Air Traffic Control/ATC

24 views
Skip to first unread message

అచంగ

unread,
Apr 3, 2014, 4:51:09 AM4/3/14
to telug...@googlegroups.com
అందరికీ నమస్కారం,

మలేషియా విమానం మాయమైనప్పటినుండి Air Traffic Control లేదా ATC గుఱించి ఎక్కువగా వింటున్నాం. దీన్ని తెలుగులో 'విమాన కట్టుబాటు కేంద్రము' అని అనవచ్చనని నా ప్రతిపాదన. దీన్ని ఇప్పటికే తమిళములో விமான கட்டுபாடு அறை (విమాన కట్టుబాడు అఱై) అని అంటున్నారు.

మీ సూచనలు తెలియజేయండి.

అచంగ.

K V Ramana

unread,
Apr 3, 2014, 5:48:38 AM4/3/14
to telugupadam
ట్రాఫిక్కును సూచించే పదం లేదు. రవాణా, రాకాపోకలు లాంటిది ఒకటుంటే స్పష్టంగా ఉంటుందనుకుంటాను.
 


--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుపదం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugupadam...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.



--
Killamsetty VenkataRamana
        mob 09937668415

Sunny D

unread,
Apr 3, 2014, 5:37:53 AM4/3/14
to telug...@googlegroups.com
Tamil விமான கட்டுபாடு அறை = English Flight Control Room

Traffic Control Room  ని  తెలుగులో గమన నియంత్రణ కేంద్రం అనవచ్చు .. 


--

Murthy Ravi

unread,
Apr 3, 2014, 12:42:54 PM4/3/14
to telug...@googlegroups.com
raddee anTE  Traffic ki saripotundemo kadaa!!

devi దేవి

unread,
Apr 3, 2014, 4:42:44 PM4/3/14
to telug...@googlegroups.com
విమాన గతి నియంత్రణ/ విమాన నియంత్రణ కేంద్రము అనవచ్చేమో.


3 ఎప్రిల్ 2014 2:21 PM న, అచంగ <mail2a...@gmail.com> ఇలా రాసారు :

--

Arun Gaddipati (అచంగ)

unread,
Apr 3, 2014, 6:53:24 PM4/3/14
to telug...@googlegroups.com
Sunny D గారూ, మీరు google translateని నమ్ముకుంటే కష్టమండీ!

మూర్తి గారూ, విమానము (సం) అంటే 'అంతరిక్షములో దేవతలు ఎక్కి సంచరించే రథము' అనే అర్థము కూడా ఉంది శబ్దరత్నాకరము ప్రకారం. కాబట్టి ఒక పదానికి నానార్థాలు ఉండటం ఎంత సహజమో, సందర్భానుసారం తగిన అర్థాన్ని తీసుకోవటమూ అంతే సహజము.

రమణ గారూ, మనం తు.చ తప్పకుండా ఆంగ్లమునుండి దించవలసిన పనిలేదనుకుంటానండీ!

దేవి గారూ, 'విమాన నియంత్రణ కేంద్రము' అన్నది బాగానే ఉంది. అయితే నియంత్రణ అంటే 'అడ్డగింత' అని అర్థము శబ్దరత్నాకరము ప్రకారం, అదే కట్టుబాటు అంటే నియమము/నిబంధన శ్రీహరి నిఘంటువు ప్రకారము. కనుక కట్టుబాటే అక్కడ సందర్భోచితమని నా అభిప్రాయము.

Lanka Giridhar

unread,
Apr 3, 2014, 7:15:55 PM4/3/14
to telug...@googlegroups.com
ఆచంగగారు ప్రథమంగా సూచించినది, దేవిగారు తరువాత చెప్పినదీ - రెండూ ఆమోదయోగ్యంగానే ఉన్నాయి.

నమస్సులు, గిరి

Vasu@gmail

unread,
Apr 3, 2014, 8:55:00 PM4/3/14
to telug...@googlegroups.com

విమాన రాకపోకల నియంత్రణా కేంద్రము




This email is free from viruses and malware because avast! Antivirus protection is active.


Pulikonda

unread,
Apr 3, 2014, 10:17:22 PM4/3/14
to telugupadam

ఏర్ ట్రాఫిక్ అనే భావం సరిగ్గా రావాలంటే వాయుయాన నియంత్రణ అని అంటే సరిగా మొత్తం భావం వస్తుంది బాగుంటుంది. సుబ్బాచారి పులికొండ.

devi దేవి

unread,
Apr 4, 2014, 10:42:32 AM4/4/14
to telug...@googlegroups.com
అందరికీ ధన్యవాదాలు. వాయుయాన కట్టడి కేంద్రం బాగుంటుందేమో.


4 ఎప్రిల్ 2014 4:23 AM న, Arun Gaddipati (అచంగ) <mail2a...@gmail.com> ఇలా రాసారు :

--

K V Ramana

unread,
Apr 4, 2014, 12:53:39 AM4/4/14
to telug...@googlegroups.com
నియంత్రణకు మూలంలో ఏ అర్థమున్నా కంట్రోలనే అర్థంతోనే వాడుక. విమానయానం అనొచ్చో లేదో - విమానయాన నియంత్రణ అంటే బావుంటుంది.
>> This email is free from viruses and malware because avast! Antivirus
>> protection is active.
>>
>>
>> --
>> You received this message because you are subscribed to the Google Groups
>> "తెలుగుపదం" group.
>> To unsubscribe from this group and stop receiving emails from it, send an
>> For more options, visit https://groups.google.com/d/optout.
>

Pulikonda

unread,
Apr 4, 2014, 9:04:23 PM4/4/14
to telugupadam

బాగుంది కట్టడి తెలుగుపదం. నియంత్రణ సంస్కృతం అంతే తేడా. ఈ రెండూ బాగా సరిపోతాయి. సుబ్బాచారి.

Sunny D

unread,
Apr 4, 2014, 12:43:06 PM4/4/14
to telug...@googlegroups.com
యానము అంటే ప్రయాణము లేదా journey అని అర్ధము కదా? ప్రయాణము అనే పదం గతిని దిక్కుని సూచించట లేదు . 
గమనము అంటే english లో movement లేదా traffic కి సరిసాటి అనిపించింది.. 

ఈ సందర్భం లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అంటే అనేక విమానాల కదలికల్ని, గతిని, దారిని, దిక్కుని  నియంత్రించడం కనుక గమనం అనే పదం సరిసాటి అని నా అభిప్రాయం. 

పైన చెప్పిన కారణాల ప్రకారం విమాన గమన నియంత్రణ సరియని నా ఆలోచన. 


PRASAD

unread,
Apr 4, 2014, 12:14:50 PM4/4/14
to vAIShalI........ lYf iSs So exqUIsIte.......!


గగనతల రవాణా నియంత్రణ = Air Traffic Control

(JVRKPRASAD)
VIJAYAWADA
Yours lovingly,
(JVRKPRASAD)

Narahari Rao Kasturi

unread,
Jul 19, 2014, 9:32:18 AM7/19/14
to telug...@googlegroups.com

గతి అనే మాట బాగుంది - గమనం కన్నా సామాన్య తరమైన పదం (more generic in meaning). రవాణా సరి కాదు. కట్టడి కూడా చక్కటి తెలుగు మాట.( కట్టు బాటు కంటె ఈ పదం ఎక్కువ గా సరిపోతుందని నా ఉద్దేశం ). నేను తెలుగు భాషా ప్రేమికుణ్ణి.  సంస్కృత భాషా ఆరాధకుణ్ణి. నియంత్రణ మంచి మాటే. కాని సందు దొరికిన చోటల్లా అచ్చ తెలుగు మాటలు వాడదామనే కోరిక బాగా ఎక్కువ. కాని గతి, కట్టడి కలిస్తే జత రాణిస్తుండా అనేది  చూడాలి

Marripoodi Mahojas

unread,
Dec 23, 2014, 1:35:47 AM12/23/14
to telug...@googlegroups.com
విమాన రద్దీ నియంత్రణ కేంద్రం
విమాన రద్దీ నియంత్రకం
లేదా
విమాన సమ్మర్ద నియంత్రణ కేంద్రం

ఈ విషయంలో తమిళ "కట్టుబాడు" ని అడాప్ట్ చేసుకోవడం సరికాదేమో. అది అనుకరణ అవుతుంది. పైపెచ్చు తెలుగులో కట్టుబాటుకున్న అర్థమూ, వాడాల్సిన సందర్భమూ వేరు. 

రమణా రావు ముద్దు

unread,
Dec 23, 2014, 10:23:02 AM12/23/14
to telug...@googlegroups.com

  విమాన రవాణా నియంత్రణ అంటే సరిపోతుంది.CENTREఅనికూడా ఉంటేనే కేంద్రం అని వాడవలసి రావచ్చును.

--

Vasu Valluri

unread,
Dec 23, 2014, 6:52:51 PM12/23/14
to telug...@googlegroups.com

Vimaanayaana niyantrana may be simpler.

Pulikonda

unread,
Dec 23, 2014, 7:48:24 PM12/23/14
to telugupadam
రద్దీ నియంత్రణ అనేది ఇక్కడ అసలు కుదరదు. 
కారణం రద్దీ అంటే చాలా ఎక్కవ వాహనాలు ఒకే సాిరి రావడం అనే అర్థం సూచిస్తుంది. ఇక్కడ విమాన రవాణా అనేది రద్దీ ఉన్నా లేదా రొజకు రెండు మూడు విమానాలే ఉన్నా ఈ కేంద్రం నియంత్రిస్తుంది. కాబట్టి విమాన రవాణా నియంత్రణ అని అనడమే బాగా సరిపోతుంది. 
మిత్రులు గమనించండి.
సుబ్బాచారి పులికొండ. 
Prof. P.  Subbachary
Head, Department of Folklore and Tribal Studies
Dean, School of Human and Social Sciences
Dravidian University
Kuppam 517425
A.P
Reply all
Reply to author
Forward
0 new messages