డిప్లొమా మరియు డాక్టరేట్

26 views
Skip to first unread message

Marripoodi Mahojas

unread,
Feb 2, 2015, 2:09:59 AM2/2/15
to telug...@googlegroups.com
ఐరోపా దేశాల్లో డిప్లొమాకీ డిగ్రీకీ పెద్దగా అర్థవ్యత్యాసం లేదు. కానీ మన దేశంలో డిప్లొమాని డిగ్రీ కన్నా తక్కువ శ్రేణిదిగా అర్థం చేసుకుంటారు. ఉన్న డిగ్రీకి అదనపు అర్హతగానూ, తక్కువ కాలవ్యవధిలో చదివి తెచ్చుకునే సర్టిఫికేట్ గానూ దాన్ని చూస్తారు. డిప్లొమాకి తెలుగులో ఇప్పటిదాకా ఎవరైనా సమానార్థక పదాన్ని కల్పించినట్లు నా దృష్టికి రాలేదు.


అదే విధంగా డాక్టరేట్ అనే డిగ్రీకి కూడా తెలుగుపదం నాకు కనిపించలేదు. పోస్ట్ గ్రాడ్యువేషన్ కైతే స్నాతకోత్తర పట్టం అంటున్నారు. (మనం పి.జి. అనేదాన్ని పాశ్చాత్యులు గ్రాడ్యువేషన్ అంటారనుకోండి) కనుక వీటికి నేనీ ఈ క్రింది పదాలు అనుకుంటున్నాను. సభ్యులు పరిశీలించి బావున్నాయో లేదో చెప్పండి.

Diploma = ప్రపట్టం/ ప్రపట్టా
Doctorate - పండిత పట్టం/ పండిత పట్టా

Marripoodi Mahojas

unread,
Feb 12, 2015, 6:52:47 AM2/12/15
to telug...@googlegroups.com
మిత్రులారా ! ఈ గుంపులో ఏ టపాకీ పెద్దగా స్పందన రావడం లేదు. నా సంగతలా ఉంచితే అసలు ఎవరూ కొత్త టాపిక్స్ టపా చేయడం లేదు. ఎందుచేత? ఎప్పట్నుంచీ ఇలా? మొదట్నుంచీ ఇంతేనా? లేక ఈ మధ్యనే ఇలా అయిందా? 

Sri Raghava Kiran Mukku

unread,
Feb 12, 2015, 7:47:38 AM2/12/15
to telug...@googlegroups.com
అయ్యా,

ఈ గుంపు ఒకప్పుడు చాల క్రియాశీలంగా ఉండేది. ఈ మధ్యనే చర్చలు తగ్గుముఖం పట్టాయి. చాల మంది గుంపునుండి వైదొలగారు కూడాను.

నమస్సులతో
రాఘవుడు

Marripoodi Mahojas

unread,
Feb 12, 2015, 11:54:37 PM2/12/15
to telug...@googlegroups.com

ఈ గుంపొకటే అని కాదండీ. బ్లాగుల్లోనూ ఇంతే. ఏం రాసినా ఎవరూ స్పందించరు. ఫేస్ బుక్కులోనూ అంతే. కిమన్నాస్తి. మన తెలుగు వెబ్ ఇలా ఎందుకుంది? ఈ జడత్వాన్ని పోగొట్టడానికి ఏం చేయాలి? ఇది ఈ గుంపు లక్ష్యాలకి విరుద్ధమైన ప్రస్తావనైతే దయచేసి క్షమించవలసిందని ప్రార్థన.   

kvjeypore

unread,
Feb 13, 2015, 2:44:26 AM2/13/15
to telugupadam
మహోజస్ గారు
  కిమన్నాస్తి అంటే ఏమిటి?


Sent from Samsung Mobile
--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుపదం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugupadam...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.

Ranganadh Nagubandi

unread,
Feb 13, 2015, 2:49:06 AM2/13/15
to telug...@googlegroups.com

Ee shabdam leka povatam

Sunny D

unread,
Feb 13, 2015, 2:54:44 AM2/13/15
to telug...@googlegroups.com
నన్ను కలుపుకొని, సహజంగా మనిషికి ఉండే బద్దకమే స్పందించకపోవడానికి కారణం. ఇది పోదు. ఈ ప్రవర్తనని అధికమించడానికి అనేక పద్ధతులు సంస్థాగత నిర్వహణ లో అవలంబిస్తూ ఉంటారు.  

అలాగే సంస్థాగత బ్లాగుల/గుంపుల (ఉదా., టెక్నాలజీ బ్లాగులు) సంభాషణల్లో కూడా సభ్యులను ప్రోత్సహించడానికి కొన్ని పద్ధతులు అవలంబిస్తున్నారు. ఆ ప్రోత్సాహక పద్ధతులనే మన తెలుగు బ్లాగుల్లో/గుంపుల్లో అమలు చేస్తే కొంచెం మెరుగుపడవచ్చు. 1. సభ్యుల ప్రోత్సాహకాలు మరియు 2. గుంపు విస్తరణ ప్రణాళిక ఉంటే ఫలితాలు కనిపిస్తాయి. 

Rewarding points to members on participation: 

To embed our google group in a blog site: 


మన గుంపుని ఇతర బ్లాగుల్లో పొందుపరిస్తే గుంపు విస్తరణకి దోహదపడుతుంది. ఇంకా అనేక పద్ధతులు అంతర్జాలంలో వెతికి, మనకు పనికివచ్చేవి ఒకసారి వాడిచుడాలి. 

భవదీయుడు,
సునీల్ 





2015-02-13 8:54 GMT+04:00 Marripoodi Mahojas <mahojasm...@gmail.com>:

ఈ గుంపొకటే అని కాదండీ. బ్లాగుల్లోనూ ఇంతే. ఏం రాసినా ఎవరూ స్పందించరు. ఫేస్ బుక్కులోనూ అంతే. కిమన్నాస్తి. మన తెలుగు వెబ్ ఇలా ఎందుకుంది? ఈ జడత్వాన్ని పోగొట్టడానికి ఏం చేయాలి? ఇది ఈ గుంపు లక్ష్యాలకి విరుద్ధమైన ప్రస్తావనైతే దయచేసి క్షమించవలసిందని ప్రార్థన.   

--

కాకర్ల నాగేశ్వరయ్య

unread,
Feb 13, 2015, 10:05:34 AM2/13/15
to telug...@googlegroups.com
గుంపు సభ్యులకు సవినయ నమస్కారాలు. నాకు గణనయంత్రం ఎక్కువకాలం అందుబాటులో
ఉండకపోవటంవలన, మరియు తగినంత విషయపరిజ్ఞానం లేకపోవటంవలన టపాలకు బదులు
వ్రాయలేకపోతున్నందుకు పెద్ద మనసుతో మన్నించగలరు. ఎవరు స్పందించినా
స్పందించకపోయినా నిత్యం ప్రకాశించే సూర్యచంద్రులవలె లోకహితం కోరే
మీబోటివారు విజ్ఞానదాయకమైన విషయాలను గుంపు మూలంగా పంచుకొంటూ ఉండండి.

కృతజ్ఞతలతో.

raki gollapelli

unread,
Feb 14, 2015, 10:01:31 AM2/14/15
to telug...@googlegroups.com

computer ni గణకం అనొచ్చు

Prasad Charasala

unread,
Feb 14, 2015, 11:07:03 AM2/14/15
to telug...@googlegroups.com
ముందు ఈ చర్చ యొక్క సబ్జెక్టు మారిస్తే కొంత ప్రయోజనం వుండవచ్చు.

ఇప్పుడు బ్లాగుల అవసరాన్ని ఫేసుబుక్కు కబళించిందని నా అభిప్రాయం. ఫేసుబుక్కు బాల్యావస్థలో వున్నప్పుడు తెలుగు బ్లాగులు, ఈ గుంపు ఇంకా తెలుగు బ్లాగు గుంపు విరివిగా చలామణిలో వుండేవి.

అప్పటివారంతా ఇప్పుడు ఫేసుబుక్కులో తీరికలేకుండా వున్నారు. కొత్తవారూ ఫేసుబుక్కుకే పరిమితమవుతున్నారు.

ఫేసుబుక్కులో తెలుగు గుంపులు విరివిగా వున్నాయి. ఉదాహరణకు "తెలుగు గజల్", "కథ", "తెలుగు పుస్తకం", "సాహిత్య నిధి" "pustakam.net" మొదలగు ఫేస్‌బుక్కు గ్రూపులని చూడండి.

Marripoodi Mahojas

unread,
Feb 15, 2015, 12:09:32 AM2/15/15
to telug...@googlegroups.com
స్పందించిన మిత్రులందరికీ కృతజ్ఞతలు.

14 ఫిబ్రవరి, 2015 9:37 [PM] న, Prasad Charasala <char...@gmail.com> ఇలా రాసారు :
Reply all
Reply to author
Forward
0 new messages