తెలుగు కూడా ఇకపై ఓ అంతర్జాతీయ భాషే

32 views
Skip to first unread message

Marripoodi Mahojas

unread,
May 10, 2015, 5:53:33 AM5/10/15
to telug...@googlegroups.com
అమెరికాలోని రెండు రాష్ట్రాలకు చెందిన పెద్ద స్కూలు బోర్డులు రెండు - తెలుగుని పాఠశాలా విద్యార్థులు ఎంపిక చేసుకోదగ్గ అంతర్జాతీయ భాషల జాబితాలో ఒకటిగా చేర్చడంతో మన భాషాచరిత్రలోనే ఒక విప్లవాత్మక దశ మొదలయినట్లు చెప్పుకోవచ్చు. (ఈ వేగుతో జతచేసిన తెరపట్టును చూడండి. ఈ వార్త ఈరోజు సాక్షి దినపత్రికలోంచి గ్రహించబడింది)  దాని సంగతెలా ఉన్నా అక్కడుంటున్న మన తెలుగుపిల్లలు తమ వారసత్వాన్ని మర్చిపోకుండా ఉండడానికి ఈ చర్య దోహదిస్తుందని భావిద్దాం. మనవారు అత్యధిక సంఖ్యలో ఉన్న మిగతా అమెరికన్ రాష్ట్రాల్లో కూడా తెలుగుకు ఇలాంటి హోదా రావాలని కోరుకుందాం. ఏమో ఎవరికి తెలుసు, భవిష్యత్తులో ఆ అమెరికన్ తెలుగు పిల్లలలోంచి అమెరికన్ తెలుగు సాహిత్యకారులు ఆవిర్భవిస్తారేమో!   
mana badi courses recognised by school boards in USA.jpg

Akshay Regulagedda

unread,
May 10, 2015, 10:16:07 PM5/10/15
to telug...@googlegroups.com

పెద్దలు ఇక్కడ ఒక విషయం గమనించాలి:

 

తెలుగు పాఠ్యంశాలుగా బర్మా, మలేశియాలలో చారిత్రాత్మకంగా ఉండేవి; అయితే, 1960లలో బర్మాలో జరిగిన రాజికీయ మార్పుల వల్లా, మలేశియాలో 1991లో జరిగిన పాఠ్యంశాల సరళీకృతీకరణ వల్ల, తెలుగుని ఆయా దేశ బడులలో నేర్పడం మానేశారు. అయినా, ఆయా దేశాలలో అధికారకంగా కాకపోయినా, ఆదివారాల పూట, మామూలు స్కూలు పాఠాలకు అతీతంగా తెలుగుని నేర్పుతున్నారట. మోరిష్యస్ లో ఇప్పటికీ తెలుగుని ప్రభుత్వ బడులలో నేర్పుతున్నారు; అయితే, మోరిష్యస్ కాకుండా మిగతా చోట్ల కేంబ్రిడ్జ్ సిలబస్ నుంచి తెలుగుని 2016 నుంచి తీసేస్తున్నారట.

 

చెప్పొచ్చేది ఏమిటంటే, నాలుగు ఐదు తరాల బట్టి తెలుగుని అరెబియన్ మహాసగారానికి, బంగాళాఖాతానికి ఇటువైపు అటువైపు నేర్పించేవారు. ఈ విషయం ఇప్పుడు కొత్తగా జరుగుతున్న ప్రపంచీకరణ నేపధ్యంలో మనం మర్చిపోకూడదు.

 

--

Akshay Regulagedda | రేగులగెడ్డ అక్షయ్
"Entropy isn't what it used to be." --Source unknown

--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుపదం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugupadam...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.

Marripoodi Mahojas

unread,
May 11, 2015, 1:53:59 AM5/11/15
to telug...@googlegroups.com
పాఠ్యాంశాలు!!

కాకర్ల నాగేశ్వరయ్య

unread,
May 11, 2015, 2:35:19 AM5/11/15
to telug...@googlegroups.com
చాలా మంచి విషయం చెప్పారు. ధన్యవాదాలండీ.
Reply all
Reply to author
Forward
0 new messages