పుటలు

4 views
Skip to first unread message

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Mar 12, 2010, 11:21:59 AM3/12/10
to తెలుగుపదం
http://telugupadam.org సైటులో అన్నిచోట్లా పేజీలు అన్న పదమే
కనిపిస్తున్నది. పేజీలు తెలుగుపదం కాదు, అందఱికీ తెలిసినప్పటికీ కూడా !
దానికి పుటలు అనే ముచ్చటైన తెలుగుపదం ఉన్నది. నిజానికి అది కూడా అందఱికీ
తెలిసినదే. మనం కొత్త తెలుగుపదాల నిష్పాదనని ప్రోత్సహిస్తున్న క్రమంలోనే
ఉనికిలో ఉన్న తెలుగుపదాల స్థానాన్ని ఆంగ్లపదాలు ఆక్రమించుకోకుండా కూడా
చూడడం అవసరం.
Message has been deleted

రాకేశ్వర రావు

unread,
Mar 12, 2010, 12:59:52 PM3/12/10
to తెలుగుపదం
ఇదే అంశం మీదఁ ఇదే అభ్యంతరం నేనూ వ్యక్తం చేశాను।
వికీలో కూడా పేజీ బదులు పుటగా మార్చాలని కూడా సూచించాను।

వికీపీడియన్లు ఇక్కడ వోటు వేయవచ్చు। సరిపడా ఓట్లు వస్తే పేజీని పుటగా
మార్చేయవచ్చుఁ
http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:Telugu_words

http://te.wikipedia.org/wiki/వికీపీడియా:Telugu_words


On Mar 12, 9:21 pm, తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం <subtadepa...@gmail.com>
wrote:
> http://telugupadam.orgసైటులో అన్నిచోట్లా పేజీలు అన్న పదమే

Subbachary Pulikonda

unread,
Mar 12, 2010, 9:39:56 PM3/12/10
to telug...@googlegroups.com
అవునండీ నిస్సందేహంగా ఈ వాదం బాగుంది. పేజీ అన్నమాటను పూర్తిగా తీసివేసి పుటలు అనే మాటని ఇక నుండి వాడదాం.
 
తెలంగాణాలోనైతే పేజీకి కమ్మ అనే మాటని చాలా విస్తృతంగా వాడతారు. పుస్తకాన్ని కమ్మలకట్ట అని అనడం ఇప్పటికీ గ్రామీణ వాతావరణంలో పెద్దతరం వారు వాడడం చాలా ఆశ్చర్యాన్ని కాక ఆనందాన్నీ కలిగిస్తూ ఉంది. 
తెలుగు ప్రాంతం అంతా విస్తృతంగా తిరగందే పూర్తి తెలుగు తెలియదని అంగీకరిద్దాం.
కమ్మ అన్నది తెలంగాణా వ్యవహారంలో ఇప్పటికీ ఇది బాగా ప్రచలితంగా ఉన్నమాట. కాని ఇతర ప్రాంతాల వారు వాడరు కాబట్టి
అందరికీ బాగా తెలిసిన పుట అనే మాటను వాడదాం. ఇదే పద్ధతిని మిగతా అన్ని సందర్భాలలో అనుసరిద్దాం.
 
పులికొండ సుబ్బాచారి.

2010/3/12 తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం <subtad...@gmail.com>

--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.

 * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
 * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
 * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి



--
Prof. P.  Subbachary
Department of Folklore & Tribal Studies
Dean, School of Human and Social Sciences
Dean, Academic Affairs (Principal)
Dravidian University
Kuppam 517425
A.P

sudhakar valluri

unread,
Mar 13, 2010, 2:06:39 AM3/13/10
to telug...@googlegroups.com
నా ఓటు పుటకే.

2010/3/12 తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం <subtad...@gmail.com>
http://telugupadam.org సైటులో అన్నిచోట్లా పేజీలు అన్న పదమే
--
అభినందనలతో..
వల్లూరి సుధాకర్

Veeven (వీవెన్)

unread,
Apr 10, 2010, 7:02:21 AM4/10/10
to telug...@googlegroups.com
తేదిన 12 మార్చి 2010 9:51 pm, తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం
<subtad...@gmail.com> వ్రాశారు:

> http://telugupadam.org సైటులో అన్నిచోట్లా పేజీలు అన్న పదమే
> కనిపిస్తున్నది.

ఈ మార్పుని http://translatewiki.net/ లో చెయ్యాలి. (ఇది మీడియావికీ
అన్ని సైట్లలోనూ, తెలుగు వికీపీడియాతో సహా, ప్రతిఫలిస్తుంది.)

అక్కడ నేను చేసే అనువాదాలలో ఇక నుండి పుట అని వాడటం మొదలుపెట్టాను.

ఇట్లు,
వీవెన్.
--
Read Telugu blogs @ koodali.org

రాకేశ్వర రావు

unread,
Apr 10, 2010, 10:28:03 PM4/10/10
to తెలుగుపదం

వీవెన్ Veeven wrote:
> తేదిన 12 మార్చి 2010 9:51 pm, తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం
> <subtad...@gmail.com> వ్రాశారు:
> > http://telugupadam.org సైటులో అన్నిచోట్లా పేజీలు అన్న పదమే
> > కనిపిస్తున్నది.
>
> ఈ మార్పుని http://translatewiki.net/ లో చెయ్యాలి. (ఇది మీడియావికీ
> అన్ని సైట్లలోనూ, తెలుగు వికీపీడియాతో సహా, ప్రతిఫలిస్తుంది.)
>
> అక్కడ నేను చేసే అనువాదాలలో ఇక నుండి పుట అని వాడటం మొదలుపెట్టాను.

చాలా మంచి పని చేస్తున్నారు వీవెన్

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Apr 11, 2010, 3:29:12 AM4/11/10
to తెలుగుపదం
కొన్ని ఆంధ్రేతర సైట్లు కూడా తమ సైట్ల తెలుగు అనువాద పాఠాన్తరాల్లో పుటలు అనే వాడుతున్నాయి. మచ్చుకు ఈ క్రింది జేపెగ్ జోడింపుని పరిశీలించగలరు.

--
నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి



This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org or download Baraha software from http://baraha.com
puta-page.jpg
Reply all
Reply to author
Forward
0 new messages