సామెతలు-చిన్నమాట

12 views
Skip to first unread message

D. Subrahmanyam

unread,
Mar 23, 2012, 1:44:12 AM3/23/12
to telug...@googlegroups.com
ఇప్పటికి నేను 9325 తెలుగు సామెతలను బ్లాగులో పోష్టు చేసాను. దీనితో నేను మొదలెట్టిన కార్యక్రమం చాలావరకు పూర్తి అయ్యింది. చాలావరకు అని ఎందుకన్నానంటే ఇంకా కొన్ని సామెతలు మిగిలిపోయాయి. వాటిని కూడా త్వరలో మీ ముందుకు తెస్తాను. ముఖ్యంగా చెప్పదలచు కున్నది ఏమిటంటే, ఈ సామెతల సంపాదించటంలో ముఖ్యంగా నేను తెలుగు విశ్వవిద్యాలయం వారి ' తెలుగు సామెతలు ' (మూడవ కూర్పు) ఉపయోగించాను. ఈపుస్తకం ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతొందో లేదో తెలియదు కానీ అంతర్జాలంలో దొరుకుతోంది. ఇవికాక అనేకమంది మిత్రులు తాము సేకరించుకున్న సామెతలను నాతో పంచుకొన్నారు. వారందరికి ధన్యవాదములు. నా ఈ ప్రయత్నంలో అడుగడుగునా వారి కామెంట్లతో ప్రోత్సాహించిన మిత్రులందరికి పేరు పేరునా ధన్యవాదములు. మీ ప్రోత్సాహం లేకపోతే ఈ పని పూర్తి చేయ్య గలిగేవాడిని కానేమో!! నా పని ఇక్కడితో పూర్తి కాలేదు. చాలాచోట్ల ఎంత జాగ్రత్తగా చూసినా ముద్రారాక్షసాలు అనేకం దొర్లాయి. వాటినన్నిటిని ముందుగా, ముఖ్యంగా సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నా తదుపరి కార్యక్రమం అదే. రెండోవది, మిగిలిపోయిన మిత్రులు పంపిన సామెతలను పోష్టుచేయటం. మూడవది కొందరు మిత్రులు సూచించిన విధంగా బ్లాగు డిజైన్ లో మార్పులు తెచ్చి browsing ఇంకా సులభతరం చేయటం. ఇలా కొన్ని పనులు మిగిలాయి. నా యీ బ్లాగును వికీలో చేర్చటానికి ఎలా సాధ్యమో చూడాలి. ఇప్పటికే నా బ్లాగుని కొంతమంది మిత్రులు తమ సైట్లలో అనుసంధించారు. వారికి కూడా నా ధన్యవాదములు. చివరగా మీత్రులందరికి విన్నపం. మీవద్ద ఏమైనా సామెతలు ఉంటే దయచేసి నాతో పంచుకోగలరు. ఇప్పటికి ఈమాట చాలనుకుంటాను. మరొక్కమారు అందరికి ధన్యవాదములు సుబ్రహ్మణ్యం.

Reply all
Reply to author
Forward
0 new messages