Re: (తెలుగుపదం) Re: Rank = స్థానాంకం మఱియు ఇతర నూతన పదాలు

21 views
Skip to first unread message

kvjeypore

unread,
Mar 30, 2015, 12:47:59 AM3/30/15
to Marripoodi Mahojas, telugupadam
మేజా  సంస్కృత పదం కాదు గనుక మేజోపరి అని చేయకూడదు.  ఇలాంటివే వార్తలలో చూస్తున్నాం - తెప్పోత్సవం అనుపోత్సవం.


Sent from Samsung Mobile



-------- Original message --------
From: Marripoodi Mahojas <mahojasm...@gmail.com>
Date: 28/03/2015 15:01 (GMT+05:30)
To: telug...@googlegroups.com
Cc: kvje...@gmail.com
Subject: Re: (తెలుగుపదం) Re: Rank = స్థానాంకం మఱియు ఇతర నూతన పదాలు


సభ్యుల స్పందనకు ధన్యవాదాలు.

సర్! ఇక్కడ "ప్రసారణ" వార్తాపత్రికల సర్క్యులేషన్ కోసం ఉద్దేశించిన పదం.
దానంతట అది ప్రసరిస్తే ప్రసరణ.
ప్రసరించేలా చేస్తే ప్రసారణ (ప్రేరణార్థకం).

ఇహపోతే laptop కి అంకోపరి అన్నట్లుగా desktop PC కి మేజోపరి అన్నమాట.

Marripoodi Mahojas

unread,
Mar 30, 2015, 9:46:18 AM3/30/15
to telug...@googlegroups.com, mahojasm...@gmail.com, kvje...@gmail.com
సర్! తాడేపల్లిగారు వ్రాసిన నవీన పద నిష్పాదన సూత్రాల ననుసరించి తప్పనిసరైతే వైరిసమాసాలూ, దుష్టసంధులూ ఆమోదయోగ్యమే అంటున్నారు. సాంప్రదాయిక వ్యాకరణాల ప్రకారం మేజోపరి తప్పేనని ఒప్పుకుంటాను. కానీ సంస్కృతంలో బల్లకి ఏమంటారు? అది తెలిస్తే మేజా వద్దు, దాన్తోనే సంధి చేద్దాం.

kvjeypore

unread,
Apr 1, 2015, 10:57:27 AM4/1/15
to Marripoodi Mahojas, telugupadam
తెలుగువాడికి తెలియని సంస్కృతపదం వెదికి కొత్తపదం సృష్టించడం వల్ల ఏం ప్రయోజనం? బల్లపైన అనకూడదా? రానురాను ఎవరికీ అర్థంకాని కొత్త భాష పుట్టుకొస్తున్నట్టుంది.


Sent from Samsung Mobile



-------- Original message --------
From: Marripoodi Mahojas <mahojasm...@gmail.com>
Date: 30/03/2015 19:16 (GMT+05:30)
To: telug...@googlegroups.com
Cc: mahojasm...@gmail.com,kvje...@gmail.com
Subject: Re: (తెలుగుపదం) Re: Rank = స్థానాంకం మఱియు ఇతర నూతన పదాలు


Marripoodi Mahojas

unread,
Apr 3, 2015, 6:06:39 AM4/3/15
to telug...@googlegroups.com, mahojasm...@gmail.com, kvje...@gmail.com
ఇక్కడ Desktop అంటే బల్లపైన కాదండీ! అదొక వస్తువు. మేజోపరి అనేది ఒక వస్తువుకి నేను పెట్టిన కొత్త పేరు. ఇలాంటి సమాసం తెలుగులో కుదరదు గనక సంస్కృత ఫక్కిలో కూర్చాల్సి వచ్చింది. అంతే!

భాషలో ప్రతిపదమూ ప్రతివారికీ అర్థం కావాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఎందుకంటే సమాజంలో ప్రతివారికీ ప్రతిపదంతోనూ అవసరం ఉండదు. ఏది అర్థం కావాలన్నా ముందు దానికి కొంతకాలం అలవాటు పడాలి. "అర్థమయ్యే పదాలు మాత్రమే" అని మడికట్టుకుంటే కొత్తపదాలు సృష్టించలేము కదా! నాకర్థమైనంత వరకూ- ఈ గుంపు ఉన్నది కొత్తపదాల కల్పన కోసమే. అర్థమయ్యే పదాల కల్పన కోసం కాదు. తెలుగుపదం సైట్ లో అర్థం కాని పదాలు చాలా ఉన్నాయి. అవన్నీ వాడడం మొదలుపెడితే అలా వాడుతూ వాడుతూ పోగా అర్థమవుతాయి.

Marripoodi Mahojas

unread,
Apr 3, 2015, 6:11:52 AM4/3/15
to telug...@googlegroups.com, mahojasm...@gmail.com, kvje...@gmail.com
నా యొక్క పై అభిప్రాయం మీద కె.వి. రమణగారు వెలిబుచ్చిన అభిప్రాయం :

అయ్యా ,
బల్లపైని, బల్లపైది, బల్లపైన పెట్టుకొనేది - సందర్భానుసారంగా ఏదోకటి అనొచ్చు.
మేజా ఉర్దూ పదం - దానికి సంస్కృత ఉపరి జోడింపు.
వైరిసమాసాలను ఆమోదించడం వాడుకలో ఇమిడిపోయిన పదాలవరకే బాగు. అది రూలుగా పెట్టుకుని కొత్త పదాలను తేవడం మేలు కాదు.

- కేవీ రమణ

 

అందుకు నేనిచ్చిన సమాధానం :


అయ్యా! మనమిక్కడ ఒక వస్తువుకి ఒక కొత్తపేరు పెడుతున్నాం. దాన్ని వర్ణించడం లేదు. వర్ణనాత్మకమైన "పేరు" మాత్రమే పెడుతున్నాం. బల్లపైది అంటే అది ఏ వస్తువుకైనా అన్వయించదగ్గ వర్ణన అవుతుంది. అది మన ఉద్దేశం  కాదు. బల్లపైది అంటే డెస్క్ టాప్ కంప్యూటర్ ఎవరికీ స్ఫురించదు. అందుచేత భాషలో లభ్యమవుతున్న ప్రత్యామ్నాయ పదాలతో కూర్చిన సమాసంతో డెస్క్ టాప్ కంప్యూటర్ కి మాత్రమే ఖాయం చేస్తూ ఒక పదాన్ని సృష్టించాం. మీకు అది నచ్చితే సరే, లేకపోతే అందరికీ తెలిసిన/ అందరికీ అర్థమయ్యే ఆంగ్లపదం డెస్క్ టాప్ ఉండనే ఉంది.

వైరిసమాసాలు కొన్నింటిని అంగీకరించి మరికొన్నింటిని తిరస్కరించడానికి కారణం బోధపడలేదు. అయినా నా ఉద్దేశం - దాన్నొక జెనరల్ రూల్ చెయ్యాలని కాదు. "తప్పనిసరైతే తప్పదు" అంటున్నాను. ప్రత్యామ్నాయ పదాలు దొరక్కపోవడమే ఆ తప్పనిసరి పరిస్థితి.

 



Reply all
Reply to author
Forward
0 new messages