SIVA
unread,Feb 14, 2010, 8:49:12 PM2/14/10Sign in to reply to author
Sign in to forward
You do not have permission to delete messages in this group
Either email addresses are anonymous for this group or you need the view member email addresses permission to view the original message
to ADVERTISEMENT POLLUTION
ఈ రోజున వ్యాపార ప్రకటనలు లేని చోటులేదు. అవి చూడకుండా,
వినకుండా మనం తప్పించుకోలేం. రోడ్డు మధ్య ఉండే డివైడర్లు
దగ్గర్నుంచి, సిటీ బస్సులు, చివరకు రైలు పెట్టెలు ఇలా ఎందెందుకు
వెతికినా అందే కలదు వ్యాపార ప్రకటన ఈ ప్రకటనలలో వాడే భాష, మోసపూరిత
ప్రలోభాలు, భామల భంగిమలు అన్ని కలసి వ్యాపార ప్రకటనలను మానసిక, దృశ్య
కాలుష్య స్థితికి తీసుకు వచ్చాయి. వీటిమీద పడి బతుకుతున్నారు కాబట్టి ఈ
టి.వి చానేళ్ళుగాని, దిన/వార పత్రికలు గాని ఈ కాలుష్యాన్ని ఆపడానికి
ఏమాత్రం ప్రయత్నం చేయడంలేదు. అసలు ఇదొక కాలుష్యమని గుర్తించడానికి కూడ
జంకుతున్నారు. చివరకు ఈ వ్యాపార ప్రకటనలు, ఒక మాఫియాగా తయారయ్యి,
పత్రికలను, టి.వి. చానెళ్ళను శాసించి, వారు వ్రాసే, ప్రసారం చేసే
విషయాలను, ప్రసార సరళిని శాసించే వరకు వచ్చింది పరిస్థితి. . ఇప్పుడున్న
మీడియా స్వతంత్రమైన మీడియా కాదు. ఈ మీడియా అడ్వర్‌టైస్‌మెంటు మాఫియా
చేతిలో కీలుబొమ్మ. మీడియానే ఆ వ్యాపార ప్రకటనలు లేకుండా బతకలేమని ఈ
మాఫియాలో స్వచ్చందంగా చేరిపోయి, వారి బాధ్యతను విస్మరిస్తే సామాన్య
జనంలోని మనమే కొంత బాధ్యత తీసుకుని మన అభిప్రాయ వ్యక్తీకరణ చేసి కొంత
ఒత్తిడి తీసుకుని రావాలి, తప్పదు. అందుకోసమే ఈ గ్రూపు. వ్యాపార ప్రకటనలు,
వాటివల్ల వచ్చే దుష్పలితాలను చర్చించటనికి ఒక వేదికగా ఈ గూగుల్ గ్రూపును
ఏర్పరచటం జరిగింది. ఈ విషయం మీద బాధపడుతున్నవారు ఈ గ్రూపులో చేరి తమ తమ
అభిప్రాయాలను అందరితో పంచుకోగలరు.