Verses from Karnaparvamu: 8_2_301 - 8_2_330

233 views
Skip to first unread message

Prakash Swaminathan

unread,
Feb 16, 2008, 2:38:52 PM2/16/08
to Andhramahabharatam
8_2_301 క.
తురగద్విపరథతూర్యా, భరణధ్వజచామరాతపత్రశకలముల్
వొరిఁ బొరి ధరఁ గప్పఁగ నె,త్తురుటేఱులు వానిఁ దొలఁగఁ ద్రోచుచువచ్చెన్.

8_2_302 వ.
అట్టియెడ.

8_2_303 తే.
అంగవంగనిషాదకళింగబలము, లర్జునునిమీఁదఁ బెల్లుగ నడరుటయును
గురుతనూభవుఁ డతనిని మురవిరోధి,నంపపెనువెల్లి ముంచి బెట్టార్చి పేర్చె.

8_2_304 వ.
అవ్విక్రమవిశేషంబునకు రోషంబు నొంది.

8_2_305 క.
అవ్వీరుం డవ్విప్రుని,క్రొవ్వును నాసైన్యసమితి క్రూరోద్ధతియున్
నివ్వటిల నీక ఖచరులు,నివ్వెఱపడ సమరకేళి నిపుణత మెఱసెన్.

8_2_306 వ.
మెఱసిన నెఱసినరోషంబున మఱియును.

8_2_307 మ.
గురుపుత్రుం డసురాంతకున్ విజయునిం గ్రూరాస్త్రసంతానని
ష్ఠురపాతంబున నొంప నాహరి దదాటోపంబు సైరింప క
న్నరులో నౌషధ మూఁది చేసి తెవులు న్మర్దింప కున్నం దుది
న్భర మై యుండదె యే పడంపుము రిపు న్సంరంభివై నావుడున్.

8_2_308 వ.
అతండు విజృంభించి గుణంబు సాలించి.

8_2_309 చ.
శిరమునఁ గంఠదేశమునఁ జేతులయందు నురస్థ్సలంబునం
జరణములన్ శరంబులు వెసన్ నిబిడంబుగఁ గీలుకొల్పుచున్
వెరవునఁ బగ్గముల్ దునువి వేగమ యీడ్చెఁ దురంగమంబు ల
గ్గురుసుతుతేరు గయ్యమునకుం గడుదవ్వు దొలంగ భూవరా.

8_2_310 వ.
ఆభూదేవుండును భగ్నోత్సాహుండై యల్లన సూతనందనుసమీపంబునకుం
జనియె నప్పుడు శౌరి సంశప్తకసైన్యంబుదెసకుం దేరు నడవుచుం దమసేన
దిక్కు కోలాహలం బాకర్ణించి చూడ్కి యట నిగిడించి యర్జును నుద్దేశించి
వేదండారూఢుం డైనదండధారుండు మనబలంబులం గలంచుచున్నవాఁ డమ్మగ
ధోత్తముండు భగదత్తునంతవాఁడ యతని మడియించి మఱి చేయం గలసని
సూచికొండ యని పలికిని నక్కవ్వడి యొడంబడ నక్కడ కరదంబు వోవ నిచ్చె
నట్టియెడ.

- దండధారుం డనురాజు వేదండంబుతోడ నర్జునుచేఁ జచ్చుట -

8_2_311 క.
పాండవసైన్యంబుల వే,దండంబుల ఘోటముల రథంబుల భటులం
జండగతి మగధపతి నిజ,శుండాలముఁ బఱపి యేపుఁ జూపి తెరల్చెన్.

8_2_312 వ.
అవ్విక్రమవిహారంబు వీక్షించి.

8_2_313 తే.
మాగధునికోల్తలకుఁ గాక మనబలంబు
విఱిగెఁ బొద పొద మని తాను దఱిమెఁ దేరు
హరియుఁ బఱపంగ నర్జునుం డడ్డపడియెఁ
జండచేష్టితోద్దండవేదండమునకు.

8_2_314 క.
అగ్గలిక దండధారుఁడు,దిగ్గజనిభనిజగజంబుఁ దీవ్రత మెఱయన్
డగ్గఱఁగఁ బఱపి హయముల,నగ్గరుడధ్వజుని నరుని నమ్ములఁ గప్పెన్.

8_2_315 చ.
అలిగి కిరీటి మాగధధరాధిపుబాహులు ద్రెంచి గ్రక్కునం
దలయును ద్రుంచి యేనుఁగు నుదగ్రతఁ బీనుఁగుఁ జేసె నప్డు గొం
దల మొకయింత లే కతనితమ్ముఁడు దండుఁడు దాఁకి తోమరం
బులు వరఁగింపఁ గేలు శిరముం గరటిం దునుమాడె నుగ్రతన్.

8_2_316 క.
తదనీకంబుగజంబులు, వొదివిన బలుగాలి మేఘములఁ దీవ్రగతిం
జెదరించుపగిది నరుఁ డు,న్మదుఁడై నలుదెసలఁ దోలె మనుజాధీశా.

8_2_317 వ.
ఇవ్విధంబున మగధసైన్యంబు మర్థంచి సంశప్తకసైన్యంబుపైఁ గవిసి కపికేత
నంబుమెఱుంగులు మెఱయ మధుమథనువెరవున వెలిమావులగతు లక్కజంబు
గా నుక్కున బార్థుం భల్లనారాచప్రముఖప్రదరపరంపరలసొంపును బాహు
వీర్యధైర్యంబులపెంపును నిలింపనికరంబు వర్ణింప నందు మహార్ణవంబునం
దిరుగుమందరనగంబుచందంబున నిజస్యందనం బొప్ప నప్పటప్పటి కెక్కుడొద
వుమదంబునం ద్రిగర్తాదు లగునమ్మార్తురు పైపయిం గ్రమ్మి కురియునస్త్రశస్త్రంబు
లు విదళితచ్ఛిన్నచూర్ణితంబులు సేయుచుఁ దదీయగాత్రంబులుం గరటి ఘోటక
తనువులుం దునియ లయ్యును నుగ్గు లయ్యును బఱియ లయ్యును గుదు లయ్యు
ను ధరం దొరఁగఁ దామరబావిం గేలి సల్పుసామజంబుచాడ్పున విహరించి యవి
హతధృతివ్రతహితు లగునహితుల నత్యుత్తమలోకంబులకుం బుచ్చినం
గొంచెపుమూఁక విచ్చినం బెద్ద వెనుకొనక యరదంబు మరల్చి వచ్చునెడ
నచ్యుతుం డర్జును నుద్దేశించి భవద్విక్రమవిహారస్థలంబు సూచితే యని పలికి
వివిధాయుధఖండంబులను వేదండాశ్వరథపదాతిశకలంబులను భూషణాతపత్ర
కేతుచామరాంశంబులను జక్షుశ్చమత్కరణపరిణతం బగురణస్థలంబు సూపె
నప్పుడు గొఱప్రాణంబులతో నొఱలునరతురగద్విరదంబులను గొందఱు దమ
వారిం గానక కన్నీళ్లు నించుచు నాలింగనరోదనప్రముఖంబులైనకరుణాభాష
ణంబు లగునవస్థావిశేషంబులం బొందువారలం గృపాళురై యాలోకించుచు
నయ్యిరువురుఁ దమమోహరంబున నెసంగుకలకలంబు విని యుదీర్ణగమనంబు
నం జనుదెంచు చుండి రట మున్న కౌరవ్యులమొనయును గర్ణునిమొగ్గరంబు
ను రెండుముఖంబులం బెనంగు చుండి కయ్యంపుటుచితత్వంబునం గలసె
నట్టియెడ రారాజు పురికొల్ప రాధేయునకుఁ బ్రాపయి పుళిందబాహ్లికటేంక
ణాంధ్రభోజానీకంబు గవిసినం గౌంతేయబలంబునకు భరం బగుటయు.

- మలయధ్వజుం డనుపాండ్యమహారా జశ్వత్థామచేతఁ జచ్చుట -

8_2_318 సీ.
పాండ్యుఁ డాసేనలపై బెట్టిదంబుగ నడరి బాహాబల మక్కజముగఁ
బేరిచి పీనుంగు పెంటగాఁ జతురంగముల రూపుమాపె నయ్యలఘుభుజుఁడు
ద్రోణభీష్ములు దనతోఁబాటి యనుపలుకున కోర్వఁ డచ్యుతార్జునులు దనకు
నెక్కుడు నా విన్ననేవగించుచు నుండు నవ్వీరుఁ డమ్మెయి నాక్రమింపఁ

ఆ.
గని కడంగి యెదురు చని గురుతనయుండు
నగుచుఁ బగఱ నీవు మృగకులంబు
గలఁ చుహరియుఁబోలెఁ గలఁచెదు నాదిక్కు
మొగము సేసి యనికి మొనయు మనియె.

8_2_319 చ.
అన విని మేను వొంగ మలయధ్వజుఁ డుగ్రపునారసంబుఁ ద
త్తనువునఁ గ్రుచ్చి మౌర్వినినదంబు నభంబునఁ బర్వ నంపవె
ల్లి నిగుడఁ జేయఁ దొమ్మిదిశిలీముఖముల్ వెస నమ్మహీశుపై
ననిమిషవర్ణనీయగతి నగ్గురునందనుఁ డేసె నేసినన్.

8_2_320 వ.
అత్తొమ్మిదింటిలోన.

8_2_321 క.
ప్రతిశరములు పాండ్యమహీ,పతియును బరఁగింపనైదు భగ్నము లయ్యెన్
గతి సెడక నిగిడి రథ్య,ప్రతతి ధరం గూల్చె నాల్గుబాణము లధిపా.

8_2_322 తే.
మఱియు గురుపుత్రుఁ డేయ నమ్మలయకేతుఁ
డాశరంబులుఁ దద్ధనుర్జ్యాలతయును
దునిమెఁ దునిమిన నతిరయంబున నతండు
నారి సంధించి యమ్ముల నభముఁ గప్పె.

Note: some of the lines in the pdf were chopped at the end. So some characters will be wrong or missing.


8_2_323 వ.
అప్పాండ్యమహీపతి పరివారసామర్థ్యంబున రథ్యవంతుం డయి వాయవ్యా
స్త్రంబున నయ్యంపపరంపరఁ బ్రతిహతంబు సేసి తదీయచక్రరక్షకులం దెగ
టార్చి యార్చినం గెరలి యగ్గురునందనుం దత్సహచరుల నుఱుమాడి రత్న
మయాగురుచందనసుందరం బైనమలయగిరిప్రకారంబునం బొలుచుకేతనంబు
గూల్చి గుఱ్ఱంబుల గీ టడంగించి సూతుప్రాణంబులు గొని చాపంబు ద్రుంచి
తేరు దుమురు సేసి యతండు వొలి వోనిపౌరుషంబునం బ్రయోగించునస్త్ర
శస్త్రంబుల నుఱక నఱకి యగ్గమై యున్నను గయ్యంబువలనివేడుక నతని
సమయింప నొల్లక యరవాయి గొనినయాలోనఁ బతితయోధం బైనసుకల్పిత
మాతంగంబు నెక్కి గిరిశిఖరంబు నలంకరించుకేసరియ ట్లొప్పి యాద్రవి
శ్వరుండు సామజంబు నుద్దామగతిం దఱిమి భీమాభిరామంబైనతోమరం
వైచిన మణిగణోజ్జ్వలం బైనయాద్రౌణిశిరోభూషణంబు ధరణింబడినఁ ద్రి
క్కంబడినభుజంగంబుపోలికం గనలి యబ్బలుమగండు తత్పార్శ్వవర్తుల నార్వు
రథికవరులఁ దద్వేదండంబుతుండంబును జరణచతుష్టయంబును నమ్మేదినీవ
పాదంబులుఁ గరంబులు శిరంబును నతితీవ్రభల్లంబులం దునుమాడిన నద్దికు
మూఁకలు విచ్చెం గురుభూవరుం డమ్మహీసురవరుం జేరం జని యగ్గించె నప్పుడు

8_2_324 క.
నిలు నిలు మనితమమూఁకల,నిలిపి వృకోదరుఁడు గవిసె నీబలములపైఁ
దలకొని ధృష్టద్యుమ్నా,దులు సంరంభోద్భటముగఁ దోడ్పడి రధిపా.

8_2_325 క.
వారలవడి కోర్వక య,క్కౌరవసైన్యంబు దెరలఁ గర్ణుఁడు దర్ప
స్ఫారత నదల్చి నిల్చి యు,దారగతిన్ వైరిరథికతతి మార్కొనియెన్.

8_2_326 వ.
అతనికి బాసటయై యడరియశ్వత్థామచేతం బలువురు పాంచాలురు వొలిసి
కృష్ణుండు గ్రీడికిం బాండ్యమహీపతి సమయుట సూపి సమీరనందనకర్ణా
లగునిరువాఁగురథికులపరాక్రమంబును వేఱు వేఱ నిరూపించి చూపిన నతండు
ను రథంబు మనసేనలోనికిం బోవ నిమ్మనిన నతండట్ల చేయ నుబ్బినపాండవా
కంబునకును రాధేయగురుపుత్రులరభసంబునం బేర్చినమనమొనకును సంకు
సమరం బయ్యెనం దాకర్ణునకు ధృష్టద్యుమ్నునకుం బరస్పరశరకర్తనంబు
నితురేతరచ్ఛత్త్రకేతుఖండనంబును నన్యోన్యవర్మవిదారణంబును మిథశ్శరీరపా
నంబును నగుసంగ్రామంబు సెల్లె నట్టియెడ నాసూతనందనునకుం దలకడ
గురునందనుండు ద్రుపదనందనుం గవిసి బ్రహ్మఘ్న నిలు నిలు మేను గలు
నెట్లు బ్రదికెద వని పలికి వెండియు.

8_2_327 క.
మాతండ్రియెడం జేసిన,పాతకము గతంబు గాఁగఁ బాంచాలనికృ
ష్టాతునిమెద నిను నరుఁ డిట,యేతేరక యున్నఁ బాఱ కీవు నిలిచినన్.

8_2_328 వ.
అన విని ధృష్టద్యుమ్నుం డతని కిట్లనియె.

8_2_329 క.
మీతండ్రి కుఱికి నఱికిన, హేతియ నీకొఱకు నునిచి తిపుడ నఱుకుదున్
నీతులువపలుకులకు నీఁ,డై తోఁ చినయుత్తరంబు నదియె దురాత్మా.

8_2_330 వ.
అని యంత నిలువక.
Reply all
Reply to author
Forward
0 new messages