subjectiviy, objectivity అనే మాటలకి తెలుగులో ఏ పదాలు వాడవచ్చు?

27 views
Skip to first unread message

Radhika Ts

unread,
Dec 9, 2014, 9:27:35 PM12/9/14
to telug...@googlegroups.com
subjectiviy, objectivity అనే మాటలకి తెలుగులో ఏ పదాలు వాడవచ్చు? ఆంధ్రభారతి నిఘంటువు రెండు పదాలకీ 'వస్తునిష్ఠత' అనే పదాన్ని చూపిస్తోంది!.

వీవెన్

unread,
Dec 10, 2014, 3:06:03 AM12/10/14
to తెలుగుపదం

10 డిసెంబర్, 2014 7:57 [AM] న, Radhika Ts <valli....@gmail.com> ఇలా రాసారు :

subjectiviy, objectivity అనే మాటలకి తెలుగులో ఏ పదాలు వాడవచ్చు? ఆంధ్రభారతి నిఘంటువు రెండు పదాలకీ 'వస్తునిష్ఠత' అనే పదాన్ని చూపిస్తోంది!.

objectiveగా ఉండటం అంటే మన స్వంత అభిప్రాయాలచే అనుభూతులచే ప్రభావితం కాక కేవలం వాస్తవాలను పరిగణించడం. ఈ అర్థంలో నిష్పాక్షిక లేదా యథార్థ/వాస్తవిక అని సందర్భానికి తగ్గట్టు వాడుకోవచ్చు. objective analysisని నిష్పాక్షిక విశ్లేషణ లేదా వాస్తవిక విశ్లేషణ అనుకోవచ్చు.

subjective అంటే మన స్వంత ఆలోచనలూ అభిప్రాయాలపై ఆధారపడటం లేదా వాటిచే ప్రభావితమవడం (కొన్ని సార్లు అనుచితమైనా కూడా). ఖచ్చితంగా అదే అర్థాన్నిచ్చే మాట తట్టట్లేదు కానీ అవసరానికి పాక్షికత అని వాడుకోవచ్చు. There is an element of subjectivity in her criticism అనే వాక్యాన్ని ఆమె విమర్శలో కొంత పాక్షికత ఉంది అని అనువదించుకోవచ్చు.

మరేమైనా సూచనలు వస్తాయేమో చూద్దాం.

ఇట్లు,
వీవెన్.


రహ్మానుద్దీన్ షేక్

unread,
Dec 10, 2014, 3:06:49 AM12/10/14
to తెలుగుపదం
విషయనిష్ఠత, వస్తునిష్ఠత అని వాడొచ్చు.

2014-12-10 7:57 GMT+05:30 Radhika Ts <valli....@gmail.com>:
subjectiviy, objectivity అనే మాటలకి తెలుగులో ఏ పదాలు వాడవచ్చు? ఆంధ్రభారతి నిఘంటువు రెండు పదాలకీ 'వస్తునిష్ఠత' అనే పదాన్ని చూపిస్తోంది!.

--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుపదం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugupadam...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.



--
With thanks & regards
Rahimanuddin Shaik
నాని
http://upload.wikimedia.org/wikipedia/meta/0/08/Wikipedia-logo-v2_1x.png

reachout
 
ఒక విశ్వాన్ని ఊహించండి, ఎక్కడయితే ప్రతి మనిషి ఒక సంపూర్ణ విజ్ఞానభాండారాన్ని అందరితో పంచుకోగలడో, ఆ విశ్వాన్ని ఊహించండి. అటువంటి విశ్వాన్ని నెలకొల్పడమే మా సంకల్పం.  
తెలుగు వికీపీడియా : http://te.wikipedia.org
A new address for ebooks : http://kinige.com
తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com

devi దేవి

unread,
Dec 10, 2014, 9:09:53 PM12/10/14
to telug...@googlegroups.com
స్థిత్యనుసారం, దృష్ట్యనుసారం అని అనవచ్చేమో..కదా! 

10 డిసెంబర్, 2014 7:57 [AM] న, Radhika Ts <valli....@gmail.com> ఇలా రాసారు :
subjectiviy, objectivity అనే మాటలకి తెలుగులో ఏ పదాలు వాడవచ్చు? ఆంధ్రభారతి నిఘంటువు రెండు పదాలకీ 'వస్తునిష్ఠత' అనే పదాన్ని చూపిస్తోంది!.

--

Pulikonda

unread,
Dec 10, 2014, 9:40:47 PM12/10/14
to telugupadam
ఇంగ్లీషులో ఈ పదాలకున్న అర్థవ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని అనువదించవలసి ఉంటుంది. తెలుగు సాహిత్య విమర్శలో ఈ పదాల అనువాదం ఇప్పటికే జరిగింది వాటిని బాగా వాడుతూనే ఉన్నారు. ఆత్మాశ్రయ విమర్శ వస్త్వాశ్రయ విమర్శ అని అంటున్నారు. ఇక subjectivity objectivity అనే మాటలన్ని ఆత్మాశ్రిత  అని వస్త్వాశ్రిత అని అనవచ్చు. తర్వాత వచ్చే సమాసాల తీరుకోసం ఆత్మాశ్రయ పరిశోధన వస్త్వాశ్రయ పరిశోధన అనేరీతిలో సమాసాలు చేసుకోవచ్చు. మరీ కొత్త దారులు కాకుండా అర్థచ్ఛాయల్లో ఇప్పటికే ఉన్న వాటిని వినియోగించుకోవడం లేదా వాటిలో మార్పులు చేసకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది. తప్పని సరి అని అనుకున్నప్పుడు పూర్తిగా కొత్త పదాలను వెదుకుదాం.
భవదీయుడు 
పులికొండ సుబ్బాచారి. 
--
Prof. P.  Subbachary
Head, Department of Folklore and Tribal Studies
Dean, School of Human and Social Sciences
Dravidian University
Kuppam 517425
A.P

devi దేవి

unread,
Dec 11, 2014, 6:13:35 AM12/11/14
to telug...@googlegroups.com
బాగుందండి.


11 డిసెంబర్, 2014 8:10 [AM] న, Pulikonda <psubb...@gmail.com> ఇలా రాసారు :
Reply all
Reply to author
Forward
0 new messages