హ్యూమనిస్ట్ బ్లాగులో కొత్తపదాలు

28 views
Skip to first unread message

Marripoodi Mahojas

unread,
Feb 15, 2015, 3:53:00 AM2/15/15
to telug...@googlegroups.com
నా అభిమాన బ్లాగుల్లో ది ఆంధ్రా హ్యూమనిస్ట్ కూడా ఒకటి. దాని రచయిత ఇంగ్లీషు పదాలకి దీటైన అనేక సమార్థకాల్ని ప్రయోగిస్తూంటారు. మీ సంగతేమో కానీ నా మటుకూ నాకవి చాలావరకూ కొత్త పదాలే. అన్నీ కాదు గానీ ఆ బ్లాగులో కొన్ని పదప్రయోగాలు నాకు బాగా నచ్చాయి. ఈ మధ్య మళ్లీ ఆ బ్లాగుని తిరగేస్తూంటే వాటిని మన మిత్రుల దృష్టికి తెద్దామనే సంకల్పం కలిగింది. తన బ్లాగుకి పెద్దగా పాపులారిటీ లేదనీ, తన రెగ్యులర్ పాఠకవర్గం 40 - 60 మందికి మించరనీ, అయినా రాస్తూనే ఉన్నాననీ ఆ రచయితే ఒకసారి ఒక టపాలో చెప్పుకుని వాపోయినట్లు గుర్తు. బహుశా అందుకే ఆ పదాలు ఇంకా విస్తృతంగా అందరి దృష్టికీ రాలేదనుకుంటా. వాటిని ఈ కింద ఇచ్చాను. పరిశీలించండి:

మహాజన బలహీనత - mass weakness
సంభావ్య పీడితుడు -  probable oppressed
ఆశింపులు - expectations
ఊనిక - emphasis
అస్తిగోపన పద్ధతులు - conservative methods
ప్రతీప భావజాలాలు - negative ideologies
ప్రతీపత - negativity
ప్రయోజనగుంపులు - interest groups
వర్గవాదం - (sectarianism)
ప్రాఙ్ నిర్ణీత శత్రువులు - pre-determined enemies
ఆత్యంతిక వాదాలు - Extremist viewpoints
పెడనిర్ణయాలు - out-of-the way decisions
క్రించు సహజాతాలు - base instincts
కూటస్థం - passive
ఏకోన్మాదులు - monomaniacs
ఉపయోగవాదులు - utilitarians
ఆరోపకుల న్యాయం Accusors’ justice
పరివర్తనాలయాలు - Reformatories
ముందస్తు వడపోత మండళ్ళు - screening committees
సర్వానవద్యం - all perfect
తత్త్వీకరణలు - philosophizations
పౌర గోప్యతా చట్టాలు - citizen privacy laws
కారుణ్య సమాపనం - Euthanasia or mercy-killing
రాజకీయంగా సాధువులైన ఉద్ఘాటనలు - politically correct statements
బౌద్ధిక దివాలా - intellectual bankruptcy
పలాయన మార్గాలు - escapes
ప్రచారకర్తలు - professional campaigners
శక్తి-అసమతూకం - power imbalance
తారం - loud
స్వకీయత - originality
ప్రయత్న-పొఱపాట్లు - trial and error
ఉపరితలీనం - superficial
ఇల్లడదారు - depositors
ప్రత్యయం - conviction
ఉభయసమ్మత శృంగారం - consensual sex
బహుసాంస్కృతికం - cosmopolitan
ఏకచ్ఛత్త్ర చట్టాలు - blanket rules
బాధితహీన నేఱాలు - victimless crimes
విలక్షణులు - unique
మూసపోత - stereotypical
అంకశాతం - marks’ percentage
సారాంశీకరించడం - False Essentialization
చలువపెట్టెలు - refrigirators
సామాజిక అమఱిక - social setting
మూకుమ్మడి చుట్టుచూపు - overall outlook
సందర్భానుసార విచారణ case-to-case approach
సడలుబాటు flexibility
గిటకచెట్టు - bonsai plant
తాత్త్విక ఊహాపోహలు -  philosophical speculations


 

Marripoodi Mahojas

unread,
Feb 15, 2015, 4:01:15 AM2/15/15
to telug...@googlegroups.com
వీటిల్లో ఎన్ని ఆ బ్లాగ్రచయిత స్వకల్పితాలో ఏవి ఇతరులకు అనుసరణలో తెలీదు.
 
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుపదం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugupadam...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.

Sunny D

unread,
Feb 15, 2015, 9:05:48 AM2/15/15
to telug...@googlegroups.com
మర్రిపూడి గారు,
 
కొన్ని సూచనలు. మీ అభిప్రాయాలు చెప్ప గలరు.  
ముందస్తు వడపోత మండళ్ళు - screening committees (ముందస్తు వడపోత మండళ్ళు
ఇల్లడదారు - depositors (జమాదారు)
ప్రత్యయం - conviction (conviction = belief / stance ;; విశ్వాసం / వైఖరి)
ఉభయసమ్మత శృంగారం - consensual sex (సమ్మిత శృంగారం)
బహుసాంస్కృతికం - cosmopolitan (విశ్వజనీయమైన)
మూసపోత - stereotypical (ఊహా చిత్రము)
సారాంశీకరించడం - False Essentialization (Summarization ?)
మూకుమ్మడి చుట్టుచూపు - overall outlook (బాహ్య వీక్షణ)
తాత్త్విక ఊహాపోహలు -  philosophical speculations (తాత్త్విక ఊహాగానాలు)

భవదీయుడు,
సునీల్ 

--

Marripoodi Mahojas

unread,
Feb 15, 2015, 10:31:47 AM2/15/15
to telug...@googlegroups.com
మీరు అడిగారు కనుక ఒకటి-రెండు ముక్కలు రాస్తాను. మీరనుకున్నదానికి నా అభిప్రాయం అన్యథా ధ్వనిస్తే పెద్దమనసు చేసుకొని మన్నించగలరని ప్రార్థన.

ఇల్లడదారు - depositors
(జమాదారు)

జమాదారు కూడా బావుందండీ. అయితే నేను తెలుగు నిఘంటువులో చూస్తే ఇల్లడదారు అనే పదకల్పనకి మూలం ఇల్లడం (తన వస్తువు ఇతరుల ఇంట్లో ఉంచడం) అని తెలిసింది. ఆ పదాన్ని హ్యూమనిస్టుగారు పునరుద్ధరించడం నాకు నచ్చింది.

ప్రత్యయం - conviction (conviction = belief / stance ;; విశ్వాసం / వైఖరి)

Faith, belief, creed అనే అర్థాల్లో మనం విశ్వాసం అని వాడుతున్నాం. Attitude కి వైఖరి అని వాడుతున్నాం. కనుక ఆ పదాలతో conviction ని అనువదించడం సరికాదేమో. ప్రతి కొత్త కాన్సెప్టుకీ ఒక కొత్త పదం అవసరమనీ, కొత్త కాన్సెప్టులకి పాత పదాలతో సరిపుచ్చుకోకూడదనీ పదనిష్పాదన కళలో తాడేపల్లిగారు చెప్పిన మాట నా మనసులో గాఢంగా నాటుకు పోయింది. కనుక ప్రత్యయమనే పాత పదాన్ని conviction అనే అర్థంలో పునరుద్ధరించి పాపులర్ చేయడం బహుశా మంచిదేననుకుంటాను.


ఉభయసమ్మత శృంగారం - consensual sex (సమ్మిత శృంగారం)

సమ్మితం, సమ్మతం రెండూ ఒకటి కాదేమో. ఉదాహరణకి - కావ్యమ్ కాంతాసమ్మితమ్ అన్నప్పుడు కావ్యం కాంతతో సమానం అని అర్థం. కాబట్టి "ఉభయ" తీసేసి సమ్మత శృంగారం అందామా? OK.


బహుసాంస్కృతికం - cosmopolitan (విశ్వజనీయమైన)

విశ్వజనీయం - విశ్వజనీనం (Universal) లా ధ్వనిస్తోంది. "బహుసాంస్కృతికం" బానే ఉందిగా?


మూసపోత - stereotypical (ఊహా చిత్రము)

Stereotype అనేదానికి మూలార్థం (వ్యుత్పత్తి అర్థం) ఏంటో నాకూ తెలీదు. కానీ జనం ఆ ఇంగ్లీషుపదాన్ని వాడుతున్న అర్థంలో "మూసపోత" అనే అనువాదం బానే ఉన్నట్లుగా అనిపిస్తోంది.


సారాంశీకరించడం - False Essentialization (Summarization ?)

I think, Essentialization is a very special technical word, especially in the context of Humanism. ఎసెన్షియలైజేషన్ అంటే ఒక వ్యక్తి లేదా వర్గంలో అనేక తత్వాలు/ కోణాలు ఉంటాయనేదాన్ని కప్పిపుచ్చి వారిని essential గా ఒకే ఒక్క దృష్టి నుంచి ఉత్తి మంచివాళ్లుగానో, చెడ్డవాళ్ళుగానో్, లేదా ఉత్తి వ్యాపారులుగానో, ఉత్తి పండితులుగానో characterize చెయ్యడం. ఇలాంటి False characterization వల్ల వారిలోని మానవత్వాన్ని మనం మిస్సవుతామని Humanism హెచ్చరిస్తుంది.

మూకుమ్మడి చుట్టుచూపు - overall outlook (బాహ్య వీక్షణ)

మూలపదమైన outlook ని బ్రాకెట్స్ లో రాయకపోతే ఒక మామూలు పాఠకుడు బాహ్యవీక్షణ అంటే కేవలం బయటికి చూడ్డం అని అనుకునే అవకాశముంది. అలా కాకుండా చుట్టుచూపు అనే పదం వినంగానే చాలావరకూ అర్థమవుతోందని నా అభిప్రాయం.  

Marripoodi Mahojas

unread,
Feb 26, 2015, 6:51:01 AM2/26/15
to telug...@googlegroups.com
నేను మళ్ళీ బాగా ఆలోచించాను. హ్యూమనిస్టుగారు వాడిన బహుసాంస్కృతికం అనే పదం Multi-cultural అనడానికి బాగా నప్పేలా ఉంది. Cosmopolitan కి కాదు. కాస్త రిసర్చి చేశాక నాకేమనిపిస్తోందంటే- Cosmopolitan కి తెలుగులో మనం "విశ్వపౌర/ విశ్వపౌరిక/ విశ్వపౌరీయ/ విశ్వపౌరీణ" అనొచ్చునేమోనని! త్వరలో మీ అభిప్రాయం తెలపాల్సిందని ప్రార్థన.

Once again thanks to పదనిష్పాదన కళ book.
Reply all
Reply to author
Forward
0 new messages