపు మొలకలచెలువునఁ బెల్లుడుల్లుఫల్గునాశుగ సంతాడనవికీర్ణ
శత్రుశేఖరవజ్రవ్రజంబులవలనను సంగ్రామం బభిరామం బయ్యును ఘోరప్రకారం బయ్యె
నమ్మహాభయంకరసంకులసమరంబున. 60
చ. ఉఱక విరోధిసైన్యముల నుక్కుమడంగఁగ నుల్లసద్గతిం
బఱప రథద్విపాశ్వములు పాండవమధ్యము తేరివీథియం
దఱవఱ లై పడం గని భ యంపడి యిద్దెస వచ్చె నేని న
త్తెఱఁ గయి పోయె యంచు నెడ తెంపిగఁ గొందఱు వాయఁ బాఱఁగన్. 61
క. వాలమ్ములు దాఁకి ధరన్, వ్రాలుభటులఁజూచి యెడలు వడఁకఁగ మేనుల్
దూలఁగ దముఁ దాఁకకయును, నాలము సాలించికొంద ఱవలఁ జనంగన్. 62
తే. ప్రొద్దు గ్రుంకిన మఱి కాని పోవఁడొక్కొ, క్రీడి యని కొంద ఱాజికి
నీడఁబోవ
బలము నెల్లనుదెగటాఱఁ బఱపి కానిఁ తక్కఁడెట్టులుననుచుం గొం దఱుచలింప. 63
క. తరతరమ ప్రజలఁ దునిమెడు, నరునప్పటియెత్తికోలు నకు సురవిద్యా
ధరఖేచరులును భీతిం, బొరసిరి తమదెసకు నేమి పుట్టునొ యనుచున్. 64
క. తమతమయొద్దిబలంబులు, క్రమవిరళములైన దొరలు గాండివిపై ను
గ్రముగఁ దఱుముటయు నాతఁడు, సమరోల్లాసమున దివ్య శరతత్పరుఁ డై. 65
సీ. ఆచార్యు డెబ్బది యమ్ముల నాచార్య,పుత్త్రు నేడింటఁ గృ పునిఁ బదింట
దుష్ప్రహుఁ బండ్రెంట దుశ్శాసనునిఁ బది, యేనింట సౌబలు నెనిమిదింట
నమరనదీసూను నఱువదింటను నేసి, రవిసుతురథ్యసా రథుల నొంచి
వర్మమంతయుఁ ద్రుంచి వైచి మర్మాస్థిబం, ధములు భేదించి వి క్రమము నెఱపి
ఆ. యిట్లు దొరలు నొవ్వ నేడ్తెఱఁ దనచేతి, కొలఁది సూపిక్రీడి సెలఁగి
దేవ
దత్త మొత్తుటయును దత్సైన్యములు సెడ, విఱిగి పాఱి భీష్ము మఱువుసొచ్చె.
66
క. గాంగేయుఁ డవష్టంభో,త్తుంగతనుం డగుచు నిట్లు దూలినకురుసే
నాంగంబులఁ బురికొలిపి సు,సంగతములు సేసె సమర సమ్ముఖములుగాన్. 67
వ. ఇట్లు భగ్నబలసమాశ్వాసనోద్భాసియగు భీష్ముభుజబలంబుప్రాపున మాతంగ
తురంగస్యందనసందోహంబులతోఁ గుంభసంభవకృపాశ్వత్థామకర్ణవికర్ణప్రముఖ
నిఖిలయోధజనంబులు సుయోధనుముందటఁ బన్ని నిలిచినం జూచి సవ్యసాచి
ప్రత్యేకప్రథనకుతూహలాయత్తచిత్తుం డగుచు నుత్తరున కి ట్లనియె. 68
ఉ. కందము లప్పళించి తుర గంబుల నించుక నిల్పు వైరిసే
నం దెలియంగఁ జూడుము ఘ నప్రకరంబునుబోలెఁ గాఱుకొం
చుం దఱ చైనదంతిభట సుందర కేతనరాజి గ్రాలఁగా
ముందట నిల్వఁ గట్టెదిరి మోహర మున్నవిధంబు గాంచితే. 69
ఆ. కర్ణుకేతనంబు గ్రాలెడు నల్లదె, యాతఁ డాజికేళి కౌతుకమునఁ
గడఁగి వచ్చుటయును గలిగియున్నదిమున్న,తొడరవలయు నతని తోడమనము. 70
వ. అని మఱియును. 71
చ. రయమునఁ గిట్టి యాతనిప రాక్రమలీల యడంచి నొంచి దు
ర్జయుఁ డని నమ్మియున్నకురు రాజునకున్ వగ పుట్టఁ జేసెదన్
హయములఁ బోవ ని మ్మనుడు నాతఁడు నాతనిలావు నచ్చి ని
ర్భయమునఁ దేరు వోఁ బఱపె భాస్కరసూతికి సమ్ముఖమ్ముగన్. 72
అర్జునుఁడు చిత్రాంగదప్రభృతికురుకుమారుల నిర్జించుట.
వ. ఇవ్విధంబున వృషభంబున కాదికొనుబెబ్బులియునుంబోలె రాధేయుదెస నడచు
కవ్వడిం గని చిత్రాంగదుండును జిత్రరథుండును సంగ్రామజిత్తును
దుష్ప్రహుండును జిత్రసేనుండును వివింశతియును దుర్ముఖుండును దుర్జయుండును
వికర్ణుండును శత్రుంతపుండును దుశ్శాసనుండును లోనుగాఁగల కురుకుమారవర్గంబు
నిరర్గళ ప్రకారంబు లగురథచిత్రప్రచారంబులు మెఱయ మొనకుం దలకడచి చటుల
పటుబాణవేణికాపరంపరలు నిగుడ నొక్కపెట్ట కవిసిన నతండును గుణధ్వని
తంత్రీనాదంబుగా నావిండ్లవా రొత్తుకాఱుగా గాండీవంబు వీణెగా వినోదంబు సలిపె
నట్టియెడ వికర్ణుండు. 73
క. తలమీఱి నిశితశరమం,డలిఁ గప్పెం బార్థు నుత్క టక్రోధమునన్
విలు విఱుగ నేసి యతనిం, దొలఁగంగాఁ జేసె నరుఁడు దోర్బలలీలన్. 74
క. ఇంతయుఁ గనుఁగొనియును శ,త్రుంతపుఁ డోసరిల కాజి దోహల మలరం
గౌంతేయుతోడఁ దలపడి, వింత లయినకూర్మనఖర విశిఖము లేసెన్. 75
వ. అర్జునుండును. 76
క. సూతుఁ బదింటను నైదిట, నాతనియంగంబు నొంచి యంత నిలువమిన్
శాతఘనశరము వే కొని, యాతల వెడలంగ నేసి యసువులఁ బారెన్. 77
తే. ఇట్లు శత్రుంతపునిఁ ద్రుంచి యివ్విధమున
నొక్కఁ డొక్కఁడ తలపడు టుడుపఁ దలఁచి
వివిధబాణపరంపర వెల్లిగొలిపె
భయరసమువఱ్ఱుపెట్టునఁ బగఱు వాఱ. 78
క. అందఱు రథికులు పఱవఁగ, నిం దేటికి మున్ను వచ్చి రిస్సీ యని సం
క్రందనసుతు మార్కొనియెఁ ద,గం దెగిసంగ్రామజిత్తు గర్వోద్ధతుఁ డై. 79
క. తలపడి వాలమ్ములు పై, నల వేర్పడ నినుచుటయును నలుక వొడమినం
దల దునిమివైచె నాతని, బలసూదనసూనుఁ డొక్క పటుభల్లమునన్. 80
తే. అపుడురాధేయుఁ డిమ్మెయి ననుజుపాటుఁ, జూచి యేనుంగునకు సిళ్లు
సూపినట్లు
గవిసిహయములమత్స్యభూ కాంతుతనయు, నేసి పండ్రెండుశరముల నేసెనరుని. 81
ఉ. కేసరివిక్రముండు కపి కేతనుఁ డత్తఱి వైరివీరసం
త్రాసకరప్రకార మగు దర్ప మెలర్పఁగ బాణజాలవి
న్యాసమునన్ వెసం బొదివె నర్కసుతున్ గరుడుండు పాము ను
ద్భాసితపక్షుఁ డై పొదువు భంగి సురావలి పిచ్చలింపఁగన్. 82
క. ఇరువురు వీరులు ని ట్లొం, డొరువులఁ దలపడుట సూచి యుత్కట మగున
చ్చెరువాటుఁ గౌతుకంబు న,డర నూరక యుండె నయ్యె డం గురుసేనల్. 83
మ. ప్రళయాంభోధరముక్తసాంద్రవిసర త్పాషాణవర్షంబు మి
క్కిలి యై శైలముఁ గప్పునట్లు నరున క్షీణాస్త్రసంతాన మి
ట్టల మై కప్పినఁ దీవ్రమారుతము గా ఢవ్యాప్తిజీమూతమం
డలిఁబోలెన్ విరియించె భానుజుఁ డవ ష్టంభోజ్వ్జలాకారుఁ డై. 84
క. విల్లును దానును శిఖ రా, జిల్లఁగ వెలుఁ గొందువహ్ని చెలువంబున శో
భిల్లుట గని కురుసైన్యము, లెల్లను దూర్యములు మ్రోయ నేడ్తెఱఁ జెలఁగెన్.
85
క. రవితనయుబాణములు వా,సవనందనుఁ బొదివినపుడు సంతోషముఁ ద
ద్వివిధాస్త్రము లాతనిపైఁ, గవియ విషాదంబు నొందుఁ గౌరవసేనల్. 86
వ. ఇవ్విధంబున నే ట్లాడుచుం గదిసి గాండీవి కర్ణున కి ట్లనియె. 87
ఆ. సభలఁ బలుకు దీవు సరి లేరు నా కని, యిదె రణంబువచ్చె నెల్లవారి
కెఱుఁగవచ్చు దీనఁ బెఱచోట రజ్జైన, యట్లు పూరగింప నగునె యిచట. 88
క. మాటలు పె క్కాడితి వీ,పోటుమగలు వినఁగ నింకఁ బోవుట దగ దె
ప్పాట నది గాక తమ్ముని,పాటును గన్నారఁ గంటి పాఱకు మింకన్. 89
ఆ. పలుకవచ్చుఁగాక పలికినయట్టుల, చేయవచ్చు నెట్లు దాయ యెందుఁ
బోయెదట్లు ద్రుపద పుత్త్రికఁ బఱుపంగఁ, గాంచి నగినఫలము గందు గాక. 90
క. ఏ నపుడు ధర్మపాశా,ధీనుఁడ నై కోపమునకు దీ కొనరింపం
గా నేరకున్న మెయి మెయిఁ, బోనయ్యెం గాక యింకఁ బొమ్మా యిచటన్. 91
వ. అనిన విని రాధేయుం డి ట్లనియె. 92
ఉ. అప్పుడు ధర్మహానికి భ యంపడి నిల్చితివో కడంకతో
నిప్పుడు వచ్చినాఁడ విట యెల్లను జేయుదు గాక యన్నపైఁ
దప్పు ఘటించి నీవు నొక తాలిమి గల్గినవాఁడ వై నెపం
బొప్పినఁ జెల్లె నీదునిలు పోపును జూతము గాక యిచ్చటన్. 93
క. సమయంబు నడపినను రా,జ్యముభాగం బీరె యిట్లు ననునాస నర
ణ్యమున వసించితి గాక ని,జమునకు నీయందు ధైర్య సారము గలదే. 94
క. మును నీ వచట నచటఁ జే,సినబంటుతనంబు లెల్లఁ జెప్పఁగ విందుం
గనినఁ గదా నమ్ముదు నవి, యనుమానము నాకు నీభ యస్థితిఁ గనుటన్. 95
కర్ణార్జునుల ద్వంద్వయుద్ధము.
వ. అనుచు వాలమ్ములు గురిసిన నర్జునుండును బ్రీతుం డై
గాండీవవిక్షేపక్షోభిత నభోభాగుం డగుచుం గానీనుపై నానానిశితవిశిఖంబులు
నినిచె న ట్లయ్యిరువురును దేవాసురసంగ్రామసాదృశ్యవిక్రమప్రక్రియం బొలిచి
రట్టిసమయంబున. 96
క. రవిదీప్తులు సొర నేరమిఁ, గవిసెం జీఁకట్లు పవను గమనం బడఁగెన్
వివిధాస్త్రంబుల నంబర, మవిరళముగఁ బొదువఁబడుట నద్భుతభంగిన్. 97
ఉ. అప్పుడు కర్ణసైన్య మమ రాధిపనందనుఁ జుట్టు ముట్టఁ దే
రుప్పరవీధి మై వలయ మొప్ప వెసం బఱపించి క్రీడి పెన్
గుప్పలుగా రథావలిని ఘోటతతిం గరిరాజిఁ గూల్చుచుం
దప్పక బనుసూనుమెయి దాఁకఁగ నేయుచు నుల్లసిల్లినన్. 98
వ. రాధేయుండును. 99
క. తఱిమి పయి నడరుటయు విలు, విఱుగంగా నేసె నరుఁడు విక్రమలీలం
గొఱఁతవడ నీక కర్ణుఁడు, మెఱుఁగు లడరుశక్తి సురలు మెచ్చఁగ వైచెన్. 100
ఆ. వైచుటయును సవ్య సాచియుఁ గౌరవుల్, విస్మయంబుతోడి వెఱపు వొంద
నధికరయము మెఱయ నది పెక్కుదునియలు, చేసె నంతరమున శితశరముల, 101
వ. అట్టయెడ నినతనయు మన్నించుజోదులు దెగి పయిం బడినఁ గ్రోధారుణనయన
పల్లవితంబును దంతకాంతిస్తబకితంబును గుంభస్థలఫలితంబును నగుతదీయకరటి
ఘటావికటవిటపిపటలంబు నాత్మీయవిశిఖవ్యాపారమహావాతంబునన్ బడలువడం గూల్చి
చండమూర్తి దాల్చి శోభిల్లుబీభత్సుం గని యతండు బొమముడి నెక్కొన వేఱొక్కవి
ల్లెత్తికొని. 102
క. తురగముల నాలుగిట ను,త్తరు నాఱిట నెనిమిదిట ర థముఁ బదిటను వా
నరు నఱువదిశరముల న, న్నరునంగంబులను బెలుచ నాటఁగ నేసెన్. 103
వ. ఇత్తెఱంగున. 104
సీ. రోషంబు భీషణ రూప మై చెలు వొంద, నతులకేతువు శిఖ యై వెలుంగ
శరజాలములు పటు జ్వాల లై నిగుడ న,ర్కతనూభవోగ్రాగ్ని ప్రజ్వరిల్లు
నుద్ధతి సైఁపక యుజ్వ్జలదివ్యప,తాక మెఱుంగు గా దళితధరణి
రథనేమిరవము గ ర్జనము గ శరపరం,పరలుధారలు గాఁగఁ బరఁగి యడరె
ఆ. నర్జునాంబుదం బ నన్యసామాన్యస, ముద్యమమున ముఖప యోరుహముల
కాంతి దఱిఁగి యపుడు కౌరవసేనాస,రోవరంబు దీన భావ మొంద. 105
క. వెండియు నుడుగక రవిసుతుఁ, డొండొండ నిశాతసాయ కోత్కరము సము
ద్దండతఁ బై నించిన నా,ఖండలనందనుఁడు గెంపు గనుగవఁ గదురన్. 106
క. శిరము లలాటంబును గం,ధరమును బాహులును నురము దందడి వ్రయ్యన్
గిరిపైఁబిడుగులు దొరఁగెడు, పరుసున దృఢదీప్తశాత భల్లము లేసెన్. 107
క. అఱిముఱి నంగము లెల్లను, నుఱుముగ ని ట్లడరునర్జు నునియమ్ములకున్
వెఱచఱచిసూతపుత్త్రుఁడు, పఱచెఁ బుడమి యద్రువ మత్స్య పతిసుతుఁ డార్వన్.
108
వ. ఇట్లు కర్ణుండు గయ్యంబు విడిచి పాఱినఁ బార్థుండు దేవదత్తంబు పూరించి
యుత్తరున కి ట్లనియె. 109
క. వీఁ డొకఁడు కురుబలంబున, వాఁడిమగం డనఁగఁ జాలు వాఁ డిబ్భంగిం
బోడిమి సెడియెనుద్రోణుల, వేఁడిమి యిట మనకు మునుము విక్రమమునకున్. 110
వ. అనుచు వీరావేశంబునఁ గౌరవానీకంబు నాలోకించునప్పు డుత్తరుండు. 111
ఉ. వెక్కసపాటు భీతియును విహ్వలభావము నొంది యి ట్లను
న్మిక్కిలి యైనశౌర్యమును నిర్భరతేజము నంత కంత కి
ట్లెక్కుడులావుఁ జూచి మది యెంతయు బెగ్గిలె మేలు చేష్టలం
దక్కె నశక్య మిం కిట ర థవ్యవహారము నిర్వహింపఁగన్. 112
ఆ. పుట్టినంతనుండి యిట్టివి యెన్నఁడుఁ, గాన నెందు నట్లు గాన చోద్య
మంది యంతరంగ మవశతఁ బొందిన,కతన నింద్రియముల కడఁక దక్కె. 113
తే. అనినఁ గొండొకన వ్వొల యంగఁ జూచి, యింద్రనందనుఁ డాతని కిట్టులనియె
నేను గలుగంగ నీ కేమి యెలమి వాహ,నముల కుబ్బుగ సంచోద నంబు సేయు 114
క. అనుటయు నాతఁడు దగ నూ,ల్కొనినం దా నుదితనినద కోదండుం డై
యనితరసులభోద్యమమున, ధనంజయుం డిట్టు లను న తనితో మఱియున్. 115
క. అరుణాశ్వంబులఁ బూనిన, యరదంబున వీఁడె నిడుపు లగుచేతులు బం
ధురకంధరంబు వెడలుపు,టురమును నై ద్రోణుఁ డొప్పె నుత్తర కంటే. 116
వ. అని చూపి వెండియు ని ట్లనియె. 117
ఆ. సకలకురుకుమార చాపశిక్షాచార్యుఁ, డాజిదుస్సహుండు సాంగ వేద
వేది నీతిశాస్త్ర విదుఁడు దివ్యాస్త్రకో,విదుఁడు సుజనహితుఁడు
విమలబుద్ధి. 118
వ. అని యగ్గించి. 119
క. తనతనయుకంటె నెమ్మన,మున నాకుం గూర్చు భావ మున గురులకు మా
ర్కొనియెదము రాచధర్మం, బునకీడునఁ జేసి యింత వుట్టఁగ వలసెన్. 120
చ. ఎదురుగఁ బోవ నిమ్ము రథ మీతనితేరికి నన్న నాతఁడుం
బదిలముతోడ రథ్యముల పగ్గము లేడ్తెఱ నూలుకొల్పి యు
న్మదగతి నట్ల చేసిన న మానుషవిక్రముఁ డైనద్రోణుఁడుం
గదిసి యిభం బిభంబుం జెన కం జనుదెంచినలీల వచ్చినన్. 121
వ. నరుఁడు నమస్కరించి గురన కి ట్లనియె. 122
క. అడవులఁ బెద్దయుఁ గాలం, బిడుమలఁ గుడిచితిమి మాకు నిది దఱి యని యి
ప్పుడు వచ్చితిమి విపన్నుల,యెడఁ గృపసేయుటయ లెస్స యీ రలుగకుఁడీ. 123
అర్జునుఁడు ద్రోణాచార్యులతో యుద్ధంబు సేయుట.
క. మును వెఱతు నేయ మీరలు, నను నేసినఁ గాని యనుడు నాకేశసుతున్
ధనురాచార్యుఁ డిరువది, సునిశితబాణముల నేసెఁ జూపఱు వొగడన్. 124
ఆ. అర్జునుండు వాని నన్నింటి నడుమన, తునియ నేయుటయును ద్రోణుఁ డడరి
శతసహస్ర సంఖ్య శరములు గప్పిన, నతఁడు నతనిఁ గప్పెఁ బ్రతిశరముల. 125
చ. అతిరథు లస్త్రశస్త్రవిదు లద్భుతబాహుబలుల్ పరాక్రమో
ర్జితయశు లిట్లు దాఁకి గురు శిష్యులు గౌరవసేనలోనిభూ
పతిసుతకోటికిన్ వెఱఁగు పా టొనరించిరి బాణజాలసం
వృతగగనాంగణం బగున వీనమహాహవ విభ్రమంబునన్. 126
వ. అట్టియెడఁ గురుసైన్యంబుజనంబులు. 127
క. నరుఁ డొక్కరుండు దక్కఁగ, గురుఁడు గడగినపుడు మాఱు కొనఁ జాపధరుం
డొరుఁడు గలఁడె మఱి వెదకిన, హరుఁడు గలం డింకఁగలుగు ననరా దెందున్. 128
క. ద్రోణుఁడు రయమున నేసిన, బాణము లెడ తెగక యొక్క బాణమపోలెన్
శ్రేణి యయి వోవఁ బార్థుఁడు, రేణువు గావించుఁ గంటి రే చిత్రగతిన్. 129
క. గురుశరములు సితపక్ష,స్ఫురణంబున నంచపిండు పొలుపు వహించెన్
నరుబాణతతి ఘనావలి,కరణి మిగుల నొప్పె నల్ల గఱులచెలువునన్. 130
వ. అనుచుం గనుంగొను చుండ. 131
శా. శ్రావ్యం బై చెలఁగన్ గభీరమధుర జ్యానాద ముద్దామవీ
రవ్యాపారనిరూఢతం బ్రతిశరా రంభంబు మర్దించుచున్
సవ్యప్రౌఢిదృఢాపసవ్యగతి నా శ్చర్యంబుగా నేయుచున్
దివ్యాస్త్రంబులఁ బోరి రిద్దఱును సా దృశ్యం బదృశ్యంబు గన్. 132
వ. ఇంద్రాగ్నివాయువరుణదైవత్యంబు లగుశరంబులు గురుం డేసిన నరుండును దత్త
ద్దేవతాకంబు లగునంబకంబులఁ బ్రతిహతంబులు సేయుచు వచ్చె నయ్యిరువురుఁ బె
ల్లేయుసాయకంబు లంతరిక్షంబున దలం బై సంతమసంబు గలిగి యునికి నేబాణం
బెక్కడఁ బాఱుటయుం దోఁపకుండె నట్టియెడఁ గుంభసంభవుబలంబు సరభసంబుగా నతని
కడ్డంబు సొచ్చిన వివ్వచ్చుండు వ్రేల్మిడిం బొడిసేసి సకేయూరంబు
లగుబాహుదండంబులను సకుండలము లగుకర్ణపాశంబులను సకిరీటంబు లగుశిరోభాగంబులను
భూభాగం బలంకరించి యప్పు డావహిల్లినరుధిర సాగరంబునకురత్నాకరత్వంబలవరించె
నిట్లు దుర్జయుండగునర్జునుండు సైన్యంబు దైన్యంబు నొందించుచు నాచార్యునకు
భరంబుగ నేట్లాడు చున్నం జూచి యతండు విస్మితుం డై. 133
క. అర్జునుని నాహవంబున, నిర్జింపఁగ నగునె ఫాల నేత్రున కైనం
బర్జన్యసుతుఁడు శరవ, ర్షోర్జితమూర్తి యగుటరయ నుచితమ కాదే. 134
వ. అని మఱియును దగినపలుకుల నగ్గింప నిలింపనికరంబు. 135
తే. ఇంతప్రొద్దు కిరీటిక ట్టెదుర నిలువ, వెఱవ కున్నప్డు ద్రోణుండ
వింటివాఁడు
నల్లవో తనయున్నసే నకు నొకండ, బలిమిఁ దలమీఱునే యిట్లు నిలువవలదె. 136
మ. అను చుండం ద్రిదశేంద్రసూనుఁడు రయం బత్యంతఘోరంబుగా
ఘనశాతోజ్వ్జలదుర్నివారవిలస త్కాండంబులన్ ద్రోణువా
హనసూతధ్వజదేహముల్ వొదివె ని ట్లస్త్రాబ్ధిని ర్మగ్నుఁ జే
సిన హాహానినదంబు లొక్కమొగిఁ బే ర్చెన్ సర్వసైన్యంబులన్. 137
క. ఈమెయి నిజజనకుభుజో,ద్దామబలము దోడుతోడఁ దఱుఁగుటయు రథ
స్తోమంబుఁ దాను నశ్వ,త్థామ వెసం దాఁకెఁ బాండు తనయునితోడన్. 138
అర్జునుఁ డశ్వత్థామతో యుద్ధము సేయుట.
చ. అతఁడును దీవ్రబాణముల నాతనిఁ గప్పుచు మాఱుకొన్న నా
శతమఖవృత్రసంగరము చందము దోఁచె వడిం జటచ్ఛటా
యితరవ మప్డు వేణువుల నేర్చుదవానలుమ్రోఁతభంగి ది
క్తతిఁ బరఁగెన్ మహాద్భుతము కౌరవసేనకు నావహిల్లఁగన్. 139
వ. అట్టియెడ. 140
చ. ఉఱక నరుండు ద్రోణసుతు యుగ్యములన్ వెస నొంచె నాతఁడుం
దెఱపి యొకింత గాంచి ఘన తీవ్రశరంబున నారిఁ ద్రుంచి క
న్గిఱిపినమాత్రలోన నత నిం బటుబాణచతుష్కయుగ్మ మే
డ్తెఱఁ దొడి మౌర్వి గ్రమ్మఱ ఘ టించునెడన్ వడి నేసి యార్చినన్. 141
క. కురుసేనలోన ని ట్లె,వ్వరుఁ జేసిన వారు లే ర వార్యభుజావి
స్ఫురణోదగ్రుండు గదే, గురుపుత్త్రుం డనుచు సమర కోటి నుతించెన్. 142
చ. చిఱునగ వొప్ప గాండివము సెచ్చెర సజ్యము సేసి సేన లు
క్కఱ రభసంబుమై నడరెఁ గవ్వడి ద్రౌణియు నీడఁబోక య
త్తఱిఁ దఱుమంగ నస్త్రములు దందడి మార్కొని మండు చుండెఁ జి
చ్చఱపిడుగుల్ వడిం దొరఁగు చాడ్పున నంబరవీధి నుగ్ర మై. 143
వ. ఇవ్విధంబున ధనంజయుం డేయువేగంబున నేయుటయు ద్రోణతనయుతూణీ రంబులు
శరశూన్యంబు లయ్యెఁ దనతూణీరంబు లక్షయబాణంబు లగుటం జేసి యంతకంతకు
నతిశయిల్లుపెల్లున నేయుచు నధికుం డగునప్పాండవమధ్యముం గనుంగొని
కృపాచార్యుండు చెంగటం దల మీఱిన. 144
అర్జునుఁడు కృపాచార్యునితో యుద్ధము సేయుట.
క. గురుపుత్త్రునిరథము విడిచి, సరభసముగ నందు సవ్య సాచి గవియుడుం
దిరమై యాతఁడు శితశర,పరంపరలు గురిసె నుగ్ర బంధుర గతులన్. 145
వ. పాండుపుత్త్రుండును జిత్ర సంచారంబుల మెఱయుచు. 146
క. పటువిశిఖపంక్తి యత్యు,త్కటరయమున నిగుడఁ జేయఁ గా నవ్విధ మూఁ
దట యైన మండె దీప్తో,ద్భటభంగిఁ గృపానలంబు బలములు వొంగన్. 147
వ. ఇట్లు మండిశిఖిఁబోలెడికనకలిప్తఘనబాణంబు వనచరకేతువుందాఁకించివేఁడిమి
సూపి వివిధాస్త్రజ్వాలలు గవియించి దిక్కులు సెలంగ నార్చినం గోపంబున
నాటోపంబు మిగిలి బలసూదనసూనుం డతనికేతనంబు దునిమి తరణికిరణాను
కారపారంగతంబు లగునారాచంబులు దదీయాంగంబుల నినుపం దొడంగిన రథ రక్షకు
లగుచంద్రకేతుండును జిత్రాశ్వుండును మణిమంతుండును మంజుమౌళియు హేమవర్మయును
సురథుండును సుషేణుండును నరిష్టుండును సుకేతుండును నుక్కు మెఱయ నొక్కటం
దాఁకిన. 148
ఆ. అన్నివెడఁదవాతి యమ్ము లద్భుతముగ, నొక్కముష్టిఁ దొడిగి గ్రక్కనంగ
నతఁడు లీలఁ దునిమె నందఱతలలును, ఘోరభంగి రక్త ధార లెగయ. 149
సీ. తునిమితోడన యొక్క సునిశితశరమునఁ, గాఁడియు రెంట న క్షములఁ ద్రుంచి
హరుల నాల్గిటఁ జంపి యాలంపుగోలతో, నొగలు మూఁడమ్ముల నుగ్గుసేసి
ధనువును సూతుని తలయుఁ జెఱొక్కట, నఱకి లోచనముల నవ్వు నెఱయఁ
గృపుని నాలోకించి క్రీడి తద్వక్షఃస్థ,లంబునఁ గ్రూరభ ల్లంబు నాట
ఆ. హతరథుండు నిపతి తాశ్వుండు సంఛిన్న,చాపుఁడును నికృత్త సారథియును
నయ్యు నొచ్చియును భు జార్గళసంరంభ, మతిశయిల్ల శక్తి నతఁడు వైచె. 150
ఉ. మండుచు వచ్చుదానిఁ బది మార్గణముల్ గొని వేగ మొప్ప నా
ఖండలనందనుండు గడి కండలు సేసినఁ జూచి యప్పు డా
తం డుడివోక లేక సమ దంబున ఖడ్గము ఖేటకంబు ను
ద్దండతఁ గొంచుఁ దేరు డిగి తాఁ గవిసెన్ రయ ముల్లసిల్లఁగన్. 151
వ. ఇట్లు గవిసిన. 152
క. పలుకయు వాలును నింతిం,తలు దునియలు సేసె బాణ తతిఁ బాండవుఁ డి
ట్టల మైనదెఱఁగుపాటున, నిలిచి కృపుఁడు ద్రోణపుత్త్రు నిరథం బెక్కెన్.
153
ఆ. అప్పు డే పడంగి యన్నిసేనలు భీష్ము,రథముపొంత కొదిఁగె రౌద్రరస వి
నోదియైనయర్జు నుఁడు ధనుశ్చాలన,దీప్తమూర్తి యగుచుఁ దిట్ట కుఱికె. 154
వ. ఇత్తెఱంగున నుఱక తఱియ నుఱికిన. 155
క. బలములు దొరలుఁ బొదివి సం,కులయుద్ధము సేయుఁ గ్రోధ ఘోరాకృతి యై
యిలఁ బ్రోవుగఁ జనురంగం,బున వ్రేల్మిడిఁ బాండురాజ పుత్త్రుఁడు గూల్చెన్.
156
ఉ. చేతులతీఁట వో నిటు ల శేషబలంబుల నుగ్గుసేసి మాం
సాతతపంక యై బహువి ధాయుధమీనము లొప్పఁ జామర
వ్రాతము ఫేనభంగిగ ని రంతరవీరశిరస్సరోరుహ
స్ఫీతవిభూతిఁ బొల్చునది సేసె రణస్థలియందు నెత్తుటన్. 157
తే. ఇట్లు కౌరవానీకంబు నెల్లఁ గలఁచి, యాడి భీష్మునిదెసఁ బోవు క్రీడిఁ
దాఁకెఁ
గొండతోఁదాఁకుతగరును ద్దండవృత్తి,దోఁప వృషసేనుఁడాహవ దోహలమున. 158
వ. విజయుండును. 159
తే. భల్ల మొక్కట నాతని విల్లు దునిమి, యైదునారసములు వక్ష మాడ నేసె
నతఁడు సైరింపరానినొ వ్వడరుటయును, బెగ్గలంబున నరదంబు డిగ్గిపాఱె. 160
వ. అట్టియెడ దుశ్శాసనశకునిదుర్ముఖవివింశతివికర్ణులు దన్నుం బొదివికొనిన
వారల రథరథ్యకేతువర్మంబులు జర్జరితంబులుగా నేసి గాసిచేసిన నందఱుం గనుకనిఁ
బఱవందొడంగినఁ బార్థుండును బ్రహాసోల్లాసభాసియగుచు నుత్తరుం గనుంగొని. 161
తే. కనకమయతాలకేతువు గ్రాలఁ జిరత,టిల్ల తాలీలఁ గలిగి శో భిల్లునంబు
దంబుచాడ్పున సురనదీ తనయుఁ డున్న, వాఁడు సూచితె మత్స్యభూ వరతనూజ. 162
అర్జునుఁడు భీష్మునితో యుద్ధంబు సేయుట.
క. బలువిడి మనదివ్యాస్త్రం,బులచవి సూపంగవలయుఁ బో నిమ్ము రథం
బలసగతి నతనిదెస కని, పలికిన నతఁ డట్ల చేసెఁ బరమప్రీతిన్. 163
ఉ. శాంతనవుండు నప్డు నిజ శంఖము కౌరవరాజసైన్యముల్
సంతస మంద నొత్తుచు స సంభ్రమలీల నెదుర్కొనంగ దు
ర్దాంతభుజాబలప్రకట దర్ప మెలర్ప నరుండు నొత్తె ది
గ్దంతినికాయకర్ణపుట దారణవిత్తము దేవదత్తమున్. 164
తే. మలసి ఱంకెలు వైచుచు మాఱుకొనిన
వృషభములభంగి నక్కురు వృషభులిట్లు
సమరగతిఁ జేరునెడఁ జూచి రమరు లర్థి
ననిమిషత్వంబు దమ కప్పు డచ్చుపడఁగ. 165
వ. ఇవ్విధంబునం గనుంగొనుచు వారలు దమలోన. 166
క. మనలను దానవులను గడ, చినయవి భుజబలము లస్త్ర శిక్షావిధముల్
గొనియాడఁ గొలఁది గా దీ,తని నాతఁడ యతని నితఁడ తగుఁ జెనయంగన్. 167
సీ. అనుచుండ సైన్యంబు లార్పులుఁ బెడబొబ్బ,లును దూర్యనాదంబు
లుల్లసిల్లఁ
బేర్చి యొక్కుమ్మడి భీష్ము నగ్గింపంగ, నతఁడు నిశాతబా ణాష్టకమునఁ
బడగపై హనుమంతు నొడలునుబహుశరం,బులనందుఁజెలఁగెడు భూతములను
దశవిశిఖముల ర థ్యములను సారథి, నేసె వాసవియును నెసక మెసఁగు
తే. నగ్గలిక గాండివంబు చ క్రాకృతిప్ర, కాశవహ్నిస్వరూపత గలిగి విడుపు
తెఱపి గానంగరాకుండ మెఱసియొప్పు, సాంద్రసాయకతతి నాక సంబు గప్పె. 168
తే. అర్జునుఁడు గవియించిన యంప మూడ, మంచుదళముగఁ గప్పిన మార్గణాంశు
జాలముల వెస విరియించె శాంతనవప,తంగుఁ డుద్య్దోతమానప్ర తాపలీల. 169
క. అమరేంద్రతనయుఁ డుగ్రా,స్త్రములు వడిం గురియ నడుమఁ దరమిడి వానిం
దుమురుగఁ జేయుచు వచ్చెను, సమరోల్లాసంబు మెఱయ శంతనుసుతుఁడున్. 170
క. అర్జునుఁడు దివ్యబాణ, స్ఫూర్జితదోశ్శక్తి దనకుఁ జూపిన నతఁ డ
త్యూర్జితబలుఁ డై నియమో,పార్జితఘోరాస్త్రవితతిఁ బ్రతిహతిఁ జేసెన్.
171
క. కవ్వడి యెమ్మెయి నేసిన, నవ్విధమున నాశరంబు లన్నియు దౌదౌ
దవ్వులన నిలువరింపఁగ, వివ్వచ్చుఁడు గినిసి యేసె విలు విఱుగంగన్. 172
మ. తనకోదండము ఖండితం బగుడుఁ గ్రో ధం బార మందాకినీ
తనయుం డప్డు సటావిలుంచనసము ద్యత్క్రోధసింహాకృతిన్
ధను వొం డుద్ధతలీల నెత్తికొని య స్త్రశ్రేణిఁ బర్వించె న
ర్జునుపైఁ దాఁకిరి చక్రరక్షకులు నా ర్పుల్ నింగి ముట్టన్ వడిన్. 173
చ. విజయుఁడు వారి నెల్ల నొక వ్రేల్మిడిఁ ద్రుంచియు భీష్ముసాయక
వ్రజము నడంచియున్ రథము వాజుల నొంచియు నాజికేళియం
దజితవిలాసముల్ మెఱయ నప్పుడు విస్మయ మందు చుండెఁ గుం
భజముఖయోధవీరతతి ప్రస్తుతి సేసిరి సిద్ధఖేచరుల్. 174
క. కొండొకయెడఁ గని శాంతన,వుం డాఖండలతనూభ వునిడామూఁ పు
ద్దండభుజబలము మెఱయఁ బ్ర,చండాస్త్రక్షతము సేసె సరభసవృత్తిన్. 175
చ. కినుక మనంబునం గదిరి క్రీడి పితామహువిల్లు వ్రేల్మిడిం
దునిమి నితాంతగాఢరయ దోర్విభవంబున నొండువిల్లు గై
కొనియెడుసందునన్ నినిచెఁ గ్రూరశరంబు లురంబునందు గ్ర
క్కున నతఁ డొల్లఁ బోయి రథ కూబర మూఁతగ నిల్చె సోలుచున్. 176
క. కనుఁగొని సూతుం డరదముఁ, గొనిపోయెం దొలఁగ నపుడు కుంతీతనయుం
డనిఁ దనివి సనక గుంపులు,గొని యున్నెడ లరసెఁ గలయఁ గురుసైన్యమునన్. 177
వ. ఇట్లఱ్ఱెత్తి చూచి గాండీవంబు దొడసి గుణంబు సారించి కవదొనలు
బిగియించి. 178
క. ఆచార్యసూర్యతనయకృ,పాచార్యప్రభృతిరథికు లందఱు మ్రొద్దై
చూచుచు నుండఁగ నద్దెస, కేచి భుజాబలము మెఱయ నింద్రజుఁ డరిగెన్. 179
వ. అప్పు డశ్వత్థామ కర్ణున కి ట్లనియె. 180
ఆ. వీఁడె వచ్చుచున్న వాఁడు పార్థుఁడు మన, మేమి సేయువార మీవు దక్క
నొరులు నిలువరింప నోపెడువారు లే, రోట లేక తాఁకి యోర్వవలయు. 181
క. అని తను నుల్లస మాటకుఁ, గినిసి యినతనూజుఁ డేను గ్రీడి నిచట మా
ర్కొనువీఁకఁ గన్నులారం, గనుఁగొనుమీ నిలిచి యనుచుఁ గవిసెం బెలుచన్.
182
క. దొరలును సుభటులుఁ గర్ణుని, యరదమునకు మున్న పొదివి రర్జును నచటం
గరి సొచ్చుతుంగమడువున, పరుసున మొన చాఁపకట్టు వడియె నతనిచేన్. 183
తే. ఇవ్విధంబులఁ బోరెడు నింద్రతనయు, నుక్కులావును నంతంత కెక్కు డయ్యె
నలసి మేనులు దూలాడ నిలిచి రంత, నంత నయ్యోధముఖ్యులా హవముదక్కి. 184
వ. అట్టియెడ నుత్తరుండు నరున కి ట్లనియె. 185
చ. ఉడుకువ లేనికయ్యమున కోర్వఁగ వచ్చునె నాకు డప్పి పు
ట్టెడు నొకమాటు నాగ్రహము డింపవు నీవును జక్కుసేసి ప
చ్చడి గలపంగ వెండియును జండితనంబున వచ్చి వచ్చి పో
రెడు మొన లింకఁ జాల నొన రింప భవద్రథసూతకృత్యమున్. 186
వ. అనిన విని కవ్వడి నవ్వుచు నేను గలుగ నీకునోహటింపనేల యంతియ వలసినం
దురంగంబులఁ దోడు గడపెద నించుక సైరించి నిలువ వలయు నెల్లపనులును జక్క
నయ్యె రా జొక్కరుండు గొఱంత యాతం డభిమాని మనలం గని సరకుగొనం డిప్పు డున్న
చందంబు మనతోడం దలపడం గడంగుట దోఁచుచున్నయది తమ్ములు నాప్తభృత్యులు
నిరుగెలంకుల నగ్గలికమెఱసి డగ్గఱియున్నవా రని కౌరవేశ్వరుని గట్టిమోహరంబు
సూపి యతనిం బురికొల్పి యద్దిక్కు దేరు వోవ నిమ్మనుటయు నతండును
దలకొనియట్లచోయనడరి యెడ నెడనడ్డపడుకురువీరులం జిఱునగవు గెడ నిగుడ
మెఱుంగువాలమ్ములఁ దొలంగ జడియుచుం గదిసిన నమ్మేదినీవల్లభుండు. 187
అర్జునుఁడు దుర్యోధనునితో యుద్ధంబు సేయుట.
క. పులి గోల వేసిన ట్టి,ట్టలపురయంబునఁ గడంగు టయుఁ దద్వక్ష
స్థ్సలమునఁ గిరీటి రెం డ,మ్ముల నాటఁగ నేసె బొమలు ముడివడుచుండన్. 188
క. క్షతములఁ బెల్లు దొరఁగుశో,ణితధారలు మదముగా వి నిర్గళకరియా
కృతిఁ గవిసి యతం డేసెను, శతమఖసుతుఫాలతలము శాతశరమునన్. 189
తే. రక్తధారయు వెడలంగ రశ్మి వెలుఁగఁ
బొలుచు బాలార్కుచాడ్పునఁ జెలువు మిగిలి
ఫల్గునుండు ప్రతాపసం భరితమూర్తి
యగుచు శరకిరణంబులు నిగుడఁ జేసె. 190
శా. వానిం దీవ్రశరంబులం దునిమి గ ర్వం బెక్కి నానాస్త్రసం
తానంబుల్ గురిసెన్ సుయోధనుఁడు దు ర్దాంతాకృతిన్ గోత్రభి
త్సూనుండుం బటుసాయకోత్కరమునం జూపెన్ భుజాటోప మి
ట్లేనుం గేనుఁగుఁ దాఁకునట్లు సమరం బేపారఁగా నయ్యెడన్. 191
తే. హస్తిపురిఁ బేరు గల మద హస్తి నెక్కి, క్రాలుకావలిరథములు గవియుదేర
నభ్రగజముపైఁ బర్జన్యుఁ డనఁగ నంప,వాన పరఁగ వికర్ణుండు వచ్చి తాఁకె.
192
ఉ. వీఁక నెదిర్చి యిట్లు కురు వీరులకుం బ్రమదం బొనర్చుచుం
దాఁకినఁ గ్రోధవేగసము దగ్రత నెఱ్ఱనిచూడ్కిఁ జూచి పే
రాఁకలితోడ నున్నజము నాకృతి భీషణరేఖ యొప్పఁగా
వ్రేఁకనినారసంబు దొడి క్రీడి కరిన్ దృఢముష్టి నేసినన్. 193
ఆ. పాలకుంభసంధిఁ బడి వాలమునదెస, నుచ్చిపోవుటయును నుర్వి యద్రువఁ
గూలె నగ్గజంబు గులిశచండాహతిఁ, బడుమహానగంబు భంగి దోఁప. 194
క. అరుణమణిమాలికావి,స్ఫురణంబున దంతితనువు సూడఁగ నొప్పెన్
ధరణిఁ బడియున్నబహుముఖ,పరిగతదావాగ్నిఁ బొల్చు పర్వతముక్రియన్. 195
వ. ఇవ్విధంబున నేనుంగు పీనుం గైన వికర్ణుండు వెఱచఱచి పఱచి వివింశతిరథం
బెక్కె నాలోనన యట్టినారాచంబున రారాజునురంబు నో నాట నేసినఁ గరీంద్రుండు
వడుటయు నరేంద్రుండు నొచ్చుటయుం గని ఱిచ్చవడురథికుల వివ్వచ్చుం డనర్గళ
ప్రసారంబగుమార్గణాసారంబున ముంచిన వెగడుపడి విఱిగి పాఱి రిత్తెఱంగునఁ
దనచుట్టును బయ లైన నయ్యురగకేతనుండును మరలె నిట్లు దొరయును విఱిగి కలను
వాసి కాలుద్రోసిపోవుటయు నతిరథవహారథు లెల్లం జెల్లాచెద రగుటయుం జూచి
సైన్యంబు లున్నవి యున్నచోటన తెరలి కనుకనిం బఱవం దొడంగిన. 196
తే. యూథపతితోడిదంతిస ముత్కరంబు, వెనుకఁ దగిలెడుసింగబు విధము దోఁప
నార్పు నాదంబుగా నరుఁ డంటఁ దాఁకె, రాజుఁ దారును బాఱెడు రథికవరుల. 197
క. వెనుకొని కర్ణునిపెడతల,యును దుశ్శాసనునివీఁపు నొక్కొక్కశరం
బున నేసె నప్పు డయ్యిన,తనయుం డి ట్లనియె నతిర థశ్రేష్ఠులతోన్. 198
ఆ. కూడి ముట్టెఁ గ్రీడి కురువంశమునకెల్ల, మూలకంద మీనృ పాలుఁ డితని
నిచటఁ గాచికొనుట యెల్లపౌరుషములుఁ, జేఁత నిలిచి లావు సేయవలయు. 199
క. అన వినుచుఁ గురుపితామహుఁ,డును ద్రోణుఁడు ద్రోణపుత్త్రుఁ డును
గృపుఁడును గ
ర్ణునిమాట సరకు సేయక, చను చుండఁగ దీనవృత్తి జనపతి పలికెన్. 200
క. లోకంబుతోడివారుగ, మీకుం జనునయ్య మగఁటి మికి గుఱి గాదే
నాకెడ రైనయెడం దగఁ, జేకొని యది మీరు చక్కఁ జేయుట యరయన్. 201
వ. అనిన విని వారలు వెనుక యై యాశ్వాసవచనంబులు పలుకుచుం బోవం బోవు చున్న
యన్నరేంద్రు నెలుం గెత్తి పిలిచి పార్థుం డి ట్లనియె. 202
అర్జునుఁడు దుర్యోధను నుపాలంభించుట.
ఉ. క్షత్త్రియుఁ డోడునే తగదు కౌరవరాజ యొకండ నేఁ బృథా
పుత్త్రులలోనఁ బిన్న నినుఁ బోరికిఁ బిల్వఁగ మాని నాఁగ ని
ద్ధాత్త్రిఁ బ్రసిద్ధి కెక్కి బల దర్పసమగ్రుఁడ వైననీవు నీ
మిత్త్రులుఁ గూడ నిట్లయిన మెత్తురె వత్తురె కొల్వ భూభుజుల్. 203
సీ. ఏనుంగు నెక్కి పె క్కేనుంగు లిరుగడ, రాఁ బురవీథులఁ గ్రాలఁ గలదె
మణిమయం బైనభూ షణజాలముల నొప్పి, యొడ్డోలగంబున నుండఁ గలదె
కర్పూరచందన కస్తూరికాదుల, నింపు సొం పార భో గింపఁ గలదె
యతిమనోహర లగు చతురాంగనలతోడి,సంగతి వేడ్కలు సలుపఁ గలదె
తే. కయ్యముననోడి పోయినఁ గౌరవేంద్ర, వినుమునాబుద్ధిమరలి యీ తనువువిడిచి
సుగతి వడయుము తొల్లింటి చూఱ గలదె, జూదమిచ్చట నాడంగ రాదుసుమ్ము. 204
వ. అని వెండియు. 205
క. నీయట్టివాఁడు నిస్సీ, పోయెడిదే యిట్లు వోకు పోకు మనుడు భూ
నాయకుఁడు మరలి పటుకో,పాయత్తతఁ ద్రొక్కఁబడ్డ యహిగతిఁ గవిసెన్. 206
వ. ఇట్లు గవిసి రథంబులం గడచి కవ్వడిం డలపడియె భీష్మద్రోణాదియోధవీరులు
నొక్కుమ్మడి మగిడి యధిపతితోడన నిగిడి క్రీడియరదంబుఁ బొదివిరి తక్కిన
బలంబులు నంతకు మున్న కౌంతేయుదెస మరలి చూచుచుం బాఱు చునికిం జేసి యేలినవాఁ
డఱుముటయును దొరలు దెగి తిరుగుటయుం గని తెంపుసేసి కూడికొని రభసంబునం
జుట్టుముట్టి యతనిపైఁగ్రందుకొన నడరె నివ్విధంబున వివిధ వ్యూహంబు
లగుబహుయోధయూథంబులుగురిసినయనేకాస్త్రశస్త్రంబులు నానాప్రకారంబులఁ
గుప్పంగూరలుగాఁ దొరఁగినం బెరిఁగినశౌర్యసంరంభంబున విజృంభించి
విజయుండాశ్చర్యధుర్యనిరతిశయరయభరిత కరయుగళుం డయి రథ
రథ్యసారథిస్వాంగంబులుగాచికొని తనతోడంబుట్టువుల ప్రతినలూహించియొండు
సేయనొల్లక సపరివారంబుగా ధార్తరాష్ట్రుల భంగపెట్టం దలంచి
యింద్రదైవత్యంబును సత్యసంవాదనంబును నరాతిసైన్యదైన్యసంపాదనంబును
నగుసమ్మోహానాస్త్రంబుఁ బ్రయోగించిన. 207
ఆ. ఆయుధములు విడిచి యంగముల్ సోలంగఁ, దలలు మెడలుఁ జక్క నిలువ కొఱగ
నెల్లవారు నెఱుక లెడలి చొ క్కెక్కి ని,ద్రాతిశయము గూరి నట్టు లైరి.
208
వ. అప్పుడు పాండవోత్తముం డుత్తరమాటలు దలంచి యుత్తరుం గనుంగొని. 209
సీ. ఇక్కురుసైన్యంబు సొక్కు దక్కకమున్న, గ్రక్కునఁజనుము రా రాజు ద్రోణ
తనయుండుఁ జుట్టిన తలచుట్లు నల్లని,యవి సూతపుత్త్రుశి రోంబరంబు
పచ్చనియది కుంభ భవకృపాచార్యుల,యుష్ణీషములు వెల్ల లుఱక నీవు
దె మ్మింతవట్టును దేవనదీసూనుఁ, డియ్యస్త్రమునకు మా ఱెఱుఁగుఁ గాన
ఆ. యతఁడు దెలిసియుండు నాతనిదెస వోకు, మనిన మత్స్యరాజ తనయుఁ డెలమి
దొలఁక నొగలఁ బగ్గ ములు గట్టి చని వాని, నెల్లఁ దెచ్చి యరద మెక్కుటయును.
210
వ. ఈరథబృందంబులయిఱకటంబు వెడలి నిలుత మని కదలినం గిరీటిం దాఁకి గురు
పితామహుండు శరవర్షంబులు గురిసిన. 211
క. ఆతనిరథ్యంబులఁ ద,త్సూతుని నొప్పించి సాంద్ర సునిశితబాణ
వ్రాతంబు మేన నించి పృ,థాతనయుఁడు నిలిపి వెడలె దర్పోజ్వ్జలుఁ డై. 212
వ. ఇవ్విధంబున నరదంబులయిఱకటంబు గడచి యెడ గలుగనిలిచి రాహునిగ్రహ
నిరాసభాసురుం డగుభానుండునుంబోలె వెలుంగు చున్నంత బలంబులు దెలిసిన. 213
ఆ. కౌరవేశ్వరుండు గను విచ్చి దిక్కులు, గలయఁ జూచి పార్థుఁ గాంచి కడఁగి
యడరఁ జూచుటయును నమరనదీసూనుఁ, డతని కిట్టు లనియె నల్ల నగుచు. 214
క. ఇంత యెఱుంగవు సైన్యము, లింతవడిం దలలు చీర లెఱుఁగక మోహా
క్రాంతంబు లయ్యెఁ బని దెగుఁ, గౌంతేయుఁడు సొరఁడుగాని క్రౌర్యంబునకున్.
215
క. మెడ యొఱగఁ జేతికైదువు, వడ నిను నీ వెఱుఁగ కున్న భంగి గనియుఁ గ
వ్వడి యూర కుండు నటె చె,ప్పెడుకొలఁదియె వానికరుణ పెంపు కుమారా. 216
వ. అతండు మనప్రాణంబులపై రానొల్లక నిలిచిన మనమింతట నిలుచుట కార్యంబు.
217
ఉ. మోహనబాణపాతమున ముందలచీర లెఱుంగ కున్నయీ
బాహుబలంబుతోఁ గడఁగి పార్థునిఁ దాఁకెడుబుద్ధి గ్రమ్మఱన్
సాహసవృత్తిఁ జేసి యవి చారతఁ బోయితిమేని వాఁడు పూ
ర్ణాహుతి సేయఁడే మనల నందఱ నొక్కట మార్గణాగ్నికిన్. 218
వ. కావున. 219
క. మనదేశమునకుఁ బోదము, మన మల్లన తెరువు వట్టి మత్స్యవిభునిగో
ధనముఁ గొని యతఁడు ప్రీతిం, జనుఁ గా కటు మనకు నంత చల మేమిటికిన్. 220
దుర్యోధనుఁడు పరాజితుం డై మరలి తనపురంబునకుఁ బోవుట.
వ. అని చెప్పినపితామహుహితవచనంబు లాకర్ణించి సంగ్రామాతికామియుం
గోపాటోపఘూర్ణమానమానసుండు నగునమ్మానవేశ్వరుండు నిట్టూర్పు నిగిడించి
యుద్రేకంబు దక్కి నిలిచెం దక్కిటివారలు నూర్జితం బగు నర్జునానలంబు
నాలోకించి ధార్తరాష్ట్రరక్షణతాత్పర్యంబున శౌర్యంబు సాలించి
భీష్మువాక్యప్రకారంబు సేసి రిట్లందఱు ముందర దమవచ్చినవంకన తిరిగి
యరుగుచున్నం గని కిరీటి శంఖరవజ్యానాదంబులు సెలంగఁ గొండొకదవ్వు
వెన్నడిందఱిమి బిరుదులతోడి గొడుగులు నడియాలంబులతోడిసిడంబులును
వైపించుకొని తృప్తింబొందిమరలు వాఁడై యెల్లవారును వినం బెద్దయెలుంగునం
బోయివచ్చెదనని చెప్పి గాంగేయ ద్రోణకృపాచార్యులకుఁ బ్రణామబాణంబు లేసి వారి
వీడ్కొనినవాఁడై మిట్టకోలల రారాజుమకుటంబుమణులు డులిచి యతనికిం
జెప్పినవాఁడై యఖర్వబాహా గర్వనిర్వహణంబు మెఱయ నప్పుడు
మధ్యందినమార్తాండప్రచండుం డగుచుండఁ గౌరవవీరు లతనిం దేఱి చూడనుంజాలక చని
రతండును జూపఱం దోలి నిలిచిన మదపుటేనుంగుచందంబున నిలిచి విరాటతనయున కి
ట్లనియె. 221
ఆ. పసులు మరలె శత్రు బలములు పీనుంగు, పెంట లయ్యె రాజుఁ బెద్దదొరలుఁ
జీర లొలువఁబడిరి సిగ్గఱి బిరుదులు, వైచి రింక మగుడ వలదె మనకు. 222
క. హయముల మరల్పు మీత,ల్లియు బంధులు నెడలు సంచ లింప గుమురు గ
ట్టి యెదురుసూతురు వారికిఁ, బ్రియముగ శ్రీఘమ్మునం బు రికిఁ బో వలయున్.
223
వ. అనిన నతండు రథంబు మగిడించినం జని చని. 224
తే. కాలుతక్కువవారలు గలయఁజెదరి, వెనుకఁబడిపోవునెడఁదన్నుఁ గనిభయమునఁ
బ్రాణదానంబు వేఁడినఁ బార్థుఁడభయ, హస్తమిచ్చుచు దయపెను పారఁబలుకు. 225
వ. ఇట్లు నానావిధదీనదశాదందహ్యమాను లగుకృపణులం దనకృపామృతంబునం దడిపినం
దేఱి వారు దీవించుచుం బ్రణమిల్లుచుం బొగడుచుం బోవు చుండ ధనంజయుండు
భూమింజయుం జూచి. 226
ఆ. కురుబలంబు గెలిచి గోవుల గ్రమ్మఱఁ, దెచ్చు టెల్ల నీయు దీర్ణ బాహు
బలమకాఁగ నీవు పలుకుము వెలిఁబుచ్చు, టుడుగు మధిపుపాల నొండుతెఱఁగు. 227
క. అనవుడు నీచేసినయీ, పని నాచేఁ గాక యునికి పతి యెఱుఁగఁడొకో
జనులు నిజము సేయుదురే, నిను నెఱిఁగింపకయ చెప్ప నేర్తునెపొసఁగన్. 228
వ. అని యుత్తరుండు మఱియును. 229
క. నీ వలచినయప్పుడ ధా,త్రీవల్లభుఁ డెఱుఁగునట్టి తెఱఁగు నడపెదన్
దేవేంద్రపుత్త్ర యే ననఁ, గా వేఱొకపేరు గలదె కార్యము నడపన్. 230
వ. అనువచనంబు లియ్యకొనుచుం జని శమీవృక్షసమీపంబున నిల్చి గాండీవాది
సాధనంబులు పూర్వప్రకారంబున నిక్షేపింపనియోగించి కపిధ్వజదేవదత్తకిరీటాది
దివ్యపరికరంబుల సవినయంబుగాఁ బ్రార్థించి యంతర్ధానంబు సేయించి యెప్పటి
సింహపతాక రథంబున బంధింపం బనిచి విరాటతనయుండు నిజాయుధంబులు గైకొని రథికుం
డయి వచ్చునట్లుగాఁ జేసి తొంటిచందంబునం దలచీర యలవ రించికొని సారథి యై
సవ్యసాచి నొగ లెక్కె నట్టిసమయంబునఁ బురందరాది బృందారకులును
దేవమునిసిద్ధగంధర్వాదులును బాండుప్రముఖరాజలోకంబును
నాశ్చర్యహర్షాయత్తచిత్తు లయి సమరవిషయంబు లయినమాట లాడుచు నిజ నివాసంబుల
కరిగి రిట నరుండు నుత్తరు నాలోకించి నీవిజయంబు పురంబున ఘోషింపగోపాలురం
బుచ్చు మనిన నతం డది దెఱంగుగాఁ గైకొని యట్ల చేయ నిట్లు నిగూఢంబుగాఁ
బట్టణంబునకుం జనుచుండ నంతకు మున్న మత్స్యమహీ వల్లభుం
డాహవజయదర్పితవాహినీపరవృతుం డై నగరంబు సొత్తెంచి. 231
తే. మందిరాభ్యంతరమున కా నందలీలఁ, బాండుపుత్త్రులుఁ దక్కటి బంధుజనులు
దానుఁ జని వ్రిపులును వని తాజనంబు, సేస లొలుక సింహసనా సీనుఁడయ్యె. 232
వ. ఇవ్విధంబునం దనవిజయంబు గొనియాడ వచ్చినవారినెల్ల నభినందించియుత్తరుం
డెచ్చట నున్నవాఁ డని యడిగి వారలవలనం గురునాథుండు
భీష్మద్రోణకర్ణకృపాశ్వత్థామాది యోధవీరులుబెరసిన బలంబులతోడనడచి
యుత్తరంబునఁ బసులంబట్టిన నతండు బృహన్నల సారథింగాఁ గైకొని యొక్కరుండ
కుయివోవుట విని విషాద వేదనాదోదూయమాన మానసుండగుచు మంత్రులమొగంబు సూచి
యిట్లనియె. 233
విరాటుఁ డుత్తరుండు కురుసైన్యంబు గెలువఁ బోవుట విని చింతించుట.
చ. అసమున మీఁ దెఱుంగక మ హాగ్రహవృత్తిఁ గడంగి చెచ్చెరం
బసులకుఁ గూయిగాఁ జనియెఁ బాపఁడు కౌరవసేన యేడ యొం
టి సనుట యేడ నా కిది గ డిందివిచారము వుట్టె సైన్యముల్
వెసఁ జని తోడు గావలయు వేగమ పంపుఁడు సాలునట్లుగన్. 234
చ. అనుటయుఁ గంకుఁ డి ట్లనియె నక్కడ వచ్చి సుశర్మ యోడెఁ గా
వున నిట వీరికిన్ జయ మ వున్ వెఱ పేటికి నీకు నుత్తరుం
డని నొకరుండు నాకుము బృ హన్నల సారథి గాన గెల్చు న
య్యనిమిషకోటి నైన నతఁ డద్భుతవిక్రమజృంభణంబునన్. 235
చ. అని వినుచుం గలంగుహృద యంబునఁ దాపము నివ్వటిల్ల ని
ట్లను మఱియున్ విరాటుఁడు ర ణావనియందుఁ ద్రిగర్తసేనచే
ననయము నొచ్చినట్టిజను లందఱుఁ దక్కఁగ నేటుఁ బోటుఁ దా
కని ఘనయోధకోటి చనఁ గా వలయున్ బలుమై రయంబునన్. 236
క. చని యక్కుమారుఁ డే మ,య్యెనొ యత్తెఱఁ గెఱిఁగి మనకు నెయి దించుట పు
ట్టినకార్యమునకుఁదగియెడు, పని యట విధి గెలువ వసమె బ్రహ్మకునైనన్. 237
వ. అనుచు నుత్తలపడునయ్యవసరంబున నుత్తరుండు పుత్తెంచిన గోపాలురు పఱ తెంచి
యతనిం గాంచి. 238
చ. కురుబలమున్ జయించి మన గోవుల నెల్లను గ్రమ్మఱించి యు
త్తరుఁ డిదె తాను సూతుఁడు ను దగ్రత వచ్చుచు నున్నవాఁడు త
త్తురగరథధ్వజాలి నొక త్రుప్పుడు రాలదు మమ్ముఁ బిల్చి వే
పురి నెఱిఁగింపుఁ డన్న నృప పుంగవ వచ్చితి మేము నావుడున్. 239
తే. అంతరంగంబు నిండి రెం డలువులందు
వెడలుసంతోషపూరంబు విధము దోఁపఁ
గన్నుఁగవ సమ్మదాశ్రులు గడలుకొనుచు
గండపులకాంకురములతోఁ గ్రమ్ముదేర. 240
క. ఏమేమీ యని గోప,స్తోమముఁ బలుమాఱు నడుగు చున్ మెయి వొదలన్
భూమీశుఁ డపుడు మంత్రుల, మోములు గనుఁగొని సగర్వ మున ని ట్లనియెన్. 241
శా. వీటన్ వీథుల నెల్ల నేనుఁగులపై విస్ఫారఘంటాధ్వనిం
జాటం బంపుఁడు పేర్మి నుత్తరుజయా శ్చర్యంబుఁ బుణ్యాంగనా
కోటిం బుచ్చుఁ డెదుర్కొనంగ మహిత క్షోణీసుర వ్రాతమున్
ఘోటస్యందనవారణప్రతతులం గూడన్ సతూర్యంబుగన్. 242
క. ఉత్తమకన్యాజనములు, నుత్తరయును గంధమాల్య యుక్తముగఁ గుమా
రోత్తము నెదుర్కొనం దగు, నత్తెఱఁగున సంఘటింపుఁ డభిరామముగాన్. 243
వ. అని నియోగించి గోపాలురకుం గట్టనిప్పించి కంకు నాలోకించి
నెత్తంబొకపలుక యాడుదమే యని యుబ్బుమైమాటగాఁ బలికిన నతండు నీవు సుమాళంబున
నున్నవాఁడవు నేఁడు నీతోడ నాడి జయింప రాదు వెఱతు ననిన విరాటుండు నగుచుఁ
దత్ప్రదేశంబున మెలంగుసైరంధ్రిం గనుంగొని సారెలు దె మ్మని పనిచి పలుక
ముందటికిఁ దిగిచికొనుచు నిందు రమ్మనవుడుఁ బాండావాగ్రజుండు జూదం బాడుట
యెంతలెస్స యనుచుం జేరి యాడం దొడంగునప్పుడు మఱియు ని ట్లనియె. 244
ఆ. జూద మాడి ధర్మ సూనుండు రాజ్యంబు, ననుజులను బ్రియాంగ నను బణంబు
గాఁగ నొడ్డి యాడి కాఱియఁ బడఁడె య, ట్లగుట దీనితోడి యర్థి గీడు. 245
వ. అని పలికి యాడు చుండుసమయంబున. 246
మ. నరనాథుండు ప్రమోదసంపదుదితో న్మాదంబుమై ని ట్లనుం
గురుసైన్యంబుల ముట్టి గెల్చి యెలమిన్ గోవర్గముం దెచ్చె ను
త్తరుబాహాబలశౌర్యసారము లుదా త్తంబుల్ గదే యెందు నె
వ్వరు నెక్కాలము నిట్లు సేసిరె కులై శ్వర్యం బవార్యంబుగన్. 247
వ. అనిన విని కంకుం డతని కి ట్లనియె. 248
చ. కురుపతిభీష్మకర్ణకృప కుంభజముఖ్యమహోగ్రయోధవి
స్ఫురణము నోర్వఁ జాలి రణ భూమి భుజాబల ముల్లసిల్ల ను
త్తరుఁడ జయించెనేని వసు ధావర యింతటికంచె నింక న
చ్చెరువును గల్గునే ధరఁ బ్ర సిద్ధికి నెక్కఁడె యాతఁ డొక్కఁడున్. 249
తే. అనినఁ గటకటఁబడి యిట్టు లాడు టెల్ల, నతనివిజయము సందియ మనుటగాదె
యింతవట్టును సైరించి తీవు గాన, యింక నీమాట లుడుగుము కంకభట్ట. 250
వ. అనుచు విరాటుండు గటంబు లదరఁ గన్నులఁ గెంపు గదురఁ బలుకచప్పు
డగ్గలంబుగా నాడుచున్న సరకు సేయక యుధిష్ఠిరుండు వెండియు ని ట్లనియె. 251
చ. కురుబల మేల దైత్యసుర కోటులు వచ్చిన గెల్వ రాదె యు
త్తరునకు నాబృహన్నల ర థంబుపయిం బరవాహినీభయం
కరభుజసారమున్ మెఱయఁ గాఁ దఱి గాంచితి నంచు విక్రమో
ద్ధురగతి నాజికేలినిర తుం డయి దుర్దమలీల నుండఁగన్. 252
వ. అనిన విని సక్రోధహాసోల్లాసవికృతాననుం డై మత్స్యమహీనాథుండు. 253
ఉ. వింతలు సాల నీవలన వింటిమి గాని ధరిత్రి నెందు నే
మింతకు మున్ను సారథుల నెవ్వరిఁ జూడమె వైరివీరదు
ర్దాంతభుజావిలాస మల రం దెగి పోరుల నస్త్రశస్త్రవి
క్రాంతిఁ గడంగువారి నని కన్నుల నిప్పులు రాలు చుండఁగన్. 254
క. నాకొడుకుపోటుమాటలు, నీ కేటికిఁ బొసఁగ నాడ నేరవు మౌర్య్ఖో
ద్రేకములఁ బలుకుచుండుట, మాకు సహింపంగరాదు మానుము విప్రా. 255
క. అనినం జలమునఁ గుంతీ, తనయాగ్రజుఁ డిట్టు లనియె దరహాసం బా
ననమున ముసుఁగువడఁగ స,జ్జననాయకుతోడ ని ట్ల శంకితభంగిన్. 256
ఉ. ఆహవకేళి వేడుక బృ హన్నలచిత్తమునం దెలర్చినన్
సాహసవృత్తి నుత్తరుని సారథిగాఁ గొనిపోయి కౌరవ
వ్యూహము నోర్చి నీపసుల నొక్కడుఁ దక్కక యుండ సత్వరో
త్సాహతఁ దెచ్చెఁ గా వలయుఁ దప్పదు నాపలు కట్ల చూడుమీ. 257
క. అని యంతట నిలువక య,మ్మనుజేశ్వరుమొగముఁ జూచి మఱియును నతఁ డి
ట్లనుఁ బురములోనఁ జాటం, బనుపు బృహన్నలజయంబు భవ్యవిచారా. 258
విరాటుండు కంకుని సారెఁగొని వ్రేయుట.
ఆ. అనిన రౌద్రరసము మనమున నడరంగ, బడగ యెత్తునురగ పాలురేఖ
నెనయుచేతిసారె గొనివ్రేసెఁబతి పేడి, గడన యుడుగు మన్న నుడుగ వనుచు. 259
వ. ఇవ్విధంబున వ్రేటువడి యజాతశత్రుం డలుక గదురనిహృదయంబుతోడం బాంచాలిదెసం
జూడ్కి మలఁగ నూర కుండె నన్నారీరత్నంబును రయంబునం జేరి వ్రేటుగంటిం
దొరగురుధిరంబుఁ దనయుత్తరీయంబున మెత్తన యొత్తి యచ్చేరువ నున్న
కనకకలశజలంబులం గరతలంబు దడిపికొని తుడుచునప్పుడు మత్స్యమహీవల్లభుం
డీశోణితంబు పైచీరం బట్టుటకుఁ గతం బేమి యని త న్నడిగిన నతని కి ట్లనియె.
260
తే. విమలవంశంబునను బుణ్య వృత్తమునను, వఱలునీతనిరక్తంబు వసుమతీశ
ధరణిపై నెన్నిబిందువుల్ దొరఁగె నన్ని, వర్షములు గల్గు నిందనా వర్షభయము.
261
వ. అని చెప్పి యుత్తమద్విజలోహితపాతం బెట్లునుం గీడు గావున నీకు నొకహాని
పుట్టుటకుఁ జాలక యిబ్భంగిం జేసితి నని వెండియుఁ గొండొకకీలాలంబు దొరఁగం
దొరఁగం దుడుచు చుండె నంత నట యుత్తరు నెదుర్కొనం బోయి. 262
క. మంగళతూర్యరవములు సె,లంగఁగ మౌక్తికవిమిశ్ర లలితాక్షతవృ
ష్టిం గురిసిరి వ్రిపులుఁ బు,ణ్యాంగనలును భద్రవాక్చ యంబులతోడన్. 263
ఉ. అత్తఱిఁ గన్యకాజనస హస్రము దానును జేరి వేడ్కమై
నుత్తర చందనార్ద్రకుసు మోత్కరమున్ నవరత్నసంచయో
దాత్తసువర్ణపుష్పములు దందడిఁ జల్లెఁ గిరీటిమీఁద న
య్యుత్తరుపైఁ బ్రమోదకల నోత్కటసంభ్రమసంభృతంబుగన్. 264
ఉ. తక్కటివారలుం గని ము దం బల రారఁగఁ గౌఁగలించుచున్
మ్రొక్కుచు నాదటం దనదు మోముపయిం దనివోనిచూడ్కులం
గ్రిక్కిఱియించుచుం బొదివి గెల్పు నుతింపఁగ రాజపుత్త్రుఁడ
య్యెక్కుడుమాట కోరువక యి ట్లను న్హరజనంబుతోఁ దగన్. 265
చ. కురుబలమున్ జయించుటయు గోవులఁ దెచ్చుటయున్ బృహన్నలా
స్ఫురితభుజాబలంబునన చూవె నిజం బిది నాక యేల యె
వ్వరికిని నెవ్వరిం గెలువ వచ్చున యిట్టిసహాయసంపదం
బొరయక యున్నమీకెఱుఁగ బోలునె నాబ్రదు కెట్టిభంగియో. 266
వ. అని సారథ్యప్రశంసాప్రకారంబుగా నక్కుమారుం డత్యుపచారవచనంబుల చందంబున
సంక్రందననందను నుతించుచుఁ జనుదెంచి రాజమందిర ద్వారంబుఁ జేరునవసరంబునఁ
బ్రతిహారి ససంభ్రమగతిం జని భూవల్లభునకుం బ్రణమిల్లి భూమింజయప్రవేశంబు
తెఱంగు విన్నవించిన నారథికసారథులం జూచువేడ్క మనంబు వేగిరపెట్టెడు
నయ్యిరువుర నియ్యెడకుం జయ్యనఁ దోడితెమ్మనువిభుని పలుకులు విని
ధర్మతనయుండు పణిహారితో నల్లన యి ట్లనియె. 267
క. ఇన్నెత్తురు గనుఁగొనిన బృ,హన్నల కోపించు నన్ను నతిభక్తిమెయిన్
మన్నంచుఁ గాన రాజుం, దన్ను విచారింప కేమి దప్పు దలఁచునో. 268
వ. ఇది లెస్సగాఁ దుడుచునంతకుఁ దదీయప్రవేశం బించుకవడి వారింపుము పదం పడి
రా నిత్తు గాని యంతకు నుత్తరుం డొక్కరుండు వచ్చునట్లుగాఁ జేయుము. 269
క. అని చెప్పి హర్ష సంభ్రమ, మున నజ్జననాయకుండు మనుఁగుట నది యే
మని యడుగఁ దలంపమిఁ దని, కను వైకార్యము ఘటించి యతనిం బుచ్చెన్. 270
చ. అతఁడును బార్థు నిల్పి విన యంబున నుత్తరుఁ దోడితెచ్చినం
బితృచరణాంబుజంబులకుఁ బ్రీతిమెయిం బ్రణమిల్లెనాతఁడా
పతియునుఁ జిక్కఁ జేర్చె గరు పాఱెడు మేనును హర్ష బాష్పసం
ప్లుత మగునాననంబు నయి పుత్త్రునిఁ బెద్దయుఁబ్రొద్దు గౌఁగిటన్. 271
వ. ఇవ్విధంబున నాలింగితుం డయి భూమింజయుండు పునఃపునఃప్రణామంబు సేసి
కంకునిం గనుంగొని సగౌరవంబుగా నమస్కరించి మొగంబుగంటి సూచి యిది యేమి యని
యడిగిన. 272
క. ఏ నీవిజయము వొగడఁగఁ దా నప్పుడు పేడిఁ బొగడె దానం గోపం
బూనిన సైరింపక నా, చే నడిచితి సారె గొని వి శృంఖలవృత్తిన్. 273
క. అని పతి వలికిన విని నె,మ్మనమున భయసంభ్రమములు మల్లడిగొన న
మ్మనుజేంద్రనందనుం డి, ట్లను నత్యాదరము మెఱయ నాతనితోడన్. 274
తే. తప్పు సేసితి రిట్టులు దగునె వీర, లేమిగతిఁ బల్కినను నది యెల్ల
మనము
గైకొనవలయుఁ గా కిట్లు గాదు గూడ, దని నిషేధించు టొప్పునె మనుజనాథ.
275
వ. అని మఱియును. 276
క. సవినయముగఁ బ్రార్థింపుఁడు, పవిత్ర చారిత్రు లైన పరమద్విజు లి
ట్లవమతులై కోపించిన, నవనీశుల కేల కల్గు నాయువు సిరియున్. 277
వ. అనిన విని యమ్మాటలు పాటిగాఁ బట్టివిరాటుండు భయభక్తియుక్తంబుగావేఁడి
కొనినం బాండవాగ్రజుండు నగుచు నాకు నలుక యెక్కడిది యితండును గీడు
తెరువువాఁడు గాఁడిది యొకప్రొద్దు కీడున నయ్యెం గాని యని తాను రాజుదెసఁ
బ్రసన్నుం డగుట దెలియునట్లుగా నుత్తరుతోడం బలికిన నమ్మహీవల్లభుండు
సంతసిల్లి తదవసరంబునఁ బ్రవేశించి కాంచినయాబృహన్నల నాదరించి నిజనందను
నాలోకించి యి ట్లనియె. 278
విరాటుఁ డుత్తరుని సమరప్రకారం బడుగుట.
ఉ. ద్రోణుఁడు భీష్ముఁడుం గృపుఁడు ద్రోణసుతుండును గర్ణుఁడుం బశు
త్రాణపరాయణత్వమున దర్పసముజ్వ్జలభంగి నుల్లస
ద్బాణపరంపరల్ గురియఁ బార్థివుఁడున్ వెను దన్ని చూడ న
క్షీణజవంబునం గవియు సేనకు మార్కొన నగ్గలించితే. 279
ఉ. బాసట లేదు క్రొవ్వడర బంటుతనంబునఁ దాఁకితేనియుం
బాసినచోట వాయుఁ బెఱ పట్టులవీరు లుదగ్రవృత్తిమై
మూసికొనంగ వత్తు రొక మోహర మమ్ముల మ్రగ్గెనేని నా
సాసల నొక్కరుండ యను నాగ్రహవృత్తి బలంబు పైఁ బడున్. 280
ఆ. ఒకడుఁ పరశురాము నోర్చినవాఁ డొక్క,రుండు ధనువునకు గు రుండు దాన
హరువరమునఁ బుట్టి యక్షీణబలవిక్ర,మముల నొక్కఁ డొప్పు మాఱు లేక. 281
ఉ. తక్కటివారలున్ సురల దైత్యుల నైనను బోర గెల్చువా
రక్కురుసేన మేటిమగ లాధృతరాష్ట్రతనూజు లాజి నొ
క్కొక్కఁడ ధాత్రి యంతయును నోర్వఁగఁ జాలుదు రట్టివారి నీ
వెక్కటి దాఁకి నొవ్వకయు నెమ్మెయి గెల్చితి నాకుఁ జెప్పుమా. 282
ఉ. గోవుల నెట్లు లాఁగితి వ కుంఠితవిక్రముఁ డైనరాజరా
జేవిధి మానభంగమున కెల్లను నోర్చి పలాయమానుఁ డై
నీవిజయంబు సైఁచి ఘన నిందకు నియ్యకొనంగఁ జాలెఁ బు
త్త్రా వెఱఁ గయ్యెడున్ రణవి ధం బఖిలంబు నెఱుంగఁ జెప్పుమా. 283
చ. అనవుడు నాతఁ డి ట్లనియె నక్కురుసేనల నేను గెల్వ గో
ధనమును నే మరల్ప మన దైవబలంబునఁ జేసి దేవసం
జనితుఁడు నాఁగ న్హర మగు చందమువాఁడు మహాత్ముఁ డొక్కరుం
డని ననుఁ గాచెఁ గౌరవుల నందఱ గెల్చె మరల్చె గోవులన్. 284
వ. అత్తెఱంగు వివరించి విన్నవించెద నవధరింపుము. 285
తే. ధూళి పెల్లుగ నెగయంగ నేల గోడి, వడఁగఁ జనుమూఁకఁ గని వడు వడ వడంకి
పాఱుదేరంగ నమ్మహా భాగుఁ డప్పు, డోడ కోడకు మని నన్నుఁ గూడవచ్చి. 286
వ. పట్టుకొని మగుడం గొనిపోయి రధంబుపైఁ బెట్టిన నే నతనియాజ్ఞకు మిగుల
కుండితి. 287
ఉ. కౌరవసేన గోగణముఁ గైకొని పోవ నతండు ముట్టి యం
దారసి రాజుఁ గానక యు పాంతమునం దొలఁగించి వేగ నా
తేరట దోలి యడ్డపడి తీవ్రశరంబుల నబ్బలంబుదు
ర్వారరయంబు మాన్చి పశు వర్గము నిద్దెస వెల్చె నార్చుచున్. 288
ఆ. చెదరకుండఁ బసులఁ బొదివి యించుకమేర, యిక్కడరుగుదెంచి యెలమిమగిడి
కడచిపోవుచున్న కౌరవపతి ముట్ట, నడరినంత సేన లతనిఁ గూడె. 289
మ. కురురాజున్ సబలంబుగాఁ గవిసినన్ ఘోరాహవం బయ్యె నం
దరదంబుల్ నుఱు మయ్యె నశ్వములు ను గ్గయ్యెం గరివ్రాతముల్
ధర దంతంబుల యూఁతగా నొఱగె ను ద్యద్బాహుదృప్యద్భటో
త్కరముల్ దిట్టినయట్లు గూలెఁ గలయం దద్బాణపాతంబులన్. 290
క. శత్రుంతపాదు లగునృప, పుత్త్రులుఁ బేరు గలయోధ పుంగవులును ద
చ్చిత్రశరనిహతి సంగర, ధాత్రిఁ బడిరి వారి నెన్నఁ దడ వై యుండున్. 291
తే. మొనలు దెరలినఁ గర్ణుండు ముంచి తాఁక
నమ్మహావీరుఁ డాతని తమ్ముఁ జంపి
హరుల నొప్పించి సూతు నో నాడ నేసి
యంగముల బాణములు నించి యతనిఁ బఱపె. 292
క. గురుఁడు దలపుడిన నతఁ డ, చ్చెరువుగ దివ్యాస్త్రవితతిఁ జిక్కివఱిచి త
ద్వరసుతుఁడుఁ గృపుఁడుఁ దాఁకినఁ, దెరలిచి భీష్మునకుఁ గవిసె
దృఢరభసమునన్. 293
చ. అతనిం దీవ్రశరంబులం బొదివి నా నాస్త్రంబు లేసెన్ నదీ
సుతుఁడుం దత్సమయంబునం గినిసి యా శూరుండు చాపంబు ద్రుం
చి తదీయాంగము నొంచినన్ వివశుఁ డై చేడ్పడ్డచో సూతుఁ డు
ద్గతభీతిం దొలఁగంగఁ దోలె రథముం దత్ప్రాణరక్షార్థి యై. 294
క. తమతమబలములతో ని,ట్లమితభుజావీర్యులైన యారథికవరుల్
గ్రమమునఁ దలపడి యోడిన, సమరవిహారమునఁ దనివి సనక యతండున్. 295
మ. ధరణీనాథుఁడు దానుఁ దమ్ములును దు ర్దాంతోద్ధతిం గూడి మో
హర మత్యూర్జితభంగి నేర్చికొని యు ద్యద్విక్రమం బొప్ప బం
ధురసంరంభత నున్నఁ జూచి బలవ ద్దోస్త్సంభలీలాభయం
కరరేఖావలమానచాపుఁ డయి వీఁ కం దాఁకె నాసేనతోన్. 296
క. కౌరవపతియనుజన్ముల, దూరమునన్ విశిఖనిహతిఁ దొలఁగ జడియుచుం
జేరి వికర్ణునికరి నొక,నారసమునఁ గూల్చి కదిసి నరపతి నొంచెన్. 297
తే. రాజు నొచ్చిన విఱిగిరి రథికవరులు, విభుఁడు దోడన తిరిగె న వ్వీరుఁ
డపుడు
దోలి యాచిక్కుమూఁకల తోడఁ గూడ, నతని దవ్వుల నడవికి నడిచి మగిడె. 298
వ. ఇది యమ్మహాపురుషుచేసిన విధం బనిన విని యచ్చెరు వంది విరాటుండు. 299
ఆ. ఆతఁ డెవ్వఁడొక్కొ యమ్మహాత్మునిఁ గనుం, గొనఁగఁ గౌఁగిలింప
వినయమొప్ప
నర్య్ఘపాద్యవిధుల నర్చింప భక్తిసం,యుక్తి నెపుడుఁ గొలిచి యుండవలయు.
300
క. ఎచ్చోట నున్నవాఁ డతఁ, డిచ్చోటికి నేల రాఁడొ యిప్పు డనుడుఁ దా
నచ్చట నంత్హరితుఁ డై, యిచ్చఁ జనియెఁ దోఁచు నేఁటి యెల్లిటిలోనన్. 301
ఉ. దేవకుమారకుండ యగుఁ దేజముచందము సూడ నాతఁ డీ
గోవులఁ గ్రమ్మఱించుటకుఁ గూడినయంతియ కాదు నాకు సం
భావనసేయువత్సలత భంగులఁ దా మనవంశ మంతయుం
గావను బ్రోవనుం దలఁపు గల్గుట దెల్లము సేసె నెంతయున్. 302
వ. అని చెప్పి యుత్తరుం డతనిం బ్రమోదాయత్తచిత్తుం జేసె నట్టిసమయంబునఁ
గౌంతేయాగ్రజుండు ముఖప్రాంతంబు పైచీరచెఱంగునం బొదివికొని ధనంజయునిఁ జక్కం
జూడక యుండె విరాటుండు కిరీటిపరాక్రమంబు క్రమంబున నిట్లు దనతనయునివలన
వినియునుం దెలియక యెప్పటినపుంసకత్వబుద్ధితోడన సంభావించి పోవం బనిచిన
బృహన్నలయును జతురంబుగాఁ బలికి తిదియ తెఱంగు ధర్మనందనునకు నింతకు మిక్కిలి
యెఱింగింప కుండునది యని వైరాటితో నల్లనచెప్పుచుం జనియె నజ్జననాయకుండును
గంకునిం బొ మ్మని యుచిత పరివారవృతుం డయి భూమింజయు నంతిపురంబునకుం
దోడ్కొని యరిగి సుదేష్ణా సందర్శనసమాచరణంబు నడపి యతం డడుగఁ ద్రిగర్తపతి
నోర్చినతెఱం గెఱింగించె నట నరుండు నాట్యశాలకుం బోయి. 303
అర్జునుఁ డుత్తరకు బొమ్మపొత్తికలుగాఁ గురువీరులశిరోంబరంబు లిచ్చుట.
తే. చెలులుఁ దానును నుత్తర యెలమిఁ దన్నుఁ
గాంచుటయుఁ బ్రీతి యెసలార గారవించి
బొమ్మపొత్తిక లడిగితి కొమ్మ యింద
మనుచు నిచ్చెఁ దాఁ దెచ్చిన యంబరములు. 304
వ. ఇవ్విధంబునఁ గృతకృత్యుం డయి యథాపూర్వంబుగా మజ్జనభోజనంబులు సలిపి
ధర్మతనయునివాసంబునం దేకాంతస్థలంబునఁ దా రేవురును ద్రౌపదియును
గూడఁబడునట్టితెఱంగు సంఘటించి సమాగమసముచితప్రకారంబు నడపి గోగణనివర్తనంబును
రణప్రవర్తనంబును నన్యోన్యవిదితం బైనయనంతరంబ యగ్రజు నుద్దేశించి
బీభత్సుండు భీమసేనున కి ట్లనియె. 305
క. మొగ మొప్పదు నా దెస నీ,జగతీనాథునకు నే వి చారించియునుం
దగ దీనికిఁ గారణ మిది, యగు నని యేర్పఱుప నేర నయ్యెద నెట్లున్. 306
వ. అనిన విని యుధిష్ఠిరుం డతని కి ట్లనియె. 307
క. ఒండేమియు లేదు విరా,టుం డాత్మతనూజుఁ బొగడు డును దుర్దమదో
ర్దండత గల్గుబృహన్నల, యుండఁ గొఱఁత యేమి పగఱ నోర్చుట కంటిన్.
ఆ. అనినఁ బేడిఁ బొగడె దని యవివేకి యై, కోప మడర సారె గొని యతండు
వ్రేసె నెత్తు రపుడు వెడలఁ బోయినఁ జీరఁ, గప్పికొంటి నీవు గానకుండ.
309
క. అని చెప్పి గంటి సూపిన, ననిలతనూభవుఁడు గనలి యాదుష్టాత్ముం
దనయాదిబంధుహితముగ, ననిచెద జముప్రోలి కనియె నంగము వొంగన్. 310
వ. కిరీటియుం గోపించి. 311
క. తనకొలఁది యెఱుంగనియ,మ్మనుజాధము నిపుడ పట్టి మర్దింపక త
క్కినఁ గాదు వీనిరాజ్యము, నిను నంతయుఁ జేరుఁ గా క నియె ధర్మజుతోన్. 312
చ. అనవుడు నాతఁ డిట్టు లను నక్కట యింతకు ముంద రేమియున్
మనల నెఱుంగఁ డవ్విభుని మాటునఁ బూనిక దీర్చికొంటి మా
తని కొకయెగ్గు సేఁత యుచి తంబె యెఱింగెడునట్లు గాఁగఁ బో
యినఁ గనియున్ దురుద్ధతి వ హించినఁ జూతము గాక పిమ్మటన్. 313
వ. అని పలికి వారలకందు మాన్పి యిది యట్ల కాక యెండు దగునే యనుచుఁ
దక్కినవారిదెసయుం గనుంగొనిన నెల్లవారు నుపశమించిరి తదనంతరంబ తమ్ము
నెఱింగించుతెఱంగు దలపోసి తా రందఱు విరాటుకొలువుకూటంబునకుం బోయి బయలు
మెఱసి యుండువారుగా నిశ్చయించి యారాత్రి గడపి వేగుటయుం గృతస్నాను లయి
పాండుసూనులు సమయవిహితాచారంబులు నడపి యుచితప్రకారంబున. 314
క. తెలుపు లగుచీరలను బూఁ,తలఁ బువ్వుల నొప్పి రాజ తనయానుగుణో
జ్వ్జలమాననీయవేషము, లలవడఁ గూడుకొని నగరి కరిగిరి ప్రీతిన్. 315
క. చని ధర్మసుతుఁడు సింహా,సనమున భీమాదు లాత్మ సముచితరుచిరా
సనముల సభాస్థలిం గయి,కొని పంచాగ్నులునుబోలెఁ గూర్చున్నంతన్. 316
తే. వేడ్కఁదొడిపూసికట్టి య వ్విరటుఁ డుత్త,రుండు దోఁజనుదేరఁగొ
ల్వుండుబుద్ధి
నచటి కేతెంచి కని విస్మ యంబు నొంది, యెల్లిదంబుగఁ దలఁచుచు నిట్టులనియె.
317
క. ఇది యేమి కంక నీ వు,న్మదవృత్తిని శంక దక్కి నాగద్దియపైఁ
బదిలంబుగఁ గూర్చుండితి, వదియును గా కిపుడు డిగ వ హంకారమునన్. 318
వ. అనిన విని మందహాసంబు సేసి సంక్రందననందనుం డతని కి ట్లనియె. 319
సీ. నడదీవియలు సేసె నగరికి మాణిక్య,మకుటముల్ పూనిన మనుజపతులఁ
దగునాజ్ఞసూయాణ ముగ నొనరించె మం,చిగ నేలనాలుగు చెఱఁగులకును
బ్రీతార్థిజనుల స చేతనత్యాగధ్వ,జములుగా నన్నిదే శములఁ బఱపె
దిక్కులన్నింటను దెలుపారుపూఁత గా,వించె నుజ్వ్జలయశో విభ్రమంబు
తే. రాజసూయాధ్వరప్రవ ర్తకుఁడు నిత్య,సత్యభాషామహావ్రత శాలి పాండు
రాజదుగ్ధపయోనిధి రాజు ధర్మ,రాజు సుమ్ము మత్స్యావనీ రమణ యితఁడు. 320
ఉ. ఈతఁ డజాతశత్రుఁడు మ హిం దగ దిగ్విజయంబు సేసె వి
ద్యాతిశయార్థి వాసవుమ హాసన మైనను నెక్క న్హరుఁడు
ద్య్దోతితమూర్తి కౌరవకు లోద్వహుఁ డార్యనికాయసంతత
ఖ్యాతచరిత్రుఁ డీచిఱుత గద్దియకుం దగఁడే నరేశ్వరా. 321
అర్జునుఁడు విరాటునకుఁ ద మ్మెఱిఁగించుట.
వ. అనిన విని యతండు విస్మయసంశయంబులు మనంబునం బెనంగొన నితండు
ధర్మతనయుండయేని భీమార్జున నకులసహదేవులుం బాంచాలియు వేరి యని యడిగినఁ
గవ్వడి యి ట్లనియె. 322
చ. వలలుఁ డనంగ నీనగర వంటలవాఁ డయి నిల్చి వేడ్కకుం
బులిఁ గరిఁ గేసరిం దొడరి పోరఁగఁ బంచినఁ బోరు జెట్టిమ
ల్లుల విఱుచుం గడంగి ప్రబ లుం డనఁగాఁ జరియించు చుండు వి
చ్చలవిడి భీముఁ డీతఁ డవి షహ్యపరాక్రమదుర్దముం డనిన్. 323
తే. బకమహాసురు నిర్జించి బ్రాహ్మణులకుఁ
బ్రీతిఁ గావించెఁ గిమ్మీరు పే రడంచి
వనము నిష్కంటకము సేసె ఘను హిడింబుఁ
గూల్చి యాతనిచెలియలిఁ గొనియె నితఁడు. 324
క. నీమెచ్చువారువంబులఁ, దా మచ్చిగ నరయు నిత్య తాత్పర్యమునన్
దామగ్రంథి యనఁగ నొక,నామము ధరియించె నితఁడు నకులుం డధిపా. 325
క. శత్రునృపకాలకూటము, మిత్రామృతవృష్టి బుధస మీహిత సిద్ధి
క్షేత్రము సజ్జనసంస్తుతి,పాత్ర మితఁడు మాద్రితొలుత పట్టి నరేంద్రా. 326
క. నీపాలికి వచ్చి నిఖిల,గోపాలకముఖ్యవృత్తిఁ గొలువు వడసి తం
త్రీపాలుఁ డనఁగ మత్స్య,క్ష్మాపాలక మెలఁగు వీఁడె సహదేవుండున్. 327
క. సుకుమారమానసుఁడు గొం,తికిఁ బ్రాణము ప్రాణ మితఁడు తేజోగణ్యుం
డకుటిలుఁడు రాజనీతి,ప్రకారసంవేది వంశ పావనుఁడు నృపా. 328
వ. అని యిట్లు ధర్మజభీమనకులసహదేవులం గ్రమంబునం జూపి చెప్పి మఱియు ని
ట్లనియె. 329
క. విను సైరంధ్రీవేషం,బున మాలిని యనఁగఁ బరఁగి పూతచరిత్రం
బునఁ గేకయభూవరనం,దనకడ మెలఁగుసతి ద్రపద తనయ మహీశా. 330
క. ఆచపలాక్షికిఁగా మన,కీచకు లందఱను రాత్రి గీటడఁచె రహ
స్యోచితవిధమున గంధ, ర్వాచరణముపేర భీముం డతిభీమముగాన్. 331
విరాటునకు భీముఁ డర్జును నెఱింగించుట.
వ. అనియె నప్పుడు వృకోదరుండు. 332
సీ. షండరూపమునఁ బ్ర చ్ఛన్నుఁ డై వచ్చి క,న్నియలకు నెల్లను నృత్తగీత
వాద్యనైపుణ మన వద్యశిక్షావిధి, నలవరించుచు బృహ న్నల యనంగఁ
బరఁగునీతండు బీ భత్సుండు సు మ్మని, చూపి యమ్మత్స్యరా జునకుఁ జెప్పి
వెండియుఁ బలుకు నా ఖండలు నోడించి, ఖాండవ మేర్చె నా తండు దన్ను
తే. గారవించిన నెక్కటి కాలకేయ,వర్గములఁ బరిమార్చె ని వాతకవచ
సంఘములనోర్చె గంధర్వ సమితిగెలిచి, ధార్తరాష్ట్రాగ్రజునిచెఱఁ దలిఁగె
నితఁడు. 333
వ. అనిన విని యద్భుతరసాక్రాంతం బగునంతరంగంబునం గలుగుసందేహావేశంబు
వినయసంభ్రమంబుల నిగుడ నీ కునికింజేసి చిక్కువడి యున్ననిజజనకునకు నర్జునుం
జూపి యుత్తరుం డి ట్లనియె. 334
తే. ఈతఁ డింతకు మీకుఁ ద న్నెఱుఁగఁ జెప్ప
వలవ దని నియమించినఁ దెలియఁ బలుక
నలికి యొకదేవసన్నిభుం డంటిఁ గాని
నిన్న యంతయుఁ దాఁ గదా నిర్వహించె. 335
చ. ఒకరుఁడ తాను భీతి వెగ డొందెడు రెండవనన్ను నెట్టకే
లకుఁ దగఁ దేర్చునప్పుడు బ లంబులతోఁ గురురాజు సూడ దా
నికి మది శంకలేమి మహ నీయపరాక్రముఁ డైనయీకిరీ
టికిఁ జనుఁ గాక యివ్విధము దెప్పర మన్యుల కోర్వ వచ్చునే. 336
చ. తము నెఱిఁగించి యల్ల నుచి తప్రియభాషల నన్ను సూతకృ
త్యమునకుఁ జొన్ప నేను బ్రమ దంబున నప్పటి కియ్యకొంటి లో
కముసమరంబునట్ల యని కయ్యముతీవ్రతకుం దగంగ ర
థ్యములఁ జరింపఁ జేఁత భర మై తుదిఁ బల్మఱు నోహటించితిన్. 337
క. మొగ మోడఁ డితఁడు కౌరవ,జగతీశుఁడు విఱిగినపుడు జవమున వెనుకం
దగిలి యిది జూద మాడఁగ, నగునెడగా దఱుమ వలయు ననియె నతనితోన్. 338
ఆ. అనిన నతఁడు వెఱపు నత్యాదరంబును, సంతసంబు మాన సమున బెరయ
నవయవముల సంభ్ర మావేశ మేర్పడ, గారవమున విజయుఁ గౌఁగిలించె. 339
క. వినయంబు మిగులఁ గుంతీ,తనయాగ్రజుపాదపీఠ తలమున ఫాలం
బును బొందఁ జాఁగి మ్రొక్కి య,తనికౌఁగిలి వడసె సమ్మ దము దళుకొత్తన్. 340
ఆ. ప్రీతి నలుమడింప భీమునిఁ గవల నా,లింగనంబు సేసి యంగకములఁ
బులక లెగయఁ గేలు దల మోడ్చి ధర్మజు, నాననమున దృష్టి యడరనిలిపె. 341
ఉ. అత్తఱి లేచి వచ్చి తన యన్నలఁ దమ్ములఁ గానిపించె న
య్యుత్తరు నర్జునుండు దగ వొందఁగ నప్పుడ పిల్వఁ బంచె మా
త్స్యోత్తముఁ డార్యమిత్రసచి వోత్కరసోదరవర్గపుత్త్రకో
దాత్తభటాదియోగ్యుల ము దంబునఁ బాండవదర్శనార్థ మై. 342
వ. ఇట్లు సమస్తజనసమేతంబుగా ధర్మతనయసేవాతత్పరుం డై తదనుమతి సముచిత
రుచిరాసనంబున నుండి విరాటుం డంతఃపురవర్తులం బిలిచి యంతయు సుదేష్ణ
కెఱింగింపం బనిచి పాంచాలిం దగినతెఱంగున గారవించునట్లు గావించె నట్టి యెడ
ధనంజయుం డి ట్లనియె. 343
తే. చాల దుస్తర మైనయ జ్ఞాతవాస, వత్సరంబు భవద్గర్భ వాసగుప్తి
వలనఁ గడపితి మతిసుఖా వాప్తచిత్త,వృత్తి నేము నిర్భయులమై విందులట్ల.
344
వ. అనిన విని విరాటుం డతని కి ట్లనియె. 345
ఉ. ఏ నన వేఱ యొక్కఁడనె యిట్లనఁగాఁ దగునయ్య యిమ్మెయిం
గాననదేశవాసములఁ గాఱియ కోర్చి యడంగి యుండి మీ
పూనిక దీర్చి మీ రెలమిఁ బొందుట యెల్లను బుణ్యదేవతా
నూనదయాసమృద్ధి నను నొందుట గాదె సురేంద్రనందనా. 346
వ. అని పలికి ధర్మనందనుం జూచి, 347
చ. ధరణియుఁ బట్టణంబు హయ దంతిరథంబులు గోవులున్ భటో
త్కరము నమాత్యవర్గమును గాఁ గలరాజ్య మితండ యేలు ని
ర్భరమున నేనుఁ బుత్త్రులును బంధులుఁ దమ్ములుఁగొల్చి యుండెదం
గరిపురి కెత్తునట్టిపని గల్గిన నోపినయంత సేసెదన్. 348
చ. అన విని యుత్తరుండు దగ నజ్జనపాలకుతోడ ని ట్లను
న్మన కొక రాజ్యముం గలదె నన్నును నిన్నును నిన్న మొన్న వీ
రనితరసాధ్యశత్రువిజ యంబునఁ గాచినయప్డు గల్గఁ జే
సినయది దక్క దాని మఱి సెప్పఁగ నేటికి నింతవింతగన్. 349
వ. అది సిద్ధం బట్ల చెల్లుం గాక యించుకవిశేషంబు గలదు వినుము. 350
చ. సవినయవృత్తిఁ గొల్వ మిట చన్నదినంబుల వీరు నీఱు పైఁ
గవిసిననిప్పులట్లు యధి కం బగుతేజము దోఁప కున్కి న
ట్టివిధము సాపరాధతను డెందము లూఱటఁ బొంది యుండ నే
రవు మన కట్లు గాన తగఁ బ్రార్థన సేయుట యుక్త మిత్తఱిన్. 351
వ. అదియునుం గాక. 352
క. ధనవర్గంబులు వీ రి,చ్చినయవి య ట్లగుట వేడ్క సేయవు తగ నూ
తన మగుకానిక యీవల,యును వే తోడ్తేరఁ బనుపు ముత్తరఁ బ్రీతిన్. 353
వ. అనిన విని మత్స్యమహీవల్లభుండు మనం బలర మంత్రులమొగంబు సూచి కుమారిక
నలంకరించుకొని తెం డని నియోగించిన వారును బ్రియంబునం జని
తత్కార్యశ్రవణసంప్రీత యగుసుదేష్ణయనుమతంబున. 354
క. పదనికి రాఁ బులు గడిగిన, మదనాస్త్రమురేఖ గలిగి మానినిమెయి చె
న్నొదవఁ గయిసేసి రప్పుడు, ముదితాజనములు ప్రమోద మున లలితముగన్. 355
విరాటునిమంత్రు లుత్తరను బాండవులయొద్దకుఁ దోడ్తెచ్చుట.
వ. ఇట్లు శృంగారంబుసేసినయమ్ముద్దయకు ముక్తాఫల ప్రాలంబమాలికలతోడి
గొడుగులు వట్టించి యత్యాదరంబున నయ్యమాత్యులు దోడ్తేర ధారాధరనికరమనోహర
యగుపర్జన్యలక్ష్మియుంబోలె వచ్చు చున్నం గని విరాటుం డెదురువోయి
పురోహితులును బంధుజనంబులుం దానునుం బొదివికొని పాండవాగ్రజునగ్ర
భాగంబునకుం దెచ్చి యచ్చెలువ నిలిపి సపరివారంబుగా దండప్రణామంబుసేసి చేతులు
మొగిడ్చి యిట్లనియె. 356
క. ఎఱుగమిచీఁకటి నీపె,ద్దఱికంబు దలంప నేమి తప్పు గలిగినన్
మఱచి దయఁ జూడు మి ట్లం, దఱు నీకుం బనులు సేయఁ దగుదురు వీరల్. 357
వ. అని నిజానుజతనూజులం జూపి మఱియును, 358
క. ఇమ్ముద్దియ నర్జునునకు, ని మ్మీపని బంధుజనుల కిందఱకుఁ గడున్
సమ్మత మెల్లప్రజకు నే, నిమ్మెయి నినుఁ జేరి బ్రదుకు టిష్టం బధిపా. 359
క. అని పలికిన విని కుంతీ, తనయాగ్రజుఁ డింద్రసుతువ దన మాలోకిం
చిన నాతఁ డిట్టు లను న,మ్మనుజేంద్రుఁడు వినుచు నుండ మత్స్యాధిపుతోన్.
360
క. ఈకన్నియఁ గోడలిఁగాఁ, గైకొనియెదఁ గాని యిది ద గ దుచితవృత్తిన్
నాకడన యబల మెలఁగుట, లోకము శంకించు నన్ను లోలాత్మునిఁగాన్. 361
వ. అదియునుం గాక నృత్తగీతాదులయెడ నిక్కోమలి గురుండ నైననాకు నివ్విధంబు
ధర్మంబు గాదు గావున. 362
మ. హరిమేనల్లుఁడు బాహువీర్యపటుశౌ ర్యస్ఫూర్తి త్రైలోక్యసుం
దరుఁ డాచారపవిత్రుఁ డంచితకళా దక్షుం డుదారుండు గా
తరసంరక్షకు, డార్యసమ్మతుఁడు వి ద్యావైభవోల్లాసి య
త్యురుతేజుండు వరించుఁ గాక యభిమ న్యుం డీసరోజాననన్. 363
వ. అనిన విని మత్స్యమహీకాంతుం డత్యంతసంతుష్టాంతరంగుం డై. 364
తే. అర్జునునివియ్య మనియెడు నంతకంటెఁ, గడవఁ బెంపు నా కెయ్యది కార్యనిశ్చ
యంబు ధర్మతనూభవుం డానతిచ్చు, వాఁడు మనమెల్లఁగావించు వారమదియు. 365
ఆ. అనుడు నతనికిట్టు లనుఁ బాండవాగ్రజుం,డింద్రతనయుఁ డుచిత
మెఱిఁగిపలికె
నిట్లు సేయువార మిప్పుడు సుట్టాల, కెల్లఁ జెప్పి పుచ్చు డీశుభంబు.
366
వ. అని నిశ్చయించి పలికిన విరాటుండును గౌరవాన్వయసంబంధంబున మాత్స్య
వంశంబు పావనం బయ్యె నని పలుకుచు ధర్మజభీమార్జుననకులసహదేవులకుఁ గ్రమంబున
నుత్తరఁ బ్రణామంబు సేయించిన వారు దీవించి యంతఃపురగమనంబునకు ననుజ్ఞ సేయ
నచ్చెలువ నెచ్చెలులుం దానును దత్సమయసముచితపరివార పరివృత యై యరిగినయనంతరంబ
మౌహూర్తికుల రావించి లగ్ననిరూపణంబు సేసి యాదవపాంచాలాదిబంధుజనంబుల నెల్లఁ
బెండ్లికింబిలువ రెండుదెఱంగుల వారును గాలరులం బనిచి రజాతశత్రుండును విరటు
గారవించి తా రతనిపాల నజ్ఞాతవాసంబు సుఖవృత్తి నడపికొనుట వాక్రుచ్చి పలికి
యతనిగుణంబులు గొనియాడి నీవు మాకు వాసుదేవునట్ల కాక సామాన్యబంధుండవే యని
సంభావించి వినయ నిభృతుం డగునతనిం దిగిచి పునఃపునరాలింగనంబు సేసిన నతండును
ససంభ్రమపరిజనసముపనీయమానంబు లగునానావిధోపకరణంబులం గౌంతేయులకు
వివిధోపచారంబు లాచరించి మహ్హారమజ్జనభోజనంబులు నడపె నంత నక్కడ
దుర్యోధనుండు నిజపురంబునకుం జని చని నడుమ విడిసినయెడం
గర్ణశకునిదుశ్శాసనులదుర్మంత్రంబు వట్టి గాంగేయునివచనంబు లప్రమాణంబులు
సేసి ధర్మతనయుం డసత్యంబున కియ్యకొనమి యెఱింగి యాతనిపాలికి దూతం
బుత్తెంచిన వాఁడు నేతెంచి కాంచి యి ట్లనియె. 367
తే. వాలి యజ్ఞాతవాససం వత్సరంబు, నిండ కుండంగ మున్నపా ర్థుండు బయలు
మెఱసి సమయంబు దప్పె నీ వెఱిఁగి దీని, కేది దగు నది సేయుము మేదినీశ. 368
వ. అని పునర్వనవాసకరణంబుదోఁప నాడిన నవ్వి యధిష్ఠితసత్యవ్రతుం డయిన
యుధిష్ఠిరుం డతని కి ట్లనియె. 369
క. నిండె సమయాబ్దములు నిం, కొం డన లే దిపుడ చని సు యోధనుతో భీ
ష్ముండును గురుఁడును వినఁగా, నిండె ననుము నిండె నిండె నిక్కంబునకున్.
370
చ. అని తగఁ జెప్పి పుచ్చఁ జని యాతఁడు దప్పక చెప్పె నంతయున్
విని ధృతరాష్ట్రసూనుఁడు వి వేకవిహీనత నాఁటిరాత్రి కొ
ల్వున గురుభీష్మకర్ణకృపు లుం దనతమ్ములు నుండ ధర్మనం
దనునకు దూతఁ బుచ్చినవి ధంబు ప్రకాశము సేయ కి ట్లనున్. 371
ఆ. మనము మోసపోయి యనిమిషపతిసూతి, తోడఁ బొడిచితిమి య దోషవృత్తి
నతఁడు సమయకాల మంతయుఁ గడచిన, వచ్చెనో యెఱుంగ వలయు నిజము. 372
క. అనిన విని యేటిమాటలు, వినువారలు నగరె యేను వివిచ్చుఁడు వ
చ్చినయపుడ తెలుపనే వల, దనుమానము సమయకాల మట మును కడచెన్. 373
క. అనవుడు భీష్మునిపలుకులు, విని యందఱు సమ్మతించి వెరవిఁడియే ఫ
ల్గునుఁ డనిరి పతియుఁ బురికిం, జనియెను మఱునాఁడు విరళ సైన్యంబులతోన్.
374
శ్రీకృష్ణుఁడు బలదేవాదులతోఁ బాండవులఁ జూడ వచ్చుట.
వ. ఇవ్విధంబునం బ్రకాశులై పాండునందనులు
శమీవృక్షనిక్షిప్తసమస్తసాధనంబులుఁ బూజాపూర్వకంబుగాఁ దెచ్చుకొని
యుపప్లావ్యంబున వసియించి మత్స్య మహీనాథుండు పంపు సేయం బెంపు మిగిలి
పౌరజానపదనానావిధోపహారంబులు గైకొనుచు బహురత్నంబులకు భాజనంబులై
మహనీయవిభూతి శోభిల్లుచున్నంత వాసుదేవుండు బలభద్రపురస్సరంబుగా
సాత్యకిసమేతుండై సుభద్రాభిమన్యులం దోడ్కొని కృతవర్మయుఁ బ్రద్యుమ్నుండును
సాంబుండును యుయుధానుండును రుక్ముండు నక్రూరుండును నింద్రసేనాదిపాండవ
సారథులును రథారూఢు లై కొల్చి రా మఱియు ననేకయాదవకుమారులును
గరితురగస్యందననిబిడంబు లగు బలంబులతోడ నిరుగెలంకుల నడవం జనుదెంచి. 375
తే. భవ్యవిభవంబుతోనుప ప్లావ్యపురము, సొచ్చిసంభ్రమమునబాండు సుతులుదనకు
నెదురు వచ్చిన నాహ్లాద మెసక మెసఁగఁ, దత్సమాగమయోగ్యవి ధంబు నడపె. 376
వ. బలదేవప్రముఖులకును దదీయసందర్శనసముచితసమాచారంబు లొనర్చి సుభ
ద్రాభిమన్యులం బాంచాలిపాలికిం గొనిపోవ నభ్యంతరజనంబుల నియోగించి. 377
క. లలితమణిమయవిభూషణ, ములు రుచిరాంబరములును బ్ర మోద మెడఁద ని
ట్టలముగ హరి కుంతీపు,త్త్రుల కెల్లను నిచ్చి పిదప ద్రోవది కిచ్చెన్.
378
వ. ఇట్లు గట్టనిచ్చి వేఱువేఱ రథకరితురగదాసదాసీజనంబులనొసంగి పద్మనాభుండు
పాండవులుం దానునుం గలసి సంతసంబున నలరారు చుండెఁ దదనంతరంబ. 379
సీ. ద్రుపదభూవిభుఁడు పు త్త్రులుఁ దానుఁజతురంగ, బలములతోవచ్చి
పాండుసుతులఁ
గాంచి వారలు దన్నుఁ గరము సంప్రీతిమై, గారవింపఁగ నుండెఁ గాశిరాజు
శైబ్యుండుఁ బదపడి సైన్యసమేతు లై, చనుదెంచి ధర్మనం దనునిచేయు
సత్కారముల గాఢ సమ్మదంబునఁ బొంది, రవ్విరాటుండును నంతవట్టు
తే. వారలకుఁ దత్తదుచితప్ర కారములఁ బ్రి
యంబు దలకొన సంవిధా నంబు సేసె
మఱియు బహుదేశములబంధు మాన్యమిత్ర
వర్గములు వేడ్కఁ బెండ్లికి వచ్చెఁ గలయ. 380
వ. ఇవ్విధంబున రెండుదెఱంగులచుట్టంబులు నైనభూపతులు దమతమవిభవంబులు మెఱసి
వచ్చి యుండ విరాటుండు పురంబున నుత్సవంబు సాటించిన, 381
క. కలువడములు మణితోరణ,ములుఁ గట్టిరి క్రముకకాండ మోచాస్తంభం
బులు నాటిరి కుంకుమమునఁ, గలయ నలికి మ్రుగ్గు లిడిగి కర్పూరమునన్. 382
క. వివధాలంకరణంబుల, నవకాంతి వహించి పట్ట ణంబు వివాహో
త్సవమాధవలక్ష్మికి లలి,తవనంబై యెలమికలిమి తావల మయ్యెన్. 383
ఉ. తాను సుదేష్ణయున్ సుతులుఁ దమ్ములు బంధులు గంధమాల్యనా
నానవరత్నభూషణమ నఃప్రియమాంగలిక ప్రసాధనా
నూనవిభూతి మత్స్యవిభుఁ డుజ్వ్జలలీల వహించి భూమిదే
వానయనాదికృత్యపరు లైనజనంబుల గారవించుచున్. 384
వ. గరువంపుసంభ్రమంబులతోడ నిజమందిరంబునందు. 385
సీ. అమలరత్నప్రదీ పావలి మెఱుఁ గిడఁ, బనిచి మణిస్తంభ పంక్తిఁ గ్రొత్త
జిగి దళుకొత్తున ట్లుగఁ దొడయించి వి,చిత్రవితానముల్ సెలువు మిగులఁ
గట్టించి నూత్నము క్తాదామములతోడఁ, గుసుమమాలిక లెడ గ్రుచ్చి వ్రేలఁ
గీలింప నియమించి కేవలమంగళ,భూరుహపల్లవ తోరణములు
తే. సంఘటింపనియోగించి చందనమునఁ, బరిణయాగార మలుకంగఁ బాణియాణి
గలుగు ముత్తియముల మ్రుగ్గు గా నొనర్పఁ, జతురపుణ్యాంగనాజన తతిఁబొనర్చె.
386
క. వైదిక లౌకికవిధిసం,పాదితవివిధ్హారవస్తు భరితత్వమునన్
వేదిక పొలు పగునట్లుగ, మోదమునఁ బురోహితుండు మునుకొని చేయన్. 387
క. ఉత్తర నలంకరింప ను, దాత్తాభరణాదివస్తు తతి యొసఁగి నరేం
ద్రోత్తముఁడు నేర్పు గలచెలి, కత్తియలం బుచ్చెఁ బ్రీతి గడలుకొనంగన్.
388
అభిమన్యుని వివాహమహోత్సవము.
వ. ఇట్లు వైవాహికవర్తనసంవిధానసావధానుం డగుమత్స్యమహీనాథుండు
మౌహూర్తికాదిశిష్టజనులు పరివేష్టింపనుండి లగ్నం బాసన్నం బగుచువచ్చెనని
ధర్మ తనయున కెఱింగింపం బనిచిన నతండు ననుజసహితంబుగా నలంకృతుం డై
వివిధప్రసాధనశోభితు లగుసమస్త బంధుజనంబులం గూర్చికొని యభిమన్యునకు
శృంగారంబు సేయించి భద్రగజారూఢుం జేసికొని యేనుంగులం బేరు గలవారువంబులను
మట్టపుదట్టంబు సేసికొని మణిగణంబులు నంబరనికరంబులుఁ బుష్ప పుంజంబులు
ఫలప్రచయంబులు లోనుగాఁ గలయోగ్యవస్తువుల విస్తరిల్లినక్రంత నడవ
మంగళతూర్యనాదంబులు విప్రాశీర్వాదంబులు మాగధగానంబులు వంది
జనవాక్యసంతానములుఁ జెలంగ వాసుదేవపుస్సరంబుగా విరాటుమందిరంబున కేతెంచి
శంఖజయఘంటాపణవాదినిక్వణంబులతోడ నెదుర్కొని చల్లుసేసలు గైకొనుచుం
జొత్తెంచిన. 389
క. విరటుఁడు సంభ్రమమును నా,దరమును భక్తియును నాత్మఁ దలకొనఁ బూజా
పరుఁ డై సమయసముచితా, చరణంబులు నిర్వహించె సమ్మదలీలన్. 390
తే. విహితపరిపాటితో విప్ర వృద్ధజనులు, పుణ్యకర్మపరంపరఁ బూని నడప
నర్థిఁగృష్ణయుధిష్ఠిర పార్థమత్స్య,వరులు దెర యొద్ద నవ్వధూ వరుల నిలిపి.
391
వ. సాంవత్సరికదత్తకాలకళావిశేషంబుల మంగళతూర్యంబులు సెలంగ నత్తెర
యెత్తించిన. 392
ఉ. వీనులఁ దియ్య మెక్క మును విన్కిఁ బరస్పరరాగవృత్తిలో
నూనినఁ జూచువేడుకల నువ్విళు లూరెడు నెమ్మమంబు ల
చ్చో నొక యింతసేపు నెడ సొచ్చుట కోర్వక యుండ నున్నయ
మ్మానినియుం గుమారుఁడును మారవికారము లంకురింపఁగన్. 393
వ. అన్యోన్యావలోకనంబు సేయునప్పుడు. 394
సీ. వరుచూడ్కి ముద్దియ వదనంబుపైఁ బాఱి, తివుటమై నునుఁగాంతి తీపు గ్రోలు
సుందరీరత్నంబు చూపు మనోరము, నడుగులయొప్పుపై నల్ల నడరుఁ
బతివిలోకనములు పడఁతుక మైఁదీవఁ, గలయంగఁ బలుమఱు మెలఁగుచుండు
వెలఁదికటాక్షముల్ విభునిపైఁ గ్రమమున, నెగసిమోమునఁజోఁకి మగిడివచ్చు
తే. నొండొరువులలేఁ జెమ్మట నూని వ్రేఁగు,పడినచాడ్పున నవయవ భంగులందుఁ
దగిలి మఱుపునఁ దడయుని ద్దఱవిశాల,నయనదీప్తులు నెఱుకువ బయలుపడఁగ. 395
వ. తదనంతరంబ. 396
తే. ఒండొరులదోయిళులనిను పొందఁ జేయు, నక్షతప్రకరంబు ల న్యోన్యమస్త
కములఁబోసిరిమందార కల్పలతలు, విరులుగమియనొండొంటిపైఁ గురియునట్లు. 397
చ. లలితతనూవిలాసముల లజ్జకతంబునఁజేసి మున్ను వి
చ్చలవిడిఁ బట్టఁగా వెరవు సాలక యోరలు వాఱుచూపులన్
లలిఁ దలఁబ్రాలు వోయునెడ లం దగ వొందిన నూలుకొల్పి యి
మ్ములఁ బచరింతు రొండొరుల మోహనమూర్తులపై వధూవరుల్. 398
తే. చిత్తమున గాఢరాగంబు చేతఁ జూపు, తెఱఁగు దోఁపఁ గెం పారెడు తీఁగబోఁడి
మృదులపాణిఁ గుమారుండు మెలపుమైగ్ర,హించెఁ బల్లవాలంబిమ త్తేభలీల. 399
వ. ఇట్లు పాణిగ్రహణం బాచరించి. 400
క. పెనుఁగుదుట నిడినచూతం,బును నవమాలికయుఁబోలెఁ బొలు పొంది రతం
డును నమ్ముగ్ధయు నేకా,సనమున నున్నపుడు నూత్న సౌభాగ్యమునన్. 401
సీ. కోర్కులు గెడఁగూడు కొని పార మెయ్దిన, చిత్తంబు లూఱటఁ జిగుళు లొత్తఁ
బులకాంకురములకుఁ దలతాకుడై యిరు, మేనను మవ్వంబు మిగిలి పొదలఁ
దఱి వేచి చనఁబోయి తడఁబడి మార్గతి, వడి చూపు లాదట బయలుపఱుపఁ
జెమటలతావులు తమలోనఁ గలసి వే,ఱొక్క సౌరభము నై చొక్కు సేయ
తే. గాఢసంస్పర్శభంగులు గల్గునట్టి, హోమసమయకృత్యంబుల నొదవి సౌఖ్య
రసము పెన్నిట్టపొరిఁబొరిఁ గ్రమ్ముదేర, సమ్మదాంబుధిఁ దేలిరి సతియుఁ
బతియు. 402
వ. ఇవ్విధంబున వివాహంబు నిర్వహించి మత్స్యమహీనాథుండు మణిభూషణంబులు
రుచిరాంబరంబులుఁ గర్పూరాదిసుగంధద్రవ్యంబులుఁ దాంబూలంబులతోడిపళ్లెరంబులఁ
బచరించి పాండవులకు వాసుదేవపూర్వకంబుగాఁ బురోహితప్రకరంబునకుం గట్ట నిచ్చి
యాజ్ఞ సేనీసుభద్రలకు ననురూపాభరణపరిధానంబు లంతఃపురవర్తులైన
య్హరజనంబులచేతం బుచ్చి సౌభద్రునకు భద్రసామజసప్తశతియును
లోకోత్తరతురంగదశసహస్రంబును సలక్షణగోపంచలక్షయు రథంబులు రెండు వేలును
దాసదాసీజనంబు లక్షయు మఱియు నానాప్రకారంబు లగుధనంబులు నరణం బిచ్చె
నమ్మహనీయమహోత్సవంబు మంగళసంవిధానసావధానపుణ్యాంగనలవలనను నృత్తగీతాది
వైచిత్య్రమనోహరవారనారీజనంబులవలనను వినూత్న రత్నమయభూషణాది
దీప్తవేషవిరాజమానులగుకుమారుల చతురపరిహాసాది విలాసంబులవలనను
బ్రభూతవిభవవిభ్రాజితు లగు రాజసూనులమాననీయగరిమ లలితవిహారవిశేషంబులవలనను
బాంచాలయాదవకేకయాది బాంధవమహితమహి మాంచితసంచరణంబులవలనను
నానందనిష్యందిపాండునందన సౌహార్దంబువలనను మత్స్యమనుజపతిమందిరంబు
పరమసంపద్భరితంబై యుండె నని చెప్పిన విని వైశంపాయనునితో జనమేజయుండు, 403
క. కుంతీనందను లట్ల,త్యంతవిభవ మెసఁగఁ బరిణ యము సేసి సుహృ
త్సంతోషోజ్వ్జలు లై తద, నంతర మెబ్భంగి నడచి రనవుడుఁ బ్రీతిన్. 404
చ. అమృతమయాత్మ భక్తి సుగ మానుభవోజ్వ్జలదివ్యవర్మ్త ష
ట్సమయగతానుభావ పురు షత్రయతా వివృతస్వభావ ని
ర్మమహృదయైకవాస ముని రంజననిత్యవిలాస దోషసం
గమవినికర్తనా పరమ గౌరవధుర్యపదప్రవర్తనా. 405
క. దుర్వహపటుతాపత్రయ, నిర్వాపణకరణ బోధ నిర్మలజనహృ
త్పర్వాచరణ మహాసుర, గర్వాపహరత్వసంప్ర కాశైకరణా. 406
మాలిని. నిగమకుసుమగంధో న్మేషభూతాభిధానా
సగుణవిగుణలీలా సౌమ్యసాక్షిత్వనానా
జగదవనవిధానా స్థైర్యదత్తావధానా
నగశరధినివాసా నంద సంస్తూయమానా. 407
గద్యము. ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్త్ర బుధారాధనవిరాజి
తిక్కనసోమయాజిప్రణీతం బయినశ్రీమహాభారతంబున విరాటపర్వంబునందు సర్వంబును
బంచమాశ్వాసము. 408
శ్రీమదాంధ్రమహాభారతమునందలి విరాటపర్వము సమాప్తము.
I have sent out a mail to the folks at andhrabharati. I will keep the
group updated once i hear back from them.
-Prakash.
దలఁచుట యెంతయుం బ్రియము దమ్ములుఁ బుత్త�
వాహనములు భోజనములు&nb
మిపతులలోన సాధుజనమిత్ర�
క.&nb
I wrote to ANDHRA BHARATHI earlier for permission. They have clearly
refused permission to allow others copy their content. Again, in a
recent mail to me, Mr. VST Sai has protested use of their material in
Wiki Source without permission.
Hence we should respect their rights and refrain from copying their
content. This is not an issue of copy right but an issue of "work"
done buy somebody. They are another group of people contributing to
Telugu Literature. Hnece we should not discourage them in any way by
using their work without permissiin.
K SUDHAKARA BABU
> IMPORTANT.
>
> Hence we should respect their rights and refrain from copying their
> content. This is not an issue of copy right but an issue of "work"
> done buy somebody. They are another group of people contributing to
On a related note, Telugu-Wiki pages also contain good amount of other material; for e.g. #bhaagavatamu#, taken from Andhrabharati site. I noticed that some 5-6 months ago and asked about that (without exactly mentioning the content!) on one of these Telugu Unicode Fans' groups. Is something going to happen there also?
Regards,
Sreenivas
--
GMX FreeMail: 1 GB Postfach, 5 E-Mail-Adressen, 10 Free SMS.
Alle Infos und kostenlose Anmeldung: http://www.gmx.net/de/go/freemail