SIVA
unread,Feb 14, 2010, 8:32:15 PM2/14/10Sign in to reply to author
Sign in to forward
You do not have permission to delete messages in this group
Either email addresses are anonymous for this group or you need the view member email addresses permission to view the original message
to ADVERTISEMENT POLLUTION
1.ఏ వ్యాపార ప్రకటనా కూడ ఒక వారంలో 25-30 సార్లకు కన్న ఎక్కువసార్లు
చూపకూడదు. తరచి తరచి చూడటం వల్ల, మనకు తెలియకుండానే ఆ వ్యాపార ప్రకటన
ప్రలోభంలో పడిపోతున్నాము.
2. ఒక కార్యక్రమం వస్తున్నాప్పుడు మధ్యలో వ్యాపార ప్రకటనల సమయం, ఆ
కార్యక్రమ సమయంలో 5% కంటే మించి ఉండరాదు. అంటే అరగంత కార్యక్రమంలో,
వ్యాపార ప్రకటనలు అర 90 సెకన్లు మాత్రమే వెయ్యాలి.
3. వ్యాపార ప్రకటనలు చేయబడుతున్న ఏ ఉత్పత్తి మీద అయినా సరే, ఆ వస్తువు
ప్యాకింగు మీద, వస్తు తయారీకి జరిగిన ఖర్చు, వ్యాపార ప్రకటనకు చేసిన
ఖర్చు తప్పనిసరిగా చూపించాలి.
4. ఒక కార్యక్రమం, వ్యాపార ప్రకటనల కోసం ఆపినప్పుడు, తెర మీద కుడిపక్కన
పై మూల ఒక టైమర్ టిక్ చేస్తూ, మరెంత సమయంలో అసలు కార్యక్రమం వస్తుందో
చూపించాలి.
5. ఏ రెండు చానెళ్ళు, ఒకే సారి వ్యాపార ప్రకటనలు వెయ్యకూడదు. మన చానెల్
మార్చినా ప్రస్తుతం ఈ బెడదను తప్పించుకోలేకుండా ఉన్నాం. ఈ చానెళ్ళన్ని
కూడబలుక్కుని, ఒకే సమయంలో వ్యాపార ప్రకటనలు వెయ్యటం వల్ల, మన చేత
బలవంతంగా వారి ప్రకటనలను చూపిస్తున్నారు. ఇది మన వ్యక్తిగత స్వేచ్చను
హరించటమే కాకుండా, ఈ ప్రకటనా కాలుష్యాన్ని, మన బుర్రల్లోకి
ఎక్కిస్తున్నారు.
6. వ్యాపార ప్రకటనల సౌండు అసలు కార్యక్రమం సఊండులో 75% శాతం మాత్రమే
ఉండాలి.
7. రోడ్లమీద, హోర్డింగులు తప్పనిసరిగా నియంత్రించి, అతి తక్కువ
ఉండేట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
8. రోడ్ డివైడర్లను వ్యాపార ప్రకటనలకు వాడకూడదు.
9. ప్రభుత్వ ఆస్తులైన, బస్సులు, రైళ్ళు, వాటి వాటి భవనాలను వ్యాపార
ప్రకటనలకు ఉపయోగించకూడదు.
10. ధారావాహికల ఎపిసోడుల సంఖ్యను నియంత్రించాలి. అలా నిరంతరం వచ్చే
ధారావాహికలను అనుమతించరాదు. రచయితల, నటుల సృజనాత్మకను ఇటువంటి నిరంతర
ధారావాహికలు దెబ్బ తీస్తున్నాయి. పైగా ఏదో ఒకటి వ్రాయాలి కాబట్టి, ప్రతి
చెత్త జనం మీదకు వదులుతున్నారు.
11.ఏ వస్తువుకుగాని, సర్వీసుకుగాని అనవసర ప్రచారం చెయ్యకూడదు. ఇలా అనవసర
ప్రచారం చెయ్యటం వల్ల, వినియోగదారులే ఎక్కువ ఖర్చుపెట్టాలిసి
వస్తున్నది.
12. ఒక వస్తువు, సర్వీసు ధరలో, వ్యాపార ప్రకటన ఖర్చు 0.01% కు మించి
ఉండరాదు.
ప్రస్తుతం గుడ్డెద్దు చేలో పడినట్టుగా, అచ్చోసిన ఆంబోతుల్లాగా
ప్రవర్తిస్తున్న ఈ వ్యాపార ప్రకటనా మాఫియాకు ముక్కుతాడు వెయ్యటానికి,
నాకు తోచిన కొన్ని మార్గాలను ఇక్కడ వ్రాశాను.